ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ Status Report - Aug 09

Posted by జీడిపప్పు

ఆగస్టు నెలలో జేపీ గారు కనిపించినన్ని ఎక్కువ సార్లు మరే నాయకుడూ టీవీల్లో కనిపించలేదు. ఎన్నో విషయాల పైన సుదీర్ఘ చర్చలు, సందేశాలు ఇచ్చారు. మొన్నటికి మొన్న రాజ్యాంగానికి అవమానం జరుగుతున్నదని అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్నారు. అసలు విషయమయిన "ప్రజాసేవ" గురించి చెప్పాలంటే - గత నెల మొత్తం పైన కూకట్‌పల్లిలో ఎన్ని ప్రజాసమస్యలు పరిష్కరించారు, ఎన్ని అభివృద్ది పనులు చేపట్టారు, జేపీ గారి వల్ల ఎందరు పేద ప్రజలు లబ్ది పొందారు మొదలయిన వివరాలు దాదాపు ఎక్కడా కనిపించలేదు. లోక్‌సత్తా వెబ్‌సైటులో జేపీ గారు ఏ రోజు ఏమి ప్రజాసేవ చేసారో వివరాలు తెలపడం లేదు. ఇదేమయినా మీడియా కుట్రా? బ్లాగులోకంలోని జేపీ గారి అభిమానులయినా చొరవ తీసుకుని వివరాలను నలుగురికి చెప్పే ప్రయత్నం చేయాలి.

ఇక Status Report సంగతికొస్తే - 31 రోజులున్న గత నెలలో శెలవు రోజులు పక్కన పెడితే రోజుకొక్క task చొప్పున చేసినా కనీసం 25 tasks ఉండాలి. తెలిసిన వివరాల ప్రకారం గత నెల స్టేటస్ రిపోర్ట్:

సంగ్రహం
ప్రజలనుండి స్వీకరించిన మొత్తం సమస్యలు: 0
పరిష్కరించిన సమస్యలు: 0
పురోగతిలో ఉన్న సమస్యలు: 0
మిగిలినవి: 0

వివరాలు
వైద్యరంగం
1) తనిఖీ చేసిన ఆస్పత్రులు: 0
2) పరిష్కరించిన సమస్యలు: 0
3) ఇతర అభివృద్ది కార్యక్రమాలు: 0

విద్యారంగం
1) తనిఖీ చేసిన పాఠశాలలు: 0
2) పరిష్కరించిన సమస్యలు: 0
3) ఇతర అభివృద్ది కార్యక్రమాలు: 0

ఇతరములు
1) పర్యటించిన మురికివాడలు: 0
2) పరిష్కరించిన మంచి నీటి సమస్యలు: 0
3) తనిఖీ చేసిన చౌక దుకాణాలు: 0
4) తనిఖీ చేసిన ప్రభుత్వ కార్యాలయాలు: 0
5) అవినీతి అధికారుల పైన తీసుకున్న చర్యలు: 0
6) అవినీతిని నిరోధించుటకు చేసిన ప్రయత్నాలు: 0

పత్రికలు చేయలేని పనిని బాధ్యతగల పౌరులుగా మనము చేసి ప్రతినెలా మొదటివారంలో గతనెల జేపీగారు చేసిన పనుల వివరాలను ఈ స్టేటస్ రిపోర్ట్ రూపంలో తెలుసుకుంటూ అందరికీ తెలియజేద్దాము.

శెలవు తీసుకున్న సింహం

Posted by జీడిపప్పు

47 ఏళ్ళ పాటు సెనేటర్ గా దేశానికి ఎనలేని సేవలు అందించిన టెడ్ కెన్నెడీ మరణంతో అమెరికా రాజయకీయ రంగంలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. జాన్ ఎఫ్ కెన్నెడీ, రాబర్ట్ కెన్నెడీ ల హత్య ల తర్వాత కెన్నెడీ కుటుంబ శకం ముగిసిపోయే తరుణంలో కుటుంబ బాధ్యతలను తీసుకున్న టెడ్ కెన్నెడీ కేవలం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తన అన్నలిద్దరి ఆశయాల సాధనకు కృషి చేసాడు.

 
టెడ్ కెన్నెడీ, జాన్ ఎఫ్. కెన్నెడీ, రాబర్ట్ కెన్నెడీ


JFK చెప్పిన America is a nation of immigrants అన్న మాటలను గుర్తించుకొని తన ఆఫీసులో తన పూర్వీకుల స్వస్థలం ఫోటో పెట్టుకున్న టెడ్ కెన్నెడీ ఇమ్మిగ్రేషన్ చట్టాలను సవరించి వలస వచ్చే వారికి సమాన సౌకర్యాలు కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించాడు. తన పెద్ద అక్క రోజ్‌మేరీ మానసికంగా ఎదగక జీవితాంతం కుటుంబానికి దూరంగా ఉండవలసి రావడం చూసిన టెడ్ ఆ తర్వాత మూడో అక్క యునీస్ కెన్నెడీతో (ఈమె రెండువారాల క్రితం మరణించింది) కలసి మానసిక, శారీరక వికలాంగులకోసం ఎన్నో సంస్కరణలు చేసాడు. ప్రపంచ వికలాంగుల ఒలింపిక్స్ అందులో ప్రముఖమయినది. ఈ రోజు అమెరికాలో దాదాపు ప్రతికుటుంబంలో ఎవరో ఒకరు టెడ్ కెన్నెడీ కృషి వల్ల minimum wage, education reforms, health care రంగాల్లో లబ్ది పొందుతున్నారు.

జాన్ ఎఫ్ కెన్నెడీ మేధావితనాన్ని, రాబర్ట్ కెన్నెడీ ఆచరణను పుణికిపుచ్చుకున్న టెడ్ సభలో మాట్లాడే తీరువల్ల Lion of the senate అని పేరు తెచ్చుకున్నాడు. తన "జీవిత లక్ష్యం" గా టెడ్ కెన్నెడీ చెప్పుకొనే Universal health care అమలు కాకముందే 77 ఏళ్ళ వయసులో బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడలేక ఆగస్టు 25 న నిష్క్రమించి Arlington National Cemeteryలో తన అన్నలిద్దరి దగ్గర శాశ్వత విశ్రాంతి కోసం సిద్దమవుతున్నాడు.

టెడ్ కెన్నెడీ ఫోటో గ్యాలరీ

ఈమెయిల్ గోలలు

Posted by జీడిపప్పు

ఐటీ ఉద్యోగులకు ఉండవలసిన అత్యంత కీలక లక్షణాలలో ఒకటి ఈమెయిల్స్ వ్రాయడం. కొందరి మెయిల్స్ చదువుతుంటే "ఆహా ఎంత బాగా చెప్పారు" అనిపిస్తుంది, ఇంకొందరి మెయిల్స్ చదువుతుంటే "ఎవడ్రా బాబూ వీడు చావగొడుతున్నాడు" అనిపిస్తుంది. రెండో విషయంలో ఇప్పటివరకు నేను చూసిన/చెందిన/చూస్తున్న కొన్ని వర్గాలు:

అడుక్కునే వాళ్ళు: ఒక వ్యక్తిని ఉద్దేశించి రాసిన మెయిలులో ఒకటికంటే ఎక్కువ "ప్లీజ్"లు ఉంటే, ఆ రాసినవారు "అడుక్కునే" వారి జాబితాలోకి వస్తారు. ఈమెయిల్ రాస్తున్నది ఏదో దానమో ధర్మమో చేయమని కాదు, ఆఫీసు పని మీద. ఇది పట్టించుకోకుండా  కొందరు ఒకే మెయిల్‌లో "ప్లీజ్ ఈ పని చెయ్యి, ప్లీజ్ ఆ పని చెయ్యి, నీకు ఏమయినా డౌట్లుంటే చెప్పు ప్లీజ్" అని ప్లీజుతుంటారు. ఇది చూసినపుడు నాకు (మాదాల రంగారావు స్టోన్‌తో) "ఒరే అయ్యా, ఏమిటా అడుక్కోవడం? ఇది బస్టాండు కాదు, ఆఫీసు. కాస్త డిగ్నిఫైడ్ గా ఉండాలి" అని చెప్పాలనిపిస్తుంది.

ఫుల్‌స్టాపర్లు: ఒకప్పుడు మెసేజ్‌లో ఎన్ని తప్పులున్నా పెద్దగా పట్టించుకోకుండా చివరలో నా పేరు పక్కన మాత్రం ఠంచనుగా ఫుల్‌స్టాప్ పెట్టేవాడిని. అసలు బుర్ర ఉన్నోడెవడయినా పేరు పక్కన ఫుల్‌స్టాప్ పెడతాడా? ఒకసారంటే పర్లేదు కానీ కొన్ని వందల మెయిల్లలో ఎవరి పేరు చివరా ఫుల్‌స్టాప్ లేదని గమనించి అయినా ఆ తప్పు సరిదిద్దుకోవచ్చు కదా!

బొమ్మలోళ్ళు: ఒక ఎర్రర్ వచ్చినపుడు లేదా ఒక డౌట్ ఉన్నపుడు వీలయినంతవరకు ఆ వివరాలను మాటలరూపంలో చెప్పి అవసరమయిన చోట స్క్రీన్‌షాట్ తీసి ఈమెయిలుకు అటాచ్ చెయ్యాలి. కానీ కొందరు అలా కాదు. ప్రింట్ స్క్రీన్ ఒకటుంది కదా అని అవసరం లేని చోట కూడా ప్రతి చిన్న విషయానికి బొమ్మలు తీస్తారు. పోనీ ఆ బొమ్మలు jpeg లో ఉంటాయా అంటే అదీ కాదు, bmp ఫార్మాట్‌లో. ఒక్కోటి ఒక MB తింటుంది. jpeg లో సేవ్ చెయ్యవచ్చుగా? ఈ బొమ్మలను అటాచ్ చేసి దేశమంతా మెయిల్ కొడితే అవతలోడు ఆ బొమ్మలను అలాగే ఉంచి దానికి మళ్ళీ రిప్లై కొడతాడు. ఇహ చూస్కో నా సామి రంగా. మరుసటి రోజు ఆఫీసుకు వచ్చేసరికి ఆ మొదటి మెయిలుకు రిప్లైల మీద రిప్లైలు ఉంటాయి, ప్రతి రిప్లై లో ఆ భారీ అటాచ్‌మెంట్ తో సహా. ఆ దెబ్బకు ఇన్‌బాక్స్ సైజు పొర్లిపోయి చేతులెత్తేయడంతో పనికొచ్చే మెయిల్స్ కూడా రావు!

కృతఘ్నులు:
తమకు అవసరమయినపుడు కొందరు తెగ మెయిల్స్ కొడతారు, అది కూడా కాపీ టు సీయం - కాపీ టు పీయం అంటూ కంపెనీకంతా. పని పూర్తి అయిన తర్వాత మాత్రం కనీసం థేంక్యూ అని కూడా చెప్పరు. నిజమే, ఆ పని చేయడమే నా డ్యూటీ అందుకే నేను జీతం తీసుకుంటున్నాను కాబట్టి నాకు థేంక్యూ చెప్పనవసరం లేదు. అయితే కార్పొరేట్ ప్రపంచంలో అత్యంత ప్రభావిత పదాలలో "థేంక్యూ" "గుడ్‌జాబ్" కూడా ఉన్నాయని చాలామంది గ్రహించరు. ఈ విషయాన్ని గ్రహించినవారే తమ పనులను సులువుగా చేయించుకోగలుగుతారు.

చాటభారతగాళ్ళు: ఏదయినా ఒక విషయం చెప్పేటపుడు KISS ఫార్ములా అవలంబించాలి. అంటే కీప్ ఇట్ సింపుల్ అండ్ స్ట్రెయిట్ (దీనినే కొందరు కీపి ఇట్ సింపుల్, స్టుపిడ్ అంటారు). రెండు లైన్లలో చెప్పగలిగిన విషయాన్ని రెండు పేరాల్లో సాగదీస్తారు కొందరు. ఈ చాటభారతానికి ఇంకో చాభా "నువ్వు చెప్పిన పని చేసాను. అంతా బాగయింది. ఎక్కడా ఇబ్బంది లేదు.." అంటూ మొదటి మెయిల్లోని చాభాని ఉటంకిస్తూ రిప్లై ఇస్తాడు. ఆ చెప్పేదేదో రెండు ముక్కల్లో "ఆల్ సెట్" అనో "డన్" అనో చెప్పచ్చుగా. ఒక్కో చాటభారతంవల్ల సగటున ఒక వ్యక్తికి 2-3 నిమిషాల సమయం వృధా. ఆ లెక్కన మూడు టీములవాళ్ళకు కలిపి ఆ ఒక్క మెయిల్ వల్ల ఒక గంట సమయం వృధా అవుతుందన్నమాట!

చివరగా - నాలో నాకు నచ్చే చాలా లక్షణాల్లో ఒకటి "ఆఫీసులో ఇంకొకరిని ఇబ్బంది పెట్టకపోవడం". ఈ ఉద్యోగంలో ఎన్ని రోజులుంటామో తెలియదు. ఎవరెవరో వస్తుంటారు పోతుంటారు. అంతమాత్రానికి ఆఫీసులో ఉన్నవాళ్ళతో గొడవలకు దిగడం లేదా ఇబ్బంది పెట్టడం చాలా తెలివితక్కువతనం. ఒకరిని ఇబ్బంది పెట్టి సాధించేది ఏమీ ఉండదు. మంచిపేరు తెచ్చుకుంటే అది భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది, అసలే మనము "గ్లోబల్ విలేజ్" లో ఉంటున్నామాయె. ఇవన్నీ తెలిసినా అవకాశం వస్తే ఒకడికి చుక్కలు చూపించాలనుకుంటున్నా. ఎందుకంటే, వాడు దేశమంతా కొట్టే మెయిల్స్ లో కూడా SMS లాగ్వేజ్ "u" "c" "ty" వాడుతుంటాడు. వీడికి ఎలాంటి గుణపాఠం నేర్పించాలంటే, జీవితంలో మళ్ళీ ఛాటింగులో కూడా SMS భాష వాడకూడదు. ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో ఆ అవకాశం!

మెడికల్ మాఫియా

Posted by జీడిపప్పు

ఇండియాలో అవినీతిని చూసి ఒకప్పుడు చాలా ఆగ్రహావేశాలకు లోనయ్యేవాడిని. ఆ తర్వాత నా పంథా మార్చుకొని "సగటు భారతీయుడి"గా ఆలోచించడం మొదలుపెట్టాక అవినీతిని గురించిన వార్తలు చూసినప్పటికీ ఏమీ అనిపించేది కాదు. తర్వాత అమెరికాలో ఎదురయిన కొన్ని అనుభవాల వల్ల "ఆహా ఏమి నా అదృష్టం! లంచం ఇవ్వకుండా అన్ని పనులు జరిగిపోతున్నాయి. అమెరికాలో అవినీతే లేదు." అనుకొనేవాడిని. (ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి వచ్చినవాడికి "మామూలు" ఇవ్వడానికి 5 డాలర్లు పక్కన పెట్టుకున్నాము. వాడి పని పూర్తి అయిన తర్వాత "నేను చెప్పిన టైం కంటే రెండు గంటలు లేటుగా వచ్చాను కాబట్టి ఇన్స్టలేషన్ ఫీజ్ కట్టనక్కర్లేదు" అంటూ బ్రతిమాలుకున్నా ఐదు డాలర్లు తీసుకోకుండా వెళ్ళిపోయాడు.)

కొంత కాలానికి అర్థమయినదేమిటంటే, అమెరికాలో కూడా అవినీతి ఉంది. కాకపోతే ఇండియాలో సగటు మనిషిముందు చెయ్యి చాపి "నాకేంటి? అహా నాకేంటని" అంటారు. అమెరికాలో అలా కాకుండా అంతా సైలెంటుగా భారీ ఎత్తున జరిగిపోతుంది. సామాన్య పౌరులు లంచం ఇవ్వవలసిన పరిస్థితి ఎప్పుడూ రాదు. మనవాళ్ళలా పాతికకో పరకకో కాకుండా అమెరికన్ అవినీతిపరులు కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు వీలయినంతవరకు మేడాఫ్ తరహాలో బిలియన్లకు లేదా మిలియన్లకు గురిపెడతారు. ఇండియాలో పదిమంది అవినీతిపరులు ఉంటే అమెరికాలో ఒకరిద్దరు ఉంటారు అంతే. అయితే ఈ ఒకరిద్దరి అవినీతి స్థాయి, క్రూరత్వం ముందు ఆ పదిమంది దిగదుడుపే అనిపిస్తుంది నాకు. వీళ్ళు ఎంత తెలివిగా అవినీతి చేస్తారో, ఏ స్థాయిలో చేస్తారో తెలుసుకోవడానికొక ఉదాహరణ:

ఈ రోజు మెడికల్ మాఫియా అన్న హెడ్డింగ్ చూడగానే "ఎవడో డాక్టరు ఇన్సూరెన్స్ ఏజంటుతో కలసి మోసం చేస్తున్నాడు" అనుకొని చదువుతుంటే మతిపోయింది. ఒకామెకు చిన్న కారు యాక్సిడెంటువల్ల వెన్నునొప్పి రావడంతో తెలిసిన ఫ్రెండుకు చెప్పింది "లీగల్ గా వెళ్తే ఇన్సూరెన్స్ కవర్ చేయదు కాబట్టి ఏదయినా సలహా కావాల"ని. కాసేపటికి ఇంకో వ్యక్తి ఫోన్ చేసి ఏమీ భయపడనవసరం లేదు, అన్నీ మేము చూసుకుంటాము. కాకపోతే ఫలనా వ్యక్తి సాయం చేసాడని ఎవరికీ చెప్పకు" అని కారును గుద్దినవాడి వివరాలు తీసుకున్నాడు.

ఆరువారాలపాటు నగరంలోని పెద్ద పెద్ద డాక్టర్లు ఆమెకు వైద్యం చేసారు. పెద్ద లాయరు వచ్చి వివరాలు తెలుసుకున్నాడు. వీటన్నిటికీ ఆమె ఒక్క సెంటు కూడా చెల్లించలేదు! ఆమె వైద్యానికి అయిన బిల్లు అంటూ ఆమె కారును గుద్దినవాడికి $200,000 బిల్లు పంపించారు. అసలు కథ అప్పుడే మొదలయింది.

ఆమె కారును గుద్దినది సాధారణ వ్యక్తి కాదు, ఒక ఫెడరల్ ప్రాసిక్యూటర్! ఒక చిన్న యాక్సిడెంటుకు అంతమంది డాక్టర్లు, అన్ని బిల్లులా అని అనుమానమొచ్చి FBI సహాయంతో తీగలాగాడు. సంగతేమిటంతే ట్రీట్‌మెంట్ ఇచ్చే డాక్టర్లు, వాదించే లాయర్లు, అవుననే పోలీసాఫీసర్లు, తీర్పునిచ్చే జడ్జీలు, డబ్బులు ఇచ్చే ఏజంట్లూ అందరూ ముఠాగా ఏర్పడి వందల మిలియన్ల డాలర్లను దాదాపు ఎవరూ కనిపెట్టలేని సహజమార్గాల్లో దోచుకుంటున్నారు! అసలు విషయం బయటపడ్డ తర్వాత చట్టంలోని లొసుగులవల్ల, పేరుకుపోయిన అవినీతివల్ల కొందరు తప్పించుకొని హాయిగా రాజభోగాలు అనుభవిస్తున్నారు.

బయటపడని ఇలాంటి మాఫియా కథలు దాదాపు ప్రతిరంగంలో ఉంటాయి. కాకపోతే మిగతా అన్ని రంగాల్లో జరిగే అవినీతి కంటే వైద్యరంగంలో జరిగే అవినీతి ఎన్నో రెట్లు ఎక్కువ. అమెరికాలో ఏడాదికి సగటున 80 బిలియన్ డాలర్ల అవినీతి ఒక్క వైద్యరంగంలోనే జరుగుతుందట! మందుల కంపెనీలు, ఆస్పత్రులు చేసే ఘోరాలకయితే అంతే ఉండదు. అనవసరమయిన బిల్లులు వేసి సగటు కుటుంబాన్ని నిమిషాల్లో బజారుపాలు చేయడానికి దాదాపు అన్ని కంపెనీలు తహతహలాడుతుంటాయి. బాధాకరమయిన విషయం ఏమిటంటే ఇప్పుడిపుడే కార్పొరేట్ వైద్యం విజృంభిస్తున్న ఇండియాలో కూడా ఈ "మెడికల్ మాఫియా" తన ఉనికిని చాటుకుంటున్నది. భవిష్యత్తులో ఇదొక పెద్ద భూతమవడం ఖాయం!

బెగ్గర్ ఖాన్‌కు అమెరికాలో అవమానం!!

Posted by జీడిపప్పు

గతవారం అమెరికాకు వచ్చిన షారుఖ్ ఖాన్‌ను న్యూజెర్సీ ఎయిర్‌పోర్ట్ లో "నిర్బంధించారు" అని, ఇది యావత్ భారతజాతికి అవమానం, అమెరికా అహంకారానికి నిదర్శనమని అటు టీవీల్లో, ఇటు పేపర్లలో కుప్పలుతెప్పలుగా వార్తలు వచ్చాయి. షారూఖ్ ఖాన్ కూడా తీవ్ర మనస్తాపం చెందానని చెప్పి బాధపడి వెనువెంటనే ఇండియాకు తిరిగి వచ్చేయకుండా అక్కడే అమెరికాలో తన రాబోవు సినిమాకు నాలుగు డాలర్లు రాబట్టుకోవడానికి కష్టపడుతున్నాడు.

నిజంగా అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు భారతీయుల పట్ల వివక్ష చూపిస్తున్నారా అంటే ముమ్మాటికీ కాదు అన్నదే సమాధానం. తానా నుండి తందానా సభలవరకు ప్రతిఏడాది ఎందరో తెలుగు సెలెబ్రిటీలు వస్తున్నారు. షారూఖ్ ఖాన్ కంటే ఎంతో గొప్పవాళ్ళు ఎందరో ఎన్నోసార్లు అమెరికాకు వచ్చాడు. వీళ్ళెవరూ ఎన్నడూ "మమ్మల్ని అవమానించారు" అని గగ్గోలు పెట్టలేదు ఎందుకు? మరి వీరు భారతీయులు కారా? వీరెవరిలో కనపడని భారతీయత వీడొక్కడిలోనే కనపడిందా ఇమ్మిగ్రేషన్ అధికారులకు?

అసలు జరిగినదేమిటో చూద్దాం. ఇమ్మిగ్రేషన్ అధికారులు డాక్యుమెంట్లు స్కాన్ చేసినపుడు "ఖాన్" అన్న పేరు హైలైట్ అయింది. అందులో తప్పేముంది? సెక్యూరిటీ కారణాలవల్ల రాసిన ప్రోగ్రాం ప్రకారం అలా హైలైట్ అయిన వారిని పక్కకు తీసుకెళ్ళి నిశితంగా పరిశీలించాలి. రూల్స్ ప్రకారం వీడిని పక్కకు పిలుచుకెళ్ళి అన్ని వివరాలు అడిగారు. ఎంతయినా కాస్త "హైలైట్" అయిన పేరు కాబట్టి ఒకరికి ముగ్గురు అధికారులు ఒక గంటసేపు అన్నీ నిర్దారించుకొని పంపించారు. ఇందులో ఎక్కడా అవమానమో లేదా అహంకారమో లేదే. కేవలం వాళ్ళ డ్యూటీ చేసారు, అదీ వాళ్ళకున్న రూల్స్ ప్రకారం.

తానేదో పెద్ద కింగ్ అని భ్రమపడే షారూఖ్ ఖాన్ ఇదే పబ్లిసిటీకి అదను అని చిల్లర స్టేట్మెంట్స్ ఇచ్చాడు. వీడు ఇండియాలో పెద్ద సూపర్‌స్టార్ కావచ్చు కానీ అమెరికాలో ఇమ్మిగ్రేషన్ అధికారి ముందు ఒక కోన్ కిస్కా గొట్టం గాడే. వీడేమయినా ఒక ప్రభుత్వాధికార హోదాలో ఒక ప్రత్యేక విమానంలో వచ్చాడా అంటే అదీ లేదు. నాలోంటోడు వచ్చే విమానంలో వచ్చి నాలాంటోడిముందు ఇమ్మిగ్రేషన్ లైన్లో నిలబడ్డాడు. నాకు తెలుసు వీడొక సో-కాల్డ్ ఇండియా ఐకాన్ అని, ఇమ్మిగ్రేషన్ అధికారికి ఎలా తెలుస్తుంది? తెలుసుకున్నా ఎందుకు నమ్మాలి వీడిని? ఎంతమంది బాలీవుడ్ హీరోలు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోలేదు?

సరే, నేనంటే ఏదో అమెరికా నీళ్ళు తాగుతున్నాననో లేక భవిష్యత్తులో అమెరికా సెనేటరో, గవర్నరో కావాలనో అమెరికాను సమర్థిస్తున్నా అనుకొని నా మాటలు పక్కన పెడదాము. బ్లాగుల్లో వ్రాసిన 1, 2, 3, 4 లాంటి ఆలోచింపదగ్గ చక్కని పోస్టులను కూడా పక్కన పెడదాము. మిడిమిడి జ్ఞానం తో అమెరికా అంటే ముందు వెనక ఆలోచించని మూర్ఖుడిలా నేను కూడా "అవునవును, న్యూజెర్సీలో భారతజాతి గౌరవానికి అవమానం జరిగింది" అన్నానే అనుకుందాము.

మరి అంతగా అవమానింపబడ్డ భారతజాతి గౌరవం వెంటనే "ఇది నాకు అవమానం. ఇక నేను మీ దేశానికి మళ్ళీ రాను. నా సినిమాలను మీ దేశంలో ఆడనివ్వను" అని వెంటనే ఇండియాకు వచ్చేసిందా లేక అవమానం జరిగిన అదే దేశంలో స్టేజీల పైన కుప్పిగంతులేస్తున్నదా డాలర్లకోసం? ఇంతకూ బెగ్గర్ ఖాన్‌కు తనకు జరిగిన అవమానం ముఖ్యమా లేక అభిమానుల అభిమానం ముఖ్యమా లేక రాబోవు సినిమాకు వాళ్ళు రాల్చే చిల్లర డాలర్లు ముఖ్యమా?

Snatch. - ఒక అద్భుత సినిమా

Posted by జీడిపప్పు

సినిమా అంటే తెలుగు సినిమా మాత్రమే, ఇంగ్లీషులో సినిమా అంటే రాంబో మాత్రమే అనుకొనే దుర్భర స్థితి నుండి అదృష్టవశాత్తూ బయటపడి కొన్నేళ్ళ క్రితం ఇంగ్లీషు సినిమాలు చూడడం మొదలుపెట్టాను (అదే సమయంలో "కొత్త తెలుగు సినిమాలు" చూడడం దాదాపు మానేశాను). మొదట్లో ఇంగ్లీషు సినిమాలకు కూడా సబ్‌టైటిల్స్ పెట్టుకొని చూసేవాడిని (సుత్తి వీరభద్రరావుగారికి ఈ సంగతి తెలిసి ఉంటే "ఇంగ్లీషు సినిమాను సబ్‌టైటిల్స్ పెట్టుకొని చూసే మొహం నువ్వునూ" అనేవారేమో!). కొద్ది కాలానికి ఆ అవసరం కూడా తీరిపోయింది.

ఒకసారి ఒక అసలు సిసలయిన "ఇంగ్లీషు" సినిమా చూడమని ఒక మిత్రుడు సలహా ఇవ్వడంతో చూడడం మొదలుపెట్టాను. సంభాషణలన్నీ ఇంగ్లీషులోనే సాగుతున్నప్పటికీ సరిగా అర్థం కాలేదు. "ఓహో ఇది బ్రిటీష్ ఇంగ్లీష్" అనుకొని కాస్త చెవులు రిక్కించి విన్నా లాభం లేకపోయింది. తప్పదని సబ్‌టైటిల్స్ తో చూడడం మొదలుపెట్టాను. వాటిపుణ్యమా అని సంభాషణలు అర్థమవుతున్నా ఆ కర్ణ కఠోరమయిన accent భరించలేకపోయాను. చూడకుండా వదిలేయడానికి ఈ సినిమా IMDB లో మంచి ర్యాంకులో ఉంది! మూడు సార్లు ఒక్కోసారి 10-15 నిమిషాలపాటు ప్రయత్నించి ఆ accent చిత్రహింస భరించలేక చేతులెత్తేసాను. ఆ సినిమా పేరే - Lock, Stock and Two Smoking Barrels.

తర్వాత ఇంకోసారి ఇంకో సినిమా రేటింగ్ చూసి దర్శకుడి పేరు చూసి ఉలిక్కిపడ్డాను. ఆ దర్శకుడు మరెవరో కాదు, పైన చెప్పిన సినిమా తీసిన దర్శకుడే. ఈ సినిమా కూడా అలాగే ఉంటుందేమో, అయినా సరే Top 155 ర్యాంకులో ఉంది కదా, ఒకసారి ప్రయత్నించాలి అనుకొని ఈసారి ముందుజాగ్రత్తగా సబ్‌టైటిల్స్ తో చూడడం మొదలుపెట్టాను. ఆ తర్వాతి వారం రోజుల్లో సబ్‌టైటిల్స్ లేకుండా ఆ సినిమాను నాలుగు సార్లు చూసాను. ఆ సినిమా పేరు Snatch., నేను చూసిన అత్యుత్తమ వినోదాత్మక చిత్రాల్లో ఒకటి.

సినిమా అన్న పదానికి వినోదం అర్థమయితే, సాధారణ కథ, చిత్రమయిన పాత్రలు, అంతకంటే విచిత్రమయిన మాటలు, అడుగడుగునా ప్రమాదాలు, ప్రమాదాల్లో కడుపుబ్బా నవ్వించే హాస్యం, చక్కటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉన్న Snatch. వినోదం అన్నమాటకు వివరణ అని చెప్పవచ్చు.

సినిమా కథ మూడంటే మూడు ముక్కల్లో  - "వజ్రం కోసం వేట". ఏ సినిమాకయినా ప్రధానపాత్రలు, సైడ్ పాత్రలు అని ఉంటాయి. కానీ ఇందులో దాదాపు అన్నీ ప్రధాన పాత్రలే. అందరూ హీరోలే, అందరూ విలన్లే, అందరూ కామెడీ చేసేవారే. ఈ సినిమా (మళ్ళీ మళ్ళీ) చూస్తున్న కొద్దీ క్యారక్టర్లు విపరీతంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా Turkish, Bullet Tooth Tony, Mickey, Brick Top.

డైలాగుల విషయానికొస్తే - ప్రతి సినిమాలో గుర్తించుకోదగ్గ కొన్ని పంచ్ డైలాగులుంటే, ఇందులో మొదటి నుండి చివరివరకూ డైలాగుల పంచ్‌లే పంచ్‌లు. "as greedy as a pig" అన్నమాటలకు పందుల గురించి Brick Top ఇచ్చే వివరణ, హోటల్లో Bullet Tooth Tony తన దగ్గరికి వచ్చిన Sol త్రయాన్ని భయపెట్టే మాటలు masterpiece డైలాగులు. తన అసిస్టెంటుకు Turkish ఇచ్చే జవాబులు, బ్రిటీషర్ల పైన Avi చూపే కోపం, Sol త్రయం కామెడీ కొద్ది రోజులపాటు గుర్తుండిపోతాయి.

కుందేలును కుక్కలు తరుముకోనే సన్నివేశంలో, Brick Top తన క్రూరత్వాన్ని చూపించుకొనే సన్నివేశాల్లో వాడిన మ్యూజిక్ చాలా బాగా సరిపోయింది. అక్కడక్కడా కాస్త భారతీయసంగీతం తాకుతుంది. Massive Attack's  Angelను ఉపయోగించుకున్నట్టే Teardrop పాటను కూడా ఏదో ఒక సన్నివేశంలో వాడుకొని ఉండవచ్చు. నిజానికి Angel కంటే Teardrop పాటే బాగుంది.

సినిమా మొత్తం మీద దాదాపు స్త్రీ పాత్ర లేకపోవడం, దాదాపు 26 మర్డర్లు జరిగినా ఒక్క మర్డరు కూడా స్క్రీన్ పైన కనిపించకపోవడం, బ్రిటీషర్లకే అర్థం కాని ఇంగ్లీషును Brad Pitt ద్వారా చెప్పించడం, 163 సార్లు $%* పదం వాడడం, టైటిల్ చివర ఫుల్‌స్టాప్ ఉండడం మొదలయినవి ఈ సినిమాలోని మరికొన్ని హైలైట్స్. చాలా సాధారణమయిన కథ ఉన్న ఈ సినిమా ఎందుకు ఆల్ టైం గ్రేట్ జాబితాలో ఉందో వీక్షించి తెలుసుకోకుంటే ఒక మంచి సినిమా మిస్ అవుతున్నట్టే!

తైలం తమాషా చూద్దాం!

Posted by జీడిపప్పు

"చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకు బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు అయినా అన్నీ అంది మనీ మనీ"

మనీ సినిమాకోసం సిరివెన్నెల కలమునుండి జాలువారిన ఆణిముత్యాలివి. స్థిరంగా ఒకచోట ఉండకుండా చేతులు మారుతూ కష్టాలు తీరుస్తూ కన్నీళ్ళు తుడిచే చుట్టము కాని చుట్టమయిన ఈ డబ్బు చేసే తమాషా గురించి మొన్న చదివిన ఒక పిట్ట కథ కాస్త మార్పులు చేస్తే ఇలా ఉంటుంది:

అది ఒక చిన్న ఊరు. ఆ ఊరికి దగ్గరలో ఉన్న పర్యాటకస్థలానికి వచ్చేవారి పైన ఆధారపడి ఆ ఊళ్ళో అందరూ జీవిస్తున్నారు. కొద్దిరోజులుగా భారీ వర్షాలు పడుతున్నందువల్ల పర్యాటకులు అటువైపు రాకపోవడంతో అందరి ఆదాయం తగ్గిపోయింది. ఒకరోజు ఒక వ్యాపారి ఆ ఊరిగుండా ప్రయాణిస్తుంటే ఉన్నట్టుండి భోరున వర్షం కురవడంతో తన స్కూటరును ఆ ఊళ్ళో ఉన్న ఒక చిన్న హోటల్/లాడ్జ్ ముందు ఆపి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు.

హోటల్ యజమాని కాఫీ ఇచ్చి మాట్లాడడం మొదలుపెట్టి ఆ వ్యాపారి పొరుగూరికి వెళ్ళి తన పని పూర్తి అయిన తర్వాత ఆ రాత్రికి తిరిగి అదే దారిన వెళ్తాడు అని తెలుసుకొని "సార్, మీరు రాత్రి తిరిగివచ్చేటపుడు వర్షం పడితే ఇక్కడే బసచేయండి. భోజనము, రూము రెండూ కలిపి వందరూపాయలే. ఒకవేళ వర్షం పడకపోతే మీ వంద మీకు ఇచ్చేస్తాను, మీరు వెళ్ళిపోవచ్చు" అన్నాడు. అంతలో వర్షం ఆగిపోవడంతొ ఆ వ్యాపారి సరేనని వందరూపాయలు ఇచ్చి తన స్కూటరు తీసుకొని అక్కడినుండి బయలుదేరాడు.

హోటల్ యజమాని అప్పటికే తనకు చికెన్ సరఫరా చేసేవాడికి నూరు రూపాయలు బాకీ ఉన్నాడు. వెంటనే ఆ వందరూపాయలు తీసుకొని వెళ్ళి చికెన్ సరఫరా చేసేవాడికి ఇచ్చి "ఒకవేళ రాత్రికి వర్షం పడకపోతే వ్యాపారికి డబ్బు ఎలా తీర్చాలి? పోనీలే ప్రస్తుతానికి అప్పు తీర్చాను. రాత్రి సంగతి అప్పుడు చూద్దాం" అనుకుంటూ హోటల్‌కు వచ్చాడు. చికెన్ సరఫరా చేసేవాడు కోళ్ళఫారం యజమానికి ఉన్న అప్పులో భాగంగా ఆ నూరు రూపాయలు ఇచ్చాడు. కోళ్ళఫారం యజమాని ఆ నూరురూపాయలను తీసుకొని దగ్గరలో ఉన్న వేశ్య ఇంటికి వెళ్ళాడు. కాసేపటికి ఆ వేశ్య హోటల్‌లో రూమును వాడుకున్నందుకుగానూ హోటల్ యజమానికి బాకీ ఉన్న నూరురూపాయలు తీర్చివేసింది.

అంతలో వ్యాపారి వెనుతిరిగి వచ్చి వర్షం పడడం లేదు కాబట్టి తాను తన ఊరికి వెళ్ళిపోతానని, తాను ఇచ్చిన నూరు రూపాయలు ఇవ్వమన్నాడు. వేశ్య తనకు ఇచ్చిన వందరూపాయలను ఆ హోటల్ యజమాని వ్యాపారికి ఇచ్చాడు. అందరూ తమ అప్పుల భారం తగ్గినందుకు సంతోషించి రేపటికోసం ఆశగా ఎదురుచూడసాగారు.

ఇదంతా చూస్తున్న ధనలక్ష్మి చిద్విలాసంగా నవ్వుకుంది!

ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ Status Report

Posted by జీడిపప్పు

కొందరు ఏడుపుగొట్టు రచయితలు తమ ఏడుపుగొట్టు కథల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఎంత కష్టమో, వారి జీవితాలు ఎన్ని కష్టాలమయమో చాలా చక్కగా ఛండాలీకరిస్తారు. అటు ఆఫీసులో, ఇటు దైనందిన జీవితంలో కష్టనష్టాలున్న సంగతేమో కానీ, ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా నాకు ఈ IT రంగంలో కొన్ని విషయాలు బాగా నచ్చుతాయి. అలాంటివాటిలో ఒకటి - task tracking and status reports.

ఎంత చిన్న పని అయినా ఆ పని ఎవరు ఎప్పుడు మొదలుపెట్టాలి, ఆ పని ఎంత శ్రమతో కూడుకున్నది, ఎప్పటిలోపు ముగించాలి మొదలయిన వివరాలతో దానికోసం ఒక task సృష్టించి వారానికోసారి టీం మెంబర్స్ అందరి status reports పరిశీలించి ఆ వారంలో ఏమి జరిగిందో అన్నీ తెలుసుకొని తన పైవారికి వివరాలను అందజేయడం టీం లీడర్ బాధ్యత. ఈ status report పుణ్యమా అని టీం మెంబర్స్ ఎవరూ పని చేయకుండా తప్పించుకోలేరు. బద్దకంతో తప్పులు చేస్తే task లోని వివరాలవల్ల పట్టుబడిపోతారు. మేనేజ్‌మెంటుకు కూడా నిర్వహణ చాలా సులభమవుతుంది.

పదిమంది ఉద్యోగులున్న చిన్న కంపెనీ కూడా ఈ స్టేటస్ రిపోర్ట్ల పైన ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నపుడు లక్షలమందికి ప్రతినిధులయిన రాజకీయనాయకులు నెల నెలా (వారానికి వద్దులే!) తాము చేసిన "ప్రజాసేవ" వివరాలను తెలుపుతూ ఎందుకు తమ స్టేటస్ రిపోర్ట్ విడుదల చెయ్యరు? ఇప్పటికే ప్రజలకు నాయకులపైన నమ్మకం పోయింది. కనీసం ప్రజలు నమ్ముతున్న జయప్రకాష్ నారాయణ గారిలాంటి వారు అయినా ఇకనుండి నెల నెలా తాము ఏమి చేసారో వివరాలు తెలిపితే ప్రజల్లో నాయకులపట్ల మళ్ళీ నమ్మకం కలుగుతుంది.

మూడు నెలల క్రితం కూకట్‌పల్లినుండి ఎమ్మెల్యేగా ఎన్నికయిన జేపీగారు ఒక్క ఎమ్మెల్యే తలుచుకుంటే ఒక ఊరి స్వరూపాన్ని ఎలా మార్చగలడో చూపించగల సత్తా ఉన్నవాడు. గత మూడు నెలలుగా తన నియోజకవర్గంలో ఏమి చేసాడో ఇప్పటివరకూ చాలామందికి తెలియదు. ఆయన ప్రజాసేవ చేయడం గురించి పత్రికల్లో రావడం లేదు. బహుశా ఇది మీడియా కుట్ర కావచ్చు. ఒక ఎమ్మెల్యే చేసిన, చేయవలసిన మరియు చేయదగిన పనులను క్రోడీకరిస్తే జేపీగారి స్టేటస్ రిపోర్ట్ ఇలా ఉంటుంది. (గత మూడు నెలల్లో జేపీగారు చేసిన ప్రజాసేవ వివరాలను కామెంట్ల రూపంలో తెలిపితే క్రింది వివరాలు update చేయబడుతాయి.)

సంగ్రహం
ప్రజలనుండి స్వీకరించిన మొత్తం సమస్యలు: 0
పరిష్కరించిన సమస్యలు: 0
పురోగతిలో ఉన్న సమస్యలు: 0
మిగిలినవి: 0

వివరాలు
వైద్యరంగం
1) తనిఖీ చేసిన ఆస్పత్రులు: 0
2) పరిష్కరించిన సమస్యలు: 0
3) ఇతర అభివృద్ది కార్యక్రమాలు: 0

విద్యారంగం
1) తనిఖీ చేసిన పాఠశాలలు: 0
2) పరిష్కరించిన సమస్యలు: 0
3) ఇతర అభివృద్ది కార్యక్రమాలు: 0

ఇతరములు
1) పర్యటించిన మురికివాడలు: 0
2) పరిష్కరించిన మంచి నీటి సమస్యలు: 0
3) తనిఖీ చేసిన చౌక దుకాణాలు: 0
4) తనిఖీ చేసిన ప్రభుత్వ కార్యాలయాలు: 0
5) అవినీతి అధికారుల పైన తీసుకున్న చర్యలు: 0
6) అవినీతిని నిరోధించుటకు చేసిన ప్రయత్నాలు: 0

పత్రికలు చేయలేని పనిని బాధ్యతగల పౌరులుగా మనము చేసి ఇకనుండి ప్రతినెలా మొదటివారంలో గతనెల జేపీగారు చేసిన పనుల వివరాలను ఈ స్టేటస్ రిపోర్ట్ రూపంలో తెలుసుకుంటూ అందరికీ తెలియజేద్దాము.

స్టుపిడ్ ఒబామా - జీనియస్ ఒబామా

Posted by జీడిపప్పు

ఉన్నఫళంగా నన్ను ఎవరయినా "అమెరికాలో నీకు తెలిసిన అత్యంత మంచి వ్యక్తిని చూపించు" అంటే వెంటనే ఒక పోలీసును చూపిస్తాను. నా దృష్టిలో ఒక సగటు అమెరికన్ కాప్ కంటే మంచివాళ్ళు ఉండరు. వీరు మాట్లాడినంత మర్యాదగా, గౌరవంగా, పద్దతిగా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న మేధావులు కూడా ఉండరేమో. ఎలాంటి ప్రమాదంలో ఉన్నా, ఏ సమస్య ఎదురయినా కాప్ కనిపిస్తే చాలు..భయపడనవసరం లేదు. పౌరులను రక్షించడానికి తమప్రాణాలు అడ్డు వేయడానికి క్షణకాలం కూడ తటపటాయించని సగటు అమెరికన్ పోలీసుల గురించి చాటభారతంలా ఎంతయినా చెప్పవచ్చు.

గతవారం మస్సాచూస్సెట్స్ లో కేంబ్రిడ్జ్ దగ్గర ఒక ఇంటి తలుపులను ఇద్దరు గట్టిగా నెట్టడం చూసిన ఒకావిడ వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. సంగతేమిటంటే, ముఖద్వారంలో ఆ తలుపు సరిగా పనిచేయకపోవడంతో వెనకనుండి ఇంట్లోకి వచ్చి ఇంటి ఓనరు అయిన హెన్రీ గేట్స్ అనే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసరు తన డ్రైవరుతో కలసి దాన్ని నెట్టడం మొదలుపెట్టాడు. ఆమె ఫోన్ చేసిన వెంటనే పోలీసులు వచ్చి ప్రొఫెసరును బయట రమ్మన్నపుడు ఈ తలతిక్క ప్రొఫెసరు "నేను ఎందుకురావాలి, నల్లవాడిని కాబట్టి రావాలా? I'll speak with your mama (mother) outside" అంటూ పోలీసులు అడిగినవి చూపించకుండా గొడవకు దిగాడు. విధిలేని పరిస్థితుల్లో పోలీసులు ప్రొఫెసరును అరెస్టు చేసి నాలుగ్గంటలు జైల్లో పెట్టి విడుదల చేసారు.

బయటకు వచ్చాక వీడు కల్లు తాగిన కోతిలా "ఇది నల్లజాతి వాళ్ళ పట్ల వివక్ష" అంటూ చిందులేసి నానా హంగామా చేసాడు. ఈ సువర్ణావకాశాన్ని మీడియా బాగా ఉపయోగించుకొని వీడితో ఇంటర్వ్యూలు మొదలుపెట్టింది. నల్లజాతీయులకు అవమానం జరుగుతున్నదా అంటూ లేనిపోని విద్వేషాలను రెచ్చకొట్టడం మొదలుపెట్టింది. అరెస్టు చేసిన ఆఫీసరు జేమ్స్ తనకు క్షమాపణ చెప్పాలని వీడు చానెళ్ళలో గొడవ చేయడం మొదలుపెట్టాడు. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఆఫీసర్ జేమ్స్ "తన డ్యూటీ తాను చేసాను ఏ తప్పూ చేయలేదు కాబట్టి క్షమాపణ చెప్పను" అన్నాడు.

ఇక్కడి వరకు మామూలుగా సాగుతున్న ఈ వివాదం ఒబామా ప్రవేశంతో ఇంకా రాజుకుంది. అమెరికా చరిత్రలో అత్యంత కీలక నిర్ణయమయిన హెల్త్ కేర్ గురించి సుమారు 52 నిమిషాలు అద్భుతంగా మాట్లాడిన ఒబామా, చివరి ఒక్క నిమిషంలో ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు మన సీయంలా "చట్టం తనపని తాను చేసుకుపోతుంది" అనడానికి బదులు "ఆ ప్రొఫెసరు నా ఫ్రెండ్ కూడా. నాకు పూర్తి వివరాలు తెలియదు కానీ Cambridge police acted stupidly " అన్నాడు. (ఒబామాను ఆ మాట అనకుండా ఆపడానికి జాన్ స్టీవర్ట్ చేసిన ప్రయత్నం @ 4:30)

ఇహ చూడాలి మీడియా మాయాజాలం! ఒబామా మాటలను మీడియా మాఫియా ఊదరగొట్టిన పుణ్యమా అని సామాన్య ప్రజలు మరుసటిరోజుకు "హెల్త్ కేరా? అంటే ఏంటి?" అనే స్థితికి వచ్చారు. నేను అప్పటివరకు పబ్లిక్ ప్లేసుల్లో ఇద్దరు అమెరికన్లు ఒక సామాజిక విషయం గురించి మాట్లాడుకోవడం వినలేదు కానీ మొదటిసారి ఒక స్టోర్లో ఇద్దరు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఒబామా అలా అనకూడదు అన్నారు. అంతగా ప్రభావం చూపించింది ఒబామా స్టుపిడిటీ. చాలామంది విద్యావంతులయిన నల్లజాతీయులు కూడా ఒబామా తప్పు చేసాడన్నారు.

మరోవైపు దేశవ్యాప్తంగా పోలీసుల్లో అసంతృప్తి వ్యక్తమయింది. ఈ లోపు పోలీసులు అసలు జరిగినదేమిటో వివరించారు. పోలీసు తప్పు చేయలేదు అని గ్రహించిన ఒబామా ఆ పోలీసు ఆఫీసరుకు ఫోన్ చేసి మాట్లాడాడు. చిన్నవిషయం అనుకోకుండా పెద్దదయి వివాదంగా మారడానికి తాను ప్రధాన కారణమయ్యానని అంగీకరించి, ఈ వివాదాన్ని పక్కనపెట్టి దేశ సమస్యల గురించి ఆలోచిద్దాము అని చెప్పి ఎందుకు తనను "జీనియస్" అంటారో నిరూపించుకున్నాడు. ఆ పోలీసు ఆఫీసరును, ప్రొఫెసరును వైట్‌హౌసుకు రమ్మని ఆహ్వానించాడు. ప్రస్తుతానికి వివాదం సమసినట్లే.

పి.ఎస్: చాలమందికిలాగే నాక్కూడా ఈ ప్రొఫెసరు చేసినదానికి వాడిని నాల్రోజులు జైల్లో పెడితే బాగుంటుంది అనిపిస్తున్నది.

Who Moved My Cheese?

Posted by జీడిపప్పు

మార్పు అన్నది ఎంత సర్వసాధారణమో ఆ మార్పుకు అనుగుణంగా మన జీవన, ఆలోచనా విధానాలను మార్చుకోవడం అంత కష్టం. ముఖ్యంగా సుఖమయమయిన జీవనశైలికి అలవాటుపడినపుడు ఆ comfort zone నుండి బయటికి రావడానికి చాలామంది ఇష్టపడరు. దీనికి కారణం - ఒకవేళ బయటకు వస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందో అన్న భయాందోళనలు.

ఇది ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, మొన్న ఈ పుస్తకాన్ని చదివాను. ఒకసారి గతాన్ని తరచి చూస్తే, దీని గురించి విన్నప్పటినుండి చదవడం వరకు నా ఆలోచనావిధానాల్లో కొన్ని "మార్పులు" ఉన్నాయి. ఐదేళ్ళ క్రితమే ఒక మిత్రుడు తప్పక చదవమని సూచించినపుడు "అబ్బే ఇలాంటి పుస్తకాల వల్ల ఉపయోగం ఉండదు" అని ఆ పుస్తకం సంగతి మరచిపోయాను. కొద్దికాలానికి ఇలాంటి పుస్తకాలపట్ల నా అభిప్రాయాన్ని "మార్చుకున్నాను". పుస్తకాల షాపుకు వెళ్ళినపుడల్లా ఈ పుస్తకం కనిపిస్తుంటే ఊరుకోలేక పేజీలు తిరగేసాను. ఏదో కథలా ఉండడంతో వద్దనుకొని కొనలేదు. ( ఏ మాటకామాటే చెప్పుకోవాలి, నాకు చీజ్ అంటే అస్సలు పడదు, టాం అండ్ జెర్రీ షోలో తప్ప!)

కొద్ది రోజుల క్రితం ఓ మిత్రుడితో మాట్లాడుతుంటే ఈ పుస్తకం ప్రస్తావన వచ్చింది. అన్వేషి లాంటివాడే ప్రస్తావించాడంటే తప్పక చదవవలసిందే అనుకొని ఈ పుస్తకం పట్ల నా అభిప్రాయాన్ని "మార్చు"కొని పుస్తకం చదివాను. ఈ పుస్తకం ఎలా ఉంది అంటే - స్వర్గం/నరకం నిర్ణయించే జంక్షన్లో నన్ను నిలబెట్టి దేవభటులు "నువ్వు చేసిన నూరు మంచి పనులు చెప్పు" అంటే అందులో "ఫలానా పుస్తకం చదివాను, చదవమని నా బ్లాగులో రాసాను" అని నూరులో ఒకటిగా చెప్తాను. చాలాకుంచెం అతిశయోక్తి అలంకార ప్రయోగం గావింపబడిననూ ఇది సత్యం!

పుస్తకంలోని విషయం ఎంత విలక్షణంగా ఉందో పుస్తకం కూడా అంత విలక్షణంగా ఉంది. మొత్తం నూరుపేజీలు కూడా లేదు. అందులో మొదటి పాతిక, చివరి ~20 పేజీలు పక్కన పెడితే "అసలు కథ" 50 పేజీలు ఉంటుంది. మధ్య మధ్యలో పేజి మొత్తానికీ "చీజ్" పైన ఒకే ఒక్క వాక్యం ఉంటుంది. ఆ మిగిలిన పేజీల్లో అయినా పేజినిండా అక్షరాలున్నాయా అంటే అదీ లేదు. కొన్ని పేజీల్లో దాదాపు సగ భాగం ఖాళీ! ఆ మిగిలిన కొద్దిపాటి స్థలంలో అక్షరలక్షలను పొందుపరచిన విధానం చూస్తే రచయితకు జోహార్లు అర్పించవలసిందే. చదవడం పూర్తిచేసాక కాస్త అర్థమవుతుంది, దశాబ్దం క్రితం సుమారు ఐదేళ్ళపాటు రాజ్యమేలిన ఈ పుస్తకం ఎందుకు 26 భాషల్లో రెండు కోట్ల ప్రతులకు పైగా అమ్ముడుపోయిందో.

చివరగా - e-పుస్తకాన్ని చదివిన ఓ వారం పది ముప్పై రోజుల్లో "శాశ్వత మార్పు" వస్తుందా అంటే, ఖచ్చితంగా రాదు. ఎందుకంటే - అది "మార్పు" కాబట్టి. మరి అలాంటపుడు ఎందుకు చదవాలి అంటే - ఒక ఆలోచనా బీజం వేయడానికి. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను - చివరి పేజీ చదివి పుస్తకాన్ని మూసేస్తున్న తరుణంలో బాస్ ఫోన్ చేసి "నిన్ను ఈ క్షణమే ఉద్యోగం నుండి తీసేస్తున్నా" అనో లేదా ఫ్రెండ్ ఫోన్ చేసి "మనం డబ్బు దాచుకున్న బ్యాంకు దివాలా తీసింది, మనం అంతా పోగుట్టుకున్నాము" అనో అంటే, ఏమాత్రం తొణక్కుండా "ఓస్ అంతేనా" అంటారు!

ఆటోప్రకాష్‌కు కవితాభిషేకం

Posted by జీడిపప్పు

నాకు కవితల పట్ల పెద్దగా ఆసక్తి లేకపోయినా బ్లాగుల్లో కనపడే కవితలను అపుడపుడు చూస్తాను. మొన్నొకరోజు కవితలను చూస్తుంటే వేదన, రోదన, ఖేదన, మోదన, బాదనా కవితలు కనిపించాయి... ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలావరకు "ఏడుపు కవితలే" కనిపించాయి. సాధారణంగా ఏదయినా కథల పోటీ అని ప్రకటించగానే "ఆర్ద్రత" కలిగిన ఏడుపు కథలను రాయడం రచయితల ఆనవాయితీ. అలా కొంపతీసి బ్లాగుల్లో కూడా కవితల పోటీ ఏమయినా నడుస్తున్నదా లేక నా పైన "గో గ్రీన్" స్లోగన్ ప్రభావమా అనిపించింది.

anyhow, ఈ వారం సాక్షి సండే స్పెషల్‌లో ఒక మహోన్నత వ్యక్తి గురించి చూసాను. వివరాలు: ఇక్కడ మరియు ఇక్కడ.  అసలు ఇలాంటి విషయం కవితావస్తువుగా పనికొస్తుందా రాదా అన్న సందేహమొచ్చి కొన్ని బ్లాగుల్లో "ఈ వార్త పైన కవిత వ్రాయ"మని కొందరిని కోరాను. వారు అందించిన ఆణిముత్యాలు:

ఆటో ప్రకాష్ 9948029294
ఈ ప్రపంచం దృష్టెపుడూ
పసిపాపలపైనే.
ప్రేమించటానికో లేక
వ్యాపారించటానికో.

అయితే ఇతని చూపు
పండు భారానికి వంగిన కొమ్మపై ఉంటుంది.
అందుకేనేమో
నిండుగర్భిణిని పాపాయిగా మార్చి
పొత్తిళ్లలో పొదువుకోగలడు.
మూలాలపై మమకారమే తప్ప
వ్యాపారముండదిక్కడ.

నెలలు నిండిన స్త్రీని చూస్తే
మగవాడికి భయమో, జలదరింపో!
బహుసా స్త్రీ ముందు తన
అస్థిత్వమేమిటో గుర్తొస్తుందేమో.
ఇతనికి మాత్రం
తన శైశవపు పెదవులనుండి
శబ్దిస్తూ విడిపోయిన తన తల్లి
చన్మొన జ్ఞప్తి కొస్తుందేమో.

కాన్పు కు సిద్దమయిన స్త్రీ నడుస్తూంటే
మృత్యువు, ప్రాణమూ
కలిసి తిరుగుతున్నట్లుంటుంది.

సృష్టిగాలులకు ప్రాణదీపం
రెపరెపలాడే ఆ రాత్రివేళ
మనిషికీ మనిషికీ మధ్య
నమ్మకపు పరిమళం ప్రవహిస్తుంది.
ఇతని మనిషితనం ముందు
మృత్యుదేవత తలదించుకొని
మౌనంగా నిష్క్రమిస్తుంది.

పుడమిలోతుల్లోంచి
మరో ఉదయం బయటపడింది.
దానిని తవ్వితీసిన తల్లి
పొడికనులు ఇతనిని తడిగా చూసిన
చూపుల భాషలోనే కదా
ఈ లోకపు కీర్తనలన్నీ వ్రాయబడ్డాయీ!

అంచులవరకూ నిండిన తృప్తితో
ఇతనూ వెనుతిరుగుతాడు
ఎప్పటిలానే!
- బొల్లోజు బాబా

ఆటో నడిపే దేముడు...
అమ్మ తనాన్ని అమ్మేవాళ్ళూ..
ఆ పిలుపుని పిండమప్పుడే నలిపేవాళ్ళూ..
అద్దెకడుపుల వేలంపాటలూ..
ఏడడుగులేసిన ఏడోరోజే చూరు అంచులకు చేర్చే వాళ్ళూ..
ఆకలి కేకల్లో ఆరాటమార్చుకునే వాళ్ళూ..

కకృతి కోరల కరాళ నృత్యం..
కాగితం చుట్టగా.. ముంగిట్లోకి..

మధ్య పేజీలో మరో ఉదయం..

కలికాలపు ప్రవాహంలో...
అడ్డుగా .. ఓ గడ్డి పరక.

తన బ్రతుకే ఎదురీత..
ఎన్ని కడుపుల భారాన్నో మోస్తూ
ఓ కాలుతున్న కడుపు..

ప్రతి క్షణమూ ప్రసవ వేదనే..
చెక్కిళ్ళపై ఆగని పురిటి స్నానాలే..

ఏడుకొండల మీడ హుండీలు నింపుతూ
ఏ గర్భ గుడిలోనో మనమెదికేవాడు
మూడు చక్రాల గుడిలో
నిండు గర్భాలు మోస్తూ
మన మధ్యనే తిరుగుతున్నాడు..

చెమరిన కళ్ళతో..
తన కాళ్ళకిదే కవితాభిషేకం.!
- ఆత్రేయ కొండూరు

మానవత్వపు ప్రతీక
ఈ ఆటో -
అమ్మతనానికి ఒక అడుగు ముందుంటుంది
మాతృత్వాన్ని వరంగా ఇస్తుంది
ఈ ఆటో పుణ్యమా అని
ఎందరో అమ్మలు పుట్టారు

తొమ్మిదినెలలు స్వప్నించిన మధురక్షణం
మరణమా? మనుగడా? అని ప్రశ్నిస్తే
ఇతని ఫోను మోగుతుంది
అంతే -
పుట్టుకకు మరణానికి మధ్య
తన ఆటో అడ్డం పెట్టేస్తాడు

తండ్రిలా చేరదీసి
అన్నలా ఆదరించి
అమ్మగా బతకమని ఆశీర్వదిస్తాడు

ఆశకు మూడు చక్రాలు తొడిగి
ఆశయమనే ఇంధనం కలిపాడేమో
ఈ నగరారణ్యంలో
ఎన్నో పసి నవ్వుల పువ్వుల పూయించాడు

ఇప్పుడు ప్రసవ వేదనంటే
జీవితానికి మరణానికి మధ్య ప్రశ్న కాదు
జీవం పోసే మంచితనానికి
మానవత్వపు ప్రతీక..!
- సత్యప్రసాద్ అరిపిరాల

పుడమి తల్లి గర్భాన్ని ఛేదించుకుని
ఉద్భవించబోతున్న బాలభానులకు
మూడు గుర్రాల రథానికి
సారథ్యం వహించే అనూరునివా ?
మానవత్వ పరిమళంతో ’ప్రకాశి‘స్తున్న
ఓ మానవతావాదీ ! నీకు నమో నమః
- చిలమకూరు విజయమోహన్ 

ఆ సూర్యప్రకాశమే నీలో.. ఆటో ప్రకాష్
చంటి పిల్లల ఏడుపులే తమ
వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టేవాళ్ళు
కేర్ కేర్ అనే భాషకు
విలువకట్టి విపణి వీధిలో
కన్న కడుపలు వేలంవేసే వాళ్ళు

ఆక్రందనలతో తల్లడిల్లుతున్న
కాబోయే తల్లుల నిస్సహాయాన్ని
ఆసరా చేసుకుని చార్జీలు పెంచే
ఆటో వాళ్ళూ, ఇందరి మధ్యలో
వన్నెతగ్గని మానవత్వం
మూర్తివంతమైంది నీలో, ఇదెలా?

క్రౌంచ పక్షుల శోకం
నాడు వాల్మీకి హృదయాన్ని
తట్టి లేపినట్లు,
సతి వేదన నేడు నీలో
మంచితనపు చిగురు తొడిగింది
మానవత్వపు చాయలింకా మాసిపోలేదంది

తన కిరణాల కాంతిలో జగతిని
వెలిగించే ఆ సూప్రకాశమే నీలో
మళ్లీ కొత్తరూపు సంతరించుకుని
మరెందరి తల్లులకో కంటి
వెలుగు నిలుపుతోంది, "ఆటో ప్రకాష్"మై.

తగిలిన గోరంత దెబ్బకే
కొండంత ప్రతీకారంతో
ఎందరి బ్రతుకులనో కాలరాచే
అసురగణాల నడుమ
నిజంగా నువ్వు పాడింది సరికొత్త
జీవనగీతమే, అది ఎందరెందరికో
ఆచరణీయమైన పాఠమే

మనసుంటే మార్గముందని
మరో సారి చేసి చూపించిన
నేస్తమా, ఏ అక్షరాల మాల కూర్చి
నిన్ను నుతించను? అందుకే
శిరసు వంచి చేస్తున్నా వందనం
శ్రుతి

పేకాటో ప్రకాశ్ లెందరో! ”ఆటో ప్రకాశ్ “ మాత్రం ఒక్కడే!!
దాన కర్ణుడిలాగ కానవసరము లేదు!
నీ నిర్లక్ష్యపు చిల్లర ఖర్చులతొ క్షుదార్తి కడుపు నింపగ వచ్చు!!
శిభి చక్రవర్తిలా దేహమర్పించగనేల?
చిన్నారుల ముదుసలుల దారి కావలి దరి చేర్చగ వచ్చు!!
బలి చక్రవర్తిలా స్వీయ త్యాగంబేల?
వ్యసనాల మానేసి బీద విద్యార్థికి చేయూత గావచ్చు!!
బిల్గేట్స్ అంబానీలవొలె కోటికి పడగెత్త నవసరము లేదు!
చేతనైనంతలో సేవ చేయగ “వైజాగ్ ఆటోప్రకాశ్” లా అవతరించవచ్చు!!
మనసుండే చోటుకై మార్గమే ఉండదా?!
మానవత్వము తోటె ప్రతి బ్రతుకు పండదా!!!
- Rakhee


అటో ఇటో ఎటో అటు సీటు చోదకుడి పక్కనైన చాలు
ఎక్కి ఇరుక్కుని గమ్యం చేరగలం
ఆటో ఉన్నది ముగ్గురికే అనే రధకుడు మూడు తరాల వెనక సంగతి
రోడ్డు పక్క పురిళ్ళు, బెడ్డులివ్వని ఆస్పత్రులు
అయితేనేం ఆటోలో చోటు చూపి
అవసరమైతే అన్నవలె తోడుండి
వచ్చే కిరాయిని పరాయి చేసి
కలికితురాయిగా నిలిచి
సైకత తీరమున అడుగు వేయనున్న పసిపాపల ఆటలకై
తన ఆటోనే ప్రసవ స్థలము చేసి..
అది ఆటో కాదు కదిలే దేవాలయముగా మార్చి
ఆ దేవాలయమున పూజారియై నిలిచి
ప్రకాశమొందుచున్నావా ప్రకాశా
 -  మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్

ఇలాంటి పుస్తకాలే కొనాలి

Posted by జీడిపప్పు

రెండేళ్ళ క్రితం అనుకుంటాను, ఉన్నట్టుండి personality development వైపు గాలి మళ్ళి వెంటనే అందుకు అవసరమయిన వనరులు సేకరించడం మొదలుపెట్టాను. IT లో ఉండడం వల్ల అన్నిటికంటే ముఖ్యమయినది "పని చేసే విధానం" అని గ్రహించి ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, టైం మేనేజ్‌మెంట్, ప్రొఫెషనల్ బిహేవియర్ మొదలయిన విషయాలకు సంబంధించిన పుస్తకాలు దింపేసాను.

ఒక వారం రోజుల పాటు ఐదారు పుస్తకాలను బరబరా చదివేసి "హమ్మయ్యా, ఇక నుండి అన్నీ చాలా ఎఫిషియంట్ గా చేస్తాను. నాకు తిరుగు లేదు" అనుకున్నాను. ఓ రెండు మూడు వారాల తర్వాత నా పనితీరు, ఆఫీసు దినచర్యలను పరిశీలిస్తే ఏ మాత్రం మార్పు కనపడలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అప్పుడర్థమయింది ఈ పుస్తకాలు అన్నీ సోది చెప్పి డబ్బులు లాక్కోవడానికే కానీ పనికొచ్చేవి కాదు అని. అంతటితో అలాంటి పుస్తకాలు చదవడం మానేశాను.

చదవడం మానేసినా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు ఫలనా పుస్తకం చదివిన తర్వాత ఫలానా విషయంలో మార్పు కనిపించింది అన్నపుడల్లా మళ్ళీ అలాంటి పుస్తకాలు చదవాలనిపించేది. రెండో ప్రయత్నం లో ఎక్కువ పుస్తకాలు చదవకుండా Brian Tracy రాసిన Eat That Frog ఒక్కటే చదివాను. పుస్తకంలో చాలా చాలా మంచి విషయాలున్నాయి. ఓ రెండు వారాల తర్వాత చూసుకుంటే ఏమీ మార్పు లేదు, మళ్ళీ డాగ్ టెయిల్ కర్వీ!!

తర్వాత అర్థమయింది నేను చేస్తున్న తప్పిదమేమిటో. కొన్ని లక్షలమందిలో కాస్తో కూస్తో మార్పు తెచ్చిన ఈ పుస్తకాలు "నవలలు" కాదు ఏకబిగిన చదవడానికి. ప్రతి పుస్తకంలో కొన్ని పదుల/వందల సూచనలు, సలహాలు ఉంటాయి. రెండు గంటలు చదివితే ఆ మంచి లక్షణాలన్నీ మన దైనందిన జీవితంలో భాగమయిపోవు. కేవలం ఒక్క లక్షణాన్ని "అలవాటు"గా చేసుకొనేందుకే సగటున 40 రోజులు క్రమం తప్పకుండా సాధన చేయాలంట! నేనేమో రెండు గంటల్లో నూటపాతిక లక్షణాలను "అలవాటు చేసుకోవా"లనుకున్నాను.

ఇప్పటికయినా మించిపోయింది లేదని మళ్ళీ అదే పుస్తకంలో చెప్పిన ఒక సలహాను పాటించడం మొదలుపెట్టాను. ఒకరోజు పాటిస్తే మూడురోజుల పాటు మరచిపోయేవాడిని. రెండు-మూడు నెలలకు కాస్త గాడిలో పడ్డాను. సగటున 40 రోజుల్లో అలవాటు కావలసిన ఈ లక్షణం నాకు అలవాటు కావడానికి సుమారు ఆరు నెలలు పట్టింది! ఇప్పుడు ప్రతిరోజూ ఆఫీసుకు వచ్చిన తర్వాత చేసే మొట్టమొదటి పని "ఏ పనులు చేయాలి, ఏవి ముందు చేయాలి ఏవి తర్వాత చేయాలి, ఎలా చేయాలి" అని జాబితా వ్రాయడం. దీనివల్ల నిఝ్ఝంఘానే నా పనితీరు మొత్తం మారిపోయిందా అంటే well.. something is better than nothing!

మొదటిసారి ఇలాంటి పుస్తకాల పైన నమ్మకం కలిగిన తర్వాత కొన్ని విషయాలు బాగా అర్థమయ్యాయి. అవి: 1) ఈ పుస్తకాలు ఊహాజనితాలు కావు, కొందరు మేధావులు తమ జీవితకాల అనుభవాలను సరళమయిన రీతిలో అందరికీ అర్థమయ్యేలా, ఆచరింపగలిగేలా పుస్తకరూపంలో అందిస్తున్నారు. 2) ఇలాంటి పుస్తకాలనెపుడూ నవల చదివినట్టు ఏకబిగిన చదవకూడదు 3) ఒక్క పుస్తకంలోని సారాన్ని మొత్తం "అలవాటు" చేసుకోవడానికి జీవిత కాలం కూడా సరిపోకపోవచ్చు. 4) పొరపాటున కూడా "పెద్ద పుస్తకాలను" కొనకూడదు.

వీటన్నిటిలో అతి ముఖ్యమయినది నాలుగవది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే, పెద్ద పుస్తకం అంటే చాలా పేజీలుంటాయి.పేజీలు నింపడానికే అన్నట్టు విషయాన్ని సాగదీస్తూ చెప్తారు. చదవడానికి చాలా సమయం పట్టినా ఏమి చెబుతున్నారో అర్థం చేసుకోవడానికి మరింత సమయం పడుతుంది. అందుకే కాస్త రీసెర్చ్ చేసి చివరకు John C. Maxwell పుస్తకాలను కొనడం మొదలు పెట్టాను.

Maxwell పుస్తకాలనే ఎక్కువగా కొంటుండానికి అనేక కారణాలున్నాయి: ముఖ్యంగా పుస్తకాలు చాలా చిన్నవి. 100-150 పేజీలకు మించకుండా జేబులో పట్టే సైజులో లభిస్తాయి. చాలా మంచి క్వాలిటీ పేపరు, చూడగానే ఆకట్టుకొనే Hardcover అయినా పుస్తకాలు చాలా తేలికగా ఉంటాయి. పుస్తకాన్ని వీలయినన్ని చాప్టర్లుగా విడగొట్టి చెప్పాలనుకొన్న విషయాన్ని సూటిగా చెప్పడం. ధర పది డాలర్లు కావడం.

ఇప్పటివరకు అన్నీ చదవకపోయినా Maxwellవి ఆరు, ఇతర రచయితలవి మూడు పుస్తకాలు కొన్నాను. (అఫ్‌కోర్స్, రాబోవు పదేళ్ళకు 10-15 పుస్తకాలు సరిపోతాయన్ని సత్యాన్ని తెలుసుకున్నా కనుక ఇప్పుడే చదవకపోయినా కొనిపెడుతున్నాను.) చూడడానికి అన్నీ భలే ఉన్నాయి. అన్ని పుస్తకాలూ ఒకేసారి పట్టుకొని అరచేతిలో మినీ లైబ్రరీ చూసుకొని మురిపోతుంటా అప్పుడపుడు. Kindle కొనేవరకు అదో తుత్తి :)

హాస్య చక్రవర్తికి నివాళి

Posted by జీడిపప్పు

చంటబ్బాయ్ సినిమాలో ఇంగ్లీషు మాట్లాడే బట్లరు పాత్రలో "ఏరా సెవెన్ హిల్సు, ఇది ఆరోసారి రాంగ్ నంబర్ స్పీక్ చేయడం. ఏమి ఆటలుగా ఉందా..ఆహా గేమ్స్ గా ఉందా అని అడుగుతున్నాను. నాతో పెట్టుకోకురా రేయ్. కుంతీ సెకండ్ సన్ బూన్, అదే భీమవరంలో వన్ ఏడాది క్రితం ఒకడిని చావ హిట్టాను. కీపెయ్యి. రెస్పెక్ట్ గా ఫోన్ కీపెయ్యి." "గార్డెన్ కర్రీ పులుసు ఇవాళ స్పెషల్..అదేనమ్మా తోటకూర"  అంటూ నవ్వులు కురిపిస్తారు.

కేవలం హాస్య పాత్రలే కాకుండా స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ ఆస్తి కాజేసే విలన్ పాత్ర పోషించారు. అహనా పెళ్ళంట సినిమాలో తన పిసినారి బావ (కోట శ్రీనివాసరావు) చేష్టలకు మతికోల్పోయే కలెక్టరుగా చిన్న పాత్రలో కనిపిస్తారు. పడమటి సంధ్యారాగం సినిమాలో గుమ్మలూరి శాస్త్రిగారిగారి మాటలు వింటూ, నటన చూస్తుంటే ఆయనకు డబ్బింగ్ చెప్పిన సుత్తి వీరభద్రరావుగారే గుర్తుకొస్తారు. ఇక వివాహ భోజనంబు తర్వాత వచ్చిన చూపులు కలసిన శుభవేళ సినిమాలోని "గుండు పాండురంగం" ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర.

ఘంటసాల పాటలను అమితంగా ఇష్టపడుతూ ఆరాధించే గుండు పాండురంగం ఆరోగ్యానికి మంచిదని తన దగ్గరకు వచ్చిన వాళ్ళనూ, తన దగ్గర పని చేస్తున్న ఉద్యోగులనూ కిలోమీటర్ల కొద్దీ నడిపించుకొని వెళ్ళి వాళ్ళను అక్కడే వదిలేసి తన కారులో తిరిగి వచ్చేస్తాడు. ఇప్పటికీ ఎవరయినా "అలా వాకింగ్ వెళ్తూ మాట్లాడుకుందామా" అంటే ఒక్క క్షణం గుండు పాండురంగం గుర్తుకొచ్చి గుండె గుభేల్మంటుంది!

చూపులు కలసిన శుభవేళ సినిమా అపుడు అనారోగ్యానికి గురి అయిన, వైద్యం వికటించి 1988, జూన్ 30న కేవలం 40 ఏళ్ళ వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. దశాబ్దకాలం పాటు ఎన్నో మరచిపోలేని పాత్రలలో నటించి ఆరోగ్యకరమయిన హాస్యానికి చిరునామాగా నిలిచిన ఈ హాస్య చక్రవర్తి,  తనూ తొందరగా వెళ్ళిపోయిన ఆయనను సృష్టించిన హాస్యబ్రహ్మ జంధ్యాల స్వర్గంలో అందరినీ నవ్వించింది ఇక చాలనుకొని మళ్ళీ భూమిమీద పుడతారని ఆశిద్దాం.

హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు - మొదటి భాగం
హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు - రెండవ భాగం
హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు - మూడవ భాగం

Transformers 2 రివ్యూ

Posted by జీడిపప్పు

చక్కని కథనం, అప్పటివరకు చూసిన గ్రాఫిక్స్ కంటే విభిన్నమయిన గ్రాఫిక్స్ లతో తీసిన Transformers చూసిన వెంటనే ఈ సినిమా సీక్వల్ తప్పక చూడాలి అని నిర్ణయించుకున్నాను. గత వారం రెండవ పార్టు విడుదలయి కేవలం ఒక్క రోజులో 60 మిలియన్ డాలర్లు, వారాంతానికల్లా $112 మిలియన్ల కలెక్షన్ రాబట్టింది. ఈ వివరాలు చూసి ఈ సినిమా పైన మరిన్ని ఎక్కువ అంచనాలతో వెళ్ళాను.

మొదటి పార్టు హిట్ అయింది కాబట్టి రెండవ పార్టుకు కాస్త ఫ్లాష్‌బ్యాక్ కలపాలన్న ప్రాథమిక సూత్రాన్ని పాటించారు. ఈజిప్టులోని పిరమిడ్లో ఉన్న యంత్రాన్ని పునరుజ్జీవనం చేయడానికి అవసరమయిన "మేట్రిక్స్" కోసం డిసెప్టికాన్స్ ప్రయత్నిస్తుంటే ఆప్టిమస్ తన మితృడయిన హీరోతో కలసి ఎలా ఎదుర్కుంటాడు, చివరికి భూలోకాన్ని డిసెప్టికాన్స్ నుండి ఎలా కాపాడగలుగుతారు అన్నది కథాంశం.

చిక్కనయిన కథతో అలరించిన ఫస్ట్ పార్టుకు భిన్నంగా ఈ కథలో సాగతీత, అనవసరపు సన్నివేశాలు ఎక్కువయ్యాయి. గ్రాఫిక్స్/విజువల్స్ కూడా మొదటిపార్టుతో పోలిస్తే తక్కువే. సూటిగా విషయానికి రాకుండా అనవసరపు ఉపోద్ఘాతాలవల్ల, ఉపన్యాసాలవల్ల కథలో స్పష్టత లేదు. మొదటి అరగంటా హీరో కాలేజీ సోదితో "సాగుతుంది". హీరో హీరోయిన్ల ప్రేమ కథ మరో అనవసరపు ట్రాక్. మొదటి పార్టులోనే ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపించారు. ఇప్పుడు దానికి ట్విస్టులు ఎందుకు పెట్టారో!

డిసెప్టికాన్లను ఎదుర్కోవడానికి ఆప్టిమస్ ప్రైం తమ గ్రహం నుండి అప్పటికప్పుడు మరికొందరు ఆటోబాట్స్ ను ఎందుకు పిలిపించడో అర్థం కాదు. హీరోయిన్ దగ్గరున్న వస్తువును కాజేయడానికి వచ్చిన డిసెప్టికాన్ చైనుకు కట్టివేయబడి కుక్కపిల్లలా ప్రవర్తిస్తూ హీరోయిన్‌కు సహాయం చేస్తుంది!! హీరో తల్లిదండ్రులను ఈజిప్టుకు తీసుకురావలసిన అవసరం కథకు ఏ కోశానా కనపడదు. చివరగా ఆప్టిమస్ ప్రైం అన్ని డిసెప్టికాన్లను మట్టుపెట్టడు. బహుశా మూడో పార్టుకోసం కావచ్చు. గ్రాఫిక్స్ కూడా అంతంత మాత్రమే. మొదటి సన్నివేశంలో కాస్త,  చెట్లమధ్య ఆప్టిమస్-డిసెప్టికాన్ల మధ్య ఫైట్, చివరగా పిరమిడ్ల పైన దాడి జరిగే సన్నివేశాలు మాత్రమే ఆకట్టుకుంటాయి.

నటీనటుల విషయానికొస్తే -  సినిమా మొత్తం పైన "నటన" అన్నది దాదాపు కనిపించదు. సినిమా అంతా కేవలం రెండు-మూడు ఎక్స్ ప్రెషన్లతో లాగించే మహేష్‌బాబులా Shia LaBeouf అతి తక్కువ హావభావాలతో "నటించాడు". మొదటి పార్టులో అస్థిపంజరంలా ఉన్న Megan Fox ఈ సినిమా కోసమే కాస్త బరువు పెరిగి సెక్సీగానే కనిపిస్తుంది, అక్కడక్కడా చాలా హాట్ గా కూడా ఉంటుంది. హీరో కనిపిస్తే ఒళ్ళు మరిచిపోయి హీరో పైన పడే బజారుదానిలా (ఇలియానాలా ) Isabel Lucas తలాతోకా లేని పాత్రలో కనిపిస్తుంది. కాస్తో కూస్తో నటనకు అవకాశమున్న పాత్రలో John Turturro కనిపిస్తాడు కానీ ఆ పాత్ర సీరియస్ పాత్రో కామెడీ పాత్రో అర్థం కాదు.

ఈ సినిమాకు Rotten Tomatoes వెబ్‌సైట్ 20%, IMDB 6.8 రేటింగ్ ఇచ్చాయంటే ఏమో అనుకున్నాను కానీ సినిమా చూసిన తర్వాత అర్థమయింది ఎందుకలాంటి రేటింగ్ ఇచ్చారో.  సినిమా అయిపోయాక థియేటర్లో కొందరు చప్పట్లు కొట్టారు....నేనూ కొట్టాను "హమ్మయ్యా సినిమా అయిపోయింది" అనుకుంటూ!

హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు - మూడవ భాగం

Posted by జీడిపప్పు

సుత్తి వీరభద్రరావు పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చే సినిమా "వివాహ భోజనంబు". రకరకాల ఆసనాలు వేస్తూ తన ఇంట్లో అద్దెకుంటున్న కవి అయిన బ్రహ్మానందానికి "సినిమా స్టోరీ" చెప్పే పాత్రను ఆయన పోషించారు. సినిమా రచయిత కావాలనుకొనే బ్రహ్మానందం ఓ కథ చెబితే దాన్ని తీసిపారేసి ఊళ్ళు, సందులు, ఆహారపదార్థాల జాబితా చెప్పి ఇలా సినిమా తీయాలంటాడు. తెవికీనుండి సంగ్రహించిన ఆ సరదా సంభాషణలు:

మట్టి పూసుకొని ఉన్నపుడు బ్రహ్మానందం సంభాషణ--(ఏడుపు గొంతుతో) ఈ చెమ్మంతా ఇగిరేలోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాఏమో మహాప్రభో. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే . జూవాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళి పోతారు. జనమెవరయినా చూస్తే ఇతర గ్రహాలనుండి వచ్చారనుకొని రాళ్ళుచ్చుక్కొడతారు... (ఆశగా ) ఇంక ఎంచక్కా కడిగేసుకుందామా మహాప్రభో.

కధ చెప్పమని--ఈ కథ సినెమాగా తీస్తే నేను అడుక్కుతినాల, ఓ వూరు వూరంతా పస్తుండి నాకు ముష్టెయ్యాల్సొస్తుంది. అరే ఇన్నాళ్ళనుండి సూత్తన్నాను. సినిమాకు పనికొచ్చే ఒక కథ కూడా సెప్పలేనోడివి నువ్వేం కవివయ్యా అసలు. నేనొక గొప్ప కథ సెప్తాను ఇనుకో.మధ్య తరగతి ఎదవనాయాలా.

మహాప్రభో తమరు నన్ను తిట్టారా?

లేదు సినిమా పేరు చెప్పా--ఆ పేరు తిట్టులా ఉంది మహాప్రభో --పేరులో తిట్టుంటేనే సినిమా హిట్టవుద్దయ్యా

తెర లెగవంగానే ఈరో ఒక కాఫీ ఓటల్కు ఎల్తాడు. సర్వర్ రాగానే ఈరో ఏమున్నాయి అని అడిగాడు. అప్పుడు సర్వరు "ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారె, మషాలా గారె, ఉప్మా, కిచిడీ, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మషాలా అట్టు, బాత్తు, టమేటా బాత్తు, బోండా, బజ్జీ, మైసూరు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరిటికాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, లడ్డు, బందరు లడ్డు, రవ్వ లడ్డు, మిఠాయి, పీచు మిఠాయి, బందరు మిఠాయి, బొంబాయి మిథాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా,హల్వా, మైసూరు పాకు, అమలాపురం కాజా, భీమవరం బాజా, పెద్దాపురం కూజా" ఉన్నాయంటాడు.

అప్పుడు ఈరో "అట్టు తే" అన్నాడు

అప్పుడు సర్వరు " యే అట్టు? పెసరట్టా, మినపట్టా, రవ్వట్టా, మషాలా అట్టా, 70mm అట్టా, MLA అట్టా, నూనేసి కాల్చాలా నెయ్యేసి కాల్చాలా, నీళ్ళోసి కాల్చాలా, పెట్రోలు పోసి కాల్చాలా, కిరసనాలు పోసి కాల్చాలా, డీజిలేసి కాల్చాలా, అసలు కాల్చాలా వద్దా " అని అడిగాడు

అప్పుడు ఈరో పెసరట్టు నెయ్యేసి కాల్చమన్నాడు, కాఫీ కూడా తెమ్మన్నాడు

అప్పుడు సర్వరు "యే కాపీ మామూలు కాపీయా,స్పెసలు కాపీయా, బుర్రూ కాపీయా, నెస్కాఫీయా, బ్లాక్ కాఫీయా, వైటు కాఫీయా హాటు కాఫీయా, కోల్డు కాఫీయా , నురుగు కావాలా వద్దా, కావాలంటే ఎన్ని చెంచాలు " అని అడిగాడు

అప్పుడు ఈరో మామూలు కాపీ తెమ్మన్నాడు

అప్పుడు సర్వరు "నీలగిరి కాపీయా, హిమగిరి కాపీయా, సిమలా కాపీయా'

ఆపండి మహాప్రభో, తమలో ఇంత వూహాశక్తి ఉందని వూహించలేకపోయాను. ఈ కథనే సినిమాగా తీసుకోండి. పది వేల రోజులు ఆడుతుంది జనం వ్రుద్దులై పండి రాలిపోయేంత వరకు, కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనం అయిపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభో నన్ను వదిలెయ్యండి మహాప్రభో నన్ను వదిలెయ్యండి

                                                     ********  
మహాప్రభో అద్దె బాకీ మాఫీ చేస్తానని తమరు నన్నిలా శంకుస్థాపన టైపులో పాతిపెట్టి తమరలా విష్ణుమూర్థిలా పడుకోవడం ఏమీ బాగలేదు మహాప్రభో

నిన్ను నేను పాతిపెట్టాను కదా, నన్ను పాతి పెట్టే మడిసి కోసం సూత్తన్నానయ్యా

Image and video hosting by TinyPic నన్ను తొరగా బయటకి లాగండి మహాప్రభో. ఏ ఊరకుక్కాన్నా దగ్గరికొచ్చి కాలెత్తిందంటే పావనమైపోతాను. లేదా యే అల్సేషనో ఇసుకలో బంతి పడిందని నా తల నొట కరుచుకొని వెళ్ళిపోతే కీర్తిశేషుడిని అయిపోతాను. చీ ముక్కు మీద దురద పుట్టినా గోక్కోలేని వెధవ బ్రతుకు అయిపోయింది నాది

స్షో ఆట్టే వాగావంటే తిత్తి తీస్తా. నువ్వు సెప్తున్న కథలో ఏదో లోపముందయ్యా కవీ. నేను ఆలోసించి పెట్టుకున్న సిన్న లైను ఇనిపిస్తాను ఇనుకో:

వో ప్యామిలీ మంగలగిరి తిరణాలకెల్తారు. ఆళ్ళ కొడుకు ఆరేళ్ళ గుంటడు ఆ జనంలో తప్పోతాడు. ఆడి తల్లిదండ్రులు ఆడికోసం బావురుమంటారు

ఆహా సెంటిమెంటు బాగుందండయ్యా. మొదటి సారిగా తమరు మెదడు వాడుతున్నారు, వాడండి

ఆడి తండ్రి ఆడికోసం వూళ్ళన్నీ గాలించడం మొదలుపెట్టాడు. యే యే వూళ్ళు తిరిగాడో తెలుసా?

ఐదరాబాదు, అదిలాబాదు, సికిందరాబాదు, అహమ్మాదాబాదు, ఫకీరాబాదు,అలహాబాదు, ఫరీదాబాదు. ఔరంగాబాదు, తనబాదు (??), సింధుబాదు,ముస్తాబాదు, ఫైసలాబాదు, గజియాబాదు, అబ్దుల్లాబాదు, జపారాబాదు, వుస్సేనుబాదు. (బ్రహ్మం ఏడుస్తూ) నా బొందబాదు, నా శ్రాద్దంబాదు, నా పిండాకూడు బాదు

ఆ ఆ ఆటన్నిటితో కలిపి మొత్తం ఇరవయ్యొక్క బాదులు ఎతికాడు. సివరాఖరికి యెవుడో ఆ గుంటడు బెజవాడలో ఉన్నాడని సెప్తే ఆ వూరెళ్ళాడు.

బెజవాడలోగవర్నరుపేట, లబ్బీ పేట, పున్నమ్మ తోట, భాస్కర్రావు పేట, సింగు నగరం, ప్రజాశక్తి నగరం, అయోధ్యా నగరం, ముత్యాలపాడు, గుణదల, గాంధీ నగరం, చిట్టి నగరం, మాచవరం, రోకళ్ళపాలెం, మారుతీ నగరం, మొగల్రాజపురం, భవానీపురం, సత్యన్నారాయనపురం, సీతారామపురం...

వద్దు బాబోయ్, చాలు మహాప్రభో చాలు, బెజవాడంతా వెతికేసాడనుకుందాం ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభో.

అన్నీ పేట్లెతికినా ఆ గుంటడు దొరకలేదయా, అప్పుడు...

పారిపోవడానికి కూడా వీలులేని పరిస్థిథిలో పడిపోయాను మహాప్రభో

ఇను ఇక్కడే ఇక్కడే తమాషగుంటంది అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు. యే యే రోడ్ల మీద పడ్డాడో తెలుసా? బీసెంటు రోడ్డు, బందరు రోడ్డు, యేలూరు రోడ్డు, నక్కల రోడ్డు, టిక్కల రోడ్డు, కారల్ మార్క్సు రోడ్డు, గాంధీ రోడ్డు, వన్ టవును రోడ్డు, అద్దంకివారి వీధి, తాళంకివారి వీధి, దాసరివారి వీధి, మల్లెలవారి వీధి, పుల్లెలవారి వీధి, పూలబావి వీధి, కొత్తగుళ్ళ వీధి, మసీదు వీధి, వినోడా టాకీసు వీధి, అచ్చమామబ ఆస్పత్రి వీధి, మాంటిసోరి స్కూలు వీధి, హనుమంతరాయ గ్రంథాలయం వీధి...

మహాప్రభో ఆపండి, ఇది సినిమా కథా? ఈ లెక్కన పోస్ట్ మ్యాన్లు అత్యద్భుతమయిన సినిమా కథలు రాయగలరు. కుక్కొచ్చి కాలెత్తినా పందొచ్చి తల కొరికినా ఇంతకంటే సుఖంగా ఉంటుంది మహాప్రభో!!

                                                                              (మిగతా చివరి భాగంలో)

పుస్తకం.నెట్ నిర్వాహకులు జైలుకు - Season Finale

Posted by జీడిపప్పు

గత ఏడాది కాలంలో తెలుగు సాహిత్య రంగానికి సేవలు చేయడానికి ఎందరో తమవంతు కృషి చేసారు. "పుస్తకం హస్తభూషణం" అన్న మాటను ఆదర్శంగా తీసుకొని పుస్తకప్రియుల కోసం మంచి పుస్తకాల సమాచారాన్ని అందివ్వడానికి, పంచుకోవడానికి కొందరు "పుస్తకం.నెట్" అనే వెబ్‌సైట్ ప్రారంభించారు. చాలావరకు చక్కని చర్చలు జరిగాయి కానీ ఈ మధ్య ఆ చర్చలు శృతిమించి వ్యక్తిగత దూషణలవరకు వెళ్ళాయి. చివరకు పోలీసు కేసులు, FIRల వరకు వెళ్ళాయి అంటే పరిస్థితి ఎంతగా చేజారిందో తెలుస్తున్నది.

కత్తి మహేష్ గారు తనను కులం  పేరుతో దూషించారని కేసు పెట్టారు. మహేష్ గారి మాటల్లో:

"పుస్తకం డాట్ నెట్ లో చలంపై జరిగిన ఒక చర్చలో  నాపై కులపరమైన నింద చేస్తూ "
"బ్లాగుల్లో కంటెంట్ కామెంట్లతో సహా అన్నిటి బాధ్యతా బ్లాగరిదే. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే మోడరేషన్ బాధ్యత బ్లాగరి తీసుకుంటాడు కాబట్టి"
"కేసు పెట్టడానికి నేను దళితుడినైతే చాలు. ఒకసారి SC/ST (prevention of) atrocities act చదువుకోండి."

అంటే మహేష్ గారిని అన్నవారికంటే ఆ వ్యాఖ్య ప్రచురించిన పుస్తకం.నెట్ నిర్వాహకులదే తప్పు. వారే బాధ్యులు అన్నమాట. ఇక ఇది SC/ST atrocity act కింద వస్తుంది కాబట్టి ఎవరూ తప్పించుకోలేరు.

సదుద్దేశంతో ఒక వెబ్‌సైట్ మొదలు పెట్టిన నిర్వాహకులు కేసుల్లో ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరిగి జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడడం కడు శోచనీయం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పురావృతం అని కోరుకుందాము.

      *******                       *******                          *******

బ్లాగుల్లో జరుగుతున్న సందడికి నా తరఫున ఇప్పటికి మూడు ఎపిసోడ్లు ప్రసారం చేసాను. ఈ నాలుగో ఎపిసోడ్‌తో ఈ మొదటి సీజన్ ముగిస్తున్నాను. అసలేమి జరిగింది, ఏమి చేసాము, ఏమి సాధించామో సింహావలోకనం చేసుకుందాము.

ముందుగా - ఒక కోన్ కిస్కా గొట్టం గాడు వచ్చి "అర్జునుడు భీముడికి బామ్మర్ది అవుతాడు తెలుసా" అన్నపుడు లేదా ఉడతలుపట్టే చిడతల చిన్నారావు "పంచపాండవులు పంచలే కట్టుకుంటారని సాక్ష్యం లేదు" అన్నపుడు ఒక సగటు వ్యక్తి భావనలలో/ఆలోచనలలో వెంట్రుకంత కూడా మార్పు ఉండదు. వినేవాడు ఒకటో తరగతి పిల్లవాడూ కాదు, చెప్పేవాడు ఒక మూర్ఖుడని అందరికీ తెలుసు. కొందరు "మనకెందుకులే ఈ బురదలో రాయి వేయడం" అని ఊరకుంటారు. నా గురించి బాగా తెలిసిన మా గురువుగారు తెలుగోడుగారు ఒకసారి "పడుకున్న గాడిదను లేపి తన్నించుకోవడం నీకు భలే ఇష్టం కదా" అన్నారు. నిజమే! రెండు తన్నించుకొని నాలుగు తన్ని దురద తీర్చుకొనే నాలాంటి వాళ్ళు ఈ చెత్త చదివి కాస్త చిరాకుతో కొన్ని కామెంట్లు/పొస్టులు వేస్తుంటారు తప్పించి ఈ మతగజ్జి మూర్ఖుల వల్ల అర్థనయాపైసా నష్టం లేదు.

ఇక బ్లాగుల్లో వివాదం సంగతి:  కత్తి మహేష్ కుమార్ గారు తనపైన వచ్చిన "కుల వివక్ష" గురించి చెప్పారు. అందరూ అంగీకరించాల్సిన విషయమే. నలుగురు కులస్తులు కలిసే చోటు ఏది? గుడి. అంటే కులం కంటే మతం గొప్పదిగా భావించేవారే ఎక్కువ కదా. మరి అలాంటి మతాన్ని
""ఈ రామాయణం ప్రకారం సీత రాముడికి సోదరి అవుతుంది. వయసులో చిన్నది కాబట్టి చెల్లెలన్నమాట....ఈ బౌద్ధజాతక కథ ప్రకారం, దశరధుడు అయోధ్యకు కాదు, వారణాశికి రాజు. అంటే కాశీరాజన్నమాట. అతనికి రామపండితుడు, లక్ష్మణకుమారుడు, సీత అనే పిల్లలు.... ఇక అన్నాచెళ్ళెల్ల వివాహం అంటారా, అప్పటి రాచరికంలో incestuous పెళ్ళిళ్ళు ఉండే అవకాశం పెద్ద ఆశ్చర్యకరం ఏమాత్రం కాదు. అమలి రాచరికపు రక్తం పేరుతో ఇలాంటి సాంప్రదాయాలు చరిత్రలోని చాలా రాచరికాల్లో ఉండటం మనకు తెలిసిందే." 
 "వ్రతాలు ఏ వేదాల్లో ఉన్నాయో కాస్త చూసిచెప్పండి! వేదకాలంలో చిల్లరదేవుడైన విష్టువు అత్యంత శక్తివంతుడైన దేవుడుగా ఎలా ఎదిగాడో కాస్త కనుక్కుని చెప్పండి! శివుడు త్రిమూర్తుల్లో ఒకడెప్పుడయ్యాడో కాస్త ఆరాతియ్యండి!"
 లాంటిమాటలతో మహేష్ గారు హేళన చెయ్యడం న్యాయమా? "బ్రాహ్మినికల్ యాటిట్యూడ్" అంటూ రకరకరాల నిర్వచనాలు చెప్పి అవతలివారితో "దళిత్ యాటిట్యూడ్" అనిపించుకొని  "కేసు పెట్టడానికి నేను దళితుడినైతే చాలు. ఒకసారి SC/ST (prevention of) atrocities act చదువుకోండి." అనడం ఎంతవరకు సమంజసం?

నేనేదో హిందూమత పరిరక్షకుడినో, హిందూన్మాదినో కాదు. సుష్టుగా వారానికి ఏడు రోజులూ చికెన్ బిర్యానీ తిని ఎన్నో ఏళ్ళనుండి దేవుడికి ఒక్కసారయినా మొక్కని నేను ఇలా ఎందుకు స్పందిస్తున్నానంటే.. i don't like this crap of insulting/mocking/scrutinizing religious stuff thus hurting one's beliefs.

ఇక ఈ నాలుగురోజుల సీజన్‌లో ముఖ్యంగా చెప్పుకోవలసినది బ్లాగరుల విశేష స్పందన. పదుల కొద్దీ పోస్టులు (పూర్తి జాబితా), వందల కొద్దీ కామెంట్లతో ఆద్యంతం ఆహ్లాదకరంగా, వినోదాత్మకంగా, పండుగవాతావరణాన్ని తలపింపచేసారు. "కేసు పడుద్ది" "నీ ఐపీ అడ్రస్ నాకు తెలుసు" "అట్రాసిటీ కేసు పెడతా" "ఏం పీక్కుంటావో పీక్కో" "నీది xyz యాటిట్యూడ్" లాంటి మాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. ముందు ముందు ఈ మాటలతో చాలా హాస్యం వెల్లివిరుస్తుందన్న విషయంలో అణుమాత్రమనుమానం లేదు.

కేవలం నాలుగు ఎపిసోడ్లతో ఈ సీజన్ ముగించడానికి కారణాలంటూ పెద్దగా ఏమీ లేవు. కాకపోతే ఈ చెత్త ఎక్కువయితే కంపు ఎక్కువవుతుంది. మోతాదు మించితే వెగటు పుడుతుంది. దీనికి తోడు నేను వ్రాయాలనుకున్న ఒకటో రెండో వెనకపడుతాయి. ఈ గొడవలు ఇప్పటికీ ఎప్పటికీ ముగియవు. తొందర్లో సీజన్ 2 ఎపిసోడ్ 1 లో మళ్ళీ సందడి చేద్దాం. 2-3 రోజుల్లో నా మామూలు పోస్టులతో మళ్ళీ కలుస్తాను.

మీకు సూచనలిచ్చేటంతటివాడిని కాకపోయినా ఓ రెండు ముక్కలు: ప్రత్యక్ష దూషణకు దిగకండి. తెగే దాకా లాగినా ఫర్వాలేదు కానీ తెగనివ్వకండి. తెగితే మనకు కావలసిన ఎంటర్‌టైన్‌మెంట్ దొరకదు. ఇది గుర్తించుకొని హాస్య/వ్యంగ్య మాటలతో హాయిగా నవ్వుకుందాము.

Take care now, bye bye then!

Image and video hosting by TinyPic

శాంతించండి బ్లాగరులారా.. సంస్కృతిని కాపాడండి

Posted by జీడిపప్పు

శాంతించండి బ్లాగరులారా. అన్యోన్యంగా కలసిమెలసి ఉండవలసిన మీరు దూషించుకొనుచున్నారని తెలిసి ఇలా వచ్చాను. మీరందరూ విద్యావంతులే, ఉన్నత చదువులు చదువుకున్నవారే. సంగీత సాహిత్య భక్తిరసాది విషయాల జ్ఞానాన్ని పరస్పరం పంచుకొనక ఈ విభేదాలు ఎందుకు? భగవత్ప్రసాదమయిన మేధస్సును ఎంతో ఉపయోగకరమైన పనులకు వినియోగించక ఎందుకూ కొరగాని అభిప్రాయభేదాలతో వ్యర్థం చేసుకొనుట మానండి.

కత్తి మహేష్ కుమార్ అను బాలకుడు "ఇవే గొప్పోళ్ళ వేషాలు. ఇదే సంస్కృతిని కాపాడే విధానం" అన్నాడు. ఈతడి హృదయం ఎంత గాయపడి ఉంటే ఆ మాట అంటాడు. ఎందుకు నాయనలారా ఇతడిని నొప్పిస్తున్నారు? మన సంస్కృతి పట్ల ఇతడికున్న ఆరాధన భావం నాకు తెలుసు నాయనలారా. అలాంటి ఇతడు బాధగా "ఇదే సంస్కృతిని కాపాడే విధానం" అన్న మాటలు చూసి నా మనసు కకావికలయినది.

చిరంజీవులారా, అన్ని జన్మల్లోకెల్లా మానవజన్మ ఎంతో ఉదాత్తమయింది మరియు క్షణభంగురమయినది. పుట్టిన మానవుడు ఏ క్షణానయినా మరణించవచ్చు. జీవించి ఉన్నన్నాళ్ళూ పరస్పర అనురాగాభిమానాప్యాయతలతో కలసిమెలసి ఉండక "బ్రాహ్మనికల్ యాటిట్యూడ్" "దళిత్ యాటిట్యూడ్" అంటూ దూషించుకోవడం భావ్యం కాదు.

చిన్నారి బాలలారా -  చనిపోయినవారితో తల్లిదండ్రులు, భార్య-పిల్లలు, అన్నదమ్ములు, బంధుమితృలు ఎవరూ  రారు. కేవలం ఆత్మ ఈ శరీరాన్ని విడిచి వెళ్తుంది. మనిషి మరణిస్తే చేసిన పాపపుణ్యాల ఆధారంగా స్వర్గానికో నరకానికో వెళ్ళవలసి వస్తుంది. పాపాలు చేసినవారు నరకానికి తీసుకెళ్ళబడతారు. అక్కడ నిప్పుల ఎడారి పైన నడిపిస్తారు. ఆకలిగొన్న శునకములు వెంటాడి వేటాడుతాయి. పాప పరిహారముగా మానవుల రక్తమాంసాలున్న నదులలో మునగవలసివస్తుంది.

దేవుడిచ్చిన అవకాశాన్ని వ్యర్థం చేసుకొని శుష్క యుద్దాలతో, వ్యర్థ ప్రసంగాలతో పాపం చేసి ఆత్మను క్షోబింపచేయు బదులు సత్ప్రవర్తన కలిగి సన్మార్గంలో పయనించండి నాయనలారా. సన్మార్గమనిన ఇతరులను దూషించకుండుట, ఇతరులను గౌరవించుట, పెద్దలను సేవించుట, పెద్దలు చెప్పిన సంస్కృతి సంప్రదాయాలను ఆచరించుట.

సంస్కృతిని ఆచరించుట ఎలాగుయనిన - అనాదిగా వస్తున్న వేదవేదాంగాలలోని మంచిని గ్రహించి దైనందిన జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి. ఉదాహరణకు రామాయణం యుగయుగాలుగా గౌరవింపబడుతున్నది. అందులో సీతారామ కల్యాణం ఒక సుమనోహర ఘట్టం. ఆ కళ్యాణం ఎంతో వీనులవిందుగా జరిగినదని వర్ణిస్తారు. దాన్ని ఆదర్శంగా తీసుకొని కనులపండుగగా శ్రీరామనవమి జరుపుకోవడం సంస్కృతిని గౌరవించడం అవుతుంది.

"ఇదే సంస్కృతిని కాపాడే విధానం." అంటూ ఆవేదన వ్యక్తం చేసిన కత్తి మహేష్ కుమార్ ఏమన్నాడో చూడండి:

కానీ నేను ఆపని చెయ్యను."ఓహో మొల్లకాలంలో తెలుగు దేశంలో ఇలా పెళ్ళిళ్ళు జరిగేవన్నమాట" అనే నిర్ధారణకు వస్తాను. ఎందుకంటే,రాముడు ఉన్నాడు అన్న కాలంలో పట్టుపీతాంబరాలు ఉండే అవకాశం ఉందా? తిలకాలుకాటుకలూ దిద్దేవారా? కంకణాలు తొడిగేవారా? మంగళవాయిద్యాలు కె.వి.మహదేవన్ తరహాలో వాయించేవారా? అసలు ఉంటే ఉత్తరభారతీయుడైన రాముడు మాంగళ్యధారణ సాంప్రదాయాన్ని పాటించేవాడే? అనే సమాధానం లేని ప్రశ్నలు ఇక్కడ అవసరం గనుక. మొల్ల తన కాలమాన పరిస్థితుల్నీ, సాంప్రదాయాల్ని బట్టి తనదైన వర్ణన చేసుంటుందనే నిర్ధారణకు వస్తాను.

ఆ వర్ణనతో పాటూ భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగే విధానం ఎప్పటి నుండీ ప్రారంభమయ్యింది. వారు పాటించే సాంప్రదాయాలకు మూలం ఎక్కడ.ఉత్తరభారతదేశంలో ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయా వంటి ప్రామాణికాలు వెదకి మూలాలను గ్రహించి, పరిశోధన ఫలితాల్ని ప్రతిపాదిస్తాను.

అలాగే దంపతులు అన్నమాటకు సీతారాములను ప్రతీకగా చెప్పుకుంటూ ప్రతి ఇంటా కొలుస్తూ సంస్కృతిని ఆచరిస్తారు అందరూ. "సంస్కృతిని కాపాడే" కత్తి మహేష్ కుమార్ ఏమంటున్నాడో చూడండి:

"ఈ రామాయణం ప్రకారం సీత రాముడికి సోదరి అవుతుంది. వయసులో చిన్నది కాబట్టి చెల్లెలన్నమాట....ఈ బౌద్ధజాతక కథ ప్రకారం, దశరధుడు అయోధ్యకు కాదు, వారణాశికి రాజు. అంటే కాశీరాజన్నమాట. అతనికి రామపండితుడు, లక్ష్మణకుమారుడు, సీత అనే పిల్లలు.... ఇక అన్నాచెళ్ళెల్ల వివాహం అంటారా, అప్పటి రాచరికంలో incestuous పెళ్ళిళ్ళు ఉండే అవకాశం పెద్ద ఆశ్చర్యకరం ఏమాత్రం కాదు. అమలి రాచరికపు రక్తం పేరుతో ఇలాంటి సాంప్రదాయాలు చరిత్రలోని చాలా రాచరికాల్లో ఉండటం మనకు తెలిసిందే."
వ్రతాలు ఏ వేదాల్లో ఉన్నాయో కాస్త చూసిచెప్పండి! వేదకాలంలో చిల్లరదేవుడైన విష్టువు అత్యంత శక్తివంతుడైన దేవుడుగా ఎలా ఎదిగాడో కాస్త కనుక్కుని చెప్పండి! శివుడు త్రిమూర్తుల్లో ఒకడెప్పుడయ్యాడో కాస్త ఆరాతియ్యండి!

ఆహా ఎంత బాగా చెప్పాడు. చూసారా ఈతడు ఎంత చక్కగా సంస్కృతిని కాపాడుతున్నాడో!!
ఇంకా "మన సంస్కృతి రహస్యకుతి అనుభవించే అద్భుతమైన సంస్కృతి. "  అన్నాడు. ఇలా మన సంస్కృతిని కాపాడుతున్న మహేష్ కుమారును నొప్పించకండి నాయనలారా. రహస్యకుతి అనుభవించే అద్భుతమైన సంస్కృతిని కాపాడండి. నా ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి.

- భగవాన్ శ్రీ శ్రీ శ్రీ బుడుగు బాబా

ముసుగువీరుడి అసలు రూపం

Posted by జీడిపప్పు

చాలా రోజుల తర్వాత బ్లాగుల్లో మళ్ళీ "ఆ సందడి" నెలకొన్నది. కామెడీ కరువైపోతున్న బ్లాగుల్లో ఒక బ్లాగరు "కేసు పెడతా" అంటూ పోస్టు వేసి కడుపుబ్బా నవ్వించి మిగిలినవాళ్ళు కూడా కేసులు వేయడానికి ఆదర్శమయ్యారు. ఈ entertainment కనీసం వారం రోజులు కొనసాగాలని ఆశిద్దాం. ఈ సందర్భంగా అందరికీ ఒక మనవి/విన్నపం: పొరపాటున కూడా నోరు జారకండి. ఎవరినీ ప్రత్యక్షంగా తిట్టకండి. వీలయినంతవరకు పరోక్షంగానే తిట్టండి. ఉదా: సుత్తి నరేష్ కుమార్ ను తిట్టాలంటే "నత్తి" అనడం.. అలాగన్నమాట. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఒక బ్లాగరు ఇలా అన్నారు: "కేసు పెట్టడానికి నేను దళితుడినైతే చాలు. ఒకసారి SC/ST (prevention of) atrocities act చదువుకోండి." తస్మాత్ జాగ్రత్త. ఆ విధంగా మనమందరం ముందుకు పోదాం.

ఇప్పటిదాకా కేసుల గురించి వెలువడిన పోస్టుల జాబితా:
మలక్పేట్ రౌడీ గారి పైన కేసు పెడుతున్నా 
IP address ద్వారా కులం కనిపెట్టడం ఎలా? 
సైబర్ నేరం, మర్యాద!! ఉఫ్ - బడే హోజావ్ బచ్చే
కత్తి మహేష్ ఎ౦దుకు వివాదాస్పదుడవుతున్నాడు - నా దృక్కోణ౦ :)
కొణతం దిలీప్ గారికి నా సమాధానం
నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు - ఓ బెకబెక
బ్రాహ్మణ ద్వేషం - ఒక ఆటిట్యూడ్  

IT లో ఉన్నవాళ్ళకు బాగా తెలుసు on-call గురించి. ఎప్పుడు ఫోన్/మెయిల్ వస్తుందో తెలియదు. బయట వెళ్ళలేము, ఎక్కువ టైం తీసుకొనే ఏ పనీ చెయ్యలేము. ఇలాంటప్పుడు మంచి టైం పాస్ కిటికీలోనుండి చూస్తూ చెట్టు ఎక్కుతున్న, దిగుతున్న ఉడతలను లెక్కపెట్టడం.. లేదా.. ఇదిగో ఇలాంటి పోస్టు వెయ్యడం!

అసలు విషయానికొస్తే -  బ్లాగుల్లో వ్యక్తిగత దూషణ తప్పు, నేను అలాంటివాటికి వ్యతిరేకం అన్నారు కత్తి మహేష్ గారు. నేను నూటికి.. well.. 92.5 శాతం (ఇదొక FM రేడియో) అంగీకరిస్తాను. ఇంకా "సత్ప్రవర్తన గల" మహేష్ గారు ఇలా అన్నారు "బ్లాగుల్లో కంటెంట్ కామెంట్లతో సహా అన్నిటి బాధ్యతా బ్లాగరిదే. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే మోడరేషన్ బాధ్యత బ్లాగరి తీసుకుంటాడు కాబట్టి." ఈ సారి 102.5 శాతం (ఇది ఇంకో FM రేడియో, రేడియో జాకీ చాలా హాట్ గా ఉంటుంది ఫోటోలో) అంగీకరిస్తాను. ఈ మాటలను ఎవరయినా చూస్తే "ఆహా ఈ మహేష్ గారు ఎంత ఉన్నత భావాలు కలవారు. ఎవరినీ నొప్పించరు, నొప్పించకూడదని చెప్తున్నారు" అనుకుంటాము కదా!

అదేంటో కానీ నాకు ఈయన ఒక ముసుగువేసుకొన్న "ముసుగు వీరుడు" అనిపిస్తాడు. పైకి మాత్రం "వ్యక్తిగత దూషణ ఉండకూడదు" అంటూనే స్వయానా తన బ్లాగులో కామెంట్ల మోడరేషన్ పెట్టి మరీ ఇంకొకరిని దూషిస్తున్న మాటలను తన బ్లాగు పోస్టులో ఆమోదిస్తాడు. ఇదేమి "రహస్య కుతి"??  పైకి శ్రీరంగ నీతులు చెప్పడం, తన బ్లాగులో మాత్రం ఇంకొకరిని తిట్టించడం.. ఇదెక్కడి న్యాయం ఉప్మా!!!

అన్నట్టు "ఇలా బూతులు తిట్టడం చట్ట రీత్యా నేరం కాబట్టి బూతులను ఆమోదించిన బ్లాగర్ల పైన కేసులు పెట్టు" అంటారా?? సారీ.. ముందు ఉడతలను లెక్క పెట్టాలి/పట్టాలి!!

మలక్పేట్ రౌడీ గారి పైన కేసు పెడుతున్నా

Posted by జీడిపప్పు

ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది. చాలా రోజులుగా చూస్తున్నాను ఈ వ్యవహారం. ఏదో ఒకసారంటే పరవాలేదు కానీ ఇలా రెండు సార్లు చేయడం మాత్రం పద్దతి కాదు. ఒకసారి "పిట్స్‌బర్గ్ పిచ్చమ్మ" అంటూ పిట్స్‌బర్గ్ లో ఉన్న తెలుగు స్త్రీలను పిచ్చివాళ్ళుగా అభివర్ణించారు. మరోసారి టెక్సస్ తిగరిబుచ్చి అంటూ టెక్సస్‌లో ఉన్న తెలుగు స్త్రీలను తిగరబుచ్చిలంటూ అన్నారు. అటు పిట్స్‌బర్గ్ లో ఇటు టెక్సస్‌లో తెలుగు స్త్రీలు రౌడీ ఆగడాలను భరించలేకున్నారు. పిట్స్‌బర్గ్ తెలుగు అసోసియేషన్ "పిటా", టెక్సస్ తెలుగు అసోసియేషన్ "టెక్స్టా" లతో మాట్లాడాను. కేసు పెట్టమన్నారు. రౌడీ గారి IP Address దొరికింది. ఇక తప్పించుకోలేరు రౌడీ గారు.

మలక్పేట్ రౌడీ అని ముసుగేసుకున్న ఈ బ్లాగరు వివరాలను మితృలసాయంతో తెలుసుకున్నాను. ఈ ముసుగుదొంగ అసలు స్వరూపాన్ని బయటి ప్రపంచానికి తెలియజెప్పాలనే మనసు చంపుకొని ఆ వివరాలు బహిర్గతం చేస్తున్నాను (అందరూ గుర్తుపట్టాలని ఫోటో కూడా జత చేసాను) తప్పించి సదరు బ్లాగరు పైన వ్యక్తిగత కక్షలు లేవు.





అన్నట్టు బ్లాగులోకాన్ని చెత్తనుండి కాపాడిన ఏకలింగం గారు కత్తి రాందాసు : శవం తమ్ముడిదయినా కంపు కామనే అన్నా  అని ఓ పోస్టేశారు ఇప్పుడే. ఎవరయినా కేసులు పెట్టాలనుకుంటే వెంటనే పెట్టెయ్యండి.

నాకు నచ్చని విధంగా కామెంట్ వేసే వారికి హెచ్చరిక: మీ IP Address నాకు తెలుసు. మీ పైన atrocity కేసు పెడతాను. నా బ్లాగు అడ్రస్ ఇస్తూ incriminating వ్యాఖ్యలు చేస్తే that amounts to cheating and impersonating. IPC సెక్షన్ 420 మరియూ దాని సన్ సెక్షన్స్ సమానమైన సైబర్ నేరాల పరిధిలోకి ఈ విషయం వస్తుంది. మీరు హైదరాబాద్ లోనే ఉంటే 23240663, 27852274 ఫోన్ చేసి కనుక్కోండి. (Source )

హాస్యబ్రహ్మకు నివాళి

Posted by జీడిపప్పు

'నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం' అంటూ నలుగురికీ నవ్వులను పంచిన హాస్యబ్రహ్మ కలం నుండి వెలువడిన సంభాషణల గురించి, దర్శకత్వంలో వచ్చిన ఆణిముత్యాల గురించి, సృష్టించిన పాత్రల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  ఆయన ఉన్నట్టుండి "ఇక నవ్వించలేను.. నవ్వించకుండా ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతున్నా" అంటూ 2001 జూన్ 19 న వెళ్ళిపోయారు. 

జంధ్యాల గారి గురించి శ్రీనివాస్ పప్పు గారు వ్రాసిన "హాస్యబ్రహ్మ (జంధ్యాల) స్మృతిగా ఈ నా చిన్న కానుక

హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు - రెండవ భాగం

Posted by జీడిపప్పు

ఆనందభైరవి చిత్రం తర్వాత బాలక్రిష్ణ హీరోగా నటించిన "బాబాయ్ అబ్బాయ్" చిత్రంలో సుత్తి వీరభద్రరావు రెండో హీరో పాత్ర పోషించారు. కనిపించినవాడినల్లా అప్పు అడుగుతూ, అబ్బాయికి సలహాలు ఇచ్చే పాత్ర ఇది. అనాధలయిన వీరిద్దరి కలయికే తమాషాగా ఉంటుంది. సినిమాల్లో ఏడుపు సన్నివేశాలు చూసి ఏడుస్తూ ఇంటికి వెళ్ళి తన తల్లికి సినిమా కథ చెప్పే అరుణ (శ్రీలక్ష్మి) ని "పేరులోనే రుణం" కూడా ఉందని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు కానీ, ఉద్యోగం సద్యోగం లేదని కూతురిని కాపురానికి పంపనంటాడు ఈయన మామ. దాంతో తప్పనిసరయి ఈయన అబ్బాయితోనే ఒక ఇంట్లో అద్దెకుంటూ అద్దె కట్టలేక ఓనరుకు మస్కా కొడుతూ అపుడపుడు పట్టుబడుతూ ఉంటారు.

ప్రతిదానికీ "త్తరై, నా త్తరై" అనడం ఈయన ఊతపదం. తమిళంలో "ఇస్తా, నేను ఇస్తా" అని దీనర్థం. అప్పు ఎప్పుడు తీరుస్తావు అని అప్పులిచ్చినవాళ్ళు అడిగినపుడల్లా "త్తరై, నా త్తరై" అంటూ ఇంటిదగ్గరున్న బీచ్‌లో ఓ మీటింగు పెట్టి  "శ్రీక్రిష్ణదేవరాయలవంటి కళాహృదయుడు తన మంత్రికి అప్పాజీ అని పేరు పెట్టుకున్నాడంటే అప్పు ఎంతవిలువయిందో గ్రహించండి. ఇంగ్లీషులో కూడా డౌను కంటే అప్పు ఉన్నతమయిందా కదా" అంటూ అప్పు గురించి స్పీచ్ ఇస్తాడు.

తనకు దారిలో కనిపించిన ఒక వ్యక్తితో జరిగే సంభాషణ:
"గుడ్మార్నింగ్ సార్, మీరు వైద్యుడా"
"భూతవైద్యుడిని"
"ఆహాహా అప్పిచ్చువాడు వైద్యుడు అన్న సుమతి శతకంవారు ఎంత గొప్పవారండీ"
"ఇంతకీ మీరూ.."

"దేశభక్తి వీరభద్రాన్ని. ఒక భారత పౌరుడిగా దేశభక్తి కలిగి ఉండడం తప్పంటారా?"
"అబ్బెబ్బెబ్బే తప్పెలా అవుతుందండీ"
"అన్నారా, అయితే దొరికిపోయారన్నమాటే. నా త్తరై"

"మన భారతప్రభుత్వం చేసిన పని మనమూ చేయడం తప్పు కాదు కదా. మన దేశం అహింసను పాటిస్తే మనమూ పాటిస్తాము. మన దేశం క్రమశిక్షణను అనుసరిస్తే మనమూ అనుసరిస్తాము. ఇప్పుడు మనదేశమేమి చేస్తూందీ? పరాయిదేశాలనుండి వీరలెవల్లో అప్పులు చేస్తోంది. ఈ ఏడాది ప్రపంచబ్యాంకుకు ఎక్కువ అప్పున్న దేశాల్లో మొదటిది భారతదేశమూ, రెండవది బెల్జియమూ. అంచేత అప్పు చెయ్యడం తప్పు చెయ్యడం కాదు. ఆ మాటకొస్తే అప్పుచెయ్యడం భారతీయుడి జన్మ హక్కు, ప్రథమ కర్తవ్యమూనూ.ఏడుకొండలవాడు కుబేరుడి దగ్గర అప్పు తీసుకొని ఇప్పటికీ వడ్డీ కడుతున్నాడు. నేలనుంచి ఆకాశం నీరు అప్పు తీసుకుని వర్షం పేరుతో ఇన్స్టాల్మెంట్లలో బాకీ తీరుస్తోంది. చంద్రుడు సూర్యుడినుండి వెలుగు అప్పు తీసుకొని ప్రకాశిస్తున్నాడు. ఇంతెందుకు..మీరు భూతవైద్యులు కదా, పంచభూతాలేవో చెప్పండి"

"అయ్యా పంచభూతాల సంగతేమో నాకు తెలీయదు కానీయండి.. ఇప్పుడు నాకు ప్యాంటుభూతమొక్కటే కనపడుతున్నది"
"నీ సెన్సాఫ్ హ్యూమరుకి నిప్పెట్టా. భూత జోకులెయ్యకండి మేష్టారూ. అసలు పంచభూతాలేమిటీ? పృధ్వివ్యాప్పస్తేజోవాయురాకాశాలు. పృథ్వి, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశమని. అలా అప్పు అనేది మన పవిత్ర పంచభూతాల జాబితాలో ఉంది. ఏషియాడ్‌లో మన గుర్తు గున్నఏనుగు పేరు ఏమిటి? అప్పు. మన వైజాగ్ పక్కనున్న సిమ్హాచలం దేవుడి పేరేమిటి? సింహాద్రి అప్పన్న" ఇలా అప్పులగురించి "అప్పోదేశం" చేస్తుంటాడు.

 ఈ సినిమా తర్వాత జంధ్యాల సినిమా అని ప్రేక్షకులకు పెద్దగా తెలియని నరేష్, భానుప్రియ జంటగా నటించిన "మొగుడు పెళ్ళాలు" చిత్రంలో నరేష్ తండ్రి పాత్ర పోషించాడు. ఇందులో ఈయన పాత్ర బాగా డబ్బున షావుకారు పాత్ర. తిట్లు కాని తిట్లతో, వింత వింత పదాలతో అందరికీ తిక్క పుట్టిస్తుంటాడు. అందులో కొన్ని:

"ఏమిటా కంగారు.. గుడిమెట్లమీద ఎండుచేపలమ్ముకొనే మొహం నువ్వునూ. పగటికలలు కంటావా కిష్యోటికా" "కిష్యోటికానా? అంటే?" "తెలీదు. మాట బాగుందని వాడాను" "శీతాకాలంలో కూజాలమ్ముకొనే మొహం నువ్వునూ. నన్ను స్క్రూలూజు అనే లెవలుకు వచ్చేశావట్రా ఇతియోకినారా" "మల్లెపూలకోసం వేపచెట్టే మొహం అదీనూ"  "పెరుగులో నెయ్యేసుకొని తినే మొహం వాడూనూ" "లతసుమపినాకీ. అంటే ఏమిటని అడగకు. ఆ మాటకూడా నీలాగే అందంగా ఉందని వాడాను" "అనకాపల్లి వెళ్ళడానికి విశాఖపట్నంలో ఓడ ఎక్కే మొహం"  "పండు పడేసి తొక్క తినే తిక్కసన్నాసీ" "మొజాయిక్ ఫ్లోర్ పైన ఆవాలు పోసి కొత్తిమీర మొలవలేదని ఏడ్చే మొహం"

ఈ సినిమా జంధ్యాల సినిమాలా అనిపించదు. అందుకే ఎవరికీ పెద్దగా తెలియదు. అన్నట్టు ఈ సినిమా ప్రారంభంలో దాదాపు 10 నిమిషాలపాటు భవిష్యత్తులో ఆడవాళ్ళు మగవాళ్ళలా, మగవాళ్ళు ఆడవాళ్ళలా ప్రవర్తిస్తుంటే ఎలా ఉంటుందో హీరో కలకంటాడు. దీనినుండే జంధ్యాలగారి శిష్యుడు (క్షమించాలి..ఇది నిజం!)  ఈవీవీ బూతునారాయణ స్పూర్తిపొంది "జంబలకిడిపంబ" తయారుచేసాడు!

Image and video hosting by TinyPic సుత్తి వీరభద్రరావు నటించిన మరో మర్చిపోలేని పాత్ర "రెండు రెళ్ళు ఆరు" సినిమాలోనిది. ఈపాత్రకు సంగీతమంటే చాలా ఇష్టం. ఆ సంగతి తెలుసుకున్న అమ్మాయి తరఫున వారు చిన్న మోసం చేసి పెళ్ళి జరిపిస్తారు కానీ ఆ రోజు రాత్రే తన భార్యకు పాడడం రాదన్ని సంగతి తెలిసి కోప్పడుతాడు. ఎప్పటికయినా సంగీతం నేర్చుకొని తన భర్తను మెప్పించాలని ఆయన భార్య పగలనక, రాత్రనక పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ చిత్రహింసలు పెడుతుంటుంది. భార్య పైన కోప్పడలేక, తన కోపాన్ని ఆపుకోలేక బట్టలు చించుకొని శాంతిస్తుంటాడు. చివరకు బీవీ పట్టాభిరాం హిప్నాటిజం ద్వారా ఆమెను మార్పించగలుగుతాడు.
                                                                                      
                                                                              (మిగతా మూడవ భాగంలో)

జాతి బావమరిదికి అన్యాయం

Posted by జీడిపప్పు

చరకుడిని ఆయుర్వేద పితామహుడు అని పిలుస్తాము. రాత్రింబవళ్ళు కష్టపడి ఎన్నో వ్యాధులకు మందులు కనిపెట్టిన చరకుడు ఆయన భార్య సహకారం లేనిదే అన్నీ సాంధించలేకపోయిఉండవచ్చు. ఆయన తన కుటుంబాన్ని పట్టించుకోకుండా సమయమంతా తన పరిశోధనలకే కేటాయిస్తుంటే ఆయన భార్య పిల్లల, కుటుంబ బాగోగులు చూసుకునేది అనుకుందాము. జీవితాంతం భర్తకు అనుకూలంగా ఉన్నదని ఆమెను "ఆయుర్వేద మాత" అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది?

పెప్సీ కంపెనీ కొన్నేళ్ళ క్రితం ఆశించినమేరకు లాభాలు ఆర్జించకపోవడంతో అప్పటి సీఈవోను మార్చి భారతీయ మహిళ అయిన "ఇంద్ర నూయి" ని సీయీవో చేసారు. తన తెలివితేటలతో ఆమె కంపెనీని ప్రగతిపథంలోకి తీసుకెళ్ళింది,మహామహులను తోసిరాజని "వుమన్ ఆఫ్ ద ఇయర్" అవార్డు అందుకుంది. తన భర్త సహకారం లేకుంటే తాను ఇవన్నీ సాధించగలిగేదాన్ని కాదాని ఈమె చెప్తుంటుంది. ఈమె వ్యాపారపనుల్లో బిజీగా ఉన్నపుడు కష్టపడి పిల్లల్ని, కుటుంబాన్ని చూసుకున్నందుకు ఈమె భర్తకు "మ్యాన్ ఆఫ్ ద ఇయర్" అవార్డు ఇవాల్సిందేనా?

ఇవి ఎపుడు ఎందుకు చెపుతున్నానంటే "భూమిక" అనే ఫెమినిస్ట్ పత్రిక నిర్వహిస్తున్న సత్యవతిగారు తన బ్లాగులో వ్రాసిన వ్యాసం చూసాను. అందులో ఒక వాక్యం ఇలా ఉంది: "జాతి మొత్తానికి పితృసమానుడుగా భావిస్తూ ' జాతిపిత'గా గాంధీజీని గౌరవిస్తామే! మరి, ఆ 'జాతిపిత' సహచరి ' జాతి మాత' కాదా? "

ఇదే వ్యాసం మూడేళ్ళ క్రితం ఆంధ్రజ్యోతిలో వచ్చినపుడు మా గురువుగారు తెలుగోడుగారు అన్నమాటలను చూసి పగలబడి నవ్వాను. కొన్నింటిని చూసి అప్పటికప్పుడు నవ్వి మర్చిపోతాము, కానీ కొన్నిటిని తలుచుకొని మరీ నవ్వుకుంటుంటాము. మా గురువుగారి కామెంటు అలాంటిది మరి. ఆయనేమన్నారంటే - "H1 కు, H4 కు ఉన్న తేడా ఉంది జాతిమాతకు, జాతిపిత భార్యకు ... .... ఓ మిత్రుడు ఈ లెక్కన గాంధీ బావ జాతి మామ, గాంధీ అత్తగారు జాతి అమ్మమ్మా అవుతారా అని సందేహపడ్డాడు". అవును మరి, జాతిపితకు బంధువులయినవారినందరినీ "జాతిమాత" "జాతికూతురు" "జాతి బావమరిది" "జాతి మేనత్త" అని పిలుస్తూపోతుంటే వారికి ఉన్న గౌరవం కూడా పోతుంది.

ఇక సత్యవతిగారు "కస్తూరిబాకు అన్యాయం" అన్నారు.  స్త్రీవాదమంటే ముందూ వెనకా చూడకుండా "ఠాఠ్ మహిళలకు అన్యాయం జరుగుతోంది" అనడమే కాదు, ఆ పొర తీసి నిజ ప్రపంచాన్ని కూడా చూడాలి. అప్పుడే దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా కస్తూరిబా పేరిట నడుస్తున్న కళాశాలలు, కస్తూరిబా పేరిట ఎందరో మహిళలకు ఆశ్రయమిస్తున్న మహిళా సంక్షేమ హాస్టళ్ళు, కస్తూరిబా పేరిట ఇస్తున్న పురస్కారాలు కనిపిస్తాయి, చిన్న గదిలోని వస్తువుల బదులు.

అలా చూడనన్నాళ్ళూ "జాతి బామ్మర్ది"కి అన్యాయం జరుగుతూనే ఉంటుంది సుమా/ఉదయభానూ!!

హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు - మొదటి భాగం

Posted by జీడిపప్పు

'నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం' అన్న హాస్య బ్రహ్మ జంధ్యాల హాస్యప్రియులకు అందించిన మరో వరం సుత్తి వీరభద్రరావు గారు. జంధ్యాల సృష్టించిన పాత్రలకు, ఆయన వ్రాసిన మాటలకు సుత్తి వీరభద్రరావు తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరు. చిత్రమయిన పాత్రలలో మరింత విచిత్రమయిన అలవాట్లు, సంభాషణలతో హాస్యానికి కొత్త నిర్వచనాన్ని అందిచారు సుత్తి వీరభద్రరావు.

విజయవాడలో కాలేజీలో చదువుకుంటున్నపుడే నటనపై ఆసక్తి పెంచుకున్న వీరభద్రరావు నాటకాలలో మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నాడు. జంధ్యాల దర్శకత్వం వహించిన "నాలుగు స్తంభాలాట" చిత్రంద్వారా తెరంగ్రేటం చేసి ఎన్నో మరిచిపోలేని పాత్రలతో ప్రేక్షకులను నవ్వించారు. తన అలవాట్లతో పక్కవాళ్ళను ఇబ్బంది పెట్టడం, అవతలివాళ్ళు ఉక్కిరిబిక్కిరయ్యేలా గుక్క తిప్పుకోకుండా  మాట్లాడడం, తిట్లు కాని తిట్లతో హింసించడం వీరభద్రరావుకే చెల్లింది. హాస్య బ్రహ్మ జంధ్యాల సినిమా అంటే హీరో ఎవరయినా ముందుగా గుర్తుకొచ్చే ఈ హాస్య చక్రవర్తిని, పరోక్షంగా హాస్య బ్రహ్మను, స్మరించుకుంటూ ఆయన నటించిన కొన్ని చిత్రాలను గుర్తుచేసుకొనే ఓ చిన్న ప్రయత్నమే ఈ వ్యాసాల ఉద్దేశ్యం.

దాదాపు అందరూ కొత్తనటులతో జంధ్యాల తీసిన నాలుగు స్తంభాలాటలో ఒక హీరో తండ్రి పాత్రతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టారు వీరభద్రరావు. ఈయనకు భారతీయ సంస్కృతి, ఆచారాలు అంటే చాలా గౌరవం. కానీ కొడుకేమో ఆధునికంగా ఉండాలనుకొంటాడు. ప్రపంచంలోని ప్రసిద్ధులంతా భారతీయులేనని ఈయన గాఠ్ఠి నమ్మకం. అందుకే "పైథాగరస్ ఎవడంటే ఏ జర్మనీవాడో ఏ రష్యావాడో అంటావు. వాడి అసలు పేరు గిరీషుడనీ, కాకినాట్లో మన పైథాగారబ్బాయని తెలుసా? షేక్స్పియర్ ఎవడు? శేషప్పయ్య అనే తమిళుడు, రామనాథ జిల్లావాడు, మన భారతీయుడునూ. న్యూటన్ ఎవరు? నూతనుడని బెంగాలీయుడు, మన భారతీయుడునూ" అంటుంటాడు.

ఇవి పట్టించుకోని కొడుకును, మిగిలినవాళ్ళనూ "నిన్నూ ఈ దేశాన్ని బాగు చెయ్యడం నావల్ల కాదు, నావల్ల కాదు" అంటుంటాడు. ఈయన అసిస్టెంటు సుత్తి వేలు వరండాలో కూర్చుకొని లెక్కలు వ్రాసుకుంటుంటే ప్రతి చిన్నవిషయానికి "అసలు ఈ విషయం తెలుసా నీకు" అంటూ చెప్పడం మొదలుపెడటాడు. మనకు తెరపైన సుత్తితో మేకును కొడుతున్న దృశ్యం కనిపిస్తుంది. ఇలా సుత్తికొట్టించే పాత్ర బాగా పాపులర్ అవడంతో వీరభద్రరావు కాస్తా సుత్తి వీరభద్రరావు అయ్యారు.

ఈ సినిమా తర్వాత శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో ధనవంతుడయిన తండ్రిపాత్ర పోషించినా పెద్దగా పేరు రాలేదు. అదే ఏడాది జంధ్యాల తీసిన "ఆనంద భైరవి" సినిమా ద్వారా సుత్తి వీరభద్రరావు సత్తా ఏమిటో ప్రేక్షకులకు తెలిసివచ్చింది. ఈ సినిమాలో ఆయన ఒక పల్లెటూరి వైద్యుడు. చాలా మంచివాడు, ఉన్నతాభావాలు కలిగిన పెద్దమనిషి. తెలుగు అభిమానమెక్కువ, ఎప్పటికయినా గొప్ప రచయిత కావాలని ప్రాసలున్న వాక్యాలను సృష్టిస్తుంటాడు. ఉద్యోగం లేని కొడుకు, ఆనందమేసినా బాధ కలిగినా కయ్‌య్‌య్‌య్ మని ఈలవేసే కోడలు ఈయన కుటుంబ సభ్యులు. ఇక ఈయన ప్రాసల ప్రసహనం:

తన దగ్గరకు వచ్చిన రోగితో - "ఆయకాయలో వేడి ఉంటుంది. ఆ వేడి నాలాంటి వాడికల వైద్యుడికి నాడిలో తెలుస్తుందిరా బోడి". సినిమానుండి కోడలికంటే ముందే ఇంటికి తిరిగివచ్చిన కొడుకుతో - "కోడలేదిరా అంటే గోడలకేసి, నీడలకేసి చూస్తావేంట్రా ఊడలజుట్టు వెధవా". తన భార్య సినిమాహాల్లో ఈలవేసిందన్న సంగతి చెప్పిన కొడుకుతో -  "అబ్బా మనకా ఈలల గోల ఏల. ఈ ఈలన్నది ఇలలో కలలో మన ఇంటావంటా లేదే"

నిద్రపోతున్న కొడునులేపి "నానీ నానీ నీ నూనె నీ నూనే నా నూనె నా నూనే. నేనే నేను, నీ నూనె నానూనెనని, నానూనె నీనూనని నేనన్నానా  నిన్నను నేనా? నో నో నో. నేనన్నానా నున్నని నాన్నా, నై నై నై. ఇందులో 56 నాలున్నాయి లెఖ్ఖ చూసుకో" అంటాడు. చిరాకేసిన కొడుకు "నాన్నా" అని "ఇవి కూడా కలుపుకో 58 అవుతాయి" అంటాడు.

నాట్య పోటీ రెండవసారి ఏర్పాటు చేయించి హీరోయిన్ నెగ్గిన తర్వాత " మీ సిగ్గు బొగ్గులవ్వ. ఆ రోజు శర్మగారి పైన నెగ్గిన గర్వంతో దిగ్గున లేచి భగ్గున మండిపడ్డారు కాదా. ఈ రోజు నిగ్గుతేలిన ప్రతిభతో ఈ మల్లెమొగ్గ నెగ్గింది. ఇక మీరు తగ్గేసి, మాటకు తల ఒగ్గేసి, ఊరంతా ముగ్గేసి, శర్మగారిని సన్మానించండి. ఆ తర్వాత మీకు సిగ్గనిపిస్తే ఆ దగ్గు ఆపేసి నా దగ్గరకు రండి. ఓ ఉగ్గు గిన్నెడు మందిస్తాను, జగ్గు నీళ్ళు కలిపి ఉగ్గు తాగినట్లు తాగి రగ్గు కప్పుకుని పడుకుందురుగానీ" అంటూ అహంకారులయిన ఊరిపెద్దలకు బుద్ది చెప్తాడు.

కోడలి గురించి "మంచి మర్యాదగల మహా మగువ, మానవసేవయే మాధవసేవ అని మనసారానమ్మిన మహాఇల్లాలు మర్రిచెట్టు మహాలక్షమ్మగారి ముద్దుల మూడో మనవరాలు కదా అని మనువు చేసుకుంటే" అన్నపుడు కొడుకు "నానా నీ ప్రాసలాపు వినలేక ఛస్తున్నాము. ఈ జన్మలో నువ్వు కథ రాయలేవు, రచయితవు కాలేవు" అంటాడు.

అంతే, - "మొక్కుబడికి బుక్కులెన్ని చదివినా బక్కచిక్కిన కుక్కగొడుగు మొక్కలా చెదలు కొట్టేసిన చెక్క ముక్కలా కుక్క పీకేసిన పిచ్చి మొక్కలా బిక్కమొహం వేసుకొని వక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ బెక్కుతూ చుక్కలు లెక్క పెడుతూ ఇక్కడే గుక్క పెట్టి ఏడుస్తూ ఈ చుక్కల చొక్కా వేసుకొని డొక్కు వెధవలా గోళ్ళు చెక్కుకుంటూ నక్కపీనుగులా చెక్కిలాలు తింటూ అరిటి తొక్కలా ముంగిట్లో తుక్కులా చిక్కు జుట్టేసుకుని ముక్కుపొడి పీలుస్తూ కోపం కక్కుతూ పెళ్ళాన్ని రక్కుతూ పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ రెక్కలు తెగిన అక్కుపక్షిలా నక్కి నక్కి ఈ చెక్కబల్ల మీద పక్కచుట్టలా పడుకోకపోతే, ఏ పక్కకో ఓ పక్కకెళ్ళి పిక్కబలం కొద్దీ తిరిగి నీ డొక్కశుద్దితో వాళ్ళను ఢక్కామొక్కీలు తినిపించి నీ లక్కు పరీక్షించుకొని ఒక్క చక్కటి ఉద్యోగం చేజిక్కించుకుని ఒక్క చిక్కటి అడ్వాన్సు చెక్కు చెక్కుచెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసీ. ఇందులో యాభయ్యారు కాలున్నాయి తెలుసా" అని కొడుక్కు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు

ఎంతటి కఠినమయిన వాక్యాన్నయినా అక్షర, ఉచ్చారణ దోషాలు లేకుండా అనర్గళంగా చెప్పడమే కాకుండా చక్కని నటనను జోడించి ఆ పాత్రకు జీవంపోయడం ద్వారా ఒక్కసారిగా అగ్ర హాస్యనటుడయి వెనువెంటనే "బాబాయ్, అబ్బాయ్" సినిమాలో రెండో హీరో పాత్ర చేజిక్కించుకున్నాడు.    

                                                                                 (మిగతా రెండవ భాగంలో)

మరో ధృవతార బాబీ కెన్నెడీ

Posted by జీడిపప్పు

కెన్నెడీ. ఆ పేరు వింటే ఎంతోమంది అమెరికన్ల హృదయం పులకరిస్తుంది. ఆ పేరు విన్నపుడు ఉప్పొంగే సంతోషంతో పాటు విషాద జ్ఞాపకాలు కూడా గుర్తుకొస్తాయి. గత అర్థ శతాబ్దంలో అమెరికాను పాలించిన అతి గొప్ప అధ్యక్షుడు ఎవరంటే అందరి మదిలో మెదిలే వ్యక్తి జాన్ ఎఫ్ కెన్నెడీ. కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే దేశాన్ని పాలించినా, ప్రెసిడెంట్ అన్న పదానికున్న గౌరవాన్ని మరింత ఇనుమడింపచేసిన జాన్ ఎఫ్ కెన్నెడీ అంత గొప్పవాడిగా పేరుపొందడానికి కారకుడు ఆయన తమ్ముడు రాబర్ట్ "బాబీ" కెన్నెడీ.

కెన్నెడీ దంపతులకు ఏడవ సంతానమయిన బాబీ కెన్నెడీ బాల్యం ఆటపాటలతో గడిచిపోయింది. జాన్ కెన్నెడీకీ, బాబీ కెన్నెడీకి మధ్య ఎనిమిదేళ్ళ వ్యత్యాసం ఉండడంతో చిన్నపుడు ఇరువురిమధ్య ఎక్కువ చనువు ఉండేది కాదు. 1951 లో తన అన్నతో కలసి ఆరువారాలపాటు ఇజ్రాయిల్, ఇండియా మొదలయిన దేశాలను పర్యటించాడు. ఆ ఆరువారాల్లో అన్నదమ్ములమధ్య సాన్నిహిత్యం పెరిగింది. అమెరికాకు తిరిగివచ్చిన తర్వాత బాబీ తన భార్య పిల్లలతో కలసి వాషింగ్టన్‌కు వెళ్ళి అక్కడ లాయరు వృత్తి మొదలుపెట్టాడు. కొద్ది రోజులకు జాన్ కెన్నెడీ సెనేటర్ గా పోటీ చేస్తుంటే తన సోదరుడికి సహయంగా ఉండడానికి లాయరు వృత్తిని విడిచిపెట్టాడు. అప్పటినుండి చట్ట సభల్లో ఎన్నో పదవులు చేపట్టి పేరు తెచ్చుకొన్నాడు.

1960లో జాన్ ఎఫ్. కెన్నెడీ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసినపుడు బాబీ సర్వం తానై నడిపించాడు. ఎత్తులకు పైఎత్తులు వేసి ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టేవాడు. కాస్త మొండివాడయినా నమ్మకానికి మారుపేరుగా నిలిచి ప్రజల దగ్గర "అన్నకు తగ్గ తమ్ముడంటే జాన్ ఎఫ్. కెన్నెడీకి బాబీ కెన్నెడీలా ఉండాలి" అని ప్రశంసలు తెచ్చుకున్నాడు. జాన్ కెన్నెడీ ప్రెసిడెంట్ అయిన తర్వాత తన తమ్ముడిని అటార్నీ జనరల్ గా నియమించాడు. అమెరికా చరిత్రలో ఈనాటి వరకు ఏ అటార్నీ జనరల్‌కు లేని అధికారాలు బాబీ చేతికి వచ్చాయి.

బాబీ కెన్నెడీ తీసుకొనే ప్రతి నిర్ణయాన్ని జాన్ కెన్నెడీలాంటి మేధావి మారుమాటాడక అంగీకరించేవాడు. చిన్నతనం నుండి విశాలభావాలుగల బాబీ నల్లజాతీయుల హక్కులకోసం ఎన్నో చట్టాలు తెచ్చాడు. వర్ణవివక్ష ఎక్కువ ఉన్న మిసిసిపీలో ఒక యూనివర్సిటీలో మొదటిసారి ఒక నల్లజాతీయుడయిన విద్యార్థి చేరుతున్న రోజు గొడవలను ఆపడానికి పెద్ద ఎత్తున సైన్యాన్ని మొహరింపచేసి తెల్లవారిని అదుపులో ఉంచి అమెరికాను నివ్వెరపోయేలా చేసాడు. మార్టిన్ లూథర్ కింగ్‌కు రక్షణ కల్పించి నల్లవారికి సమానహక్కులు ఉండాలని ప్రజల భావాలను మార్చే ప్రయత్నం చేసాడు.

60, 70లలో అమెరికాలో పాతుకుపొయి ఉన్న మాఫియాకు బాబీ సింహస్వప్నమయ్యాడు. మాఫియాను అదుపులోకి తెచ్చేందుకు చట్టాలను ప్రవేశపెట్టి అణిచివేయడం మొదలుపెట్టాడు. క్యూబా వివాదంలో రష్యాతో అణుయుద్దం దాదాపు ఖాయమయినా జరగకపోవడానికి కారణం జాన్-బాబీ కెన్నెడీల మంత్రాంగమే. అప్పటివరకు అధ్యక్షులను తమ చెప్పుచేతల్లో ఉంచుకొన్న CIA ఆటలు బాబీ ముందు సాగలేదు. CIA దురాగతాలకు అడ్డుకట్టవేయడానికి ప్రయత్నించిన జాన్ ఎఫ్ కెన్నెడీ 1963 లో CIA కుట్రవల్ల హత్య చేయబడ్డాడు.

తల్లిదండ్రులకంటే ఎక్కువ సాన్నిహిత్యం ఉన్న తన సోదరుడు హత్యకు గురికావడం బాబీని కలచివేసింది. కొద్దిరోజులు జీవితం పట్ల నిరాశ చెందినా, తమ ఇద్దరి ఆశయాలకోసం మళ్ళీ అధ్యక్ష పదవికి పోటీ చేసాడు. బాబీ అధ్యక్షుడయితే తమ ఆటలు సాగవని తెలుసుకున్న CIA, మాఫియా కలసి బాబీ కెన్నడీని కాలిఫోర్నియాలో హత్య చేయించాయి.

1968 జూన్ 6 న కేవలం 42 ఏళ్ళ వయసులో మరణించిన బాబీ కెన్నెడీ అన్యాయాన్ని అరికట్టి ప్రజల మేలు కోసం ఏదయినా చేయడానికి వెనుకాడని నాయకుడిగా, తనను నమ్మిన అన్న కోసం ప్రాణాలివ్వడానికి వెనుకాడని తమ్ముడిగా ఇప్పటికీ అందరి హృదయాల్లో ఉన్నాడు.

అమెరికాలో ఆంధ్రుల పైన దాడి

Posted by జీడిపప్పు

ఈ మధ్య పత్రికల్లో ప్రవాసభారతీయుల పైన దాడుల వార్తలు దర్శనమిస్తున్నాయి. ఆ మధ్య అమెరికాలో తెలుగువారిని వరుసగా హత్యలు చేసారనీ, తెలుగువారిపైన దాడులు ఎక్కువ జరుగుతున్నాయని కూడా వార్తలు వచ్చాయి. ఎన్నడూ లేనిది ఆస్ట్రేలియాలో భారతీయులను లక్ష్యం చేసుకొని కొన్ని అల్లరి మూకలు దాడులు కొనసాగిస్తున్నాయి. ఇది అమానుష చర్య. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనికి నిరసనగా అమితాబ్ బచ్చన్ తనకు ఆస్ట్రేలియావారు ఇవ్వబోతున్న డాక్టరేట్ తిరస్కరించాడు. నేను కూడా ఇంకో వారం రోజులపాటు ఆస్ట్రేలియన్ మోడల్స్ ఫోజులిచ్చిన ప్లేబోయ్ మేగజైన్లను, వాళ్ళు నటించిన ప్లేబోయ్ వీడియోలను బహిష్కరిస్తున్నాను.

దాడులు తప్పు అన్నదానిలో అణుమాత్రమనుమానం లేదు కానీ, దానికి ప్రతిచర్యగా మనవాళ్ళు బిజీ రోడ్ల పైన బైఠాయింపులు, రాళ్ళు రువ్వడాలు చేయడం మాత్రం బాగలేదు. నేను ఆఫీసుకు వెళ్ళే దారిలో ఎవరయినా నిరసనలు చేస్తుంటే Who the #$&% are these morons delaying my meeting అనుకుంటాను. ఆస్ట్రేలియాలో మనవాళ్ళు చేస్తున్న చర్యలవల్ల మంచివాళ్ళకు కూడా కోపం వచ్చి వారిలో కూడా "వర్ణ" ఆలోచనలు మొదలవుతాయి. కాబట్టి ఇప్పటికయినా మనవాళ్ళు తమ పంథా మార్చుకొంటే మంచిది.

ఇక అమెరికా సంగతి కొస్తే - కొద్ది కాలం క్రితం మన తెలుగు మీడియావాళ్ళు "అమెరికాలో ఆంధ్రుల పైన దాడులు" అంటూ ఊదరగొట్టారు. దాడులు జరిగిన మాట నిజమే. మొన్నటికి మొన్న ఒక ఆంధ్ర విద్యార్థి పైన దాడి జరిగింది. ఆ వార్త మొత్తం చదివిన తర్వాత ఆ విద్యార్థి పట్ల నాకు కలిగిన అభిప్రాయం - What a mindless idiot. వినడానికి కటువుగా ఉన్నా ఇది నిజం. ఇలాంటి బుద్దిలేనివాళ్ళకు అలాంటి శాస్తే జరుగుతుంది మరి.

ఇలా ఎందుకంటున్నానంటే, కొన్నేళ్ళ క్రితం అమెరికాలో అడుగుపెట్టినపుడు సీనియర్లు కొన్ని సలహాలు ఇచ్చారు. అవి: చీకటి పడిన తర్వాత ఒంటరిగా తిరగవద్దు. ఎప్పుడూ జేబులో ఐదు-పది డాలర్లు ఉంచుకో. ఎవరయినా, ముఖ్యంగా నల్లజాతీయులు, ఎదురుపడితే సూటిగా వారి కళ్ళలోకి చూడకు. నల్లజాతీయుడు వచ్చి డబ్బు అడిగితే పటతటాయించకుండా నీ దగ్గర ఉన్న మొత్తం డబ్బు ఇచ్చేయి. పొరపాటున కూడా వారితో వాదనకు/పోట్లాటకు దిగకు.

సాధారణంగా ఈ నల్లజాతీయులు సిగరెట్లు/మందు/డ్రగ్స్ కోసం మనల్ని డబ్బు అడుగుతారు. మాటమాట్లాడకుండా వాలెట్ తీసి మొత్తం డబ్బు ఇచ్చేస్తే ఏమీ అనకుండా వెళ్ళిపోతారు. నేనయితే కొత్తగా వచ్చినవాళ్ళకు "నిన్ను అడిగితే వాలెట్ ఇచ్చెయ్యి" అని చెప్తాను. డబ్బు ఇచ్చిన తర్వాత కూడా గాయపరిచేవారు చాలా తక్కువ. (ఇప్పటివరకు నన్నెవరూ డబ్బు అడగలేదు. అడిగితే వాలెట్ ఇచ్చేస్తాను. ఇచ్చినా నన్ను గన్‌తో కాలిస్తే అపుడు చెప్తాను, నేను అనుకున్నది తప్పు అని!)

ఈ వివరాలు దాదాపు కొత్త విద్యార్థులందరికీ సీనియర్లు చెప్తారు. దాదాపు అందరూ పాటిస్తారు కానీ కొందరు తలతిక్క మనుషులు పాటించక ప్రాణాలపైకి కొనితెచ్చుకుంటారు. గత ఏడాది జరిగిన 10 హత్యలలో సుమారు ఏడెనిమిది ఇందువల్లే జరిగాయి. గత ఏడాది డాలస్‌లో ఒక దేశీ తన గర్ల్ ఫ్రెండ్ ముందు ఫోజు కొట్టాలని నల్లజాతీయుడికి ఎదురు తిరిగాడు. సీన్ కట్ చేస్తే డిక్కీలో (శవపేటికలో) తొంగున్నాడు.

ఇక తెలుగువాళ్ళ పైనే ఈ దాడులు ఎందుకు జరుతాయంటే తెలుగువాళ్ళ జనాభా అంత ఎక్కువ కాబట్టి. నేను స్కూల్లో ఉద్యోగం అడుక్కుంటున్నపుడు..err.. వెతుక్కుంటున్నపుడు చాలామంది అమెరికన్లు are you from Hyderabad? అన్నారు. కొన్ని స్కూళ్ళల్లో అయితే మాస్టర్స్ లో "(అన)అధికార భాషగా తెలుగు" ఉంటుంది! కాబట్టి అమెరికాలో ఎవరయినా విద్యార్థి పైన దాడి జరిగిన వార్త చూసి ఆ విద్యార్థి తెలుగు విద్యార్థి కాకపోతే ముక్కు తీసి వేలుపైన వేసుకుంటాము.

మీడియా ఏమో "అమెరికాలో ఆంధ్రుల హత్య" అని రాద్ధాంతం చేస్తుంది. వీళ్ళు అమెరికాలో ఒక సంస్థ తెలుగువాళ్ళను చంపడమే ధ్యేయంగా కార్యకలాపాలు సాగిస్తున్న రేంజ్‌లో హంగమా చేస్తారు,ఎప్పటిలాగే గోరంతలు కొండంతలు చేసి చెప్తారు. మొన్న మిసిసిపీలో జరిగిన సంఘటనలో ఆ విద్యార్థి చొక్కా కారు డోరుకు తగులుకొని ఉండగా 100 మీటర్లు లాక్కుని వెళ్ళినట్టు హిందూ పత్రికలో వస్తే, కిలోమీటరు లాక్కెళ్ళినట్టు ఈనాడులో వచ్చింది. ఒక బ్లాగరయితే ఏకంగా  ఆ విద్యార్థి ఆత్మకు శాంతి కలగాలని కూడా ప్రార్థించాడు.. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో బ్రతికించేసాడు! ఇలా ఉంటాయి లీలలు.

అన్నట్టు నిన్న మెగాస్టార్ గారు "ప్రవాసాంధ్రుల రక్షణకొసం ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి" అన్నారు. అమెరికాలో సంపాదిస్తూ అమెరికా దేశానికి పన్ను కట్టే నా రక్షణకోసం ఒక శాఖనా??!!! అదీ నేను పైసా డబ్బు కట్టకుండా?! అలా అయితే ఢిల్లీదాకా ఏంటీ..ఢ ఢ ఢల్లాస్ దాకా దేక్కున్నా మనకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే నాకొచ్చిన సందేహమేమిటంటే, మెగాజోకర్ గారు ముఖ్యమంత్రి అయి ఒక శాఖను ఏర్పాటు చేసారే అనుకుందాము. అమెరికాలోని ఒక నగరంలో ఆంధ్రుని పైన దాడి జరుగుతుంటే మెగాజోకర్ గారు ఎలా రచ్చిస్తారబ్బా???

కూడలి కష్టాలు - పరిష్కారం

Posted by జీడిపప్పు

కొద్దిరోజుల క్రితం కూడలిలో పోస్టులు చూసి చాలా చిరాకేసింది. ఒకరివి (అఫ్‌కోర్స్ అన్ని బ్లాగులూ కలిపి) తొమ్మిది, మరొకరివి ఐదు, ఇంకొకరివి ఆరు ఫోటోలు, ఇంకొకరివి మూడు పోస్టులు..ఇలా ఐదారుమంది తమ పోస్టులతో మొత్తం జాబితాలో సుమారు సగం ఆక్రమించేసారు. అది చూసి ఒక పోస్టు వ్రాసాను కానీ చివరిక్షణంలో నేనొక్కడినే ఇలా అనుకుంటున్నానేమో అనిపించి ఆ పోస్టు ప్రచురించలేదు. ఈ రోజు జ్యోతిగారి పోస్టు చూసిన తర్వాత ఆ పోస్టును యథాతథంగా ప్రచురిస్తున్నాను. మీకు కూడా ఇది సమస్యే అనిపిస్తే..మరెందుకాలశ్యం, ఓ పోస్టు వెయ్యండి. పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందేమో!

అసలు పోస్టు :

నేను కూడలిని ఏడాదినుండి క్రమం తప్పకుండా చూస్తున్నాను. కూడలిని చూడడం అంటే ఈ పేజీ చూడడం. నాకు తెలిసి చాలామంది బ్లాగర్లు ఈ పేజీనే చూస్తారు అనుకుంటా. ఎందుకంటే, ఈ పేజీలో అయితే పోస్టుల మొదటి నాలుగు లైన్లు చూస్తూ కుడిపక్కన కామెంట్లను చూడవచ్చు.

కొద్దికాలం క్రితం వరకూ ఈ పద్దతి అనుసరించడం చాలా సులభంగా ఉండేది. చాలావరకు "చదవగలిన" పోస్టులే ఉండడంతో "చెత్త" పోస్టులను సులభంగా దాటుకుంటూ వెళ్ళిపోయేవాడిని. కానీ ఈ మధ్య అంతా రివర్స్ అయినట్టనిపిస్తున్నది. మంచి పోస్టులు తగ్గిపోయి, ఒకే బ్లాగులో రోజుకు నాలుగైదు పోస్టులు పడుతున్నాయి. రోజుకు రెండు-మూడు కంటే ఎక్కువ ఒకే బ్లాగుకు సంబంధించిన పోస్టులు కూడలిలో కనిపించాయంటే అన్నీ పరమ చెత్త పోస్టులే అని నా own స్వంత పర్సనల్ స్వాభిప్రాయం.

ఇలా రోజుకు మూడు నాలుగు పోస్టులవల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి. బ్లాగు లోకంలో చాలా పాపులర్ అవ్వవచ్చు, ఆ పోస్టులు వేసేవాడు ఎంత మేధావో అందరికీ తెలుస్తుంది, బ్లాగుకు హిట్లు పెరుగుతాయి, అలెక్సా ర్యాంకు పెరుగుతుంది. అందుకే నేను కూడా కొన్ని బ్లాగులు మొదలు పెట్టాలనుకుంటున్నాను.

ఒకటో బ్లాగు: నాకు కమ్యూనిస్టులంటే పరమ అసహ్యం. ఇవి ప్రపంచంలోనే అత్యంత ---- అన్నమాట. వీటిపైన నాకున్న కసి తీర్చుకోవడానికి తెల్లవారి ఆరున్నరకు "ఛీ కమ్యూనిస్టులు" అని రెండు లైన్లు, తొమ్మిదిన్నరకు 'థూ కమ్యూనిస్టులు" అని మూడు లైన్లు, రెండున్నరకు "ఛీ ఛీ కమ్యూనిస్టులు" అని రెండు లైన్లు, సాయంత్రం ఏడున్నరకు 'కమ్యూనిస్టులు ఛీ ఛీ" అని ఒక లైను పోస్టులు వేస్తాను అన్నమాట.

రెండో బ్లాగులో "అసలు మా మెగాజోకర్ గారు ఓడిపోలేదు", "మెగాజోకర్ గారూ, మీ వెంటే మేముంటాము", "వచ్చే ఎన్నికల్లో మీరే ముఖ్యమంత్రి మెగాజోకర్ గారూ", "మీరు చాలా మంచివారు మెగాజోకర్ గారు" "అసలు మెగాజోకర్ ఎవరు" లాంటి పోస్టులు వేస్తాను, మతి చలించినప్పుడల్లా లేదా మతి ఉన్నపుడల్లా. మూడో బ్లాగులో మా ఊరి ఎమ్మెల్యే భజన, మా ఊరి రోడ్ల గుంతల ఫోటోలు ఉంటాయి. నాలుగో బ్లాగు వార్తలకోసం. న్యూయార్క్ నగరంలో జరుగుతున్న విషయాలతో గంటకొకసారి అప్‌డేట్ అవుతుంటుంది.

ఇలా సగటున రోజుకు 15-20 చెత్త పోస్టులతో కూడలి పేజీని సగం నింపడంవల్ల మంచి పోస్టులను చదవాలనే వారికి చికాకు కలిగించవచ్చు. ఇహపోతే - స్వేచ్ఛ పేరుతో నన్నేమీ చేయలేరు. రోజుకు నాలుగు కాదు, నలభై చెత్త పోస్టులు వేసుకున్నా ఎవరికీ అడిగే హక్కులేదు. ఒకే బ్లాగులో 10 పోస్టులు వెయ్యకూడదని రూల్ పెడితే ఐదు బ్లాగులు సృష్టించి ఒక్కోదాంట్లో రెండేసి పోస్టులు వేస్తాను. ఇష్టముంటే చదవచ్చు లేదా చదవకపోవచ్చు. మరీ అంత ఇబ్బంది అయితే "మంచి పోస్టులున్న" బ్లాగులు ఫేవరెట్స్ లో కలుపుకోవాలి.

ఇంత సేపు ఈ చెత్తను ఓపిగ్గా చదివినందుకు మీకో ఉచిత సలహా:: కూడలి నిర్వాహకులకు " అయ్యా, దయచేసి ఈ multiple టపాల బ్లాగులకోసం ఇంకో Tab సృష్టించి అవన్నీ అక్కడ పెట్టండి. ఈ చెత్తను మెయిన్ పేజీలో చూడలేక, ఆ చెత్తలో మంచి పోస్టులను వెతుక్కోలేక ఛస్తున్నాము" అని అర్జీ పెడుతూ ఒక పోస్టు వెయ్యండి. మీ అదృష్టం బాగుంటే ఈ multiple పోస్టుల బాధ తగ్గవచ్చు.

వీవెన్ గారు :)

అమెరికాలో తెలుగు ఉద్యమం

Posted by జీడిపప్పు

ఈ మధ్య బ్లాగుల్లో LTTE సంస్థ గురించి, తమిళ-తెలుగు భాషల గురించి పోస్టులు, చర్చలూ జరుగుతున్నాయి. కొందరు శ్రీలంకలో తమిళులు చేసినదాన్ని సమర్థిస్తూ, కీర్తిస్తూ చక్కని పోస్టులు వేసారు. కానీ అందరికంటే అసంబద్ధమైన పోస్టు "బ్లాగాడిస్తా రవి" గారు వేసారు. నాకు రవిగారి పోస్టు నచ్చకపోవడానికి కారణం - ముందు వెనుకా ఆలోచించకుండా "భాష" అన్న పదం వినపడగానే పూనకం వచ్చి ఊగిపోయి "అవును అందరూ భాష కోసం ఉద్యమాలు జరపాలి" అనకపోవడం. రవిగారి పోస్టులో ఇంకా నచ్చనిదేమిటంటే - అన్నికోణాల్లో ఆలోచించి ఉన్నవి ఉన్నట్లు చెప్పడం.

శ్రీలంకలో తమిళులు తమ భాషకోసం జరుపుతున్న పోరాటాన్ని, వారికి తమ భాష పట్ల ఉన్న అభిమానాన్ని చూసి ప్రవాసాంధ్రుడిగా నాకు నిఝ్ఝంగానే తెలుగువాడిని అయినందుకు సిగ్గు వేసింది. నాకు తెలిసి ప్రతి తెలుగువాడూ శ్రీలంక తమిళులనుండి నేర్చుకోవలసింది ఎంతో ఉంది, ముఖ్యంగా ప్రవాసాంధ్రులు.  అమెరికాలో ఉన్న భారతీయుల్లో ఎక్కువమంది తెలుగువారే. న్యూజెర్సీ, బే ఏరియా మొదలయిన ప్రాంతాల్లో తెలుగువారి జనాభా చాలా ఎక్కువ. ప్రతి ఇద్దరు భారతీయుల్లో ఒకరు తెలుగువారే అంటే అతిశయోక్తి కాదేమో. అయినా సరే అమెరికాలో తెలుగు నిరాదరణకు గురి అవుతున్నది. అందుకుగల కారణాలు, పరిణామాలు, పరిష్కారము చూద్దాము.

శ్రీలంకలో తమిళులు Vs అమెరికాలో తెలుగులు
శ్రీలంకకు వెళ్ళిన తమిళులు తాము సింహళం నేర్చుకోము, తమకోసం అన్నీ తమిళంలోనే ఉండాలి అన్నారు. మనము ఏమి చేసాము? అమెరికాకు వచ్చాకో, వచ్చే ముందో ఇంగ్లీషు నేర్చుకొన్నాము. కొద్ది కాలానికి అమెరికన్ యాస కూడా అలవాటు చేసుకున్నాము.
వీళ్ళు మేమంతా తమిళులము కాబట్టి మేమంతా ఒకే చోట ఉంటాము, మీతో కలవము అన్నారు. మనమేమో ఎక్కడుంటే ఏముంది, హాయిగా ఉంటే చాలు అని తెల్లవాళ్ళ మధ్య నివశిస్తున్నాము.
వీళ్ళు సింహళీయుల చట్టాలను పట్టించుకోలేదు, వాటిని అతిక్రమించి ఎదురుతిరిగారు. మనమేమో అమెరికావాడు చెప్పినట్టు కుడి వైపునే కారు నడిపాము, రోడ్డు పైన చెత్త వెయ్యలేదు, క్యూలో ఉన్నపుడు తొక్కిసలాటలు జరపలేదు.
వీళ్ళు తమ పిల్లలకు "సింహళ బాష నేర్చుకోకూడదు" అని చెప్పారు. మనమేమో "మనం ఈ దేశానికి వచ్చినపుడు ఈ దేశస్థుల్లా ఉండాలి" అంటూ పిల్లలకు ఇంగ్లీషు నేర్పిస్తున్నాము.
వీళ్ళు తమ పిల్లలకు "మనం ఉంటున్న శ్రీలంక మన దేశం కాదు, మనము మన భాషను, సంస్కృతినే ఆచరించాలి" అని భోధించారు. మనమేమో "మనము ఇక్కడకు వలస వచ్చాము. భాషకంటే మనకు కూడూ, గుడ్డ పెడుతున్న దేశం పట్ల గౌరవం ముఖ్యం. ఈ దేశాన్ని గౌరవించాలి, వీరి సంస్కృతి కూడా అలవాటు చేసుకోవాలి" అంటూ తెలుగువారింట్లో కూడా క్రిస్మస్ రోజున అందరూ హాయిగా, సంతోషంగా బహుమతులతో గడిపే దీనస్థితికి వచ్చాము.

పరిణామాలు
తెలుగువారు ఇలా అమెరికా పద్దతులను గౌరవిస్తూ, ఆచరిస్తూ అమెరికన్లతో కలసిపోయి హాయిగా జీవిస్తున్నారు. మొదటితరం తెలుగు పిల్లలకు తెలుగు చదవడం, వ్రాయడం, మాట్లాడడం సరిగా రాదు. తెలుగు సంతతివారు అమెరికన్లతో పోటీ పడి చదువుతున్నారు. ఎన్నో కాంపిటీషన్లలో నెగ్గుతున్నారు. కంపెనీల్లో ఉన్నత పదవులను చేపడుతున్నారు. కేవలం మన తెలుగు పండగలయిన ఉగాది, సంక్రాంతి వంటివి మాత్రమే కాక అమెరికన్ల పండగలయిన థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్ పండగలను కూడా జీవితంలో ఒక భాగం చేసుకుంటున్నారు. తమ భాషకంటే తమకు బ్రతుకుతెరువునిస్తున్న దేశ పద్దతులకు గౌరవమిస్తూ ఆ దేశ ప్రజల్లా బ్రతుకుతున్నారు. ఈ విపరీత ధోరణి ఇలా కొనసాగితే మరో రెండు తరాల తర్వాతి తెలుగువారు 'వాట్ ఈజ్ టెల్గు? హూ ఈజ్ ఉగాడి?' అంటారు.

తక్షణ కర్తవ్యం
ఎందుకు? ఎందుకు ఇలా జరుగుతోంది? ఇన్ని లక్షల మంది తెలుగువాళ్ళు అమెరికాలో ఉన్నా "భారతీయులు" గా గుర్తింపు పొందుతున్నారే కానీ "భారతీయ తెలుగువారి"గా ఎప్పుడు గుర్తింపబడతారు? కొన్ని తరాల తర్వాత అమెరికాలో తెలుగువారి పరిస్థితి ఏమి?
ఇలాంటి ప్రశ్నలకున్న ఏకైక జవాబు -  అమెరికాలోని తెలుగువారు ఉద్యమించడం.

"తెలుగు" అన్న మాట వినిపిస్తే కల్లు తాగిన కోతిలా చిందులు తొక్కే మతిలేనివాడిని నాయకుడిగా ఎన్నుకోవాలి. ఈ తెలుగోన్మాది తెలుగువారిలో భాషాభిమానాన్ని రెచ్చకొట్టేవాడయి ఉండాలి.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఎన్నో భారతీయ భాషలున్నా తమిళులకు జరుగుతున్న అన్యాయాలే వినిపిస్తాయి కానీ తెలుగువారికి జరుగుతున్న అన్యాయాలు వెలుగులోకి రావడం లేదు. ఇకనుండి తెలుగువారికి కూడా అన్యాయం జరిగేలా ఈ తెలుగోన్మాది చర్యలు చేపట్టాలి.
అమెరికాలో తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచాలి. తెలుగు వారి పిల్లలకు బోధన తెలుగులోనే జరగాలి.
తెలుగు వారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సూచనల మొదలు అన్నీ తెలుగులో ఉండాలని ఆందోళనలు చేపట్టాలి.
ఇలా చేసినపుడే తెలుగు వారికి గుర్తింపు లభిస్తుంది.

శ్రీలంకలోని తమిళులు చేసినది చూసి ఇకనయినా ప్రవాసాంధ్రులు కళ్ళు తెరుస్తారని, తెలుగు ఉద్యమాలు, తెలుగు ఆందోళనలు చేపడుతారనీ, అమెరికాలో తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని చాటి చెబుతారని ఆశిద్దాం.

శభాష్ శ్రీలంక

Posted by జీడిపప్పు

మొత్తానికి ప్రభాకరన్ చచ్చాడు. అన్నెం పున్నెం ఎరుగని బాలలను సైతం మానవ బాంబులుగా తయారు చేసి, వారిలో జాతి విద్వేషాన్ని విషంలా ఎక్కించిన ఈ మానవ మృగాన్ని చంపిన శ్రీలంక సేనకు జేజేలు కొట్టాలి. వీడిని ఎదుర్కొని ఎన్నో దశాబ్దాలుగా సాగుతున్న మారణకాండను అదుపులోకి తెచ్చిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ధైర్యానికి జోహార్లు అర్పించాలి. ఈ సందర్భంగా -  విషయాన్ని చక్కగా విశ్లేషించే ఎంబీయస్ ప్రసాద్ గారు ఈ తీవ్రవాద సంస్థ గురించి వ్రాసిన వ్యాసాలనుండి సంగ్రహించిన కొన్ని అంశాలు:

Image and video hosting by TinyPic
Image and video hosting by TinyPic
Image and video hosting by TinyPic
Image and video hosting by TinyPic
Image and video hosting by TinyPicImage and video hosting by TinyPic
Image and video hosting by TinyPicImage and video hosting by TinyPic
Image and video hosting by TinyPicImage and video hosting by TinyPic