రామలింగరాజు గారికి ధన్యవాదాలు - 2

Posted by జీడిపప్పు

ఇంతకు ముందు భాగంలో ఉద్యోగాలు చేస్తున్న యువత జీవనశైలిలో మార్పులు తెస్తున్నందుకు రాజుగారికి ధన్యవాదాలు చెప్పుకున్నాము. ఈ భాగంలో విద్యార్థులపైన రాజుగారి ప్రభావం ఎంత వుందో చూసి వీలయితే ధన్యవాదాలు చెప్పుకుందాము.


విద్యార్థులు
సినిమాల్లో ధర్మవరపు సుబ్రమణ్యం, ఎమ్మెస్ నారాయణ వేసే పాత్రల పుణ్యమా అని గత పదేళ్ళ నుండి లెక్చరర్ అంటే "వాడా, ఒక ఎదవ  "అని ఒక స్టాండర్డ్ ను ఏర్పరుచుకున్నారు కాలేజీ విద్యార్థులు. గురువులపట్ల గౌరవం తగ్గడానికి కొందరు గురువులు కూడా కారణం. చదువు చెప్పడం తక్కువ, ప్రైవేటు బిజినెస్‌లు ఎక్కువ అవుతున్నాయి కొందరు గురువులకు. ఆ విషయం పైన ఇంకో పోస్టు వెయ్యవచ్చు.

అసలు విషయానికి వస్తే, పదేళ్ళ క్రితం కూడా లెక్చరర్ల పైన జోకులు వెయ్యడం, ఆటపట్టించడం ఉండేది. అవి చేస్తున్నా, కాస్తో కూస్తో భయం, లెక్చరర్ అంటే ఒక విలువనిచ్చేవాళ్ళు విద్యార్థులు. ఎప్పుడయితే IT బూం పెరిగిందో, విద్యార్థుల వైఖరిలో మార్పు మొదలయింది, ముఖ్యముగా 2003 నుండి. ఫైనల్ ఇయర్ కాకముందే కంపెనీలు క్యూలు కట్టి మరీ "ఆన్ క్యాంపస్" పేరిట ఉద్యోగాలిచ్చేవాళ్ళు. తమకు చదువు చెబుతున్న వారికి వచ్చే జీతం దాదాపు తమకూ వస్తుంది మరి కొద్ది రోజుల్లో అనే భావన 20 ఏళ్ళు కూడా నిండని యువతలో పాతుకుపోయింది.

అప్పుడు చూడాలి వారి ప్రవర్తన. ప్రొఫెసర్లపట్ల "నువ్వెంత, నీకు నాకు తేడా ఏంటి, నీ శాలరీ కంటే ఎక్కువ సంపాదిస్తాను నెక్స్ట్ ఇయర్‌కు" అన్న భావనలు కలిగాయి. అప్పట్లో ప్రతిఒక్కడూ ITలో దుంకుతుంటే కొందరు పరిగెత్తి పాలు తాగడం ఎందుకని ఏ 15-20 వేల జీతానికో కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేరారు. పాపం వాళ్ళు అనుభవించిన అవమానాలు ఉపాధ్యాయ వృత్తిలో ఎవరూ అనుభవించి ఉండరేమో! " కనీసం IT జాబ్ తెచ్చుకోవడం చేతకాక దిక్కులేక ఫుడ్డు కోసం మాకు చదువు చెబుతున్నావు" అని చూపులతోనే చెప్పడం మన విద్యార్థులకు చెల్లింది. మీకు తెలిసిన మిత్రులెవరయినా ప్రొఫెసర్లుగా ఉంటే అడిగి చూడండి, మూడు నాలుగేళ్ళ క్రితం పరిస్థితి ఏంటో!

మిగతా కంపెనీలకంటే మన రాజు గారు మరొకడుగు ముందుకు వేసి పెద్ద కంపెనీలు తీసుకోని వాళ్ళను తీసుకున్నారు. చాలా మంచిది, ఏమీ రాని వాళ్ళను కూడా రెకమండేషన్లవల్ల తీసుకున్నారు. వీళ్ళను పెట్టి ప్రాజెక్టులు చేయించడానికి ఆ టీం లీడర్లు ఎంత కష్టపడ్డారో ఆ దేవుడికే ఎరుక. వీళ్ళు చేసిన పనిలోని  తప్పులు భరించలేక ఆ ఆన్-సైట్ కో-ఆర్డినేటర్ "వద్దు,మీరు పని చేస్తే అందులోని తప్పులు ఫిక్స్ చేయడానికి నాకు రెండింతలు టైం పడుతుంది. నా తిప్పలేవో నేనే పడతాను, మీ పని కూడా నేనే చేసుకుంటాను" అన్న సందర్భాలు కోకొల్లలు.

విద్యార్థుల ప్రస్తావన వచ్చింది కనుక కాలేజీల గురించి కూడా చూద్దాం. ఇప్పుడు ఆంధ్రాలో దాదాపు 500 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి అన్నం నిజం తెలుసా? ఒక్కో కాలేజీ నుండి సగటున 200 మంది, అంటే ఏడాదికి సరాసరి లక్ష మంది కేవలం ఇంజినీరింగ్ కాలేజీల నుండి బయటకు వస్తారు. IT రంగంలో లక్షల ఉద్యోగాలున్నాయి నిజమే, మరి మిగతా వాటి పరిస్థితేమిటి? 2000 సంవత్సరం తర్వాత దాదాపు యే కాలేజీలో సివిల్ బ్రాంచ్ లేదు. దానిబదులు ఉన్న బ్రాంచిలను  క్రాస్ బ్రీడింగ్ చేసి "ఏదో" IT బ్రాంచ్ పెట్టారు. భవిష్యత్తులో సివిల్ ఇంజినీర్ల కొరత ఏర్పడుతుంది. అప్పుడు పొరుగురాష్ట్రాలకు పరుగెత్తాలి.

ఆస్ట్రేలియాలో వరదలు అని తెలిస్తే ఏమీ పట్టించుకోము. ఢిల్లీలో వరదలు అని తెలిస్తే - అవునా అనుకుంటాము. కోస్తాలో వరదలు అంటే ఉలిక్కిపడి మన ఊళ్ళో ఏమవుతుందో అని ఆలోచిస్తాము. సరిగ్గా ఇదే జరగబోతున్నది IT విషయంలో. అమెరికాలో ఉద్యోగాలు పోతున్నాయి అంటే 'మళ్ళీ వస్తాయిలే" అనుకున్నారు. రాజు గారి స్కాం తెలిసి IT జీవితాలు అంటే రిస్క్ అని అందరికీ తెలిసింది.

గత ఏడాది నుండి "ఆన్ క్యాంపస్" ఉద్యోగాలు తగ్గిపోయాయి. ఫైనల్ ఇయర్‌లో ఉన్న విద్యార్థులు 60% వస్తే చాలు మాకు ఉద్యోగం వస్తుంది అనుకోవడం లేదట. ప్రొఫెసర్లను గౌరవిస్తున్నారట. "మీకేమి సార్, 20 వేల జీతం, రిస్కు లేని సుఖమయిన ఉద్యోగం. మేము బయట వెళ్తే ఉద్యోగాలు లేవు, ఉన్నా ఎప్పుడు వూడతాయో? ఏమి చేయాలో తెలియదు" అంటున్నారట. తల్లిదండ్రులు కూడా "యే బ్రాంచ్ అయినా సరే, IT తప్ప" అంటున్నారట (Of course మళ్ళీ బూం వస్తే పరుగులు పెడతారు, అది వేరే విషయం). మన నట్టింట రాజు గారు చేసిన నిర్వాకం వల్ల ఇవి ఇంకాస్త పెరుగుతాయి.

మొన్నటి వరకు "ఎందుకురా ఈ ఉద్యోగం చేస్తూ 20 ఏళ్ళు కూడా నిండని వాళ్ళ దగ్గర చులకనగా బ్రతుకుతున్నాము" అనుకొనే కాలేజీల్లో ప్రొఫెసర్లు మూడేళ్ళ క్రితం ఉన్న దీనస్థితికి బదులు నేడు, రేపు, మరి కొద్ది రోజులు గౌరవాన్ని దక్కించుకోవడానికి కాస్తో కూస్తో దోహదం చేసిన, చేస్తున్న రాజుగారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి కదా  మరి! Image Hosted by ImageShack.us

ఆంధ్రులు సిగ్గుపడాలి

Posted by జీడిపప్పు

ఇప్పటికే బ్లాగుల్లో చాలా మంది సిగ్గు పడిపోతున్నారు, అలాంటి పోస్టులు కుప్పలు తెప్పలుగా పడుతున్నాయి. ఆల్రెడీ "భారతీయులు సిగ్గుపడాలి" అని ఒక పోస్టు వేసి మళ్ళీ ఈ "ఆంధ్రులు సిగ్గుపడాలి" అనే పోస్టు ఎందుకు అని నా పైన కోపగించుకోకండి. అందరూ రాళ్ళు వేస్తున్నపుడు మనమూ రెండు రాళ్ళు వేసేస్తే ఓ పని అయిపోతుంది. పైగా సిగ్గు పడాలనుకొనే వాళ్ళు ఇంకోసారి సిగ్గుతో మొగ్గలవడానికి, సారీ, సిగ్గుతో తల దించుకోవడానికి మరో అవకాశం కలిపించాలన్న సత్సంకల్పంతో శ్రీ సోదేశ్వర స్వాముల వారి ఆశీర్వాదంతో ఈ పోస్టు వేస్తున్నాను.

మొన్ననే పబ్ లలో తాగి తందనాలాడుతూ అశ్లీల నృత్యాలు చేస్తున్న అమ్మాయిల పైన దాడి జరిగింది. ఇది అత్యంత హేయనీయం. భారతదేశ చరిత్రలో కాంస్యాక్షరాలతో లిఖించతగ్గ దారుణం.అయినప్పటికీ కొందరు ఆ దాడిని సమర్థిస్తున్నారు, మన బ్లాగుల్లో కూడా. అయ్యలారా/అమ్మలారా, దాడి ముమ్మాటికి తప్పు. దీనికి "మరో వైపు" లేదు. కేవలం ఒక్క వైపు మాత్రమే ఉంది. దాడిని సమర్థించే ముందు "ఆ స్థితిలో మన వాళ్ళు ఉంటే" అని ఆలోచించండి.

మీ కూతురో లేదా చెల్లెలో క్లీవేజ్ కనిపించేలా టాప్ వేసుకొని, మోకాళ్ళ పైకి స్కర్టు వేసుకొని బయట వెళ్తుంటే తిడతారా, లేక కొడతారా? " తప్పేముంది నా కూతురు అలా వెళ్తుంటే?? వెళ్ళిరామ్మా" అని చెప్తారు కదా. మరి దాడిని "మరో కోణంలో" ఎందుకు సమర్థిస్తున్నారు.

మీ కూతురో లేదా చెల్లెలో తాగి అశ్లీలంగా నృత్యం చేస్తున్న దృశ్యం మీ కంటబడితే తిడతారా, లేక కొడతారా? "చాలా బాగా ఊపుతున్నావమ్మా" అని మెచ్చుకుంటారు కదా? మరి దాడిని "మరో కోణంలో" ఎందుకు సమర్థిస్తున్నారు?

మీ కూతురో లేదా చెల్లెలో తాగిన మత్తులో బోయ్ ఫ్రెండ్ ఇచ్చిన డ్రగ్స్ మత్తులో కాలు జారి కడుపు చేయించుకుంటే , లేదా పిమ్మట అబార్షన్ చేయించుకుంటే తిడతారా, లేక కొడతారా? "నీకు పెళ్ళి కాకముందే నేను ఆడుకోవడానికి బిడ్డనిచ్చావు తల్లీ" అనో "ఏమీ కాదమ్మా అబార్షన్ చాలా సింపుల్" అని చెప్తారు కదా. మరి దాడిని "మరో కోణంలో" ఎందుకు సమర్థిస్తున్నారు?

ఇప్పటికయినా కళ్ళు తెరవండి మహాశయులారా.

ఇక ఆంధ్రులు సిగ్గుపడాలి అన్న సంగతికొద్దాము:

నిన్నటికి నిన్న హైదరాబాదులో ఒకమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసారట http://thatstelugu.oneindia.in/news/2009/01/29/college-student-gang-rapped-290109.html

పరిచయం చేసుకొని ఆ అమ్మాయిని పబ్‌లకు రిసార్టులకు తీసుకెళ్ళారు. తర్వాత ఎక్కడికో రమ్మన్నారు, ఈ అమ్మాయి వెళ్ళిన తర్వాత డ్రింక్స్ తాగించి రేప్ చేసారు. ఎంత దారుణం. ఈ అమ్మాయి ముక్కూ మొహం తెలియని వాళ్ళతో పబ్‌లకు రిసార్టులకు వెళ్తున్న సంగతి తెలిసినపుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు "నా కూతురు ఎంత ఎదిగింది" అని మురిసిపోయారో ఆలోచించండి. ఆ రాత్రి వాళ్ళు "ఎక్కడికో" రమ్మని పిలిచినపుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు "జాగర్తగా వెళ్ళిరామ్మా వాళ్ళు పిలిచిన చోటికి" అని సాగనంపారు. కానీ ఈ దుర్మార్గులు ఆ అమ్మాయిని రేప్ చేసారు. ఆ తల్లిదండ్రులు ఎంత క్షోభ పడ్డారో ఆలోచించండి.

తమ కూతురితో పై పైన టిఫిన్లు మాత్రమే చేస్తారు అన్న నమ్మకంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు పబ్‌లకు, రిసార్టులకు పంపితే - వారినమ్మకాన్ని వమ్ముచేసి టిఫిన్లతో సరిపెట్టుకోకుండా రేపు, ఎల్లుండి చేయడం ఖండనార్హం మరియు గర్హనీయం. ఇలా చేస్తే ఎంత మంది తల్లిదండ్రులు తమ కూతుళ్ళను లేదా ఎంతమంది అన్నలు తమ చెల్లెళ్ళను ధైర్యంగా బార్లకు, రిసార్టులకు పంపగలరు? మన రాష్టంలో జరిగిన ఈ సంఘటన చూసి ఆంధ్రులు - ముఖ్యంగా వరంగల్, మహబూబ్‌నగర్, గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు వాసులు సిగ్గుతో తల దించుకోవాలి, 21 రోజులు తల వంచుకొనే నడవాలి.

అమెరికథలు - 1

Posted by జీడిపప్పు

2008 నా జీవితంలో గొప్ప సంవత్సరం. పెళ్ళి అయింది, కొడుకు పుట్టాడు, అనుకున్న విధంగా ఉద్యోగం నడిచింది. కానీ మా అబ్బాయి పెదవికి సర్జరీలు అవసరమయ్యాయి. అవి పూర్తయ్యే వరకు నా భార్య ఉద్యోగానికి వెళ్ళదలుచుకోలేదు. నా ఒక్క సంపాదనతో అన్ని ఖర్చులు ఎలా భరించాలి అన్న ఆలోచన నాకు కలిగింది. ఇప్పట్లో ఆర్థిక వ్యవస్థ బాగుపడే సూచనలు కనిపించడం లేదు. మేము కూర్చుని "ఇది అవసరం, ఇది అవసరం లేదు" అని ఖచ్చితంగా నిర్ణయించాము. ఖరీదయిన రెస్టారెంట్లకు వెళ్ళడం మానేశాము. రెండు ప్లేట్లు భోజనం, రెండు బాటిళ్ళు వైను వద్దనుకోవడం వల్ల $120 మిగులుతున్నవి.

సర్జరీలు దాదాపు పూర్తి అయ్యాయి. ఈ దేశానికి వలస వచ్చిన నా తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడి జీవనాన్ని గడిపారో తలుచుకుంటూ వారిని ఆదర్శంగా తీసుకొని ధైర్యంగా బ్రతుకుతున్నాను. ఆర్థికంగా దెబ్బతినడం మన చేతుల్లో కూడా ఉంది. అనవసరపు ఖర్చులు చేయకండి, తెలివయిన ప్రణాళికతో ఖర్చు పెట్టండి. మన అందరికి గుడ్ లక్!!- By MALIBLOC

***************************************

నా వయసు 61, యాభైలలో ఎక్కువ రోజులు నా సోదరి బాగోగులు చూసుకోవడానికి ఇంటిదగ్గరే ఉన్నాను. ఆమె ఏడాది క్రితం చనిపోయింది. అప్పటినుండి ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. 8 ఏళ్ళ తర్వాత, 61 ఏళ్ళ వయసులో ఉద్యోగం వెతుక్కోవడం ఎంత కష్టమో మీకు తెలుసా? నాకు Social Security డబ్బు వస్తుంది కానీ ఒక్కనెల రాకుంటే ఇల్లు వదిలి వీధిన పడాలి.

ప్రస్తుతానికి ప్రత్యామ్నాయ భోదకురాలిగా మరియు McDonalds లో పని చేస్తున్నాను. స్కూలు లేని రోజుల్లో పని ఉండదు, పని లేని రోజు డబ్బు ఉండదు. క్రిస్మస్ అపుడు మూడు వారాలు పని దొరకలేదు. ఈ వారం మొత్తానికి MDonalds లో మూడు గంటలు పని దొరికింది. క్రితం వారం నా మొత్తం సంపాదన $103, ఈ వారం నా సంపాదన $50. ఆదివారానికి ఇంటి అద్దె కట్టాలి, కట్టకపోతే ఇంటి యజమాని ఊరుకోరు. కారుకు ఇన్సూరెన్సు కట్టవలసిన తేదీ దాటిపోయింది. నేను ఎంతో ఇష్టపడి కొనుకున్న 08 Honda కారు అమ్మేస్తున్నాను. పనికి వెళ్ళడానికి ఒక పాత కారు కొనుక్కోవాలి. నూడుల్స్, చీజ్ తింటూ బ్రతుకుతున్నాను. జీవితంలో మొదటిసారి ఉచితంగా ఆహారాన్ని ఇచ్చే food pantry కి గత వారం వెళ్ళాను.

నా యీ "golden years" లో ఇలా జీవించవలసి వస్తుంది అనుకోలేదు. - By greenghia

CNN.com లో iReport అనే విభాగం ఉంది. అందులో ప్రజలే రిపోర్టర్లు. కొందరు అమెరికన్లు ప్రస్తుత ఆర్థికమాంద్యంలో తమ జీవితం ఎలా ఉందో చెబుతూ పంచుకున్న అనుభవాలను తెలుగులోకి అనువదించడం జరిగింది.

రామలింగరాజు గారికి ధన్యవాదాలు - 1

Posted by జీడిపప్పు

వేల కోట్ల కుంభకోణం చేసి, లక్షల మందిని ఇబ్బందుల పాలు చేసి , " రాజు గారు ఆంధ్రుడని చెప్పడానికి గర్వపడుతున్నాను, రాజు గారిది ఆంధ్రానే, నాదీ ఆంధ్రానే" అని చెప్పేవాళ్ళు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక బైరాగుల్లో కలిసేలా చేసిన రామలింగరాజుగారికి ధన్యవాదాలు ఎందుకు అన్న అనుమానం వచ్చే ఉండాలి. రాజు గారు జైల్లో రాజభోగాలనుభవిస్తూ బినామీ పేర్లతో ఉన్న వేల కోట్ల ఆస్తిని దాచడానికి, పంచడానికి ఎంతో కష్టపడుతున్నారు పాపం. మరి ఆయనకు ధన్యవాదాలు ఎందుకు? రాజుగారు చేసినదానివల్ల కొంత మంచి కూడా జరిగింది అనుకొనే వాళ్ళలో నేను ఒకడిని. జరిగిందేదో జరిగిపోయింది. "వెంట్రులన్నీ పోయి గుండు అయింది అని బాధపడేదానికంటే షాంపూ, పేలు, దువ్వెన బాధ తప్పింది అని ఆనందించాలి" అన్నారు శ్రీ సోదేశ్వర స్వాములవారు. మీరు కూడా ఆయన భక్తులయితే ఇది చదవండి.

కొందరి జీవన శైలి:
పాతికేళ్ళు దాటని కుర్రాడి జీతం పాతికవేలు దాటి ఉంటున్నది. కానీ నెలాఖరుకు చూస్తే బ్యాంకు బ్యాలెన్సు వందల్లో ఉంటుంది. బ్యాంకుల వాళ్ళు అడుక్కొని మరీ క్రెడిట్ కార్డులు అంటగట్టేవారు, వీళ్ళ చేతకానితనం బాగా తెలిసి. ఈ విషయంలో బ్యాంకు వారి తెలివితేటలను మెచ్చుకోవాలి. మనకు పెద్దగా తెలియని క్రెడిట్ కార్డులను పరిచయం చేసి, అలవాటు చేసి డబ్బు అవసరం లేని వాళ్ళు సంపాదించిన డబ్బంతా లాక్కున్నారు. అలా లాక్కోకపోతే పాపం ఆ డబ్బు ఏ బీరువాలోనో మూలిగేది!! వీకెండ్ వస్తే పబ్‌లు డిస్కోథెక్‌లు, ఐమాక్స్ వెళ్ళడానికే సరిపోతుంది. 2-3 వేల రూపాయల షర్ట్, గర్ల్ ఫ్రెండ్, బోయ్ ఫ్రెండ్ లతో షికార్లకు వేలకు వేల రూపాయలు ఖర్చు చేసేవారు. భూమికి పడి అడుగుల ఎత్తులో నడిచినా పర్లేదు కానీ పాతిక అడుగుల ఎత్తులో నడిస్తే చాలా ప్రమాదం.

ఆనకట్ట కట్టి నీటిని ఆపి కాలువలద్వారా సరఫరా చేసినపుడే నీటికి విలువ, సరి అయిన ప్రయోజనం చేకూరుతాయి. ఆనకట్ట లేకుంటే, నీళ్ళు అడ్డు అదుపులేకుండా ప్రవహించి కల్లోలం చేస్తాయి. గత ఆరేడు సంవత్సరాల్లో మన దేశానికి డబ్బు వరదలా వచ్చింది. రాజు గారు తిన్నదాన్ని పక్కన పెట్టినా సత్యం ఉద్యోగులకు నెలకు సరాసరిన వందల కోట్లు జీతాలు చెల్లించారు. మిగతా కంపెనీల జీతాలు కలిపితే అధమపక్షాన నెలకు ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లింపులు జరుగుతున్నాయి. అంటే గత ఐదారేళ్ళలో కొన్ని లక్షల కోట్లు వచ్చి పడ్డాయి. కేవలం కొద్దిశాతం ఉన్న IT ఉద్యోగుల వల్ల లక్షల కోట్లు రావడం, చేతులు మారడం వల్ల ఏమయిందో తెలిసిందే. రియల్ ఎస్టేట్ ఉప్పెన, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం 12 శాతానికి చేరడం జరిగాయి. ఇది ఇలాగే జరిగి అప్పులు చేసి ఇళ్ళు, కార్లు కొని, విలాసవంతమయిన జీవితానికి అలవాటుపడితే అమెరికాలో అయిన విధంగా మరో పదేళ్ళకు మన దేశంలో కూడా దివాలాలు ప్రకటించేవారు.

అగ్నికి వాయువు తోడయినట్లు ఆర్థికమాంద్యానికి రాజుగారు తోడయ్యారు. రాజు గారి పుణ్యమా అని కేవలం సత్యంలో పని చేసే వుద్యోగులే కాక వేరే కంపెనీల్లో పనిచేసే వారిలో కూడా, అంటే ప్రత్యక్షంగా వేలమందిలో పరోక్షంగా లక్షల మందిలో వణుకు మొదలయింది. ఇపుడు వాడి ఉద్యోగానికి ఎసరు, మరి రేపు నాకు జరిగితే? అన్న భయాలు/నిజాలు కనిపిస్తున్నాయి.

ఇప్పుడు పబ్‌లో తాగేవాళ్ళు, డిస్కోల్లో తందనాలాడేవాళ్ళు తగ్గిపోయారు మన సిటీల్లో. ఫైవ్ స్టార్ హోటల్‌లో పూటకు నాలుగైదు వందలు పెట్టి తినకుండా మామూలు హోటళ్ళవైపు దారిమళ్ళారు. మాల్స్ లో మూడు-నాలు వేల రూపాయల బట్టలు దిగులు మొహాలేసుకుని చూస్తుండగా వెయ్యి రూపాయల లోపు బట్టలే ఎక్కువ అమ్ముడు పోతున్నాయట ! కనీస భవిష్యత్ ప్రణాళిక లేకుండా కార్లు, అపార్ట్మెంట్‌లు కొన్న వారు నెల నెలా EMI కట్టడానికే భయపడుతున్నారు. ఇది మన వ్యవస్థకు శుభసూచకం. జరుగుతున్నది చూస్తున్న యువత జాగ్రత్తగా భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోనే అవకాశం వద్దన్నా వచ్చింది. అపుడే అడ్డదిడ్డంగా కాకుండా క్రమ పద్దతిలో ఆర్థిక, సామాజిక పురోగతి సాధ్యం.

ఈ మార్పుకు కాస్తో కూస్తో దోహదం చేసిన రాజు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలిగా మరి.

భారతీయులు సిగ్గుపడాలి

Posted by జీడిపప్పు

మొన్న మంగళూర్‌లో జరిగిన సంఘటన చూసి ప్రతి భారతీయుడు సిగ్గుతో తల దించుకోవాలి.
పబ్ లో పార్టీ చేసుకుంటున్న అమ్మాయిల పైన దాడి జరగడం అత్యంత శోచనీయం. అందుకు రామ సేన చెప్పిన కారణం:

Sudhir, district convener of Sri Rama Sene says "there is lot of upheaval in the society, alcoholism, pub culture, meaningless partying, obscene dancing which includes soft pornographic positions and open caressing and kissing has become common among the youth. Such open show of lust is not our culture".


మనది స్వతంత్ర్య దేశం. ఎవరయినా తనకు నచ్చినది చేసుకోవచ్చు, అది చట్టాన్ని ఉల్లఘించనంతవరకు. అలాంటప్పుడు ఈ అమ్మాయిలు చేసిన తప్పేమిటి? అమ్మాయిలు మందు తాగుతుంటే ఆ మందు అమ్ముతున్న బార్ పైన దాడి చేయాలి. అమ్మాయిలు తాగిన మైకంలో అశ్లీలంగా నృత్యాలు చేస్తుంటే ఆ నృత్యాలు చూస్తున్న వారిని కొట్టాలి. అంతేగానీ అన్నెం పున్నెం ఎరుగని అమ్మాయిల పైన దాడులు చేసిన వీళ్ళు మగాళ్ళా లేక .... ?

పేరుకు స్వాతంత్ర్యం వచ్చిందే కానీ, ఆడదానికి వచ్చిందా? ఆడవాళ్ళు సిగరెట్లు తాగకూడదు, మందు కొట్టకూడదు, రెచ్చకొట్టే విధంగా బట్టలు వేసుకోకూడదు. వొళ్ళు కనిపించేలా ఒకమ్మాయి బట్టలు వేసుకొని వెళ్తుంటే వెంట పడి ఏడ్పించడం, పబ్లిక్ ప్లేసుల్లో అశ్లీలంగా ప్రవర్తిస్తుంటే వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చెయ్యడం. పబ్‌కు వెళ్ళి తాగిన ఎంత మంది అమ్మాయిలు ధైర్యంగా ఇంటికి రాగలరు? ఇది మన భారతం, మన స్వాతంత్ర్యం

మొన్న జరిగిన సంఘటనను సమర్థిస్తున్న వారి మాటలు చూస్తే జాలి వేస్తుంది.

Whatever has happend is sad. But, I must tell each one of you NRI mangloreans that this was something that Mangalore needs at this point of time. The girls here are just loosing their track and doing all things that you would not like your wife, sister, mother doing!! Wearing revealing clothes, smoking, getting drunk, falling over guys. These girls are the once inviting trouble. If you happend to visit these so called happening places you would agree with me. Atleast now the gals will be carefull and you parents out there will know what your daughters, sisters are actually upto!! If this incident will change the scene that is going around in my kudla, then am happy for it!!


ఎక్కడ బ్రతుకుతున్నారు వీళ్ళు? రాతి యుగంలోనా?
ఇప్పటికయినా ప్రభుత్వాలు కళ్ళు తెరచి చట్టలు తీసుకురావాలి. దోషుల పైన రేప్ కేస్ పెట్టి నాన్-బెయిలబుల్ అరెస్టు చేయాలి. లేకుంటే పబ్‌లకు వెళ్ళాలంటేనే అమ్మాయిలు భయపడతారు.