ఆంధ్రులు సిగ్గుపడాలి

Posted by జీడిపప్పు

ఇప్పటికే బ్లాగుల్లో చాలా మంది సిగ్గు పడిపోతున్నారు, అలాంటి పోస్టులు కుప్పలు తెప్పలుగా పడుతున్నాయి. ఆల్రెడీ "భారతీయులు సిగ్గుపడాలి" అని ఒక పోస్టు వేసి మళ్ళీ ఈ "ఆంధ్రులు సిగ్గుపడాలి" అనే పోస్టు ఎందుకు అని నా పైన కోపగించుకోకండి. అందరూ రాళ్ళు వేస్తున్నపుడు మనమూ రెండు రాళ్ళు వేసేస్తే ఓ పని అయిపోతుంది. పైగా సిగ్గు పడాలనుకొనే వాళ్ళు ఇంకోసారి సిగ్గుతో మొగ్గలవడానికి, సారీ, సిగ్గుతో తల దించుకోవడానికి మరో అవకాశం కలిపించాలన్న సత్సంకల్పంతో శ్రీ సోదేశ్వర స్వాముల వారి ఆశీర్వాదంతో ఈ పోస్టు వేస్తున్నాను.

మొన్ననే పబ్ లలో తాగి తందనాలాడుతూ అశ్లీల నృత్యాలు చేస్తున్న అమ్మాయిల పైన దాడి జరిగింది. ఇది అత్యంత హేయనీయం. భారతదేశ చరిత్రలో కాంస్యాక్షరాలతో లిఖించతగ్గ దారుణం.అయినప్పటికీ కొందరు ఆ దాడిని సమర్థిస్తున్నారు, మన బ్లాగుల్లో కూడా. అయ్యలారా/అమ్మలారా, దాడి ముమ్మాటికి తప్పు. దీనికి "మరో వైపు" లేదు. కేవలం ఒక్క వైపు మాత్రమే ఉంది. దాడిని సమర్థించే ముందు "ఆ స్థితిలో మన వాళ్ళు ఉంటే" అని ఆలోచించండి.

మీ కూతురో లేదా చెల్లెలో క్లీవేజ్ కనిపించేలా టాప్ వేసుకొని, మోకాళ్ళ పైకి స్కర్టు వేసుకొని బయట వెళ్తుంటే తిడతారా, లేక కొడతారా? " తప్పేముంది నా కూతురు అలా వెళ్తుంటే?? వెళ్ళిరామ్మా" అని చెప్తారు కదా. మరి దాడిని "మరో కోణంలో" ఎందుకు సమర్థిస్తున్నారు.

మీ కూతురో లేదా చెల్లెలో తాగి అశ్లీలంగా నృత్యం చేస్తున్న దృశ్యం మీ కంటబడితే తిడతారా, లేక కొడతారా? "చాలా బాగా ఊపుతున్నావమ్మా" అని మెచ్చుకుంటారు కదా? మరి దాడిని "మరో కోణంలో" ఎందుకు సమర్థిస్తున్నారు?

మీ కూతురో లేదా చెల్లెలో తాగిన మత్తులో బోయ్ ఫ్రెండ్ ఇచ్చిన డ్రగ్స్ మత్తులో కాలు జారి కడుపు చేయించుకుంటే , లేదా పిమ్మట అబార్షన్ చేయించుకుంటే తిడతారా, లేక కొడతారా? "నీకు పెళ్ళి కాకముందే నేను ఆడుకోవడానికి బిడ్డనిచ్చావు తల్లీ" అనో "ఏమీ కాదమ్మా అబార్షన్ చాలా సింపుల్" అని చెప్తారు కదా. మరి దాడిని "మరో కోణంలో" ఎందుకు సమర్థిస్తున్నారు?

ఇప్పటికయినా కళ్ళు తెరవండి మహాశయులారా.

ఇక ఆంధ్రులు సిగ్గుపడాలి అన్న సంగతికొద్దాము:

నిన్నటికి నిన్న హైదరాబాదులో ఒకమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసారట http://thatstelugu.oneindia.in/news/2009/01/29/college-student-gang-rapped-290109.html

పరిచయం చేసుకొని ఆ అమ్మాయిని పబ్‌లకు రిసార్టులకు తీసుకెళ్ళారు. తర్వాత ఎక్కడికో రమ్మన్నారు, ఈ అమ్మాయి వెళ్ళిన తర్వాత డ్రింక్స్ తాగించి రేప్ చేసారు. ఎంత దారుణం. ఈ అమ్మాయి ముక్కూ మొహం తెలియని వాళ్ళతో పబ్‌లకు రిసార్టులకు వెళ్తున్న సంగతి తెలిసినపుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు "నా కూతురు ఎంత ఎదిగింది" అని మురిసిపోయారో ఆలోచించండి. ఆ రాత్రి వాళ్ళు "ఎక్కడికో" రమ్మని పిలిచినపుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు "జాగర్తగా వెళ్ళిరామ్మా వాళ్ళు పిలిచిన చోటికి" అని సాగనంపారు. కానీ ఈ దుర్మార్గులు ఆ అమ్మాయిని రేప్ చేసారు. ఆ తల్లిదండ్రులు ఎంత క్షోభ పడ్డారో ఆలోచించండి.

తమ కూతురితో పై పైన టిఫిన్లు మాత్రమే చేస్తారు అన్న నమ్మకంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు పబ్‌లకు, రిసార్టులకు పంపితే - వారినమ్మకాన్ని వమ్ముచేసి టిఫిన్లతో సరిపెట్టుకోకుండా రేపు, ఎల్లుండి చేయడం ఖండనార్హం మరియు గర్హనీయం. ఇలా చేస్తే ఎంత మంది తల్లిదండ్రులు తమ కూతుళ్ళను లేదా ఎంతమంది అన్నలు తమ చెల్లెళ్ళను ధైర్యంగా బార్లకు, రిసార్టులకు పంపగలరు? మన రాష్టంలో జరిగిన ఈ సంఘటన చూసి ఆంధ్రులు - ముఖ్యంగా వరంగల్, మహబూబ్‌నగర్, గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు వాసులు సిగ్గుతో తల దించుకోవాలి, 21 రోజులు తల వంచుకొనే నడవాలి.

10 comments:

 1. mmkodihalli said...

  21 రోజులే ఎందుకు గురువా? ఆ తర్వాత మరచిపోతామనా?

 2. లక్ష్మి said...

  Adaragottesaru kadaa.... nijame tagullani, tirugullani samrdhinchevaallani mundu veli veyali, lekapote veella panikimalina sidhantalato janalani chedagodataru. Good one!!!

 3. శ్రీనివాస్ పప్పు said...

  కేక..దాంతో పాటు ఒక పెద్ద విజిల్..
  మరి మిగతా జిల్లాల వాళ్ళకి తలదించుకోడానికి అర్హత లేదా అధ్యక్షా అని సభాముఖంగా అడుగుతున్నా?

 4. సత్యసాయి కొవ్వలి Satyasai said...

  కేక ... కాదు ...గగ్గోలు. ఎందుకు దించుకోవాలో అర్ధం కాలేదు. అయినా నేనాల్రెడీ తలదించుకోవడం మొదలెట్టా.కానీ మీరు ఇంటలెక్టువల్ కారుగా .. మీకు తలదించుకోమని చెప్పే హక్కుందా? :)))

 5. నేస్తం said...

  :)) mari blaagarulandaru eppudu siggupadadaam :P

 6. చైతన్య.ఎస్ said...

  21 రోజులు సిగ్గుదినాలా(సంతాపదినాలులాగా)

  శ్రీనివాస్ పప్పు గారు :)

 7. krishna rao jallipalli said...

  ఏమి... మిగత జిల్లాల్లో ఉన్నా తల్లితండ్రులు, అన్నయ్యలు, అక్కయ్యలు, మనుషులు మీ దృష్టిలో అంత పత్తిత్తులా ?? ఇలా ప్రతీ దానికి సిగ్గుపడుతూ కూర్చుంటే... అయినా ఎవడో లంజా కొడుకు ఏదో చేసాడని మిగతా వారందరూ ఎందుకు సిగ్గుపడాలి. ఏమి. మనందరికీ వేరే పని పాటా లేవా. సిగ్గు పడితే గిడితే ఆ వ్యక్తుల సంబందికులు మాత్రమె పడాలి.

 8. జీడిపప్పు said...

  @laxmi గారు, @నేస్తం గారు, - ధన్యవాదాలు
  @కోడీహళ్ళి మురళీ మోహన్ గారు , @చైతన్య గారు - హ హ.. ఇదేదో బాగుంది. ఇకనుండి సంతాపదినాలుగా సిగ్గు దినాలు. మన బ్లాగర్లకు సిగ్గులే సిగ్గులు :)
  @శ్రీనివాస్ పప్పు గారు - ఏమి చెప్పాలో తెలియడం లేదు మేష్టారు!
  @సత్యసాయి కొవ్వలి గారు - నేనూ బ్లాగుల్లో చేరాను, ఓ ఇంటలెక్టువల్ అవుతాను ;)
  @ krishna rao jallipalli గారు - మిగతా జిల్లా వాళ్ళు కూడా భేషుగ్గా సిగ్గు పడవచ్చు. ఇంకోసారి పోస్టు చూడండి :)
  ఇక మీరు వాడిన బూతు గురించి - దయ చేసి మన బ్లాగుల్లో బూతులు వాడకండి. నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే, కొద్ది సంవత్సరాలక్రితం క్రితం నేను పది మాటలున్న వాక్యం మాట్లాడితే అందులో ఐదారు బండ బూతులు ఉండేవి. ఒకసారి జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్‌లో పక్క వూరి వాడు నాతో ఆడుతూ చెక్ పెట్టాడు. "మా వూళ్ళో చెస్ ఆడుతూ నాకే చెక్ పెడతావట్రా ... ... .. " అని బండ బూతులు తిట్టాను. తర్వాత తెలిసింది వాడికి చాలా బ్యాక్ గ్రౌండ్ ఉంది అని. వాడు కాపు కాసి నా మక్కెలిరగిదన్ని మురిక్కాలువలో పడవేశాడు. అప్పటినుండి బూతులు చూస్తే అది గుర్తు వచ్చి కోపం, బాధ కలుగుతాయి. కాబట్టి దయ చేసి బూతులు వాడకండి. ఆ విధంగా మనమందరం ముందుకు పోదాము.

 9. krishna rao jallipalli said...

  నేను మీలా (కొన్ని సంవత్సరాల క్రితం వాడినట్లు) బండ బూతులు వాడను. కనుక నాకు ఏ ప్రమాదమూ ఎవరినుండి రాదు. అదికాక... నేను తప్పు, నేరం చేసిన వారి మీద మాత్రమె వాడతాను. అంతే కాని.. సరదాకి, అనవసరంగా బూతులు వాడలేదు, తన్నులు తినలేదు.
  నాకు చాలా కోపం వస్తుంది... మీరు తన్నులు తిన్నారు కాబట్టి కోపం రావడం సహజం. anyway... మీ experience ని మనసులో పెట్టుకొని అవసరమైన చోటే వాడతాను. సరేనా..

 10. జీడిపప్పు said...

  సహృదయంతో అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు!

Post a Comment