శెలవు తీసుకున్న సింహం
Posted by జీడిపప్పు
టెడ్ కెన్నెడీ, జాన్ ఎఫ్. కెన్నెడీ, రాబర్ట్ కెన్నెడీ
JFK చెప్పిన America is a nation of immigrants అన్న మాటలను గుర్తించుకొని తన ఆఫీసులో తన పూర్వీకుల స్వస్థలం ఫోటో పెట్టుకున్న టెడ్ కెన్నెడీ ఇమ్మిగ్రేషన్ చట్టాలను సవరించి వలస వచ్చే వారికి సమాన సౌకర్యాలు కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించాడు. తన పెద్ద అక్క రోజ్‌మేరీ మానసికంగా ఎదగక జీవితాంతం కుటుంబానికి దూరంగా ఉండవలసి రావడం చూసిన టెడ్ ఆ తర్వాత మూడో అక్క యునీస్ కెన్నెడీతో (ఈమె రెండువారాల క్రితం మరణించింది) కలసి మానసిక, శారీరక వికలాంగులకోసం ఎన్నో సంస్కరణలు చేసాడు. ప్రపంచ వికలాంగుల ఒలింపిక్స్ అందులో ప్రముఖమయినది. ఈ రోజు అమెరికాలో దాదాపు ప్రతికుటుంబంలో ఎవరో ఒకరు టెడ్ కెన్నెడీ కృషి వల్ల minimum wage, education reforms, health care రంగాల్లో లబ్ది పొందుతున్నారు.
జాన్ ఎఫ్ కెన్నెడీ మేధావితనాన్ని, రాబర్ట్ కెన్నెడీ ఆచరణను పుణికిపుచ్చుకున్న టెడ్ సభలో మాట్లాడే తీరువల్ల Lion of the senate అని పేరు తెచ్చుకున్నాడు. తన "జీవిత లక్ష్యం" గా టెడ్ కెన్నెడీ చెప్పుకొనే Universal health care అమలు కాకముందే 77 ఏళ్ళ వయసులో బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడలేక ఆగస్టు 25 న నిష్క్రమించి Arlington National Cemeteryలో తన అన్నలిద్దరి దగ్గర శాశ్వత విశ్రాంతి కోసం సిద్దమవుతున్నాడు.
టెడ్ కెన్నెడీ ఫోటో గ్యాలరీ
మెడికల్ మాఫియా
Posted by జీడిపప్పు
కొంత కాలానికి అర్థమయినదేమిటంటే, అమెరికాలో కూడా అవినీతి ఉంది. కాకపోతే ఇండియాలో సగటు మనిషిముందు చెయ్యి చాపి "నాకేంటి? అహా నాకేంటని" అంటారు. అమెరికాలో అలా కాకుండా అంతా సైలెంటుగా భారీ ఎత్తున జరిగిపోతుంది. సామాన్య పౌరులు లంచం ఇవ్వవలసిన పరిస్థితి ఎప్పుడూ రాదు. మనవాళ్ళలా పాతికకో పరకకో కాకుండా అమెరికన్ అవినీతిపరులు కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు వీలయినంతవరకు మేడాఫ్ తరహాలో బిలియన్లకు లేదా మిలియన్లకు గురిపెడతారు. ఇండియాలో పదిమంది అవినీతిపరులు ఉంటే అమెరికాలో ఒకరిద్దరు ఉంటారు అంతే. అయితే ఈ ఒకరిద్దరి అవినీతి స్థాయి, క్రూరత్వం ముందు ఆ పదిమంది దిగదుడుపే అనిపిస్తుంది నాకు. వీళ్ళు ఎంత తెలివిగా అవినీతి చేస్తారో, ఏ స్థాయిలో చేస్తారో తెలుసుకోవడానికొక ఉదాహరణ:
ఈ రోజు మెడికల్ మాఫియా అన్న హెడ్డింగ్ చూడగానే "ఎవడో డాక్టరు ఇన్సూరెన్స్ ఏజంటుతో కలసి మోసం చేస్తున్నాడు" అనుకొని చదువుతుంటే మతిపోయింది. ఒకామెకు చిన్న కారు యాక్సిడెంటువల్ల వెన్నునొప్పి రావడంతో తెలిసిన ఫ్రెండుకు చెప్పింది "లీగల్ గా వెళ్తే ఇన్సూరెన్స్ కవర్ చేయదు కాబట్టి ఏదయినా సలహా కావాల"ని. కాసేపటికి ఇంకో వ్యక్తి ఫోన్ చేసి ఏమీ భయపడనవసరం లేదు, అన్నీ మేము చూసుకుంటాము. కాకపోతే ఫలనా వ్యక్తి సాయం చేసాడని ఎవరికీ చెప్పకు" అని కారును గుద్దినవాడి వివరాలు తీసుకున్నాడు.
ఆరువారాలపాటు నగరంలోని పెద్ద పెద్ద డాక్టర్లు ఆమెకు వైద్యం చేసారు. పెద్ద లాయరు వచ్చి వివరాలు తెలుసుకున్నాడు. వీటన్నిటికీ ఆమె ఒక్క సెంటు కూడా చెల్లించలేదు! ఆమె వైద్యానికి అయిన బిల్లు అంటూ ఆమె కారును గుద్దినవాడికి $200,000 బిల్లు పంపించారు. అసలు కథ అప్పుడే మొదలయింది.
ఆమె కారును గుద్దినది సాధారణ వ్యక్తి కాదు, ఒక ఫెడరల్ ప్రాసిక్యూటర్! ఒక చిన్న యాక్సిడెంటుకు అంతమంది డాక్టర్లు, అన్ని బిల్లులా అని అనుమానమొచ్చి FBI సహాయంతో తీగలాగాడు. సంగతేమిటంతే ట్రీట్‌మెంట్ ఇచ్చే డాక్టర్లు, వాదించే లాయర్లు, అవుననే పోలీసాఫీసర్లు, తీర్పునిచ్చే జడ్జీలు, డబ్బులు ఇచ్చే ఏజంట్లూ అందరూ ముఠాగా ఏర్పడి వందల మిలియన్ల డాలర్లను దాదాపు ఎవరూ కనిపెట్టలేని సహజమార్గాల్లో దోచుకుంటున్నారు! అసలు విషయం బయటపడ్డ తర్వాత చట్టంలోని లొసుగులవల్ల, పేరుకుపోయిన అవినీతివల్ల కొందరు తప్పించుకొని హాయిగా రాజభోగాలు అనుభవిస్తున్నారు.
బయటపడని ఇలాంటి మాఫియా కథలు దాదాపు ప్రతిరంగంలో ఉంటాయి. కాకపోతే మిగతా అన్ని రంగాల్లో జరిగే అవినీతి కంటే వైద్యరంగంలో జరిగే అవినీతి ఎన్నో రెట్లు ఎక్కువ. అమెరికాలో ఏడాదికి సగటున 80 బిలియన్ డాలర్ల అవినీతి ఒక్క వైద్యరంగంలోనే జరుగుతుందట! మందుల కంపెనీలు, ఆస్పత్రులు చేసే ఘోరాలకయితే అంతే ఉండదు. అనవసరమయిన బిల్లులు వేసి సగటు కుటుంబాన్ని నిమిషాల్లో బజారుపాలు చేయడానికి దాదాపు అన్ని కంపెనీలు తహతహలాడుతుంటాయి. బాధాకరమయిన విషయం ఏమిటంటే ఇప్పుడిపుడే కార్పొరేట్ వైద్యం విజృంభిస్తున్న ఇండియాలో కూడా ఈ "మెడికల్ మాఫియా" తన ఉనికిని చాటుకుంటున్నది. భవిష్యత్తులో ఇదొక పెద్ద భూతమవడం ఖాయం!
బెగ్గర్ ఖాన్‌కు అమెరికాలో అవమానం!!
Posted by జీడిపప్పు
నిజంగా అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు భారతీయుల పట్ల వివక్ష చూపిస్తున్నారా అంటే ముమ్మాటికీ కాదు అన్నదే సమాధానం. తానా నుండి తందానా సభలవరకు ప్రతిఏడాది ఎందరో తెలుగు సెలెబ్రిటీలు వస్తున్నారు. షారూఖ్ ఖాన్ కంటే ఎంతో గొప్పవాళ్ళు ఎందరో ఎన్నోసార్లు అమెరికాకు వచ్చాడు. వీళ్ళెవరూ ఎన్నడూ "మమ్మల్ని అవమానించారు" అని గగ్గోలు పెట్టలేదు ఎందుకు? మరి వీరు భారతీయులు కారా? వీరెవరిలో కనపడని భారతీయత వీడొక్కడిలోనే కనపడిందా ఇమ్మిగ్రేషన్ అధికారులకు?
అసలు జరిగినదేమిటో చూద్దాం. ఇమ్మిగ్రేషన్ అధికారులు డాక్యుమెంట్లు స్కాన్ చేసినపుడు "ఖాన్" అన్న పేరు హైలైట్ అయింది. అందులో తప్పేముంది? సెక్యూరిటీ కారణాలవల్ల రాసిన ప్రోగ్రాం ప్రకారం అలా హైలైట్ అయిన వారిని పక్కకు తీసుకెళ్ళి నిశితంగా పరిశీలించాలి. రూల్స్ ప్రకారం వీడిని పక్కకు పిలుచుకెళ్ళి అన్ని వివరాలు అడిగారు. ఎంతయినా కాస్త "హైలైట్" అయిన పేరు కాబట్టి ఒకరికి ముగ్గురు అధికారులు ఒక గంటసేపు అన్నీ నిర్దారించుకొని పంపించారు. ఇందులో ఎక్కడా అవమానమో లేదా అహంకారమో లేదే. కేవలం వాళ్ళ డ్యూటీ చేసారు, అదీ వాళ్ళకున్న రూల్స్ ప్రకారం.
తానేదో పెద్ద కింగ్ అని భ్రమపడే షారూఖ్ ఖాన్ ఇదే పబ్లిసిటీకి అదను అని చిల్లర స్టేట్మెంట్స్ ఇచ్చాడు. వీడు ఇండియాలో పెద్ద సూపర్‌స్టార్ కావచ్చు కానీ అమెరికాలో ఇమ్మిగ్రేషన్ అధికారి ముందు ఒక కోన్ కిస్కా గొట్టం గాడే. వీడేమయినా ఒక ప్రభుత్వాధికార హోదాలో ఒక ప్రత్యేక విమానంలో వచ్చాడా అంటే అదీ లేదు. నాలోంటోడు వచ్చే విమానంలో వచ్చి నాలాంటోడిముందు ఇమ్మిగ్రేషన్ లైన్లో నిలబడ్డాడు. నాకు తెలుసు వీడొక సో-కాల్డ్ ఇండియా ఐకాన్ అని, ఇమ్మిగ్రేషన్ అధికారికి ఎలా తెలుస్తుంది? తెలుసుకున్నా ఎందుకు నమ్మాలి వీడిని? ఎంతమంది బాలీవుడ్ హీరోలు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోలేదు?
సరే, నేనంటే ఏదో అమెరికా నీళ్ళు తాగుతున్నాననో లేక భవిష్యత్తులో అమెరికా సెనేటరో, గవర్నరో కావాలనో అమెరికాను సమర్థిస్తున్నా అనుకొని నా మాటలు పక్కన పెడదాము. బ్లాగుల్లో వ్రాసిన 1, 2, 3, 4 లాంటి ఆలోచింపదగ్గ చక్కని పోస్టులను కూడా పక్కన పెడదాము. మిడిమిడి జ్ఞానం తో అమెరికా అంటే ముందు వెనక ఆలోచించని మూర్ఖుడిలా నేను కూడా "అవునవును, న్యూజెర్సీలో భారతజాతి గౌరవానికి అవమానం జరిగింది" అన్నానే అనుకుందాము.
మరి అంతగా అవమానింపబడ్డ భారతజాతి గౌరవం వెంటనే "ఇది నాకు అవమానం. ఇక నేను మీ దేశానికి మళ్ళీ రాను. నా సినిమాలను మీ దేశంలో ఆడనివ్వను" అని వెంటనే ఇండియాకు వచ్చేసిందా లేక అవమానం జరిగిన అదే దేశంలో స్టేజీల పైన కుప్పిగంతులేస్తున్నదా డాలర్లకోసం? ఇంతకూ బెగ్గర్ ఖాన్‌కు తనకు జరిగిన అవమానం ముఖ్యమా లేక అభిమానుల అభిమానం ముఖ్యమా లేక రాబోవు సినిమాకు వాళ్ళు రాల్చే చిల్లర డాలర్లు ముఖ్యమా?
స్టుపిడ్ ఒబామా - జీనియస్ ఒబామా
Posted by జీడిపప్పు
గతవారం మస్సాచూస్సెట్స్ లో కేంబ్రిడ్జ్ దగ్గర ఒక ఇంటి తలుపులను ఇద్దరు గట్టిగా నెట్టడం చూసిన ఒకావిడ వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. సంగతేమిటంటే, ముఖద్వారంలో ఆ తలుపు సరిగా పనిచేయకపోవడంతో వెనకనుండి ఇంట్లోకి వచ్చి ఇంటి ఓనరు అయిన హెన్రీ గేట్స్ అనే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసరు తన డ్రైవరుతో కలసి దాన్ని నెట్టడం మొదలుపెట్టాడు. ఆమె ఫోన్ చేసిన వెంటనే పోలీసులు వచ్చి ప్రొఫెసరును బయట రమ్మన్నపుడు ఈ తలతిక్క ప్రొఫెసరు "నేను ఎందుకురావాలి, నల్లవాడిని కాబట్టి రావాలా? I'll speak with your mama (mother) outside" అంటూ పోలీసులు అడిగినవి చూపించకుండా గొడవకు దిగాడు. విధిలేని పరిస్థితుల్లో పోలీసులు ప్రొఫెసరును అరెస్టు చేసి నాలుగ్గంటలు జైల్లో పెట్టి విడుదల చేసారు.
బయటకు వచ్చాక వీడు కల్లు తాగిన కోతిలా "ఇది నల్లజాతి వాళ్ళ పట్ల వివక్ష" అంటూ చిందులేసి నానా హంగామా చేసాడు. ఈ సువర్ణావకాశాన్ని మీడియా బాగా ఉపయోగించుకొని వీడితో ఇంటర్వ్యూలు మొదలుపెట్టింది. నల్లజాతీయులకు అవమానం జరుగుతున్నదా అంటూ లేనిపోని విద్వేషాలను రెచ్చకొట్టడం మొదలుపెట్టింది. అరెస్టు చేసిన ఆఫీసరు జేమ్స్ తనకు క్షమాపణ చెప్పాలని వీడు చానెళ్ళలో గొడవ చేయడం మొదలుపెట్టాడు. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఆఫీసర్ జేమ్స్ "తన డ్యూటీ తాను చేసాను ఏ తప్పూ చేయలేదు కాబట్టి క్షమాపణ చెప్పను" అన్నాడు.
ఇక్కడి వరకు మామూలుగా సాగుతున్న ఈ వివాదం ఒబామా ప్రవేశంతో ఇంకా రాజుకుంది. అమెరికా చరిత్రలో అత్యంత కీలక నిర్ణయమయిన హెల్త్ కేర్ గురించి సుమారు 52 నిమిషాలు అద్భుతంగా మాట్లాడిన ఒబామా, చివరి ఒక్క నిమిషంలో ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు మన సీయంలా "చట్టం తనపని తాను చేసుకుపోతుంది" అనడానికి బదులు "ఆ ప్రొఫెసరు నా ఫ్రెండ్ కూడా. నాకు పూర్తి వివరాలు తెలియదు కానీ Cambridge police acted stupidly " అన్నాడు. (ఒబామాను ఆ మాట అనకుండా ఆపడానికి జాన్ స్టీవర్ట్ చేసిన ప్రయత్నం @ 4:30)
ఇహ చూడాలి మీడియా మాయాజాలం! ఒబామా మాటలను మీడియా మాఫియా ఊదరగొట్టిన పుణ్యమా అని సామాన్య ప్రజలు మరుసటిరోజుకు "హెల్త్ కేరా? అంటే ఏంటి?" అనే స్థితికి వచ్చారు. నేను అప్పటివరకు పబ్లిక్ ప్లేసుల్లో ఇద్దరు అమెరికన్లు ఒక సామాజిక విషయం గురించి మాట్లాడుకోవడం వినలేదు కానీ మొదటిసారి ఒక స్టోర్లో ఇద్దరు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఒబామా అలా అనకూడదు అన్నారు. అంతగా ప్రభావం చూపించింది ఒబామా స్టుపిడిటీ. చాలామంది విద్యావంతులయిన నల్లజాతీయులు కూడా ఒబామా తప్పు చేసాడన్నారు.
మరోవైపు దేశవ్యాప్తంగా పోలీసుల్లో అసంతృప్తి వ్యక్తమయింది. ఈ లోపు పోలీసులు అసలు జరిగినదేమిటో వివరించారు. పోలీసు తప్పు చేయలేదు అని గ్రహించిన ఒబామా ఆ పోలీసు ఆఫీసరుకు ఫోన్ చేసి మాట్లాడాడు. చిన్నవిషయం అనుకోకుండా పెద్దదయి వివాదంగా మారడానికి తాను ప్రధాన కారణమయ్యానని అంగీకరించి, ఈ వివాదాన్ని పక్కనపెట్టి దేశ సమస్యల గురించి ఆలోచిద్దాము అని చెప్పి ఎందుకు తనను "జీనియస్" అంటారో నిరూపించుకున్నాడు. ఆ పోలీసు ఆఫీసరును, ప్రొఫెసరును వైట్‌హౌసుకు రమ్మని ఆహ్వానించాడు. ప్రస్తుతానికి వివాదం సమసినట్లే.
పి.ఎస్: చాలమందికిలాగే నాక్కూడా ఈ ప్రొఫెసరు చేసినదానికి వాడిని నాల్రోజులు జైల్లో పెడితే బాగుంటుంది అనిపిస్తున్నది.
మరో ధృవతార బాబీ కెన్నెడీ
Posted by జీడిపప్పు
కెన్నెడీ దంపతులకు ఏడవ సంతానమయిన బాబీ కెన్నెడీ బాల్యం ఆటపాటలతో గడిచిపోయింది. జాన్ కెన్నెడీకీ, బాబీ కెన్నెడీకి మధ్య ఎనిమిదేళ్ళ వ్యత్యాసం ఉండడంతో చిన్నపుడు ఇరువురిమధ్య ఎక్కువ చనువు ఉండేది కాదు. 1951 లో తన అన్నతో కలసి ఆరువారాలపాటు ఇజ్రాయిల్, ఇండియా మొదలయిన దేశాలను పర్యటించాడు. ఆ ఆరువారాల్లో అన్నదమ్ములమధ్య సాన్నిహిత్యం పెరిగింది. అమెరికాకు తిరిగివచ్చిన తర్వాత బాబీ తన భార్య పిల్లలతో కలసి వాషింగ్టన్‌కు వెళ్ళి అక్కడ లాయరు వృత్తి మొదలుపెట్టాడు. కొద్ది రోజులకు జాన్ కెన్నెడీ సెనేటర్ గా పోటీ చేస్తుంటే తన సోదరుడికి సహయంగా ఉండడానికి లాయరు వృత్తిని విడిచిపెట్టాడు. అప్పటినుండి చట్ట సభల్లో ఎన్నో పదవులు చేపట్టి పేరు తెచ్చుకొన్నాడు.
1960లో జాన్ ఎఫ్. కెన్నెడీ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసినపుడు బాబీ సర్వం తానై నడిపించాడు. ఎత్తులకు పైఎత్తులు వేసి ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టేవాడు. కాస్త మొండివాడయినా నమ్మకానికి మారుపేరుగా నిలిచి ప్రజల దగ్గర "అన్నకు తగ్గ తమ్ముడంటే జాన్ ఎఫ్. కెన్నెడీకి బాబీ కెన్నెడీలా ఉండాలి" అని ప్రశంసలు తెచ్చుకున్నాడు. జాన్ కెన్నెడీ ప్రెసిడెంట్ అయిన తర్వాత తన తమ్ముడిని అటార్నీ జనరల్ గా నియమించాడు. అమెరికా చరిత్రలో ఈనాటి వరకు ఏ అటార్నీ జనరల్‌కు లేని అధికారాలు బాబీ చేతికి వచ్చాయి.బాబీ కెన్నెడీ తీసుకొనే ప్రతి నిర్ణయాన్ని జాన్ కెన్నెడీలాంటి మేధావి మారుమాటాడక అంగీకరించేవాడు. చిన్నతనం నుండి విశాలభావాలుగల బాబీ నల్లజాతీయుల హక్కులకోసం ఎన్నో చట్టాలు తెచ్చాడు. వర్ణవివక్ష ఎక్కువ ఉన్న మిసిసిపీలో ఒక యూనివర్సిటీలో మొదటిసారి ఒక నల్లజాతీయుడయిన విద్యార్థి చేరుతున్న రోజు గొడవలను ఆపడానికి పెద్ద ఎత్తున సైన్యాన్ని మొహరింపచేసి తెల్లవారిని అదుపులో ఉంచి అమెరికాను నివ్వెరపోయేలా చేసాడు. మార్టిన్ లూథర్ కింగ్‌కు రక్షణ కల్పించి నల్లవారికి సమానహక్కులు ఉండాలని ప్రజల భావాలను మార్చే ప్రయత్నం చేసాడు.
60, 70లలో అమెరికాలో పాతుకుపొయి ఉన్న మాఫియాకు బాబీ సింహస్వప్నమయ్యాడు. మాఫియాను అదుపులోకి తెచ్చేందుకు చట్టాలను ప్రవేశపెట్టి అణిచివేయడం మొదలుపెట్టాడు. క్యూబా వివాదంలో రష్యాతో అణుయుద్దం దాదాపు ఖాయమయినా జరగకపోవడానికి కారణం జాన్-బాబీ కెన్నెడీల మంత్రాంగమే. అప్పటివరకు అధ్యక్షులను తమ చెప్పుచేతల్లో ఉంచుకొన్న CIA ఆటలు బాబీ ముందు సాగలేదు. CIA దురాగతాలకు అడ్డుకట్టవేయడానికి ప్రయత్నించిన జాన్ ఎఫ్ కెన్నెడీ 1963 లో CIA కుట్రవల్ల హత్య చేయబడ్డాడు.
తల్లిదండ్రులకంటే ఎక్కువ సాన్నిహిత్యం ఉన్న తన సోదరుడు హత్యకు గురికావడం బాబీని కలచివేసింది. కొద్దిరోజులు జీవితం పట్ల నిరాశ చెందినా, తమ ఇద్దరి ఆశయాలకోసం మళ్ళీ అధ్యక్ష పదవికి పోటీ చేసాడు. బాబీ అధ్యక్షుడయితే తమ ఆటలు సాగవని తెలుసుకున్న CIA, మాఫియా కలసి బాబీ కెన్నడీని కాలిఫోర్నియాలో హత్య చేయించాయి.
1968 జూన్ 6 న కేవలం 42 ఏళ్ళ వయసులో మరణించిన బాబీ కెన్నెడీ అన్యాయాన్ని అరికట్టి ప్రజల మేలు కోసం ఏదయినా చేయడానికి వెనుకాడని నాయకుడిగా, తనను నమ్మిన అన్న కోసం ప్రాణాలివ్వడానికి వెనుకాడని తమ్ముడిగా ఇప్పటికీ అందరి హృదయాల్లో ఉన్నాడు.
అమెరికాలో ఆంధ్రుల పైన దాడి
Posted by జీడిపప్పు
దాడులు తప్పు అన్నదానిలో అణుమాత్రమనుమానం లేదు కానీ, దానికి ప్రతిచర్యగా మనవాళ్ళు బిజీ రోడ్ల పైన బైఠాయింపులు, రాళ్ళు రువ్వడాలు చేయడం మాత్రం బాగలేదు. నేను ఆఫీసుకు వెళ్ళే దారిలో ఎవరయినా నిరసనలు చేస్తుంటే Who the #$&% are these morons delaying my meeting అనుకుంటాను. ఆస్ట్రేలియాలో మనవాళ్ళు చేస్తున్న చర్యలవల్ల మంచివాళ్ళకు కూడా కోపం వచ్చి వారిలో కూడా "వర్ణ" ఆలోచనలు మొదలవుతాయి. కాబట్టి ఇప్పటికయినా మనవాళ్ళు తమ పంథా మార్చుకొంటే మంచిది.
ఇక అమెరికా సంగతి కొస్తే - కొద్ది కాలం క్రితం మన తెలుగు మీడియావాళ్ళు "అమెరికాలో ఆంధ్రుల పైన దాడులు" అంటూ ఊదరగొట్టారు. దాడులు జరిగిన మాట నిజమే. మొన్నటికి మొన్న ఒక ఆంధ్ర విద్యార్థి పైన దాడి జరిగింది. ఆ వార్త మొత్తం చదివిన తర్వాత ఆ విద్యార్థి పట్ల నాకు కలిగిన అభిప్రాయం - What a mindless idiot. వినడానికి కటువుగా ఉన్నా ఇది నిజం. ఇలాంటి బుద్దిలేనివాళ్ళకు అలాంటి శాస్తే జరుగుతుంది మరి.
ఇలా ఎందుకంటున్నానంటే, కొన్నేళ్ళ క్రితం అమెరికాలో అడుగుపెట్టినపుడు సీనియర్లు కొన్ని సలహాలు ఇచ్చారు. అవి: చీకటి పడిన తర్వాత ఒంటరిగా తిరగవద్దు. ఎప్పుడూ జేబులో ఐదు-పది డాలర్లు ఉంచుకో. ఎవరయినా, ముఖ్యంగా నల్లజాతీయులు, ఎదురుపడితే సూటిగా వారి కళ్ళలోకి చూడకు. నల్లజాతీయుడు వచ్చి డబ్బు అడిగితే పటతటాయించకుండా నీ దగ్గర ఉన్న మొత్తం డబ్బు ఇచ్చేయి. పొరపాటున కూడా వారితో వాదనకు/పోట్లాటకు దిగకు.
సాధారణంగా ఈ నల్లజాతీయులు సిగరెట్లు/మందు/డ్రగ్స్ కోసం మనల్ని డబ్బు అడుగుతారు. మాటమాట్లాడకుండా వాలెట్ తీసి మొత్తం డబ్బు ఇచ్చేస్తే ఏమీ అనకుండా వెళ్ళిపోతారు. నేనయితే కొత్తగా వచ్చినవాళ్ళకు "నిన్ను అడిగితే వాలెట్ ఇచ్చెయ్యి" అని చెప్తాను. డబ్బు ఇచ్చిన తర్వాత కూడా గాయపరిచేవారు చాలా తక్కువ. (ఇప్పటివరకు నన్నెవరూ డబ్బు అడగలేదు. అడిగితే వాలెట్ ఇచ్చేస్తాను. ఇచ్చినా నన్ను గన్‌తో కాలిస్తే అపుడు చెప్తాను, నేను అనుకున్నది తప్పు అని!)
ఈ వివరాలు దాదాపు కొత్త విద్యార్థులందరికీ సీనియర్లు చెప్తారు. దాదాపు అందరూ పాటిస్తారు కానీ కొందరు తలతిక్క మనుషులు పాటించక ప్రాణాలపైకి కొనితెచ్చుకుంటారు. గత ఏడాది జరిగిన 10 హత్యలలో సుమారు ఏడెనిమిది ఇందువల్లే జరిగాయి. గత ఏడాది డాలస్‌లో ఒక దేశీ తన గర్ల్ ఫ్రెండ్ ముందు ఫోజు కొట్టాలని నల్లజాతీయుడికి ఎదురు తిరిగాడు. సీన్ కట్ చేస్తే డిక్కీలో (శవపేటికలో) తొంగున్నాడు.
ఇక తెలుగువాళ్ళ పైనే ఈ దాడులు ఎందుకు జరుతాయంటే తెలుగువాళ్ళ జనాభా అంత ఎక్కువ కాబట్టి. నేను స్కూల్లో ఉద్యోగం అడుక్కుంటున్నపుడు..err.. వెతుక్కుంటున్నపుడు చాలామంది అమెరికన్లు are you from Hyderabad? అన్నారు. కొన్ని స్కూళ్ళల్లో అయితే మాస్టర్స్ లో "(అన)అధికార భాషగా తెలుగు" ఉంటుంది! కాబట్టి అమెరికాలో ఎవరయినా విద్యార్థి పైన దాడి జరిగిన వార్త చూసి ఆ విద్యార్థి తెలుగు విద్యార్థి కాకపోతే ముక్కు తీసి వేలుపైన వేసుకుంటాము.
మీడియా ఏమో "అమెరికాలో ఆంధ్రుల హత్య" అని రాద్ధాంతం చేస్తుంది. వీళ్ళు అమెరికాలో ఒక సంస్థ తెలుగువాళ్ళను చంపడమే ధ్యేయంగా కార్యకలాపాలు సాగిస్తున్న రేంజ్‌లో హంగమా చేస్తారు,ఎప్పటిలాగే గోరంతలు కొండంతలు చేసి చెప్తారు. మొన్న మిసిసిపీలో జరిగిన సంఘటనలో ఆ విద్యార్థి చొక్కా కారు డోరుకు తగులుకొని ఉండగా 100 మీటర్లు లాక్కుని వెళ్ళినట్టు హిందూ పత్రికలో వస్తే, కిలోమీటరు లాక్కెళ్ళినట్టు ఈనాడులో వచ్చింది. ఒక బ్లాగరయితే ఏకంగా ఆ విద్యార్థి ఆత్మకు శాంతి కలగాలని కూడా ప్రార్థించాడు.. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో బ్రతికించేసాడు! ఇలా ఉంటాయి లీలలు.
అన్నట్టు నిన్న మెగాస్టార్ గారు "ప్రవాసాంధ్రుల రక్షణకొసం ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి" అన్నారు. అమెరికాలో సంపాదిస్తూ అమెరికా దేశానికి పన్ను కట్టే నా రక్షణకోసం ఒక శాఖనా??!!! అదీ నేను పైసా డబ్బు కట్టకుండా?! అలా అయితే ఢిల్లీదాకా ఏంటీ..ఢ ఢ ఢల్లాస్ దాకా దేక్కున్నా మనకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే నాకొచ్చిన సందేహమేమిటంటే, మెగాజోకర్ గారు ముఖ్యమంత్రి అయి ఒక శాఖను ఏర్పాటు చేసారే అనుకుందాము. అమెరికాలోని ఒక నగరంలో ఆంధ్రుని పైన దాడి జరుగుతుంటే మెగాజోకర్ గారు ఎలా రచ్చిస్తారబ్బా???
అమెరికాలో తెలుగు ఉద్యమం
Posted by జీడిపప్పు
శ్రీలంకలో తమిళులు తమ భాషకోసం జరుపుతున్న పోరాటాన్ని, వారికి తమ భాష పట్ల ఉన్న అభిమానాన్ని చూసి ప్రవాసాంధ్రుడిగా నాకు నిఝ్ఝంగానే తెలుగువాడిని అయినందుకు సిగ్గు వేసింది. నాకు తెలిసి ప్రతి తెలుగువాడూ శ్రీలంక తమిళులనుండి నేర్చుకోవలసింది ఎంతో ఉంది, ముఖ్యంగా ప్రవాసాంధ్రులు. అమెరికాలో ఉన్న భారతీయుల్లో ఎక్కువమంది తెలుగువారే. న్యూజెర్సీ, బే ఏరియా మొదలయిన ప్రాంతాల్లో తెలుగువారి జనాభా చాలా ఎక్కువ. ప్రతి ఇద్దరు భారతీయుల్లో ఒకరు తెలుగువారే అంటే అతిశయోక్తి కాదేమో. అయినా సరే అమెరికాలో తెలుగు నిరాదరణకు గురి అవుతున్నది. అందుకుగల కారణాలు, పరిణామాలు, పరిష్కారము చూద్దాము.
శ్రీలంకలో తమిళులు Vs అమెరికాలో తెలుగులు
శ్రీలంకకు వెళ్ళిన తమిళులు తాము సింహళం నేర్చుకోము, తమకోసం అన్నీ తమిళంలోనే ఉండాలి అన్నారు. మనము ఏమి చేసాము? అమెరికాకు వచ్చాకో, వచ్చే ముందో ఇంగ్లీషు నేర్చుకొన్నాము. కొద్ది కాలానికి అమెరికన్ యాస కూడా అలవాటు చేసుకున్నాము.
వీళ్ళు మేమంతా తమిళులము కాబట్టి మేమంతా ఒకే చోట ఉంటాము, మీతో కలవము అన్నారు. మనమేమో ఎక్కడుంటే ఏముంది, హాయిగా ఉంటే చాలు అని తెల్లవాళ్ళ మధ్య నివశిస్తున్నాము.
వీళ్ళు సింహళీయుల చట్టాలను పట్టించుకోలేదు, వాటిని అతిక్రమించి ఎదురుతిరిగారు. మనమేమో అమెరికావాడు చెప్పినట్టు కుడి వైపునే కారు నడిపాము, రోడ్డు పైన చెత్త వెయ్యలేదు, క్యూలో ఉన్నపుడు తొక్కిసలాటలు జరపలేదు.
వీళ్ళు తమ పిల్లలకు "సింహళ బాష నేర్చుకోకూడదు" అని చెప్పారు. మనమేమో "మనం ఈ దేశానికి వచ్చినపుడు ఈ దేశస్థుల్లా ఉండాలి" అంటూ పిల్లలకు ఇంగ్లీషు నేర్పిస్తున్నాము.
వీళ్ళు తమ పిల్లలకు "మనం ఉంటున్న శ్రీలంక మన దేశం కాదు, మనము మన భాషను, సంస్కృతినే ఆచరించాలి" అని భోధించారు. మనమేమో "మనము ఇక్కడకు వలస వచ్చాము. భాషకంటే మనకు కూడూ, గుడ్డ పెడుతున్న దేశం పట్ల గౌరవం ముఖ్యం. ఈ దేశాన్ని గౌరవించాలి, వీరి సంస్కృతి కూడా అలవాటు చేసుకోవాలి" అంటూ తెలుగువారింట్లో కూడా క్రిస్మస్ రోజున అందరూ హాయిగా, సంతోషంగా బహుమతులతో గడిపే దీనస్థితికి వచ్చాము.
పరిణామాలు
తెలుగువారు ఇలా అమెరికా పద్దతులను గౌరవిస్తూ, ఆచరిస్తూ అమెరికన్లతో కలసిపోయి హాయిగా జీవిస్తున్నారు. మొదటితరం తెలుగు పిల్లలకు తెలుగు చదవడం, వ్రాయడం, మాట్లాడడం సరిగా రాదు. తెలుగు సంతతివారు అమెరికన్లతో పోటీ పడి చదువుతున్నారు. ఎన్నో కాంపిటీషన్లలో నెగ్గుతున్నారు. కంపెనీల్లో ఉన్నత పదవులను చేపడుతున్నారు. కేవలం మన తెలుగు పండగలయిన ఉగాది, సంక్రాంతి వంటివి మాత్రమే కాక అమెరికన్ల పండగలయిన థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్ పండగలను కూడా జీవితంలో ఒక భాగం చేసుకుంటున్నారు. తమ భాషకంటే తమకు బ్రతుకుతెరువునిస్తున్న దేశ పద్దతులకు గౌరవమిస్తూ ఆ దేశ ప్రజల్లా బ్రతుకుతున్నారు. ఈ విపరీత ధోరణి ఇలా కొనసాగితే మరో రెండు తరాల తర్వాతి తెలుగువారు 'వాట్ ఈజ్ టెల్గు? హూ ఈజ్ ఉగాడి?' అంటారు.
తక్షణ కర్తవ్యం
ఎందుకు? ఎందుకు ఇలా జరుగుతోంది? ఇన్ని లక్షల మంది తెలుగువాళ్ళు అమెరికాలో ఉన్నా "భారతీయులు" గా గుర్తింపు పొందుతున్నారే కానీ "భారతీయ తెలుగువారి"గా ఎప్పుడు గుర్తింపబడతారు? కొన్ని తరాల తర్వాత అమెరికాలో తెలుగువారి పరిస్థితి ఏమి?
ఇలాంటి ప్రశ్నలకున్న ఏకైక జవాబు - అమెరికాలోని తెలుగువారు ఉద్యమించడం.
"తెలుగు" అన్న మాట వినిపిస్తే కల్లు తాగిన కోతిలా చిందులు తొక్కే మతిలేనివాడిని నాయకుడిగా ఎన్నుకోవాలి. ఈ తెలుగోన్మాది తెలుగువారిలో భాషాభిమానాన్ని రెచ్చకొట్టేవాడయి ఉండాలి.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఎన్నో భారతీయ భాషలున్నా తమిళులకు జరుగుతున్న అన్యాయాలే వినిపిస్తాయి కానీ తెలుగువారికి జరుగుతున్న అన్యాయాలు వెలుగులోకి రావడం లేదు. ఇకనుండి తెలుగువారికి కూడా అన్యాయం జరిగేలా ఈ తెలుగోన్మాది చర్యలు చేపట్టాలి.
అమెరికాలో తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచాలి. తెలుగు వారి పిల్లలకు బోధన తెలుగులోనే జరగాలి.
తెలుగు వారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సూచనల మొదలు అన్నీ తెలుగులో ఉండాలని ఆందోళనలు చేపట్టాలి.
ఇలా చేసినపుడే తెలుగు వారికి గుర్తింపు లభిస్తుంది.
శ్రీలంకలోని తమిళులు చేసినది చూసి ఇకనయినా ప్రవాసాంధ్రులు కళ్ళు తెరుస్తారని, తెలుగు ఉద్యమాలు, తెలుగు ఆందోళనలు చేపడుతారనీ, అమెరికాలో తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని చాటి చెబుతారని ఆశిద్దాం.
ఇంక చాలు..వెళ్ళు Brett Favre
Posted by జీడిపప్పు
మిగతా టీములకంటే గ్రీన్ బే ప్యాకర్స్ కున్న ప్రత్యేకత ఏమిటంటే - ప్రజాస్వామ్యం నిర్వచనం టైపులో ఈ టీం విస్కాన్సిన్ రాష్ట్ర ప్రజలయొక్క, ప్రజలచేత, అఫ్కోర్స్ ప్రజలకొరకు పుట్టిన టీం. మిగిలిన 31 టీములకూ ఒక్కో వ్యక్తి యజమాని అయితే, ప్యాకర్స్ కు ప్రజలే యజమానులు. పెట్టుబడి అంతా ప్రజలనుండే వస్తుంది. అందుకు ప్రతిఫలంగా ప్రజలకు షేర్లు, కొన్ని నిర్ణయాల పైన హక్కులు ఇవ్వబడుతాయి. మిగిలిన టీములన్నిటిపట్లా ఆ పట్టణాల్లోని చూపించే అభిమానం కంటే ప్యాకర్స్ పట్ల విస్కాన్సిన్ వాసుల అభిమానమే ఎక్కువ.
ఇలాంటి టీములో అడుగుపెట్టిన బ్రెట్ ఫార్వ్ కొద్ది కాలానికే ప్యాకర్స్ అంటే ఫార్వ్, ఫార్వ్ అంటే ప్యాకర్స్ అనే స్థాయికి ఎదిగాడు. బయటనుండి ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని అక్కడే స్థిరపడ్డాడు. బ్రెట్ ఫార్వ్ పేరుతో వెలువడిన ఏ వస్తువయినా ప్రజలు ఎగబడి కొనేవాళ్ళు. ఫార్వ్ ఏది చేసినా ప్యాకర్స్ మంచి కొరకే అని నమ్మేవాళ్ళు, ఫార్వ్ కూడా అలాగే చేసాడు. ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి అందరి అంచనాలను మించి ఆడేవాడు, జీసస్ క్రైస్ట్ ను కలుస్తారా బ్రెట్ ఫార్వ్ ను కలుస్తారా అంటే విస్కాన్సిన్ మొత్తం "జీసస్ క్రైస్టా? who" అనడానికి సంకోచించేవారు కాదు.
అలాంటి బ్రెట్ ఫార్వ్ నాలుగేళ్ళ ముందు, 12 ఏళ్ళు ప్యాకర్స్ తో ఆడిన తర్వాత రిటైర్ ఆలోచన వెలుబుచ్చాడు. మరో రెండు ఏళ్ళు అదే మాట చెపుతూ ఆడాడు. ఆ మధ్యలో బోర్డ్ ఆఫ్ డైరక్టర్లతో అభిప్రాయభేదాలు వచ్చాయి. ఎట్టకేలకు గత ఏడాది మార్చ్ లో రిటైర్ అయ్యాడు. క్రీడాలోకం అంతా ఫార్వ్ గొప్పదనాన్ని వేనోళ్ళ పొగిడింది. అభిమానుల బాధకయితే అంతే లేదు.
కొద్ది రోజులకు ఏమయిందో ఏమో, తాను మళ్ళీ ఆడతానన్నాడు. అప్పటికే ఉన్న విభేదాలవల్ల డైరక్టర్లు ఒప్పుకోలేదు. విస్కాన్సిన్‌లో ఆరాధ్య దైవం ఇమేజ్ ఉన్న ఫార్వ్, ఆ కోపంలో న్యూయార్క్ జెట్స్ తరపున ఒక ఏడాది ఆడి అపఖ్యాతిపాలయ్యాడు. అభిమానులు చాలా అసంతృప్తితో ఉండగా ఆ సీజన్ అయిన వెంటనే మళ్ళీ రిటైర్మెంట్ ప్రకటించాడు. అందరూ జరిగినది పీడకలలా మర్చిపోతుంటే, ప్యాకర్స్ ఆగర్భ శత్రువయిన మిన్నెసోటా వైకింగ్స్ తరపున ఆడడానికి మంతనాలు జరపడం మొదలుపెట్టాడు.
ఒకప్పుడు కేవలం విస్కాన్సిన్‌లో మాత్రమే కాక అమెరికా అంతా అభిమానులను సంపాదించుకున్న ఫార్వ్ చేస్తున్నవి చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికయినా బ్రెట్ ఫార్వ్ తన పద్దతి మార్చుకొని ఫుట్‌బాల్‌కు స్వస్తి చెపితే ఆ మిగిలి ఉన్న అభిమానం అయినా ఉంటుంది. లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు!
కామెడీ షోలు
Posted by జీడిపప్పు
Bill Cosby Show - ఇది ఇప్పటివరకు నేను చూసిన అత్యద్భుత, అమోఘమైన, ఆరోగ్యకరమైన షో. ఒక్క పరుషమయిన మాట లేకుండా, కించపరిచే లేదా నొప్పించే మాటలు లేకుండా, సకుటుంబసమేతంగా చూడగలిగే హాస్యాన్ని సృష్టించినందుకు బిల్ కాస్బీకి అపర హాస్య బ్రహ్మ అని బిరుదు ఇవ్వవచ్చు. ఈ షో వల్ల చదువుకున్న నల్లజాతీయుల పట్ల మిగతా అమెరికన్ల దృక్పథం కొంతయినా మారిందట. భార్య-భర్తలు, పెద్దలు-పిల్లలు, పెద్దలు-పెద్దలు, పిల్లలు-పెద్దలు ఎలా ఉండాలో ఈ షోలో చెప్పినంత చక్కగా, హాస్యభరితంగా మరి ఏ ఇతర షోలోనూ చెప్పలేదనుకుంటా. ఇది కుటుంబానికి ఎన్‌సైక్లోపీడియా లాంటిది అంటుంటారు. ఈ షో గురించి పూర్తిస్థాయి వ్యాసం వ్రాయవచ్చు.
Everybody Loves Raymond - కాస్బీ షో తర్వాత నాకు బాగా నచ్చే షో ఇది. కుటుంబంలో ఎటువంటి సమస్య వచ్చినా బిల్ కాస్బీ తనదైన శైలిలో సున్నితంగా పరిష్కరిస్తే, రేమండ్ మాత్రం తనదైన పద్దతిలో మరింత సంక్లిష్టం చేస్తాడు. రేమండ్ చేసే తింగరి పనులకు ఘాటుగా స్పందిస్తూ, రేమండ్ ను అమితంగా ప్రేమించే భార్య, తన కొడుకులకు 40 ఏళ్ళు వచ్చినా చిన్న పిల్లల్లా భావిస్తూ, కోడలికి చురకలంటిచే అత్త, ముసలివాడయినా ఏ మాత్రం చురుకుదనం తగ్గకుండా భార్య పైన సెటైర్లు వేసే తండ్రి, పోలీసు ఆఫీసరు అయినా తమ్ముడితో కీచులాడే అన్న, వీళ్ళ మధ్య బొమ్మలాంటి అమ్మాయి, ఇద్దరు కవలలతో ఆద్యంతం కుటుంబంలో గొడవలు, కీచులాటలు, ప్రేమాభిమానాలతో నవ్వించే మరో ఆణిముత్యం ఈ షో.
F.R.I.E.N.D.S - ఇప్పటివరకు వచ్చిన టీవీ షోలలో యువతను ఈ షో కంటే ఎక్కువ ఏదీ ఆకట్టుకొని ఉండదేమో. కలసిమెలసి జీవించే ముగ్గురు యువకులు, ముగ్గురు యువతుల కథ ఇది. ఒక ప్రేమ జంట, ప్రేమించుకున్నా చెప్పుకోని మరో జంట, ప్రేమించడానికి అమ్మాయి దొరకని జోయి, అదో అయోమయం మాలోక ఫీబీ, వీరితో పాటు వచ్చి పోయే బోయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ తో యువత జీవితానికి దర్పణం పడుతుంది. ఒకానొకదశలో ఎవరు ఎవరితో కలుస్తారో తెలియక అయోమయంతో పాటు సాగతీత ఎక్కువయింది.
That 70s Show - ఇది F.R.I.E.N.D.S కు కాస్త అటు-ఇటుగా ఉంటుంది. విస్కాన్సిన్ లో ఉన్న ఒక మధ్య తరగతి కుటుంబంలోని టీనేజ్ కుర్రాడు ఇందులో కథానాయకుడు. పక్కింటి మగరాయుడు అమ్మాయి ఇతడి గర్ల్ ఫ్రెండ్. హీరో తల్లిదండ్రులు దత్తత తీసుకున్న మరొకడు, అదేదో దేశం నుండి వచ్చిన ఇంకో కుర్రాడు, ఇంకో యువ జంట అంతా కలసి బేస్‌మెంట్‌లో మాటలు చెప్పుకుంటూ గడిపేస్తుంటారు. భయస్తుడయిన హీరోను వాళ్ళ నాన్న అనే మాటలు కొన్ని సుత్తి వీరభద్రరావును గుర్తు తెస్తాయి. కథానాయకుడయిన టోఫర్ గ్రేస్ సినిమాల్లోకి వెళ్ళడంతో షో పాపులారిటీ తగ్గి 2006లో షో ముగిసింది. నాకయితే ఫ్రెండ్స్ కంటే ఇందులోనే ఎక్కువ హాస్యం కనిపిస్తుంది.
ఇవి నాకు బాగా నచ్చిన షోలు. కొద్ది రోజులు King of Queens చూసాను కానీ మొనాటనస్ కామెడీ అనిపించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, యావత్ అమెరికా ఏకగ్రీవంగా The greatest show అని నిర్ణయించిన Seinfeld పట్ల ఎందుకో నాకు ఆసక్తి కలగలేదు. ఈసారెపుడయినా ఈ షోను ఒక పట్టు పట్టాలి.
ఇక వర్తమానానికొస్తే - ప్రస్తుత ఏ షో కూడా పైన చెప్పినవాటిలోని హాస్యాన్ని అందించడం లేదు. గత రెండు మూడేళ్ళలో రియాలిటీ షోలు, ట్యాలెంట్ షోలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. దీనివల్లేనేమో హాస్యంలో నాణ్యత తగ్గిపోతున్నది. అయినా అలవాటుపడిన ప్రాణం కాబట్టి కొన్ని కామెడీ షోలు చూస్తున్నాను. ఈ మధ్య నేను రెగ్యులర్‌గా చూస్తున్న షో Everybody Hates Chris. ఈ షోకున్న పెద్ద మైనస్ పాయింట్ క్రిస్ రాక్. క్రిస్ రాక్ అంటే నల్లజాతీయులను కించపరుస్తూ బూతులు మాట్లాడతాడు అని ప్రశస్తి. అటువంటివాడు తీస్తున్న షో ఎలా ఉంటుందో అని చూసాను, ఫరవాలేదు. నల్లజాతీయులను కించపరచడం ఎక్కువ లేదు. ఒక హైస్కూల్ కుర్రాడు ఇంట్లో, స్కూల్లో ఎదుర్కొనే సంఘటనల ఆధారంగా ఈ షో నడుస్తుంది. ప్రతి సెంటూ లెక్క చూసే తండ్రి, పిల్లలను క్రమపద్దతిలో పెంచే తల్లి పాత్రలు ఆకట్టుకుంటాయి.
మరొక అడల్ట్ కామెడీ షో Two and a Half Men కూడా పరవాలేదు. ఒక జల్సారాయుడు, డబ్బుల్లేని అతడి సోదరుడు, మనిషి పెరిగినా బుర్ర పెరగని కుర్రాడు ఒకే ఇంట్లో ఉంటారు. చాలా వరకు రేటెడ్ కామెడీ అయినా చూడవచ్చు. చివరగా, యానిమేషన్ షో అయిన Family Guy - ఇప్పటివరకు ఈ షో ఎదుర్కున్న విమర్శలు మరి ఏ ఇతర యానిమేషన్ షో ఎదుర్కొని ఉండదు. చాలా చీప్ కామెడీ అయినా ఇందులోని స్టీవీ పాత్రను కాసేపు చూస్తే ఈ షోను వదలబుద్ది కాదు. మాటలు రాని ఈ చంటోడు (??!!) ప్రపంచాన్ని మొత్తం తన స్వాధీనంలో ఉంచుకోవాలనుకుంటాడు. వీడి తర్వాత బాగా ఆకట్టుకొనేది మాట్లాడే కుక్క బ్రయన్. ఈ రెండు పాత్రలకోసం చూడవచ్చు ఈ షో.
ఇదన్నమాట సిట్‌కాం ల ప్రసహనం. ఇప్పుడొస్తున్న షోలు మొక్కుబడిగా చూస్తున్నా, 20 నిమిషాలు హాయిగా నవ్వుకోవాలంటే మొదట చెప్పిన కాస్బీ, రేమండ్, ఫ్రెండ్స్, 70s షోలే ఇప్పటికీ శరణ్యం. మళ్ళీ అలాంటి షోలు ఎప్పుడొస్తాయో!
జై హో జాన్ స్టీవర్ట్
Posted by జీడిపప్పు
24 గంటల చానెళ్ళల్లో Exclusive Report అని Breaking News అని ఏవేవో చెప్తుంటారు. ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ కనీసం ఎలక్షన్లపుడయినా నిజాలను చెప్పరు. అందుకే అమెరికాలో మీడియాను "మాఫియా మీడియా " అనవచ్చు. రిపబ్లికన్లు అధికారంలో ఉన్నపుడు ఇది మరీ ఎక్కువ ఉండేది. ప్రతి చానెల్ పోటీ పడి జార్జ్ బుష్ గురించిన నిజాలను తొక్కిపెట్టేవి. అసలు ఇరాక్ యుద్దం ఎందుకు చేస్తున్నారో రెండేళ్ళవరకు చాలామందికి తెలియదంటే ఈ "మాఫియా మీడియా" ప్రభావం ఎంతో తెలుసుకోవచ్చు.
అమెరికాలోని అత్యంత ప్రమాదకర సంస్థ పేరు FOX News. రిపబ్లికన్లు 2+ 2 = 3 అంటే అది నిజమని వారం రోజులు, డెమొక్రాట్లు 2+ 2 = 4 అంటే అందులో ఏదో తప్పు ఉందని నెలరోజులు ఊదరగొడుతుంది ఈ మాఫియా గ్యాంగ్. వీళ్ళు ఎంత ప్రమాదకరం అంటే, ఇరాక్ అణ్వాయుధాలు వేస్తే మారుమూల పల్లెల్లో ఉన్నవాళ్ళు ఎలా చనిపోతారు, అలా చనిపోకుండా ఉండాలంటే రక్షించుకోవడానికి అవసరమయిన Safety Equipment ఫలానా కంపెనీవాళ్ళ దగ్గరే కొనాలి అని పుంఖానుపుఖలుగా రోజుల తరబడి న్యూస్ లో కథలు చెప్తూ ప్రజలను భయభ్రాంతులను చేసారు. సగటు ఓటరు నిజమేననుకొని బుష్‌ను రెండో సారి అధ్యక్షుడిగా చేయాల్సి వచ్చింది, "అమెరికా బీహార్" అయిన ఫ్లోరిడా పుణ్యమా అని.
ఇక అసలు విషయానికొస్తే, నేను మీడియాలో వెతికినది "రిపబ్లికన్లను ఎండగట్టే" వార్తల కోసం. ఒక రోజు చానెల్స్ మారుస్తూ Comedy Central లో ఏదో "కామెడీ షో" వస్తుంటే చూసాను. ఎవరో రిపబ్లికన్ల పైన భలే జోకులు వేస్తూ విమర్శిస్తున్నారు. ఇదేదో భలే ఉందే అనుకుంటూ చూడడం మొదలుపెట్టాను.
సీన్ కట్ చేస్తే, కొన్నేళ్ళ తర్వాత - ఈ రోజు అసలు సిసలయిన వార్తల కోసం యువత అత్యధికంగా చూసేది ఆ "కామెడీ" షో. దాన్ని నిర్వహిస్తున్న వ్యక్తిపేరు జాన్ స్టీవర్ట్. ఆర్థిక మాంద్యం లేకుంటే ఈ ఎన్నికల్లో కూడా రిపబ్లికన్లకు ఓట్లు బాగానే పడేవి. అయినా ఒబామా గెలిచేవాడు. అందుకు ప్రధాన కారణం యువత పెద్ద ఎత్తున ఎన్నికల్లో పాల్గొనడం. దీని కారకుడు జాన్ స్టీవర్ట్. ఈ మధ్య జరిపిన ఒక సర్వే ప్రకారం, మిగతా న్యూస్ చానెళ్ళను గంటల తరబడి చూసేవారికంటే, జాన్ స్టీవర్ట్ The Daily Show చూసే వాళ్ళకే వాస్తవాలు ఎక్కువ తెలుస్తాయట!
ఒక Stand-up కమెడియన్ గా కెరీర్‌ను మొదలు పెట్టిన జాన్ స్టీవర్ట్ కామెడీ సెంట్రల్ చానల్లో ఒక చిన్న షో నిర్వహించేవాడు. క్రమంగా రాజకీయ అంశాలపై తనదైన శైలిలో విమర్శిస్తూ అనతికాలంలో పేరు తెచ్చుకున్నాడు. CNN లో Crossfire అనే పరమ చెత్త షో నడిచేది. వాళ్ళు జాన్ ను తక్కువ అంచనా వేసి తమ షోకు పిలిచి ఎప్పటిలాగే పనికిరాని సంభాషణలు మొదలుపెట్టారు, కానీ తన పదునైన మాటలతో ఇద్దరినీ విమర్శించి ఇద్దరికీ దిమ్మె తిరిగేలా చేసాడు. జాన్ స్టీవర్ట్ గురించి సరిగా తెలియనివాళ్ళు నోరు వెళ్ళబెట్టారు "టీవీ రంగంలో నిజాలను ఇంత ఖచ్చితంగా చెప్పే ఈ వ్యక్తి ఎవరా" అని. కొద్ది రోజులకు Crossfire షో పైన వీక్షకులకు నమ్మకంపోవడంతో ఆ షో క్యాన్సిల్ చేసేసారు.అదీ జాన్ స్టీవర్ట్ మాటల తడాఖా!
మరోసారి రిపబ్లికన్ ఎన్నిక కాకుండా అమెరికాను కాపాడేందుకు తన సర్వశక్తులు ఒడ్డి పోరాడిన జాన్ స్టీవర్ట్, ఒబామా అంటే పక్షపాతం చూపిస్తాడు అనుకోవడం పొరపాటే. ఒబామా తప్పు చేస్తే అదే వాడి, వేడి మాటలతో విమర్శిస్తున్నాడు.
నిమిష నిమిషానికి నవ్విస్తూ, నిజాలను నిర్భయంగా చెబుతూ అసలు సిసలయిన "న్యూస్ మేన్" గా ఆరాధింపబడే జాన్ స్టీవర్ట్ కు మరోసారి జై హో!
Madoff మహా స్కాం
Posted by జీడిపప్పు
చట్టాలు, పోలీసులు అంటూ వినపడే అమెరికాలో Madoff అనే పెద్దాయన చట్టబద్దంగా ఒక వ్యాపారం మొదలుపెట్టాడు. సుమారు 30 ఏళ్ళ పాటు వ్యాపారం నడిచిన తర్వాత 2008 డిసెంబరులో తాను చేస్తున్న వ్యాపారమంతా బోగస్ అని బాంబు పేల్చాడు. దానివల్ల నష్టం 50 - 65 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది. రూపాయల్లో అయితే ఈ స్కాం విలువ ఓ మూడు లక్షల కోట్ల రూపాయలన్నమాట!! అమెరికా అసలే ఆర్థికమాంద్యంతో అతలాకుతలమవుతుంటే మధ్యలో ఈ స్కాం ఒకటి అని అందరికీ మరింత కోపాన్ని తెచ్చింది. కాస్తో కూస్తో సంతోషించదగ్గ విషయం ఏమిటంటే, ఇందులో సామాన్యుడు ప్రత్యక్షంగా నష్టపోలేదు. నష్టపోయింది అత్యాశ గల ధనవంతులు, కొన్ని బ్యాంకులు.
అసలు ఏమి జరిగిందంటే - A అనేవాడు Madoffకు 10 రూపాయలిచ్చాడు. ఆ 10 రూపాయలతో "ఎదో" చేస్తాను అంటాడు Madoff. అది ఏమిటో స్పష్టంగా చెప్పడు. నీకు డబ్బు కావాలా వద్ద అని మభ్యపెడతాడు. ఆ డబ్బంతా స్టాక్స్ లో పెట్టినట్లు పత్రాలు సృష్టించాడు. నిజానికి ఆ డబ్బంతా బ్యాంకులో తన ఎకౌంటులో ఉంచుకున్నాడు. ఏడాది తర్వాత A కి 10% డివిడెండ్ అంటూ ఒక్క రూపాయి వచ్చింది. అది చూసిన B , C లు ఇద్దరూ చెరో పది రూపాయలు ఇచ్చారు. అంటే మొత్తం Madoff దగ్గర ఉన్న సొమ్ము 29 రూపాయలు. దాన్ని అలాగే బ్యాంకులో ఉంచి మరో ఏడాదికి ముగ్గురికీ తలో రూపాయి బోనస్ ఇచ్చాడు. అంతలో C తన డబ్బులు మొత్తం తీసేసుకున్నాడు. ఈ మధ్యలో Madoff ఓ రెండు రూపాయలు నొక్కేస్తాడు. లెక్కప్రకారం ఇంకా A,Bల పెట్టుబడి ఉంది. అంటే 20 రూపాయల పెట్టుబడి ఉండాలన్నమాట. కానీ Madoff దగ్గర ఉన్నది 30-4-10-2 = 14 మాత్రమే!
ఈ విధంగా కొత్తగా వచ్చినవారి దగ్గర తీసుకొని పాతవాళ్ళకు ఇచ్చేవాడు. ఇక నెల నెలా ప్రతిఒక్కరికి ఆరేడు పేజీల స్టేట్‌మెంట్స్ పంపించేవాడు. చాలమందికి అదేమిటో కూడా అర్థమయ్యేది కాదు. కాకపోతే పేపరు పైన తమ డబ్బు పెరుగుతుంటే చాలనుకున్నారు. Madoff విలాసవంతమయిన పార్టీలు ఇచ్చేవాడు. అతిథులుగా రాజయకీయ నాయకులు, సెలెబ్రిటీలు వచ్చేవారు. వారికి ఇంద్రభవనాల్లో అతిధి సత్కారాలు, ఖరీదయిన బహుమతులు ముట్టేవి.
తన ఇమేజి పెంచుకోవడానికి Madoff చేసిన జిమ్మిక్కులు భలే ఉంటాయి. సాధారణ మిలియనీర్లకు అందుబాటులో ఉండేవాడు కాదు. Madoff దర్శనం కలిగితే చాలని మిలియనీర్లు తహతహలాడేవారు. కొద్ది రోజులు తిప్పించుకున్న తర్వాత అపాయింట్‌మెంట్ ఇచ్చేవాడు. తమదగ్గర ఉన్న మిలియన్లను తీసుకోమని మిలియనీర్లు ప్రాధేయపడినా అంత సులభంగా అంగీకరించేవాడు కాదు. దాంతో Madoff అంటే మరింత క్రేజ్ పెరిగిపోయేది. Madoff తన కంపెనీలో ఉద్యోగులను చాలా బాగా చూసుకొనేవాడు. సెక్రెటరీ జీతం $500,000. మేనేజర్ల జీతం మిలీయన్లలో ఉండేది. $5000 లేదా అంత కంటే ఎక్కువ transaction జరిగితే వెంటనే అధికారులకు తెలిసి దాని పైన ఒక కన్నేసి ఉంచుతారు. అలాంటిది మిలియన్లు చేతులు మారినా Madoff పైన చర్య తీసుకోలేదంటే ఏ స్థాయిలో చట్టాన్ని అవినీతిమయం చేసాడో తెలుస్తున్నది.
నిరాటంకంగా సాగిపోతున్న ఈ వ్యాపారాన్ని Recession వెలుగులోకి తెచ్చింది. 2008 డిసెంబరులో కొందరు ఇన్వెస్టర్లు తమ డబ్బు వెంటనే కావాలని పట్టుబట్టారు. లేని డబ్బు తీసుకురావలని రావడంతో విధిలేక Madoff అసలు సంగతి తన కొడుకులకు చెప్పాడట. అది తెలుసుకున్న చట్టం అదర బదరా రంగంలోకి దిగి Madoff పైన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది.
Madoff నోరు విప్పితే ప్రస్తుత ప్రభుత్వంలోని, గత ప్రభుత్వాల్లోని కొందరు రాజకీయ నాయకుల జీవితాలు ముగుస్తాయి కాబట్టి పెద్దతలకాయలు "బాబ్బాబూ ఎలాగూ నీకు 70 ఏళ్ళు, ఎక్కువ కాలం బ్రతకవు. నీ కుటుంబాన్ని మేము చూసుకుంటాము, మా పేర్లు మాత్రం చెప్పకు" అని బ్రతిమాలుకొని ఉంటారు. దయతలచిన Madoff ఈ నెల 12 న తన పైన ఉన్న అన్ని అభియోగాలను అంగీకరించాడు. అన్ని తప్పులకు తానే బాధ్యుడినన్నాడు.
Madoff ఆస్తులన్నీ సీజ్ చేసారు. వీటివిలువ మహా అయితే ఒక బిలియన్ డాలర్లు ఉంటుంది. తెలియని ఆస్థులు, స్విస్ బ్యాంక్‌లో డబ్బులు మొదలయిన వివరాలు Madoffకే ఎరుక. చేసిన నేరానికి 150 ఏళ్ళ శిక్ష అనుభవించి, 170 బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలి అని తీర్పునిచ్చారు. 150 ఏళ్ళ శిక్ష అనుభవించాలంటే 70 + 150 = 220 ఏళ్ళు బ్రతకాలి. అది మానవుడికి సాధ్యం కాదు, కేవలం తాబేలుకే సాధ్యం. అందుకే ఆరిజోనా ఎడారిలోని రహస్య భూగర్భ పరిశోధనశాలలో Madoff ను తాబేలుగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇల్లు కాలిపోతుంటే..
Posted by జీడిపప్పు
కంపెనీ లాభాల్లో ఉన్నపుడు ఇచ్చినా పర్వాలేదు కానీ AIG మరణావస్థలో ఉంది. చనిపోతున్నదాన్ని బ్రతికించడానికి ప్రభుత్వం వందల బిలియన్లు ఇస్తుంటే, యాజమాన్యం ఏమో "కంపెనీ రూల్స్ అలా ఉన్నాయి" అనో "మంచి వాళ్ళను పోగొట్టుకోకూడదని ఇస్తున్నాము" అనో అంటోంది. పన్ను చెల్లించే సగటు పౌరుడికి మాత్రం ఇది చూసి మండుతోంది. ఒక వైపు లక్షల మందికి ఉద్యోగాలు లేవు. వీళ్ళేమో ప్రజల సొమ్మును ఇలా దోచుకుంటున్నారు. నిజానికి ఇది ఒబామా రాక ముందే జరిగింది. అయినా సరే ఇందులో ఒబామా తప్పు కాస్త ఉంది అని నమ్ముతున్నా. అన్ని బిలియన్లు ఇచ్చినపుడు ప్రతి సెంటుకూ లెక్క చూపాలని, అన్ని వివరాలు బహిర్గతం చెయ్యాలని ఆంక్షలు పెట్టాలి.
ఈ రోజు ఇంకో వార్త ఏమిటంటే, ఆటో ఇండస్ట్రీకి ఐదు బిలియన్ డాలర్లు ఇస్తున్నారు. ఇది మరొక ఘోర తప్పిదం అనిపిస్తోంది. డెట్రాయిట్ ఆటో సంస్థల కంటే అవినీతిమయమయినవి అమెరికాలో మరేవీ ఉండవు. అక్కడి లేబర్ యూనియన్ల ముందు మాఫియా ఎందుకూ పనికిరాదు అంటారు. వాళ్ళ జీతాలు, ఇతర సదుపాయాలు చూస్తే కళ్ళుతిరుగుతాయి. మేనేజ్‌మెంట్ కూడా అలాంటిదే. దొరికినంత వరకు దోచుకోవడమే. కంపెనీ డబ్బులతో ప్రైవేట్ జెట్లను కొనిపిస్తారు, ఆఫీసు పక్కన ల్యాండ్ అవడానికి!
తమ ఫ్యాక్టరీలను బ్రతికించుకోవడానికి ప్రభుత్వాన్ని అప్పు అడగడానికి మూడు కార్ల కంపెనీల పెద్దలుముగ్గురూ కంపెనీ ప్రైవేట్ విమానాల్లో వాషింగ్టన్‌కు వెళ్ళారు. ఒక సెనేటర్ కు మండిపోయి "ఇప్పటికిప్పుడు మీ జెట్ విమానాలను అమ్మివేసి మామూలు విమానంలో సాధారణ ప్రయాణీకుల్లా వెళ్ళడానికి మీలో ఎవరు సిద్దమో చేతులెత్తండి. " అంటే ఒక్కరు కూడా చేతులెత్తలేదు. ఇక వీళ్ళ కంపెనీలకు ఎంత డబ్బు కావాలో వీళ్ళకే తెలియదు. మొదట 13 బిలియన్లు అన్నారు, తర్వాత 25 బిలియన్లు అన్నారు.
ఏమయినా అంటే ఆ మూడు కంపెనీల పైన 2 మిలియన్ ఉద్యోగాలు ఆధారపడి ఉన్నాయి అంటారు. పోనీ ఆ కార్లు కొనదగినవా అంటే అదీ కాదు. సగటు అమెరికన్లు "మా దేశపు కారు కొని పడ్డ కష్టాలు చాలు. ఇప్పుడు ఈ జపాన్ కారుతో హాయిగా ఉంది" అంటున్నారు.
ఇప్పుడు 50 బిలియన్లు ఇచ్చినా లేబర్ యూనియన్లు "రూల్స్" అంటూ శుభ్రంగా తినేస్తాయి తప్పించి ఆ కంపెనీలు బాగుపడతాయన్న నమ్మకం లేదు. ఆ కంపెనీలతో దివాలా ప్రకటింపచేసి మొత్తం ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ఏ టొయోటాకో హోండాకో అమ్మివేయడమే ఉత్తమం.
కొత్త H1-B వీసాలు వద్దు
Posted by జీడిపప్పు
ఇప్పటికే IT కంపెనీలు ఉన్నవాళ్ళను ఉద్యోగాలనుండి తీసేస్తున్నారు. కొత్త ఉద్యోగాలు దాదాపు శూన్యం. రాబోవు రోజుల్లో మరిన్ని firings ఉంటాయే తప్ప hirings ఉంటాయన్న నమ్మకం, ఆశ లేదు. గత ఆరు నెలల్లో ఉద్యోగాలు ఊడినవాళ్ళకు కొత్త ఉద్యోగాలు వస్తున్న దాఖలాలు లేవు. వేలమంది స్వదేశాలకు వెళ్ళిపోతున్నారు.
ఒక వేళ ఈ ఏడాది ఆఖరికి మళ్ళీ ఆర్థిక వ్యవస్థ బాగుపడినా అమెరికాలో ఉన్నవారికే అవి సరిపోవు. ఉద్యోగాలు పోయిన అనుభవజ్ఞులకు ముందు ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళందరూ అయిన తర్వాత dependent గా వచ్చి తర్వాత H1 కు మారిన వాళ్ళకు ఉద్యోగాలు కావాలి. వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చి మిగిలితే కొత్తవాళ్ళకు ఇవ్వాలి. అందుకే ఈ ఏడాది ఒక్క H1 ఇవ్వకపోయినా నష్టం లేదు. ఉన్నవాళ్ళతో, అమెరికన్లతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఏడాది సాఫీగా సాగిపోతుంది. వచ్చే ఏడాది కావాలంతే అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు. పని చేయించుకొనే అమెరికా వాడికి లేని దురద పని చేసే మనకెందుకో!!
ఇది తెలియని మన మీడియా, కుహానా మేధావులు భౌ భౌ అని మొరుగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వేళ ఎవరయినా ఉద్యోగాన్వేషణకు H1 పైన అమెరికాకు వస్తే, స్వర్గం చూస్తారు. అది కూడా మామూలు స్వర్గం కాదు.. కలలో కూడా ఊహించని స్వర్గం. నమ్మండి!
అమెరికాకు నష్టం - ప్రపంచానికి లాభం
Posted by జీడిపప్పు
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి లేదా ఉద్యోగం చేసి తమ స్వదేశానికి వెళ్ళినవారి గురించి కొన్ని వివరాలు:
- వీరందరూ ఉన్నత విద్యావంతులు. చైనీయులలో 51% మాస్టర్స్, 40.8% PhD చేసినవారు, భారతీయులలో 65.6% మాస్టర్స్, 12.1% PhD చేసినవారు
- 26.9% భారతీయులు, 34% చైనీయులు అమెరికాలో గ్రీన్‌కార్డ్ లేదా సిటిజన్‌షిప్ ఉన్నవారు
- 76% వారికి వీసా అన్నది సమస్య కాదు
- 90% పైగా అమెరికాకు రావడానికి కారణం ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు
- 68.7% భారతీయులు, 84% చైనీయులు తమ స్వదేశంలో అమెరికాలో కంటే మంచి ఉద్యోగావకాశాలున్నాయి అన్నారు
- 42.4% భారతీయులు, 17.6% చైనీయులు తమ పిల్లలకు అమెరికాలో కంటే తమ స్వదేశంలో మంచి విద్య లభిస్తుంది అన్నారు
- అమెరికాలోకంటే స్వదేశంలో ఉద్యోగాల్లో ఉన్నత స్థానానికి చేరుకోవడం సులభం
- 56.6% భారతీయులు మరో ఐదేళ్ళలో తమ సొంత కంపెనీలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు
వినడానికి చాలా తమాషాగా ఉన్నా, చాలామంది అమెరికన్ల పరిస్థితి ఇంతే. ఆర్ట్స్ అంటే ప్రాణమిస్తారు కానీ మ్యాథ్స్, సైన్స్ అంటే పరుగులుపెడతారు. ఈ తరం పిల్లల్లో ఇది మరీ ఎక్కువ అవుతుండడం చూసి నాలుగేళ్ళ ముందు అనుకుంటా, కొందరు మేధావులు కలసి మ్యాథ్స్, సైన్స్ కోర్సులు చేసే వారికోసం ప్రత్యేక సదుపాయాలు, స్కాలర్‌షిప్‌లు ఇవ్వమని, సుమారు $20 బిలియన్ డాలర్ల ప్రతిపాదన చేసారు కానీ జార్జ్ బుష్ అమలు పరచలేదు. ఇంత కష్ట సమయంలో కూడా ఒబామా $50 బిలియన్లు విద్యకు కేటాయించడం వెనుక రహస్యం రాబోవు తరం వారికి అవసరమయిన ఉన్నత విద్యకోసమే. అందులో మ్యాథ్స్, సైన్స్ లకు ప్రాధాన్యత ఉండబోతుంది తప్పకుండా.
ఏది ఏమయినప్పటికీ ఈ మేథోవలస వల్ల భవిష్యత్తులో ఇండియాలో సిలికాన్ వ్యాలీలు, మరెన్నో యాహూ, గూగుల్ లాంటివి పుట్టడం తథ్యం.
అమెరికాను బహిష్కరిద్దాం
Posted by జీడిపప్పు
సరే, ఇక అసలు విషయానికొస్తే - అమెరికా ప్రభుత్వం వందల బిలియన్లు ఇచ్చి "మీరు కొత్తవాళ్ళను తీసుకోవాలనుకుంటే అమెరికన్లనే తీసుకోండి. H1B వాళ్ళను వద్దు" అన్నది. వినడానికి అన్యాయం అనిపిస్తున్నా, నాకయితే వారివాదనలో తప్పులేదు అనిపిస్తున్నది. Of course సరి అయిన నిపుణులు లేక, పని సరిగా జరగక వాళ్ళ పాట్లేవో వాళ్ళే పడతారు, కళ్ళు తెరచి మళ్ళీ H1Bను పిలవవచ్చు లేదా మరింత outsource చెయ్యవచ్చు.
"కాలిఫోర్నియాలో ఉద్యోగాలకు కేవలం కాలిఫోర్నియా వాళ్ళనే తీసుకోవాలి" అని చెప్పిఉంటే నేనూ వ్యతిరేకించేవాడిని. వాళ్ళు చెప్పింది "ఇతర దేశస్థుల" గురించి. "ముందు మనదేశ పౌరులకు ఉద్యోగాలుండాలి, ఆ తర్వాతే ఎవరికయినా" అన్నారు. వాళ్ళేమీ భారతీయులను తీసేయమనలేదు. ఉన్నవాళ్ళను అలాగే ఉంచచ్చు కానీ కొత్తగా ఉద్యోగాలు ఇస్తే మాత్రం అమెరికన్లకే ఇవ్వాలి అంటున్నారు. ఈ రోజు అక్షరాలా 50 లక్షల మంది నిరుద్యోగ భృతి తీసుకుంటున్న అమెరికాలో ఈ షరతు సరి అయినదే అని నా నమ్మకం.
ఒక్కనిమిషం ఆలోచించండి - మన దేశంలో రోజుకు కొన్ని వేల ఉద్యోగాలు పోతున్నాయి అనుకోండి. అప్పుడు మన ప్రభుత్వం కంపెనీలకు కొన్ని వందల కోట్లు ఇచ్చింది, ఉద్యోగాలు కల్పించడానికి. అప్పుడు Infosys బెంగుళూరు ఆఫీసులో భారతీయుల బదులు చైనీయులను బెంగుళూరుకు పిలిపిస్తే ఎలా ఉంటుంది? ముందు మన దేశస్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఆ తర్వాతే బయటి దేశస్థులకు లేదా మన దేశానికి వలస వచ్చినవారికి.
ఒక నాయకుడు అమెరికా వస్తువులను బహిష్కరించాలని ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చాడు. మీలో ఎవరయినా దానిని సమర్థిస్తే, ఈ క్రిందివి కూడా చేయండి.
- మీ ఇంట్లో అమెరికా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఉంటే వెంటనే బద్దలు కొట్టండి
- అమెరికానుండి మీవాళ్ళు తెచ్చిన బహుమతులు చెత్తలో పడవేయండి
- మీ ఇంట్లో ఎవరయినా IT ఉద్యోగం చేస్తుంటే వెంటనే మానిపించండి. ఎందుకంటే 60% పైగా మన IT ఉద్యోగాలు అమెరికాకు పని చేయడానికే ఉన్నాయి
- IT లేదా అమెరికానుండి వచ్చిన డబ్బుతో కొన్న భూములు, ఇళ్ళు పేదలకు దానం చెయ్యండి
- ఇంటర్నెట్ కనిపెట్టింది అమెరికావాళ్ళే. ఇంకెప్పుడూ ఇంటర్నెట్ వాడకండి
- అన్నట్టు మరచిపోయాను, బ్లాగు అన్నది అమెరికావాళ్ళ ప్రాడక్టు. ఇంకెందుకు ఆలశ్యం...బ్లాగింగు మానెయ్యండి.
ఒబామా మంత్రం ఫలిస్తుందా?
Posted by జీడిపప్పు
- రోడ్లు, నిర్మాణాలు, బ్రిడ్జిల రిపేర్లకు $120 బిలియన్లు, విద్యకు $100 బిలియన్లు, ఇంధన/శక్తి ఉత్పాదనకు $30 బిలియన్లు
- ఆరోగ్యానికి $10 బిలియన్లు, నాసాకు $2 బిలియన్లు
- హై-స్పీడ్ రైలు వ్యవస్థకు $8 బిలియన్లు, Amtrak రైళ్ళకు $1.3 బిలియన్లు
- అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇళ్ళను కొనుగోలు చేయడానికి $2 బిలియన్లు, ఇళ్ళు లేనివారికి $1.5 బిలియన్లు
- ఏడాదికి $125,000 కంటే తక్కువ సంపాదన ఉన్నవారు 2009లో కొత్త కారు కొంటే సేల్స్ ట్యాక్స్ కట్టనవసరం లేదు
- మొదటిసారి ఇల్లు కొంటున్నవారికి $8,000 ట్యాక్స్ చెల్లింపు
- ఒక్కరి సంపాదన $80,000 కంటే లేదా కుటుంబ సంపాదన $160,000 కంటే తక్కువ ఉంటే కాలేజ్ ఫీజులో $2,500 పన్ను మినహాయింపు
- ఒక్కరి సంపాదన $75,000 కంటే లేదా కుటుంబ సంపాదన $150,000 కంటే తక్కువ ఉంటే ఒక్కరికి $400 లేదా కుటుంబానికి $800 చెల్లింపు
చివరి పాయింటుకు, అంటే ఏమీ ఖర్చు పెట్టని వాళ్ళకు కూడా డబ్బు ఇవ్వడం, నేను పూర్తి వ్యతిరేకిని. ఈ పరిస్థితుల్లో ఒక మధ్య తరగతి కుటుంబానికి ఓ $800 ఇస్తే వాళ్ళు ఆ డబ్బు ఖర్చుపెడతారా లేక జరుగుతున్నవి చూసి ఆ డబ్బు ఖర్చుపెట్టగలిగే స్థితిలో ఉన్నా దాచుకుంటారా? ప్రజలకు డబ్బు ఇవ్వకూడదు. ఆ డబ్బుతో మరిన్ని ఉపాధి అవకాశాలు కలిగించాలి, డబ్బు చేతులు మారేలా చేయాలి. జార్జ్ బుష్ అన్ని బిలియన్లు కుమ్మరించాడు. ఏమయింది? ఒబామా ప్రణాళికలో 35 శాతం ట్యాక్స్ కోతలు/చెల్లింపులు, 65 శాతం ఖర్చులు ఉన్నాయి. ఇవి 20-80 శాతాలుగా ఉండి ఉంటే బాగుండేదేమో.
50 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఒబామాకు ఇవన్నీ ఎంత దోహదం చేస్తాయో చూద్దాం. అంతా మంచే జరగాలని, అమెరికా తొందరగా కోలుకోవాలని ఆశిద్దాము.
అమెరికథలు - 1
Posted by జీడిపప్పు
సర్జరీలు దాదాపు పూర్తి అయ్యాయి. ఈ దేశానికి వలస వచ్చిన నా తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడి జీవనాన్ని గడిపారో తలుచుకుంటూ వారిని ఆదర్శంగా తీసుకొని ధైర్యంగా బ్రతుకుతున్నాను. ఆర్థికంగా దెబ్బతినడం మన చేతుల్లో కూడా ఉంది. అనవసరపు ఖర్చులు చేయకండి, తెలివయిన ప్రణాళికతో ఖర్చు పెట్టండి. మన అందరికి గుడ్ లక్!!- By MALIBLOC
***************************************
నా వయసు 61, యాభైలలో ఎక్కువ రోజులు నా సోదరి బాగోగులు చూసుకోవడానికి ఇంటిదగ్గరే ఉన్నాను. ఆమె ఏడాది క్రితం చనిపోయింది. అప్పటినుండి ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. 8 ఏళ్ళ తర్వాత, 61 ఏళ్ళ వయసులో ఉద్యోగం వెతుక్కోవడం ఎంత కష్టమో మీకు తెలుసా? నాకు Social Security డబ్బు వస్తుంది కానీ ఒక్కనెల రాకుంటే ఇల్లు వదిలి వీధిన పడాలి.
ప్రస్తుతానికి ప్రత్యామ్నాయ భోదకురాలిగా మరియు McDonalds లో పని చేస్తున్నాను. స్కూలు లేని రోజుల్లో పని ఉండదు, పని లేని రోజు డబ్బు ఉండదు. క్రిస్మస్ అపుడు మూడు వారాలు పని దొరకలేదు. ఈ వారం మొత్తానికి MDonalds లో మూడు గంటలు పని దొరికింది. క్రితం వారం నా మొత్తం సంపాదన $103, ఈ వారం నా సంపాదన $50. ఆదివారానికి ఇంటి అద్దె కట్టాలి, కట్టకపోతే ఇంటి యజమాని ఊరుకోరు. కారుకు ఇన్సూరెన్సు కట్టవలసిన తేదీ దాటిపోయింది. నేను ఎంతో ఇష్టపడి కొనుకున్న 08 Honda కారు అమ్మేస్తున్నాను. పనికి వెళ్ళడానికి ఒక పాత కారు కొనుక్కోవాలి. నూడుల్స్, చీజ్ తింటూ బ్రతుకుతున్నాను. జీవితంలో మొదటిసారి ఉచితంగా ఆహారాన్ని ఇచ్చే food pantry కి గత వారం వెళ్ళాను.
నా యీ "golden years" లో ఇలా జీవించవలసి వస్తుంది అనుకోలేదు. - By greenghia
CNN.com లో iReport అనే విభాగం ఉంది. అందులో ప్రజలే రిపోర్టర్లు. కొందరు అమెరికన్లు ప్రస్తుత ఆర్థికమాంద్యంలో తమ జీవితం ఎలా ఉందో చెబుతూ పంచుకున్న అనుభవాలను తెలుగులోకి అనువదించడం జరిగింది.

