బెగ్గర్ ఖాన్‌కు అమెరికాలో అవమానం!!

Posted by జీడిపప్పు

గతవారం అమెరికాకు వచ్చిన షారుఖ్ ఖాన్‌ను న్యూజెర్సీ ఎయిర్‌పోర్ట్ లో "నిర్బంధించారు" అని, ఇది యావత్ భారతజాతికి అవమానం, అమెరికా అహంకారానికి నిదర్శనమని అటు టీవీల్లో, ఇటు పేపర్లలో కుప్పలుతెప్పలుగా వార్తలు వచ్చాయి. షారూఖ్ ఖాన్ కూడా తీవ్ర మనస్తాపం చెందానని చెప్పి బాధపడి వెనువెంటనే ఇండియాకు తిరిగి వచ్చేయకుండా అక్కడే అమెరికాలో తన రాబోవు సినిమాకు నాలుగు డాలర్లు రాబట్టుకోవడానికి కష్టపడుతున్నాడు.

నిజంగా అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు భారతీయుల పట్ల వివక్ష చూపిస్తున్నారా అంటే ముమ్మాటికీ కాదు అన్నదే సమాధానం. తానా నుండి తందానా సభలవరకు ప్రతిఏడాది ఎందరో తెలుగు సెలెబ్రిటీలు వస్తున్నారు. షారూఖ్ ఖాన్ కంటే ఎంతో గొప్పవాళ్ళు ఎందరో ఎన్నోసార్లు అమెరికాకు వచ్చాడు. వీళ్ళెవరూ ఎన్నడూ "మమ్మల్ని అవమానించారు" అని గగ్గోలు పెట్టలేదు ఎందుకు? మరి వీరు భారతీయులు కారా? వీరెవరిలో కనపడని భారతీయత వీడొక్కడిలోనే కనపడిందా ఇమ్మిగ్రేషన్ అధికారులకు?

అసలు జరిగినదేమిటో చూద్దాం. ఇమ్మిగ్రేషన్ అధికారులు డాక్యుమెంట్లు స్కాన్ చేసినపుడు "ఖాన్" అన్న పేరు హైలైట్ అయింది. అందులో తప్పేముంది? సెక్యూరిటీ కారణాలవల్ల రాసిన ప్రోగ్రాం ప్రకారం అలా హైలైట్ అయిన వారిని పక్కకు తీసుకెళ్ళి నిశితంగా పరిశీలించాలి. రూల్స్ ప్రకారం వీడిని పక్కకు పిలుచుకెళ్ళి అన్ని వివరాలు అడిగారు. ఎంతయినా కాస్త "హైలైట్" అయిన పేరు కాబట్టి ఒకరికి ముగ్గురు అధికారులు ఒక గంటసేపు అన్నీ నిర్దారించుకొని పంపించారు. ఇందులో ఎక్కడా అవమానమో లేదా అహంకారమో లేదే. కేవలం వాళ్ళ డ్యూటీ చేసారు, అదీ వాళ్ళకున్న రూల్స్ ప్రకారం.

తానేదో పెద్ద కింగ్ అని భ్రమపడే షారూఖ్ ఖాన్ ఇదే పబ్లిసిటీకి అదను అని చిల్లర స్టేట్మెంట్స్ ఇచ్చాడు. వీడు ఇండియాలో పెద్ద సూపర్‌స్టార్ కావచ్చు కానీ అమెరికాలో ఇమ్మిగ్రేషన్ అధికారి ముందు ఒక కోన్ కిస్కా గొట్టం గాడే. వీడేమయినా ఒక ప్రభుత్వాధికార హోదాలో ఒక ప్రత్యేక విమానంలో వచ్చాడా అంటే అదీ లేదు. నాలోంటోడు వచ్చే విమానంలో వచ్చి నాలాంటోడిముందు ఇమ్మిగ్రేషన్ లైన్లో నిలబడ్డాడు. నాకు తెలుసు వీడొక సో-కాల్డ్ ఇండియా ఐకాన్ అని, ఇమ్మిగ్రేషన్ అధికారికి ఎలా తెలుస్తుంది? తెలుసుకున్నా ఎందుకు నమ్మాలి వీడిని? ఎంతమంది బాలీవుడ్ హీరోలు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోలేదు?

సరే, నేనంటే ఏదో అమెరికా నీళ్ళు తాగుతున్నాననో లేక భవిష్యత్తులో అమెరికా సెనేటరో, గవర్నరో కావాలనో అమెరికాను సమర్థిస్తున్నా అనుకొని నా మాటలు పక్కన పెడదాము. బ్లాగుల్లో వ్రాసిన 1, 2, 3, 4 లాంటి ఆలోచింపదగ్గ చక్కని పోస్టులను కూడా పక్కన పెడదాము. మిడిమిడి జ్ఞానం తో అమెరికా అంటే ముందు వెనక ఆలోచించని మూర్ఖుడిలా నేను కూడా "అవునవును, న్యూజెర్సీలో భారతజాతి గౌరవానికి అవమానం జరిగింది" అన్నానే అనుకుందాము.

మరి అంతగా అవమానింపబడ్డ భారతజాతి గౌరవం వెంటనే "ఇది నాకు అవమానం. ఇక నేను మీ దేశానికి మళ్ళీ రాను. నా సినిమాలను మీ దేశంలో ఆడనివ్వను" అని వెంటనే ఇండియాకు వచ్చేసిందా లేక అవమానం జరిగిన అదే దేశంలో స్టేజీల పైన కుప్పిగంతులేస్తున్నదా డాలర్లకోసం? ఇంతకూ బెగ్గర్ ఖాన్‌కు తనకు జరిగిన అవమానం ముఖ్యమా లేక అభిమానుల అభిమానం ముఖ్యమా లేక రాబోవు సినిమాకు వాళ్ళు రాల్చే చిల్లర డాలర్లు ముఖ్యమా?

29 comments:

 1. చిలమకూరు విజయమోహన్ said...

  well said

 2. Bhãskar Rãmarãju said...

  :)
  ఒకసారి నా స్నేహుతునికీ ఇలా జరిగింది. బిజినెస్ వీసా మీద అది ఐదోసారి రావడం. మన శ్రీకిట్నుడిపేరే అతనిదీ. ఆపేసారు. అండర్ ప్యాంట్స్ మీద రెండుగంటలు కూర్చూపెట్టారు. మనోడు కిక్కురుమనకుండా కూర్చున్నాడు. అయ్యింది మూణ్ణెల్లు, ఎనక్కి వచ్చేసాడు. మళ్ళీ ఆన్సైట్ ఎప్పుడా అని ఆశగా చూస్తూనే ఉన్నాడు. మళ్ళీ మళ్ళీ వచ్చాడు ఆ తర్వాత కూడా. పైసామే పర్మాత్మా హై!!గొడవ ఎందుకూ హై?? సుత్తే నాకొడుకు కాకపోతే!!! బాగా చెపారు జీడిపప్పు భాయ్!!!!

 3. Anonymous said...

  మేము కెనడాకి నయాగరా చూసి వచ్చేటప్పుడు నన్నూ ఓ రెండు గంటలు నిలబెట్టారు...బోలెడు జనాలు... నా వంతు వచ్చేటప్పటికి. ఓ రెండుమూడు ప్రశ్నలు అడిగి వదిలారు. విషయమేంటంటే, మనోళ్ళకి ఫాల్స్ ప్రెస్టీజ్ ఎక్కువ. అదిలా అప్పుడప్పుడూ బయటపడుతూ ఉంటుంది..

 4. బుజ్జి said...

  నేను మాంఛి సెటైర్ ఎక్స్పెక్ట్ చేసాను మీ దగ్గర నుండి.. అసలే మీకు బెగ్గర్ ఖాన్ అంటే బోల్డంత అభిమానం కదా అని. disappointed :(

 5. భావన said...

  అలా కాదు లెండి మీరు మరీ ఏక పక్ష నిర్ణయాలు చేసేస్తున్నారు. ఎంత మంది ఖాన్ లు వస్తారు అందరిని ఇలానే ఆపుతున్నారా? ఆయూబ్ లు, ఇబ్రహీం లు ఎంత మంది ఏమి ప్రశ్నించబడకుండా నే వస్తున్నారు.. ఆపటం కాదు అక్కడి ప్రశ్న, ఇన్ఫర్మేషన్ చూసి వెంటనే పంపించెయ్యవచ్చు, అతనికి బోలెడంత బాక్గ్రౌండ్ హిస్టరి వుండే వుంటుంది, పేద్ద డేటాబేస్ లు మావి, చీమ చిట్టుక్కంటే మేము చటుక్కున పట్టేస్తాము అని ఓ చెప్పుకుంటారు కదా మరి. ... నిర్లక్ష్యం ప్రాసెసింగ్ లో అనుకుంటా నేనైతే.. ఈ ఖాన్ లు ఏమి వుంది లే కాని (అందులో NY, newark ఏర్ పోర్ట్ లు గురించి తెలిసిన గోలే కదా.. సంతకాలు మానరా వేలి ముద్రలెయ్యరా అనుకుంటు వచ్చేస్తారు వుద్యోగాలకు) కలాం గారికి జరిగింది మాత్రం తప్పు ముమ్మాటికి అక్కడి అధికారుల అహంకారానికి, నిర్లక్షానికి చిహ్నం అనుకుంటున్నా నేనైతే...

 6. కొండముది సాయికిరణ్ కుమార్ said...

  కరెక్టుగా చెప్పారు. రాబోయే సినిమాకి పబ్లిసిటీ స్టంటు తప్ప మరేమీ కాదు.

 7. Unknown said...

  ఇంకా ఈ విషయం మీద మీ పోస్టు పడలేదేంటా అని చుస్తున్నా. బాగా చెప్పారు. :)
  కాని ఇక్కడ ఈయన stmts కి మన భారత దేశం లో వివిధ వ్యక్తుల స్పందన గురించి రాయకుండ నిరాశపరిచేసారేం?

 8. Bolloju Baba said...

  హ్మ్
  మొత్తం మీద "అమెరికా దేశభక్తి" మన బ్లాగుల్లో వరదలై పారుతున్నదంటారు.

  బొల్లోజు బాబా

 9. Sravya V said...

  జీడిపప్పు గారు బాగుంది మీ పోస్టు ఎంత కోపం వస్తే మాత్రం మరీ అన్ని "వీడు" లా :)
  బాబా గారు ఇది మీకు అమెరికా దేశభక్తి లా అనిపిస్తుందా నాకేమో commen sense లాగ అనిపిస్తుంది !

 10. Bolloju Baba said...

  శ్రావ్య గారు థాంక్యూ

  రోడ్డుపై నుంచో పెడితే కనీసం ఓ యాభై కోట్ల మంది గుర్తించగలిగిన షారూక్ ఖాన్ ని, పక్కింటి వాడు కూడా గుర్తించలేని ఒక కామన్ మేన్ తో పోల్చటం commen sense లాగ అనిపిస్తుందా మీకు?

  ఈ సంఘటన వెనుక రకరకాల కారణాలు ఉండవచ్చు. నేను కాదనను.

  కానీ అంత గొప్ప దేశమూ తన దేశం లోకి అడుగుపెడుతున్న ఒక వ్యక్తి గురించిన కొద్దిపాటి సమాచారం సేకరించటంలో కొంత అలసత్వం ప్రదర్శించిందనే నా వ్యక్తిగత అభిప్రాయం.

  బొల్లోజు బాబా

 11. మంచు said...

  నాది ఇదె కామెంట్ :-)
  "" జీడిపప్పు గారు బాగుంది మీ పోస్టు ఎంత కోపం వస్తే మాత్రం మరీ అన్ని "వీడు" లా :) ""

  http://kovela.blogspot.com/2009/08/blog-post_16.html?showComment=1250521964629#c4079992380855110603

  లొ

  Sai Brahmanandam Gorti గారి కామెంట్ చదవండి (ఇప్పటికె చదవక పొతే ). బావుంది.

 12. మంచు said...

  ఇంతకీ ద్ర్రొహి సల్మాన్ ఎమని కామెంటాడొ ఎవరయిన చెప్పండి . నేను మిస్ అయ్యాను. :-))

 13. Sravya V said...

  బాబా గారు ముందు గా మీరు ఎందుకు థాంక్స్ చెప్పారో నాకు అర్థం కాలేదు, నా కామెంట్ పర్సనల్ గా మిమ్మల్ని ఏమైనా టార్గెట్ చేసినట్లు అనిపిస్తే దానికి సారీ !
  ఇక రోడ్డు మీద నుంచో పెడితే 50 కోట్లు మంది గుర్తు పడితే యే తప్పు చేయరని గ్యారంటీ ఉందా ? మీ లాజిక్ ఏమిటో నాకేమి అర్థం కాలేదు ! ఇక పొతే షారుక్ గురించి ఆయన కు జరిగిన అవమానం గురించి (మీ ఉద్దేశ్యం లో :) ) ఎంత తక్కువ గా మాట్లాడుకుంటే అంత మంచిది నా ఉద్దేశ్యం లో ఆయన తన పనుల కోసం అమెరికా కి వెళ్ళాడు కాని దేశాన్ని ఉద్దరించే పని మీద కాదు వెళ్ళింది ! ఇదే డిస్కషన్ కలాం గారి విషయం లో జరిగి ఉంటే నా రెస్పాన్స్ వేరే ఉండేది. మనకు ఎదురైన ప్రతి విషయం నా జాతికి నా మతానికి లేకపొతే నా దేశాని కి జరిగింది అని ఆలోచించాలా ? మళ్లీ ఇక్కడ కూడా కొన్ని exceptions మంచి జరిగితే అది పర్సనల్ చెడు జరిగితే ఏదో ఒక "trump card" వాడటం మన జనాలకు బాగా అలవాటు గా మారిపోయింది .

 14. మంచు said...

  Interestingly, the same day that SRK was detained in Newark, there came news that the great Bob Dylan, wandering around Long Branch, near New York City
  , was asked for an ID by two cops too young to know who he really was. When he couldn’t furnish one, Dylan was taken back to the resort where he was putting up and staff there vouched for him. And America is Dylan’s own country. Was there a furore? Not even a little blowin’ in the wind.


  SOURCE: http://economictimes.indiatimes.com/News/PoliticsNation/Dont-make-a-big-deal-of-Shah-Rukh-Khans-detention/articleshow/4900958.cms

 15. Shashank said...

  బా చెప్పావు. కాని "ఖాన్" అని పేరున్న ప్రతిఒక్కడిని ఇలా చేయడం ఎంత వరకు సబబో తెలీదు. దొంగ passport తో వేరే పేరు తో వస్తే?

 16. Bolloju Baba said...

  శ్రావ్య గారికి
  థాంక్స్ కి అంత డీప్ మీనింగేమీ లేదు. just like that. అంతే.

  ఇక విషయానికి వస్తే, పై లింకులో ఇచ్చిన గొర్తి గారి కామెంటు చూసాకా, నా అభిప్రాయాలను సమీక్షించుకోవాలా అనిపించింది.

  పోనీ లెండి నూతిలో కప్ప, దానినే లోకం అనుకుంటుందంట. అలాగే, నాకూ ఇలా ఆలోచించుకోవటమే ఎక్కువ ఆనందాన్నిస్తుంది. (చాలామందికి ఇస్తున్నట్లుగానే). ఇలాగే కానిచ్చేస్తాను.

  థాంక్యూ
  బొల్లోజు బాబా

 17. Sravya V said...

  బాబా గారు నేను ఇంతకు ముందు నాకు ఇంగ్లీష్, హిందీ కొద్ది గా కష్టం గా అర్థమవుతాయి, తెలుగు తిరుగు లేదు అనుకోనేదాని ఇప్పుడు మీ కామెంట్ చూసిన తరవాత తెలుగు కూడా కష్టమే అని అర్థమైంది, ఏమి చేస్తాం :(
  పోనీ లెండి నూతిలో కప్ప, దానినే లోకం అనుకుంటుందంట. అలాగే, నాకూ ఇలా ఆలోచించుకోవటమే ఎక్కువ ఆనందాన్నిస్తుంది. (చాలామందికి ఇస్తున్నట్లుగానే). ఇలాగే కానిచ్చేస్తాను>>
  దీని భావం ఏమిటో నాకేమీ తెలియలేదు నేనేమి అలాంటి భావం తో నా కామెంట్ లో వ్రాయలేదే? మిమ్మలిని నూతి లో కప్ప అనవలసిన అవసరం నాకేమి లేదు అనను కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి !

 18. Bolloju Baba said...

  ఇక విషయానికి వస్తే...... అన్నదగ్గరనుంచి నా కామెంటు మిమ్ములను ఉద్దేశించినది కాదు.

  ముమ్ములను ఉద్దేసించినది మొదటి వాక్యం మాత్రమే.

  ఏంటో జీడిపప్పుగారి బ్లాగుకూ నాకూ ఎప్పుడూ కమ్యూనికేషను గాప్ వస్తూంటుంది. :-)

 19. చదువరి said...

  బాబాగారూ,
  షారుఖ్‌ను విమర్శించి, అమెరికా చర్యను సమర్ధించినవారిని అమెరికా దేశభక్తులా? ఓహ్!

  నేను ముస్లిమును కాబట్టే నాకిలా అవమానం జరిగింది అని షారుక్కన్నాడు. మరి ఖాన్‌ను సమర్ధిస్తూ, అమెరికా చర్యను విమర్శించేవారంతా ముస్లిము భక్తులేనా? ముస్లిము పక్షపాతులేనా?

  మీరు ఈ టపాలోని అభిప్రాయానికి విరుద్ధంగా అభిప్రాయపడి ఉంటే అది సహజంగానే ఉండేది. కానీ ఈ అభిప్రాయం వెలిబుచ్చినవాళ్ళను అమెరికాదేశ భక్తులని మీరనడం ఆశ్చర్యం కలిగించింది.

 20. మహాపోకిరి said...

  bollOju gaaru,

  i would doubt even if 10% of the immigration officials would have known about King Khan. I like King Khan. I liked him since "Fauji" days.

  ఈ భూ ప్రపంచమ్మీద కొన్ని వందల దేశాలు వున్నాయి. ఒక్కొ దేశానికి కనీశం పదిమంది VIPs వుంటే వాళ్ళందర్నీ ఎలా గుర్తుపెట్టుకుంటారు. Immigration officer ఉద్యోగానికి ఇంటర్వ్యూ చేసినప్పుడు "కజకిస్థాన్ లో 10 celebrities పేర్లు చెప్పు" అని అడగరు కదా?

  ఇమ్మిగ్రేషన్ చెక్కు 1-2 గంటలు పట్టటంచాలా సాధారణం. అలాంటిది దేశభద్రత విషయంలో 2గం. కూర్చోపెట్టటంలో తప్పులేదు.

 21. జీడిపప్పు said...

  @ చిలమకూరు విజయమోహన్ గారు - ధన్యవాదాలు

  @ భాస్కర్ రామరాజు గారు - అంతే కదా మరి. పైసామే పర్మాత్మా హై!!!!

  @ sreenyvas గారు - కరెక్టుగా చెప్పారు

  @ బుజ్జి గారు - నిజమే, బెగ్గర్ ఖాన్ అంటే చాలా అభిమానమే :). ఎందుకో సెటైర్ వైపు ఆలోచించలేదు!

  @ భావన గారు - ఇందరి అభిప్రాయాలు చూసాక కూడా నాది ఏక పక్షమా లేక బహు పక్షమా :)

  @ కొండముది సాయికిరణ్ కుమార్ గారు - వీడు పబ్లిసిటీకోసం ఎంతకయినా దిగజారే రకం కదా మరి.

  @ శ్రావ్య గారు - "భారత దేశం లో వివిధ వ్యక్తుల స్పందన" అంటారా? దాదాపు అందరిదీ ఒకే పాట కదా!

  @ బొల్లోజు బాబా గారు - బ్లాగుల్లో కామన్‌సెన్స్ వరదలై పారుతున్నది :)

  @ శ్రావ్య గారు - పబ్లిక్ బ్లాగు కాబట్టి "వీడు"తో సరి పెట్టాను. లేకుంటే .. :) :)

  @ మంచు పల్లకీ గారు - :) అందరికంటే ముందు సల్మాన్ అన్నాడు అనుకుంటా ఇదంతా పబ్లిసిటీ స్టంటు అని.

  @ శశాంక్ - దొంగ పాస్‌పోర్ట్ తో వస్తే.. రూల్స్ ప్రకారం చెయ్యాల్సింది చేస్తారు.

  @ చదువరి గారు - చాలా చక్కగా చెప్పారు

  @ మహాపోకిరి - well said beavis :pouce:

 22. Varunudu said...

  buDugU, nI blAg lO :smileys: lEni lOTu baaga koTTochchinaTTu, tannochchinaTTu, baadochchinaTTu kanipistOMdi. Edainaa ErpaaTu ceyyaraadU?

 23. జీడిపప్పు said...

  వరుణుడు గారూ, మొదట్లో చాలా ప్రయత్నించాను కానీ కుదరలేదు. ఏదో plug-in ఉంది కానీ ఈ టెంప్లేట్‌తో compatible కావడం లేదు. ఇంకోసారి ట్రై చేస్తాను.

 24. Unknown said...

  I totally disagree with your blog which is highly opinionated. It is a known fact that the immigration officials overdo things especially with people of South Asian origin. Just because something is done in USA does not mean that it is correct. Every system is open for criticism and is improved from time to time only through constant feedback. FYI, if a high profile person takes care in highlighting this issue, then this brings awareness among the public and the people concerned and ultimately leads to improvement in policies and procedures. BTW, do you understand what frisking means? One more thing, since you are writing a blog open for public, usage of terms like "veedu" are highly discouraged and reflect the type of behaviour seen in the telugu discussion forums in other websites. I am disappointed that things like these are considered blogs and posted in Koodali.

 25. జీడిపప్పు said...

  "I totally disagree with your blog which is highly opinionated."

  Thank you for your opinion.

 26. మహాపోకిరి said...

  Sriram said "I totally disagree with your blog which is highly opinionated. It is a known fact that the immigration officials overdo things especially with people of South Asian origin."

  You would've made a better impression if the word "totally" wasn't used in your reply.

  I didn't know that the immigration officials targeted people of South Asian origin. Can you please pardon my ignorance and post some links to a few articles.

  the blogger can choose whatever words he wants to use. It is completely upto you to decide if you want to read it or not.

 27. మంచు said...

  Sairam
  Your comment
  " He immigration officials overdo things especially with people of South Asian origin. Just because something is done in USA does not mean that it is correct "

  I don't think it is correct.

  * Just something done in America - is NOT just something. Its biggest terrorist attack in last century (?)

  * They suffered in that attack.. not you and I. The persons who suffered would know how strict he should be next time.

  * All the direct terrorist attacks on America has similar background (region or religion or whatever) . I don't see why they should not be more (EXTRA) careful about the persons having same background

  * Any officer in America (govt or non govt) works based on the instructions given to them not by the common sense or any other influences. Sometimes they are dumb like machines to carry their instructions without thinking. He doesn't care movie star or politician to perform his duties. (personal observation - could be wrong)

  * Sharuk doesn't have any privilege to refuse the security standards taken by any country. These standards may be different for different country origins. For ex. India takes a month to issue a first time visa to Pakistani national and takes 1 day to issue a visa to USA.


  Lastly - (Its not for you )

  దేశభక్తి అంటె మనవాడు చేసిన అడ్డమయిన పనిని గుడ్డి గా సమర్దించడం కాదు.
  " ఈ విషయం " లొ మనవాడు చేసింది తప్పు , అమెరికా వాడిది తప్పు లేదు అంటె అమెరికా మీద భక్తి పొంగి పొరలుతున్నట్టు కాదు.
  కలాం విషయం లొ అమెరికా అదికారులను తప్పుపట్టిన వారె ఇప్పుడూ అమెరికా అదికారులను సమర్దిస్తున్నారు.

 28. Telugu Velugu said...

  "I totally disagree with your blog which is highly opinionated."

  Thank you for your opinion.

  LOOOOOOOOOOOOL ! Cannot stop laughing just thinking of this comment ! Cool common-sense post,( which is not so common these days) and totally love your comment(retort?) for it's highly hilarious nature. You go Budugu !

  Jeedipappu vardhillaali ! :-))

 29. జీడిపప్పు said...

  Thank you Z gaaru. mee identity?? :)

Post a Comment