కొత్త H1-B వీసాలు వద్దు

Posted by జీడిపప్పు

నాల్రోజుల క్రితం విదేశాంగ కార్యదర్శి తన అమెరికా పర్యటనలో భాగంగా విలేఖరులతో మాట్లాడుతూ "H1-B ల గురించి మనమేమీ చెయ్యలేము" అన్నాడు. అంతే కదా మరి.. ఇల్లు కట్టించేవాడికి తెలుసు కూలీలను తీసుకోవాలా వద్దా అని, మనకేమి హక్కు ఉంది చెప్పడానికి? ఇక మీడియా ఎప్పటిలాగే H1-Bలకు అన్యాయం అని మొరుగుతూనే ఉంది.ఆ వార్త కింద మన దేశానికి అన్యాయం అంటూ కామెంట్లు ఉన్నాయి.  కాస్త లాజికల్ గా ఆలోచిద్దాము.  అసలు ఈ తరుణంలో కొత్త H1-Bలు అవసరమా?

ఇప్పటికే IT కంపెనీలు ఉన్నవాళ్ళను ఉద్యోగాలనుండి తీసేస్తున్నారు. కొత్త ఉద్యోగాలు దాదాపు శూన్యం. రాబోవు రోజుల్లో మరిన్ని firings ఉంటాయే తప్ప hirings ఉంటాయన్న నమ్మకం, ఆశ లేదు. గత ఆరు నెలల్లో ఉద్యోగాలు ఊడినవాళ్ళకు కొత్త ఉద్యోగాలు వస్తున్న దాఖలాలు లేవు. వేలమంది స్వదేశాలకు వెళ్ళిపోతున్నారు.

ఒక వేళ ఈ ఏడాది ఆఖరికి మళ్ళీ ఆర్థిక వ్యవస్థ బాగుపడినా అమెరికాలో ఉన్నవారికే అవి సరిపోవు. ఉద్యోగాలు పోయిన అనుభవజ్ఞులకు ముందు ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళందరూ అయిన తర్వాత dependent గా వచ్చి తర్వాత H1 కు మారిన వాళ్ళకు ఉద్యోగాలు కావాలి. వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చి మిగిలితే కొత్తవాళ్ళకు ఇవ్వాలి. అందుకే ఈ ఏడాది ఒక్క H1 ఇవ్వకపోయినా నష్టం లేదు. ఉన్నవాళ్ళతో, అమెరికన్లతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఏడాది సాఫీగా సాగిపోతుంది. వచ్చే ఏడాది కావాలంతే అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు. పని చేయించుకొనే అమెరికా వాడికి లేని దురద పని చేసే మనకెందుకో!!

ఇది తెలియని మన మీడియా, కుహానా మేధావులు భౌ భౌ అని మొరుగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వేళ ఎవరయినా ఉద్యోగాన్వేషణకు H1 పైన అమెరికాకు వస్తే,  స్వర్గం చూస్తారు. అది కూడా మామూలు స్వర్గం కాదు.. కలలో కూడా ఊహించని స్వర్గం. నమ్మండి!

8 comments:

 1. MURALI said...

  you know onething. I heard a news that a guy who has already a H1B, went on a leave to India. When he returned to US, imigration officers stopped him at the airport and called up his company. They got to know that this guy is on bench. They sent back him to India from airport itself. He has a house, furniture and car here. Now he is looking for people to buy them.

  Another instance, a guy came on H1B to work for his company as onsite co-ordinator. Imigration officers sent him bak and asked him to come with L1B.

 2. Ajit Kumar said...

  సాఫ్టవేర్ రంగంలోగానీ మరే వ్యాపారంలో గానీ నష్టాలు వస్తున్నాయనే పుకార్లకు ఆర్ధికమాంద్యం అనే దయ్యం పేరుతో మాయగాళ్ళు (వ్యాపారులు) చెప్పే కథలు తప్ప మీకు తెలిసిన నిజాలేమిటి?

 3. జీడిపప్పు said...

  @ మురళిగారు - H1 వాళ్ళు ఈ టైంలో అమెరికా దాటితే రావడం కష్టమే.
  @ అజిత్ కుమార్ గారు - మిగతా ఏమో కానీ.. ఆర్థికమాంద్యం వల్ల అమెరికాలో Food, Clothing, Housing, Cars, Recreation, Tourism, Electronics, Traveling sectors చాలా దెబ్బ తిన్నాయి .

 4. సూర్యుడు said...

  అయితే మీరు అమెరికాలో ఉన్నారన్నమాట ;)

  వేరే పొస్ట్ లో మీ కామెంట్ లో స్వార్ధపరుడు అని వ్రాసుకుంటే అర్ధం కాలేదు, ఇప్పుడు బాగా అర్ధం అవుతోంది ;) అయినా మరీ ఇంత స్వార్ధమా ;)

 5. జీడిపప్పు said...

  సూర్యుడు గారు - ఏదో మీ అభిమానం :)

 6. Shashank said...

  ఈ దేశం లో ఇగ H1 ల కాలం అయిపోయింది అనిపిస్తోంది. పెతీ జాబు కి citizens or gc holders కావాలి అంటున్నరు. సారే వాళ్ళ దేశం మనం ఏమి అనలేము. ఇలానే ఉంటే ఇంక కొద్ది నెలలలో మొత్తం h1 గ్యాంగ్ మళ్ళ సొంత దేశలకి తిరుగుటపా కట్టడం ఖాయం. అల చేస్తే అయినా మన దేశం కూసంథ బాగుపడుతుందేమో చూడాలి.

 7. జీడిపప్పు said...

  @ Shashank - pls check this http://jeedipappu.blogspot.com/2009/03/blog-post_05.html

 8. చైతన్య said...

  "పని చేయించుకొనే అమెరికా వాడికి లేని దురద పని చేసే మనకెందుకో!!"
  అవును మరి... పని చేయించుకునే వాడు డబ్బులు ఇవ్వాలి... పని చేసేవాడికి డబ్బులు కావాలి... మరి దురద ఎవరికి ఉండాలి?

Post a Comment