ఇజ్రాయిల్‌కు జై కొడదాం రండి

Posted by జీడిపప్పు

ఇజ్రాయిల్. ఆ పేరు వినగానే కొన్ని దేశాలు ఉలిక్కిపడతాయి. చుట్టూ తమను ద్వేషించే దేశాలు ఉన్నా ఎదుర్కొంటూ, కోటి జనాభా కూడా లేని ఆ దేశం పరోక్షంగా కొన్ని అగ్రరాజ్యాల రాజకీయాలను సైతం ప్రభావితం చెయ్యగలదు. పాలస్తీయులపైన అరాచకాలు అంటూ గగ్గోలు పెట్టేవారికోసం  కాదు ఈ పోస్టు, ఒకసారి భారతీయులందరూ ఇజ్రాయిల్‌కు జై కొట్టి శాల్యూట్ చేయాలి అని చెప్పడానికి. ఎందుకంటారా?

1972లో ఇజ్రాయిల్ తమ దేశానికి చెందిన పదకొండుమంది అత్యుత్తమ ఆటగాళ్ళను జర్మనీలోని మ్యునిక్‌లో జరిగే ఒలింపిక్ క్రీడలకు పంపించింది. అప్పటికే ఇజ్రాయిల్-పాలస్తీనాల మధ్య పోట్లాటలు జరుగుతున్నాయి. పాలస్తీనాకు చెందిన కొందరు "బ్లాక్ సెప్టెంబర్" పేరుతో ఒక తీవ్రవాద సంస్థను ఏర్పాటు చేసి మ్యునిక్‌కు వెళ్ళి 11 మంది ఆటగాళ్ళను హతమార్చారు. హత్య చేసిన వారిలో ముగ్గురు తీవ్రవాదులు పట్టుబడ్డారు.

ఒక్కసారిగా ఇజ్రాయిల్ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. తీవ్రవాదుల పట్ల చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. అప్పటి ఇజ్రాయిల్ ప్రధానమంత్రి అయిన గోల్డా మెయిర్ తాను, రక్షణ మంత్రి, అత్యంత ప్రమాదకర గూఢచార వ్యవస్థ అయిన మొస్సాద్ అధ్యక్షుడితో కలిపి "కమిటీ X" ఏర్పాటు చేసింది. కమిటీలోని సభ్యులు అందరూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఆ హత్యల వెనుక ఉన్న అందరినీ హతమార్చడమే సరి అయినదని, తద్వారా భవిష్యత్తులో తీవ్రవాదులు ఇజ్రాయిల్ అంటే భయపడతారని గోల్డా మెయిర్‌కు తెలిపారు.

గోల్డాకు ఇది నచ్చకపోయినా అసంతృప్తిగా ఆమోదించింది. అంతలో జర్మనీలో తీవ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి బందీలుగా ఉన్న ముగ్గురు తీవ్రవాదులను విడిపించుకుపోయారు. ఇది చూసిన గోల్డా మెయిర్  బ్లాక్ సెప్టెంబర్‌ను అంతం చేయమని కమిటీకి పూర్తి అధికారాలు ఇచ్చింది. ఆమె ఆదేశాల మేరకు మొస్సాద్ ఆరితేరిన తమ గూఢచారులను యూరోప్ అంతటా రంగంలోకి దింపింది.

కొద్దిరోజుల్లో బ్లాక్ సెప్టెంబర్ వెనుక ఉన్న ప్రముఖుల జాబితా తయారయింది. మొత్తం  25-30 మంది ప్రపంచంలోని వివిధ దేశాల్లో, ఎక్కువగా యూరోప్ దేశాల్లో తల దాచుకుంటున్నారు. వీరిని అంతం చెయ్యడంలో ఎక్కడా ప్రభుత్వ హస్తం ఉన్నట్టు ఆధారాలు ఉండకూడదు అన్న నియమమం పెట్టింది గోల్డా మేయిర్.

ఇందుకోసం మొస్సాద్ మెరికల్లాంటి ఏజెంట్లను ఎంపిక చేసింది. ఒక అంచనా ప్రకారం మొత్తం ఆపరేషన్ లోని సభ్యులు ఐదు గ్రూపులుగా విభజింపబడ్డారు:
 1. Aleph - హత్యలు చేయడంలో నిష్ణాతులయిన ఇద్దరు కిల్లర్స్
 2. Bet - Aleph గ్రూపులోకి కిల్లర్స్ ను నీడలా అనుసరించేవారు
 3. Heth - ఇందులోని ఇద్దరు గూఢచారులు మిగతా అందరికీ అవసరమయిన హోటళ్ళు, కార్లు, ఇతర వసతి సదుపాయాలు చూసుకుంటారు
 4. Ayin - ఇందులో ఆరునుండి ఎనిమిదిమంది ఉంటారు. లక్ష్యాన్ని వెతికి వారిని ఎక్కడ హత్య చేయాలో నిర్ణయించి,  హత్య జరిగిన తర్వాత Aleph, Bet గ్రూపుల సభ్యులు తప్పించుకొనే ఏర్పాటు చేయడం వీరి విధి
 5. Qoph - ఒక గ్రూపులో పని చేసే వారు మరొక గ్రూపుకు తెలియకపోవచ్చు. అన్ని గ్రూపుల మధ్య కమ్యూనికేషన్ ఈ ఇద్దరు చూసుకుంటారు.

అక్టోబర్ 16, 1972న మొదటి హత్యతో మొదలయిన ఆపరేషన్ కొన్ని ఏళ్ళ పాటు నడిచింది. మొదటి తయారు చేసుకున్న జాబితాలో ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా హత్య చేసారు. ఆపరేషన్‌లో ఎందరో ఏజంట్లు మరణించారు, లెక్కలేనంత డబ్బు ఖర్చయింది కానీ ఇజ్రాయిల్ ప్రజల్లో సంతృప్తి కలిగింది. ఈ ఆపరేషన్ తర్వాత ఏ తీవ్రవాద సంస్థ కూడా అంత ఎత్తున ఇజ్రాయిల్ ప్రజల ఆత్మాభిమానాన్ని గాయపరిచేలా దాడి చేయడానికి సాహసించలేదు.

దీని ఆధారంగా స్పీల్‌బర్గ్ "మ్యునిక్" అనే సినిమా తీసాడు. అందరూ తప్పక చూడవలసిన సినిమా ఇది. తీవ్రవాదులను ఎలా వెంటాడి, వేటాడి చంపారు అన్నది కథాంశం.

మనుషులను వెంటాడి కిరాతకంగా  చంపడాన్ని చూడమంటున్నాడు వీడేమి శాడిస్టు అనుకుంటున్నారా? అయితే ఈ క్రింది రెండు వర్గాల్లో మీరు రెండో వర్గానికి చెందినవారయితే ఈ సినిమా చూడకండి.

మొదటి వర్గం: మన దేశంలో ఎప్పుడు, ఎక్కడ తీవ్రవాదులు బాంబులు పెడతారో తెలియదు. "గోకుల్ చాట్‌లో బాంబు పేలినపుడు నా కుటుంబ సభ్యులు ఉండి ఉంటే" అని తలుచుకుంటే భయం వేస్తుంది. మొన్నటికి మొన్న ముంబైలో జరిగింది మన దేశానికే తలవంపు. అంతకంటే అవమానం మరొకటి ఉండదు. దాని వెనక ఉన్న తీవ్రవాదులను ఎలా శిక్షించాలి అంటే, భవిష్యత్తులో భారతదేశం పేరు చెబితే తీవ్రవాదులు భయపడాలి.

రెండవ వర్గం: తీవ్రవాదులు బాంబులు పేల్చినంత మాత్రాన వారిని చంపకూడదు. మొన్ననే పాకిస్తాన్ తీవ్రవాది పైన చార్జ్ షీట్ దాఖలు చేసాము. దాని ఆధారంగా విచారణ జరపాలి. ఈ లోపు కాందహార్ తరహాలో మరో హైజాక్ జరిగితే ఆ తీవ్రవాదిని విడిచిపెట్టాలి. రేపు నా కుటుంబ సభ్యులు ఉన్న చోట బాంబు పేలినా ఇలాగే చేయాలి.

ఎలాగూ మొదటిది జరగదు కాబట్టి  ఆ భావాలు ఉన్న వాళ్ళు "మ్యునిక్" సినిమా చూసి కాసేపు మన దేశంలో కూడా అలా జరుతున్నట్టు ఊహించుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకోండి!!

PS: ఈ పోస్టు లింకు లేదా content మీ మిత్రులకు forward చేయండి.

55 comments:

 1. Anonymous said...

  సుప్రీం కొర్టు ఉరిశిక్ష వేసినా అమలు చేయలేని సమాజం మనది.
  ఇజ్రాయెల్ ని అనుకరించడంలో చాలా దూరంలో ఉన్నాము.

 2. Indian Minerva said...

  May India follow Israel. Amen!!

 3. Indian Minerva said...

  అన్నట్టు. ఈ విషయంలో ఇజ్రయెల్ విధానం కూడా గొప్పదే నండోయ్... మొత్తం బందీలందరినీ కోల్పోవడానికైనా సిద్ధ పడతారు గానీ తీవ్రవాదులకు మాత్రం లొంగరు. మనలో ఆ నాడు ఒక్క రూపిన్ కత్యాల్(ప్రయాణికుడు) మాత్రమే పోరాడారు మిగతా పని మన మంత్రి గారు చక్క బెట్టుకొచ్చారు. అప్పటివరకూ మనచే గుర్తించబడని ఒక దేశనికి తలవంచి మరీ....

 4. చిలమకూరు విజయమోహన్ said...

  ప్రజలబాగు దేశంబాగెవరికికావాలండి మాకు వోట్లు తద్వారా అధికారం తర్వాత దేశాన్ని దోచుకోవడం ఇదే కావాల్సింది

 5. Anonymous said...

  పోస్టు చాలా బాగుంది,వందనాలు.ఇలాంటిదే కొన్ని సంవత్సరాల క్రితం (డబ్బైలలో అనుకొంటా) ఇజ్రాయేలు కమెండోలు విడిపించుకొన్న వారి హైజాకైన విమానం తో సహా నూట ఇరవైమందిని విడిపించుకొన్న వైనం రైడ్ ఆన్ ఎన్టబీ చిత్రంలో చూడొచ్చు.విజయోథ్సాహం తో తిరిగి వెలుతూ వారు పాడిన హీబ్రూ పాట వింటుంటే వళ్ళు గగుర్పొడుస్తుంది.ఎంటబీ విమానాశ్రయాని ఆదేశ అధ్యక్షుడు ఈడీ అమిన్ వేషం లో తీవ్రవాదుల మధ్య కు వెళ్ళి విడిపించుకొని వచ్చారు.

  మొన్న ముంబై దాడుల లో కూడా తాజ్ హొటల్ లో క్రికెటర్ల కు అండ గా ఉన్న ఇజ్రాయేలీ కమెండోలు మొదట స్పందించారనేది తెలిసే ఉంటుంది.వారు సర్వ సన్నద్ధంగా ఉండటానికి కారణం అణుక్షణం వారిపై జరిగే దాడులే అప్రమత్తత కలిగించింది.

  ఐతే మనవాళ్ళు ఒకసారి పాకిస్తాన్ లో అనుకుంటా స్కావేంజర్ల వేషం లో వెళ్ళి హైజాకర్ల బారి నుండి విడిపించుకొని వచ్చారు.

  మొన్న ముంబై దాడిలో తాజ్ కాక మరో హొటల్ లో జరిగిన కాల్పులలో మన కమెండోలు వాడిన గోడ అవతలి ప్రక్కనవి చూడగలిగే రైఫిల్స్ ఇజ్రాయేల్ వారి దగ్గరే కొన్నామనే విషయం పేపర్ల లో చదివే ఉంటారు.

  పందోమ్మిది వందల నలబై ఎనిమిది లో ఇజాయేల్ ఏర్పడినప్పుడు మొదటి అధ్యక్షుడిగా ఉండమని ఐన్ ష్టెన్ ను అడుగగా రాజకీయాలు పరిచయం ఇష్టంలేక ఒప్పుకోలేదు.

 6. రాజ మల్లేశ్వర్ కొల్లి said...

  ప్రపంచం ఇజ్రాయెల్ కి ఎందుకు గౌరవం ఇస్తోంది / ఇవ్వాలి అంటే.., ఇజ్రేలీ ఇంటెలిజన్స్ విజయం సాధించిన అనేక క్లిష్టమైన ఆపరేషన్స్ ఒక ఉదాహరణ గా చూపొచ్చు. అందులో 1976 లో జరిగిన "Operation Thunderbolt - Entebbe Hostage Rescue" ఒక అత్యుత్తమ ఉదాహరణ. ఒళ్ళు గగుర్పాటు కలిగించే Inspirational డాక్యుమెంటరీ ని ఈ క్రింద Youtube లింక్ లలో చూడొచ్చు.

  Part1
  http://www.youtube.com/watch?v=ffRQ6e29Dw0&NR=1

  Part2
  http://www.youtube.com/watch?v=DJU1VsgI_-I&NR=1

  part3
  http://www.youtube.com/watch?v=Lv7L0repSuA&NR=1

  Part4
  http://www.youtube.com/watch?v=Pe0zyp7Ijhg&NR=1

  Part5
  http://www.youtube.com/watch?v=xoeMvUW_Rck&NR=1

  part6
  http://www.youtube.com/watch?v=M4OTgYsqork

 7. Anonymous said...

  munich is pronounced as mew-nick ;-) AFAIK

 8. Anonymous said...

  బాగా రాసారు. ఇజ్రాయిల్ స్ఫూర్తి మనకూ ఉండాలి.

 9. Anil Dasari said...

  తీవ్రవాదులతో పోరాడే విషయం వరకూ ఇజ్రాయెల్‌ని ఆదర్శంగా తీసుకోవచ్చు కానీ అంతకు మించితే మంచిది కాదు. ఇజ్రాయెలేమీ పత్తిత్తు దేశం కాదు.

  స్పీల్‌బర్గ్ 'మ్యునిక్', 'షిండ్లర్స్ లిస్ట్' సినిమాలకి ఆయన యూదు నేపధ్యం పెద్ద ప్రేరణ.

 10. అసంఖ్య said...

  ఇరాన్, ఇరాక్ లు తుమ్మితే పెడబొబ్బలు పేట్టే అమెరికా, ఇజ్రాయిల్ పాలస్తీనా (గాజా స్ట్రిప్)ని దిగ్భందనం చేసి ఆప్రజలస్వాతంత్ర్యం మీద ఉమ్ము వేసినా కుయ్ కియ్ మనదు (ఓటుబ్యాంకు రాజకీయాలు). ఇది కూడా వారి (మొండి) ధైర్యానికి ఒక కారణం కావచ్చు.

 11. Praveen Mandangi said...

  విమోచనా పోరాట సంస్థ అయిన ఎల్.టి.టి.ఇ.ని హింసావాద సంస్థ అన్న ఈ సోకాల్డ్ శాంతి కాముకునికి నిజం హింసావాద దేశమైన ఇజ్రాయెల్ ఆదర్శదేశంలా కనిపించింది. ఏమి గొప్ప ఆదర్శవాదం ఇది?

 12. జీడిపప్పు said...

  @bonagiri గారు, @Indian Minerva గారు, @చిలమకూరు విజయమోహన్ గారు, @chaduvari గారు - ధన్యవాదాలు

  @telusukumdam గారు - ఆసక్తికరమైన విషయాలు తెలిపారు

  @రాజ మల్లేశ్వర్ కొల్లి గారు - మంచి లింకులు అందించారు. ప్రతి పౌరుడు చూడవలసిన డాక్యుమెంటరీ అది.

  @Anonymous గారు - సరి చేసాను. ధన్యవాదాలు

  @అబ్రకదబ్ర గారు - ఇజ్రాయిల్ నుండి మనం నేర్చుకోవలసినవి: గూఢచార వ్యవస్థ, ఆయుధాల నిర్మాణం, ఆధునిక వ్యవసాయం

  @ధవళ సోమశేఖర్ గారు - అమెరికా ఒక్కమాట కూడా అనలేదు, ఎందుకంటే ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే మరుసటిరోజు అమెరికాలోని సగం బ్యాంకులు మూతపడవచ్చు!!

 13. జీడిపప్పు said...

  @ISP Administrator గారు,
  పైన రెండు వర్గాలున్నాయి. అందులో మీరు ఏ వర్గానికి చెందినవారో కాస్త చెప్పగలరా?

 14. Anonymous said...

  "..హింసావాద దేశమైన ఇజ్రాయెల్ ఆదర్శదేశంలా కనిపించింది. ఏమి గొప్ప ఆదర్శవాదం ఇది?": కనిపించడానికేముంది.. మన కళ్ళజోడు రంగునుబట్టి మనకు కనబడే రంగు. ఎర్రజోడు పెట్టుకున్నవారికి లోకమంతా ఎరుపే! ఇక వాదాలు.. గతితార్కికభౌతికవాదాలు, మతితప్పిన రసాయనికవాదాలు, అడ్డగోలు అభౌతికవాదాలు.. సమర్ధించుకోడానికి మనమూ ఓ వాదాన్ని ఇసిరిపారెయ్యొచ్చు అవతలోడి మీద. ఉదాహరణకు - ఉదాహరణగానే - ఇజ్రాయిల్ సమర్ధనగా ఇలా అనొచ్చు.. "వాదంలో భాగంగా కొన్నిటికి వ్యతిరేకంగా కొన్నిటిని సమర్థించడం తప్పు కాదనే నమ్ముతాను. పాచిపట్టిన ఎర్ర సిద్ధాంతానికి దాని స్థానం చూపడం కోసం ఇజ్రాయిలును సమర్ధించవచ్చు"

 15. Kathi Mahesh Kumar said...

  మీ ధోరణి నాకైతే పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించలేదు. మొదటి నుంచీ మీది ఈ వాదమేగా!

 16. జీడిపప్పు said...

  అవును మరి.. "తీవ్రవాదిని" తరిమి కొట్టాలి.. ఎంతయినా మొదటి వర్గానికి చెందినవాడిని కదా!!

  అన్నట్టు అందులో వాదం లేదు, కామన్‌సెన్స్ ఉంది!

  ఇంతకూ పైన ఉన్న రెండు వర్గాల్లో మీరు ఏ వర్గానికి చెందుతారు మహేష్ గారూ?

 17. oremuna said...

  ఎందుకో నాకిక్కడ అందరూ మేధానులే కన్పిస్తున్నారు. :)

  ఇల్లు కాలుతుంటే బాయి ఎక్కడ ఏ దిక్కున త్రవ్వాలని వెనకటి మేధావులు మీటింగ్ పెట్టుకున్నారంట :)

 18. Praveen Mandangi said...

  @చదువరి
  స్కూల్ పిల్లల మీద బాంబులు వేసి చంపే జియోనిస్ట్ ఉన్మాదుల్ని సమర్థించే లెవెల్ కి ఈ మార్కిస్ట్-లెనినిస్ట్ తత్వవేత్త దిగజారలేదు, దిగజారబోడు కూడా. జియోనిస్ట్ ఉన్మాద చర్యల్ని నీలాంటి వాళ్ళు జీవితాదర్శాలుగా భావిస్తారు కానీ అలాంటి ఉన్మాద చర్యల వీడియోలు చూస్తుంటే ఇది మానవ సమాజమా లేదా మానవ మృగాల గుంపా అన్న డౌట్ వస్తుంది. ఆటవిక చర్యల్ని నగ్నంగా సమర్థించేవాళ్ళకి మాత్రం ఆ డౌట్ రాదు.

 19. Anonymous said...

  మనుషులంతా సమానం కాకున్నా అందరి ప్రాణాలైతె సమానమే కాదా? ఎందుకంటె పొయిన ప్రాణాలు తేలేము కదా!
  తీవ్రవాదులు చేసే హత్యలు ఘోరమైనవె. కాని "రైతుల ఆత్మ హత్యలు", "పేదరిక కారణమైన అనారోగ్య చావులు" ఎవరు చేసిన హత్యలు.

  మన దౌర్బాగ్యమేమంటె ఇలాంటి తీవ్రవాదులు చేసిన దిగ్భ్రాంతికరమైన హత్యలకు స్పందిస్తుంటాము.ఎందుకంటె ఇలాంటి వాటిలో బాధితులు ధనవంతులు, ఎగువ మద్యతరగతి వారుంటుంటారు.
  నిశబ్ధంగా హత్యకు గురికాబడె అనామకుల గురించి పట్టించుకోము.

  ఈ రెండు రకాల హత్యలకు కారణం సామ్రాజ్యవాదం మరియి వారి తొత్తులైన మన పాలకవర్గం.

 20. బుజ్జి said...

  interseting,
  @రాజ మల్లేశ్వర్ కొల్లి , interesting documenatry

 21. Kathi Mahesh Kumar said...

  @జీడిపప్పు: మీరు రెండుగా విభజించినంత సులువుగా మనుషులుండరు.నేను మూడొరకానికి చెందుతాను. Law of the land prevail అవుతూనే హింసకు ప్రతిహింస సమాధానం కాకూడదనుకునే moderate మనిషిని నేను. ఇక్కడ తీవ్రవాది మీరా నేనా అనేది చదివే అందరికీ తెలుసు.

 22. Kathi Mahesh Kumar said...

  http://en.wikipedia.org/wiki/Human_rights_in_Israel

 23. సుజాత వేల్పూరి said...

  అబ్రకదబ్ర గారితో ఏకీభవిస్తున్నాను.

 24. Anonymous said...

  చాలా బావుంది. పనిలో పనిగా మావో, మరి కొద్దిగా వెనక్కెళ్ళి స్టాలిను, ఇంకాస్త వెనక్కెళ్ళి హిట్లరు, .. అబ్బ ఎలాగా ఇందాకా వచ్చాం కాబట్టి అలాగే తామర్లేనూ, జెంగీజ్ ఖానూ అందర్నీ ఆదర్శంగా తీసుకుందాం. భూదేవికి యెదవ మానవుల పీడాపోద్ది.

 25. Praveen Mandangi said...

  నాజీ జెర్మనీ తరువాత నెంబర్ 2 జాతి దురహంకార దేశం ఇజ్రాయెలే కదా. ఇజ్రాయెల్ ని నమ్మికుంటే భూమి మీది భారం సులభంగానే తగ్గుతుంది.

 26. Anonymous said...

  ISP Administrator: ఓహో..! సద్దామ్ హుస్సేను కుర్దులనేంజేసాడు? రసాయనిక ఆయుధాలతో చేసిన ఒకే ఒక్క దాడిలో 4 వేల పైచిలుకు కుర్దులు అక్కడికక్కడే చచ్చిపోయారు. ఇది ఒకే ఒక్ఖ దాడి సంగతి. అలాంటివి ఎన్నెన్ని చేసాడో, ఎన్ని వేలమందిని (లక్షల మందిని అనే వాదన ఉంది) పొట్టనబెట్టుకున్నాడో సరైన లెక్క లేదు. కానీ అతడు మాత్రం అమర వీరుడు. ఇజ్రాయిలు మాత్రం ఉన్మాది. ఒక్కొక్కళ్ళకు ఒక్కో కొలబద్దన్నమాట!

 27. జీడిపప్పు said...

  @కత్తి మహేష్ కుమార్ -
  "హింసకు ప్రతిహింస సమాధానం కాదు" అనేవాళ్ళే ఆ రెండో రకానికి చెందుతారు. so మీరు చెప్పేదేమిటంటే, మీ కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఒక షాప్‌లో బాంబు బారిన పడితే, ఆ బాంబు పెట్టిన తీవ్రవాదులను చంపకూడదు. విచారణ జరపాలి, వాళ్ళు హైజాక్ డ్రామా ఆడి తప్పించుకొని వెళ్ళిపోయి మళ్ళీ బాంబులు పెట్టినా పరవాలేదు. అంతేనా?

  జరిగేపనేనా అది? మన బ్లాగులోకంలో కూడా ఒక తీవ్రవాది ఉన్నాడు. మీకు తెలుసు అనుకుంటా ఆ తీవ్రవాది ఎంత కల్లోలం సృష్టించాడో ఒకప్పుడు. కాబట్టి తీవ్రవాదులను ఆదిలోనే అంతం చెయ్యాలి కానీ ఆ తీవ్రవాదికి చెబితే వింటాడా?

  అన్నట్టు ఇంకొకరిని చూసి మంచిని నేర్చుకోవడానికి ఒప్పుకోని వాళ్ళే తీవ్రవాదులకంటే ప్రమాదకరం.

 28. Praveen Mandangi said...

  సద్దాం హుస్సేన్ కమ్యూనిస్టులని కూడా చంపాడు. వియత్నాం యుద్ధంలో అమెరికా సామ్రాజ్యవాదులు చంపిన యాభై లక్షల మంది, కొరియా యుద్ధంలో హత్యకి గురైన నలభై లక్షల మందితో పోలిస్తే సద్దాం హుస్సేన్ చేతిలో చనిపోయిన కుర్దుల సంఖ్య, కమ్యూనిస్టుల సంఖ్య చాలా తక్కువే. అమెరికా ఇరాక్ పై దాడి చేసినప్పుడు ఇరాకీ కమ్యూనిస్ట్ పార్టీ సద్దాం హుస్సేన్ పక్షాన నిలబడింది ఇందుకే.

 29. సుజాత వేల్పూరి said...

  జీడిపప్పు గారు,
  హింసకు ప్రతి హింస సమాధానం కాదని నేనూ నమ్ముతాను. కానీ శిక్ష ఉండాల్సిందే! కానీ ఏ వ్యక్తిగత కక్షా, పగా లేకుండా తెగబడే తీవ్రవాదుల విషయం వేరు. వాళ్లని ఏరి పారేయకపోతే జాతికే ముప్పు.

  బ్లాగర్లతో అభిప్రాయ భేదాలుంటె వారితోనే పోనివ్వండి. కుటుంబాన్ని లాగి ఎమోషన్స్ రెచ్చగొట్టడం భావ్యమా? ఇంతకు ముందు స్వప్నిక పై యాసిడ్ దాడి విషయంలో కూడా కొందరు ఇదే విధంగా స్పందించారు.ఎంకౌంటర్ అనాగరికమని వాదించిన వారితో "ఇదే మీ ఇంట్లో ఎవరిమీదైనా యాసిడ్ పోస్తేనో" అని!

  అర్థం చేసుకుంటారని ఆశిస్తాను.

 30. Anonymous said...

  సుజాత గారు, ఒక వ్యక్తిని మరొక వ్యక్తి అనుకోకుండా కారుతో గుద్ది లేదా క్షణికావేశంలో కత్తితో పొడిచినా నేను ఇలా చెప్పేవాడిని కాదు. మనము మాట్లాడుతున్నది కరుడుగట్టిన తీవ్రవాదుల గురించి. అలాంటివారిని ఏరివేయాలి అన్నదానిని సమర్థించని వాళ్ళే అసలయిన తీవ్రవాదులు అని చెబుతున్నాను.

  ఇక కుటుంబ సభ్యులను లాగడం - ఇది కావలనీ మరీ చేసాను. ఒక సాధారణ వ్యక్తితో చర్చించేటపుడు అయితే తప్పే కానీ ఇంత జరుగుతున్నా తీవ్రవాదులను అంతం చేయడాన్ని వ్యతిరేకించే నిజమయిన తీవ్రవాదులతో చర్చించడానికి ఇదే సరి అయిన మార్గం.

  చర్చకు దిగినపుడు "పక్కనోళ్ళ పైన బాంబులు పడితే అన్నదాని గురించే మాట్లాడాలి, మా వాళ్ల పైన బాంబులు పడితే" అన్నదాని గురించి చర్చించకూడదు అనడం సమంజసంగా లేదు. పక్కనోళ్ళ గురించి చెప్పేటపుడు అది మనకే జరిగితే అని ఆలోచించాలి కదా?

 31. హరి said...

  ఒక మనిషి చేసే ఒకటి రెండు పనుల వల్ల ఆ మనిషి మంచి చెడులని గుర్తించలేం. ఆ పనుల ఆధారంగా ఈ మనిషి చెడ్డ వాడని, ఆ మనిషి మంచి వాడని ఒక నిర్ణయానికి రాలేం. అయితే అతడు చేసిన పనులను విచారించి తప్పకుండా తగిన శిక్ష విధించాల్సిందే. పనులు మాత్రమే మంచివి, చెడ్డవి ఉంటాయి కాని, అవి చేసే మనుషులు కారు. అందుకే శిక్ష పూర్తి చేసుకున్న మనిషిని సమాజం మామూలు మనిషి గా గుర్తిస్తుంది.

  దేశాలు దీనికి మినహాయింపేమీ కాదు. ప్రతీ దేశం కూడా కొన్ని మంచి పనులు, కొన్ని చెడ్డ పనులు చేసి ఉండ వచ్చు. దీనికి కమ్యూనిస్టు దేశాలేమీ మినహాయింపు కాదు. ప్రజాస్వామ్య దేశాలు, నియంతృత్వ దేశాలు, కమ్యూనిస్టు దేశాలు కూడా ఏదో ఒక అకృత్యానికి వివిధ సందర్భాలలో పాల్పడ్డాయని చెప్పక తప్పదు. ఏది ఎక్కువ చెడ్డ, ఏది తక్కువ చెడ్డ అనేది ఎడతెగని వాదన. అయితే దురదృష్ట వశాత్తు దేశాల తప్పొప్పులు విచారించే వ్యవస్థ లేదు. కాబట్టి దేశాల మధ్య ఇప్పటికీ అరాజకత్వం రాజ్యమేలడంలో ఆశ్చర్యం లేదు.

  ఇప్పుడు సమస్య అల్లా ఒక మనిషి కాని, మనుషుల సమూహం కాని మతం కాని, మరే ఇతర కారణాల వల్ల కాని ప్రజల పై, వ్యవస్థ పై దాడులు, హత్యా కాండ జరపడం. అటువంటి వారిని తప్పకుండా శిక్షించాల్సిందే. వారు నేరం చేసి వేరే దేశానికి వెళ్ళి దాక్కున్నంత మాత్రాన మినహాయింపు లేదు. ఎలాగూ దేశాల మధ్య అరాజకత్వమే ఉంది కనుక, అన్యాయం జరిగిన దేశం తనకు తోచిన విధంగా దోషులైన వారిని శిక్షించడంలో తప్పు లేదనిపిస్తోంది. ఈ నాడు ప్రబలుతున్న తీవ్ర వాదాన్ని అరికట్టాలంటే అంతకన్నా మార్గం లేదేమో. ఒక వేళ ఉందని ఎవరైనా అనుకుంటే వ్యర్థ వాదాలకన్నా అవి ఇక్కడ సూచిస్తే బాగుంటుంది.

 32. Anonymous said...

  ISP Administrator: సరే, సద్దాము కంటే అమెరికావోడే ఎక్కువమందిని చంపాడు.. కానీ దానికీ - ఇజ్రాయిలువాడు బడుల మీద బాంబులేసి పిల్లలను చంపాడని చీదరించుకోడానికి, అదే నోటితో సద్దాముహుసేను (జాతి తుడిచివేతకు - ఎథ్నిక్ క్లెన్సింగు - పాల్పడినవాడు) భజించడానికీ సంబంధం ఏంటి?

  సిద్ధాంతాల మాటున వల్లమాలిన స్వేషం మీ భావాల్లో కనబడుతోందే తప్ప, మీరు చేసే వాదనల్లో నిలకడ కనబడ్డంలేదు. అందుకో ఉదాహరణే ఇజ్రాయిలుపై ద్వేషం, సద్దామ్‌పై ప్రేమ. అదే సద్దాము, 80ల్లో అమెరికాకు మిత్రుడు. అక్కడినుంచి ఆయుధాలు తెచ్చుకున్నాడు. అమెరికా సహాయంతో తయారుచేసుకున్న రసాయనిక ఆయుధాలతోనే కుర్దులను చంపాడు! మరి సద్దాము ఎలా అభినందనీయుడయ్యాడు?

  మీరు సద్దామ్ హుసేన్ను కీర్తిస్తేను, ఇజ్రాయిలును విమర్శిస్తేను అభ్యంతరమేం లేదు.. కానీ అందుకు మీరు చూపించే కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయంతే!

  జీడిపప్పు: రైలుపట్టాల లాగా రెండు చర్చలు సాగుతున్నాయిక్కడ. ఏంటిది అని చిరాకు పడకండి.

 33. జీడిపప్పు said...

  చదువరి గారు, ఇందులో చిరాకు పడవలసినదేమీ లేదు. అందుకే నేను కూడా ఆ ట్రాక్ తాకలేదు :)

 34. Praveen Mandangi said...

  "Peaceful collaboration with imperialism" పేరు చెప్పి సోవియట్ యూనియన్ ని విఛ్ఛిన్నానికి కారకులైన కృషేవ్, బ్రెజ్నేవ్ లాంటి పక్కా అవకాశవాదుల కంటే సద్ద్దం హుస్సేనే నిజాయితీపరుడని నేను నమ్ముతాను. సద్దాం హుస్సేన్ కమ్యూనిజాన్ని వ్యతిరేకించాడని నాకు తెలుసు. కమ్యూనిజాన్ని వ్యతిరేకించే వర్గంలో చాలా మంది కంటే సద్దాం హుస్సేనే నిజాయితీపరుడు. అప్పట్లో కమ్యూనిస్టులని చంపడానికి అమెరికా సామ్రాజ్యవాదుల దగ్గర ఆయుధాలు కొని, తరువాత అదే ఆయుధ సంపత్తితో అమెరికా సామ్రాజ్యవాదులకి బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు. ప్రపంచంలో ఉగ్రవాదానికి అందరికంటే పెద్ద కర్త, కర్మ, క్రియ అమెరికా సామ్రాజ్యవాదులే. 1991 వరకు కోల్డ్ వార్ పేరుతో ప్రపంచాన్ని టెర్రరైజ్ చేసి, తరువాత ఇస్లాం వ్యతిరేక యుద్ధం పేరుతో ప్రపంచాన్ని టెర్రరైజ్ చెయ్యడం మొదలుపెట్టింది. అమెరికాని విమర్శిస్తే ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు రావని భారత పాలక వర్గం వాళ్ళ భయం, అమెరికా కుప్పకూలితే అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉద్యోగం సంపాదించే చాన్స్ రాదని భారత హైయర్ మిడిల్ క్లాస్ వర్గం వాళ్ళ భయం. రాజు బట్టలు వేసుకోలేదన్న నిజం మాట్లాడితే తాము రండా:పుత్రులమైపోతామని భయపడే అమాయక రాజభక్తులు రాజు గారి చేష్టల గురించి మాట్లాడడానికి ఎంత భయపడతారో, అమెరికా సామ్రాజ్యవాదం వల్ల ప్రయోజనం పొందాలనుకునేవాళ్ళు అమెరికాకి వ్యతిరేకంగా మాట్లాడడానికి అలా భయపడతారు.

 35. చైతన్య said...

  మొన్ననే A wednesday సినిమా చూసాను... ఆహా... నిజంగా ఆ సినిమా చూసి మనలో కొంతమంది అలా మారి ఆ తీవ్రవాదుల్ని మట్టుబెడితే... మన దేశం ఎంత ప్రశాంతంగా ఉంటుంది అని అనిపించింది ఆ క్షణం.
  కాని హింస కి ప్రతిహింస ఎప్పటికి సమాధానం కాదు... వీలైనంత వరకు అవతలి వ్యక్తిని మార్చటానికి ప్రయత్నించాలి...
  కాని అది అన్ని సందర్భాలలోనూ సాధ్యం కాదు...
  అలా అని వెంటపడి పైశాచికంగా చంపటం కూడా అంత అభినందనీయం కాదేమో! వాళ్ళకి మనకి తేడ ఉంది కదా!
  వాళ్ళు మనల్ని చంపుతున్నట్టే మనం కూడా వాళ్ళ వెంటపడి చంపటం కంటే... చంపటం కోసం పట్టుకున్న వాళ్ళని వెంటనే శిక్షార్హులుగా నిర్ణయించి ఆ వెంటనే శిక్ష(ఉరి శిక్ష కూడా కావచ్చు) అమలు చేస్తే... అప్పుడు అది చట్టపరంగా చేసినట్టు ఉంటుంది కదా...
  మన దేశంలో ఒక కేసు ఎంత కాలానికి solve అవుతుందో.... మన కోర్టుల పని తీరు ఎలా ఉంటుందో తెలిసిందే అయినా... ఇటువంటి కేసులని మాత్రం వెంటనే(ఒక్క రోజులోనే) పరిష్కరించేలా చూడగలిగితే కొంత నయం కదా!

 36. Kathi Mahesh Kumar said...

  @చైతన్య: మీ ఆలోచన సహేతుకమైనది. దేశంలోని చట్టాలను మీరి, ప్రతీకారం చేసే దిశగా తీవ్రవాదాన్ని ఎదుర్కోవాలనుకోవడం ఈ మధ్య కొందరు మధ్యతరగతి హిందూవాదుల పోకడగా కనిపిస్తోంది.దానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళను రకరకాల పేర్లతో పిలవడం వీరికి మరో సరదా.

  A wednesday సినిమా మరియూ ఇలాంటి ఇతర సినిమాల గురించి నేను చేసిన విశ్లేషణ నవతరంగంలో చూడచ్చు.
  http://navatarangam.com/2008/10/angry-middleclass-films/

  ఆ వ్యాసంలోని కొన్ని వాక్యాల్ని ఇక్కడ ఇస్తున్నాను చూడండి.
  "ఈ మధ్యవచ్చిన సినిమా ‘A Wednesday’ కూడా ఈ విధమైనదే. వరుస బాంబుపేలుళ్ళ నేపధ్యంలో ప్రభుత్వ విధానాలతో విసిగి, ఎమీ జరగడం లేదన్న నిరాశలో,ఏదైనా జరగాలనో కోరికతో వున్న మధ్యతరగతి ఆకాంక్షల్ని చక్కగా ఎత్తిచూపిన చిత్రం ఇది. “ఎవరోఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకూ అటో.. ఇటో..ఎటోవైపు” అనే desperation లో ఉన్న మనకిచ్చిన sugar coated pill ఇది. ఇదివరకు చెప్పిన పాటలో ఉటంకించినట్టు “అటో..ఇటో” కాకుండా, “ఎటో” నడిపించి ప్రేక్షకులను ఒప్పించిన చిత్రం ఇది. అందుకే ఇంత “realistic” గా సమస్యకు లోపభూయిష్టమైన అంగీకారాత్మక సమాధానం ఇవ్వడం ప్రమాదకరంగా అనిపిస్తుంది. ఒక్కోస్థాయిలో చౌకబారు సినిమాలకన్నా, ఇలాంటి సినిమాలు సమాజాన్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశాలు ఎక్కువ.

  “ఇలా ఎవడోఒకడు చేస్తేగానీ, ప్రభుత్యానికి బుద్దిరాదు” అంటూ సగటు ప్రేక్షకుడు సినిమా నుంచీ బయటకొచ్చాడంటే, లోపాయకారిగా ప్రస్తుతం వున్నవ్యవస్థని ప్రేక్షకుడు నిరసించి, ఇలాంటి మిలిటెంట్ చర్యల్ని సమర్దించినట్టే లెక్క. అది ఎంతవరకూ సమంజసం అనేది పక్కనబెడితే, మధ్యతరగతిలో పేరుకుపోయున్న నిరసనను ఈ సినిమా ఎత్తిచూపి వారి aspirational projection కు అనుకూలంగా ఈ సినిమా నిలబడిందనేది మాత్రం ఖచ్చితంగా ఒప్పుకొని తీరవల్సిందే."

 37. Anonymous said...

  "...అమెరికాకి వ్యతిరేకంగా మాట్లాడడానికి అలా భయపడతారు.": భయమా! హ హ్హ హ్హ!!
  అవునూ, ISP Administrator గారూ మార్తాండ అన్నా మీరే కదూ?

 38. Praveen Mandangi said...

  తెలుగు వికీపీడియాలో బ్లాక్ చేసిన ఐ.పి. అడ్రెస్ లని మార్చినప్పుడే డౌట్ రాలేదా? ఐ.ఎస్.పి. ఆపరేటర్ మాత్రమే ఆ పని చెయ్యగలడని? కేబుల్ కనెక్షన్ తీసుకున్నవాడికి ఒకే ఐ.పి. ఉంటుంది. ఐ.ఎస్.పి. సర్వర్ పెట్టినవాడే ఐ.పి.ల సీరీస్ పొందగలడు.

 39. Anonymous said...

  హిందూత్వమా?
  ఒకసారి పాతిబస్తీకెళ్ళి ఒక సగటు ముస్లింను "కూరగాయల మార్కెట్లో బాంబు పేలింది. నీ భార్య చనిపోయింది, నీ కొడుకు కాళ్ళు, చేతులు, కళ్ళు పోయాయి. ఆ బాంబు పెట్టినవాడిని పట్టుకొని ఏమి చేయాలి" అని అడగండి. ఆ ముస్లిం పొరపాటున "అలాంటి ఉగ్రవాదిని అంతం చేయాలి" అంతే "అతడు ముస్లిం కాదు, ముస్లిం లాంటి హిందువు" అంటారా మహేష్ గారు?

  టెర్రరిస్టులను అంతం చేయడం మిలిటెంట్ చర్య అన్నారు. మొన్న ముంబై తాజ్ హోటల్లో మన వాళ్ళు టెర్రరిస్టులను అంతం చేయడం మిలిటెంట్ చర్యా లేక దేశభక్తి చర్యా లేక హిందూ ఉన్మాద చర్యా? మీలో మతవిద్వేషం ఉంది అని తెలుసు కానీ ఇలాంటప్పుడు కూడా "హిందూమతం" ప్రస్తావన తెచ్చారంటే మీలో మతోన్మాదం విషంలా నిండి ఉన్నదని అందరికీ తెలుస్తున్నది.

  కనిపించే టెర్రరిస్టులకంటే "టెర్రరిస్టులను అంతం చేయడాన్ని మిలిటెంట్ చర్య"గా అభివర్ణించే కనిపించని మతోన్మాద తీవ్రవాదులే దేశానికి ప్రమాదకరం.

 40. Praveen Mandangi said...

  నేనేమీ ఇస్లాం మతాన్ని వెనకేసుకురావడం లేదు. ఇజ్రాయెల్ లాంటి ఫాసిస్ట్ దేశాలని పొగడడం మాత్రం చాలా జుగుప్సకరంగా ఉంది. ఇజ్రాయెల్ ని దూషించినంత మాత్రాన ఇస్లాం ని సమర్థించినట్టు కాదు. గతంలో విజయ విహారం పత్రిక ఎడిటర్ రమణమూర్తి ముహమ్మద్ ప్రవక్త గురించి ఒక నిజం వ్రాసినందుకు అతన్ని అరెస్ట్ చేశారు. ముహమ్మద్ ప్రవక్త వావివరసలు మరిచి తన కోడలు జైనబ్ ని పెళ్ళి చేసుకున్నాడు. తండ్రితో పడుకున్న స్త్రీతో కొడుకు పడుకోకూడదని ముహమ్మద్ ప్రవచించాడు కానీ కొడుకుతో పడుకున్న స్త్రీతో తండ్రి పడుకోవచ్చని హిపోక్రిటిక్ గా నమ్మేవాడు. ఈ విషయం తెలిస్తే ఇస్లాం మతం పరువు పోతుంది, సెక్యులర్ రాజకీయ నాయకులకి ముస్లింల వోట్లు పడవు అన్న భయంతో ఆ నిజాలు వ్రాసిన విజయ విహారం పత్రిక ఎడిటర్ ని అరెస్ట్ చేశారు.

 41. Kathi Mahesh Kumar said...

  అయ్యా జీడిపప్పుగారూ, నా వ్యాఖ్య చైతన్యగారి వ్యాఖ్యకు ఇచ్చిన సమాధానం. దానికీ మూల వ్యాసానికీ లంకె లేదు. అది తన observations పైన నా అభిప్రాయం. అందుకే దాని పుష్టీకరణ కోసం క్రింద నా నవతరంగం వ్యాసంలోని వాక్యాలను జతపరిచాను. అయినా, మీకు out of context లో నా వ్యాఖ్యల్ని fix చేసి "తీవ్రవాదిగా" ముద్రవెయ్యడం కొత్త కాదుకదా! carry on.

 42. జీడిపప్పు said...

  మహేష్ గారూ - నా వ్యాఖ్య చైతన్యగారి వ్యాఖ్యకు మీరు ఇచ్చిన సమాధానానికి సమాధానం. ఇక out of context అంటారా? మరి context గురించి అడిగితే జవాబు చెప్పకుండా తప్పించుకున్నారు. సరే మళ్ళీ అడుగుతున్నా:

  మీ కుటుంబ సభ్యులు ఇద్దరు హైదరాబాదులోని ఒక షాప్‌లో బాంబు బారిన పడ్డారు. తీవ్రవాదులు తుపాకి పట్టుకొని పరిగెడుతున్నారు. ఆ బాంబు పెట్టిన తీవ్రవాదులను చంపకూడదు. విచారణ జరపాలి, వాళ్ళు హైజాక్ డ్రామా ఆడి తప్పించుకొని వెళ్ళిపోయి మళ్ళీ బాంబులు పెట్టినా పరవాలేదు. రేపు మీ కుటుంబంలో మరి కొందరు ఆ రెండవసారి పెట్టిన బాంబు బారిన పడినా పర్వాలేదు కానీ టెర్రరిస్టులను చంపకూడదు. ఇదేనా టెర్రరిస్టుల పట్ల మీ అభిప్రాయం? లేక వాళ్ళను కాల్చి చంపాలా?

  మొన్న ముంబై తాజ్ హోటల్లో తీవ్రవాదులను కాల్చి చంపడం సరి అయిన చర్యేనా?

 43. Kathi Mahesh Kumar said...

  @జీడిపప్పు: ఎదురుదాడిలో తీవ్రవాదుల్ని మట్టుపెట్టడానికి చట్టం యొక్క sanction ఉంది. దానిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ,వ్యవస్తీకృత ప్రతీకార హింస గర్హనీయం. తీవ్రవాదులు పట్టుబడితే వాళ్ళని చట్టప్రకారం విచారణ జరిపి శిక్షించకుండా, చంపేస్తామనడం లేదా చంపమనడం అంగీకారాత్మకం కాదు.

  However wrong it might be, law is law.కేవలం కొన్ని aberrations మూలంగా మొత్తం చట్టాన్ని తుంగలోతొక్కి, మీ పైత్యాన్ని అమలు చేస్తానంటే దానికి అంతమెక్కడుంది? Law of the land should always prevail. That is more important that individual grief and emotions.

  నాకుటుంబం త్రీవ్రవాదుల హింసకుబలైనా, నేనే చచ్చిపోయినా, నా దేశచట్టంకన్నా నా భావనలు ముఖ్యం కావని నమ్ముతాను.నక్సలైట్లనే పేరుతో రాజ్యహింసకు గురయిన కుటుంబ నేపధ్యం నాకుంది. అయినా,చట్టాన్ని నేను గౌరవిస్తాను. అదిలేకపోతే,మీలాంటి వారి కారణంగా దేశమెప్పుడో గృహయుద్ధం పాలయ్యేది.

 44. చైతన్య said...

  జీడిపప్పు గారు... మీరు పై కామెంట్ లో చెప్పిన సందర్భంలో అయితే మీ అభిప్రాయాన్ని నేను సమర్దిస్తాను. మొన్న ముంబై లో జరిగిన సంఘటన లాంటి సందర్భంలో కోర్టులు కేసులు అంటూ కూర్చుంటే మరింత ప్రాణ నష్టం జరిగే అవకాశం ఇచ్చినట్టే... అలాంటి పరిస్థితుల్లో మనవాళ్ళు చేసింది నూటికి నూరు పాళ్ళు సమర్ధనీయమే (నా ఉద్దేశంలో).
  కానీ మీరు ఈ పోస్ట్ లో చెప్పారు కదా ఇజ్రాయిల్ లో జరిగిన విషయం... అంటే సంఘటన జరిగిన కొంత కాలం తర్వాత(లేదా వెంటనే) కూడా ఒక కమిటీ పెట్టి ఆ తీవ్రవాదులని వెంటాడి వెంటాడి చంపేసారు అని... అలాంటి సందర్భం గురించి మాత్రమే చెప్పాను నేను నా కామెంట్ లో... అలా వెంటాడి పట్టుకున్న వాళ్ళని అక్కడే చంపటం కంటే... వెంటనే ఒక్కరోజులో వాళ్లకి శిక్ష వేసి ఆ శిక్షని చట్టపరంగా అమలుజరిపి ఉండొచ్చేమో అన్నది నా ఉద్దేశం.

  అయినా అందరు మనుషులు ఒకేలా ఆలోచించలేరు కదండీ... మనిషి మనిషికి ఉద్దేశాలలో మార్పు ఉండటం సహజం. ఇదే కరెక్ట్ అది రాంగ్ అని ఎవరం నిర్నయించగలం :)

 45. సుజాత వేల్పూరి said...

  మార్తాండ గారు,
  out of context అనుకోకపోతే.....మీరు రమణమూర్తి అభిమాని అనుకుంటాను. ఎందరి బండారాలనో బయటపెట్టి చాలామంది చేత హీరో అనిపించుకున్న రమణమూర్తి తన యజమాని ని హత్య చేసిన కేసులో జైల్లో పడ్డాడని మర్చిపోయారా? అందరికీ శకునం చెప్పే బల్లి ఎందులోనో పడ్డట్లు!ఆ కేసేమైందో తెలీదు కానీ అప్పట్లో గట్టిగానే బిగిసింది ఉచ్చు. ఆయన అసలు స్వభావం తెలిసాక, గుట్లు విప్పే వ్యాసాలన్నీ కేవలం విజయవిహారం సర్క్యులేషన్ కోసమో, సంచలనాల కోసమో రాశాడనిపించింది నాకు.

  జీడిపప్పు గారు, సారీ అండి, టపాకి సంబంధం లేని వ్యాఖ్య రాశాను. మార్తాండ గారి బ్లాగులో కామెంట్ రాయాలంటే పెద్ద తతంగం ఉంది. అందుకని...ఇక్కడ!

 46. జీడిపప్పు said...

  @ కత్తి మహేష్ కుమార్ -
  తీవ్రవాదులు పట్టుబడితే చేయాలంటున్నారు బాగానే ఉంది. వాళ్ళు పట్టుబడకుండా పెద్ద మనుషుల ముసుగులో ఉపన్యాసాలిస్తూ మరిన్ని ఉగ్రవాదచర్యలకు పథకాలు పన్నుతుంటే వారినేమి చేయాలి? ఒకవేళ పట్టుబడినా వారిని అంతం చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు మామూలు మనుషులు కాదు "ఉగ్రవాదులు". దేశసార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తున్నపుడు కొన్ని కఠినమయిన చర్యలు చేపట్టినపుడే తీవ్రవాదం తగ్గుతుంది. ఆ పనే ఇజ్రాయిల్ చేసింది. ఇప్పటివరకు అంత పెద్ద ఎత్తున ఇజ్రాయిల్ ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్య ఏ ఉగ్రవాద సంస్థ కూడా చేయ్యలేదు. ఎందుకో తెలుసా? చేస్తే ఏమవుతుందో ఉగ్రవాదులకు బాగా తెలుసు కాబట్టి. అందుకే ఆ విషయంలో ఇజ్రాయిల్‌కు జై కొట్టాలి మీలాంటి కరుడుగట్టిన హిందూ మతద్వేషులు కూడా!!

  @చైతన్యగారు - దొంగనో, దొమ్మీలో హత్య చేసినవాడినో జైల్లో పెట్టవచ్చు. కానీ వీళ్ళు ఉగ్రవాదులు. ఒకసారి వ్యాసం చూడండి. దాడి జరిగిన వెంటనే ముగ్గురు తీవ్రవాదులను జర్మనీ పోలీసులు పట్టుకున్నారు కానీ తీవ్రవాదులు విమానం హైజాక్ చేసి ఆ ముగ్గురినీ విడిపించుకుపోయారు. అలాంటపుడు ఏమి చేయాలి మరి?

  @సుజాతగారు - ఫరవాలేదు.. దేనిపాటికదే :)

 47. Kathi Mahesh Kumar said...

  @జీడిపప్పు: నన్ను "హిందూమత ద్వేషి"గా ముద్రవేసాక చర్చకు అర్థం లేదు. నేను హిందూమతానికి వ్యతిరేకిని కాను కానీ హిదుత్వభావజాలానికి తీవ్రవిరోధిని. ఈ రెంటికీ తేడా తెలుసుకునే విజ్ఞత,అవసరం మీకు లేదుగనక, i rest my case.

 48. జీడిపప్పు said...

  మహేష్ గారూ - ఆ రెండింటి తేడా నాకు తెలుసో ఏమో కానీ, ఇంత జరుగుతున్నా తీవ్రవాదులను అంతం చేయడాన్ని సమర్థించకుండా "మధ్యతరగతి హిందూవాదుల పోకడగా" అంటూ మీ మత విద్వేషాన్ని చూపించారని తెలుస్తుంది. ఎపుడయినా "ముసుగేసుకున్న ఇలాంటి మతోన్మాద తీవ్రవాదిని ఎదుర్కొనడమెలా" అన్న వ్యాసం వ్రాయడానికి మీ కామెంట్లు చాలా ఉపకరిస్తాయి,వీలయితే తొందర్లో రాస్తాను. ఓపికగా కామెంట్లు పోస్టు చేసినందుకు ధన్యవాదాలు. తొణకుండా "నేను చచ్చినా" అని మీ భావాలను చెప్పినందుకు heartful హేట్సాఫ్

 49. చైతన్య said...

  జీడిపప్పు గారు... ప్రతి సందర్భంలోను ఇలాగే చేయాలి అని చెప్పటం చాలా కష్టం... సందర్భానుసారంగా చేసుకుంటూ పోవటమే...
  ప్రతిసారి తీవ్రవాదులందరిని జైల్లో పెట్టాలని నా ఉద్దేశం కాదు... సందర్భానికి తగ్గట్టుగా (అంటే మొన్న ముంబై ఘటనలో లాగా) అక్కడిక్కడే సరైన సమాధానం కూడా చెప్పొచ్చు. అప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళని హతమార్చటమే సరి అయిన పని.
  కాని అలా అని ప్రతిసారీ అలా వెంటపడి మరీ (govt హస్తం బయటకి రాకుండా, రహస్యంగా) చంపటం కూడా కరెక్ట్ కాదేమో! ఏం చేసినా చట్టపరంగా చేయొచ్చు కదా (కొన్ని exceptional cases లో తప్ప)!

  హైజాక్ చేసే అవకాశం అసలు వాళ్లకి ఎందుకు ఇవ్వాలి... ఏ దేశం అయిన తీవ్రవాదాన్ని సమర్ధించదు కదా... అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడ దొరికారో ఆ దేశం లోనే వెంటనే చట్టపరంగా వాళ్ళకి తగిన (ఉరి)శిక్ష వేస్తే బాగుంటుంది కదా... ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు... కాని అలా ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం.
  ఇజ్రాయిల్ లో జరిగిన దానికి నేను వ్యతిరేకిని కాను... అలా అని అందరు అదే అనుసరించాలి అని సమర్ధించలేను... అదే కొంచం అందరు హర్షించేలా చట్టపరంగా చేస్తే బాగుంటుందేమో అన్నది మాత్రమే నా ఆలోచన.

  (మొన్న ముంబై ఘటనలో జరిగింది govt ప్రమేయం తోనే జరిగింది కాబట్టి... అందులో ఏమి తప్పు లేదనుకుంటున్నాను... కాని ఇజ్రాయిల్ లో govt పేరు బయటకి రాకుండా వాళ్ళని చంపేసారు అని చెప్పారు కదా...!!)

 50. Praveen Mandangi said...

  @సుజాత గారు
  రమణమూర్తి వ్రాసాడని కాదు, నేను ముహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రని చదివే అలా వ్రాసాను.
  http://www.google.co.in/search?q=muhammad%27s+incest+with+zainab&ie=utf-8&oe=utf-8&aq=t&rls=com.ubuntu:en-US:unofficial&client=firefox-a

 51. Malakpet Rowdy said...

  Israel is basically terrorizing the terrorists, unlike India.

  As of leftist jokers, Who on the Earth cares about those double-tongued creatures? Aint they the same set of people who supported China when it ruthlessly killed 2000 people in the 80s? I suggest reading the leftist literature, instead of reading jokes on Swati or Andhra Bhoomi. I bet you wont be disappointed.

  By the way, terrorist cardre is ready to die - so there is no point in just killing them - instead, terrorise them. For example, deny Islamic burial for the Mumbai terrorists - Burn their bodies instead of burying them. Use their own fanatic thoughts against them. India has not done it so far, for the sake of so called "Decency" lolz .. It's time we moved out of that mindset.

 52. imaaya said...

  Emotions aside, if one observed the acts of terrorism carefully... there is one striking thing, that ALL terrorists (or the organizations who power these individuals) seek attention.

  Kill people, as ruthlessly as possible.. make mayhem! the more sensational, the better. Make headlines. Stun the world. Get the governments involved to a screeching halt. Grad as much attention of the world as possible.

  The philosophy behind terrorism is attention seeking. Terrorists and terrorist organizations seek attention. Media gives them more than they deserve.

  How to deal with them? Attention seekers should be deprived of attention (this doesnt solve the problem, but it simply *forces* the terrorists to seek alternative course of action)

  As per "what should we do with terrorists" question - Its idiotic on governments part to think about so called human rights in case of held terrorists. Heck, terrorists have no humanism. If a terrorist is held, intorrogate him for the details, if it doent work, kill him - ruthlessly. Thats the most gentle treatment they deserve.

  I agree. I wish RAW had the guts to hunt down every terrorist and kill em at first site, and make headlines thereby.. at least it would teach a lesson to wanna be terrorists!

 53. imaaya said...

  there were a few spelling mistakes in the last comment, nevermind I am a bit drunk!

  How does the terrorist organizations recruit people for a suicide mission? Among many other things like poverty etc., these organizations imbue the impressionable young terrorists with *eternal glory*. There is pride in dying for that 'cause', and there is promise of Heaven and 72 virgins (oh well, they don't specify whether they will be male virgins are female virgins)

  Now compare this with this scenario. Terrorists come and fulfill their task, they go back home untouched! RAW hunts them down... person by person. Kills them in the most dramatic of situations and the news makes headlines!

  The future terrorists will now think that RAW is invincible. That RAW will hunt them down and kill them ruthlessly if they mess with India. Heavenly, glorified death for 72 virgins on one side and a RAW agent shooting in poin blank range on the other side. This may not root out terrorism, but as I said earlier.. it will make the future terrorists think twice!

  If only RAW had guts to do that. If only Indian netas had that courage to do that... oh well, we know the reality is different! I know I am dreaming!

  I told you, I am drunk!

 54. Malakpet Rowdy said...

  imaaya,

  Exactly my thoughts - the terrorists want only publicity and they are getting it in tonnes thanks to our TRP oriented Press and Journalists! I was typing a post on this a few days back but backed off .. lol .. just got bored .. may be I'll retype it once I get some time. I wish I had a couple of more weeks of bench ... heheee

 55. Shashank said...

  malakpet rowdy, imaaya couldn't agree more with you. human rights should be reserved only for people who are human. terrorists are not humans వాళ్ళ ద్వారా ఎమైనకొత్త ఇంఫొర్మషన్ దొరికితే వాళ్ళని "విచారించడం' సబబే లేకపోతే కాల్చేయడమే కరెస్ట్.
  @ హింసకి ప్రతిహింస సమధానం కాదు అనేవాళ్ళకి ఒక ప్రశ్న. మొన్న బొంబాయ్ లో ఉగ్రవాదులు అల కాల్పులు జరుపుతున్నప్పుడూ మనం (అంటే మన దేశం) ఏమి చేసిండాలి అని మీరు భావిస్తున్నారు?
  తాజ్ ముందు, ఒబేరై ముందు పెద్ద పెద్ద మైక్ సెట్లని పెట్టి రామాదాసు కీర్తనలు లేకపోతే గాంధి వ్యాఖనలో పెట్టాలసిందా? మీరు ఎంత మందిని చంపినా పర్లేదు ఎలా చంపినా పర్లేదు మేము మాత్రం మిమ్మల్ని ఏమి చేయము.. ఎందుకంటే హింస కి ప్రతిహింస సమధానం అని మేము భావించము అని చెప్పాల్సిందా?

Post a Comment