మలక్పేట్ రౌడీ గారి పైన కేసు పెడుతున్నా

Posted by జీడిపప్పు

ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది. చాలా రోజులుగా చూస్తున్నాను ఈ వ్యవహారం. ఏదో ఒకసారంటే పరవాలేదు కానీ ఇలా రెండు సార్లు చేయడం మాత్రం పద్దతి కాదు. ఒకసారి "పిట్స్‌బర్గ్ పిచ్చమ్మ" అంటూ పిట్స్‌బర్గ్ లో ఉన్న తెలుగు స్త్రీలను పిచ్చివాళ్ళుగా అభివర్ణించారు. మరోసారి టెక్సస్ తిగరిబుచ్చి అంటూ టెక్సస్‌లో ఉన్న తెలుగు స్త్రీలను తిగరబుచ్చిలంటూ అన్నారు. అటు పిట్స్‌బర్గ్ లో ఇటు టెక్సస్‌లో తెలుగు స్త్రీలు రౌడీ ఆగడాలను భరించలేకున్నారు. పిట్స్‌బర్గ్ తెలుగు అసోసియేషన్ "పిటా", టెక్సస్ తెలుగు అసోసియేషన్ "టెక్స్టా" లతో మాట్లాడాను. కేసు పెట్టమన్నారు. రౌడీ గారి IP Address దొరికింది. ఇక తప్పించుకోలేరు రౌడీ గారు.

మలక్పేట్ రౌడీ అని ముసుగేసుకున్న ఈ బ్లాగరు వివరాలను మితృలసాయంతో తెలుసుకున్నాను. ఈ ముసుగుదొంగ అసలు స్వరూపాన్ని బయటి ప్రపంచానికి తెలియజెప్పాలనే మనసు చంపుకొని ఆ వివరాలు బహిర్గతం చేస్తున్నాను (అందరూ గుర్తుపట్టాలని ఫోటో కూడా జత చేసాను) తప్పించి సదరు బ్లాగరు పైన వ్యక్తిగత కక్షలు లేవు.

అన్నట్టు బ్లాగులోకాన్ని చెత్తనుండి కాపాడిన ఏకలింగం గారు కత్తి రాందాసు : శవం తమ్ముడిదయినా కంపు కామనే అన్నా  అని ఓ పోస్టేశారు ఇప్పుడే. ఎవరయినా కేసులు పెట్టాలనుకుంటే వెంటనే పెట్టెయ్యండి.

నాకు నచ్చని విధంగా కామెంట్ వేసే వారికి హెచ్చరిక: మీ IP Address నాకు తెలుసు. మీ పైన atrocity కేసు పెడతాను. నా బ్లాగు అడ్రస్ ఇస్తూ incriminating వ్యాఖ్యలు చేస్తే that amounts to cheating and impersonating. IPC సెక్షన్ 420 మరియూ దాని సన్ సెక్షన్స్ సమానమైన సైబర్ నేరాల పరిధిలోకి ఈ విషయం వస్తుంది. మీరు హైదరాబాద్ లోనే ఉంటే 23240663, 27852274 ఫోన్ చేసి కనుక్కోండి. (Source )

26 comments:

 1. Malakpet Rowdy said...

  కేకో కేక!!!!!!!!

 2. ఏక లింగం said...

  LOL..

 3. కొండముది సాయికిరణ్ కుమార్ said...

  :))

 4. రాఘవ said...

  :) keka nenu kuda inko kesu pedataanu pitsberg lo naa 4th ex-gal frnd undedi.. kaabatti naa mano bhavalu debbatinnayi...

 5. నాగప్రసాద్ said...

  హ హ హ :)

 6. డ్రెంచకుడు said...

  LOL.

 7. పానీపూరి123 said...

  అలాగే కేసు పేపర్లతో పాటు... కొన్ని కిలోల జీడుపప్పు కూడా పంపించండి... :-P

 8. నాగప్రసాద్ said...

  ఇందాక చదివినప్పుడు అంతగా అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అర్థమవుతోంది. చూస్తుంటే, బ్లాగులోకంలో మళ్ళీ ఏవో గొడవలు స్టార్ట్ అయినట్లున్నాయి.

  హమ్మయ్యా! గత నెలరోజులుగా బ్లాగులు బోరుకొడుతున్నాయి. ఈ గొడవతో ఒక వారం, పది రోజుల పాటు మస్తు ఎంటర్టైన్మెంటు లభించబోతోందన్నమాట. జెజ్జినక...హై...జెజ్జినక...హై...జెజ్జినక.

 9. విశ్వక్శేనుడు said...

  రచ్చలు ............

 10. జీడిపప్పు said...

  @ అందరికీ - lolll.. seems everyone is having hell of fun.. let us put more cases on Malakpet Rowdy garu

  @ పానీపూరి123 గారు - బాబోయ్.. కిలోల జీడిపప్పా? నా జీతం సరిపోదు

  @ నాగప్రసాద్ గారు - same here మనకు మంచి ఎంటెర్‌టెయిన్మెంట్ ముందు ముందు.. stay tuned!!!

 11. ఏక లింగం said...

  పనిలో పనిగా నా సెటైర్ కూడా చూడండి.
  http://ekalingam.blogspot.com/2009/06/blog-post_20.html

  బాగుంది. వీకెండ్ మంచి కాలక్షేపం...

  Sorry Jeedipappu gaaru for this advertisement.

 12. జీడిపప్పు said...

  ఏకలింగం గారూ, ఎంత మాట!!! i'm honored with your comment!! పైన పోస్టులో మీ పోస్టు లింకు ఇచ్చాను.

  yes..బాగుంది. వీకెండ్ మంచి కాలక్షేపం on-call లో ఉన్నవాళ్ళకు :) :)

 13. ఏక లింగం said...

  Thanks a lot :)

 14. అశోక్ చౌదరి said...

  కే బ్లా స వారు కలగసేసుకుని ఈ సమస్యని పరిష్కరించాలని లేకుంటే అంతర్జాతీయ న్యాయస్థానం లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తానని తెలియజేసుకుంటున్న..

  NOTE:. ఎవరన్న నా WIFI ని హక్ చేసి కామెంట్స్ పెడితే నేను బాద్యుడిని కాదు అని తెలియజేసుకుంటున్న..

 15. విశ్వక్శేనుడు said...

  @అశోక్
  ముందు ఇంకా ఎవరెవరి మీద కెసులు వెస్తున్నారో తెలిస్తే అప్పుడు పరిష్కారం అలోచించవచ్చు.....
  ఒక సారి నా టపా కూడా చూడండి.
  http://vijayamadhava.blogspot.com/2009/06/blog-post_20.html

  ఇది అడ్వర్టైజ్మెంట్ కాదు....
  జీడిపప్పు గారు మీరు కూడా తప్పకుండా చూడాలి

 16. Malakpet Rowdy said...

  seems everyone is having hell of fun.. let us put more cases on Malakpet Rowdy garu
  _________________________________________________

  KEVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVVV

 17. శరత్ కాలమ్ said...

  @అశోక్
  కె బ్లా స అధ్యక్షుల వారు అయిన రౌడీ గారినే జీడిపప్పు గారు కెలికారు కనుక థర్డ్ పార్టీ సేవలు అవసరం - ఈ వివాదం పరిష్కరించడానికి. అందుకే కె బ్లా స వద్దుగానీ వేరే నలుగురు పెద్దమనుషులను చూడండి.

  నేను కూడా రౌడీ గారి మీద కేసు వేద్దామని ఆలోచిస్తున్నా. పెళ్ళయిన నాకు గల్లీ గల్లీలో మళ్ళీ పెళ్ళి చేయాలని కుట్రలు పన్నారు - అందుకే.
  ఏకలింగం గారి మీద కూడా - నన్ను సన్నాసుల్లో కలపడానికి కుట్రలు పన్నారు మరి.

 18. శరత్ కాలమ్ said...

  @ రౌడీ
  కేసు పడుద్ది!
  కె బ్లా స మీద కూడా కేసు పడొచ్చని ఒక బ్లాగులో అన్యాపదేశంగా వచ్చిన వ్యాఖ్య చూసిన తరువాత అర్జంటుగా మీరే మా అధ్యక్షులని అందరికీ గుర్తు చేస్తున్నా. కేసే గనుక వస్తే మేము అందరం చేతులు దులిపేసుకొని మీ పేరే చెబుతాం. కొంపదీసి కే సి ఆర్ లాగా రాజీనామా డ్రామా ఆడరు కదా. మిమ్మల్ని బ్రతిమలాడి మళ్ళీ అధ్యక్షస్థానం లో కూర్చోబెట్టే ఓపిక, తీరిక మాకు లేవు సుమా!

 19. ఏక లింగం said...

  కెబ్లాస అద్యక్షులు మలక్‌పేట్ రౌడి గారికి జై...
  కెబ్లాస అద్యక్షులు మలక్‌పేట్ రౌడి గారికి జై...
  కెబ్లాస అద్యక్షులు మలక్‌పేట్ రౌడి గారికి జై...

  ఏమో..బాబు. ఎందుకయినా మంచిదని మా ముందు జాగ్రత్త. విషయం కేసు దాకా వస్తే మా బ్లాగులకు మట్టంటకుండా ఉంటుందని.

 20. Malakpet Rowdy said...

  VAMMOOOOVVVVVV

 21. నాగప్రసాద్ said...

  http://nagaprasadv.blogspot.com/2009/06/blog-post_21.html

 22. Shashank said...

  హమ్మయ్య - సివరాఖరికి అసలు విషయం ఏంటో అని అర్థం అయ్యింది. ఇదంతా చూస్తుంటే ఇది దేశద్రోహుల కుట్ర అని, విదేశీ హస్తం ఉందని అనిపిస్తోంది. నాకు ఎవరి మీదైన కేసు పెట్టాలని ఉంది.. ఇంక వేరెవాళ్ళేందుకు... "మనవోన్మాది" "మానవద్వేషి" బుడుగు a.k.a జీడిపప్పు మీద పెడతా. యే సెక్షనో అర్థం కావడం లేదు. కొంచం ఎవరైన "న్యాయవాదుల్ని" సంప్రదించి చెప్పగలరు. బుడుగు IP, birth certificate వాళ్ళా ఊరి మునసబ్ నుండి తెచ్చిన లేఖ వాళ్ళా బడి హెడ్ మాస్టారు ఇచ్చిన 'అ-ప్రశంసా పత్రం" అన్ని సేకరిచ్చా నేను.

  మీకు అలాంటివి ఇంకేమైన దొరికితే నన్ను సంప్రదించండి. నా ఈ-మేల్ ;dikkulenicourtlodava@gmail.com. అలనే బుడుగు ఉరఫ్ జీడిపప్పు ఫోటో కూడా సంపాదించా. (క్షమించాలి ఆ ఫోటో పెట్టలేకపోతున్నా. "unparliamentary / uncivilised గా ఉంటుందని) ఇంత చదువుకు కొని ఇన్నేసి చికేన్ లని తిని అన్నేసి సార్లు గాడ్ ఫాథర్ చూసినా కూడా జీడిపప్పు కి బుద్ధుని లా జ్ఞానం రాకపోవడం చింతనీయం.

  పనిలోపని ఈ బ్లాగులో జీడిపప్పు ని చూసి నవ్వనివాళ్ళ మీద కూడా కేసు పెడుతున్నా. చట్టం ఇంకా తెలీదు. మీరు ఎవరిమీదైన పెట్టాలనుకుంటే చెప్పండి మళ్ళా పేపర్ దండగా నేను రాసే FIR లోనే ఇరికిచ్చేద్దాం.

 23. Shashank said...

  http://aakasam.blogspot.com/2009/06/blog-post_21.html

  evariana chadavalEdO kEsu peData. chadivArO kEsu peDatA.

 24. జీడిపప్పు said...

  Good going everyone!!!

 25. ఏక లింగం said...

  See this also

  http://ekalingam.blogspot.com/2009/06/blog-post_21.html

 26. ఏక లింగం said...

  new my another post

  http://ekalingam.blogspot.com/2009/06/blog-post_22.html

Post a Comment