శాంతించండి బ్లాగరులారా.. సంస్కృతిని కాపాడండి

Posted by జీడిపప్పు

శాంతించండి బ్లాగరులారా. అన్యోన్యంగా కలసిమెలసి ఉండవలసిన మీరు దూషించుకొనుచున్నారని తెలిసి ఇలా వచ్చాను. మీరందరూ విద్యావంతులే, ఉన్నత చదువులు చదువుకున్నవారే. సంగీత సాహిత్య భక్తిరసాది విషయాల జ్ఞానాన్ని పరస్పరం పంచుకొనక ఈ విభేదాలు ఎందుకు? భగవత్ప్రసాదమయిన మేధస్సును ఎంతో ఉపయోగకరమైన పనులకు వినియోగించక ఎందుకూ కొరగాని అభిప్రాయభేదాలతో వ్యర్థం చేసుకొనుట మానండి.

కత్తి మహేష్ కుమార్ అను బాలకుడు "ఇవే గొప్పోళ్ళ వేషాలు. ఇదే సంస్కృతిని కాపాడే విధానం" అన్నాడు. ఈతడి హృదయం ఎంత గాయపడి ఉంటే ఆ మాట అంటాడు. ఎందుకు నాయనలారా ఇతడిని నొప్పిస్తున్నారు? మన సంస్కృతి పట్ల ఇతడికున్న ఆరాధన భావం నాకు తెలుసు నాయనలారా. అలాంటి ఇతడు బాధగా "ఇదే సంస్కృతిని కాపాడే విధానం" అన్న మాటలు చూసి నా మనసు కకావికలయినది.

చిరంజీవులారా, అన్ని జన్మల్లోకెల్లా మానవజన్మ ఎంతో ఉదాత్తమయింది మరియు క్షణభంగురమయినది. పుట్టిన మానవుడు ఏ క్షణానయినా మరణించవచ్చు. జీవించి ఉన్నన్నాళ్ళూ పరస్పర అనురాగాభిమానాప్యాయతలతో కలసిమెలసి ఉండక "బ్రాహ్మనికల్ యాటిట్యూడ్" "దళిత్ యాటిట్యూడ్" అంటూ దూషించుకోవడం భావ్యం కాదు.

చిన్నారి బాలలారా -  చనిపోయినవారితో తల్లిదండ్రులు, భార్య-పిల్లలు, అన్నదమ్ములు, బంధుమితృలు ఎవరూ  రారు. కేవలం ఆత్మ ఈ శరీరాన్ని విడిచి వెళ్తుంది. మనిషి మరణిస్తే చేసిన పాపపుణ్యాల ఆధారంగా స్వర్గానికో నరకానికో వెళ్ళవలసి వస్తుంది. పాపాలు చేసినవారు నరకానికి తీసుకెళ్ళబడతారు. అక్కడ నిప్పుల ఎడారి పైన నడిపిస్తారు. ఆకలిగొన్న శునకములు వెంటాడి వేటాడుతాయి. పాప పరిహారముగా మానవుల రక్తమాంసాలున్న నదులలో మునగవలసివస్తుంది.

దేవుడిచ్చిన అవకాశాన్ని వ్యర్థం చేసుకొని శుష్క యుద్దాలతో, వ్యర్థ ప్రసంగాలతో పాపం చేసి ఆత్మను క్షోబింపచేయు బదులు సత్ప్రవర్తన కలిగి సన్మార్గంలో పయనించండి నాయనలారా. సన్మార్గమనిన ఇతరులను దూషించకుండుట, ఇతరులను గౌరవించుట, పెద్దలను సేవించుట, పెద్దలు చెప్పిన సంస్కృతి సంప్రదాయాలను ఆచరించుట.

సంస్కృతిని ఆచరించుట ఎలాగుయనిన - అనాదిగా వస్తున్న వేదవేదాంగాలలోని మంచిని గ్రహించి దైనందిన జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి. ఉదాహరణకు రామాయణం యుగయుగాలుగా గౌరవింపబడుతున్నది. అందులో సీతారామ కల్యాణం ఒక సుమనోహర ఘట్టం. ఆ కళ్యాణం ఎంతో వీనులవిందుగా జరిగినదని వర్ణిస్తారు. దాన్ని ఆదర్శంగా తీసుకొని కనులపండుగగా శ్రీరామనవమి జరుపుకోవడం సంస్కృతిని గౌరవించడం అవుతుంది.

"ఇదే సంస్కృతిని కాపాడే విధానం." అంటూ ఆవేదన వ్యక్తం చేసిన కత్తి మహేష్ కుమార్ ఏమన్నాడో చూడండి:

కానీ నేను ఆపని చెయ్యను."ఓహో మొల్లకాలంలో తెలుగు దేశంలో ఇలా పెళ్ళిళ్ళు జరిగేవన్నమాట" అనే నిర్ధారణకు వస్తాను. ఎందుకంటే,రాముడు ఉన్నాడు అన్న కాలంలో పట్టుపీతాంబరాలు ఉండే అవకాశం ఉందా? తిలకాలుకాటుకలూ దిద్దేవారా? కంకణాలు తొడిగేవారా? మంగళవాయిద్యాలు కె.వి.మహదేవన్ తరహాలో వాయించేవారా? అసలు ఉంటే ఉత్తరభారతీయుడైన రాముడు మాంగళ్యధారణ సాంప్రదాయాన్ని పాటించేవాడే? అనే సమాధానం లేని ప్రశ్నలు ఇక్కడ అవసరం గనుక. మొల్ల తన కాలమాన పరిస్థితుల్నీ, సాంప్రదాయాల్ని బట్టి తనదైన వర్ణన చేసుంటుందనే నిర్ధారణకు వస్తాను.

ఆ వర్ణనతో పాటూ భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగే విధానం ఎప్పటి నుండీ ప్రారంభమయ్యింది. వారు పాటించే సాంప్రదాయాలకు మూలం ఎక్కడ.ఉత్తరభారతదేశంలో ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయా వంటి ప్రామాణికాలు వెదకి మూలాలను గ్రహించి, పరిశోధన ఫలితాల్ని ప్రతిపాదిస్తాను.

అలాగే దంపతులు అన్నమాటకు సీతారాములను ప్రతీకగా చెప్పుకుంటూ ప్రతి ఇంటా కొలుస్తూ సంస్కృతిని ఆచరిస్తారు అందరూ. "సంస్కృతిని కాపాడే" కత్తి మహేష్ కుమార్ ఏమంటున్నాడో చూడండి:

"ఈ రామాయణం ప్రకారం సీత రాముడికి సోదరి అవుతుంది. వయసులో చిన్నది కాబట్టి చెల్లెలన్నమాట....ఈ బౌద్ధజాతక కథ ప్రకారం, దశరధుడు అయోధ్యకు కాదు, వారణాశికి రాజు. అంటే కాశీరాజన్నమాట. అతనికి రామపండితుడు, లక్ష్మణకుమారుడు, సీత అనే పిల్లలు.... ఇక అన్నాచెళ్ళెల్ల వివాహం అంటారా, అప్పటి రాచరికంలో incestuous పెళ్ళిళ్ళు ఉండే అవకాశం పెద్ద ఆశ్చర్యకరం ఏమాత్రం కాదు. అమలి రాచరికపు రక్తం పేరుతో ఇలాంటి సాంప్రదాయాలు చరిత్రలోని చాలా రాచరికాల్లో ఉండటం మనకు తెలిసిందే."
వ్రతాలు ఏ వేదాల్లో ఉన్నాయో కాస్త చూసిచెప్పండి! వేదకాలంలో చిల్లరదేవుడైన విష్టువు అత్యంత శక్తివంతుడైన దేవుడుగా ఎలా ఎదిగాడో కాస్త కనుక్కుని చెప్పండి! శివుడు త్రిమూర్తుల్లో ఒకడెప్పుడయ్యాడో కాస్త ఆరాతియ్యండి!

ఆహా ఎంత బాగా చెప్పాడు. చూసారా ఈతడు ఎంత చక్కగా సంస్కృతిని కాపాడుతున్నాడో!!
ఇంకా "మన సంస్కృతి రహస్యకుతి అనుభవించే అద్భుతమైన సంస్కృతి. "  అన్నాడు. ఇలా మన సంస్కృతిని కాపాడుతున్న మహేష్ కుమారును నొప్పించకండి నాయనలారా. రహస్యకుతి అనుభవించే అద్భుతమైన సంస్కృతిని కాపాడండి. నా ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి.

- భగవాన్ శ్రీ శ్రీ శ్రీ బుడుగు బాబా

13 comments:

 1. Krishna K said...
  This comment has been removed by the author.
 2. శరత్ కాలమ్ said...

  అలాగే బాబాజీ, అర్ధమయ్యింది మీ సదేశం.
  అన్నమయితేనేమిరా, సున్నమయితేనేమిరా,
  ఈ పాడు పొట్టకు - అన్నమే పడవేయురా!
  అనేటటువంటి మెట్ట వేదాంతమే కదా బాబా మీది? ఏంటో అంతా ఈ-మాయ!

 3. పునర్వసు said...

  నా వ్యాఖ్య
  http://tureeyam.blogspot.com/2009/06/blog-post_22.html

 4. madhu said...

  జీడిపప్పు గారు, మీకు అచ్చెరువొన్దిన్చేటన్త టాలెంట్ ఉంది !

  కృష్ణ గారు, అప్పు తచ్చా? 'పాతకుండ' --- పాపకుండ కాదు !

 5. చిలమకూరు విజయమోహన్ said...

  "దేవుడిచ్చిన అవకాశాన్ని వ్యర్థం చేసుకుని" ఏదేవుడిచ్చిన అవకాశం చెప్పనేలేదు ఏసుప్రభువా,అల్లానా లేక చిల్లరదేవుడైన విష్ణువా ? చెప్పండి మనది లౌకిక రాజ్యం చెప్పకపోతే ఇబ్బంది రిజర్వేషన్లతో

 6. Krishna K said...
  This comment has been removed by the author.
 7. Krishna K said...

  Z, మీ సవరణ తో,
  రహస్యకుతి అనుభవించే అద్భుతమైన సంస్కృతిని కాపాడండి" ఇలా సంస్కృతి ని కాపాడలేకపోయారో,మన బ్లాగ్లలో, పెద్దల సహకారం తో, సంస్కృతి కాపాడుట కోసం (మాత్రమే) కేసులు గట్రాలు పెడతాం నాయనలారా. అనుమానాలు ఎమైన ఉంటే "పుస్తకం" లో చూసి చదువుకోండి "పాతకుండ"ల్లారా. - ఇట్లు మీ "ఉత్తముండ" :)).

 8. నాగప్రసాద్ said...

  అసలు ప్రతీదానికి ఆధారం కావాలనే మనిషి, బౌద్ధ జాతక కథను ఎలా నమ్మాడో, ఎందుకు నమ్మాడో. ఇంకో టూమచ్ కామెడీ ఏమిటంటే, బౌద్ధున్ని తీసుకొచ్చి దశావతారాల్లో కలపడం.

  @చిలమకూరు విజయమోహన్ గారు, :))

 9. Malakpet Rowdy said...

  lol

 10. వేమన said...

  నేను ఈ బ్లాగుల గుంపుకి కొత్త... కానీ ఒక్క మాట -
  మంచి నమూనాలే ఏరారు....ఇలాంటివన్నీ (కనీసం లాజికల్ గా ఖండించలేనంత అడ్డంగా) రాస్తుంటే శత్రువులు తయారవరేంటి మరి!

 11. ఏక లింగం said...

  see this
  http://ekalingam.blogspot.com/2009/06/blog-post_23.html

 12. మంచు said...

  """ మనిషి మరణిస్తే చేసిన పాపపుణ్యాల ఆధారంగా స్వర్గానికో నరకానికో వెళ్ళవలసి వస్తుంది. పాపాలు చేసినవారు నరకానికి తీసుకెళ్ళబడతారు """

  బాబా జీ .. పాపపుణ్యాల ఆధారంగా అని సెలవిచ్చారు ? అక్కడ రిజర్వెషన్స్ వుండవా ?

 13. Anonymous said...

  please visit http://dhoommachara.blogspot.com for new post

Post a Comment