పుస్తకం.నెట్ నిర్వాహకులు జైలుకు - Season Finale

Posted by జీడిపప్పు

గత ఏడాది కాలంలో తెలుగు సాహిత్య రంగానికి సేవలు చేయడానికి ఎందరో తమవంతు కృషి చేసారు. "పుస్తకం హస్తభూషణం" అన్న మాటను ఆదర్శంగా తీసుకొని పుస్తకప్రియుల కోసం మంచి పుస్తకాల సమాచారాన్ని అందివ్వడానికి, పంచుకోవడానికి కొందరు "పుస్తకం.నెట్" అనే వెబ్‌సైట్ ప్రారంభించారు. చాలావరకు చక్కని చర్చలు జరిగాయి కానీ ఈ మధ్య ఆ చర్చలు శృతిమించి వ్యక్తిగత దూషణలవరకు వెళ్ళాయి. చివరకు పోలీసు కేసులు, FIRల వరకు వెళ్ళాయి అంటే పరిస్థితి ఎంతగా చేజారిందో తెలుస్తున్నది.

కత్తి మహేష్ గారు తనను కులం  పేరుతో దూషించారని కేసు పెట్టారు. మహేష్ గారి మాటల్లో:

"పుస్తకం డాట్ నెట్ లో చలంపై జరిగిన ఒక చర్చలో  నాపై కులపరమైన నింద చేస్తూ "
"బ్లాగుల్లో కంటెంట్ కామెంట్లతో సహా అన్నిటి బాధ్యతా బ్లాగరిదే. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే మోడరేషన్ బాధ్యత బ్లాగరి తీసుకుంటాడు కాబట్టి"
"కేసు పెట్టడానికి నేను దళితుడినైతే చాలు. ఒకసారి SC/ST (prevention of) atrocities act చదువుకోండి."

అంటే మహేష్ గారిని అన్నవారికంటే ఆ వ్యాఖ్య ప్రచురించిన పుస్తకం.నెట్ నిర్వాహకులదే తప్పు. వారే బాధ్యులు అన్నమాట. ఇక ఇది SC/ST atrocity act కింద వస్తుంది కాబట్టి ఎవరూ తప్పించుకోలేరు.

సదుద్దేశంతో ఒక వెబ్‌సైట్ మొదలు పెట్టిన నిర్వాహకులు కేసుల్లో ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరిగి జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడడం కడు శోచనీయం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పురావృతం అని కోరుకుందాము.

      *******                       *******                          *******

బ్లాగుల్లో జరుగుతున్న సందడికి నా తరఫున ఇప్పటికి మూడు ఎపిసోడ్లు ప్రసారం చేసాను. ఈ నాలుగో ఎపిసోడ్‌తో ఈ మొదటి సీజన్ ముగిస్తున్నాను. అసలేమి జరిగింది, ఏమి చేసాము, ఏమి సాధించామో సింహావలోకనం చేసుకుందాము.

ముందుగా - ఒక కోన్ కిస్కా గొట్టం గాడు వచ్చి "అర్జునుడు భీముడికి బామ్మర్ది అవుతాడు తెలుసా" అన్నపుడు లేదా ఉడతలుపట్టే చిడతల చిన్నారావు "పంచపాండవులు పంచలే కట్టుకుంటారని సాక్ష్యం లేదు" అన్నపుడు ఒక సగటు వ్యక్తి భావనలలో/ఆలోచనలలో వెంట్రుకంత కూడా మార్పు ఉండదు. వినేవాడు ఒకటో తరగతి పిల్లవాడూ కాదు, చెప్పేవాడు ఒక మూర్ఖుడని అందరికీ తెలుసు. కొందరు "మనకెందుకులే ఈ బురదలో రాయి వేయడం" అని ఊరకుంటారు. నా గురించి బాగా తెలిసిన మా గురువుగారు తెలుగోడుగారు ఒకసారి "పడుకున్న గాడిదను లేపి తన్నించుకోవడం నీకు భలే ఇష్టం కదా" అన్నారు. నిజమే! రెండు తన్నించుకొని నాలుగు తన్ని దురద తీర్చుకొనే నాలాంటి వాళ్ళు ఈ చెత్త చదివి కాస్త చిరాకుతో కొన్ని కామెంట్లు/పొస్టులు వేస్తుంటారు తప్పించి ఈ మతగజ్జి మూర్ఖుల వల్ల అర్థనయాపైసా నష్టం లేదు.

ఇక బ్లాగుల్లో వివాదం సంగతి:  కత్తి మహేష్ కుమార్ గారు తనపైన వచ్చిన "కుల వివక్ష" గురించి చెప్పారు. అందరూ అంగీకరించాల్సిన విషయమే. నలుగురు కులస్తులు కలిసే చోటు ఏది? గుడి. అంటే కులం కంటే మతం గొప్పదిగా భావించేవారే ఎక్కువ కదా. మరి అలాంటి మతాన్ని
""ఈ రామాయణం ప్రకారం సీత రాముడికి సోదరి అవుతుంది. వయసులో చిన్నది కాబట్టి చెల్లెలన్నమాట....ఈ బౌద్ధజాతక కథ ప్రకారం, దశరధుడు అయోధ్యకు కాదు, వారణాశికి రాజు. అంటే కాశీరాజన్నమాట. అతనికి రామపండితుడు, లక్ష్మణకుమారుడు, సీత అనే పిల్లలు.... ఇక అన్నాచెళ్ళెల్ల వివాహం అంటారా, అప్పటి రాచరికంలో incestuous పెళ్ళిళ్ళు ఉండే అవకాశం పెద్ద ఆశ్చర్యకరం ఏమాత్రం కాదు. అమలి రాచరికపు రక్తం పేరుతో ఇలాంటి సాంప్రదాయాలు చరిత్రలోని చాలా రాచరికాల్లో ఉండటం మనకు తెలిసిందే." 
 "వ్రతాలు ఏ వేదాల్లో ఉన్నాయో కాస్త చూసిచెప్పండి! వేదకాలంలో చిల్లరదేవుడైన విష్టువు అత్యంత శక్తివంతుడైన దేవుడుగా ఎలా ఎదిగాడో కాస్త కనుక్కుని చెప్పండి! శివుడు త్రిమూర్తుల్లో ఒకడెప్పుడయ్యాడో కాస్త ఆరాతియ్యండి!"
 లాంటిమాటలతో మహేష్ గారు హేళన చెయ్యడం న్యాయమా? "బ్రాహ్మినికల్ యాటిట్యూడ్" అంటూ రకరకరాల నిర్వచనాలు చెప్పి అవతలివారితో "దళిత్ యాటిట్యూడ్" అనిపించుకొని  "కేసు పెట్టడానికి నేను దళితుడినైతే చాలు. ఒకసారి SC/ST (prevention of) atrocities act చదువుకోండి." అనడం ఎంతవరకు సమంజసం?

నేనేదో హిందూమత పరిరక్షకుడినో, హిందూన్మాదినో కాదు. సుష్టుగా వారానికి ఏడు రోజులూ చికెన్ బిర్యానీ తిని ఎన్నో ఏళ్ళనుండి దేవుడికి ఒక్కసారయినా మొక్కని నేను ఇలా ఎందుకు స్పందిస్తున్నానంటే.. i don't like this crap of insulting/mocking/scrutinizing religious stuff thus hurting one's beliefs.

ఇక ఈ నాలుగురోజుల సీజన్‌లో ముఖ్యంగా చెప్పుకోవలసినది బ్లాగరుల విశేష స్పందన. పదుల కొద్దీ పోస్టులు (పూర్తి జాబితా), వందల కొద్దీ కామెంట్లతో ఆద్యంతం ఆహ్లాదకరంగా, వినోదాత్మకంగా, పండుగవాతావరణాన్ని తలపింపచేసారు. "కేసు పడుద్ది" "నీ ఐపీ అడ్రస్ నాకు తెలుసు" "అట్రాసిటీ కేసు పెడతా" "ఏం పీక్కుంటావో పీక్కో" "నీది xyz యాటిట్యూడ్" లాంటి మాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. ముందు ముందు ఈ మాటలతో చాలా హాస్యం వెల్లివిరుస్తుందన్న విషయంలో అణుమాత్రమనుమానం లేదు.

కేవలం నాలుగు ఎపిసోడ్లతో ఈ సీజన్ ముగించడానికి కారణాలంటూ పెద్దగా ఏమీ లేవు. కాకపోతే ఈ చెత్త ఎక్కువయితే కంపు ఎక్కువవుతుంది. మోతాదు మించితే వెగటు పుడుతుంది. దీనికి తోడు నేను వ్రాయాలనుకున్న ఒకటో రెండో వెనకపడుతాయి. ఈ గొడవలు ఇప్పటికీ ఎప్పటికీ ముగియవు. తొందర్లో సీజన్ 2 ఎపిసోడ్ 1 లో మళ్ళీ సందడి చేద్దాం. 2-3 రోజుల్లో నా మామూలు పోస్టులతో మళ్ళీ కలుస్తాను.

మీకు సూచనలిచ్చేటంతటివాడిని కాకపోయినా ఓ రెండు ముక్కలు: ప్రత్యక్ష దూషణకు దిగకండి. తెగే దాకా లాగినా ఫర్వాలేదు కానీ తెగనివ్వకండి. తెగితే మనకు కావలసిన ఎంటర్‌టైన్‌మెంట్ దొరకదు. ఇది గుర్తించుకొని హాస్య/వ్యంగ్య మాటలతో హాయిగా నవ్వుకుందాము.

Take care now, bye bye then!

Image and video hosting by TinyPic

32 comments:

 1. శరత్ కాలమ్ said...

  ప్చ్. పుస్తకం డాట్ కాం. ఎంత గడ్డుకాలం ఎదుర్కోబోతోందీ! నా సానుభూతి మీకు ఎప్పుడూ వుంటుంది. ఏదయినా సహాయం అవసరమయితే నన్ను కూడా అడగండి.

 2. Krishna K said...

  అందుకనేనా, నేను pustakam.net లో IP అడ్డ్రెస్సులు షేర్ చేసుకోవటానికి (పంచి ఇవ్వటం లో) వాళ్ల పాలసీలు ఏమిటి అని అడుగుతుంటే, సమాధానం కూడా రావటం లేదు. "ఇంత బ్రతుకు బ్రతికి, ఇంటి వెనకాల పొయినట్లు" అన్నట్లు, పుస్తకం తరుపున మార్థాండ ఉరఫ్ ప్రవీణ్ spokes person అయ్యాడు. ఇప్పుడు అర్ధం చేసుకోగలుగుతున్నా.

 3. నాగప్రసాద్ said...

  >>"భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పురావృతం అని కోరుకుందాము." :))

  >>"ప్రత్యక్ష దూషణకు దిగకండి. తెగే దాకా లాగినా ఫర్వాలేదు కానీ తెగనివ్వకండి. తెగితే మనకు కావలసిన ఎంటర్‌టైన్‌మెంట్ దొరకదు. ఇది గుర్తించుకొని హాస్య/వ్యంగ్య మాటలతో హాయిగా నవ్వుకుందాము.

  :))

  ఈ వారంలో పని కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల నేను ఇంకో రెండు పోస్టులు వెయ్యలేకపోయా ఈ విషయం మీద. :(, లేకపోతే ఇంకొంచెం లాగేటోళ్ళమే.


  PS: నాకు పై రెండు కామెంట్లు నచ్చలేదు. ఎందుకంటే నా కంటే ముందు ఈ పోస్టు చదివి, కామెంట్ రాశారు కాబట్టి. అందుకని డిలీట్ చెయ్యమని కోరుతున్నాను. వివరాలకు ఐ.టి. చట్టం చదువుకోగలరు. :))

 4. శరత్ కాలమ్ said...

  నాకు నాగప్రసాద్ వ్యాఖ్య బొత్తిగా నచ్చలేదు. వెంఠనే ఆ కామెంటును పీకి పాతరెయ్యండి. హ హ హ (వికటాట్టహాసం).

 5. Anonymous said...

  ఈ జీడిపప్పు సంగతి ఓ సారి చూద్దాం. ఓ రోజు తాడేపల్లిగారిని తెలుగులో అంకెలు రాసేంతగా తెలుగు వాడెయ్యాలా? అని అడిగాడు. అతను అతని ఉద్దేశ్యం చెప్పారు. అంతే! మరుసటి రోజు నుండీ ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ అతనిపై నోరు పారేసుకోటం మొదలుపెట్టాడు. అంటే వీడు చెప్పెయ్యగానే జనాలు వినేయాలన్న పిచ్చి వీడికుంది. ఇంక అలాంటి చిన్న అవకాశం వచ్చినా విడిచిపెట్టడు. మహేశ్ ఏ జీవంలేని విషయాలపైన అడ్డంగా వాదిస్తున్నాడని చెప్తున్న ఈ గొప్ప మనిషి ఓ మనిషని కూడా చూడకుండా ఎవరినైనా ఎంతలా గాయపరచడానికైనా వెనుకాడడు. ఈ బ్లాగ్లోకం బ్రష్టుపట్టిపోటానికి కారణమైన తొట్టిగ్యాంగులో వీడికీ భాగం ఉంది. సీనియర్ బ్లాగర్ల మీద విరుచుకుపడిన ఈ ముష్టి గ్యాంగు ఇప్పుడు ఎంత గొప్పగా ప్రవర్తిస్తున్నారో చూశారు కదా. అదన్నమాట సంగతి. నోరేసుకు పడిపోవడం తప్ప ఇంకేమీ తెలీదు వీళ్ళకి.

 6. జీడిపప్పు said...

  freedomfromcraziness గారు, నా బ్లాగుకు స్వాగతం, సుస్వాగతం.
  ఈ జీడిపప్పు గురించి నేను కూడా చాలా రోజులనుండి గమనిస్తున్నాను. సరి అయిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. మీరు ఇందాకే ప్రారంభించిన మీ బ్లాగులో జీడిపప్పు గురించి, ఈ జీడిపప్పు పాత పోస్టులను/కామెంట్లను quote చేస్తూ పోస్టులు వేసి అసలు రంగు బయటపెట్టండి.ఈ జీడిపప్పు గురించి నాకు అన్ని వివరాలు తెలుసు. మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను ఇస్తాను. మన చేతుల్లో ఈ జీడిపప్పు కాస్తా "జాడిపప్పు" అయిపోతాడు.


  O boy, i love this crap very much!!

 7. Krishna K said...

  freedomfromcraziness గారు, చాలా బాగా చెప్పారు. ఈ జీడిపప్పు కు సీనియర్ బ్లాగర్ ల మీద అసలు గౌరవం లేదు. మొన్నా మధ్య ర్యాగింగ్ చేయించుకోమంటె, ఓ కెస్ వెస్తానన్నాడు. తనె చెబ్తున్నాడుగా, గుడికి గాని, కనీసం ఇంటి వెనకాలే ఉండే చర్చికి గాని పోను కూడా పోడు. ఈ జీడిపప్పు గన్నేరు పప్పులాంటోడు. తప్పకుండా కెలుకుడు బ్లాగర్ సంఘం లో తనూ ఓ మెంబెరే. కాబట్టి మన కోటా బ్లాగర్ సంఘం తరుపున ఓ కేస్ వేద్దాం. ఈ పప్పు ip అడ్డ్రెస్స్ కావాలంటే మన సీకాకులం తీగల వీరుడి సహాయం తీసుకొందాం. కాదు కూడదు అంటే, బ్లాగ్ లోకపు మాంత్రికుడి సహాయం తీసుకొందాం. రౌడీ ఇజం, కావాలంటె తనకి రాబోయే కాలం లో కాబోయే పోటీదారుడేమో అన్న అనుమానం తో, మలక్పేట తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని, ఆస్టిన్ ప్రక్కనే ఉండే క్రాఫొర్డ్ బుష్ గారి రాంచ్ మీద వొట్టేసి మరీ చెప్పారు. ఇకేటూ మన HCU వాళ్ల అండ ఎప్పుడూ ఉంటుంది కదా. చెయిన్ లు గట్రాలు , కావాలంటే ఈయన బేచ్ లోనే , ఇంకో పోటీదారుడు శరత్ చెయిన్ లు సప్లై (చేయిన్ లు, ఇంతక్ముందు ఎప్పుడు ఎలా ఏ ఏ పనులకు వాడొరో అడగొద్దు అన్న కండిషన్ మీద) చేయటానికి ముందుకొచ్చారు. కాబట్టి మీరు రెచ్చి పోండి. కేస్ లో సాక్ష్యాలు కావాలంటే తెరిచిన పుస్తకం వారు ఎటూ ఉన్నారు. :))

 8. శరత్ కాలమ్ said...

  ముర్దాబాద్ జీడిపప్పు! ముర్దాబాద్!!

 9. Bhaskar said...

  ఈ తిట్ల, కొట్లాటల సీజన్లొ ముసుగు వీరులు ఎక్కువ అయిపొయారు! freedomfromcraziness లాగ! నిద్రపొయె గాడిద వ్యవహరం జబర్దస్థు!

 10. ఏక లింగం said...

  Jeedipappu gaaru,
  you did not add this post in your list

  http://ekalingam.blogspot.com/2009/06/blog-post_22.html

 11. రాజ మల్లేశ్వర్ కొల్లి said...

  ముసుగువీర లేవరా అంట్లుతోమి పొమ్మురా
  అదరవద్దు బెదరవద్దు ఈ కూడలి నీ హద్దురా

  ఎవరువారు ఎచ్చటివారు ఈ ముష్టిగ్యాంగు వారు
  అభిమానధనం దోచుకునే దొంగవారు ||ముసుగు||

  బ్లాగ్స్వాతంత్ర్య వీరుడా స్వేచ్చ పిచ్చగాడా
  అందుకో మాపూజలందుకో పిచ్చగాడా ఓస్వేచ్చ పిచ్చగాడా ||ముసుగు||

  బ్రష్టుపట్టిన బ్లాగోకంలో పౌరుషాన్ని రగిలించినవాడా
  ముష్టి గ్యాంగు గుండెలో నివశించినవాడా ||ముసుగు||

  వందే బ్లాగుమాతా.. వందేబ్లాగుమాతా...
  వందే బ్లాగుమాతా.. వందేబ్లాగుమాతా...||ముసుగు||

  (తెలుగువీర లేవరా పాట రచయిత, అభిమానులకు క్షమాపణలతో)

 12. శ్రీనివాస్ పప్పు said...

  ప్రత్యక్ష దూషణకు దిగకండి. తెగే దాకా లాగినా ఫర్వాలేదు కానీ తెగనివ్వకండి. తెగితే మనకు కావలసిన ఎంటర్‌టైన్‌మెంట్ దొరకదు. ఇది గుర్తించుకొని హాస్య/వ్యంగ్య మాటలతో హాయిగా నవ్వుకుందాము.

  http://pappusreenu.blogspot.com/2009/06/blog-post_6405.html

 13. Shashank said...

  ee jeedipappu gurinchi naaku gata koddi ellaga telusu. eppudu ante.. pattina kundelu ani mottukuntun untadu. anduke maa guruvu gaaru annadi correct.
  jeedipappu ki chala chala publicity craze undi.

  jeedipappu down down. nee IP naa daggara undi. case on its way.

 14. Krishna K said...

  కొల్లి గారూ, :)) :)) :)) సూపర్ స్టార్ అభిమానుల ముందు మాత్రం పాడకండి, LOL

  @Shashaank కేసులు వేయటం మా కోటా బ్లాగర్ల సంఘం జన్మ హక్కు, ఇందుకు (మీరు కేస్ వెయటానికి) మేము ఒప్పుకోము అద్యక్షా, freedomfromcraziness (స్వేచ్చ పిచ్చగాడు) కే జీడిపప్పు మీద కేస్ వేసే హక్కు ఉంది. కావాలంటే అట్రాసిటీ యాక్ట్ చదువుకోండి. కోటా బ్లాగర్ల సంఘం జిందాబాద్, కెలుకుడు బ్లాగర్ల సంఘం ముర్దాబాద్. చేస్తాం, చేస్తాం, జీడిపప్పును, జీడి పాకం. చేస్తాం, చేస్తాం, జీడిపప్పును, జీడి పాకం.

 15. ఏక లింగం said...

  "కేసు పడుద్ది" "నీ ఐపీ అడ్రస్ నాకు తెలుసు" "అట్రాసిటీ కేసు పెడతా" "ఏం పీక్కుంటావో పీక్కో" "నీది xyz యాటిట్యూడ్" లాంటి మాటలు బాగా ప్రాచుర్యం పొందాయి

  ----

  వీటితో పాటు చేర్చవలసినవి...

  కామెంట్ తమ్ముడిదయినా కేసు కామనే అన్నా
  కేసేసుకుందాం రా...
  కేసుకు తక్కువ కామేంట్ కు ఎక్కువ.

 16. Anonymous said...

  "ఈ బ్లాగ్లోకం బ్రష్టుపట్టిపోటానికి కారణమైన తొట్టిగ్యాంగులో వీడికీ భాగం ఉంది. సీనియర్ బ్లాగర్ల మీద విరుచుకుపడిన ఈ ముష్టి గ్యాంగు ఇప్పుడు ఎంత గొప్పగా ప్రవర్తిస్తున్నారో చూశారు కదా. అదన్నమాట సంగతి. నోరేసుకు పడిపోవడం తప్ప ఇంకేమీ తెలీదు వీళ్ళకి."

  పై వ్యాఖ్య మరొక్కసారి చదవండి. ఇప్పుడు ఇంకో వ్యాఖ్య.

  "జనాలకు ఇంత వినోదాన్ని అందిస్తున్న మీ ఇద్దరినీ(మహేశ్ & యోగి) అభినందించలేకుండా ఉండలేకపోతున్నాను. ముఖ్యంగా యోగికి మరింత అభినందనలు. చదువేస్తే ఉన్నమతి పోతుంది అన్నదానికి యోగీ, మహేశ్‌లు ప్రత్యక్ష సాక్ష్యాలు. ఒకరినొకరు దూషించుకోవటం, రెచ్చగొట్టుకోవటం, హేళన చేసుకోవటంతోనే వీళ్ళ తెలివితేటలను బయటపెట్టుకుంటున్నారు. అందులో అరక్షణం కూడా ఎదుటివారి మాటలను అర్ధం చేసుకోటానికి వెచ్చించే ఓపిక ఇద్దరికీ లేదు. కనీసం మహేశ్ యోగితోనే ఆపేస్తాడు. కానీ యోగి మాత్రం మహేశ్‌ని అభినందించేవాళ్ళని కూడా వదిలిపెట్టాడు. గొప్పగా చదివి ఊడబొడిచాను కదా, ఎవరినైనా ఏమైనా అనవచ్చు అనే అహంకారమే కనిపిస్తుంది. విపరీతమైన సెన్సేషనల్ స్టేట్మెంట్లు ఇచ్చే మహేశ్ ఏమీ తక్కువ కాదు. అసలు యోగి రాక వల్ల భాస్కరరామరాజు నుండి ఈ మద్యనే వచ్చిన విశ్వక్శేనుడు వరకూ అందరూ మహేశ్‌ని తిట్టి ఆనందించేవాళ్ళే. వీళ్ళని అదుపుచేసేవాళ్ళే లేరు. అందరినీ ప్రశ్నించే యోగిని ఎవరూ ప్రశ్నించరు. ఎందుకంటే అతను నోరేసుకొని పడిపోవటంలో సిద్దహస్తుడు."

  http://parnashaala.blogspot.com/2009/06/blog-post_9937.html

  ఇదే టపాలో ఇంకొక వ్యాఖ్య

  "మల్లీ పెద్ద మేధావని ఫీలింగోటి. అదేందంటే ఇంగ్లిపీసులో కూస్తడు ఏదో ఈనొక్కనికే ఇంగ్లీసొచ్చినట్టు పోజులుగాకపోతె."

  సోదర క్లాగరులారా (కెలుగుకుడు బ్లాగర్లు అని కవి భావము) పై మూడు వ్యాఖ్యలూ రాసినది ఒక్కరేనని అది ఒక స్త్రీ అని నేను మీకు తెలియజేస్కుంటున్నాను. కొంచెం పరిశీలించిన పిమ్మట ఇటుల అక్కసు తీర్చుకోవల్కసిన అవసరం ఎవరికి ఉందో కూడా మీకు తెలుస్తుందని కూడా మనవి చేస్కుంటున్నాను. ఆంగ్లపు మాటలతో సమస్యలెవరికి ఉంటాయి చెప్పండి ఇంతకుముందు దారుణంగా దెబ్బతిని మర్చిపోలేని వారికి తప్ప?

  కాబట్టి నా క్లాగు సోదరులారా మీలో ఎవ్వరికన్నా కత్తి చీర్ గర్ల్స్ జిందాబాద్ అని ఒక టపా రాయాలనిపిస్తే రాయకండి. ఓర్చుకోండి, ఎందుకంటే అది మన సంస్కృతి కాదు.

 17. Anonymous said...

  అన్నట్లు ఈవిడగారి వ్యాఖ్యలోని జూనియర్ బ్లాగర్ల పట్ల వివక్ష ను మనం తీవ్రాతితీవ్రంగా ఖండించాలని తీర్మానించడం జరిగింది.

  Junior Blogger atrocity కేసొకటి ఈ వ్యాఖ్యాతగారి మీద వెయ్యాలని మేము డిమాండ్ చేస్తున్నాం........ జీడిపప్పు ఐపీ ఇస్తావా లేదా. అట్లనే మంచి స్క్రీన్ షాట్ కూడా పంపు

 18. ఏక లింగం said...

  "కత్తి చీర్ గర్ల్స్"

  LOL..
  ఇదేదో పనికొచ్చే పదం లాగుంది. వింటే శరత్ వచ్చి తన్నుకు పోతాడు.

 19. Dreamer said...

  బౌద్ధ జాతక కథల్లో రాముడికి సీత చెల్లెలవుతుందన్న విషయం ఆరుద్ర రాస్తే మీకేం అనిపించలేదుగానీ మహేష్ అదే విషయం చెప్తే ఎందుకు సహించలేకపోతున్నారు. నాకు తెలిసినంతవరకు ఆయన చెప్పే విషయాలన్నీ ఇంతకుముందు ఎక్కడో చదివినవే.

  So, you conveniently ignore that arudra is a brahmin and bash mahesh coz you can't stand his opinion only because he is a dalit.

  Till now I used to wonder why on earth we still need reservations for dalits, now I totally understand. We are still feudal at heart.

  BTW, Iam a brahmin and I don't give a flying squirrel about my caste.

 20. ఏక లింగం said...

  @ Dreamer

  నమస్తే అన్న..

  మీలాంటి Day Dreamers నిద్రనుండి లేవాలి అన్నా.. అప్పుడే ఇక్కడ నిజం ఏంటో తెలుస్తుంది. కత్తికి ఆరుద్ర కు పోలిక పెడుతున్నావు అంటే మీకింకా నిద్రమత్తు వదల్లేదనుకుంటాను. ఒకసారి మొహం కడుక్కోని రండి. కూర్చొని మాట్లాడుకుందాం.

  మీరు చర్చను ప్రక్కదారి పట్టించేలా మధ్యలో రిజర్వేషన్ ల గురించి మాట్లాడకండి. ఇక్కడ దానిగురించి ఎవరు ఏమీ అనడం లేదు.


  BTW...we are all not brahmins. This is a motley crew.

 21. Krishna K said...

  @Dreamer అన్న,
  "BTW, Iam a brahmin and I don't give a flying squirrel about my caste." ఎంత మంచి మాటన్నావన్నా, ఈ కేలుకుడు బ్లాగర్ల గొడవ అదేనన్నా, నీలాగే అచ్చు అలాగే అన్న, మా సుత్తన్న, కులాని (గట్టి గా కులం కూడా కాదన్న, రిజర్వేషన్ తీసుకొన్నాడని, ఎవరో అనగానే) అనగానే, తన వి.....శా....ల....భావాలు అన్నీ తీసి గట్టుమీదెట్టేసి,
  "కేసు పెట్టడానికి నేను దళితుడినైతే చాలు. ఒకసారి SC/ST (prevention of) atrocities act చదువుకోండి." అనేసాడన్న.

  దీనిగురెంచేనన్న ఈ కేలుకుడు గాళ్లు తెగ కెలుకుతున్నారాన్న. నువ్వన్నా ముంది వెళ్లి, మొఖం కడొక్కొచ్చి (లేకపోతే ఏకలింగం బాధ పడతాడన్న) ఒక్క సారి, నీ "వి.....శా....ల....భావాలు " సుత్తెన్న కు కూడా, ఇంకోసారి వివరించన్నా. మరీ ముఖ్యం గా "I don't give a flying squirrel about my caste అన్నావే ఆ ముక్క గురించి :))

  మనలో మాట అన్న, నేను నీలాగే brahmin ను కాదన్నా. సుబ్బరంగా, బ్రతికిఉన్న, చచ్చిన కోళ్లు, చేపలు కోసుకొని, కూరొండుకొనే, వీర శైవుడిని అన్నా. అనుమానం ఉంటే మా ఊళ్లొ హాంకాంగ్ మార్కెట్ వాళ్లు కూడా సాక్షీకం ఇస్తారన్న.

 22. Dreamer said...

  @ ekalingam & Krishna
  This is called Reductio ad absurdum.

  aarudra cheppinde katti chepthey enduku mandindi ani adiganu, aarudrani kathi ko polchaledu.

  Anyway, I understand that talking to you guys is like talking to a wall.

  Enjoy your shit bath.

 23. Krishna K said...

  @Dreamer అన్నా, ఏకలింగం అంది నిన్ను నీళ్లతో మొఖం కడుక్కొని రమ్మని, shit bath తో కాదన్న. దీనికి నాకు ఏటువంటీ సంబంధం లేదన్నా. కేసు గట్ర పెట్టాలంటే, ఏకలింగం మీదే పెట్టెయ్ అన్నా. IP అడ్డ్రెస్స్ కావాలంటె photoshop image కొసం, జీడిపప్పును అడుగన్నా. రౌడీ అయితే, నీకు ఎలా కావాలంటే అలా చేసి ఇస్తాడన్న :))

 24. ఏక లింగం said...

  @ Dreamer
  ఎందుకు సార్ మద్యలో వచ్చి ఇరుక్కుంటారు. నేను తిట్టడం మొదలు పెడితే, మీకు తలెక్కడ పెట్టుకోవాలో తెలియదు. మళ్లీ అనవసరంగా కెలుక్కోకండి.

 25. Bhãskar Rãmarãju said...

  ఏక లింగం -
  ఏవయ్యా!! ఎవ్వర్నీ వదిలే సమస్యే లేదా? తస్సదియ్యా!!

 26. కాలనేమి said...

  Hey, look who is talking!!

  Reductio ad absurdum, eh? Lets see!

  You wrote:

  "బౌద్ధ జాతక కథల్లో రాముడికి సీత చెల్లెలవుతుందన్న విషయం ఆరుద్ర రాస్తే మీకేం అనిపించలేదుగానీ మహేష్ అదే విషయం చెప్తే ఎందుకు సహించలేకపోతున్నారు"

  Since you invoke logical fallacies, it wouldn't be odd if I ask you a few 'logical' questions. Would it?

  What exactly does the above statement convey?

  1. Arudra wrote something and it becomes true? ( Fallacy: Appeal to Authority)

  2. Arudra was a Brahmin and that qualifies him to say whatever he wants to say against everything and anything and it becomes true? (Fallacy: Guilt By Association)

  3. Arudra is a Brahmin. He supports a claim. All Brahmins support this claim and it becomes true.
  (Fallacy1: Misleading Vividness Fallacy2: Hasty Generalization)

  4. Would Contradicting Aarudra before contradicting Katti make contradicting Katti justified?
  (Fallacy: Special Pleading)

  5. Arudra belongs to X catse. Katti belongs to Y caste. Both Arudra and Katti say xn=1. Therefore, Arudra and Katti are same?
  (Fallacy: False Analogy)  My dear Dreamer, I would love to dream with love. Most dreams are soothing, after all. But when you expect people to argue with you logically, think rationally - the same is expected from you!

  Pose a question. Not a pseudo question. And ye shall be answered.

 27. కాలనేమి said...

  a small correction in the above comment -

  "My dear Dreamer, I would love to dream with you"

 28. కాలనేమి said...

  ..... And I just saw this line in your comment -

  "Enjoy your shit bath."

  Dreamer Dude, Do you wanna play hard ball? Think again.

  Logic, Rationality and Shit talk don't go hand in hand, you see!

 29. ఏక లింగం said...

  @ భాస్కర్ రామరాజు
  :)


  @ యోగి...
  సత్తేపెమాణకంగా జెప్తన్న...పైనజెప్పిన ఒక్కముక్క అర్థం కాలేదు.

 30. కాలనేమి said...

  ఏకలింగం గారు

  హిహి... అర్థం కాకుండా మాట్లాడితేనే మేతావులకర్థమయ్యేది :)

 31. Krishna K said...

  హమ్మయ్య యోగి, ఆ Dreamer కు ఇంకో సమాధానం ఇచ్చే పని తప్పించావు నాకు. LOL
  కేస్ వేస్తే, ఏకలింగం తో పాటు, నిన్ను కూడా ఇరికించేవచ్చు అన్నమాట. :))

  Good to See you guys here.

 32. జీడిపప్పు said...

  Seems everyone is having hell of fun :)

  These comments are worth to be full length posts and discussions..hence closing comments on all episodes of Season 1.

  Have fun!

Post a Comment