హాస్యబ్రహ్మకు నివాళి

Posted by జీడిపప్పు

'నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం' అంటూ నలుగురికీ నవ్వులను పంచిన హాస్యబ్రహ్మ కలం నుండి వెలువడిన సంభాషణల గురించి, దర్శకత్వంలో వచ్చిన ఆణిముత్యాల గురించి, సృష్టించిన పాత్రల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  ఆయన ఉన్నట్టుండి "ఇక నవ్వించలేను.. నవ్వించకుండా ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతున్నా" అంటూ 2001 జూన్ 19 న వెళ్ళిపోయారు. 

జంధ్యాల గారి గురించి శ్రీనివాస్ పప్పు గారు వ్రాసిన "హాస్యబ్రహ్మ (జంధ్యాల) స్మృతిగా ఈ నా చిన్న కానుక

6 comments:

  1. సుజాత వేల్పూరి said...

    తెలుగులో ఒక మోటు సామెత ఉంది. 'అవసరం తీరగానే అల్లుడు......డాష్" అని! అలాగే ఇప్పుడు టాప్ కమెడియన్స్ గా వెలుగొందుతున్న వారిలో కొందరు జంధ్యాల గారు ఇబ్బందుల్లో ఉంటే కనీసం తిరిగి చూడలేదట. ఆయన అంత్యక్రియలకు కూడా డబ్బు చాలని పరిస్థితిలో వీరంతా ఇంట్లో ఉండి లేమని చెప్పించడం, షూటింగ్ కి వేరే వూరెళ్లారని చెప్పించడం వంటి పనులు చేసి తప్పించుకున్నారని అప్పట్లో చదివాను. జంధ్యాల ఆత్మ ఎంతగా క్షోభించి ఉంటుందో!

    మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుని హాయిగా నవ్వుకునే క్లీన్ హాస్యం జంధ్యాల గారిది.

  2. బ్లాగ్ చిచ్చు said...
    This comment has been removed by the author.
  3. Shashank said...

    సుజాత గారు - ఎవరో గురించి నాకు తెలీదండి కాని ఇప్పటికీ జంధ్యల గారి కుటుంబానికి వారి కవలల చదువులు గట్ర చూస్తున్నది ధర్మవరపు గారని ఎక్కడో చదివాను.
    మీరన్నది మాత్రం 100% నిజం. జంధ్యల గారు లేకపోయింటే తెలుగులో ఒక తరం కమేడియన్లు క్లీన్ కామెడి ఉండేది కాదేమో.

    హాస్య బ్రహ్మ మన మధ్యన ఎప్పటికి నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు.

  4. Hima bindu said...

    ఎన్ని సార్లు చూసిన విసుగనిపించని హాస్యం జంధ్యాల గారి సొంతం....ఆయనకు నా నివాళులు.

  5. Bhãskar Rãmarãju said...

    ఓ ఆలోచన- జంధ్యాల పేరిట డొనేషన్స్ సేకరించి వారి పిల్లల చదువులకి ఊతం ఇస్తే ఎలా ఉంటుంది?

  6. మాలా కుమార్ said...

    జంద్యాల గారి కి అభిమానిని నేను.
    ఆయన లేని లోటు సినిమా ల కి తీరేది కాదు.

Post a Comment