జాతి బావమరిదికి అన్యాయం

Posted by జీడిపప్పు

చరకుడిని ఆయుర్వేద పితామహుడు అని పిలుస్తాము. రాత్రింబవళ్ళు కష్టపడి ఎన్నో వ్యాధులకు మందులు కనిపెట్టిన చరకుడు ఆయన భార్య సహకారం లేనిదే అన్నీ సాంధించలేకపోయిఉండవచ్చు. ఆయన తన కుటుంబాన్ని పట్టించుకోకుండా సమయమంతా తన పరిశోధనలకే కేటాయిస్తుంటే ఆయన భార్య పిల్లల, కుటుంబ బాగోగులు చూసుకునేది అనుకుందాము. జీవితాంతం భర్తకు అనుకూలంగా ఉన్నదని ఆమెను "ఆయుర్వేద మాత" అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది?

పెప్సీ కంపెనీ కొన్నేళ్ళ క్రితం ఆశించినమేరకు లాభాలు ఆర్జించకపోవడంతో అప్పటి సీఈవోను మార్చి భారతీయ మహిళ అయిన "ఇంద్ర నూయి" ని సీయీవో చేసారు. తన తెలివితేటలతో ఆమె కంపెనీని ప్రగతిపథంలోకి తీసుకెళ్ళింది,మహామహులను తోసిరాజని "వుమన్ ఆఫ్ ద ఇయర్" అవార్డు అందుకుంది. తన భర్త సహకారం లేకుంటే తాను ఇవన్నీ సాధించగలిగేదాన్ని కాదాని ఈమె చెప్తుంటుంది. ఈమె వ్యాపారపనుల్లో బిజీగా ఉన్నపుడు కష్టపడి పిల్లల్ని, కుటుంబాన్ని చూసుకున్నందుకు ఈమె భర్తకు "మ్యాన్ ఆఫ్ ద ఇయర్" అవార్డు ఇవాల్సిందేనా?

ఇవి ఎపుడు ఎందుకు చెపుతున్నానంటే "భూమిక" అనే ఫెమినిస్ట్ పత్రిక నిర్వహిస్తున్న సత్యవతిగారు తన బ్లాగులో వ్రాసిన వ్యాసం చూసాను. అందులో ఒక వాక్యం ఇలా ఉంది: "జాతి మొత్తానికి పితృసమానుడుగా భావిస్తూ ' జాతిపిత'గా గాంధీజీని గౌరవిస్తామే! మరి, ఆ 'జాతిపిత' సహచరి ' జాతి మాత' కాదా? "

ఇదే వ్యాసం మూడేళ్ళ క్రితం ఆంధ్రజ్యోతిలో వచ్చినపుడు మా గురువుగారు తెలుగోడుగారు అన్నమాటలను చూసి పగలబడి నవ్వాను. కొన్నింటిని చూసి అప్పటికప్పుడు నవ్వి మర్చిపోతాము, కానీ కొన్నిటిని తలుచుకొని మరీ నవ్వుకుంటుంటాము. మా గురువుగారి కామెంటు అలాంటిది మరి. ఆయనేమన్నారంటే - "H1 కు, H4 కు ఉన్న తేడా ఉంది జాతిమాతకు, జాతిపిత భార్యకు ... .... ఓ మిత్రుడు ఈ లెక్కన గాంధీ బావ జాతి మామ, గాంధీ అత్తగారు జాతి అమ్మమ్మా అవుతారా అని సందేహపడ్డాడు". అవును మరి, జాతిపితకు బంధువులయినవారినందరినీ "జాతిమాత" "జాతికూతురు" "జాతి బావమరిది" "జాతి మేనత్త" అని పిలుస్తూపోతుంటే వారికి ఉన్న గౌరవం కూడా పోతుంది.

ఇక సత్యవతిగారు "కస్తూరిబాకు అన్యాయం" అన్నారు.  స్త్రీవాదమంటే ముందూ వెనకా చూడకుండా "ఠాఠ్ మహిళలకు అన్యాయం జరుగుతోంది" అనడమే కాదు, ఆ పొర తీసి నిజ ప్రపంచాన్ని కూడా చూడాలి. అప్పుడే దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా కస్తూరిబా పేరిట నడుస్తున్న కళాశాలలు, కస్తూరిబా పేరిట ఎందరో మహిళలకు ఆశ్రయమిస్తున్న మహిళా సంక్షేమ హాస్టళ్ళు, కస్తూరిబా పేరిట ఇస్తున్న పురస్కారాలు కనిపిస్తాయి, చిన్న గదిలోని వస్తువుల బదులు.

అలా చూడనన్నాళ్ళూ "జాతి బామ్మర్ది"కి అన్యాయం జరుగుతూనే ఉంటుంది సుమా/ఉదయభానూ!!

15 comments:

  1. గీతాచార్య said...

    బాగా సెప్పారు ఝాన్సీ/శిల్పా చక్రవర్తి గారూ. :-D

  2. కామేశ్వరరావు said...

    ఇది నన్ను చాలా కాలంగా తొలుస్తున్న ఆలోచన.
    గొప్పవాళ్ళ భార్యలకు మీరన్నట్టు తగిన టైటిల్సు ఇవ్వడం సబబా హాస్యాస్పదమా అని కాదు నా ప్రశ్న. సమాజానికి ఏదో వెలగబెట్టి గొప్పపేరు తెచ్చుకొనే మగవాళ్ళకి ఆ సదరు సమాజం ఇచ్చే గౌరవం కీర్తి పేరు ప్రఖ్యాతలూ వగైరా వగైరాలు, కుటుంబాన్ని చక్కబెట్టే సదరు భార్యామణులకి కూడా దక్కాలా లేదా? దక్కాలని ఒప్పుకుంటే అది ఏ రూపంలో? ఇది సమాజానికేదో వెలగబెట్టి గౌరవం తెచ్చుకొనే స్త్రీల భర్తలకీ (అతను కుటుంబ సంరక్షణ బాధ్యత తీసుకుని ఉంటే) వర్తిస్తుంది.
    దక్కాల్సిన అవసరం లేదంటే ఒక చిక్కొచ్చి పడుతుంది. అప్పుడెవరికి వాళ్ళు కుటుంబాన్ని గాలికొదిలి సమాజంలో గుర్తింపు పొందే ప్రయత్నంలో పడిపోతారు. "So what? అయితే ఏంటి?" అంటారా, నేను షట్టప్పయిపోతాను.

  3. పానీపూరి123 said...

    lol :-)

  4. Sujata M said...

    CONVINCING.

  5. Bhaskar said...

    I thought that this is something about "Praja Bammardi" :-).

  6. బ్లాగాగ్ని said...

    Soooper!!!

  7. Shashank said...

    నాకు ఫెమినిస్ట్లన్నా కమ్యునిస్ట్లన్నా పరమ చిరాకు. :)

    జాతి బావమరదికి జరిగిన అన్యాయాన్ని నేను ఖండిస్తున్నా. తీవ్రం గా ఖండిస్తున్నా.

  8. విశ్వక్శేనుడు said...

    ఇరగ్గొట్టేసారు అంతే.......

  9. తెలుగోడు said...

    SishyA!!
    I anavasaramaina varasala charchala rachchalO paDi, nuv jIDipappulO kAlESAv. pitAmahuDi bhArya, pitAmahi avutundi.. mAta kAdu!!

    pOtE, akkaDa "BARao" gAru cheppinaTTu,
    jhAnsi lakshmibhAyi moguDevaranTE, entamandiki telusu?
    firoz gAndhi gAru rOjU khachchitangA, paLLutOmukunivunTAru. A Eppulla E musium lO ayinA peTTArA?
    rANi rudramadEvi bharta chinnappuDu ADukunna gUTibiLLa vElam vEstAmanTE, evarainA konTArA?

    anta mAtrAna, mottam magajAtikE avamAnam jarigipOyindani 'idai'pOtAmA ;)

  10. Varunudu said...

    @జీడిపప్పు : ఇరగదీశావ్ !

    @తెలుగోడు
    తెలుగోడు నుండి - ఓ తెలుగోడివయ్యవా? బాగు బాగు !

  11. జీడిపప్పు said...

    @ గీతాచార్య గారు - :)

    @ భైరవభట్ల కామేశ్వర రావు గారు - దక్కాలి. ఏ రూపంలో అంటారా? ఇప్పుడు దక్కుతున్న రూపంలోనే!

    @ పానీపూరి123 గారు - lol

    @ సుజాత గారు - ధన్యవాదాలు

    @ భాస్కర్ గారు - ప్రజా బామర్దినా హ హ్హ హ్హా. చిరంజీవిగారు అంటారు తొందర్లో :)

    @ బ్లాగాగ్ని గారు - ధన్యవాదాలు

    @ షషంక్ - ఫెమినిస్టులున్నారు జాగ్రత్త :)

    @ విశ్వక్శేనుడు గారు - ధన్యవాదాలు

    @ గురువు గారు - కొత్త అవతారం ఎత్తారేంటి? వరసల విషయంలో తప్పు దొర్లింది.. చెమించెయ్యండి. అవునూ.... ఫిరోజ్ గాంధీ వేపపుల్లతో తోముకొనేవారా, బ్రష్హుతో తోముకొనేవారా ;)

    @ వరుణుడు గారు - అంతా మీ అభిమానం. బ్లాగడం మొదలుపెట్టరా ఇప్పుడే??????

  12. తెలుగోడు said...

    EppullatO, brush pullatO, E pullatO ayitEnEmi.... asalu pulla gurinchi paTTinchukunnArA annadE matter.

    @rain mAmA!!! blAgu blAgu

  13. కొండముది సాయికిరణ్ కుమార్ said...

    అసలామాటకొస్తే, జాతిపితగా గాంధీని, రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ ను పేర్కోవటం గట్రా గట్రాలు, ఇతర దేశభక్తులను, తదితర రాజ్యాంగ నిర్మాతలను అవమానించటమే.

  14. Anonymous said...

    జాతి బామ్మర్ది. LOL. కుటుంబ సభ్యుల సహకారం చాలా మంది సక్సెస్ స్టోరీస్ లో కనపడుతుంది. అలా అని వారందరికీ ఇస్తూ పోతె ఇక అంతే సంగతులు. Eamcet rankers, Civils rankers వాళ్ల వాళ్ళకి కూడా ఇవ్వాల్సివస్తుందేమో. "పరమ వీర చక్ర" లాగా "పరమ వీర చక్ర పత్ని/పతి" ఇవ్వాలంటారేమో. హహ్హహ్హా.

    -విజయ్

  15. శ్రుతి said...

    నిజమె సుమా! నాకు ఇంతవరకు తట్టనే లేదు(అసలు నా తట్టే లేదు).
    జాతి బామ్మర్ది గారికి నా సానుభూతి.
    మీ రన్నట్లు స్త్రీ వాదమనే పదానికి స్రదం మార్చేసిన నారీ రత్నాలు కొన్ని ఉన్నాయి. చురక బాగా తగిలింది.

Post a Comment