ఇంక చాలు..వెళ్ళు Brett Favre

Posted by జీడిపప్పు

మిగతావారితో పోలిస్తే నాకు NFL పట్ల ఆసక్తి కలగడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. ఒక సీజన్ పూర్తిగా చూసాక NFL అభిమానినయ్యాను, తర్వాత క్రమక్రమంగా వీరాభిమానినయ్యాను. ఈ క్రమంలో కొందరు ప్రస్తుత, గత ఆటగాళ్ళ గురించి తెలుసుకొని ఆటను మరింత ఆస్వాదించడం మొదలుపెట్టాను. డాన్ మరినో, ట్రాయ్ ఐక్‌మన్ నుండి నేటి పేటన్ మేనింగ్, టాం బ్రేడీ వరకు ఎవరికి వారే సాటి. కానీ వీరందరికంటే గొప్పవాడు బ్రెట్ ఫార్వ్ అనిపించింది, కొన్ని విషయాలు తెలుసుకున్నాక. 15 ఏళ్ళపాటు మయామీ డాల్ఫిన్స్ QB గా ఉన్న డాన్ మరినో, అమెరికాను నివ్వెరపోయేలా చేసిన పిట్స్ బర్గ్ స్టీలర్స్ QB టెర్రీ బ్రాడ్‌షా, క్వార్టర్‌బ్యాక్ లకు ఆదర్శమయిన జో మాంటానా లాంటి అతిరథ మహారథులున్నా బ్రెట్ ఫార్వ్ పట్ల ఎక్కువ గౌరవం కలగడానికి కారణం గ్రీన్‌బే ప్యాకర్స్ కు క్వార్టర్‌బ్యాక్ కావడమే.

మిగతా టీములకంటే గ్రీన్ బే ప్యాకర్స్ కున్న ప్రత్యేకత ఏమిటంటే - ప్రజాస్వామ్యం నిర్వచనం టైపులో ఈ టీం విస్కాన్సిన్ రాష్ట్ర ప్రజలయొక్క, ప్రజలచేత, అఫ్కోర్స్ ప్రజలకొరకు పుట్టిన టీం. మిగిలిన 31 టీములకూ ఒక్కో వ్యక్తి యజమాని అయితే, ప్యాకర్స్ కు ప్రజలే యజమానులు. పెట్టుబడి అంతా ప్రజలనుండే వస్తుంది. అందుకు ప్రతిఫలంగా ప్రజలకు షేర్లు, కొన్ని నిర్ణయాల పైన హక్కులు ఇవ్వబడుతాయి. మిగిలిన టీములన్నిటిపట్లా ఆ పట్టణాల్లోని చూపించే అభిమానం కంటే ప్యాకర్స్ పట్ల విస్కాన్సిన్ వాసుల అభిమానమే ఎక్కువ.

ఇలాంటి టీములో అడుగుపెట్టిన బ్రెట్ ఫార్వ్ కొద్ది కాలానికే ప్యాకర్స్ అంటే ఫార్వ్, ఫార్వ్ అంటే ప్యాకర్స్ అనే స్థాయికి ఎదిగాడు. బయటనుండి ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని అక్కడే స్థిరపడ్డాడు. బ్రెట్ ఫార్వ్ పేరుతో వెలువడిన ఏ వస్తువయినా ప్రజలు ఎగబడి కొనేవాళ్ళు. ఫార్వ్ ఏది చేసినా ప్యాకర్స్ మంచి కొరకే అని నమ్మేవాళ్ళు, ఫార్వ్ కూడా అలాగే చేసాడు. ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి అందరి అంచనాలను మించి ఆడేవాడు,  జీసస్ క్రైస్ట్ ను కలుస్తారా బ్రెట్ ఫార్వ్ ను కలుస్తారా అంటే విస్కాన్సిన్ మొత్తం "జీసస్ క్రైస్టా? who" అనడానికి సంకోచించేవారు కాదు.

అలాంటి బ్రెట్ ఫార్వ్ నాలుగేళ్ళ ముందు, 12 ఏళ్ళు ప్యాకర్స్ తో ఆడిన తర్వాత రిటైర్ ఆలోచన వెలుబుచ్చాడు. మరో రెండు ఏళ్ళు అదే మాట చెపుతూ ఆడాడు. ఆ మధ్యలో బోర్డ్ ఆఫ్ డైరక్టర్లతో అభిప్రాయభేదాలు వచ్చాయి. ఎట్టకేలకు గత ఏడాది మార్చ్ లో రిటైర్ అయ్యాడు. క్రీడాలోకం అంతా ఫార్వ్ గొప్పదనాన్ని వేనోళ్ళ పొగిడింది. అభిమానుల బాధకయితే అంతే లేదు.

కొద్ది రోజులకు ఏమయిందో ఏమో, తాను మళ్ళీ ఆడతానన్నాడు. అప్పటికే ఉన్న విభేదాలవల్ల డైరక్టర్లు ఒప్పుకోలేదు. విస్కాన్సిన్‌లో ఆరాధ్య దైవం ఇమేజ్ ఉన్న ఫార్వ్, ఆ కోపంలో న్యూయార్క్ జెట్స్ తరపున ఒక ఏడాది ఆడి అపఖ్యాతిపాలయ్యాడు. అభిమానులు చాలా అసంతృప్తితో ఉండగా ఆ సీజన్ అయిన వెంటనే మళ్ళీ రిటైర్మెంట్ ప్రకటించాడు. అందరూ జరిగినది పీడకలలా మర్చిపోతుంటే, ప్యాకర్స్ ఆగర్భ శత్రువయిన మిన్నెసోటా వైకింగ్స్ తరపున ఆడడానికి మంతనాలు జరపడం మొదలుపెట్టాడు.

ఒకప్పుడు కేవలం విస్కాన్సిన్‌లో మాత్రమే కాక అమెరికా అంతా అభిమానులను సంపాదించుకున్న ఫార్వ్ చేస్తున్నవి చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికయినా బ్రెట్ ఫార్వ్ తన పద్దతి మార్చుకొని ఫుట్‌బాల్‌కు స్వస్తి చెపితే ఆ మిగిలి ఉన్న అభిమానం అయినా ఉంటుంది. లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు!

10 comments:

  1. Shashank said...

    ప్యాకర్స్ అంటే ముందు గుర్తుకురావాల్సిన వ్యక్తి - విన్స్ లొంబార్డి. ఫార్వ్ ఈ సారి వకింగ్స్ కి ఆడే అవకాసం ఉంది. అయిన నేను 2006 తర్వత ఫార్వ్ ని పట్టీంచుకోడం మానేసా. నువ్వు అదే చేయి.

  2. Anonymous said...

    IMO His name is Brett Favre ... pronounced as brett favor not F_A_R_V_E...

  3. Anil Dasari said...

    >> "మిగతావారితో పోలిస్తే నాకు NFL పట్ల ఆసక్తి కలగడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది"

    నాకు మీకన్నా ఎక్కువ సమయం పట్టింది. ఇంకా పడుతూనే ఉంది :-) ఈ ఆట నాకస్సలు నచ్చదు. చాలా స్లోగా, బోరింగ్‌గా అనిపిస్తుంది. దాన్నసలు ఫుట్‌బాల్ ఎందుకంటారో కూడా అర్ధం కాదు.

  4. Shashank said...

    అబ్రకదబ్ర - వాళ్ళు ఆడే బాల్ పొడవు ఒక ఫుట్టు ఉండడం వలన దాన్ని ఫుట్ బాల్ అంటారు.

  5. Shashank said...

    read that as "foot" not put.

  6. Anil Dasari said...

    @శశాంక్:

    అదే నిర్వచనం ఇంతకు ముందూ విన్నా. అలాగైతే పౌండ్‌బాల్, బ్రౌన్‌బాల్ లాంటి పేర్లతోనూ ఆటల్ని పిల్చుకోవచ్చేమో :-) ఈ మాటే ఒక అమెరికన్‌తో అంటే అతన్నవ్వేసి 'మరి మీ వాళ్ళంతగా పడిచచ్చే ఆ ఇంగ్లీషాటకి పేరెట్టటానికా పురుగే దొరికిందా' అన్నాడు. ఏం చెబ్తాం? Btw, ప్రపంచంలో పురుగు పేరుతో పిలవబడే ఒకే ఒక్కాట అది తెలుసా ;-)

  7. Sravya V said...

    Btw, ప్రపంచంలో పురుగు పేరుతో పిలవబడే ఒకే ఒక్కాట అది తెలుసా >> Cricket :)

  8. Shashank said...

    అబ్రకదబ్ర - మనకీ ఈ ఫుట్ బాల్, బాస్కేత్ బాల్ వద్దు గురు... గ్లోబాల్, పింబాల్ ఇలాంటిది ఏదాఇన వెరైటి ది కనుకుందాం. అది క్లిక్ అయితే లీగులు పెట్టేసి కోట్లు గడిచ్చేద్దాం.

  9. జీడిపప్పు said...

    @ శశాంక్ -yah నేను కూడా ఇక పట్టించుకోదలుచుకోలేదు కానీ, ఎక్కడో మూల కూసింత అభిమానం ఇంకా మిగిలివుంది!

    @ అనానిమస్ గారు - "బ్రెట్ ఫేవర్" నా? హ హ్హ హ్హా భలే జోక్ వేసారు. అమెరికాలో జోక్ ఆఫ్ ద ఇయర్ గా ఎన్నికవుతుంది.

    @ అబ్రకదబ్ర గారు - ఒక్కసారి అలవాటయితే దీనిని మించి ఆసక్తిగా ఉండే ఆట ఇంకొకటి ఉండదు. ఒకానొక స్థాయిలో నేను అడిక్ట్ అయ్యాను, అఫ్‌కోర్స్ నా బ్లడ్ గ్రూప్ P+ కాబట్టి తప్పలేదు :)

    @ శ్రావ్య గారు - :)

  10. మహాపోకిరి said...

    మావోడు మళ్ళీ వొచ్చేశాడు :)

Post a Comment