ఓపన్ లెటర్ టు చిరంజీవి గారు

Posted by జీడిపప్పు

కొన్ని వెబ్‌సైట్లలో "ఓపన్ లెటర్ టు xyz" అని రాస్తుంటారు. ఎందుకో తెలియదు కానీ, ఆ హెడ్డింగ్ చూడగానే నాకు కిసుక్కున నవ్వొస్తుంది. ఆ నటుడు ఈ లెటర్ చదివేస్తాడని, తాము చెప్పినవన్నీ ఆచరిస్తాడని ఫీల్ అవుతారనిపిస్తుంది అది రాసిన వాళ్ళు. అలా ఎప్పుడూ జరగదు. ఎవడో ముక్కూ మొహం తెలియనివాడు రాసిన ఆ లెటర్ చదవడానికి అంత పెద్ద స్టార్ తన పనులు పక్కన పెట్టి ఆ వెబ్‌సైటుకు రాడు. కానీ నేను రాసిన ఈ వ్యాసాన్ని చిరంజీవి గారు తప్పక చదువుతారు, నేను చెప్పినవన్నీ తప్పక ఆచరిస్తాన్న నమ్మకం నాకుంది. అందుకు కారణాలనేకం, అనంతం.

ఏంటి చిరంజీవి గారూ ఇంత పని చేసారు? మీకిది భావ్యమా? ఇలాంటి ఫలితాలనా మీ అభిమానులకు ఇచ్చేది? మనం పార్టీ పెట్టింది ఎందుకు? మన పార్టీ స్లోగన్ "అధికారమే లక్ష్యం, డబ్బే మార్గం" అని పెట్టుకున్నాము. ముందు అధికారం కావాలి, ఆ తర్వాత డబ్బు కావాలి అని ఎలా మర్చిపోయారు? అధికారం ఉంటే డబ్బు వస్తుంది, డబ్బు వస్తే అధికారం రాదు అని చిలక్కు చెప్పినట్టు చెప్పాను, మీరేమో "నాకు చిలకభాష రాదు, నువ్వు చెప్పింది అర్థం కాలేదు" (ఇది మా గురువుగారు తెలుగోడు గారినుండి కాపీ కొట్టాను) అన్నారు.

మనం పార్టీ పెట్టినపుడే అనుకున్నాము కదా -  సుమారు 50 సీట్లు తప్పక వస్తాయి, ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాదు కాబట్టి మనమే కింగ్ మేకర్ అవుతాము అని. మీరు సపోర్ట్ ఇచ్చినందుకు గాను కొన్ని వేల కోట్లు, మినిస్ట్రీలు ఇచ్చేవారు. నాలుగో ఐదో ఏంపీ సీట్లొస్తే కేంద్రంలో కూడా చక్రం తిప్పవచ్చు, అరవింద్ గారిని కేంద్ర మంత్రి చేయవచ్చు అనుకున్నాము కదా?

మీరు కూడా కేసీయార్, లాలూ ప్రసాద్ యాదవ్, రాంవిలాస్ పాశ్వాన్‌ల సరసన చేరి ఇటు రాష్ట్ర, అటు కేంద్రప్రభుత్వాల సుస్థిరతను నాశనం చేయగలిగే మరో రాజకీయనాయకుడు అవుతారు అనుకున్నాము కానీ మీరేమో తొందరపడి సీట్లన్నీ అమ్ముకొని ఎందుకూ పనికిరాని 18 సీట్లు గెల్చుకొని "చేతకాని చవట నాయకుడు" "మెగా జోకర్" "సీట్ల బ్రోకర్" అని పేరు తెచ్చుకున్నారు చిరంజీవి గారూ, పేరు తెచ్చుకున్నారు.

వేరే పార్టీలనుండి వలస వచ్చిన భిక్షగాళ్ళకు, రాత్రికి రాత్రి పార్టీలు మారిన వాళ్ళకు టికెట్లు ఇచ్చారు. మీరేమో "ప్రజలు పిలిస్తే వచ్చాను, నాకేమీ రావాలని లేదు" అన్నారు. ప్రజలేమో ఆ భిక్షగాళ్ళను పట్టించుకొలేదు, మేము పిలవకుండానే పిలిచామని చెప్తావా ఆయ్ అని మన పార్టీ అభ్యర్థులను, మిమ్మల్నొక చోట డొక్కలో తన్ని డిక్కీలో పడుకోబెట్టారు.

ఇన్నేళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్నా ఒక్కరంటే ఒక్క సినీస్టార్ కూడా మీ వెంట రాలేదు. మీవెంట వచ్చిన పిల్ల స్టార్లను "కోతి మనిషిగా ఎదగకపోతే ఎలా ఉంటుందో" చూడడానికి వచ్చారు కానీ వాళ్ళను చూసి ఓట్లేయడానికి కాదు చిరంజీవిగారూ, కాదు. ఆ పిల్లకోతులను మళ్ళీ సినీజూకే పరిమితం చేయండి.

జరిగిందేదో జరిగిపోయింది.  వచ్చే ఎలక్షన్లలో అల్లు అరవింద్ గారిని దూరంగా పెట్టి సీట్ల అమ్మకాన్ని మీరే దగ్గరుండి చూసుకోండి. 100 సీట్ల కంటే ఎక్కువ అమ్మవద్దు లేదా నాన్నవద్దు. అలా అయితేనే మనం అనుకున్న 50-60 సీట్లు గ్యారంటీగా వస్తాయి, మీరు కింగ్ మేకర్ అయి వేలకోట్లకు మన ఎమ్మెల్యేలను అమ్మవచ్చు.

మనకు అందరికంటే ముఖ్యం కార్యకర్తలు. మనం చెప్పినట్లు కాళ్ళ దగ్గర పడి ఉండి నమ్మకంగా పనిచేసేలా వీళ్ళను తయారుచేసుకోవాలి, లేకుంటే మిమ్మల్ని పాలకొల్లులో తరిమి కొట్టినట్టు తరిమికొడతారు. కార్యకర్తలతో ఆప్యాయంగా మాట్లాడినట్టు నటించండి. మీరు వాళ్ళకు లక్షలివ్వనక్కర్లేదు, మీదగ్గరికి వచ్చినపుడు ఆప్యాయంగా "టిఫిన్ తిన్నారా" అని పలకరించి ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారె, మషాలా గారె, ఉప్మా, కిచిడీ, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మషాలా అట్టు, బాత్తు, టమేటా బాత్తు, బోండా, బజ్జీ, మైసూరు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరిటికాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, లడ్డు, బందరు లడ్డు, రవ్వ లడ్డు, మిఠాయి, పీచు మిఠాయి, బందరు మిఠాయి, బొంబాయి మిథాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా,హల్వా, మైసూరు పాకు, అమలాపురం కాజా, భీమవరం బాజా, పెద్దాపురం కూజా .. ఇలా మీ ఇంట్లో ఏవుంటే అవి పెట్టండి. మీరు తెచ్చిపెట్టుకొనే ఎమోషన్‌తో వీళ్ళముందు బాగా నటిస్తే చాలు, పొంగిపోయి నమ్మకంగా కాళ్ళ దగ్గర పడి ఉంటారు. అదే మన ఓటుబ్యాంకుకు శ్రీరామరక్ష.

ప్రచారం మరో ముఖ్యమయిన అంశం. ఏదో మొక్కుబడిగా ఊరికొక సభ కాకుండా వాడవాడలా సభలు నిర్వహించండి. ఉదాహరణకు, బెజవాడలో  ప్రచారం చేయాలంటే... గవర్నరుపేట, లబ్బీ పేట, పున్నమ్మ తోట, భాస్కర్రావు పేట, సింగు నగరం, ప్రజాశక్తి నగరం, అయోధ్యా నగరం, ముత్యాలపాడు, గుణదల, గాంధీ నగరం, చిట్టి నగరం, మాచవరం, రోకళ్ళపాలెం, మారుతీ నగరం, మొగల్రాజపురం, భవానీపురం, సత్యన్నారాయనపురం, సీతారామపురం.. మొదలయిన అన్ని ప్రాంతాల్లో సభలు నిర్వహించాలన్నమాట.

అమెరికాలో సభలు నిర్వహించి "అమెరికా చిరంజీవి", సైబరాబాద్‌లో సభలు నిర్వహించి "'హైటెక్ చిరంజీవి", మురికివాడల్లో సభలు నిర్వహించి "మురికి చిరంజీవి", పెంటపాడులో సభలు నిర్వహించి "పెంట చిరంజీవి".. ఇలా రక రకాల ఫోజులతో ఫోటోలు తీయించుకొని మాకు పంపండి. మేము వెబ్‌సైట్లు పెట్టి మీ గొప్పదనాన్ని చాటుతూ డబ్బులు ఇవ్వమని అడుగుతాము. ఆ ఫోటోలు చూసి ముందు-వెనుక ఆలోచించకుండా గొర్రెల్లా డబ్బు ఇవ్వడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నాము చిరంజీవి గారూ, సిద్ధంగా ఉన్నాము.

కనీసం ఇకనయినా మీరు కళ్ళు తెరిచి, చీమతలకాయంతయినా బుర్ర ఉపయోగించి అన్ని సీట్లు అమ్ముకోకుండా, వచ్చే ఎలక్షన్ల తర్వాతయినా మన పార్టీ ట్యాగ్‌లైన్ అయిన 'అధికారమే లక్ష్యం, డబ్బే మార్గం' సాధిస్తారన్న నమ్మకంతో...

ఓ అభిమాని.

36 comments:

 1. teresa said...

  hahaa... marvelous!

 2. Indian Minerva said...

  :)

 3. kishan said...

  ఇదేమీ బాగాలేదు. అన్నీ ఎక్కడ అమ్ముకొన్నాం?. తుపాకుల మునెమ్మ లాంటి వాళ్లకు ఒకటో అరా ఇచ్చామా లేదా? జగ్గయ్యపేట లాంటి చోట, కాంగ్రెస్ కాండిడేట్ నుండి తీసుకొన్నాం కాని, మా టికెట్ మేము అమ్ముకోలేదు (కాకపోతే మా తరుపున, ఓ గొట్టాం ను నిలబేట్టాం అంతె, 104 అంకె కోసం).
  అయినా మేము అమ్ముకొన్నాం అంటారు కాని, మేము ఎమైనా EBAY లో పెట్టి వేలం పాట వేసామా? మా దగ్గరకు టికెట్లు కోసం వచ్చిన వాళ్లను అడిగామే కానీ, రాజశేఖర్ మీద లాగా దాడులు ఎమైన చేసామా?
  వాళ్లు డబ్బులు ఎక్కువయ్యి ఇచ్చారు అంతే! ఎంతో కొంత నిజాయితీ పరులము కాబట్టి, మా మీద నమ్మకం పడిపోకూడదు కాబట్టి, ఎవరు ఎక్కువ offer చేసారో వాళ్లకే కదా నిజాయితీగా టికెట్లు ఇచ్చాము. మళ్లీ మేము తొండె చేసాము అంటారు అనేకదా వేలం పాటలు అన్నీ ఒక్క వ్యక్తి తోటే నడిపాము, తేడాలు, మాట మార్పులు ఉండకూడదు కాబట్టి.

  ఎంతైన నిజాయితీకి రోజులు లేవబ్బా?

 4. Anonymous said...

  sick!

 5. Anonymous said...

  Yack, these bloggers are supposed to be educated and cultured, I just realized that education and culture have no bearing on each other. This blog and blogger are perfect example. I am sick of these caste maniacs.

 6. Narendra Chennupati said...

  మీరు రాసిన content అందరికి నచ్చుతుందో లేదో కాని..మీ శైలి మాత్రం సూపరో...సూపరు :)

 7. Malakpet Rowdy said...

  LOLOLOLOLLLLLLLLLL ....

  TOOOOOOOOO GOOOOOD !!!!

  ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారె, మషాలా గారె, ఉప్మా, కిచిడీ, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మషాలా అట్టు, బాత్తు, టమేటా బాత్తు, బోండా, బజ్జీ, మైసూరు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరిటికాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, లడ్డు, బందరు లడ్డు, రవ్వ లడ్డు, మిఠాయి, పీచు మిఠాయి, బందరు మిఠాయి, బొంబాయి మిథాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా,హల్వా, మైసూరు పాకు, అమలాపురం కాజా, భీమవరం బాజా, పెద్దాపురం కూజా
  ____________________________________________________________________________

  ఇదేదొ "వివాహ భోజనంబు" లో కోటా శ్రీనివాసరావ్ డయలాగ్ లా ఉందే?

 8. Malakpet Rowdy said...

  Anonymous dude, Relax. You posted your comment on a wrong post by mistake. There has been no reference to any caste in here :))

 9. Malakpet Rowdy said...

  Get busy living or Get busy dying ... if you can do neither then get busy bloggin :))

 10. హరే కృష్ణ said...

  చిరు ఇండస్ట్రీ లో రెస్పెక్ట్ ఉండేది..ఇప్పుడు మొత్తం పోయింది..బాగా చెప్పారు మీరు

 11. మేధ said...

  :)

 12. సిరిసిరిమువ్వ said...

  :))

 13. Kathi Mahesh Kumar said...

  :):):)

 14. సుజాత వేల్పూరి said...

  జీడిపప్పు గారూ,
  ఈ వ్యాసాన్ని చిరంజీవి చదివితే డొక్కలో స్వయంగా తనే తన్నుకుని(ఎలాగో నాకూ తెలీదు) డిక్కీలో పడుకోబెట్టేసుకుంటాడు.పాపం,....ఎంతపని చేశారండీ!

  ప్రింట్స్ తీసి రోడ్ నంబర్ 10, జూబిలీ హిల్స్ లో పడేస్తే సరి! ఒక్కటన్నా చిరంజీవికి చేరకపోతుందా! సూపర్బ్ అనే మాట చాల్దంటే చాల్దు ఇక్కడ మీ టపాని

  మలక్ పేట్ రౌడీ గారు,
  చావలేక బతకలేక ఉండేవాళ్ళు బ్లాగర్లు అనా మీ కవి హృదయం:-)))

 15. Anonymous said...

  @Jeedipappu. funny post. LOL :):):)

  @anonymous. I could not find anything about caste here. Probably you misplaced the comment here thinking this as Katthi's blog.

  @Rowdy. Vivahabhojanambu daaka correct. But actor is Suthhi Veera Bhadra Rao.

 16. కొత్త పాళీ said...

  కొద్దిగా శ్రుతి మించిందేమో?
  ఐనా పర్లేదు, ఎన్నికల్లో వోటర్లు తాగించిన మషాళా కషాయం తరవాత ఇది పెప్సీ అంత మధురంగానూ ఉండొచ్చు.
  అన్నట్టు సామాజిక న్యాయం సంగతి ప్రస్తావించలేదే?

 17. Shashank said...

  manaki prajalu nyayam chEyaledu malla saamajika nyayam okati. i object.

  @budugu - adaraho! inka megafans chetlo nee pani ayinatte. power star kuda vastademo.

 18. Anil Dasari said...

  థమ్సప్.

  మీ గురువుగారు నేనా!! ఐతే, యు వో మి యువర్ థంబ్ శిష్యా :-)

 19. నిషిగంధ said...

  :)))
  బైదవే, సుజాత గారి ఐడియా, ఓపెన్ లెటర్ ఓపెన్ గా అందజేయడం ఏదో బావుందే!

 20. Shashank said...

  @అబ్రకదబ్ర - జీడిపప్పు అంటోంది మిమ్మల్ని కాదు. ఇంకో మహానుభావుని గురించి. బాబాయి నువ్వు ఈ వ్యాఖ్య చూస్తే ఓ పారి పోస్టుకో..

 21. Anil Dasari said...

  @శశాంక్:

  అందుకే నేను రెండు !! లతో అంత గాఠిగా హాశ్చర్యపోయేసింది. ఈ ఉంకో తెలుగోడెవరు!?! ఇంతకీ మీ బాబాయెవరు? జీడిపప్పా, ఉంకో తెలుగోడా??

 22. asha said...

  నిజమే. చిరంజీవి చూడాల్సిన ఉత్తరం.

 23. తూ.గో.జి. కుర్రోడు said...

  @అబ్రకదబ్ర

  తెలుగోడు ఎవరా? చెప్పనా?

 24. జీడిపప్పు said...

  @ తెరెసా గారు - :)

  @ ఇండియన్ మినర్వా గారు - :)

  @ కిషన్ గారు - హ్హ హ్హా భలే చెప్పారు. బ్లాగు ప్రారంభించండి తొందరగా!

  @ "sick" Anonymous గారు - :(

  @ "caste" Anonymous గారు - :) :(

  @ నరేంద్ర గారు - ధన్యవాదాలు

  @ రౌడీ గారు - అది "వివాహ భోజనంబు" లో సుత్తి వీరభద్రరావు గారు చెప్పిన డైలాగు

  @ హరే కృష్ణ గారు - ధన్యవాదాలు

  @ మేధ గారు - :)

  @ సిరిసిరిమువ్వ గారు - :)

  @ మహేష్ గారు - :)

  @ సుజాత గారు - హ హ్హ హ్హా, తనే తన డొక్కలో తన్నుకుంటాడా :) వీలయితే ప్రింట్స్ తీసి పంచుదాం!

  @ anonymous గారు - ధన్యవాదాలు

  @ కొత్తపాళీ గారు - కనీసం ఇప్పుడయినా శృతి మించాలి కదా. సామాజిక న్యాయం సంగతి మర్చిపోయాను!

  @ శశాంక్ అన్న - కరెస్టుగా చెప్పావు, మనం న్యాయం చేయడం ఏంటీ? అన్నట్టు మన పవర్ స్టార్ "రింగు" కామెంటాడు చూడు :)

  @ అబ్రకదబ్ర గారు - మీరు కాదు! మీరు "తెలు-గోడు" మా గురువు గారు "తెలుగోడు". ఆయన "అంకుసం" సంఘాన్ని స్థాపించి మాలాంటి వాళ్ళకు ఆదర్శంగా నిలిచారు.

  @ నిషిగంధ గారు - :)

  @ భవాని గారు - :)

  @ తూగోజీ కుర్రోడు - ఎల్లో ఎల్లో రింగు ఎంట్లున్నావ్? తెలుగోడు ఎవరో చెప్పు నీ స్టైల్లో, ఓ పోస్టు వేద్దాం.

 25. Shashank said...

  చూసావా బుడుగు - పవర్ స్టార్ ని అంటే మనోడు వచ్చేసాడు. ఇంకే ఓ పోస్ట్ వేస్తా పవర్ స్టార్ జాని గురించి. అంత కంటే చెత్త సినిమా ఈ భూమండలం లో రాలేదు అని.

 26. Anonymous said...

  టాగ్ మారిందండి. డబ్బే లక్ష్యం సీట్లే మార్గం.

 27. తూ.గో.జి. కుర్రోడు said...

  ఎల్లో ఎల్లో రౌడీ ఫెల్లో....
  ఏటి బుడుగు మామ మొత్తం గ్యాంగ్ ఇక్కడే వుందనుకుంటా? అక్కడ మొత్తం తాడులు అన్నీ చదివితే గాని తెలీలేదు దీని సంగతి...

  సరే నువ్వు అడిగింది ఏనాడైనా కాదన్నానా? నీ ముచ్చటే కానియ్యి...

 28. తూ.గో.జి. కుర్రోడు said...

  తెలుగోడు ఎవరు?

  వహ్! ఏమి కొస్చెన్? అసల ఈ కొస్చన్ లో ఎంత మాధుర్యం వుంది..అలానే తీపి కూడా వుంది. కొంచెం తీపి, కొంచెం పులుపు, కొంచెం చేదు, కొంచెం కారం, కొంచెం వగరు , కొంచెం ఉప్పు...ఇలా ఎన్నైనా రుచులు చెప్పుకోవచ్చు. అసల ఈ రుచీ వుంది చూడండీ, ఈ రుచీ అనే పదాన్ని వాడుకునీ రుచీ పచ్చళ్ళు తయారుచేసారు ప్రియ పచ్చళ్ళ కు పోటీ గా. ఈ ప్రియ పచ్చళ్ళు ఎవరిది అనుకున్నారు? మన రామోజీ రావు ది. ఈ రామోజీ రావు కి ఒక్క పచ్చళ్ళ బిజినస్సే కాదు ఇంకా ఈనాడు పత్రిక బిజినస్సు, ఆ మధ్యనే గొంతు లోతు మునిగి మళ్ళీ తేలి ప్రస్తుతం వెన్టిలేటరు మీద బ్రతుకు కొనసాఆఆఆ...గిస్తున్న మార్గదర్శి చీటీ పాట బిజినస్సు, ఫిల్మ్ సిటీ బిజినస్సు, కోడలు పిల్ల చూసుకునే డల్ఫిన్ హొటళ్ళ బిజినస్సు, మీ టీవి ఈటీవి బిజినస్సు ఇలా చాలా వున్నాయి. ఈటీవి అంటే ఏమనుకున్నారు? ఈనాడు టెలివిజన్. ఇందులో ’హార్లిక్స్ హృదయాంజలి’ అనీ హార్లిక్స్ వారు స్పాన్సర్ చేసే ప్రోగ్రాం వచ్చేది. అలాగే ’కాల్గేట్ పాడుతా తీయగా’ అనే ఇంకో ప్రోగ్రాం కూడా వచ్చేది. దాన్నీ మన ఎస్.పీ.బీ. కన్డక్ట్ చేసేవాడు. అసల ఎస్.పీ.బీ ఎంత మంది యంగ్ ట్యాలంట్ ని ఎంకరేజ్ చేసాడో ఈ ప్రోగ్రాం లో...మన ఏడుపు గొంతు ఆర్.పీ.పట్నాయక్ ఫేవరెట్ గాయిని ఉష ఈ ప్రోగ్రామ్ నుండే వెలుగు లోకి వచ్చింది. వెలుగు...ఈ వెలుగు వుంది చూసారూ...వెలుగు కోసం సూరీడు ఒక్కడే...సూరీడు అంటే ’అరిస్తే చరుస్తా పెన్సిల్ ఇస్తే చప్పరిస్తా’ మోహన్ బాబు పుత్రరత్నం మంచు విస్స్ను చేసిన సినిమ ’సూర్యం’ కాదు :), ఆకాశం లో వుండే సూరీడు అనమాట. వెలుగు కోసం సూరీడు ఒక్కడే వున్డాల్సిన అవసరం లేదు...ఇంట్లో కర్మ కాలీ కరంటు వుంటే, స్విఛ్ వేస్తే బల్బ్ వెలుగునిస్తుంది. కర్మ కాలకపోయి కరంటు పోతే అగ్గిపుల్ల కాల్చాలి. అది కూడా వెలుగునిస్తుంది. ఆ అగ్గిపుల్ల తో ఓ కొవ్వత్తి ని అంటిస్తే అది కూడా వెలుగునిస్తుంది. కొవ్వత్తి ని హస్టల్స్ లో రాత్రి పూట కరంటు పోయినప్పుడు కొంత మంది చదువుకోడానికి వాడేవారు. మిగిలిన మరికొంత మంది అమ్మాయిల హాస్టల్ పోడానికి వాడుకునేవారు. ఈ హాస్టల్స్ లో వెలుగు చూడని చాలా ఆశలు..చాల గొడవలు , రౌడీయిజంలు వుంటాయి. రౌడీయిజం అంటే మామూలు చేతులతో కొట్టుకోడం కాదు...కత్తులు కటారులతో ఖడ్గాలతో కాట్రాజు మాదిరి కొట్టేసుకోడం లాంటివి అనమాట. ఖడ్గం అంటే గుర్తొచ్చింది, ఖడ్గం సినిమా లో ఎక్కడ చూసినా మూడు రంగులు చూపిస్తాడు మన కిస్స్న వంశి. అసల ఈ మూడు రంగుల జాతీయ జండాని ఎవరు మొదట డిజైన్ చేసారనుకుంటున్నారూ?

  ...మన తెలుగోడు.


  తెలుగోడు ఎవరు?

 29. జీడిపప్పు said...

  కుమ్మేశావ్ రింగూ! దీన్ని ఒక పోస్టుగా వేసాను చూడు!!

 30. Shashank said...
  This comment has been removed by the author.
 31. Bhaskar said...

  Arupulu..Kekalu...

 32. ohmyroots said...

  though i do not want to agree to what you say,I just cannot stop reading and laughing..... keka pettincharu....cine zoo.....edagani kothi abboo.....

 33. Vinay Chakravarthi.Gogineni said...

  ento chaduvukunna tikkalollu.....media baagaledu antaaru but aa media lonide chadivi choosi vere vaallani tidataaru.......

  just ponnur niyojakavargamlo d.narendra 6 crores sped chesaadu...alane congress atanu kooda.....same.....maku relatives iddaru....

  neeku emtelusu jeedipappu babu.......naku nachhaledu...choddam ga andaru hereo anukuntunna j.p gaaru enta panitanam choopistado.........endaro ias lu resign chesi social work chestunnavallu vunnaru j.p emi kottagaadu...........

 34. M.Srinivas Gupta said...

  హన్నన్నా...!
  భలే బాగ చెప్పారు సార్,
  పాము చావకూడదు, కట్టె విరక్కూడదు

 35. Anonymous said...

  chala baga rasaru jeedipappu garu.......

  nenu eppudu e blog anthaga chudanu.....

  jandyala vari hasyam kosam search chestunte me blog dorikindi.....

  hasyam tho patu antha info naku e blog lo dorikindi.........

  thanx a lot andi.........

 36. AMALAPURAM BULLODU, DAS BDS, ABJ said...

  chaala bhagundandi...
  alanti vallaki meelanti valle bhuddi cheppali..
  kulame kullani
  mathame matthani

Post a Comment