సైనికుడి మిత్రుడు

Posted by జీడిపప్పు

ఒక యువకుడు సైన్యంలో చేరాడు. కొద్ది రోజులకు యుద్ధం వస్తే అందులో పాల్గొనడానికి వెళ్ళాడు. యుద్ధంలో పాల్గొంటూ ప్రతివారం తన ఇంటికి తప్పక ఉత్తరం రాసేవాడు. అతడి తల్లిదండ్రులు ఆ ఉత్తరం చూసి అతడు క్షేమంగా ఉన్నాడని సంతోషించేవారు. ఒకసారి మూడు వారాలయినా కొడుకునుండి ఉత్తరం రాలేదు. ఒకరోజు వారికి టెలిగ్రాం వచ్చింది. అందులో " మీ కుమారుడు మూడువారాల క్రితం యుద్దంలో తప్పిపోయాడు, ఎంత వెతికినా కనిపించలేదు. బహుశా అతడు  మరణించి ఉండవచ్చు" అని ఉంది. అది చూసి అతడి తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. ఒక్కగానొక్క కొడుకు దూరంకావడం వారిని క్షోభపెట్టింది.

మూడు వారాల తర్వాత ఫోన్ వచ్చింది. "అమ్మా నేను బ్రతికే ఉన్నాను, నన్ను మన సైనికులు కనుగొన్నారు. తొందర్లో ఇంటికి వస్తాను" అన్న కొడుకు గొంతు విని తల్లిదండ్రులు ఇద్దరూ ఎంతో ఆనందించారు. అంతలో అతడు మళ్ళీ "నా తోటి సైనికుడు తన ప్రాణాలు ఫణంగా పెట్టి నన్ను రక్షించాడు. ఆ సంఘటనలో అతడు బాంబు బారిన పడ్డాడు. మొహం అంతా కాలిపోయింది, ఒక చెయ్యి, ఒక కాలు పోయాయి. అతడికి ఎవరూ లేరు. నాతో పాటు అతడిని కూడా తీసుకువస్తాను. మనతోనే ఉండమన్నాను కానీ మనకు భారమవుతానేమోనని అతడు మొహమాట పడుతున్నాడు" అన్నాడు.

అతడి తల్లిదండ్రులు కొద్దిసేపు ఆలోచించి "అలాంటివాడు కొద్ది రోజులు ఉంటే పరవాలేదు కానీ ఎక్కువ రోజులు ఉంటే అతడికి సేవలు చేయడం కష్టమే, ఇంకోసారి ఆలోచించు అలా కాలు, చెయ్యి లేనివాడితో ఎంత ఇబ్బందో" అన్నారు. "సరే"నని అతడు ఫోన్ పెట్టేసాడు.

మూడు రోజుల తర్వాత వారికొక టెలిగ్రాం వచ్చింది "మీ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నా"డని. ఇంటికి తిరిగి వస్తాడు అనుకున్న కొడుకు ఎందుకలా చేసాడో తెలియక తల్లిదండ్రులిరువురు కుప్పకూలిపోయారు. అతడి శవం వచ్చిన తర్వాత పెట్టె తెరచి చూసారు. అతడి మొహం మొత్తం కాలిపోయి ఉంది. ఒక చెయ్యి, ఒక కాలు లేవు.

9 comments:

  1. swapna@kalalaprapancham said...

    chala bhada ga undi.

  2. చిలమకూరు విజయమోహన్ said...

    బాధాకరంగా ఉంది.

  3. Hima bindu said...

    మనస్సంత కలచివేసిందండి ,మానవ సంబంధాలు ఎంత సున్నితమో ఈ కథ వివరిస్తోంది .రేజేక్షన్ అనేది భరించలేనిది కదా .

  4. మురళి said...

    బాగుంది..

  5. Anonymous said...

    abba naku yemirayalo kudaa teliyatam
    ledu.eedi nijam gaa jarigindaaaaa.......

  6. Padmarpita said...

    మనసుని పిండిన ఫీలింగ్....చదివాక.

  7. పరిమళం said...

    sir!really heart touching !

  8. Anonymous said...

    ఎందుకో నాకు భయమేసింది !

  9. Anonymous said...

    @అతడి తల్లిదండ్రులు కొద్దిసేపు ఆలోచించి "అలాంటివాడు కొద్ది రోజులు ఉంటే పరవాలేదు కానీ ఎక్కువ రోజులు ఉంటే అతడికి సేవలు చేయడం కష్టమే, ఇంకోసారి ఆలోచించు అలా కాలు, చెయ్యి లేనివాడితో ఎంత ఇబ్బందో" అన్నారు.

    I couldn't move from this page. ఈ కథలో పై ఆలోచనలు కల్పితంగా వున్నాయి. నిజం చెప్పాలి అంటే తల్లిదండ్రుల పాత్రలు చాలా కల్పితంగా వున్నాయి. I MEAN కథలో చెప్పిన విధంగా ప్రవర్తించే తల్లిదండ్రులు తమ పిల్లలను యుద్దానికి పంపించారని నా అభిప్రాయం.

Post a Comment