స్లమ్‌డాగ్‌ Vs విజయేంద్ర వర్మ - 1

Posted by జీడిపప్పు

ఎట్టకేలకు స్లమ్‌డాగ్‌ మిలియనీర్ చూసాను. మొదటి సగం చూస్తుంటే తెలుగు నటి లయ (?) నటించిన 'భద్రం కొడుకో' గుర్తొచ్చింది. అందులో రైల్వే స్టేషన్‌లలో చిన్న పిల్లలను బిచ్చగాళ్ళుగా చేస్తారు. స్లమ్‌డాగ్‌లో కూడా అలాంటిదే. స్లమ్‌డాగ్‌ మొదటి సగం "ఉన్నది ఉన్నట్టు" (ఒకట్రెండు సీన్లు మినహా) చూపించారనుకుందాం. పేదల జీవితం గురించి తెలియని ప్రతి ఒక్కరు తప్పక చూడాలి. సెకండ్ హాఫ్ మాత్రం అదిరింది. బాలకృష్ణ నటించిన విజయేంద్రవర్మ గుర్తుకొచ్చింది. ఆ సినిమాలో సీన్లు ఈ సినిమాలోని సీన్లు ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. ఏది గొప్పో నిర్ణయించడానికి మకతిక పడాల్సివచ్చింది.

విజయేంద్రవర్మలో బాలకృష్ణ రన్‌వే పైన నిలబడి దూరం నుండి తన వైపు వస్తున్న విమానం చక్రాల బోల్టులను షూట్ చేస్తాడు. అవి విడిపోయి విమానం దెబ్బతింటుంది. మానవ మాత్రుడెవడయినా అలా కాల్చగలడా, ప్రొఫెషనల్ స్నైపర్స్ కూడా కాల్చలేరు అన్న అనుమానం రావచ్చు మనకు. కానీ అది సాధ్యం. ఫ్లైట్ మన వైపు ఎంత స్పీడుతో వస్తున్నది, మనకు ఫ్లైట్‌కు మధ్య ఎంత దూరం ఉన్నది, ఆ దూరం ఏ రేటులో తగ్గుతున్నది, విమానం చక్రం వ్యాసమెంత, ఆ బోల్టుకు మనకు ఉన్న కోణం ఎంత లాంటివి 5 సెకన్లలోపు లెక్క కట్టగలితే 476 మీట్లర్లో ఉన్న ఎలాంటి గుండుసూదినయినా నిలబడి కూలింగ్ గ్లాసులు పెట్టుకొని కాల్చవచ్చు.

స్లం డాగ్ మిలియనీర్‌లో క్విజ్‌లో "$100 నోటు పైన ఎవరి బొమ్మ ఉంటుంది" అన్న ప్రశ్న వేస్తాడు అనిల్ కపూర్. మీరు అప్పుడెప్పుడో అదేదో డాలరు నోటు పైన చూసిన అబ్రహాం లింకన్ (మనకు గాంధి ఎలాగో అమెరికా వాళ్ళకు లింకన్ అలాగ అనుకొని) పేరు చెబితే తప్పులో వేలేసినట్లే. ఎందుకంటే మన నోట్లన్నిటిపైనా గాంధీజీ ఉన్నట్టు అమెరికన్ కరెన్సీ ఉండదు . ఒక్కో నోటు పైన ఒక్కొక్కరి బొమ్మ ఉంటుంది. ఈ ప్రశ్న అడిగిన వెంటనే హీరోకు ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. బొంబాయికొచ్చిన హీరో ఒక చోట అడుక్కుంటున్న ఒక అంధబాలుడిని తన చిన్ననాటి మిత్రుడిగా గుర్తించి దయ తలచి ఒక నూరు డాలర్లు ఇస్తాడు. (అక్షరాలా అమెరికన్ $100) అది నూరు డాలర్లు అని తెలుసుకొన్న అంధబాలుడు "అయితే దీని పైన ఎవరి బొమ్మ ఉందో చెప్పు" అంటాడు. హీరో తనకు తెలియదు అంటాడు. అపుడు అంధబాలుడు "బెంజిమన్ ఫ్రాంక్‌లిన్" అని చెప్తాడు. తన ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకున్న హీరో, క్విజ్‌లో సరి అయిన ఆన్సర్ చెబుతాడు. (ప్రవాస ఆంధ్రులకు ఒక ప్రశ్న - $5 నోటు పైన ఎవరి బొమ్మ ఉంటుందో చెప్పండి చూద్దాం Image and video hosting by TinyPic )

సినిమా చూసిన తర్వాత తలెత్తిన మరియు తలతిన్న ప్రశ్నలు, వాటి జవాబులు:

ప్ర: అసలు మన హీరోకు $100 ఎలా వచ్చింది?
జ: తాజ్‌మహల్ దగ్గర గైడ్‌గా పని చేసాడుగా అక్కడ ఇచ్చారేమో

ప్ర: ఎక్కడో బొంబాయి స్లం నుండి తాజ్‌మహల్ దగ్గరకు వచ్చి వెంటనే తాజ్‌మహల్ గురించి ఎలా చెప్పగలడు?
జ: బొమ్మ చూసి ఆ మాత్రం చెప్పలేరా? చెత్త పక్కన ఉండేవాడు కదా, ఆ చెత్తలో రోజూ తాజ్‌మహల్ సిగరెట్ ప్యాకెట్ల పైన ఉన్న బొమ్మలు చూసేవాడు. సిగరెట్ ప్యాకెట్లు చెప్పి ఉంటాయి.

ప్ర: సిగరెట్ ప్యాకెట్లకు మాటలు రావుగా??
జ: ఏం రాకూడదా Image and video hosting by TinyPic ? నీకు అనుమానంగా ఉంటే మారు మూల పల్లెలో చార్మినార్ బీడిలు తాగే చదువు రాని వ్యక్తిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి చార్మినార్ ముందు నిలబెట్టు, చార్మినార్ చరిత్ర మొత్తం చెప్పగలడు.

ప్ర: సరే, సిగరెట్ ప్యాకెట్లు చెప్పాయే అనుకున్నాము. మరి హీరో ఇంగ్లీషులో ఎలా చెప్పగలుగుతాడు, ఫారిన్ టూరిస్టులకు?
జ: సిగరెట్ ప్యాకెట్లు ఇంగ్లీషులో చెప్పి ఉంటాయి, పైగా స్లంస్‌లో ఉన్నవాళ్ళకు మనకంటే ఎక్కువ ఇంగ్లీషు వస్తుంది. Image and video hosting by TinyPic

ప్ర: అమెరికన్ టూరిస్ట్ ఇండియాకు వస్తే తమ కరెన్సీని రూపాయల్లో మార్చుకొని ఆ రూపయలు ఇస్తారు కదా, మరి హీరోకు డాలర్లు ఎందుకిచ్చారు?
జ: Image Hosted by ImageShack.us వాళ్ళ దగ్గరున్న రూపాయలన్నీ అయిపోయాయి. హీరో అడిగేసరికి తిరిగి అమెరికా చేరుకున్న తర్వాత ఎయిర్‌పోర్ట్ నుండి ఇంటికి వెళ్ళడానికి ట్యాక్సీ డబ్బుల కోసం ఉంచుకున్న వంద డాలర్లూ ఇచ్చి ఇంటికి నడుచుకెళ్ళారు.

ప్ర: ఆ ఇచ్చేదేదో డాలరో, అంటే 50 రూపాయలో లేదా పది డాలర్లో అంటే 500 రూపాయలో ఇవ్వాలో కానీ 100 డాలర్లు ఇవ్వడమేమిటి?
జ: Image Hosted by ImageShack.us ఎందుకంటే వాళ్ళకు అప్పటికే తెలుసు ఈ కుర్రాడే స్లం డాగ్ మిలియనీర్ సినిమాలో హీరో అవుతాడని, తాము ఇవ్వకపోతే క్విజ్‌లో జవాబు చెప్పలేడని. అందుకే ఇచ్చి ఉంటారేమో. లేదా తాజ్‌మహల్ దగ్గర గైడ్‌లకు $100 ఫీజు ఇవ్వాలని రూలు ఉందేమో.

ప్ర: అసలు ఆ అంధబాలుడికి అమెరికన్ డాలరు గురించి ఎలా తెలుసు?
జ: ఎవరో అమెరికన్ టూరిస్టులు ఇచ్చి ఉంటారు

ప్ర: సరే, మరి అంధబాలుడికి $100 డాలర్ల నోటు గురించి, దాని పైన ఉన్న బొమ్మ గురించి ఎలా తెలుసు?
జ: పది అమెరికన్ డాలర్లకు ఒక్క రూపాయి, పది రూపాయలు ఇవ్వాలనుకొని $100 ఇచ్చారేమో అమెరికన్ టూరిస్టులు

ప్ర: మరి దాని పైన ఉన్న బొమ్మ గురించి ఎలా తెలుసు?
జ:Image Hosted by ImageShack.us Image and video hosting by TinyPic

ప్ర: చెప్పు, పైన ఉన్న బొమ్మ గురించి ఎలా తెలుసు?
జ: చిన్నపుడు WWF కార్డులతో ఆడుకొనేవాళ్ళము, గుర్తుందా, ఆ కార్డు పైన పేరు చెప్పి, Stats చెప్పి? ఇది కూడా అలాగే. బిచ్చగాళ్ళు అయిన బాలలు ప్రపంచ వ్యాప్త కరెన్సీ అంతా కలెక్ట్ చేసి అలా ఆడుకుంటారు. అలాగే ఈ అంధబాలుడికి తెలిసింది నూరు డాలర్ల పైన ఎవరుంటారో. పైగా బెంజిమన్ ఫ్రాంక్‌లిన్ అనేది అందరికీ తెలిసిన పేరే కదా, సులభంగా గుర్తు పెట్టుకున్నాడు.

ప్ర:
Image and video hosting by TinyPic


ఇప్పుడు చెప్పండి ఎక్కడో ఉన్న విమానచక్రం బోల్టును కాల్చిన విజయేంద్ర వర్మ గొప్పవాడా, బొంబాయిలో బిచ్చమెత్తుకొనే కుర్రాడు $100 నోటు పైన ఉన్న బొమ్మ చెబితే ఆ విషయాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత క్విజ్‌లో చెప్పిన హీరో గొప్పవాడా? లేక ఇద్దరూ సరిసమానమేనా?

Thank you CD annaa!!

19 comments:

 1. Anonymous said...

  :)

 2. Anil Dasari said...

  మీరు స్లమ్‌డాగ్ కధని సరిగా ఫాలో ఐనట్లు లేరు. మీరడిగిన ప్రశ్నల్లో అన్నిటికీ సమాధానాలు సినిమాలోనే ఉన్నాయి. వంద డాలర్ల గురించి సరిగ మీరడిగిన ప్రశ్నే సినిమాలో అనిల్ కపూర్ జమాల్‌ని అడుగుతాడు. అప్పుడతని సమాధానం గుర్తు చేసుకోండి.

  ఇక, టూరిస్టులు ఫారిన్ కరెన్సీ ఇవ్వటం మన దేశంలో సర్వ సాధారణం. నేను స్వయంగా గమనించానిది, ఎక్కడో కాదు - తాజ్ మహల్ వద్దనే. టూరిస్టుల సంగతొదిలెయ్యండి, ఎన్నారైనని ఎలా కనిపెట్టారో కానీ - అక్కడ భిక్షగాళ్లు నా వెంటా పడ్డారు - డాలర్లివ్వమంటూ!!

  ఐదు డాలర్ల మీదుండేది మీరు పైన చెప్పిన అబ్రహాం లింకన్. మరో విశేషం: తతిమ్మా అన్ని డాలర్ల నోట్ల మీదా ఉండేదీ అమెరికా అధ్యక్షుల బొమ్మలే కానీ, వంద డాలర్ల మీద ఉండే బెంజమిన్ ఫ్రాంక్లిన్ మాత్రం ఎప్పుడూ అమెరికా అధ్యక్షుడిగా పనిచెయ్యలేదు!

 3. Anonymous said...

  adbhutham mee comparision

 4. Shiva Bandaru said...

  :)

 5. జీడిపప్పు said...

  అబ్రకదబ్ర గారు, నేను కూడా అదే చెప్పాను తాజ్‌మహల్ దగ్గర ఇచ్చి ఉంటారని. $100 ఎందుకు ఇచ్చారో కూడా చెప్పాను చూడండి :)

 6. Unknown said...

  waiting for part 2 :)

 7. లక్ష్మి said...

  ROFL :D

  Too much kadaaa!!!

 8. Naga said...

  ఇద్దరూ సరిసమానమే!

 9. Anonymous said...

  విజయేంద్ర వర్మ --> వీడు రాష్ట్ర దరిద్రం
  స్లమ్‌డాగ్‌ --> వీడు అంతర్జాతీయ దరిద్రం

 10. Anonymous said...

  komcham +ve gaa alochinchandi.
  manchi cinemaa piagaa atta,
  pedda puraskaraniki velluthundi.
  akkada vaallu yem pani pata
  leni vallu kadu mana cinemani
  vurike pogadataniki.
  nominate aindantene stuff unnatlu.

 11. సుజాత వేల్పూరి said...

  జీడిపప్పు గారు,
  అసలు బాలకృష్ణ (కనీసం సినిమాల్లో) చెయ్యలేని పనంటూ ఏదైనా ఉందా?

 12. చైతన్య said...
  This comment has been removed by the author.
 13. చైతన్య said...

  ఎందుకు అందరు ఈ సినిమా ని ఇంతగా విమర్శిస్తున్నారో నాకు అర్థం కావటంలేదు! ఇదే సినిమా ని ఒక ఇండియన్ తీసిఉంటే అప్పుడు కూడా ఇంతలా విమర్శించేవారా? పుస్తకం ఆధారంగా తీసిన సినిమా గురించి చెప్తున్నారే కానీ ఒక్కరు కూడా ఆ పుస్తకం గురించి మాట్లాడరే? అది రాసింది ఒక ఇండియన్ కావటం వలన?
  అయినా సినిమా ని సినిమా లా చూడాలి కాని ప్రతి దానికి కారణాలు వెతికితే మనం ఏ సినిమాని చూడలేమేమో!?
  మన తెలుగు సినిమాల్లో చూపిస్తారు కదా... ఎక్కడో హీరోయిన్ ని విల్లన్ tease చేస్తుంటే హీరో వచ్చి రక్షిస్తాడు... మరి ఆ హీరో కి ఎలా తెలిసింది ఇక్కడ హీరోయిన్ ని tease చేస్తున్న సంగతి? ఇలా ప్రతి దానికి కారణాలు వెతుకుతూ విమర్శించటమే ధ్యేయంగా చుస్తే మనం ఒక్క సినిమా కూడా చూడలేమేమో!?

  పైన ఎవరో anonymous గారు చెప్పినట్టు... అక్కడ నామినీస్ సెలక్షన్ కమిటీ లో కూర్చున్నవారు పనీ పాట లేని వారు కాదు కదా...!!

  ** ఇది కేవలం నా అభిప్రాయం. మిమ్మల్ని విమర్శించటం నా ఉద్దేశం కాదు.

 14. శ్రీనివాస్ పప్పు said...

  ఇంత దరిద్రాన్ని చూపించడానికి అంత ఖర్చు పెట్టి సినిమా తియ్యాలా?
  మనం అంత ఖర్చు పెట్టి ఈ సినిమా చూడాలా?
  మరే ఏ గల్లీ లో చూసినా ఇంత కంటే దరిద్రం ఊరికే కనపడుతుంది కదా?
  ఏ ప్రపంచ దేశాల్లోనూ ఇంత కంటే దరిద్రం లేదంటరా?
  ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే మీరూ ఈ సినిమా టైటిలే?

 15. Unknown said...

  కోడిగుడ్డుకి ఈకలు పీకుతున్నట్టు వుంది!!

 16. నాగప్రసాద్ said...

  మన భారతీయలు ఇదే సినిమాని, ఇదే విధంగా తీసివుంటే ఇంత పెద్ద పేరు వచ్చేది కాదేమో!.

 17. జీడిపప్పు said...

  @సుజాత గారు - బాలక్రిష్ణ చెయ్యలేని పని మెంటల్ సినిమాల్లో నటించకపోవడం :)
  @ +ve Anonymous గారు, @చైతన్య గారు - మొదటి పేరాలోనే చెప్పాను చూడండి. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఆ తర్వాత మాంఛి మసాలా సినిమా అని!
  @ శ్రీనివాస్ పప్పు గారు - చెబితే చెట్టెక్కేస్తారా :)
  @ Naresh M గారు - ఈక"లు" కాదండి. ఇప్పటికే ఒక ఈక మాత్రమే పీకాను!
  @నాగప్రసాద్ గారు - మనవాడు తీసి ఉంటే కనీసం 2-3 ఆస్కార్ నామినేషన్లు కూడా వచ్చి ఉండేవి కాదు.

 18. Shashank said...

  బహుబాగు బహుబాగు. cinematic liberties ని విచ్చలవిడిగా వాడితే సివారాఖరికి ఒచ్చేది బాలయ్య చిత్రాలే అని నిరుపించావు కద. :)

 19. Dheeraj Sayala said...

  Meeru logic laage mundu logical ga alochiste bagundedi.. :)

Post a Comment