జోకులు

Posted by జీడిపప్పు

ఈ నెల విపులలో నాకు నచ్చిన కొన్ని కార్టూన్లు:


1. నువ్వేమో ఎడిటర్‌కి డబ్బులు తక్కువ ఇచ్చావు. దాంతో వాడు వెనకది ముందుకు, ముందుది వెనకకు ఎడిట్ చేసాడు. ఇప్పుడేమో ఇది 'హాలివుడ్ స్క్రీన్‌ప్లే" అని మన సిన్మాని మీడియా ఆకాశానికెత్తేస్తున్నది బావా...

2.(తప్పస్సు చేస్తున్న ముని ముందు మైకు పట్టుకొని TV రిపోర్టరు) - ఎంతకాలం నుంచి తపస్సు చేస్తున్నాడు..? ఏ దేవుడి కోసం తపస్సు చేస్తున్నాడు.. ఈ వివరాలకోసం ఈయన్నే డైరక్టుగా అడిగి తెలుసుకుందాం

3.(T.V. లో ) ఇప్పుడు "బ్రైన్ మీది - ప్రైజ్ మాది" కార్యక్రమంలో ఈ వెంట్రుక ఏ హీరోదో కనిపెట్టి వెంటనే మాకు S.M.S. పంపండి...

4.టీచరు:  "వికటకవి" ఇలాంటిదే మరో పేరు చెప్పరా.
విద్యార్థి:  పోరా పో

5.(హిప్పీ జుట్టు కుర్రాడితో డాక్టరు) రకరకాలయిన టెస్టులు చెయ్యగా, నీ చెవి వినపడకపోవటానికి గల కారణం తెల్సింది. ఇమ్మీడియట్‌గా జుట్టు కత్తిరించుకో.

6.కారు వెనకసీట్లోని ధనవంతుడు పక్కనున్న మిత్రుడితో: హైదరాబాద్ వచ్చినపుడు ఒక్క గోచీతో వచ్చా ఇప్పుడు పదికోట్లు సంపాదించా
కారు డ్రైవరు: అన్ని గోచీలు ఏం చేసుకుంటారు సార్!...

1 comments:

  1. CL said...

    నాకు 4th భలే నచ్చింది. :D

Post a Comment