స్లమ్‌డాగ్‌కు అన్ని అవార్డులెందుకు?

Posted by జీడిపప్పు

ఇప్పటికే బ్లాగుల్లో చాలామంది స్లమ్‌డాగ్‌ సినిమాను విమర్శిస్తున్నారు. మురికి వాడ మురిసిపోయే రోజు చూసిన తర్వాత ఈ పోస్టు వేయాలనిపించింది. ఇప్పటివరకు ఎన్ని భారతీయ సినిమాలు ఆస్కార్ అవార్డుకు ఎంపిక అయ్యాయి? ఎన్ని సినిమాలు గోల్డెన్ గ్లోబ్ సాధించాయి? ఒక మామూలు కథ, అది కూడా మొదటి సగం ఉన్నది ఉన్నట్టు తీసి, రెండవ సగం ఫాంటసీలో చూపెట్టి "రియల్ ఫాంటసీ" (రెండవ భాగం ఫాంటసీ అని ఎందుకంటున్నానో  స్లమ్‌డాగ్‌ Vs విజయేంద్ర వర్మ - 1 మరియు స్లమ్‌డాగ్‌ Vs విజయేంద్ర వర్మ - 2  చూడండి) సినిమాగా రూపు దిద్దుకొన్న ఈ సినిమాకు అంత పేరు రావడానికి కారణమేమి?

ఇంతకంటే ఎన్నో గొప్పసినిమాలు మన దేశంలో వచ్చాయి గత పదేళ్ళలో. ఇంతకంటే గొప్ప మ్యూజిక్ రెహ్‌మాన్ ఎన్నో సార్లు అందించాడు. ఇంతకంటే గొప్ప కథా వస్తువులు ఎన్నో  చూసాము. అయినా ఈ సినిమాకు అన్ని అవార్డులు రావడం ఎందుకంటారు?

మీకు గుర్తుందా, ఒకప్పుడు విశ్వసుందరి,  ప్రపంచసుందరి, భూలోక సుందరి,, అతిలోక సుందరి మొదలయిన కిరీటాలన్నీ భారతీయులకే వచ్చాయి కానీ ఆ తర్వాత రాలేదు. ఆ సుందరుల్లో ఎంతమంది అందుకు సరిపోతారో అందరికీ తెలిసిందే. అయినా ఎందుకు వరించాయి? ఎందుకంటే - కాస్మెటిక్స్ కంపెనీలు తమ ప్రాడక్టులు పెంచుకోవడానికి. ప్రతి వెర్రి పుల్లమ్మా "నేనెందుకు పాతాళ సుందరి కాకూడదు" అనుకొని ఎగబడి కొంది. ఆ పుణ్యమే ఈ రోజు వాడవాడలా బ్యూటీ ప్యార్లర్లు,  మేకప్పులు, ముందు ముందు సైడెఫెక్టులవల్ల ముందుగానే ముసలితనం మరియు చర్మ రోగాలు. మొత్తమ్మీద వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికే ఈ సుందరి అవార్డులు అర్హత లేనివాళ్ళకు కూడా ఇచ్చారు.

ఇక స్లమ్‌డాగ్‌ విషయానికొస్తే - ఈ మధ్యనే అమెరికాకు చెందిన కొన్ని సినీ సంస్థలు మన దేశంలో అడుగు పెట్టాయి. ఇక్కడి సినిమాలను Cash చేసుకోవడానికి ఉన్న సులువయిన మార్గం - "ఇది ఆస్కార్ నామినేటెడ్" అని చెప్పడం. అందుకే స్లమ్‌డాగ్‌ సినిమాకు అన్ని అవార్డులకు అర్హత లేకున్నా, ఆ సినిమా డిస్త్టిబ్యూటరు అయిన అమెరికాకు చెందిన ఫాక్స్ సంస్థ రాజకీయాలవల్లే అన్ని అవార్డులకు నామినేట్ అయింది. లేకుంటే ఏ 2-3 అవార్డులకు మాత్రమే నామినేట్ అయ్యేది.

ఒకవేళ ఇదే సినిమాకు భారతీయ దర్శకుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటరు ఉండి ఉంటే ఇన్ని అవార్డులు, నామినేషన్‌లు వచ్చి ఉండేవా?

12 comments:

 1. Anonymous said...

  అందాల పోటీలు కాస్మెటిక్ కంపెనీలకి లాభాలు కలిగించడానికేనని నాకు ముందు నుంచి తెలుసు కానీ దాని వల్ల తొందరగా ముసలితనం వస్తుందని నేను ఇంతకు ముందు అనుకోలేదు. బ్యూటీపార్లర్ కి వెళ్ళే వాళ్ళ కంటే వెళ్ళని వాళ్ళే ఎక్కువ అందంగా ఉంటారు. నేను మగవాడినైనా నా ముఖం చాలా మంది ఆడవాళ్ళ ముఖాలు కంటే అందంగా ఉంటుంది. నేను ముఖానికి పౌడర్ లాంటివి రాసుకోను. కేవలం శుభ్రత పాటిస్తూ అందం, ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటాను. బ్యూటీపార్లర్ ట్రీట్మెంట్ వికటించి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అందం చెడిపోతే చర్మానికి ప్లాస్టిక్ సర్జెరీ చెయ్యించుకోవాలి. అందాల పోటీల వల్లే ఈ రకంగా డాక్టర్లకి కూడా లాభమే.

 2. చైతన్య said...

  అందాల పోటీల గురించి, దానివల్ల కాస్మెటిక్ కంపెనీలకి కలిగే లాభాల గురించి, కాస్మెటిక్స్ వల్ల ముందుగానే వచ్చే ముసలితనం గురించి నాకు తెలీదు కానీ... ఈ సినిమా ఒక ఇండియన్ తీసిఉంటే మాత్రం అసలు ఏ ఒక్క అవార్డుకు కూడా నామినేట్ అయి ఉండేది కాదని నా అభిప్రాయం!
  స్క్రీన్ ప్లే, కథ, సంగీతం చాలా బాగున్నాయి... కానీ ఇంతకంటే మంచి సంగీతం రెహ్మాన్ చాలాసార్లు మన సినిమాలకి అందించారు... అవి మాత్రం ఎప్పుడు ఇండియా దాటి బయటకి వెళ్ళినట్టు గుర్తులేదు... దీనికి మాత్రం ఏకంగా ఇన్ని నామినేషన్స్!

 3. లక్ష్మి said...

  చక్కటి విశ్లేషణ, రెండు విభిన్న పార్శ్వాలను బాగా స్పృశించారు

 4. Anonymous said...

  You are right.They(west) are entering the Indian cinema field.

 5. చెడుగుడు said...

  మీ విజయేంద్రవర్మ పోలికలు బాగున్నాయి.

 6. నేస్తం said...

  :)

 7. మురళి said...

  చాలా బాగా రాశారు

 8. కన్నగాడు said...

  సారీ, మీరన్నట్టుగా ఫాక్స్ సంస్థ రాజకీయాలు కారణమైతే బెంజిమిన్ బట్టన్ మల్లే నామినేషన్లు వచ్చేవేమో గాని అవార్డులు కాదు. ఒకసారి ఐఎమ్‌డిబి గూడులో ఉన్న అవార్డుల సంఖ్య చూడండి.

  ఇంతకంటే వేయి రెట్లు మంచి సినిమా హిందీ తెలుగు తమిళ మళయాల సినిమా పరిశ్రమలో ఎవరు తీసినా ఆస్కార్ రాదు ఎందుకంటే అవి ఆంగ్ల సినిమా అవార్డులు, మన సినిమాలు నామినేట్ అవడనికి అస్కారం ఉంది ఒకే ఒక విభాగం అది బెస్ట్ ఫారిన్ మూవి.

  స్లమ్ డాగ్ ఒక భారతీయ ఇతివృత్తంతో నిర్మించబడ్డ ఒక ఆంగ్ల చిత్రం కాబట్టి దానికా అర్హత ఉంది, సినిమాలో కూడా అంత పదార్దం ఉంది.

  నోట్: మీరు బెంజిమిన్ బట్టన్ చూసారో లేదో ఆస్కార్ కి పదమూడు విభాగల్లో నామినేట్ అయింది కాని సినిమాలో అంత సర్కు కనిపించలేదు వీలైతే ఒకసారి చూడండి.

 9. కన్నగాడు said...

  ఇందాక మరిచిపోయా నిర్మాతలలో ఒక చేయి ఏ.ఆర్,రెహ్మాన్ ది కూడా ఉంది, చివరగా టైటిల్స్ పడేటప్పుడు చూడండి.
  కాబట్టి ఒక భారతీయడే నిర్మాతేననుకుంటా

 10. Anil Dasari said...

  కన్నగాడి అభిప్రాయమే నాదీ (కన్నగాడు, మిమ్మల్ని చిన్నబుచ్చే ప్రయత్నం కాదు. మీ పేరలా ఉంది మరి)

  అందాల పోటీల వరకూ మీతో నాది ఏకాభిప్రాయమే. మనకన్నా ముందు వెనిజులా సుందరీమణులకి(?) వరసబెట్టి కిరీటాలొచ్చాయి, గుర్తుందా?

  సినిమా అవార్డుల విషయంలో నాది భిన్నాభిప్రాయం. నామినేషన్ల వరకూ లాబీయింగ్‌తో నెట్టుకు రావచ్చు కానీ అవార్డులు ఎక్కువగా సత్తా ఉన్న సినిమాలకే వస్తాయి. గోల్డెన్ గ్లోబ్స్‌లో బెంజమిన్ బటన్ పెద్ద ఉదాహరణ. దానికన్ని ఆస్కార్ నామినేషన్లు రావటం నావరకూ వింతే. స్లమ్‌డాగ్‌కి కూడా కొన్ని విభాగాల్లో (సినిమాటోగ్రఫీ లాంటివి) అర్హత లేకున్నా నామినేషన్లొచ్చాయని నా అభిప్రాయం. ఈ ఏడాది వచ్చిన ఎంట్రీల్లో అంతకన్నా గొప్పవి లేకపోవటం ఓ కారణమయ్యుండొచ్చు.

 11. కన్నగాడు said...

  ఇక్కడ రాయొచ్చో లేదో నాకు తెలీదు, అబ్రకదబ్ర గారు మీరు బ్రాకెట్ లో రాసింది చదివేవరకు నాకు స్పురించలేదు మీ ఏకవచన సంబోధన, అయినా నన్ను అలా పిలిస్తేనే సంతోషం.

 12. Anonymous said...

  ఈ సినిమా నేను చూడను. పదేళ్ళ కిందట "ఫైర్" సినిమా చూసాక మళ్ళీ ఆ బాపతు సినిమాలు చూడకూడదని నిశ్చయించుకున్నాను.

  ఈ సినిమా కంటే యండమూరి, చిరంజీవిల "చాలెంజ్'' సినిమా ఉత్తమమైనదని నా అభిప్రాయం.

Post a Comment