కళ్ళల్లో యాసిడ్ పోయాలి

Posted by జీడిపప్పు

అందరు అమ్మాయిలలాగే అందమయిన ఆ అమ్మాయి కూడా తనకు కాబోయే భర్త ఎలా ఉంటాడో ఊహించుకొని కలలు కన్నది. కానీ ఇప్పుడు ఆమెను ఎవరయినా పెళ్ళి చేసుకోవడానికి ముందు వచ్చినా అతడు ఎలా ఉంటాడో చూడలేదు. అందుకు కారణం: యాసిడ్ దాడిలో ఆమె కళ్ళు పోయాయి.

ఇరాన్‌లో 2002లో 24 ఏళ్ళ ఎలక్ట్రానిక్స్ విద్యార్థిని అయిన బరామీని ఒకడు వేధించడం మొదలుపెట్టాడు. రెండేళ్ళపాటు వేధింపులు సాగిన తర్వాత ఆమె తనను నిరాకరించిందన్న కోపంతో బస్‌స్టాప్‌లో ఉన్న ఆమె పైన వెనుకనుండి దాడి చేసి ఆమె మొహం పైన యాసిడ్ పోసాడు. ఆమె కళ్ళుపోయాయి. మొహాన్ని కప్పుకొనడానికి చేసిన ప్రయత్నంలో ఆమె చేతి వేళ్ళు కాలిపోయాయి.

2005లో నిందితుడు నేరం ఒప్పుకొన్నాడు కానీ అతడిలో పశ్చాత్తాపం లేదు. తాను చేసింది సరి అయినదే అన్నాడు. శిక్షగా ఆ అమ్మాయికి  కొంతడబ్బు వచ్చే అవకాశం ఉన్నా బరామీ అందుకు ఒప్పుకొనక తనకు కళ్ళు లేకుండా చేసినవాడికి కళ్ళు లేకుండా చేయాలని కోరింది. కోర్టు అందుకు అంగీకరించింది. నిందితుడు పెట్టుకున్న పిటీషన్ గతవారం కోర్టు కొట్టి వేసింది. కొద్ది వారాల్లో నిందితుడి కళ్ళలో యాసిడ్ చుక్కలు వేయబడతాయి. (కొందరి స్పందన )

"నేను అతడి కళ్ళు పోగొట్టాలన్నది అతడి పైన పగతో కాదు, ఇలాంటివి మళ్ళీ జరగకూడదని. రేపు మరొక అమ్మాయికి నాలాగే జరిగితే,  నన్ను నేను జీవితాంతం క్షమించుకోలేను" అన్నది బరామీ. ఆమెకు ఇప్పటికి 12 సర్జరీలు జరిగాయి, ఇంకా కొన్ని కావాలి.

యాసిడ్ దాడికి ముందు                                               ప్రస్తుతం













5 comments:

  1. Praveen Mandangi said...

    మన ఇండియాలో కూడా అలాంటి చట్టాలు అమలు చేస్తే బాగుంటుంది కానీ ఎంకౌంటర్లు చెయ్యడం మాత్రం ఆటవికమే.

  2. పరిమళం said...

    సరిఅయిన శిక్ష!

  3. Anonymous said...

    "నేను అతడి కళ్లలో యాసిడ్ పోయాలన్నది అతడి మీద పగతో కాదు. మరొక అమ్మాయికి ఇలా జరక్కూడదని...." ఈ మాటలకు విశ్వసనీయత లేదు. "అలా చేస్తే గానీ నేనెంత బాధ పడ్డానో వాడికి తెలిసి రాదు" అని చెప్తే కొంచెం బాగుంటుంది. అతడు ఆ తర్వాత ఈ పని చేయకపోవచ్చు. కానీ వేరొకడు క్షణికావేశంలోనో, తప్పించుకోగలనన్న ధీమాతోనో, చేస్తాడు. ఇలాంటి శిక్ష తక్షణమే స్వప్నిక కేసులో అమలు జరిగినా ఆ తర్వాత యాసిడ్ కాకపోయినా ఇలాంటి కక్షతో శారీరకంగా వేధించిన సంఘటనలు అనేకం జరిగాయి. ఇటువంటి శిక్షలతో మనుషుల్ని మార్చడం అనేది జరగని పని. కక్షను చంపడం ఎవరి తరమూ కాదు. మనసు దానంతట అది మారితే తప్ప.

    కానీ ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. ఇహ వాడికి ఎటువంటి శిక్ష వేసినా కోల్పోయిన ఆమె జీవితం తిరిగి రాదు.పాశ్చాత్య దేశాల్లో లాగా వాడికి ఒక 200 యేళ్ళు జైలు శిక్ష వేసి జైల్లోనే వాడి జీవితం ఎందుకూ పనికి రాకుండా, నిరుపయోగంగా అంతమయ్యేలా చెయ్యాలి.


    యాసిడ్ దాడి తర్వాతి ఫొటో మీరు ప్రచురించకుండా లింక్ మాత్రం ఇచ్చి మంచి పని చేశారు.

  4. krishna rao jallipalli said...

    వరంగల్ యాసిడ్ దాడి తరువాత ఆంధ్ర జ్యోతి లో ఒక ఆర్టికల్... ఒక అమ్మాయి పదవ తరగతి చదివేడప్పుడు tution నుంచి తిరిగి వస్తుండగా ముగ్గురు నా కొడుకులు యాసిడ్ పోశారు. పోలిసోల్లని, రాజకీయ నాయకులని మేనేజ్ చేసి కేసు నుండి తప్పించు కొన్నారు. ఆ నా కొడుకులు ఇప్పుడు పెళ్ళాలు, పిల్లలతో సుఖంగా సంసారం చేస్తున్నారు. (అటువంటి లుచ్చా లంజా కొడుకులకి పిల్లల్ని ఎవరిచ్చారో, ఎలా ఇచ్చారో అర్థం కాదు). పాపం ఈమె మాత్రం MBA పూర్తీ చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది. ఆమె రూపం చూసి ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వడం లేదు. అందుకనే కఠినమైన శిక్ష (ENCOUNTER 150% CORRECT) పడాల్సిందే.

  5. మనోహర్ చెనికల said...

    ananymous చెప్పినట్టు జీవితంలో బయట ప్రపంచం కనబడకుండా చెయ్యాలి. అదే సరైన శిక్ష

Post a Comment