నిర్మలమ్మకు నివాళి

Posted by జీడిపప్పు

తెలుగు సినిమాల్లో బామ్మ అనే మాటకు పర్యాయపదమయిన నిర్మలమ్మ గారు తన 89 ఏళ్ళ జీవిత ప్రయాణానికి ముగింపు పలికారు. ఎవరేమంటున్నా తన మనవళ్ళకు కొండంత అండగా నిలబడి, ప్రేమను తిట్లరూపంలో పంచి, మనుమలకోసమే బ్రతికే  బామ్మ పాత్రలో జీవించిన ఆమె ఇక లేరు అన్న వార్త బాధాకరం. స్వాతిముత్యంలో అమాయకుడయిన తన మనుమడిని చిన్నపిల్లవాడిలా పెంచడం, చిన్నోడు పెద్దోడులో మనవళ్ళిద్దరినీ నానామాటలు అనడం, ఆలీబాబా అరడజనుదొంగలులో తన బావ కోసం ఎదురు చూడడం.. మరుపురాని పాత్రలు. నిర్మలమ్మ పోషించిన పాత్రలలో తమ బామ్మలను చూసుకొనే వాళ్ళు ఎందరో ఉన్నారు.

ఎల్.వి.ప్రసాద్ నుండి రాజేంద్రప్రసాద్  తర్వాతి వరకు మూడు-నాలుగు తరాలవారితో 1000 పైగా చిత్రాలలో నటించిన ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం.

6 comments:

  1. నేస్తం said...

    నాకెంతో ఇష్టమైన నటిమణి ఆమె,ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాను

  2. Anonymous said...

    చాలా సహజంగా ఉంటుంది ఆమె నటన. మాటలు చెప్పే విధానం కూడా తెచ్చిపెట్టుకున్నట్టుగా కాక, సహజంగా ఉంటుంది. సచ్చినాడా, నీ జిమ్మడ, నీ పాడెగట్ట లాంటి తిట్లు ఆమె తిట్టినంత ఇమ్మర్శగా మరొకరు తిట్టలేరు.

  3. Vinay Chakravarthi.Gogineni said...

    nirmalamma gaaru chanipoyaara........ohhhh
    ame aatmaku shanti kalagaalani.......

  4. పరిమళం said...

    నిర్మలమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాను.

  5. మరువం ఉష said...

    నిజమే, రామారావు గారు పౌరాణిక పాత్రలని రూపమిచ్చినట్లుగా, నిర్మలమ్మ గారు నానమ్మ, అమ్మమ్మ, అమ్మ, మామ్మ పాత్రలకి ఒకేఒక చిరునామా. ఆమె ఆత్మ శాంతికి ప్రార్థిస్తూ..

  6. ఉమాశంకర్ said...

    ఈ విషయం తెలిసినప్పటినుంచి ఏదో బాధ..ఒకటా రెండా ఎన్ని సినిమాలు? పాత సినిమాల్లో దాసి గానో, చెలికత్తె గానో కనపడినప్పుడు ఆమె నిర్మలమ్మ కదూ అనుకొనేవాళ్ళం.. వారి ఆత్మశాంతి కోసం దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను...

Post a Comment