తెలంగాణా ఇవ్వాలి, 2025 లో - Part 2 - మేలుకొలుపు

Posted by జీడిపప్పు

ప్రతి మనిషిలోనూ కొన్ని మంచి లక్షణాలున్నట్టే నాలోనూ కొన్ని మంచి లక్షణాలున్నాయి. అందులో ఒకానొకటి Knowledge Sharing. నా కెరీర్ ప్రారంభంలో ఒక పుణ్యాత్ముడు దగ్గరుండి మరీ నాకు పని నేర్పించి అత్యవసర సమయాల్లో ఆపద్భాంధవుడిలా ఆదుకొని "మనము నేర్చుకున్నది ఇంకొకరికి చెబితే మనకే చాలా మంచింది. ముఖ్యంగా అంత ట్యాలెంట్ లేనివాళ్ళకు వీలయినంత సహాయం చేయ్యాలి" అన్న సత్యాలను తెలియజెప్పాడు. నేను నేర్చుకున్నది ఎంతో కొంత అయినా వీలయినంత వరకు దాన్ని ఇతరులతో పంచుకోవడం ఇప్పటికీ పాటిస్తున్నాను.

ఇక విషయానికొస్తే - ఒకానొక ఉద్యోగంలో నాకంటే సీనియర్ అయిన వాడికంటే నేను కాస్త ముందుండే వాడిని. ఏదో గుడ్డిగా పనిచేయడం తప్ప వీడికి ఎక్కువ ట్యాలెంట్ లేదు. ఎవరినయినా టీం నుండి తీసేయాలి అనుకుంటే అందులో మొదటిపేరు వీడిదే ఉంటుంది. మా మేనేజరు మంచివాడు కాబట్టి, టీంలో అందరూ దేశీలే కాబట్టి ఎలాగో నెట్టుకొచ్చేవాడు. కేవలం టెక్నికల్ హెల్ప్ మాత్రమే కాకుండా చాలాసార్లు 'ఎలా మాట్లాడాలి, ఎలా ఈమెయిల్ వ్రాయాలి ' అని నాకు తెలిసినంతలో సహాయం చేసేవాడిని. కొన్నాళ్ళకు నేను ఇంకో ప్రాజెక్టులోకి వెళ్ళినా అపుడపుడు కలుస్తూ మాట్లాడుకొనేవాళ్ళము.

అప్పటివరకు వీడికి నేనంటే కాస్త అభిమానముతో పాటు గౌరవము కూడా ఉండేవి అనుకుంటా. కానీ ఉన్నట్టుండి ఏమయిందో ఏమో కానీ నాతో పాటు మరో ఇద్దరితో సరిగా మాట్లాడేవాడు కాదు. ఒకరోజు లంచ్ చేస్తూ మాట్లాడుకుంటుంటే "మీ వల్లే మా తెలంగాణా ఇలా అయిపోతోంది" అన్నాడు. తెలంగాణాకు మాకు ఏమి సంబంధమో అర్థం కాలేదు. అదేంటని అడిగితే "మీ సీమాంధ్రవాళ్ళు పెట్టుబడులు పెట్టి హైదరాబాద్ చుట్టూ రియల్ఎస్టేట్ రేట్లు పెంచేసారు. మామూలుగా అయితే 20 లక్షలకు మంచి అపార్ట్మెంట్ వచ్చేది. ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్ కొనాలనుకుంటుంటే 30 లక్షలకు తక్కువలో లేవు. కూకట్‌పల్లి తర్వాత అంతా మీరే కదా, తెలంగాణా వచ్చేస్తే 20 లక్షలకే అపార్ట్మెంట్ వస్తుంది" అన్నాడు. వాడు చెప్పిన మాట నూటికి నూరుపాళ్ళు నిజమే అనిపించి ఏమి చెప్పాలో తెలియక నవ్వి ఊరుకున్నా.

వీడు చెప్పినదానిలో అంతా నిజమే అనిపిస్తుంది. దీనికి చక్కని ఉదాహరణ నేనే. 2002 లో అనుకుంటా - తెలిసిన వాళ్ళు హైదరాబాదులో అపార్ట్మెంట్ కొన్నారు. అది విని నేను కూడా వీలయినంత తొందరగా హైదరాబాదులో అపార్ట్మెంట్ కొనాలి అనుకున్నాను. నాలాగే సీమాంధ్రలోని ఎందరో "హైదరాబాదులో ఒక అపార్ట్మెంట్ కొనాలి" అనుకొనేవారు. ఇహ ఎన్నారైల సంగతయితే చెప్పనక్కర్లేదు!! ప్రతి Pot luck లో, ప్రతి గెట్-టుగెదర్ లో ఈ "రియల్" మాటలే ప్రధాన చర్చలుగా ఉండేవి. తత్ఫలితమే హైదరాబాదు శివార్లలో స్థల, ఇళ్ళ రేట్లు ఆకాశాన్నంటడం మొదలుపెట్టాయి.

సీమాంధ్రులు మరెక్కడా స్థలాలు లేవన్నట్టు హైదరాబాదులో ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు పెట్టి రేట్లను అలా పెంచకుండా ఉండి ఉంటే ఈ రోజు సగటు తెలంగాణా మధ్య తరగతి వ్యక్తికి అన్నీ అందుబాటులో ఉండేవి. కానీ అలా జరగలేదు, పరిస్థితి చేజారిపోయింది. ఇక జరుగవలసినది ఏమయినా ఉందా అంటే - తెలంగాణా రావడం. ఎప్పుడయితే తెలంగాణా వస్తుందో, అప్పుడు సీమాంధ్రులు హైదరాబాదు నుండి తమ దృష్టి మరల్చి తమ ప్రాంతాలకు చెందిన రాజధానుల్లో లేదా ప్రముఖ పట్టణాలలో పెట్టుబడులు పెడతారు, తద్వారా హైదరాబాదులో మళ్ళీ రియల్ ఎస్టేట్ బూం తగ్గి, చౌకగా అపార్ట్మెంట్లు వస్తాయి.

నా మిత్రుడి భావన కూడా సరిగ్గా ఇదే. కాకపోతే వాడు సగటు ఆక్రోశ తెలంగాణా వాసి వలే "మీరు వీళ్ళిపోతే మాకు అన్నీ చీప్" అన్నాడు. వీడన్న మరో మాట - "మీరొచ్చి మా ఉద్యోగాలు లాక్కుంటున్నారు".  ఇది విని ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఇదే మాట హైదరాబాదు రోడ్లపైన తిరిగే నిరుద్యోగి అన్నా పర్లేదు కానీ పొట్ట చేతబట్టుకొని అమెరికాకు వచ్చి ఎన్నొ కష్టాలు పడి ఉద్యోగం సంపాదించి ఎలాగో దాన్ని నిలబెట్టుకొని, అవసరమయితే అమెరికన్ల ఉద్యోగాలు ఊడిపోయేలా జాగ్రత్తపడి, అమెరికాలో బ్రతికే వీడు అనడమే వింతగా తోచింది. వీడేమో అమెరికాకొచ్చి సంపాదించవచ్చు కానీ సీమాంధ్రులు హైదరాబాదులో మాత్రం ఉద్యోగం చెయ్యకూడదు. హన్నన్నా!!

అప్పటివరకు సాటి తెలుగువాడిగా వీడి పట్ల ఉన్న భావాలు కాస్తా తుడిచిపెట్టుకుపోయాయి. నేనేమయినా తెలంగాణా రాకుండా అడ్డుకుంటున్నానా? అసలు నేనేటి నా సత్తా ఏమిటి? బ్రతుకుదెరువుకోసం అమెరికాకు వచ్చిన వాళ్ళను పట్టుకొని "మీ వల్లే" అంటే ఏమన్నా ఉపయోగం, అర్థం ఉందా? వాడి అపార్ట్మెంట్ ఏడుపు వాడికి ఉండొచ్చుగాక, అందుకు మమ్మల్ని నిదించడం ఏంటో, అదీ అమెరికాలో!! అందునా ఒకప్పుడు నా దగ్గ్గర నేర్చుకొని నావల్ల వీడికి నష్టం జరుగుతున్నట్టు మాట్లాడుతుటే ఆ సమయంలో "నీతిలేని #$%^&^"  అనుకున్నా కానీ ఇప్పుడయితే అలాంటి పరుషపదజాలం వాడకుండా సింపుల్ గా "మెగాస్టార్ చిరంజీవిలా దిగజారిపోయావురా" అనేవాడిని.

రాష్ట్రాన్ని విభజించకూడదు అన్న ఆలోచన పక్కనబెట్టి వాడు చెప్పిదాని గురించి ఆలోచిస్తే ఒక కొత్త లాజిక్ కనిపించింది. తెలంగాణా అంత అభివృద్ది చెందడానికి సీమాంధ్రుల పెట్టుబడులు కూడా ప్రధాన ఒకకారణం కదా. ఒకవేళ ప్రత్యేక తెలంగాణా ఏర్పడితే ఆ పెట్టుబడులేవో తమ ఊళ్ళలోనో చుట్టుపక్కలో పెడతారు, అపుడు సీమాంధ్రప్రాంతాలు కూడా ఇంకా అభివృద్ది చెందుతాయి. ఇదొక్కటే కాకుండా వాడు చెప్పినట్టు తెలంగాణా వస్తే ఇప్పుడు 30 లక్షలున్న అపార్ట్మెంట్ 20 లక్షలకే వస్తుందన్నమాట. అంటే హైదరాబాదులో 20 లక్షలకే ఒక ఇల్లు కొనుక్కోవచ్చు!

ఇదే మాట వాడితో అన్నాను "అంటే, తెలంగాణా వచ్చేస్తే అక్కడ రేట్లు తగ్గుతాయి కదా, నువ్వు తొందరగా ఇల్లు కొనుక్కోవచ్చు కదా" అని. అవునన్నాడు. "అలా అయితే నేను కూడా ఒకటి కొంటాను, జై తెలంగాణా" అన్నాను. దిమ్మ తిరగడం వాడివంతయింది! అదేంటి అన్నాడు - "అంతే కదా మరి, తెలంగాణా వస్తే రేట్లు తగ్గుతాయి అన్నావు కదా నువ్వే. ఏదయినా కొనడానికి అదే రైట్ టైం. ఆ టైంలో కొంటే చీప్‌గా వస్తాయని నువ్వే అన్నావుగా.. అప్పుడు నేనేటి, చాలామంది సీమాంధ్రులు కొంటారు" అన్నాను. ఇప్పటికీ వాడితో అంటుంటా "తెలంగాణా వచ్చిన వెంటనే రేట్లు తగ్గుతాయి, అపుడు కొంటే లాంగ్ టర్మ్ లో చాలా ప్రాఫిట్" అని.

ప్రస్తుత పరిణామాలు చూస్తే - తెలంగాణా ఉద్యమం ఊపందుకోవడంతో సీమాంధ్రుల పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. గత రెండేళ్ళలో సీమాంధ్రలోని పట్టణాల్లో చాలా చోట్ల కొత్త లేఅవుట్లు వెలుస్తున్నాయి. ఎప్పటికయినా హైదరాబాదులో ఇల్లు కావాలనుకొనేవారు "ఇప్పుడే హైదరాబాదులో ఎందుకులే, ముందు మనూళ్ళో కొందాము" అంటూ ఇక్కడే పెట్టుబడులు పెడుతున్నారు. ఎవరో రాజకీయనాయకుడు "రాష్ట్రం విడిపోతే మాకు లక్ష కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి" అన్నాడు. లక్ష కోట్లు ఇవ్వడం కంటే లక్షమంది సీమాంధ్రులు తమ ప్రాంతాల్లోనే తమ పెట్టుబడులు పెట్టి అభివృద్దిలో పాలుపంచుకోవడం చాలా ముఖ్యం.

అందుకే ఈ ఉద్యమం ఇలాగే ఇంకో పది పదిహేనేళ్ళు సాగుతూ ఉండాలి. అప్పటికి హైదరాబాదులో పెట్టుబడులు తగ్గుతూ సీమాంధ్రలో పెరుగుతూ ఉంటాయి అని నా అభిప్రాయం మరియు ఆశ. తెలంగాణావాదులు కోరుకుంటున్నదీ ఇదే కదా మరి!!! (సశేషం)6 comments:

 1. Praveen Mandangi said...

  కేవలం ఐటి & రియల్ ఎస్టేట్స్‌లో పెట్టుబడులు పెడితే రాష్ట్రమంతా అభివృద్ధి చెందుతుందనుకోవడం ఫార్స్ కాకపోతే ఏమిటి? ఐటి కంపెనీవాళ్ళు అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న హైదరాబాద్‌లోనే ఆఫీస్‌లు పెడతారు కానీ వరంగల్‌లోనో కాజీపేటలోనో పెట్టమంటే పెట్టరు. ఐదు నక్షత్రాల హొటెల్స్ కట్టేవాళ్ళు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వచ్చే వైజాగ్‌లో ఐదు నక్షత్రాల హొటెల్ కడతారు కానీ భద్రాచలం దగ్గరో, మంత్రాలయం దగ్గరో కట్టరు. ఒకటిరెండు నగరాల అభివృద్ధిని మాత్రమే అభివృద్ధి అని భ్రమపడే స్థితిలో ఉన్నారు సమైక్యవాదులు.

 2. said...

  Hi Praveen What is development in your ideas?

  1. You from Andhra having lot of awareness even if you are staying in very much remote place like srikakulam. You are making your own business and developing. You are not blaming some other person for your life. I feel thats development of Andhra.

  Where as most Telangana people they want Collector Jobs for 10th class. they blame Andhra people for every small big problem. That's under-development mind, social...

  I have faced similar guy referred in the blog in my office in bangalore. He is getting 80k Salary in bangalore from Telangana. And want to KICK andhrites from Hyderabad. And this person is a high ranker in Eamcet studied in guntur, did Btech in CBIT. Living and making bread in bangalore but want to kick all andhrites from their homes hyderabad. Thats the development of T people.

 3. Mauli said...

  సమైక్య ఉద్యమ౦ యొక్క అసలు రూపం కూడా మీరు చెప్పిన కధలోనిదే. ఇప్పుడు 30 లక్షలు వస్తుందన్న ఇ౦టికి తరువాత తక్కువ వస్తు౦ది .మీరు వారిని ఎలా ఒప్పిస్తారు ?

  ఈ మధ్యలో (2025 లోగా ) సీమాంధ్ర కు పెట్టుబడులు వస్తాయనడం కూడా అ౦త నమ్మకం గా లేదు (బ౦గారమ్, పొలాలు మాత్రమె కొ౦టున్నారు ) . కాకు౦టే మీరు చెప్పిన ఇ౦టి ధర హైదరాబాదు లో 20 లక్షలకు చేరుకోవచ్చు , రాష్ట్రం విడిపోయినా అ౦తకన్న తగ్గదు అని హైదరాబాదులో జనాభాకి నమ్మకం వచ్చాక ఇక విభజనకి స౦తోషం గా ఒప్పుకు౦టారేమొ :)
  నేను కూడా ఇవే అభిప్రాయాలను క్లుప్తం గా వ్రాసాన౦డి http://teepi-guruthulu.blogspot.com/2011/07/blog-post_03.html

 4. Praveen Mandangi said...

  Srikakulam is not remote area. It is located near trunk road (national highway) since the time of British and we have English medium school since 1965. అప్పట్లో తెలంగాణాలో నిజాం ఉర్దూ మీడియం పాఠశాలలు నడిపేవాడు. ఉర్దూ నేర్చుకోలేక అప్పట్లో తెలంగాణాలో ఎక్కువ మంది చదువురాకుండా ఉండిపోయారు. ఇప్పుడు మాత్రం విద్యావకాశాలు ఏమి పెరిగినాయి? రెండుమూడు దశాబ్దాల క్రితం రాష్ట్రంలో అక్షరాస్యత కేవలం 45% ఉండేది. అప్పట్లో శ్రీకాకుళం జిల్లాలో 36%, విజయనగరం జిల్లాలో 35% అక్షరాస్యత ఉంటే వరంగల్ జిల్లాలో 34%, కరీంనగర్, మెదక్ జిల్లాలలో 32%, మహబూబ్‌నగర్ జిల్లాలో 30% ఉండేది. గోదావరి జిల్లాలలో మాత్రం అక్షరాస్యత 50% పైనే ఉండేది. నిజాం పోయినా తెలంగాణా ప్రజలకి చదువు అబ్బలేదు. ఆర్థిక పరిస్థితులు అలా ప్రతికూలించాయి.

 5. Sravya V said...

  జీడిపప్పు గారు పోస్టు బావుంది . మీరు చెప్పిన వాదనలో తప్పులు కూడా కనపడటం లేదు :) కాని తెలంగాణా అడిగే వాళ్ళు ఈ ప్రాతిపాదిక న అడగటం లేదే ఒక ప్రాంతము వాళ్ళు మోసం చేసారు , నా నిధులు అన్నీ దొచుకున్నారు అన్న ప్రాతిపాదికన రాష్ట్రం అడుగుతున్నారు (ఇప్పుడు దయచేసి ఎవరు కెసిఆర్ ఒక్కడే ఆ మాట అన్నాడు ఎవరు అనలేదు అని చెప్పటానికి ఏవేవో లింక్లు ఇవ్వండి ప్లీజ్ చదివి చదివి అలిసిపోయా) . అదే నిజమైతే మరి అసెంబ్లీ లో ఎందుకు చర్చ కు భయపడతారు అనేది అర్ధం కాదు .

  ofcourse మీ రాసే ఈ సిరీస్ ఇవి చర్చింటానికి కాదు , ఒక పరిష్కార మార్గం కోసం అనేది అర్ధం అయ్యింది , కాకపోతే ఈ మాటలు విన్న, చూసిన ఉక్రోషం ఆగడం లేదు అంతే :)

  ఒకటి మాత్రం నిజం కొంచెం విషప్రచారం ఆపేసి, న్యాయ అన్యాయ ప్రాతిపదిక కాకుండా , administrative గ్రౌండ్స్ మీదనే , లేదా ఇంకేదో ప్రాతిపదికనో ఐతే రాష్ట్ర విభజనకి ఇంత వ్యతిరేకత ఉండకపోవచ్చు అని నా అనుకోలు . మరీ ముఖ్యం మీము చేసేది మాత్రమే ఉద్యమం వేరే వాళ్ళు చేసేది రాజకీయం ఇలాంటి పిడి వాడళ్ళు మాని కొంచెం సహ్రుద్భావం పెరిగితే కాని ఈ సమస్య కి ఏదో ఒక పరిష్కారం దొరకదు .

 6. said...

  Dear Praveen,

  Do you blame godavari people for your less %age of education and employment? like telangana people?

  Whole telangana is also covered by highways. So anybody stopped them from development?

  anybody stopped you from development?

Post a Comment