స్టుపిడ్ ఒబామా - జీనియస్ ఒబామా

Posted by జీడిపప్పు

ఉన్నఫళంగా నన్ను ఎవరయినా "అమెరికాలో నీకు తెలిసిన అత్యంత మంచి వ్యక్తిని చూపించు" అంటే వెంటనే ఒక పోలీసును చూపిస్తాను. నా దృష్టిలో ఒక సగటు అమెరికన్ కాప్ కంటే మంచివాళ్ళు ఉండరు. వీరు మాట్లాడినంత మర్యాదగా, గౌరవంగా, పద్దతిగా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న మేధావులు కూడా ఉండరేమో. ఎలాంటి ప్రమాదంలో ఉన్నా, ఏ సమస్య ఎదురయినా కాప్ కనిపిస్తే చాలు..భయపడనవసరం లేదు. పౌరులను రక్షించడానికి తమప్రాణాలు అడ్డు వేయడానికి క్షణకాలం కూడ తటపటాయించని సగటు అమెరికన్ పోలీసుల గురించి చాటభారతంలా ఎంతయినా చెప్పవచ్చు.

గతవారం మస్సాచూస్సెట్స్ లో కేంబ్రిడ్జ్ దగ్గర ఒక ఇంటి తలుపులను ఇద్దరు గట్టిగా నెట్టడం చూసిన ఒకావిడ వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. సంగతేమిటంటే, ముఖద్వారంలో ఆ తలుపు సరిగా పనిచేయకపోవడంతో వెనకనుండి ఇంట్లోకి వచ్చి ఇంటి ఓనరు అయిన హెన్రీ గేట్స్ అనే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసరు తన డ్రైవరుతో కలసి దాన్ని నెట్టడం మొదలుపెట్టాడు. ఆమె ఫోన్ చేసిన వెంటనే పోలీసులు వచ్చి ప్రొఫెసరును బయట రమ్మన్నపుడు ఈ తలతిక్క ప్రొఫెసరు "నేను ఎందుకురావాలి, నల్లవాడిని కాబట్టి రావాలా? I'll speak with your mama (mother) outside" అంటూ పోలీసులు అడిగినవి చూపించకుండా గొడవకు దిగాడు. విధిలేని పరిస్థితుల్లో పోలీసులు ప్రొఫెసరును అరెస్టు చేసి నాలుగ్గంటలు జైల్లో పెట్టి విడుదల చేసారు.

బయటకు వచ్చాక వీడు కల్లు తాగిన కోతిలా "ఇది నల్లజాతి వాళ్ళ పట్ల వివక్ష" అంటూ చిందులేసి నానా హంగామా చేసాడు. ఈ సువర్ణావకాశాన్ని మీడియా బాగా ఉపయోగించుకొని వీడితో ఇంటర్వ్యూలు మొదలుపెట్టింది. నల్లజాతీయులకు అవమానం జరుగుతున్నదా అంటూ లేనిపోని విద్వేషాలను రెచ్చకొట్టడం మొదలుపెట్టింది. అరెస్టు చేసిన ఆఫీసరు జేమ్స్ తనకు క్షమాపణ చెప్పాలని వీడు చానెళ్ళలో గొడవ చేయడం మొదలుపెట్టాడు. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఆఫీసర్ జేమ్స్ "తన డ్యూటీ తాను చేసాను ఏ తప్పూ చేయలేదు కాబట్టి క్షమాపణ చెప్పను" అన్నాడు.

ఇక్కడి వరకు మామూలుగా సాగుతున్న ఈ వివాదం ఒబామా ప్రవేశంతో ఇంకా రాజుకుంది. అమెరికా చరిత్రలో అత్యంత కీలక నిర్ణయమయిన హెల్త్ కేర్ గురించి సుమారు 52 నిమిషాలు అద్భుతంగా మాట్లాడిన ఒబామా, చివరి ఒక్క నిమిషంలో ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు మన సీయంలా "చట్టం తనపని తాను చేసుకుపోతుంది" అనడానికి బదులు "ఆ ప్రొఫెసరు నా ఫ్రెండ్ కూడా. నాకు పూర్తి వివరాలు తెలియదు కానీ Cambridge police acted stupidly " అన్నాడు. (ఒబామాను ఆ మాట అనకుండా ఆపడానికి జాన్ స్టీవర్ట్ చేసిన ప్రయత్నం @ 4:30)

ఇహ చూడాలి మీడియా మాయాజాలం! ఒబామా మాటలను మీడియా మాఫియా ఊదరగొట్టిన పుణ్యమా అని సామాన్య ప్రజలు మరుసటిరోజుకు "హెల్త్ కేరా? అంటే ఏంటి?" అనే స్థితికి వచ్చారు. నేను అప్పటివరకు పబ్లిక్ ప్లేసుల్లో ఇద్దరు అమెరికన్లు ఒక సామాజిక విషయం గురించి మాట్లాడుకోవడం వినలేదు కానీ మొదటిసారి ఒక స్టోర్లో ఇద్దరు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఒబామా అలా అనకూడదు అన్నారు. అంతగా ప్రభావం చూపించింది ఒబామా స్టుపిడిటీ. చాలామంది విద్యావంతులయిన నల్లజాతీయులు కూడా ఒబామా తప్పు చేసాడన్నారు.

మరోవైపు దేశవ్యాప్తంగా పోలీసుల్లో అసంతృప్తి వ్యక్తమయింది. ఈ లోపు పోలీసులు అసలు జరిగినదేమిటో వివరించారు. పోలీసు తప్పు చేయలేదు అని గ్రహించిన ఒబామా ఆ పోలీసు ఆఫీసరుకు ఫోన్ చేసి మాట్లాడాడు. చిన్నవిషయం అనుకోకుండా పెద్దదయి వివాదంగా మారడానికి తాను ప్రధాన కారణమయ్యానని అంగీకరించి, ఈ వివాదాన్ని పక్కనపెట్టి దేశ సమస్యల గురించి ఆలోచిద్దాము అని చెప్పి ఎందుకు తనను "జీనియస్" అంటారో నిరూపించుకున్నాడు. ఆ పోలీసు ఆఫీసరును, ప్రొఫెసరును వైట్‌హౌసుకు రమ్మని ఆహ్వానించాడు. ప్రస్తుతానికి వివాదం సమసినట్లే.

పి.ఎస్: చాలమందికిలాగే నాక్కూడా ఈ ప్రొఫెసరు చేసినదానికి వాడిని నాల్రోజులు జైల్లో పెడితే బాగుంటుంది అనిపిస్తున్నది.

18 comments:

  1. మహాపోకిరి said...

    this is exactly what happens when 2 egoists clash. the one with the gun always wins.

  2. srinivas said...

    Completely Agreed.

  3. Sravya V said...

    చాలమందికిలాగే నాక్కూడా ఈ ప్రొఫెసరు చేసినదానికి వాడిని నాల్రోజులు జైల్లో పెడితే బాగుంటుంది అనిపిస్తున్నది. >> నాక్కూడా :)

  4. సుభద్ర said...

    mana jananiki anta vighnata eppudu vastundo...manchi vishayam chepparu.

  5. Indian Minerva said...

    చేసిన వెధవ పనిని "నా వ్యాఖ్యలు వక్రీకరించబడ్డాయి" లాంటి వెధవన్నర స్టేట్మెంట్లతో కవర్ చెయ్యాలనిచూడకపోవడం, ఎలాంటి భేషజాలూ చేకుండా క్షమాపణలడగడం నాకు నచ్చింది. మరా ప్రొఫెసర్ కి తాటతీయు కార్యక్రమం కూడా ఏమైనా పెట్టుకొని వుంటే ఇంకా బాగుండేది.

  6. Arun said...

    I slightly disagree on your first few comments about American cops. They are most corrupted and does lot of cheap tricks. Takes no pride in job always blame for poor salaries....

  7. విశ్వామిత్ర said...

    I heard that scotland yard police stands first place in the world. Next place our great Mumbai Police. I have seen this issue in the news papers. But no one knows the facts unless it is told by some one like you. Good post.

  8. కొత్త పాళీ said...

    హెన్రీ గేట్స్ తన ఫీల్డులో ఎంతో గౌరవాన్ని సంపాదించుకున్న వ్యక్తి. ఆయన్ని పట్టుకుని వీడు వాడు అని రాయడం బావులేదు. మీడియా మాఫియా అని వాళ్ళని దుయ్యబట్టిన మీరు కూడా ఈ టపాలో వాళ్ళు చేసిన దానికంటే ఘోరమైన వక్రీకరణలు చేశారు. హెన్రీ గేట్స్ తాట తీయు కార్యక్రమం, నాల్రోజులు వూచల్లెక్కబెట్టించడం .. ఇత్యాది అమూల్యమైన అభిప్రాయాలు వెలిబుచ్చుతున్న పాఠకులారా .. ఒక్క సారి ఆలోచించండి. ఆయన ఉన్న పరిస్థితిలో మీరే ఉంటే మీరేం చేసేవారు?

  9. సుజాత వేల్పూరి said...

    మీడియా ఎక్కడైనా ఇంతే అన్నమాట! జీవితాల్లోకి చొచ్చుకుపోవడం, సంచలనాలు సృష్టించడం ఈ రెండే మీడియా అంతిమ లక్ష్యం అన్నమాట దేశమేదైనా!

  10. Srujana Ramanujan said...

    కొత్త పాళీ గారు,

    బాగా చెప్పారండీ.

  11. Anonymous said...

    Good post.

  12. మంచు said...

    ఎంత గొప్పవారయినా ఒక్క వెదవ పని చెస్తె చాలు, వున్న గౌరవం పొవడానికి. నాకూ "నాల్రోజులు జైల్లో పెడితే బాగుంటుంది అనిపించింది " .
    కాకపొతె ఒబామా చాలా త్వరగా వివాదం సమసిపొయాలా చెసాడు. నాకు టొటల్ గా చుస్తె ఒబామా లొ స్టుపిడ్ కన్నా "జీనియస్" ఎక్కువ కనిపిస్తాడు .
    అమెరికా పొలీసులు గురించి పైన చెప్పింది చాల కరెక్ట్ .. వాళ్ళలొనూ కొంత మంది వెదవలు వున్నా , ఒవరాల్ గా ఎక్కువ పర్సంట్ మంచొళ్ళు.

  13. Bhãskar Rãmarãju said...

    నే కామెంటుజెయ్య!! :):)
    ఐతే - ఇలియట్ స్పిట్జర్ లాంటోళ్ళనే బొక్కలో పెట్టటంలో పోలీసుల తెగువ - నిజం. వీళ్ళలో లంచగొండులు ఉండవచ్చుగాక, కనీ *నిర్ధాక్ష్యణ్యంగా* అరెస్టుజేసి లోపలేస్తారు. పిలవగానే వస్తారు. చాలా మర్యాదగా మాట్లాడతారు. నిజం.
    మన పోలీసు వ్యవస్థని పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది!!

  14. జీడిపప్పు said...

    @ మహాపోకిరి - nope, not always!

    @ శ్రీనివాస్ గారు - ధన్యవాదాలు

    @ శ్రావ్య గారు - :)

    @ సుభద్ర గారు - కనుచూపుమేరలో కనిపించడం లేదు :)

    @ ఇండియన్ మినర్వా గారు - సరిగ్గా చెప్పారు

    @ అరుణ్ గారు - ఇప్పటివరకు నన్ను, నాకు తెలిసిన వాళ్ళను పోలీసులెపుడూ లంచం అడగలేదు. మీరు ఏ స్టేట్‌లో ఉంటారు?

    @ విశ్వామిత్ర గారు - ధన్యవాదాలు

    @ సుజాత గారు - అమెరికన్ మీడియా ముందు మన TV9 ఎందుకూ పనికిరాదు :)

    @ సృజన రామానుజన్ గారు - ధన్యవాదాలు

    @ హరేఫల గారు - ధన్యవాదాలు

    @ మంచుపల్లకి గారు - totally agreed, ధన్యవాదాలు

    @ భాస్కర్ రామరాజు గారు - totally agreed, ధన్యవాదాలు. అన్నట్టు మీ(?)జెర్సీలో కొన్ని పెద్దతలకాయలను లోపల వేస్తున్నారు కదా :)

  15. జీడిపప్పు said...

    కొత్తపాళీ గారు - "పాఠకులారా .. ఒక్క సారి ఆలోచించండి. ఆయన ఉన్న పరిస్థితిలో మీరే ఉంటే మీరేం చేసేవారు?" అన్నారు. మీరే ఉంటే మీరేం చేసేవారు?
    cop మీ ఇంటి ముందుకు వచ్చి వచ్చి బయటికు రమ్మని పిలిచినపుడు hey, wazzup? i'm so and so... here is my ID, i live here. whats going on? Is there any problem? అంటారా లేక "నేనెందుకు రావాలి? ఇండియన్ కాబట్టి రావాలా? I'll speak with your mama outside అంటారా?

  16. Krishna K said...

    లంచగొండులు నాకు తగిలారు, లేక నేనే అలవాటు చేసానేమో. ఇప్పుడు కాదు, ఓ 10,15 సంవత్సరాల క్రితం, కీవెస్ట్ నుండి మయామి కి మహా స్పీడుగా (అప్పుడు కొంచం వయసులో ఉన్నానేమో, అద్దెకారు క్రొత్తది కావటం, అంతకంటే అలసి పోయి నిద్రవస్తూ ఉండటం వలన) తోలుతూ ఉంటే, పొదలలో దాక్కున్న పోలీసువాడు మాములుగానే లైట్లు వేసుకొని వెనకబడ్డాడు. ఆపిన తరువాత, అలవాటుగా (అప్పుడే దేశం నుండి దిగబడటం వలన, ఇక్కడ లంచం ఇవ్వ జూపినట్లు వాళ్లు కేసు వేస్తే ఏమవుతుందో తెలియని తనం కూడానేమో) ఓ $50 తీసి, I will be very happy if you accept this money and let me go without ticket అన్నా, ఇంకా సరిగా వంటబట్టని అమేరికా accent లో, ఏమనుకొన్నడొ ఎమో, చక్కగా తీసుకొని జేబులో వేసుకొని, bro, don't do this with other cops, especially white cops అని చెప్పి మరీ నవ్వుకొంటూ వెళ్లిపోయాడు.
    ఇప్పుడు తలచుకొంటె, అది చేసింది నేనేనా అనిపిస్తుంది!!
    ఏమయినా, మన పోలీసులతో పోలిస్తే, ఇక్కడ వాళ్లు మాత్రం నిజాయితీ పరులే అనిపిస్తుంది, కాకపోతే వాళ్లలో racistలు ఎక్కువేమో అనిపిస్తుంది నా వరకు, అది బహుశా south లో, అందునా Texas లో ఓ పల్లెటూర్లో ఉండటం వల్ల కావచ్చు.

  17. Bhãskar Rãmarãju said...

    మనది జెర్సి కాదు అన్నాయ్!! అప్స్టేట్ న్యూయార్క్.

    అవును, మా పెద్దోడు మొన్నటిదాకా గడగడ లాడించాడు. పెద్దోడు = స్పిట్జర్. ఇప్పుడు మా కరెంటు పెద్దోడు రాబోయే ఎన్నికలకి గవర్నరుగా పోటీ సేయబోతున్నాడు. ఇప్పటి పెద్దోడు = యాన్డ్రూ కూమో (ప్రస్తుత ఎటార్నీ జెనరల్)

  18. నేస్తం said...

    పోస్ట్ వల్లే కాదు కామెంట్స్ వల్ల కూడా చాలా విషయాలు తెలుస్తున్నాయి :)

Post a Comment