అవీ..ఇవీ..అన్నీ

Posted by జీడిపప్పు

13-18 మధ్య వయసులో ఉన్నవారి లోకమే వేరు. అప్పుడప్పుడే "కొత్త కొత్త" విషయాలు తెలుస్తుంటాయి. "ఏవేవో" చేయాలనే ఉత్సాహం, అందరిలో తాను ప్రత్యేకంగా కనిపించాలన్న ఆత్రుత, ఆరాటంలో తప్పులు చేస్తుంటారు. అందుకే టీనేజ్ పిల్లలు చేసే తప్పులలో చాలామటుకు నిజమయిన "నేరాలు"గా పరిగణించలేము. అమెరికాలో 18 ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉన్న వారితో సెక్స్ చేస్తే జీవితం ముగిసినట్లే. ఎందరో ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు 18 ఏళ్ళ లోపు అమ్మాయిల నగ్న ఫోటోలు చూడడం వల్ల నాశనం అయ్యారు. ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే, సగటు అమెరికన్ అమ్మాయి 15 ఏళ్ళకే సెక్స్ మొదలు పెడుతుంది. హై స్కూల్ పూర్తి అయ్యే లోపు సెక్స్ చెయ్యని అమ్మాయి దాదాపు ఉండదు. చాలామంది పేరెంట్స్ Be Safe అని చెప్తారు తెలిసినా.

ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, మొన్న ఒక కుర్రాడికి 25 ఏళ్ళ శిక్ష పడింది ,అతడు చేసిన "ఘోర" తప్పిదానికి. ఒక టీనేజ్ అమ్మాయి తన నగ్న చిత్రాలను తీసి సెల్‌ఫోన్లో తన బోయ్ ఫ్రెండ్ కు పంపింది. టీనేజ్ అమ్మాయిల్లో చాలామంది తమంతట తామే ఇలాంటి పనులు చేస్తుంటారు తన బోయ్ ఫ్రెండ్ తనను మెచ్చుకోవాలని. కొద్ది రోజులకు ఆ అమ్మాయి ఇతడితో విడిపోయింది. ఆ కోపంలో ఆ కుర్రాడు ఆ అమ్మాయి పంపిన ఫోటోలు అందరికీ పంపించాడు.

అంతే, ఆ కుర్రాడిని "చైల్డ్ పోర్నోగ్రఫీ" చట్టం కింద అరెస్టు చేసారు. 43 ఏళ్ళ వయసు వచ్చాక ఆ 18 ఏళ్ళ కుర్రాడు బయట వస్తాడు! ఇది చాలా దారుణం అనిపిస్తున్నది. ఆ కుర్రాడు చేసింది తప్పే కానీ దానికి విధించిన శిక్ష మాత్రం సరి అయినది కాదు. ఈ వార్త చదివిన ఎంతో మంది తల్లిదండ్రులు దీనిని ఖండిస్తున్నారు. అందరికీ తెలుసు - అనుక్షణం రెచ్చగొట్టే వాతావరణం లో ఉన్న పిల్లలు ఇలాంటివి చేస్తుంటారని. అంత మాత్రానికి ఆ కుర్రాడి జీవితం నాశనం చెయ్యడం భావ్యం కాదు. ఒక వేళ తప్పు చేసిన వారినందరినీ శిక్షించాలంటే, ఆ అమ్మాయిని కూడా జైల్లో పెట్టాలి.. అమెరికాలోని సగం మందికి పైగా టీనేజర్లను జైళ్ళలో పెట్టాలి!
*****
ధనాధన్ ధోని పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఏ రకమయిన ఫార్మాట్ అయినా సరే విజయవిహారం చేస్తున్నాడు. దాదాపు 40 ఏళ్ళ తర్వాత న్యూజిలాండ్‌లో సిరీస్ గెలుచుకోవడం అభినందనీయం. ఇక మూడవ టెస్టులో ముందుగానే డిక్లేర్ చెయ్యకపోవడం చూస్తే కెప్టెన్ గా ధోని సమర్థత తెలుస్తోంది. అంతకు ముందు మ్యాచులో 600 కొట్టిన వాళ్ళకు మరో రెండు రోజులు అవకాశం ఇస్తే లక్ష్యాన్ని ఛేదించించినా ఛేదించవచ్చు. ఇక్కడ మ్యాచ్ గెలవడం ముఖ్యం కాదు, సిరీస్ గెలవడం ముఖ్యం. అందుకే నాలుగో రోజు కూడా కాసేపు బ్యాటింగ్ చేసి సిరీస్ కైవసం చేసుకున్నారు. స్టీవ్ వా తర్వాత కెప్టెన్ అంటే ధోని అనిపించుకుంటాడేమో భవిష్యత్తులో!
*****
అల్లు అరవింద్ వైఖరి నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పటికే పార్టీ కోసం ఎంతో కష్టపడ్డవారు, అభిమానులు పార్టీకి గుడ్ బై చెప్పేశారు.  సుమారు ఆరేడు వందల కోట్లకు టికెట్లు అమ్మాడు అరవింద్. రాజయకీయాల్లోకి వచ్చీ రాగానే అంత కక్కుర్తి ఎందుకో? పొరపాటున ఎందుకూ కొరగాని సీట్లు వస్తే చక్రం తిప్పలేడు . అలా కాకుండా ఒక 70-80 సీట్లను అమ్ముకొని 200-300 కోట్లు సంపాదించుకోవాల్సింది. పైగా వాళ్ళు అడిగిన సీట్లను పడేస్తే నమ్మకంగా కాళ్ళ దగ్గర పడి ఉంటారు కదా?

ఎలక్షన్లలో అభ్యర్థులు గెలిచినా అరవింద్ చేతిలో కీలుబొమ్మలుగా ఉంటారు కాబట్టి నెలవారీ మామూళ్ళ కింద నెల నెలా కొన్ని కోట్లు వస్తాయి. మరో వైపు అభిమానులలో కూడా అసంతృప్తి ఉండదు. ఈ విధంగా చేయడం వల్ల రాబోవు ఐదేళ్ళలో సులభంగా ఐదారు వందల కోట్లు సంపాదించవచ్చు. అంతేకాక ఐదేళ్ళ తర్వాత సీట్లను ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చు. మొత్తమ్మీద చెప్పొచ్చేదేమిటంటే, చెడ్డవాడిగా ముద్ర వేయించుకొని ఇప్పటికిప్పుడు కొన్ని వందల కోట్లు సంపాదించుకోవడం కంటే, మంచివాడిగా పేరు తెచ్చుకొని నెమ్మదిగా వేల కోట్లు సంపాదించవచ్చు. ఇప్పటికయినా అల్లు అరవింద్ కళ్ళు తెరవాలి.

అన్నట్టు, చిరంజీవి గారి అభిమానులకు ఒక సువర్ణావకాశం.పీఆర్పీ ఎన్నారై విభాగం "మార్పు కోసం" ప్రజారాజ్యం పార్టీకి  విరాళాలు ఇవ్వమని కోరింది. వరద/భూకంప బాధితులకు విదిల్చినట్లు పాతికో,పరకో,చాటో కాకుండా చిరంజీవి గారి అభిమానులు కనీసం ఒక నెల జీతం అయినా డొనేట్ చేసి మెగా ఫ్యాన్స్ పవర్ ఏంటో చూపించి జ్యోతీరావు ఫూలే అనుచరులు అనిపించుకోవాలి. ఈ అవకాశాన్ని జారవిడుచుకోకండి.

3 comments:

 1. చైతన్య said...

  మీరు చెప్పిన కేసు సంగతి ఏమో కాని... మన ఇండియా లో కుడా 'అలాంటి ఘోరాల'కు స్ట్రిక్ట్ గా కఠినమైన శిక్షలు అమలు చేసే రోజు రావాలని కోరుకుంటున్నాను (మీరు చెప్పిన మొబైల్ ఫోన్ కేసు లాంటివి కాదు... చిన్న పిల్లలని సెక్సువల్ harassment కి గురి చేసేవాళ్ళ గురించి) .

  అల్లు అరవింద్ పద్దతి ఎవరికీ నచ్చటం లేదు... డబ్బే లక్ష్యంగా సాగిపోతుంది పార్టీ తీరు!

 2. చైతన్య.ఎస్ said...

  >>ధనాధన్ ధోని పట్టిందల్లా బంగారమే అవుతోంది.
  నిజమే 100% నిజం

 3. Shashank said...

  best news of the decade - http://timesofindia.indiatimes.com/articleshow/4389164.cms

  jai mulayam.

Post a Comment