తెలుగు బ్లాగుల పరిస్థితి - బాబోయ్ కూడలి.. వామ్మో మాలిక

Posted by జీడిపప్పు

ప్రతిమనిషికీ ఏదో ఒక బలహీనత ఉన్నట్టే వీలు దొరికినపుడల్లా తెలుగు బ్లాగుల సమాహారాలయిన కూడలి/మాలిక చూడడం నా బలహీనత అనుకుంటాను.  ఒకప్పుడు కూడలికి వస్తే ఎటు చూసినా ఆసక్తికరమయిన టపాలే స్వాగతం పలికేవి. అక్కడక్కడా పంటికింద రాయిలా కనిపించే కొన్ని 'వార్తల బ్లాగులను ' పెద్దగా పట్టించుకొనేవారు కాదు. కానీ ఇప్పుడు కూడలికి లేదా మాలికకు వస్తే 'తెలుగు బ్లాగులంటే ఇవా?' అని ముక్కు తీసి వేలు పైన వేసుకోవలసి వస్తోంది.  బ్లాగుల జాబితాలో సుమారు 70-80 శాతం కేవలం 'వార్తలు ' ఉండడం చూసి 'ఇదేమి ఖర్మ, బ్లాగులంటే ఇవేనా ' అనుకొని ఆ వార్తల మధ్య ఉన్న చదవగలిగే బ్లాగులను వెతుక్కోవాలంటే తలప్రాణం తోకకు వస్తోంది.  పోనీ నచ్చిన బ్లాగును add చేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటే, ముందుగా ఓ చక్కని బ్లాగు కనపడాలి కదా??!!!

ఇంకా వివరంగా చెప్పాలంటే, సమాహారాల్లో ఉన్న బ్లాగుల్లో అధికభాగం 'అసెంబ్లీలో తూలిపడ్డ మంత్రి ', 'ఈ సినిమా ఆడియో రేపు విడుదల ',  'అదేదో దేశంలో రోడ్డు ప్రమాదం ',  'నెల్లూరులో ఫలానా రోడ్డు మరమ్మత్తులకు పది లక్షలు మంజూరు ', ' జాతీయ అంతర్జాతీయ చెత్త ',  'వాయిదాపడ్డ పరీక్షలు '.  'రామానాయుడు స్టూడియోలో ఈ సిన్మా షూటింగ్ ',  'శ్రీశైలంలో తగ్గిన విద్యుత్ ఉత్పత్తి '...ఇలాంటివాటికి తోడు న్యూస్ పేపర్లలో వచ్చే చెత్తాచెదారాన్ని కూడా 'బ్లాగు పోస్టు ' గా పోస్టు చేసి ఎంతో విలువయిన సమాహారాల space ను తినేస్తుంటే చూడడం కష్టంగానూ కాస్తంత బాధగానూ ఉంది.

అవి ఉంటే ఏంటి నీ బాధ అంటారా? కొన్నేళ్ళ క్రితం 'మా వూరు రోడ్డుకు గుంత పడింది ' ' ఓ హీరోకు జలుబు చేసింది ' అంటూ ఒక్కో బ్లాగులో రోజుకు ఐదారు పోస్టులు వేస్తుంటే అది చూసి తట్టుకోలేక ఓ పోస్టు వేశాను. సదరు మహానుభావులు కాస్త దయతలచారు.  తమ ఊర్లో పడ్డ గుంత గురించి, అసెంబ్లీలో మంత్రి తూలిపడ్డం గురించి వ్రాస్తే అవి బ్లాగుల కిందికి రావా అని ప్రశ్నిస్తే,  బ్లాగు అంటే 'అభిప్రాయాలకు వేదిక. తన అభిప్రాయాలను తెలపడానికి ఒక సాధనం ' అని నమ్మినవాడిగా అలాంటి 'వార్తలు ' బ్లాగులు కాదు అని చెప్తాను.

కూడలి/మాలిక వంటి సమాహారాలను ఈ ''వార్తా బ్లాగులు" నింపివేయడం 'అభిప్రాయాలు తెలిపే, ఆసక్తికరమయిన బ్లాగుల ' మనుగడకే ముప్పు అనిపిస్తుంది. దీనికి ఒక ఉదాహరణ: ప్రస్తుతం కూడలిలో అప్పుడుపుడు కాసేపు కనిపిస్తున్న యరమణగారి (డాక్టరుగారి) బ్లాగును మొదటిసారి నేను చూసినప్పటికే చాలాపోస్టులున్నాయి.  ఆణిముత్యాల్లాంటి పోస్టులు చదువుతుంటే "ఇంతకాలం ఈ బ్లాగు ఎలా మిసయ్యానబ్బా... కూడలి, మాలికలు తరచూ చూస్తుంటానే" అనుకుని చించగా చించగా అర్థమయిందేమిటంటే - ఒక మంచి బ్లాగు కూడలిలో ఎంతసేపు ఉంటుంది అన్నది ఈ 'వార్తా బ్లాగుల ' దయపైన ఆధారపడి ఉంటుంది.  ఇవి తలుచుకుంటే ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూసే క్రిష్ణ ప్రియ గారి కబుర్లు కొద్ది గంటల్లో కూడలి/మాలిక నుండి అదృశ్యమయిపోతాయి. మనసులోమాట సుజాత గారు వ్రాసే చక్కని పుస్తకాల రివ్యూలు కొందమంది పుస్తకప్రియులకే కనిపిస్తాయి.  చదువరిగారి సమగ్ర విశ్లేషణలను ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి!!!! (ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇప్పటికీ సజీవంగా ఉన్న మరి కొన్ని బ్లాగుల పరిస్థితి కూడా ఇంతే!)

ఇప్పటికయినా కూడలి/మాలిక/హారం నిర్వాహకులు కాస్త దయతలచాలి. ఒకప్పుడు చక్కని బ్లాగులతో కళకళలాడిన తెలుగు బ్లాగు సమాహారాలు ఇప్పుడు కేవలం 'వారా కూడళ్ళు ' గా మిగిలిపోతున్నాయి. పత్రికల్లో కూడా తెలుగు బ్లాగుల గురించి ఘనంగా వ్రాస్తున్నారు. ఒక సగటు పాఠకుడు 'ఈ బ్లాగుల సంగతి చూద్దాం ' అనుకొని కూడలికో మాలికకో వచ్చి చూస్తే 'చదివించగలిగే బ్లాగులు ' పట్టుమని పది కూడా కనపడక "ఓస్ ఓస్ ఈ మాత్రం కాపీ పేస్ట్ నేను చేయలేనా, నాలుగు ఫుత్వాలు పోస్టు చెయ్యలేనా" అనుకుంటాడు.

ఇప్పటికే కొందరు బ్లాగరులు తమకు నచ్చిన బ్లాగులను add చేసుకొని అవి చదువుకుంటున్నారు తప్ప కూడలి/మాలిక/హారం కు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. (మొన్న రమణగారి బ్లాగులో నా కామెంటుకు డాక్టరుగారు 'ఈ మధ్య కూడలి చూడడం మానుకున్నాను ' అని ఇచ్చిన ప్రత్యుత్తరమే ఈ పోస్టుకు ప్రేరణ)  అంతమాత్రాన నేను ఈ వార్తాబ్లాగులను తొలగించమని చెప్పడం లేదు. కొందరికి అవి ఎంతో విలువయిన సమాచారాన్ని అందిస్తుండవచ్చు. అందుకే ఇవన్నీ 'వార్తల సెక్షన్లో మాత్రమె ' కనపడేలా చేసి 'అభిప్రాయాలు, ఆలోచనలను ' తెలిపే బ్లాగులను మీ వెబ్‌సైట్ ప్రధాన పేజీలో పెడితే తెలుగు బ్లాగులకు మరింత ఉపకారం చేసినవారవుతారు. కాస్తంత సమయాన్ని వెచ్చించి బ్లాగులను వర్గాలుగా విభజించమని విన్నపం.

పాఠకులారా, నేను మోతాదును మించి స్పందించానేమో, బహుశా నాకు మాత్రమే ఈ "వార్తల బ్లాగులు" ఎక్కువ కనిపిస్తున్నాయేమో తెలియడం లేదు.  నా అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తే (ద్వికీభవించినా పర్లేదు!) మీ అభిప్రాయాలను కూడా పంచుకోండి.

87 comments:

  1. శరత్ కాలమ్ said...

    ఏకీభవిస్తున్నా.

  2. Anonymous said...

    ఏకీభవిస్తున్నా. జై జై నాయక,తెలుగ్గోడు,జనవిజయం మొదలైనవి విసుగెత్తిస్తున్నాయి.

  3. Anonymous said...

    I agree with you. Kudos for coming out with it bravely.

  4. Anonymous said...

    XYZ gari, ABC gari peLLisamdaDi vaartalu marchipoyaaru :)
    Telugu blog world is not the same as 3 years ago, with or without aggregators.

  5. Anonymous said...

    Exactly.. I am new to this blogworld and i found 90% of the blogs are just reposting all the stupid stuff from News papers / online news websites.
    :Venkat

  6. Anonymous said...

    ఏకీభవిస్తున్నాను. కాస్త ఆయా సైట్ల యజమానులు ఈ విషయంపై దృష్టిపెడితే బావుండు.

  7. Apparao said...

    అయితే మీరు సంకలిని చూడలేదు అన్నమాట :(
    సంకలిని లో బ్లాగుల వర్గీకరణ జరిగింది
    వార్తల బ్లాగులు , సినిమా బ్లాగులు అలా ,,,,,, అన్నమాట
    సినిమా విభాగంలో కూడా కొన్ని స్పైసీ బ్లాగులు లని పెద్దలకి మాత్రమే విభాగం లో చేర్చాము

    ఒక్క రోజులో నాలుగు కన్నా ఎక్కువ పోస్ట్లు వ్రాసేవాళ్ళ బ్లాగులు ఒక సెక్షన్ ( ఈ సెక్షన్ సంకలిని లో క్రింద భాగం లో వస్తుంది)
    మిగిలిని బ్లాగులు రెండో సెక్షన్ క్రింద విభజించాము

    మిగిలిన అగ్రిగేటర్ లకి మల్లె కమర్షియల్ బ్లాగులు (వ్యాపార ప్రకటనులు, popup లు ఓపెన్ అయ్యేవి) వాటిని సాధారణ బ్లాగులలో కలపలేదు
    సాధారణ బ్లాగులకి (భావ వ్యక్తీకరణ బ్లాగులకి) పెద్ద పీట వేసి కూర్చోపెట్టాము :)

    మిగిలిన అగ్రిగేటర్ లకన్నా మరింత వేగవంతమైన అగ్రిగేటర్ = సంకలిని

    బ్లాగర్ ఒక్క సారి పోస్ట్ వ్రాసి పబ్లిష్ బటన్ కొట్టాక సంకలిని ఎవ్వరి మాట వినదు
    పబ్లిష్ చేసిన 10 సెకండ్స్ లో బ్లాగ్ ని తిరిగి తీసుకుంటే సరే సరి లేకపోతె ఆ పోస్ట్ ని డిలీట్ కొట్టినా లేక డ్రాఫ్ట్ లో పెట్టినా చూపిచేస్తుంది

  8. Malakpet Rowdy said...

    Maalika is undergoing a big time overhaul. Give us two to three months.

  9. oremuna said...

    Thank you very much for the feedback. (as one of the persons responsible )
    -----------
    Our sleeves are up ...
    We are onto something.
    ---------------
    OK, you made the tight lipped "me" to write above words :-)

  10. చిలమకూరు విజయమోహన్ said...

    మేమూ మీ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాం.

  11. కొత్తావకాయ said...

    అగ్రిగేటర్లని చూసే బలహీనత అందరికీ ఉంటుందేమో!

    మీరు చెప్పినది ముమ్మాటికీ నిజం. మంచి బ్లాగులు కంటబడడమే కష్టమైపోతోంది.(యరమణ గారి బ్లాగు నాకూ చాలా ఆలస్యంగా తెలిసింది.ఈ లోగా తకుళుబెళుకు రాళ్ళు తట్టెడు కనిపించాయి. :) ) కనిపించిన మంచి బ్లాగుల లంకెలనో, మంచి టపాల లంకెలనో ఫేస్బుక్ వాల్ మీదో, గూగుల్ ప్లస్ లోనో పంచుకోవడం జరుగుతోంది.

    టపా రాసినందుకు చప్పట్లు!!

  12. Surabhi said...

    You read my mind!!!
    I totally agree with you. Appreciate for bringing this up. Aggregators should categorise the blogs and have the generic blogs to be appeared on the front page atleast for one full day.News blogs, they can do what ever they want

  13. Anonymous said...

    Yes I agree, Same thing my brother said, he is writing a serial in his blob “Nithyavasantam”, but said that the link appear here very short time, which is hindering to reach wider audience, now we started posting the link in our face book accounts.
    Categorization will help a lot

  14. Anonymous said...

    Sorry typo error from my side it is "http://nityavasantam.blogspot.com/"

    Thank you very much for coming up with this issue.

  15. Sri Kanth said...

    బల్ల చరిచి మీకో ఏకీభవిస్తున్నా..!!

  16. Saahitya Abhimaani said...

    జీడిపప్పుగారూ, నేను కూడా మీకు మద్దతు పలుకుతున్నా.

    కవిత్వం పేరిట ఒక బ్లాగు మాటి మాటికి పంటి కింద రాయిలా అడ్డుపడుతూ ఉంటే భరించలేక, కూడలి/మాలిక వారికి మైల్ ఇచ్చాను. ఫలితం లేదు. నా ఉద్దేశ్యంలో తెలుగులో చురుకుగా ఉన్న బ్లాగులన్నీ కూడా సంకలినిలులలో కనిపిస్తూ ఉండాలి. చురుకుగా అంటే కనీసం నెలకు ఒక్క వ్యాసం అన్నా ప్రచురించేవి. ఆ బ్లాగు మీద కర్సర్ ఉంచగానే, ఆ బ్లాగులో వ్రాయబడ్డ లేటెస్ట్ వ్యాసం కనపడేట్టు చేస్తే బాగుంటుంది. అది చూసుకుని, చదువరి ఆ బ్లాగును ఎంచుకోవటమా లేదా నిర్ణయించుకుని క్లిక్ చేసే అవకాశం ఉన్నది. ఇప్పుడు కూడ లేటెస్ట్ వ్యాసం చూసే కదా చదువరి ఆకర్షితుడయ్యేది. ఈవిధంగా చెయ్యటం వల్ల కొంతమంది బ్లాగర్లు రెండు లైన్ల కవిత్వాలు, మూడు లైన్ల సినీ అభిప్రాయాలు, పేపర్ల నుంచి కాపీ పేస్టులు రోజులో ఎన్నిసార్లు వ్రాసినా ఆ బ్లాగు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది, మిగిలిన బ్లాగులూ కనపడుతూనే ఉంటాయి. ప్రస్తుతపు పధ్ధతిలో, బ్లాగులో వ్రాసిన వ్యాసం మాత్రమే కనపడటం వల్ల, ఎవరు ఎంత తరచుగా వ్రాస్తే వారు వ్రాసిన వ్యాస శీర్షిక మాత్రమే కనపడి, మిగిలిన వ్యాసాలు మరుగున పడుతున్నాయి. బ్లాగులన్నీ కూడ వర్ణమాలప్రకారం సంకలినులలో కనపడితే హాయిగా చూసుకోవచ్చు.

    బ్లాగు పేరు చూసి ఆ బ్లాగులను వర్గాలుగా కూర్చటం అసాధ్యం. కారణం, పేరొకటి, వ్రాసే విషయాలు అనేకం. ఒకే విషయం మీద వ్రాసే బ్లాగులు చాలా తక్కువ.

    సాంకేతికపరంగా, పైన చెప్పిన విధానం వీలయ్యి పాటిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం.

  17. సుజాత వేల్పూరి said...

    ఏకీభవిస్తున్నా! ఈ మధ్య "బ్లాగులో" రాయడం బాగా తగ్గించాను. అగ్రిగేటర్లు చూడ్డం అసలే తగ్గించాను. కారణాలు మీరు చెప్పినవే!

    మంచి టపా రాశారు

  18. Anonymous said...

    జరిగితే మంచిదే!!!

  19. Sri Kanth said...

    @శివరామప్రసాదు కప్పగంతు,

    Good Idea.. sir ji. :-)

  20. Zilebi said...

    జీడిపప్పు గారు,

    వెంటనే మీరు 'హారం' కి బదిలీ అయిపోండి. ఆల్ ప్రాబ్లెం సాల్వేడ్!

    అప్పారావు స్మాష్ త్రీ గారు,

    ofcours sankalani as well!!

  21. Sujata M said...

    చప్పట్లు. ఏకీభవిస్తున్నాం ! అవును అసలు కూడలి చూడాలంటేనే విసుగ్గా వుంది. మొదట్నించీ అలవాటయిపోయింది. కాబట్టి, బ్లాగులు చదవాలంతే ఇంట్రెస్టు పోయింది.

  22. Sravya V said...

    హ్మ్! కరెక్టే మంచి బ్లాగులు ఎక్కువ సేపు ఎగ్రిగేటర్ లో కనపడటం లేదు . ఏది మంచి బ్లాగు / ఏది జనాలని నచ్చటం లేదు అనేది ఎలా డిసైడ్ చేయాలి ? ఎక్కువ హిట్లు / ఎక్కువ మంచి చదివేవి అని కాటగిరీ లో పెట్టలంటారా ?

    అసలు నాకు సమస్య అగ్రిగేటర్ లతో కన్నా మీలాంటి బాగా రాయగలిగే వాళ్ళు
    ఎందుకో బ్లాగింగ్ మీద శీత కన్ను వేయటం వాళ్ళ ఈ సమస్య అనిపిస్తుంది :p

    మీరు , ఇంకా చదువరి గారు , మంచు పల్లకి, తోటరాముడు ఇలా ఇంకొంతమంది బాగా రాసే వాళ్ళందరూ ఎందుకో మరి సడన్ గా రాయటం మానేశారు . బ్లాగులు కళకళలాడుతుంటే కదా అగ్రిగేటర్స్ కి కళ ఉండేది ? నేను మాత్రం కరువు లో ఈ కృష్ణప్రియ గారు , శైలజ గారు, సుజాత గారు ఇలాంటి వాళ్ళు పోస్టు కనపడగానే అమ్మయ్య అని అదే ఒక పది సార్లు చదువుతున్నా :D

    ఇందు మూలం గా చెప్పేది ఏంటి అంటే మీరు , మంచు గారు , చదువరి , ఇంకా ఉన్నారు వాళ్ళ లిస్టు ఇస్తా ముందు మీ బ్లాగుల దుమ్ము దులిపండి మా కోసం రాయటం మొదలు పెట్టండి కొద్ది గా బ్లాగులకి పాత కళ తెండి ప్లీజ్ !

    btw జిలేజీ గారి కామెంట్లు ఎప్పుడు నా మట్టి బుర్ర కి అర్ధం కాక గిల గిల కొట్టుకుంటా , ఇన్ని రోజులకి వారు నాకు అర్ధం అయ్యేట్లు ఒక కామెంట్ రాసారు , Thanks జిలేజీ గారు !

  23. మరువం ఉష said...

    మీ ప్రతిపాదన బావుంది, శివరామప్రసాదు కప్పగంతు గారి సూచనలు బాగున్నాయి. ఇప్పటికీ చందమామ దొరికితే కూతూహలంగా తిప్పినట్లే తీరికలో లాప్టాప్ ఒళ్ళోకి చేరితే తరువాతి కొన్ని నిమిషాల్లో ఒక బ్లాగో/అగ్రిగేటరో తెరవటం ఆనవాయి అనుకుంటా, బ్లాగింగ్ దెబ్బల మచ్చలు చూసుకుని బెంగపడుతూ కూడా :) ఒక సానుకూల పరిస్థితి నెలకొనేవరకు నేను నా బాణీ కొనసాగిస్తాను. ప్రతిరోజూ చూసే అల్ప వ్యవధిలో నాకు తెలిసిన బ్లాగుల లింక్స్ మాత్రం చూస్తాను. వారంతాల్లో, అనుకోని విరామం (ఇవాళలా) వస్తే అగ్రిగేటర్స్ తెరిచి నాకు నచ్చినవి నాకు తెలిసిన మరొక ఇద్దరికీ పంచుతా. వాళ్ళూ దాదాపు నా పనే చేస్తారు. ఒక్కోసారి ఒకే పంధా లో రాసేవి ఇక వైవిధ్యం లేదు అనుకున్నవి వెనక్కి జరిపి, జిజ్ఞాస కలిగించేవి ముందుకు తీస్తా. ఇదంతా కూడా కాస్త పనే. కానీ, బళ్ళో పిల్లలు ఏడాదేదికి కాస్త పై తరగతికి పోయినట్లుగా నా చదువరితనం మెరుగైంది ఈ బ్లాగువనానే. అన్నీ రకాల నాణ్యత, నాసి, వాసి, రాసి తెలిసిందిక్కడే. కనుక, తప్పదు.

  24. శ్రీనివాస్ said...

    అందరికీ నమస్కారం !! ఒక్కసారి " బ్లాగిల్లు" చూసి మీ అభిప్రాయాలు తెలుపగలరు . మీరందరూ చెప్పిన అన్ని విషయాలూ తప్పక పాటిస్తాం
    blogillu.com

  25. Sri Kanth said...

    బ్లాగిళ్ళుగారూ, మీ అగ్రిగేటరును ఇప్పుడే సందర్శించా. తాజా టపాలు అన్న దానిలో 99% వార్తలేనండీ. :-(

  26. vineela said...

    హారం లో కామెంట్స్ మరియు ఎక్కువ గ చదివిన టపాలు చుస్తే ఒక మంచి అవగాహన వస్తుంది నా మటుకు..గూగుల్ రీడర్ లో కొన్ని బ్లాగ్ లు ఫాలో అవుతున్న అప్పుడు ఆగ్రిగేతర్ లో కనిపించనివి కొన్ని మంచి టపాలు కనిపిస్తున్నాయి.

  27. శ్రీనివాస్ పప్పు said...

    నేను సైతం

  28. Anonymous said...

    కూడలి వారు మీ సమస్యను ఇప్పటికే పరిష్కరించే ఉన్నారు కదా !
    కూడలి లో పైన ' నిర్వహణ ' మీద క్లిక్ చేసి మీకు నచ్చని బ్లాగులను అక్కడ ఎంటర్ చేస్తే మీకు ఆ వార్తల గొడవ ఉండదు కదా !

  29. సుజాత వేల్పూరి said...

    నా కామెంట్ ఏమైపోయింది? ఏమైపోయింది?పొద్దున రాశానే!

    నేను అగ్రిగేటర్లు చుడ్డం మానేసి చాలా రోజులైంది. బ్లాగులు చదవడం మానేసి మరిన్ని రోజులైంది. బ్లాగులో రాతలు తగ్గి పోయాయి. నా సొంత రాతలు, కాలములు ఉన్నాయి కాబట్టి! కారణాలు మీరు చెప్పినవే..సమాచారాల,వంటల,చిట్కాల బ్లాగులు తట్టుకోలేక!

  30. Sujata M said...

    సుజాత గారూ..

    ఒకప్పుడు (మొదలు పెట్టినప్పుడు) బ్లాగులు చదవడం కూడా ఒక ఎడ్యుకేషన్ లా వుండేది. కూడలి రోజూ పొద్దున్నే తెరుచుకుని కాలక్షేపం చేసేదాన్ని. ఇప్పుడు మనకీ టైం లేదు, రాసేవాళ్ళకీ లేదు. అనవసరం లేదా అంత ఉపయోగం కాని సమాచారం ఎక్కువయిపోయింది. వంటలూ, చిట్కాలు కూడా తక్కువయిపోయాయి. ఆ మధ్య మరీ ఘోరం. పోట్లాటలూ, ఐ.పీ. ఎడ్రసులూ, బెదిరింపులూ వగైరా. రాసేవాళ్ళు కూడా ఇంట్రెస్టు గా రాయడం లేదని నా విన్నపం. :D

    జీడిపప్పు గారూ..

    చాలా మంచి విషయం ఎత్తారు. కూడలి లో నాకు నచ్చని బ్లాగులు చూపించొద్దని 'నిర్వహణ' లో ఏవో కుస్తీలు పడ్డాను. కానే యధాప్రకారం, అన్ని బ్లాగులూ కనిపిస్తూనే వున్నాయి. ఇలానే కొనసాగితే, కష్టమే. ఏదైనా అతి సర్వత్ర... వద్దులే !

  31. Anonymous said...

    ఇలాగైతే తెలుగులో జాతీయ, అంతర్జాతీయ విషవార్తల బ్లాగులేమయిపోవాలి? గోళ్ళు ఏపుగా పెరగాలంటే చిట్కాలెవరిస్తారు? మూతి సౌందర్యానికి మూతి పేక్ కావాలంటే వెతుక్కోవాల్సిందేనా? బుక్కులోళ్ళు అమ్ముకునే ప్లాట్ఫాం లా సంకలినులను మార్చడానికి పెతిపచ్చాలు చేస్తోన్న కుట్ర, విదేశీ హస్తం.

  32. పల్లా కొండల రావు said...

    " క్రింది మేటర్ నాకు నచ్చిన నిజం. కావాలి ఫోజు పెట్టని జనం . అపుడే వికసిస్తుంది తెలుగు ప్రభంజనం "

    దీనిని సురవర డాట్ కాం నుండి సేకరించాను.

    " లిటరల్లీ ప్రతి ఒక్కళ్లూ ఒక బ్లాగు రాసుకోవచ్చు. ఆ విదంగా ఎంత చిన్న ఇంపార్టెన్స్ లేని విషయం కూడా బ్లాగులో రాయవచ్చు. అది లక్ష మందికి ఇంపార్టెంట్ కాకపోవచ్చు, పదివేల మందికి తెలియాల్సిన విషయం కాకపోవచ్చు, కానీ వంద మందికి అది ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉండవచ్చు. అలాంటి చిన్న విషయాలకు, పాజనేట్ విషయాలకు మనం బ్లాగులు సమర్ధవంతంగా వినియోగించుకోవాలి, అది బ్లాగుల సంఖ్య పెరిగే కొద్ది ఎలాగూ జరుగుతుంది అని నేను ఆశిస్తాను "

  33. పల్లా కొండల రావు said...

    ఈ పోస్టులో కొన్ని అంశాలు బాగున్నాయి. నా బ్లాగు " జనవిజయం ' లో ఈ పోస్టులో సూచించిన చాలా లోపాలు ఉన్నాయి.అవి నా దృష్టిలో ఉన్నాయి.అవి కావాలని చేస్తున్నవి కావు. కొన్ని ప్రయోగాల రీత్యా అలా జరుగుతున్నాయి. అయినా అవి జరుగ కూడదు. అచంగ గారు సూచన మేరకు నేను ఉగాది రోజునుండి కొన్ని మార్పులు ఆచరణలో చేసి చూపుతాను.

  34. మధురవాణి said...

    నేను కూడా మీరు చెప్పిన అంశాలతో ద్వివీభవిస్తున్నానండీ.. :)

  35. సుజాత వేల్పూరి said...

    కొండల రావు గారూ, మీ బ్లాగు గురించే అడుగుదామని అనుకుంటున్నాను. కొన్ని ఆలోచింపజేసే పోస్టులు ఉంటున్నాయి, మరి కొన్ని సినిమా వార్తలూ అవీ....ఈ వైరుధ్యం అర్థం కాలేదు. రెంటికీ పొంతన లేదు కాబట్టి,ప్రయోగాలనే నేనూ అర్థం చేసుకున్నాను.

    బ్లాగుల్లో వార్తలు చిట్కాలు,వంటలు,సినిమా సమాచారం(ఫొటోలతో సహా)ఎక్కువైపోవడం వల్ల,భావ వ్యక్తీకరణ తగ్గిపోయింది. సమస్యా పూరణలూ,పద్యాలు చేసేంత పరిజ్ఞానమా లేదాయె! పైగా నా సొంత కాలంస్,ఇతర రాతలూ నాకున్నాయండీ. అందువల్లనే బ్లాగులు సెలక్టివ్ గా చూస్తున్నాను.అగ్రిగేటర్లు అరుదుగా!

    ప్రతి ఒక్కరికీ బ్లాగు రాసే స్వేచ్ఛ ఉంది కాబట్టి, వాటిని అగ్రిగేటర్లలో చేర్చే హక్కూ ఉంది కాబట్టి అగ్రిగేటర్ల నిర్వహణా సమస్యలను కూడా అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ! అవి వాళ్ళ తిప్పలు________అనుకుంటే మాత్రం ..ఈ "వార్తా కంటెంట్"బ్లాగులు చూడ్డం తలనొప్పే!

  36. రవి said...

    కొన్నేళ్ళ క్రిందట తేనెగూడు అని ఒకటుండేది. అందులో చూడగానే సినాప్సిస్, ఈ వారం ఉత్తమ బ్లాగుల లిస్టూ, ఆ నెలలో ఉత్తమ బ్లాగుల లిస్టూ వంటివి చక్కగా అమర్చి ఉండేవి. ఎంచేతో అది మూతబడింది.

  37. పల్లా కొండల రావు said...

    సుజాత గారూ !
    మీరన్న దానిలో వాస్తవం ఉంది. 'జనవిజయం'ను ఆన్‌లైన్‌ మేగజైన్‌ గా తీసుకురావాలనే దానిలో భాగంగా కొన్ని ప్రయోగాలు చేయడం జరుగుతోంది. అయితే ఉగాది నుండి చాలా వరకూ మార్పులు చేస్తున్నాను. ఇపుడు కాపీ చేసేవి కూడా ఇతరులకు నష్టం లేనివే.అయినా అది సరైనది కాదు కనుక ఇకపై కాపీ+పేస్ట్ లు ఉండవు. నా బ్లాగును కూడా ఇంతగా అబ్జర్వ్ చేస్తున్నారు మరియు ఈ పద్ధతి వలన కొందరు విసుగు పడుతున్నారు అనీ అనుకోలేదు. నా ప్రయోగాలు నేను చేసుకుంటూ వెళుతున్నాను. నేను బ్లాగులకు కొత్త కూడా.ముఖ్యమైన సేకరణలు వారి పేరుతో కలిపి మాత్రం కొన్ని ఉంటాయి. ఇప్పటిలా రోజూ ఇన్ని పోస్టులు కాపీలు మాత్రం ఇకపై ఉండవు. వీలైతే ఈ రోజే మానేస్తాను. ఇకమీదట 'జనవిజయం'లో మార్పులు గమనించగలరు.

  38. పల్లా కొండల రావు said...

    బ్లాగుల మరియూ అగ్రిగేటర్ల నిర్వహణ గురించి మరింత శాస్త్రీయంగా ఇతరులను కించపరచకుండా , ఆలోచింపజేసే విధంగా చర్చ జరగాలి. నా వరకూ నేను కొన్ని సవరణలు చేసుకుంటాను. ఆ మేరకు ఈ చర్చ లేపి కారకులైన జీడిపప్పు గారికి ధన్యవాదాలు . అభిననందనలు .

  39. శేఖర్ (Sekhar) said...

    Well said....I created a well blogger list on my own blog to avoid this kind of junk.

    Thanks for sharing our thoughts and i appreciate Maalika admin for responding to this issue.

    Initially people write some good stuff and later even they convert to copy paste business.Because of this even Aggregators are finding it difficult to manage in section wise.

  40. శరత్ కాలమ్ said...

    ఈ బ్లాగోత్పాతం గురించి నేనెప్పుడో జ్యోతిష్యం చెప్పా.

    http://sarath-kaalam.blogspot.com/2011/05/blog-post_11.html

  41. శరత్ కాలమ్ said...

    అప్పుడు ఓ అజ్ఞాత ఇలా కామెంటేరు :
    అజ్ఞాత చెప్పారు...

    అగ్రిగేటర్ admin కి లేని దూల నీకెందుకు బె....
    ఎవరి ఇష్టం వారిది......
    నీ మాట వింటే రోజుకు 10-20 బ్లాగులు మాత్రమె దర్శనమిస్తాయి.
    తెలుగులో వార్తలు , కవితలు వగైరాలకోసం ఒక్కొక్క సైట్ వెతికే దౌర్భాగ్యం ఎందుకు.?
    ఒకే చోట చూసుకుంటే సరిపోలా ...
    పతి ఒక్కరూ ఏ విషయాన్నైనా ఎక్కడో ఒక చోట నుండి గ్రహిస్తారు.. దాన్ని కాపి చేస్తే తప్పేంటి ...!! ఆయా వార్తలకోసం ఫలానా సైట్ వెతికి చూడకుండా ఇది మంచికే కదా...
    "రాజకీయాలు", "సినిమా" విషయాలకు వస్తే ప్రతి ఒక్కటి దానితోనే ముడి పడి ఉంటాయి.
    బ్లాగు భావ ప్రకటనలకే కాదు...
    సంకలినులు 18+ బ్లాగులను తప్ప ఎలువంటి టపాలనైనా ప్రచురిస్తాయి..

  42. Blogger said...

    అందరికీ నమస్కారం !! క్రింది పోస్టుపై మీ కామెంట్స్ వ్రాస్తారుగా...
    http://blogillu.blogspot.in/2012/02/blog-post.html

  43. Anonymous said...

    తాడేపల్లిగారి కలగూరగంప మాలికలో కనపడదేందుకు? ఆయన దానిలో తన బ్లాగును చేర్చలేదా? భైరవభట్ల, నాగమురళి, సందీప్ (మనోనేత్రం), రవి మొద|| వారందరికి ఏమైంది ఒక్కరు కనపడటం లేరు. రాస్తున్నారా లేక వీరి టపాలను తొక్కేశారా?

  44. నాలోనేను said...

    బ్లాగుల వరదలో కొట్టుకుపోయి ఊపిరి ఆడక కొన్ని క్షణాలలో పారిపోయాను..
    చాన్నాళ్ళకు జల్లెడ చూసా.
    మీ బ్లాగు చదివి జారుకుంటా.
    మంచి బ్లాగుల కోసం మొహంవాచి వున్న నాలాంటి వాళ్ళను కరుణించండి.
    భ్లాగు బ్లాగు

  45. జీడిపప్పు said...

    బ్లాగు సమాహారాల దుస్థితి గురించి సుమారు మూడుపదులమంది నా అభిప్రాయముతో ఏకీభవిస్తుండడం చూసి ఆనందించాలో లేక మరిన్ని పదులమంది ఈ దుస్థితి వల్ల బ్లాగులకు దూరమవడం తలచుకొని బాధపడాలో అర్థం కావడం లేదు.

    ముందుగా, కూడలి నిర్వాహకులయిన ఒరేమునా (చావా కిరణ్) గారికి, మాలిక నిర్వాహకులైన మలక్‌పేట్ రౌడీ గారికి ధన్యవాదాలు. వీలయినంత త్వరగా బ్లాగు సమాహారాలకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తారని ఆశిస్తున్నాము.

  46. జీడిపప్పు said...

    @ శరత్ గారు, అచంగ గారు, విజయమోహన్ గారు, కొత్తావకాయ గారు, సురభి గారు, శ్రీకాంత్ గారు, కష్టేఫలే గారు, వినీల గారు, శ్రీనివాస్ పప్పు గారు, మధురవాణి గారు, రవి గారు, శేఖర్ గారు - మీ అభిప్రాయాలు తెలిపినందుకు ధన్యవాదాలు
    ,
    శ్రీనివాస్ గారు - బాబోయ్ మళ్ళీ ఆ వార్తా బ్లాగులను గుర్తుచేస్తున్నారు!!

    అప్పారావు శాస్త్రి గారు - సంకలిని చూడలేదండి.. తొందర్లో కాస్త explore చేస్తాను

    శివరామప్రసాదు గారు - మీ సూచనలు చాలా బాగున్నాయి. ఆచరించడం ఎంతవరకు సాధ్యమో చూడాలి!

    జిలేబి గారు - హారానికెళ్ళినా ఈ వార్తల కంపు కాస్త కొడుతూనే ఉంది!!

  47. జీడిపప్పు said...

    శ్రావ్య గారు - ఏది మంచి బ్లాగు అంటే.. యే బ్లాగులో అయితే "అభిప్రాయాలు, ఆలోచనలు, మధురస్మృతులు" ఉంటాయో అవన్నీ కూడా మంచిబ్లాగులే అనుకుంటా. ఇక బ్లాగులు వ్రాయడమంటారా.. వ్రాయాలి అనుకుంటున్నా కానీ వాయిదా పడుతోంది. నేను కూడా మీలాగే పాతకాపులు వ్రాసినవి చదివి ఆనందిస్తున్నా ప్రస్తుతానికి.

    ఉష గారు - మన స్వంత బాణినే కొనసాగిస్తూ మంచిబ్లాగుల బాణిని అనుసరిస్తుంటే బాగుంటుంది. విమర్శలను పట్టించుకోకండి

    శ్రీనివాస్ గారు - మీ బ్లాగిల్లు కూడా వార్తలమయమే!

    అరవింద్ గారు - కూడలిలో ఉన్న నిర్వహణ సరిగా పనిచేయడం లేదు. పనిచేసినా చాలామందికి తెలియదు అనుకుంటాను.

    కొండలరావు గారు - వార్తా బ్లాగులన్నీ ఒకేచోట ఉంచితే పదిమందికే కాక పాతికమందికి చేరుతాయనుకుంటాను. కాబట్టి వార్తాబ్లాగుల సెక్షన్ చాలా అవసరం.

  48. జీడిపప్పు said...

    సుజాత గారు - మీరు బ్లాగులు చూడడం, వ్రాయడం మానేశాననడం భావ్యం కాదు. తొందర్లో అంతా సర్దుకొని సమాచార, వంటల, చిట్కాల బాధ తప్పుతుందని ఆశ ఉంది కాబట్టి మీరు మళ్ళీ బ్లాగడానికి సమాయత్తం కావాలి

    ఇంకో సుజాత గారు - ఇప్పుడు ఆ పోట్లాటలు దాదాపు లేవు లెండి. ప్రశాంత వాతావరణమున్నా ఈ వార్తలు, ఫోటోలు, చిట్కాల కంపు వల్ల చాలామంది బ్లాగరులు ముక్కుమూసుకొని పారిపోతున్నారు. ఈ కంపు తగ్గితే మళ్ళీ మంచిరోజులొస్తాయన్న ఆశతో చేసిన చిన్న ప్రయత్నమే ఇది.

  49. సిరిసిరిమువ్వ said...

    మంచి టపా. అగ్రిగేటర్లు ఉన్నాయన్న సంగతే మర్చిపోయాను నేను. చదవాలనుకున్నప్పుడు మంచి బ్లాగులు తెరిచి చదువుకోవటమే!కూడలి లో వర్గీకరణ బాగానే ఉంటుంది కదండి. మళ్లీ మంచి రోజులు వస్తాయంటారా! ఏమో..అనుమానమే!

  50. Kathi Mahesh Kumar said...

    lol

  51. Blogger said...

    జీడిపప్పు గారూ ! " బ్లాగిల్లు" మొదటి పేజిలో అన్ని రకాల పోస్టులూ ఉండొచ్చు కానీ విభాగాల్లో మాత్రం అయా రకాల పోస్టులే ఉంటాయి .. ఒకటి నిజం - బ్లాగులను బట్టికాక పోస్టులను బట్టి విభాగాలు నిర్ణయించే ఆగ్రిగేటర్ " బ్లాగిల్లు " .. ఇంకా అనేక వెసులుబాట్లు, ఫీచర్లు ఉన్నాయి .మీకు నచ్చిన " కీ వర్డ్ " తో మీయొక్క సొంత విభాగాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఏ ఆగ్రిగేటర్ లోనీ లేని ఫీచర్స్ " బ్లాగిల్లు " సొంతం ..

  52. Sujata M said...

    JP ji,

    చాలా రోజులకి వ్యాఖ్యలు అన్నీ ఇంటరెస్టింగ్ గా చదివే అవకాశం కలిగింది. మంచి చర్చ కు తెర లేపినందుకు మీకు థాంకులు. నాను సానా వెనకబడి ఉన్నానని ఎరికై, విచారం కూడా! పోన్లెండి. ఎప్పటికైనా ఇలాంటి ఆలోచన అందరికీ రావాల్సిందే !

  53. జ్యోతి said...

    గంటకోసారి అగ్రిగేటర్ చూసే అలవాటు వారానికొకసారి ఓ లుక్కేద్దాం అన్నట్టుగా మారింది. మీరు చెప్పిన కారణాలవల్ల మంచి టపాలు కనపడక, ఈ వార్తలు, చిట్కాలు చదవలేక అగ్రిగేటర్లు చూడడం మానేసి చాలా కాలమైంది. నా బ్లాగు రాయాలంటే కూడా ఆసక్తి కలగడం లేదు..:))

  54. Zilebi said...

    జ్యోతి గారు,

    మధ్యలో వారెవరో జిలేబీ గారట, బర బర టప టప కామెంటు పరంపరలు వేరే!

    అబ్బ, అసలు అగ్రిగేటర్స్ చూడాలంటేనే మరీ చికాకు పుట్టిస్తున్నారండీ మరీ ను.

    చీర్స్
    జిలేబి.

  55. Anonymous said...

    @ జీడిపప్పు గారికి,
    కూడలి లో నిర్వహణ సరిగానే పనిచేస్తుంది. మీరు డిఫరెంట్ బ్రౌసర్లను ఉపయోగించినప్పుడు అది పనిచేయదు. ఇంకా కుకీస్, కాచ్ డిలీట్ చేసినప్పుడు నిర్వహణ పనిచేయదు, మీరు నిర్వహణలో ఉంచిన బ్లాగులు మీకు మాత్రమే కనబడవు మరియూ మీ కంప్యూటర్లో మాత్రమే కనిపించవు.
    @ బ్లాగు సమూహాలతో చిరాకు పడ్డ అందరికీ,
    బ్లాగు సమూహాలతో ఇబ్బందిపడ్డవారు బ్లాగు సమూహాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు. విండోస్ కూ, లినక్స్ కూ అన్ని ఆపరేటింగ్ సిస్టంస్ కూ ' ఫీడ్ రీడర్ ' సాఫ్ట్వేర్లు లబ్యమవుతాయి. ఆ సాఫ్ట్వేర్ ను ఉపయోగించవచ్చు. వీటిగురించి ఏమన్నా సమాచారం కావలసి వస్తే urstrulyAravind@todaysworld.in కు మెయిల్ చేయవచ్చు. ' ఫీడ్ రీడర్ ' వద్దు అనుకున్న వారు గూగుల్ రీడర్ కూడా ఉపయోగించవచ్చు.

  56. జీడిపప్పు said...

    సిరిసిరిమువ్వ గారు - బ్లాగులకు మంచి రోజులు వస్తాయన్న నమ్మకం ఉంది :)

    Sujata గారు, సుజాత గారు, జ్యోతి గారు, మహేష్ గారు - ఇలా అంటున్నందుకు అన్యదా భావించకండి. తెలుగు బ్లాగర్లలో ప్రథమపంక్తిలో ఉండే మీలాంటి వారు ఈ సమస్యను లేవనెత్తి ఉంటే మరింతమంది స్పందించి తొందరగా పరిష్కారం లభించేది. మీకు కాస్త ఓపిక, ఆసక్తి ఉంటే వీలయితే మీరు కూడా ఇదే విషయం మీద ఒక టపా వ్రాయండి. అలా చేస్తే ఈ సమస్యకు మరింత మంచి పరిష్కారం లభిస్తుందేమో!

  57. Anonymous said...

    >>తెలుగు బ్లాగర్లలో ప్రథమపంక్తిలో ఉండే మీలాంటి వారు

    వాళ్ళు మిమ్మల్ని పొగిడేయడం, వాళ్ళను మీరు ఆకాశానికి ఎత్తేయడం - ఇది మరీ వీపు గోకుడులా లేదూ? ఆపండి మీ పొగడ్తలు కుక్కలెత్తుకెళ్ళా మీ ఏడుపంతా బ్లాసం ఎర లాంటి వాళ్ళపైనేనా? వాళ్ళను పీకేస్తే మీరేదో చించేస్తారని అనుకోవాలా? గుర్రపుడెక్కలతో సహవాసం చేస్తున్నా కమలం వికసించక మానదు. మీ రాతలు అంత బావుంటే చదువరులు వెతుక్కుంటూ వస్తారు.

  58. పల్లా కొండల రావు said...

    @ Anonymous !
    ఇక్కడ చర్చించిన చాలా బ్లాగుల కంటే కూడా బ్లాసం ఎర బ్లాగు ఉపయోగకరంగా ఉంటుంది. చాలామందికి ఆరోగ్య విషయాలు ఉపయోగకరంగా ఆ బ్లాగులో ఉంచుతున్నారు. ఇలాంటి విషయాలు సేకరించి ఉంచితే తప్పే కాదు. ఈ విషయం ఎవరూ విమర్సించలేదుగా !

  59. జీడిపప్పు said...

    Anonymous గారు,

    చూడబోతే ఒకప్పుడు బ్లాగుల్లో ఒక వెలుగు వెలిగిన వారిలా కనిపిస్తున్నారు.. ఇంతకీ మనది ఏ బ్లాగంటారు?

    పరస్పర పొగడ్తలంటరా? తప్పదు కదస్మీ. అలా పొగిడినపుడు వాళ్ళు కామెంట్లు వేస్తే నాకు డబ్బులొస్తాయి.. ఆ డబ్బులతోనే కదండి మా జీవితాలు గడుస్తున్నది!!

    అన్నట్టు పనిగట్టుకొని కామెంటు పోస్టినందుకు ధన్యవాదాలు. నా బ్యాంక్ బాలెన్స్ పెరిగిందేమో చూసొస్తా

  60. Zilebi said...

    జీడి పప్పు గారు,

    >>- బ్లాగులకు మంచి రోజులు వస్తాయన్న నమ్మకం ఉంది :)

    ఉంది లే మంచి కాలం ముందు ముందున,
    అందరూ, 'బ్లాగూపడాలి' నంద నందనా !


    చీర్స్

    జిలేబి

  61. Anonymous said...

    తెలుగు వార్తలు చదవడానికి, ఆంధ్రజ్యోతి, ఈనాడు కన్నా, గొప్ప బ్లాగ్స్ అవసరం లేదు. బ్లాగ్ అంటే, తమ అభిప్రాయల్ని పంచుకోవడానికి ఉపయోగించుకోవాలి కాని, ఎక్కడో వార్తల్ని ఏరుకొచ్చి, కుప్ప పోస్తే, దాన్ని బ్లాగ్ అనడం ఎందుకు. రాజుగారి నూతన వస్త్రాల గురించి ధైర్యంగా చెప్పిన మా డుబుగ్స్ కు జై!!

    నేను సైతం...

  62. కృష్ణప్రియ said...

    జీడిపప్పు గారు,

    మీ టపా ఇప్పుడే చూస్తున్నాను. చాలా చర్చ జరిగినట్టుంది. నా అభిప్రాయం కూడా రాసేద్దామని..

    బ్లాగు లో ఏం రాసుకోవచ్చు.. అనేది ఎవరిష్టం వారిది అని సురవర.కాం లోపైన కోట్ చేసింది కరెక్టే..
    పాటలు,వంటలు,చిట్కాలు,వార్తల కట్ అండ్ పేస్ట్, ఫోటోల బ్లాగులంటే కూడా నాకిష్టమే. కానీ కనీస విశ్లేషణ లేకుండా ఊర్కే లింకులిచ్చే పాటలు, వార్తల బ్లాగులూ చూస్తే కొద్దిగా విసుగ్గా అనిపిస్తుంది నిజమే.

    మీరన్నట్టు, ఎంత బిజీ గా ఉన్నా, రోజుకి కనీసం రెండు సార్లు అగ్రగేటర్లు చూడటం నాకు గత రెండేళ్ల క్రితం ఏర్పడిన వ్యసనం. టీవీ ఎక్కువ చూడక పోవటం తో బ్లాగుల వల్లే నాకు చాలా ఎంటర్ టెయిన్ మెంట్.

    నిజానికి వార్తా పత్రికల్లో కొన్ని వార్తలు పడ్డప్పుడు, బ్లాగుల్లో జనాలేమనుకుంటున్నారు చూద్దాం అని వచ్చి చూడటం,కొన్నింటిని ఎవరూ పట్టించుకోలేదని 'అయ్యో' అనుకోవటం కూడా ఒక అలవాటు గా మారింది నాకు.

    ఇక మీరన్నట్టు ఆల్రెడీ బ్లాగులు చూస్తున్నవారు చాలా బిజీ గా ఉండి కొన్ని బ్లాగులని కొంత కాలం పాటూ మిస్సయ్యే చాన్సులు ఉన్నాయి. కరెక్టే. అందుకే నచ్చిన బ్లాగుల్ని ఫీడర్ లో కలుపుకు పోతూ ఉంటాను.

    అన్నింటి కన్నా పెద్ద సమస్య.. కొత్తగా 'ఈ బ్లాగుల సంగతేంటో చూద్దాం..' అని చూసే వారికి..ఆ రోజు పోస్ట్ అయిన టపాలు కొత్తగా, వారి అభిరుచి కి తగ్గట్టు గా కనిపించక తిరిగి రావాలనిపించక పోవచ్చు. దీనికి బ్లాగ్ సంకలునులు వర్గీకరణ లు చేయటం లో ఏదో ఒక ఉపాయం కనిపెట్టాల్సిందే :)

    నా వరకూ కొంత కాలం పాటూ ఏ కారణాల వలనైనా బ్లాగుల వైపు రావటం తటస్థించకపోతే, నేను చూసేవి... మాలిక కామెంట్ల సెక్షన్, హారం టాప్ రెడ్ పోస్టులు..

  63. Angry Bird said...

    @Aravind Palla

    Feed readers will work only when you exactly know which feeds you would like to subscribe.

    I am still not sure how they can solve the problem faced by Jeedipappu (discovering good new blogs). He still have to check out aggregators or explore on his own.

    Did I miss something ?

    - Angry Bird.

  64. Anonymous said...

    @ Angry Bird,

    అగ్గ్రిగేటర్లలో మీకు నచ్చిన బ్లాగులు ఇంకొకరికి నచ్చక పోవచ్చు. అప్పుడు ఒక సమూహానికి నచ్చినదే అందరికీ రావాలంటే కుదరదు కదా !. కొంతమందికి సినిమాల గురించి నచ్చవచ్చు. మరికొంత మందికి వార్తల గురించి నచ్చవచ్చు. అందుకనే ఈ ' ఫీడ్ రీడర్ ' ద్వారా ఎవరికి నచ్చిన బ్లాగులు వారు ఎంపిక చేసుకొవచ్చు.

  65. Anonymous said...

    @@@@ Anonymous said...
    March 18, 2012 1:39 AM

    All discussion is nonsence ... To develop telugu blogs aggregators must be there.. also all telugu aggregators are working their best... @@@@@
    అందరి కామెంట్లూ బాగానే ఉన్నాయి. ఒక్క మీ కామెంట్ తప్ప. అయినా ఈ అజ్ఞాత కామెంట్లను ' జీడిపప్పు ' బ్లాగు ఎందుకు ఎలో చెస్తున్నారో ?

  66. Rockstar said...

    @ aravind..
    Your feed reader can't remove unwanted posts from a feed.. so it nothing..

  67. Anonymous said...

    @ Rockstar,

    మీకు ఇష్టం లేని పోస్టులను ' ఫీడ్ రీడర్ ' నుండి నిరభ్యంతరంగా రిమూవ్ చేసుకోవచ్చు బ్లాగును తీసేయకుండానే !

  68. Angry Bird said...

    @Aravind Palla,

    Sorry, you still did not answer my question.

    How do we discover new good blogs through feed readers without checking out aggregators or exploring the blogosphere on your own ?

    - Angry Bird.

  69. Anonymous said...

    @ Angry Bird
    మనం ఫీడ్ రీడర్ ద్వారా కొతా బ్లాగులను కనుగొనలేము. వారు ప్రచారం చేసుకుంటే తప్పా !

  70. Anonymous said...

    @ Kastephali,
    ఫలానా వాళ్లను బ్లాగులు రాయొద్దు అనే అధికారం ఎవరికీ లేదు. మీరు నిరభ్యంతరంగా బ్లాగును రాయవచ్చు. http://kastephale.wordpress.com/ మీ బ్లాగులోని టపాలు బాగున్నాయి కూడా ! ఇలాంటి బ్లాగులే ఉండాలి. ఇక్కడ ఉన్న అందరూ వాదించేది ఒకప్పుడు బ్లాగులలోని టపాలు చాలా బావుండేవి. ఇప్పుడు సినిమాలు, వార్తలు గురించే టపాలు వస్తున్నాయి. అవి కూడా సొంతంగా లేకుండా, న్యూస్ పేపర్లలోనుండి కాపీ చేసేవి. అవి న్యూస్ పేపర్లలోనే చదువుకోవచ్చు. ఆ బ్లాగులవల్ల బ్లాగు సమూహాలలో స్పేస్ వ్యర్దమవుతుందనేదే ఇక్కడ చర్చ . ( నా అభిప్రాయం ).

  71. knmurthy said...

    @Srinivas said...
    March 15, 2012 2:47 PM

    "ఏకీభవిస్తున్నా. జై జై నాయక,తెలుగ్గోడు,జనవిజయం మొదలైనవి విసుగెత్తిస్తున్నాయి."
    @అన్నయ్యగారు....
    మీకు విసుగు పుట్టిస్తున్న బ్లాగులు ఇతరులకు నచ్చుతున్నయేమో మీరు ఎలా చెప్పగలరు ???అంత విసుగు పుట్టిస్తుంటే చూడటం మానేయండి.ఇంతకూ తమరి బ్లాగు ఏమిటో చెబితే మిగతా వాళ్ళు చూసి తమ అభిప్రాయం చెబుతారు.

  72. Paper Tiger said...

    సాఫ్ట్వేర్ అయితే మనతోపాటూ తీసుకు పోలేముకదా నీకునచ్చిన పేరుతో మీరే ఓ వెబ్ సైట్ ప్రారంభించుకోండి ఇప్పుడే ..క్రింది లింకును దర్శించండి

    http://feedcluster.com/

    దీనిలో నా ఆగ్రిగేటర్ కూడా ఉందండోయ్ అది
    http://vennela.feedcluster.com/

  73. పూర్వ ఫల్గుణి (poorva phalguni) said...

    సర్, నేను కూడా మీ లాగే భాదపడ్డాను,కాని ఏమి చెయ్యాలో తెలియలేదు
    ఆలాగే మీరు నా బ్లాగ్ ను కలుపుకోండి. తద్వారా నాకు కూడా బ్లాగర్
    మిత్రుల పరిచయం అవుతుంది

    http://manikyamba.blogspot.in/


    ఇది నాకు నచ్చిన బ్లాగ్



    http://maditalapulu.blogspot.in/

  74. ఎందుకో ? ఏమో ! said...

    Comment part -1

    మొత్తం 74 comment దీనితో కలిపి 75 post ఉద్దేశ్యం ఏమైనప్పటికీ, మళ్ళీ చాలాకాలం తరువాత ఒక మంచి post చదివాను అనిపించింది,
    జీడి పప్పు blog అధివరేన్యా ! అభివాదములు !!
    అందరు face చేస్తున్నా అంశం పై మీ ఈ సమగ్ర స్పందనకు కృతజ్ఞతలు
    దాదాపు అన్ని comments చేసిన వారి మనసుల్లోనూ అసంతృప్తే ఉన్నది,
    ఇవాళ నేను ఈ blog లోకం లో 7 వ నెల లోనికి అడుగుపెడుతున్నాను,
    నా పేరు ఎందుకో? ఏమో! శివ
    నా blog alexa ranking పెంచుకోవాలనే బలీయ మైన కాంక్షతో
    నేను నా blogs posts ద్వారా నా comments ద్వారా నా youtube channel ద్వారా
    చెయ్యని ప్రయత్నం లేదు
    almost అన్ని blogs ని ఒకపరి చూసినట్లే భావిస్తున్నాను
    కొందరి పెద్ద బ్లాగుల్లో తప్ప చాలా బ్లాగుల్లో ఒకటి అరా నా comments కూడా వుంటాయి,
    December రెండవ ఆదివారం జరిగే తెలుగు బ్లాగుల దినోత్సవం కోసం నేను ఒక video రూపొందిద్దామని
    అన్ని బ్లాగుల window (తలుపు) లను తట్టాను,
    అది కొన్నీ మినాహయిస్తే,,,అయితే
    నాకు తెలిసిన సంగతి ఏమంటే,,,,
    blog aggregators లో అన్ని బ్లాగుల వివరాలు రావటం లేదు అని కూలకషం గా చెప్పగలను,
    నేను నా blog ని ఎన్ని మార్లు aggregator లింక్ చేయటానికి ప్రయత్నించిన నా blog ఆ aggrgators లో రాలేదు
    ఒక్క హారం మరియు సంకలిని లలో తప్ప.

  75. ఎందుకో ? ఏమో ! said...

    Comment part - 2


    సరే ! తరలి రాదా తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అని,
    మిన్నకుండి పోయాను,
    నైతికం , సామాజికం, హాస్యం, సంగీతం, సినిమా, టీవీ, న్యూస్, వింతలు, విశేషాలు, విడ్డూరాలు, software కబుర్లు,
    ఇంకా seo టెక్నిక్లు, video లు పాటలు lyrics కూడా నా blog లో ఒక్కో రోజు ఒక్కో special గా మూడు నెలలు గడచిన పిదప
    నా blog 20 వేల page views with in a short period కైవసం చేసుకుంది.
    alexa rankings లో aggregators రంకింగ్ కంటే నాదే best రాంక్.
    almost సంకలిని ని cross చేసేయ్యటం జరిగింది.
    తర్వాత వృత్తి రీత్యా break పడటం
    ఈ లోపు google వాడు blogspot.com ని blogspot.in చెయ్యటం తో నా alexa రాంక్ ని ఒక 10 or 15 రోజుల్లోనే miss చేసుకున్నాను,
    సరే బాగానే ఉంది,
    (((కాస్త self ఎక్కువైందని తెలుసు కాని కొత్త వారికి నన్ను నేను మరింత స్పష్టం గా పరిచయం చేసుకునేందుకు ఇంత self డబ్బా ! తప్పదు !!)))
    నిజానికి అప్పుడు break పడినప్పుడు నింపాదిగా సమీక్షించుకుంటే....
    ఈ blogging అంతా fun oriented basis పైన ఉంది అనిపించింది,
    కాసేపు కాలక్షేపం కోసం అనుకోవటమే ఇందుకు కారణం
    నేను చాల professional blogs ని చూసాను
    అందుకే తదుపరి
    వారిని చూసి inspire అయ్యి నా blog ని complete గా సంస్కరించాను

    నా దృష్టిలో blogging అంటే,
    మనిషితో కాక మనిషి అంతరంగం తో మాట్లాడటం,
    ఏదో post వేశామ? వేరే వాళ్ళ post కి comment పెట్టామా అంటే కుదరదు !

  76. ఎందుకో ? ఏమో ! said...

    Comment part - 3


    మనం ఆ రచయితే ఉద్దేశ్యం తో ఇది post చేసారు,
    తద్వారా తాను ఏమి చెప్పదలచు కున్నారు,
    మనం ఎంత గ్రహించాం?
    ఇందులో మెచ్చుకో దాగిన పాళ్ళు ఎంత?
    దీనిని ఇంకేలాగైనా సవరించ వచ్చా?
    ఇది దేనినైనా ప్రతిబింబించేది లా ఉన్నదా?
    ఇలా ఎన్నో ఎన్నెన్నో రకాలైన
    ముఖములతో ఒక blog post మరియు comment ఆధారపడి ఉన్నవి.
    నిజమే! సమాజం లో జరుగుతున్న సమకాలీన అంశాల పట్ల వార్తల రూపాన వాటి విశ్లేషణ ల రూపాన
    మనో భావాలను వ్యక్త పరచటం మంచి బ్లాగోన్ముఖంగా నైనా సామరస్య ధోరణి లో వ్యక్త పరచాలి కూడా!
    అయితే 10 వేదిక లవ్వటం వలన meeting పలచ బడి పోవుచున్నది.
    ఆధ్యాత్మికం విషయం లోనూ అంతే...
    అప్పట్లో మార్గశిరం వచ్చింది, ప్రతి blog లోను ఇదే ముచ్చట
    అయితే స్వంతం గా రాసేవారు కొందరైతే copy paste మరి కొందరు
    ఏదేమైనా విషయం అందటం ప్రధానం కాని ఇక్కడా పది వేదికలున్నాయి.
    కవితలు కొందరు నిత్యం రాస్తా ఉంటూనే ఉంటారు
    వాటి జోలికి పెద్దగా ఎవరూ పోరు,
    కొందరు అరుదుగా రాస్తారు,
    ఉవ్వెత్తున ప్రశంశల జల్లులో తడుస్తుంటారు ,,,
    అయితే ఇలా అరుదుగా రాసే వారి గురించి అంతగా అందరికీ తెలియదు
    కారణం ఇక్కడ వేదికలు 10 కాదు 100
    కథలు, అనుభవాలు, ముచ్చట్లు నిజమే వీటికి స్వీయ blogs తప్పని సరి,
    కాని కొన్ని
    సామాన్య విషయాల పట్ల సమిష్టిగా కలసి వ్యవహరించాతమే ఈ మొత్తం సమస్యకి పరిష్కారం అవుతుంది,
    http://telugublogreviews.blogspot.in
    ఇది వ్యష్టి blog ఎంత మాత్రము కాదు ఇది సమిష్టి blog
    ఎవరైనా ఇందులో పెద్దలుగా వ్యవహరించి
    ఉన్నతమైన అంశాలను post లను 1000 మందికి తెలిసేలా ఇక్కడ present చేస్తే
    ఇది సమిష్టి blog కావటం చేత
    ఒకేచోట ఏ వర్గం కి కావలసిన అంశం ఆ వర్గం వారు ఎంచుకోవచ్చు
    దానికి తమదైన స్పందన తెలుప వచ్చు మార్పులు చేర్పులు సూచించ వచ్చు
    ఇంకా ఇది శాశ్వత వేదిక కూడాను.

  77. ఎందుకో ? ఏమో ! said...

    Comment part - 4


    so సమిష్టి blog లో కొన్ని వర్గాలను విభజన చేసి

    వార్తలు || సినిమాలు || ఆధ్యాత్మిక౦ || చిట్కాలు || కవితలు || పద్యాలు || కథలు || ముచ్చట్లు || software సంగతులు ||
    రాజకీయాలు || నిజాలు || general knowledge | | వంటలు& ఇల్లాలి చిట్కాలు || blog tips & tricks ||
    Movie reviews || స్వీయానుభవాలు || సామాజిక సమస్యలు చర్చా వేదిక || పాత & కొత్త పాటలు || గ్రంథ పరిచయాలు సమీక్షలు ||
    || business వస్తువోత్పత్తులు విలువలు || vision INDIA దేశం కోసం || కళలు || మధురానుభూతులు || ప్రముఖుల పరిచయ వేదికలు ||
    ఇంకా tv లు || మరియు || blog సమీక్షలు ||


    ఇలా ఇంకా ఎమన్నా ఉంటె అవీను అన్ని వర్గాలుగా విభజించి
    ఏ వర్గానికి ఆవర్గం వారికి వారిలో పెద్ద తరహాలో వ్యవహరించి స్వచ్చందంగా బాధ్యతలు చేపట్టే వారికి ఒక వర్గాన్ని కేటాయించి
    ఆవర్గం తాలూకు post ల సారాంశాన్ని link లను వీలైతే చిన్న size వ్యాసాలను పొందు పరిస్తే బాగుంటుంది.
    నిజంగా విలువున్న అంశం పదిమందికి చేరుతుంది.
    ఇది open blog అందరి blog సమిష్టి blog self agregator
    అన్ని ఉపయుక్తం అయ్యేవే.
    వర్తమాన అంశాలే కాక పోవచ్చు గతం లో మీ బ్లాగుల్లో వచ్చిన మంచి post ల లింక్స్ ను ఇక్కడ ఇవ్వ వచ్చు
    అది 5 యేండ్ల క్రితం నాటిది అయినా సరే !

    బంగారానికి ఎప్పటికీ విలువ వుంటుందీ! వజ్రం ఎప్పటికి నిలిచి ఉంటుంది...

    so ఇలా సమిష్టి blog కి సమిష్టి గా కృషి సల్పితే

    మన అసంతృప్తి నుండీ మనం వేరుపడి
    విలువలు నిండిన అంశాలను ఎన్నెన్నో అనునిత్యం ఆస్వాదన చేయగలుగుతాము

    so ఈ సమిష్టి blog పై అందరూ కూడా ఒక మారు దృష్టి సారిస్తే బాగుంటుందని మనవి.
    అసలు ఒక మారు ప్రారభించి చూస్తే ఆ తరువాత కదా! తెలిసేది practical అవునో కాదో అని !!

    మీ అభిప్రాయాలు తెలుప గలరు

  78. Anonymous said...

    కామెంట్లు ఇలా సీరియల్స్‌లా విడుదల చేయటం అనేది, ఇదే మొదటిసారి చూడటం! బాగుంది. ఈ టెక్నిక్, సీరియల్ బ్లాగర్లను నిలువరించే నాగాస్త్రం అవుతుందనడంలో సందేహం లేదు. :P :))

  79. Zilebi said...

    శంకర్ గారు,

    ఈ పద్ధతి ద్వారా జీడిపప్పు గారు ఈ టపా కి 'ఎవర్' ఫ్రెష్ అండ్ 'గ్రో' మోర్ స్థాయి కలుగ చేస్తున్నా రన్న మాట !


    చీర్స్
    జిలేబి.

  80. చిత్రహేల said...

    Would you please add my blog?

    venneello.wordpress.com

    I don't blog regularly, but post my articles/stories published in various other Telugu magazines.

    Thanks
    -Brahmanandam

  81. చిత్రహేల said...

    There is a typo in the blog name:

    vennello.wordpress.com

    Thx,
    -Brahmanandam

  82. RAMPS said...

    మన తెలుగు బ్లాగు మరియు కామెంట్స్ రూపంలొ వస్తున్న వారి అభిప్రాయలు చాలబాగున్నాయి.

  83. జీడిపప్పు said...

    చిత్రహేల గారు, మీ బ్లాగును జాబితాలో చేర్చాను. మీకు తెలిసిన మంచి బ్లాగులు ఉంటే తెలపండి

  84. Unknown said...

    "can you provide option in the hands of user to hide posts from certain blogs based on cookies to avoid registration and other process"

    ani nenu mail pettaanu admin ki...

  85. Unknown said...

    Excellent posts about making telugu site..
    Hadoop training in hyderabad.All the basic and get the full knowledge of hadoop.Hadoop online training



  86. Anonymous said...

    ప్రతిమనిషికీ ఏదో ఒక బలహీనత ఉన్నట్టే వీలు దొరికినపుడల్లా తెలుగు బ్లాగుల సమాహారాలయిన కూడలి/మాలిక చూడడం నా బలహీనత అనుకుంటాను.informatica training ఒకప్పుడు కూడలికి వస్తే ఎటు చూసినా ఆసక్తికరమయిన టపాలే స్వాగతం పలికేవి.

  87. anirudh said...


    Thanks for the great article this is very useful info thanks for the wonderful post.
    Best Devops Training Institute

Post a Comment