కామెడీ షోలు
Posted by జీడిపప్పు
Bill Cosby Show - ఇది ఇప్పటివరకు నేను చూసిన అత్యద్భుత, అమోఘమైన, ఆరోగ్యకరమైన షో. ఒక్క పరుషమయిన మాట లేకుండా, కించపరిచే లేదా నొప్పించే మాటలు లేకుండా, సకుటుంబసమేతంగా చూడగలిగే హాస్యాన్ని సృష్టించినందుకు బిల్ కాస్బీకి అపర హాస్య బ్రహ్మ అని బిరుదు ఇవ్వవచ్చు. ఈ షో వల్ల చదువుకున్న నల్లజాతీయుల పట్ల మిగతా అమెరికన్ల దృక్పథం కొంతయినా మారిందట. భార్య-భర్తలు, పెద్దలు-పిల్లలు, పెద్దలు-పెద్దలు, పిల్లలు-పెద్దలు ఎలా ఉండాలో ఈ షోలో చెప్పినంత చక్కగా, హాస్యభరితంగా మరి ఏ ఇతర షోలోనూ చెప్పలేదనుకుంటా. ఇది కుటుంబానికి ఎన్‌సైక్లోపీడియా లాంటిది అంటుంటారు. ఈ షో గురించి పూర్తిస్థాయి వ్యాసం వ్రాయవచ్చు.
Everybody Loves Raymond - కాస్బీ షో తర్వాత నాకు బాగా నచ్చే షో ఇది. కుటుంబంలో ఎటువంటి సమస్య వచ్చినా బిల్ కాస్బీ తనదైన శైలిలో సున్నితంగా పరిష్కరిస్తే, రేమండ్ మాత్రం తనదైన పద్దతిలో మరింత సంక్లిష్టం చేస్తాడు. రేమండ్ చేసే తింగరి పనులకు ఘాటుగా స్పందిస్తూ, రేమండ్ ను అమితంగా ప్రేమించే భార్య, తన కొడుకులకు 40 ఏళ్ళు వచ్చినా చిన్న పిల్లల్లా భావిస్తూ, కోడలికి చురకలంటిచే అత్త, ముసలివాడయినా ఏ మాత్రం చురుకుదనం తగ్గకుండా భార్య పైన సెటైర్లు వేసే తండ్రి, పోలీసు ఆఫీసరు అయినా తమ్ముడితో కీచులాడే అన్న, వీళ్ళ మధ్య బొమ్మలాంటి అమ్మాయి, ఇద్దరు కవలలతో ఆద్యంతం కుటుంబంలో గొడవలు, కీచులాటలు, ప్రేమాభిమానాలతో నవ్వించే మరో ఆణిముత్యం ఈ షో.
F.R.I.E.N.D.S - ఇప్పటివరకు వచ్చిన టీవీ షోలలో యువతను ఈ షో కంటే ఎక్కువ ఏదీ ఆకట్టుకొని ఉండదేమో. కలసిమెలసి జీవించే ముగ్గురు యువకులు, ముగ్గురు యువతుల కథ ఇది. ఒక ప్రేమ జంట, ప్రేమించుకున్నా చెప్పుకోని మరో జంట, ప్రేమించడానికి అమ్మాయి దొరకని జోయి, అదో అయోమయం మాలోక ఫీబీ, వీరితో పాటు వచ్చి పోయే బోయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ తో యువత జీవితానికి దర్పణం పడుతుంది. ఒకానొకదశలో ఎవరు ఎవరితో కలుస్తారో తెలియక అయోమయంతో పాటు సాగతీత ఎక్కువయింది.
That 70s Show - ఇది F.R.I.E.N.D.S కు కాస్త అటు-ఇటుగా ఉంటుంది. విస్కాన్సిన్ లో ఉన్న ఒక మధ్య తరగతి కుటుంబంలోని టీనేజ్ కుర్రాడు ఇందులో కథానాయకుడు. పక్కింటి మగరాయుడు అమ్మాయి ఇతడి గర్ల్ ఫ్రెండ్. హీరో తల్లిదండ్రులు దత్తత తీసుకున్న మరొకడు, అదేదో దేశం నుండి వచ్చిన ఇంకో కుర్రాడు, ఇంకో యువ జంట అంతా కలసి బేస్‌మెంట్‌లో మాటలు చెప్పుకుంటూ గడిపేస్తుంటారు. భయస్తుడయిన హీరోను వాళ్ళ నాన్న అనే మాటలు కొన్ని సుత్తి వీరభద్రరావును గుర్తు తెస్తాయి. కథానాయకుడయిన టోఫర్ గ్రేస్ సినిమాల్లోకి వెళ్ళడంతో షో పాపులారిటీ తగ్గి 2006లో షో ముగిసింది. నాకయితే ఫ్రెండ్స్ కంటే ఇందులోనే ఎక్కువ హాస్యం కనిపిస్తుంది.
ఇవి నాకు బాగా నచ్చిన షోలు. కొద్ది రోజులు King of Queens చూసాను కానీ మొనాటనస్ కామెడీ అనిపించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, యావత్ అమెరికా ఏకగ్రీవంగా The greatest show అని నిర్ణయించిన Seinfeld పట్ల ఎందుకో నాకు ఆసక్తి కలగలేదు. ఈసారెపుడయినా ఈ షోను ఒక పట్టు పట్టాలి.
ఇక వర్తమానానికొస్తే - ప్రస్తుత ఏ షో కూడా పైన చెప్పినవాటిలోని హాస్యాన్ని అందించడం లేదు. గత రెండు మూడేళ్ళలో రియాలిటీ షోలు, ట్యాలెంట్ షోలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. దీనివల్లేనేమో హాస్యంలో నాణ్యత తగ్గిపోతున్నది. అయినా అలవాటుపడిన ప్రాణం కాబట్టి కొన్ని కామెడీ షోలు చూస్తున్నాను. ఈ మధ్య నేను రెగ్యులర్‌గా చూస్తున్న షో Everybody Hates Chris. ఈ షోకున్న పెద్ద మైనస్ పాయింట్ క్రిస్ రాక్. క్రిస్ రాక్ అంటే నల్లజాతీయులను కించపరుస్తూ బూతులు మాట్లాడతాడు అని ప్రశస్తి. అటువంటివాడు తీస్తున్న షో ఎలా ఉంటుందో అని చూసాను, ఫరవాలేదు. నల్లజాతీయులను కించపరచడం ఎక్కువ లేదు. ఒక హైస్కూల్ కుర్రాడు ఇంట్లో, స్కూల్లో ఎదుర్కొనే సంఘటనల ఆధారంగా ఈ షో నడుస్తుంది. ప్రతి సెంటూ లెక్క చూసే తండ్రి, పిల్లలను క్రమపద్దతిలో పెంచే తల్లి పాత్రలు ఆకట్టుకుంటాయి.
మరొక అడల్ట్ కామెడీ షో Two and a Half Men కూడా పరవాలేదు. ఒక జల్సారాయుడు, డబ్బుల్లేని అతడి సోదరుడు, మనిషి పెరిగినా బుర్ర పెరగని కుర్రాడు ఒకే ఇంట్లో ఉంటారు. చాలా వరకు రేటెడ్ కామెడీ అయినా చూడవచ్చు. చివరగా, యానిమేషన్ షో అయిన Family Guy - ఇప్పటివరకు ఈ షో ఎదుర్కున్న విమర్శలు మరి ఏ ఇతర యానిమేషన్ షో ఎదుర్కొని ఉండదు. చాలా చీప్ కామెడీ అయినా ఇందులోని స్టీవీ పాత్రను కాసేపు చూస్తే ఈ షోను వదలబుద్ది కాదు. మాటలు రాని ఈ చంటోడు (??!!) ప్రపంచాన్ని మొత్తం తన స్వాధీనంలో ఉంచుకోవాలనుకుంటాడు. వీడి తర్వాత బాగా ఆకట్టుకొనేది మాట్లాడే కుక్క బ్రయన్. ఈ రెండు పాత్రలకోసం చూడవచ్చు ఈ షో.
ఇదన్నమాట సిట్‌కాం ల ప్రసహనం. ఇప్పుడొస్తున్న షోలు మొక్కుబడిగా చూస్తున్నా, 20 నిమిషాలు హాయిగా నవ్వుకోవాలంటే మొదట చెప్పిన కాస్బీ, రేమండ్, ఫ్రెండ్స్, 70s షోలే ఇప్పటికీ శరణ్యం. మళ్ళీ అలాంటి షోలు ఎప్పుడొస్తాయో!
May 5, 2009 at 3:54 AM
Seinfeld is the best. The office is the next best for me.
May 5, 2009 at 4:08 AM
What about "The big bang theory"? This is one of the best intellectual comedy shows I have ever seen.
May 5, 2009 at 6:21 AM
మీరు పరిచయం చేసిన కామెడి షోలలో ఏవన్నా dvd గా లభ్యమవుతున్నాయా?
May 5, 2009 at 7:19 AM
nAku nacchina sitcom - Still Standing. inkoka 20 yrs lo nEnu andulO "bill" lAgA avvalani decide ayyanu. asalu baddakaniki parakAstha vaadu. my idol.
May 5, 2009 at 8:48 AM
మీరు The Simpsons గురించి మర్చి పోయినట్లున్నారు.
May 5, 2009 at 9:06 AM
Full House kooda chaala baavuntundi...
May 5, 2009 at 10:16 AM
Seinfeld, a show about nothing! కాన్సెప్టే కాస్త వింత.. మొదట్లో నాకూ అంత నచ్చలేదు.. ఒకసారి మావారు పట్టుపట్టి 3,4 రోజులు వరుసగా చూపించారు.. అంతే, ఇప్పటికీ రోజూ సాయంత్రం వంట చేసేప్పుడు అదే చూస్తూ చేస్తాను :-)
ఇది కాకుండా నా ఆల్ టైం ఫేవరెట్స్ Everybody loves Raymond, Friends, and Fresh Prince of Bel Air..
and of course, Bill Cosby Show is an exceptional!
May 5, 2009 at 11:12 AM
కాస్బీ షో నంబర్ ఒన్. తరువాత ఫుల్ హౌసు, ఫ్రెండ్స్, ప్రిన్సు అఫ్ బెల్ ఏర్.
May 5, 2009 at 1:38 PM
బిల్ కాస్బీ షో, ఫుల్ హౌస్, ఎవ్రిబడీ లవ్స్ రేమండ్, ఫ్రెష్ ప్రిన్స్ .. నా నాలుగు అభిమాన షోలు. ఫ్రెండ్స్, సైన్‌ఫెల్డ్ ఎంత ప్రయత్నించినా వంటబట్టలా. ఇక ఇప్పుడొచ్చే షోస్ ఏమిటో కూడా తెలీదు. పాత రిపీట్స్‌లో స్టిల్ స్టాండింగ్ కూడా ఓకే.
బిల్ కాస్బీ, ఫుల్ హౌస్‌లు కేవలం కామెడీయే కాకుండా పిల్లల్ని పెంచటమెలాగో నేర్పించే పాఠ్య పుస్తకాలు. ఇక రేమండ్, ఫ్రెష్ ప్రిన్స్‌లు కుటుంబ బంధాలని హైలైట్ చేసేవి. ఆశ్చర్యమేమిటంటే - కుటుంబ విలువల గురించి గొప్పలు చెప్పుకునే మనదేశంలో వచ్చే టీవీ సీరియళ్లన్నీ అక్రమ సంబంధాల చుట్టూనే తిరుగుతుంటాయి!
May 5, 2009 at 7:20 PM
మీరు చెప్పిన వాటితో పాటు నేను Reba, Faith & Hope చూస్తుంటాను. నిజంగా సిట్కాంలు మంచి కాలక్షేపం.
May 5, 2009 at 8:44 PM
Reruns of 'I love Lucy' , Three's company and Golden girls are good too. I love lucy is available as a set of DVDs.
May 5, 2009 at 10:39 PM
అమ్మో, ఫ్రెండ్స్ చాలా మందికి నచ్చుతుందనుకుంటా! నాకు ఎందుకో మరి భలే బోరు. కాస్బీ షో ఇష్టమే! గోల్డెన్ గర్ల్స్ నాకో ఫ్రెండ్ మొత్తం సెట్ DVDలు బహూకరించారు. అది కూడా అప్పుడప్పుడూ వేసుకుని చూస్తాను. ఇంకా జెర్రీ లూయిస్ షో ఎప్పటిదో కానీ నా దగ్గర ఒక set of DVDలు ఉన్నాయి. ఇంకా విప్పి కూడా చూళ్ళేదు. ఎవరన్నా US వెళుతుంటే ఇష్టమైన షోలు, ఇక్కడ దొరకని సినిమాలు DVDలు తెప్పించేస్తూ ఉంటాను.
నాకు బాగా నచ్చిన యానిమేషన్ సినిమా "చికెన్ రన్" DVD ఇక్కడ ఎక్కడా దొరక్కపోవడం ఏంటోమరి! అందులో రూక్ కి మెల్ గిబ్సన్ డబ్బింగ్. భలే ఉంటుంది సినిమా. ఇండియాలో ఎక్కడ దొరుకుతుందో చెప్పండి ఎవరైనా!
May 6, 2009 at 11:34 AM
friends assalu bharinchaleenu neenu. antha OA serial naa life lo chudaleedu. daanikante vijeyandravarma daily chudachu.
May 8, 2009 at 11:28 AM This comment has been removed by the author.