భరతఖండంబు పద్యం - మతగజ్జి కుక్కలు

Posted by జీడిపప్పు

నిన్న మహేష్ గారి బ్లాగులో "భరతఖండంబు చక్కని పాడి ఆవు" పద్యం గురించి కొత్త విషయాలు తెలుసుకున్నాను. మహేష్ గారి మిగిలిన చెత్త పోస్టులలా కాకుండా ఈ పోస్టు ఆలోచింపచేస్తూ నిజాలను వెలుగులోకి తెచ్చేలా ఉంది. "రాముడికి సీత ఏమవుతుంది" లాంటి పోస్టులు వేసి "బ్లాగులోకపు కే ఏ పాల్" అని పేరు తెచ్చుకున్న మహేష్ గారు తన ట్యాలెంట్‌ను ఇలాంటి మంచి పోస్టులకు వినియోగిస్తే ఎంత బాగుంటుందో! ఆ రోజు తొందర్లో రావాలని మహేష్ గారి అభిమానిగా ఆశిస్తున్నా.

సరే, ఇక అసలు విషయానికొస్తే - ఈ పద్యం రాసింది చిలకమర్తివారు అని అందరూ అనుకుంటారు కానీ, నిజానికి ఇది ఆయన రాసింది కాదట, చెన్నాప్రగడ భానుమూర్తి అనే ఆయన రాసిందట. దాదాపు వందేళ్ళ తర్వాత అసలు సంగతి ఆధారాలతో సహా బయటపడింది. ఇది నిజంగా చాలా గొప్పవిషయం. చెన్నాప్రగడ భానుమూర్తికి దక్కవలసిన గుర్తింపు ఇప్పటికయినా దక్కింది. లేకుంటే ఆయన పేరు భావి తరాల వారికి తెలిసేది కాదు.

ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే, ఈ సంగతి దాదాపు "నూరేళ్ళ" తర్వాత బయటపడింది. 1910 ప్రాంతంలో ఈ పద్యం పాడని ఆంధ్రులు లేరు. ప్రతి ఒక్కరూ ఈ పద్యం పాడుకొని తమలోని దేశాభిమానాన్ని పెంచుకొనేవారు. మరి అప్పుడే చెన్నాప్రగడ వారు ఎందుకు నిజాన్ని బయటపెట్టలేదు? ఆ సంగతి నలుగురికీ చెప్పి చిలకమర్తివారికి దక్కాల్సిన ఖ్యాతిని ఎందుకు దక్కించుకోలేదు? అన్న ప్రశ్నలు ఉదయించకమానవు. దీని వెనుక ఆసక్తికరమయిన నిజాలు ఉన్నాయి.

నిజానికి చెన్నాప్రగడ వారూ, చిలకమర్తివారూ ఇద్దరూ మంచి మిత్రులు. కానీ చిలకమర్తివారు తన రచనా సామర్థ్యంతో అనతికాలంలో గొప్ప పేరు తెచ్చుకొని ధనవంతుడయ్యాడు. ఒకసారి చెన్నాప్రగడ గారు 'భరతఖండంబు" పద్యం వ్రాసి అభిప్రాయం చెప్పమని చిలకమర్తివారికి చూపించారు. ఆ పద్యం విలువ తెలుసుకున్న చిలకమర్తివారు ఆ పద్యాన్ని జూదంలో పందెంగా పెట్టమని చెన్నాప్రగడ వారిని బలవంత పెట్టి మోసపూరితంగా ఆ పద్యాన్ని సొంతం చేసుకున్నారు.

మోసాన్ని మోసంతో జయించాలన్న చెన్నాప్రగడగారు ఆ పద్యాన్ని "భారత ధర్మ దర్శనం" అనే పుస్తకంలో ఇరికించి మొత్తం 875 పుస్తకాల ప్రతులను అచ్చువేయించారు. ఈ పుస్తకం జనాల్లోకి వెళ్ళి అందరూ ఆ పద్యం చిలకమర్తివారు వ్రాసింది కాదు అని తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఇది సహించలేని చిలకమర్తివారు మెరికల్లాంటి గూండాల ద్వారా ఆ పుస్తకాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టాడు. అచ్చయి ఉన్న పుస్తకాల్లో 874 పుస్తకాలను స్వాధీనం చేసుకొని అన్నీ తగులబెట్టాడు. ఒక్కటి మాత్రం ఎంత ప్రయత్నించినా దొరక లేదు. చిలకమర్తి వారి కుట్ర తెలుసుకున్న ఒకడు ఆ పుస్తకం తీసుకొని కుటుంబంతో సహా రంగం (బర్మా) పారిపోయాడు. చిలకమర్తివారు తన గూఢచారులతో ఎంత వెతికించినా ఆ చివరి పుస్తకాన్ని కనుక్కోలేకపొయారు.

తనకున్న అర్థబలం, అంగబలంతో చెన్నాప్రగడ గారికి ప్రాణహాని తలపెడతానని భయపెట్టడంతో ఆయన ఆ పద్యం తానే రాసానన్న సంగతి ఎప్పటికీ బయట పెట్టలేదు. అసలు సంగతి తెలిసిన కొందరు చెన్నాప్రగడ గారిని నిజం బయటపెట్టమన్నా ఆయన పెట్టకపోవడానికి కారణం ప్రాణభయమే. ఆ దొరకని ఒక్క పుస్తకం దొరకడం వల్ల నూరేళ్ళ తర్వాత అసలు నిజం బయటపడింది. ఇప్పటికయినా మన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఈ పద్యం ద్వారా చిలకమర్తివారు సంపాదించిన కీర్తిని, ధనాన్ని రద్దు చేసి చెన్నాప్రగడ వారికి ఆ కీర్తి, ధనం దక్కేలా చేయాలి.

మహేష్ గారు ఈ గొప్ప నిజాన్ని పరిచయం చేయడంతో పాటు "ఈ వివాదానికి తోడు ఈ పద్యంలో మతప్రస్తావనా, కులప్రస్తావనా ఉండటంవల్ల మరోవివాదం రగలకుండా ఉంటే అంతే చాలు." అని కూడా అన్నారు. ఇది అక్షర సత్యం. చిలకమర్తివారి పైన చర్య తీసుకోవడం కంటే ఈ పద్యం వల్ల మతకల్లోలాలు, కుల ఘర్షణలు తలెత్తకుండా చూడాలి.

అందరూ మహేష్ గారిలా వివాదం రగలకూడదు అని కోరుకొనేవాళ్ళు కాదుగా! కొందరు మతగజ్జి రోగులు ఉంటారు. వీరివల్లే అసలు ముప్పు. నూరేళ్ళుగా ఎన్నడూ ఎవరికీ కనిపించని కుల, మత విషయాలు ఈ గజ్జి కుక్కలకు కనిపిస్తాయి. ఈ కుక్కలకు కేవలం మతగజ్జే కాకుండా కులగజ్జి కూడా ఉండడం వల్ల వీటిని దూరంగా ఉంచాలి. లేకపోతే "ఆ ఏముంది, ఇది మంచి దేశభక్తి పద్యం" అనే వాళ్ళను కూడా "లేదు, సరిగా చూడు, ఇందులో కుల, మత ప్రస్తావన ఉంది" అంటూ విషబీజాలు నాటి తమకున్న గజ్జిని మనుషులకు కూడా అంటిస్తాయి.

ఏది ఏమనయిప్పటికీ, చిలకమర్తివారు ఈ పద్యం ద్వారా సంపాదించుకున్న కీర్తిని రద్దు చేసి, చెన్నాప్రగడ గారికి దక్కవలసిన పేరును దక్కించి, అలాగే ఈ మతగజ్జి కుక్కలను తరిమికొట్టే విధంగా రాబోవు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని ఆశిద్దాం.

47 comments:

 1. Varunudu said...

  హవ్వ... హవ్వ.. !

 2. కత్తి మహేష్ కుమార్ said...

  నేను బ్లాగు రాసేది నాకోసం. నేను అనుకున్నవి,తెలుసుకున్నవి,ఆలోచించినవి రాసుకోవడానికి. ఇందులో ఎవరికో ఉపయోగపడాలనే ఆశయం లేదు. ఆ ఆలోచనా లేదు. మీకు నచ్చేలా రాయడానికో లేక మరికొంతమందిని వ్యతిరేకించడానికో రాయాలనుకున్న క్షణాన నా వ్యక్తిత్వానికి విలువలేదు. మీ అభిమానానికి కృతజ్ఞుడ్ని. కానీ మీ అభిమానంకన్నా నాకు నేను ముఖ్యం.

  ఇక పద్యం గురించి. 5 మే,2009 (రాజమండ్రి నుంచీ వెలువడే)ప్రజాపత్రిక చూడండి. అందులో ఈ పద్యంలో గొల్ల కులస్తుల్ని తెల్లవాళ్ళతో పోలుస్తూ అవమానించారని ఈ పద్యాన్ని నిజానికి బ్యాన్ చెయ్యాలని రాశారు.

 3. అశోక్ said...

  నాకు ఈ పద్యం లో కుల మత ప్రస్తావన ఎక్కడ వచిందో అర్ధం కాలేదు.. కొంచెం వివరిస్తారా.. లేకుంటే పాల్ గారినే అడగాల? :-)

 4. అశోక్ said...

  వార్ని! మహేష్ యు you are sick man.. .. నిన్ను వదిలితే భారత మాత అని మగవాళ్ళని ఇన్సుల్త్ చేసారు.. భారత పురుషుడు అని చేయాలి అని గొడవ లేపిన లేపుతావు..

 5. Shashank said...

  బుడుగు - రచ్చ. ఈ పద్యం వెనక ఇంత కుట్ర ఉందని ఇప్పుడే తెలిసింది. నేర్లు.

  @ మహేష్ గారు - అయితే ఈ పద్యం దెఫినెట్ గా బ్యాన్ చేయాల్సిందే. వాళ్ళ వోట్లు పోవు లేకుంటే?

  @అశోక్ గారు - హహహ. భారతపురుషుడు హహహ భలే భలే. ఇంక అలనే పిలుద్దాం.

 6. కత్తి మహేష్ కుమార్ said...

  @అశోక్: కనీసం వ్యాఖ్యని పూర్తిగా చదివి మాట్లాడు. ఎక్కడ అన్నారో చెబితేకూడా నీ వాగుడు నీదేకదా! Who is sick man here? you or me!

 7. కత్తి మహేష్ కుమార్ said...

  @జీడిపప్పు: చెన్నప్రగడ గారు 1910 లో ప్రభుత్వోద్యోగంలో చేరారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తూ ప్రభుత్వంలో మనడం కష్టం అందుకోసంకూడా వారు ఊరకుండి ఉండొచ్చు.

  మీ వ్యాసంలోని శ్లేష నాకు అర్థమయ్యింది.కానీ rhetoric కన్నా విషయానికి నేను ప్రాధాన్యత ఇస్తానన్నది మీకెప్పుడర్థమవుతుందో అప్పుడే నా ఉద్దేశాలు మీకు అవగతమవుతాయని ఆశిస్తాను.

 8. Anonymous said...

  ఆ పద్యానికి ఇంత చరిత్ర ఉందా! TQ for the info.

 9. అశోక్ said...

  @కత్తి మహేష్ కుమార్
  హ హ హ.. ఎవరు సిక్కో నీకు ఇంకా అర్ధం కాలేదా.. ఐ పిటి యు మాన్.. మొత్తానికి మంచి పేరు సంపదిచావు.. K A PAUL అని..

  ప్రతి ఒక్క విషయం లో కులం మతం అని విషం కక్కేది ఎవరో బ్లాగ్ లోకంలో మొత్తానికి తెలుసు.. నాటకాలు కట్టి పెట్టు..

 10. రాజ మల్లేశ్వర్ కొల్లి said...

  స్వాతంత్ర్యోద్యమ కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన పద్యం వెనుక ఉన్న అసలు కధ ని వెలుగులోకి తెచ్చిన (బ్లాగుల్లో) కత్తి గారికి, జీడిపప్పు గారికి అభినందనలు.

  అంటే..., చిలకమర్తి వారు రౌడీ కవన్న మాట..!

  ఒకవేళ చెన్నాప్రగడ వారు దళితులు గా పిలవబడుతున్న కులానికి చెందినవారైతే..., ఇంకెంత రచ్చ జరిగేదో..!!

 11. Icanoclast said...

  హ్మ్.... ఇంత కధుందా.. ఏదో మాంచి ధ్రిల్లర్ సిన్మాలా వుంది మొత్తానికి.

 12. Krishna said...

  ఆ ఏముంది, S.C./S.T. act క్రింద చిలకమర్తి వారిమీద ఓ కేస్ పెట్టి ఉండేవారు. చనిపోయినవాళ్ల మీద కూడా కేసులు S.C./S.T. లు పెట్టవచ్చు అని, దానికి తగ్గట్టుగా పార్లమెంట్ లో, ఓ తీర్మానం కూడా గెలుస్తే తీర్మానం చేస్తాం అని మన రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేసేవి.

 13. బొల్లోజు బాబా said...

  జీడిపప్పుగారూ
  మీరు వ్రాసినదానికి (పుస్తకాలను నాశనం చేయటం) ఏమైనా రిఫరెన్సెస్ ఉన్నాయా? లేక స్వకపోల కల్పితమా? ఏమైనా ఆధారాలున్నట్లయితే దయచేసి ఉటంకించండి. ఇలా ఎక్కడ చెప్పబడిందో, ఎవరుచెప్పారో వగైరాలు. ఎందుకంటే ఈ విషయంపట్ల ఫష్ట్ హాండ్ సమాచారం అందించేవాళ్లు బతికి ఉండే అవకాసం లేదు కనుక.
  ఒక వేళ ఇది మీ స్వీయకపోల కల్పితమే అయినట్లయితే, i can pity you for your bad taste, sorry.

  i am extremely sorry for it.

 14. బుజ్జి said...

  మీరు శ్లేష king అసలు.. superrrrr

 15. Shashank said...

  @రాజ మల్లేశ్వర గారు - ఒక వేళ అతడు దళితుడు అయ్యింటే ఇప్పటికి ఆంధ్ర దేశం లో చాలా చోట్ల ధర్నాలు నిరాహార దీక్షలు మంద కృష్ణ జరిగి ఉండేవి.

  @కృష్ణ - చనిపోయిన వాళ్ళ మీద కేసా? ఏం సాధిస్తారు ? వాళ్ళ ఫోటో ని జైలు లొ పెడతారా?

 16. జయహొ said...
  This comment has been removed by the author.
 17. జయహొ said...

  మీకు మహేష్ కు మధ్య ఎమైనా అవగాహన ఉందా? ఆయన రాసిన పిచ్చి లాజిక్ టపాలను మీరు పొగటటం నేను చాలా సార్లు గమనించాను. జీడిపప్పు ని పట్టుకొని బాడ్ టెస్ట్ అని అనుంటున్నరు. ఇన్ని పద్యాలు రాసే మిలాంటి వారికి ఆయాన వ్యగ్యంగా రాశాడు అని తెలుసు కోలేని అమాయకులా మీరు?

 18. బొల్లోజు బాబా said...

  జయహో గారికి

  నేననేది అదే. ఆయన వ్యంగ్యంగా వ్రాసినట్టు ఎక్కడ చెప్పారు?
  టపా అంతా సీరియస్ గా అదేదో ఈయన పెద్ద రీసర్చ్ చేసినట్లు చెపుతూంటే.

  ఒక వేళ ఇది వ్యంగ్యమే అయినట్లయితే అది కారక్టర్ అస్సాసినేషను కాదా? అదీ ఎప్పుడో చనిపోయిన ఓ పెద్దమనిషిగురించి. (ఆయన రచన ఈ ఒక్క పద్యంతోనే అంతం కాలేదుగా).

  నిజంగా వ్యంగ్యమే అయితే ఆ తరువాత వచ్చిన కొన్ని కామెంట్లు ఆ ఉదంతాన్ని నమ్ముతూ/నిజంచేస్తూ లేవా?
  ఉదా: హ్మ్.... ఇంత కధుందా.. ఏదో మాంచి ధ్రిల్లర్ సిన్మాలా వుంది మొత్తానికి. వంటివి.

  ఇవన్నీ గుడ్ టేస్ట్ ఉన్నవారు చేసే విషయాలు కావు.

  ఇక మహేష్ కూ నాకూ ఏముందో మీరు అనలైజ్ చేయాల్సిన అవసరమైతే లేదులెండి.

  బహుసా నేను అమాయకుడినేనేమోలెండి.
  ఏదో పాపం పెద్దాయన్ని బద్నాం చేస్తున్నట్లు అనిపిస్తే నోరుజారాను.

  థాంక్యూ
  బొల్లోజు బాబా

 19. Ashok said...

  @ బొల్లోజు బాబా
  ఎవరిని బదనం చేసినట్లు మీకు అనిపిస్తుంది మీకు?
  నేను విన్న రూమర్ ఏంటంటే జీడిపప్పు గారికి ఈ కధ మొత్తం K A Paul కి చిలకమర్తి గారి మోసం గురించి చెప్పిన వాళ్ళే చెప్పారట..
  @జీడిపప్పు
  అవునండి నాకు ఇంకొక సందేహం.. ఆ మిగిలిన ఒక్క పుస్తకం తీసుకుని బర్మా పారిపోయిన వాడు మహేష్ స్నేహితుడా ఏంటి? ఇన్నాళ్ళ తరువాత ఆ పుస్తకాన్ని బయట పెట్టి చెన్నాప్రగడ వారి కీర్తి ని వ్యాపింప చేయమని అడిగారా ఏంటి? :-)

  నాకు ఏంటో తెగ సందేహాలు వస్తున్నాయ్.. చెన్నాప్రగడ గారు దళితులేమో .. అల అయితే దళితులను అనగగోక్కుతున్న అగ్రవర్ణాలు అని పాల్ దగ్గరనుంచి ఇంకొక కామెడీ పోస్ట్ ఎక్ష్పెక్త్ చేయోచు.. :-)

 20. బొల్లోజు బాబా said...

  నేను బద్నాం అన్నమాట చిలకమర్తివారిని ఉద్దేసించినది. అయ్యా?

  ఈ వివాదం పూర్వాపరాలు, వాద ప్రతివాదనలు ఆంధ్రజ్యోతి వివిధలో రెండునెలలక్రితం నడిచినవి. ఇదేదో మహేష్ కనిపెట్టిన విషయమని మీరనుకొంటున్నారేమో.
  నిజానికి ఈ రగడ (భరతఖండంబు చక్కని పాడియావు అన్న గీతం ఎవరిదనేవిషయం) పంతొమ్మిది వందల అరవైలలోనే మొదలయ్యింది. కానీ ఎందుకో అంతగా ప్రచారం లభించలేదట అప్పట్లో. ఇప్పుడు

  మీడియా పెరగటంవల్ల బాగా లైమ్ లైట్ లోకి వచ్చింది.
  అప్పుడెవరూ ఇలా ముద్రించిన పుస్తకాలను గూండాలతో వెనక్కి రప్పించినట్లుగానూ, ఆ నిజ గీతకర్త ప్రాణ భయంతో నోరువిప్పనట్లుగానూ ఎవరూ చెప్పటం చదవలేదు. అందుకనే ఆ వాదనకు సోర్సెస్ ఏమైనా ఉన్నాయా అని అడిగాను.

  మరొక్కసారి చదవండి ఈ వ్యాసాన్ని. ఒక పెద్దమనిషిని, ఎప్పుడో చచ్చిపోయిన మనిషి యొక్క గౌరవాన్ని కించపరిచేట్లు లేదూ? ఆయనను ఒక గూడాతోను, అవసరమైతే హత్యలు చేయగలిగేంత కౄరునిగానూ చిత్రించటం దారుణం.

  పై వ్యాసం నిజంగా వ్యంగ్యమే అయితే,ఆ విషయాలను ఇప్పటికీ నేను బేడ్ టేస్ట్ గానే అనుకొంటున్నాను.

  ఆ పై మీ ఇష్టం.

  ఇక దీనికి కులాల రంగు అద్దాలని ప్రయత్నించటం ఎంతవరకూ సమంజసమో మీ విజ్ఞతకే వదిలివేస్తున్నాను..


  బొల్లోజు బాబా

 21. Ashok said...

  @బొల్లోజు బాబా ఒక్కసారి టప మొత్తం చదవండి సారు:
  "ఈ వివాదానికి తోడు ఈ పద్యంలో మతప్రస్తావనా, కులప్రస్తావనా ఉండటంవల్ల మరోవివాదం రగలకుండా ఉంటే అంతే చాలు." ఒక వేల ఎవరికన్నా ఆ ఆలోచన రాకపోయినా గుర్తు చేసే ఆ వాక్యం మహేష్ పోస్ట్ లో అవసరమా?
  అసలు ఆ టప వుద్దేశం ఏంటి? ఆంధ్రజ్యోతి లో ఆ వివాదానికి ఎక్కువ ప్రచారం రాలేదు కాబట్టి వీడు (పాల్) ఒక పోస్ట్ రాసి ప్రచారం తెద్దాం అనుకున్తున్నదా?
  భరత ఖండంపు పోస్ట్ తో తను ఏమి సాదిచాలి అనుకున్తున్నదో మీకు తెలిస్తే చెప్పండి విని తరిస్తాం... మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నంటే ఓ తెగ గింజుకుంటున్నారు కదా మహేష్ గురించి..

 22. Ashok said...

  @బొల్లోజు బాబా ఇక దీనికి కులాల రంగు అద్దాలని ప్రయత్నించటం ఎంతవరకూ సమంజసమో మీ విజ్ఞతకే వదిలివేస్తున్నాను..

  అంత దూల వున మనిషి ఒకరే ఒకరు వున్నారు తెలుగు బ్లాగుల్లో ఆటను ఎవరో అందరకి తెలుసు .. The one and only.... పేరు మీకు తెలుసులే...

 23. బొల్లోజు బాబా said...

  మరొక్క విషయం
  పాపం చిలకమర్తి వారు కూడా నిజానికి గీత చౌర్యం చేయలేదనే ఒక వాదన ఉంది.
  ఆయన తన ఆత్మకధలో, ఈ గీతం గురించి ప్రస్తావించవలసివచ్చినపుడు, తాను జ్ఞాపకం తెచ్చుకొని స్టేజి మీద చెప్పానని అంటారు తప్ప ఆశువుగా అల్లానని అనలేదు. అది వారి నిజాయితీ.
  చిలకమర్తి వారి మరణం తరువాత ఆ గీతకర్త్రుత్వం ఆయనకు ఆపదింపబడటం జరిగింది.

  అలానే చెన్నాప్రగడవారు కూడా తాను జీవించిన రోజుల్లో (ఈయన చిలకమర్చివారి మరణించినతరువాత కూడా జీవించారు) ఆ గీతం నాదని వాదించుకోలేదు. లేదా బహుసా ఈ గీతం అప్పటికే ఈయనపేరుతో ప్రచురింపబడిన సంగతి తెలియకపోవచ్చు. లేదా ప్రభుత్వోద్యోగి కనుక ఎందుకులే రాజ ధిక్కారం అనుకొని ఉండవచ్చు. కారణాలు ఏమైనా ఈయన ఆ గీతకర్తగా తన జీవితకాలంలో గుర్తింపు పొందలేకపోయాడు.

  తరువాత తరువాత, ఇదే గీతం ఒక పత్రికలో చెన్నాప్రగడవారిపేరుపై ప్రచురింపబడినవిషయం, (చిలకమర్తివారు సభలో చదవటానికి ముందు డేటుతో) పంతొమ్మిది వందల అరవైలలో (అప్పటికే ఇద్దరూ పోయారు) బయటపడి ఈ వివాదం ఈ నాటికి ఒకకొలిక్కి వచ్చినట్టే అనిపిస్తుంది.
  అదీ ఈ గీతం గురించి జరిగిన సంగతి.


  ఈ వివాదం పట్ల కొద్దో గొప్పో తెలుసున్న వాడిని కనుక, అయ్యా ఇదేమి వింత మాటలు. ఇలా వ్రాయటం నాకు అన్యాయం గా అనిపిస్తున్నది. ఈ మాటలకు ఏమైనా ఆధారాలున్నాయా అని అడగటం నా తప్పయిపోయినట్లున్నది మీకందరకూ. అమాయకునిలా కనిపిస్తున్నాను కూడాను. కదూ

  ఇందులో పాపపుణ్యాలు మీరే ఆలోచించుకోండి

  బొల్లోజు బాబా

 24. బొల్లోజు బాబా said...

  @అశోక్
  మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నంటే ఓ తెగ గింజుకుంటున్నారు కదా మహేష్ గురించి..

  నేనెవరి తరపున మాట్లాడుతున్నానన్నది ఇప్పటికీ గ్రహింపుకు రాకపోతే నేనేం చేయలేను.

 25. Ashok said...

  @బొల్లోజు బాబా:
  ఈ ముక్క మహేష్ పోస్ట్ లోనే చెప్పి వుంటే ఇంత రచ్చ జరిగేది కాదు... మహేష్ గడు ఏదో చిలకముర్తి వారు వేరే వాళ్ళు రాసిన పద్యాన్ని కొట్టేసి పేరు తెచుకున్నారు అన్నట్లు మాట్లాడడు కదా...
  Thx ఫర్ ది ఇన్ఫర్మేషన్...

 26. జీడిపప్పు said...

  @ వరుణుడు గారు - :)

  @ మహేష్ గారు - "అందులో ఈ పద్యంలో గొల్ల కులస్తుల్ని తెల్లవాళ్ళతో పోలుస్తూ అవమానించారని ఈ పద్యాన్ని నిజానికి బ్యాన్ చెయ్యాలని రాశారు." అన్నారు. మీరు ఈ పద్యం గురించి చెప్తున్నపుడు "వందేళ్ళుగా ఎవరికీ కనిపించని కుల ప్రస్తావన ఈరోజు కొన్ని కులగజ్జి ఉన్న కుక్కలకు కనిపించిండం శోచనీయం" అని చెప్పాలా లేక "ఇందులో కుల ప్రస్తావన ఉంది" అని చెప్పాలా?
  ఆ తర్వాత "బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తూ ప్రభుత్వంలో మనడం కష్టం అందుకోసంకూడా వారు ఊరకుండి ఉండొచ్చు." అన్నారు. మరి బ్రిటీష్ ప్రభుత్వం వెళ్ళిపోయాక ఏమి చేసాడో తెలియదా?

  @ అశోక్ గారు - బాగా కుల గజ్జి ఉన్న వాళ్ళను అడగండి, పాల్ గారిని అడిగినా ఉపయోగం ఉంటుందేమో!!

  @ శశాంక్ - నిజమే, బ్యాన్ చేయాలి :)

  @ అంతర్యానం గారు - :)

  @ రాజ మల్లేశ్వర్ గారు - ఇప్పటికే కొన్ని కుల గజ్జి కుక్కలు ఆ పనిలో ఉన్నాయి, రచ్చ జరపడానికి తహతహలాడుతూ

  @ Icanoclast - మరి నేను స్టోరీ రైటర్ అయితే ఆ మాత్రం ఉండాలి కదా!!

  @ క్రిష్ణ గారు - హ హ్హ హ్హా భలే చెప్పారు. వచ్చే ఎలక్షన్లలో గొల్లవారి ఓట్లకోసం ఆ పని పోటీలుపడి చేస్తారు చూడండి.

  @ బుజ్జి గారు - హ హ్హ హ్హా :)

  @ జయహో గారు - బొల్లోజు బాబాగారు ఎంత అమాయకులో తెలియదా :)

  @ అశోక్ గారు - ఆ పుస్తకం తీసుకొని వెళ్ళినవాడు కే ఏ పాల్ గారి స్నేహితుడు కాదు. కనుక్కోండి చూద్దాం :)

 27. జీడిపప్పు said...

  బొల్లోజు బాబా గారు - నేను రాసింది వ్యంగ్యమో, నిజమో మీకు తెలియలేదన్నమాట. మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షమాపణలు చెప్పడానికి అభ్యంతరం లేదు కానీ అందుకు మీరు అర్హులు కారు అనుకుంటున్నా కాబట్టి ఇప్పుడే చెప్పడం లేదు. మీరు అర్హులు కారు అని ఎందుకన్నానంటారా?

  చనిపోయిన వారి గురించి నేను అలా అన్నానని bad taste అన్నారు. చాలా బాగుంది.
  మరి మహేష్ గారి బ్లాగులో మీ కామెంట్ ఏమిటి? నిజాయితీగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి:
  ఈ పద్యం మీరు ఇంతకు ముందు విన్నపుడు మీకు అందులో కుల, మత ప్రస్తావన ఉన్నట్టు, ఈ పద్యం ఒక కులం వారిని కించపరుస్తున్నట్టు అనిపించిందా? నాకయితే ఎప్పుడూ అలా అనిపించలేదు. కేవలం మత,కుల గజ్జికుక్కలకే అలా అనిపిస్తుంది అని నా నమ్మకం.

  మీ సమాధానం అవును అయితే, పైన చెప్పిన క్షమాపణ ఇపుడు చెప్తున్నా. మీ సమాధానం కాదు అయితే;
  మహేష్ గారి బ్లాగులో మహేష్ గారు "మతప్రస్తావనా, కులప్రస్తావనా ఉండటంవల్ల" అన్నారు. అది చూసిన మీరు "మహేష్ గారు, ఇందులో కుల ప్రస్తావన లేదు, మత ప్రస్తావన లేదు. వందేళ్ళుగా ఎవరికీ ఆ ఆలోచన రాలేదు. ఈ రోజు కొన్ని మతోన్మాద, కులగజ్జి ఉన్న కుక్కలు మిగతావారిని రెచ్చకొట్టడానికి, వాటి గజ్జి తీర్చుకోవడానికి అలా మొరుగుతున్నాయి. ఆ కుక్కలకు మీరు పబ్లిసిటీ ఇవ్వడం బాగలేదు. bad taste" అని ఉండాలి కదా? కానీ అక్కడ మీరు అలా అనలేదు!

  ఏమంటారు బొల్లోజు బాబా గారు?

 28. కత్తి మహేష్ కుమార్ said...

  @జీడిపప్పు: మీ వాదన చూస్తుంటే "పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చే" అనే సామెత గుర్తొస్తోంది.నా బ్లాగులో నేను చేసింది పుస్తక పరిచయం. ఆ పుస్తకం కొని చదివితే మీకు ఆధారాలతో సహా నిరూపించబడిన పరిశోధన దొరుకుతుంది. కులమత వివాదాలు నేను ఆశించేవి కావు. కానీ ఈ పద్యంపై ఇలాంటి వివాదం ఒకటి తయారయ్యింది కాబట్టి అలా జరక్కూడదని కోరుకున్నాను. ఇందులో మీకు కనిపించిన "గజ్జి" మీ మనసులోనిదే అని గ్రహించగలరు.

  మత/కులగజ్జి నాది కాదు మీది. ఈ విషయం కొంత ఆత్మ పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది. ఒకవేళ ఆత్మ అనేది ఒకటి ఏడిస్తేనే సుమా! లేకపోతే శ్ర వృధా.

 29. జీడిపప్పు said...

  చాలా బాగా చెప్పారు మహేష్ గారు, మత/కుల గజ్జి ఉన్న కుక్క గురించి.

  Enjoy your ignorance.

 30. బొల్లోజు బాబా said...

  జీడిపప్పు గారు
  నేనేదో మహేష్ గారి బ్లాగులో పెట్టిన కామెంటును ఇక్కడ ఉంచుతున్నాను. ఏ విషయం చుట్టు మాత్రమే నా ఆలోచనలు తిరిగుతున్నాయో ఆలోచించుకోండి.


  "అవును దీని గురించి ఈ మధ్య పేపర్లలో వాదోపవాదాలు చదివాను.
  చెన్నాప్రగడవారి వైపు వాదనే బలంగా వినిపిస్తుంది."


  ఇక మీరు వ్రాసింది వ్యంగ్యమో, నిజమో తెలుసుకొనేంత తెలివితేటలు నాకు లేకపోవటం నా దురదృష్టం.
  ఒక మంచి సాహితీ కారుడని (ఆయన అవునో కాదో తెలుగు వికీ లో ఆయనపై వ్యాసం చదవండి), మంచి సంఘసంస్కర్త, ఎన్నోగ్రంధాలు వ్రాసి పేరుతెచ్చుకొన్న మంచి వ్యక్తిని పట్టుకొని, రౌడి కవి, గూండా రచయితా, మంచి త్రిల్లింగు గా ఉంది అంటూ వాక్యానించటం చూసి మనసు చివుక్కుమని, నాకు తెలిసిన విషయాలు పంచుకొన్నానే/అది తప్పని ఆయన అటువంటి వ్యక్తి కారు అని చెప్పప్రయత్నించానే తప్ప ఇందులో నాకే ఇతర ప్రయోజనాలనీ ఆశించలేదు.

  అలా మీరు అనుకోవటం పట్ల ఇప్పుడు నిజంగా i really pity you
  for your ignorance or acting ignorance.

 31. జీడిపప్పు said...

  దీనికి కులా,మత రంగు అద్దాలని, నూరేళ్ళుగా ఎవరికీ తట్టని ఆలోచనలన విషబీజాలు నాటాలని ఎవరు ప్రయత్నిస్తున్నారో తెలుసా మీకు?
  నా పోస్టు కింద మీ కామెంటు:
  ఇక దీనికి కులాల రంగు అద్దాలని ప్రయత్నించటం ఎంతవరకూ సమంజసమో మీ విజ్ఞతకే వదిలివేస్తున్నాను..
  బొల్లోజు బాబా

  ఈ మాట అక్కడ స్పురించలేదా? కేవలం నా పోస్టు చూసినపుడే కులం గురించి మతం గురించి కనపడిందా?

  i really pity you for your ignorance

 32. బొల్లోజు బాబా said...

  ఇక దీనికి కులాల రంగు అద్దాలని ప్రయత్నించటం ఎంతవరకూ సమంజసమో మీ విజ్ఞతకే వదిలివేస్తున్నాను..

 33. బొల్లోజు బాబా said...

  ఒకవేళ చెన్నాప్రగడ వారు దళితులు గా పిలవబడుతున్న కులానికి చెందినవారైతే..., ఇంకెంత రచ్చ జరిగేదో..!!

  నాకు ఏంటో తెగ సందేహాలు వస్తున్నాయ్.. చెన్నాప్రగడ గారు దళితులేమో .. అల అయితే దళితులను అనగగోక్కుతున్న అగ్రవర్ణాలు


  whats the hell is this ????????

 34. బొల్లోజు బాబా said...

  it is nothing but perverted casteist descrimination against intellectual abilities of the backward communities.

 35. Malakpet Rowdy said...

  Whoa Jeedipappu garu! Mee Satire "Adurs!!!!"

 36. కత్తి మహేష్ కుమార్ said...

  @బాబాగారు: బ్లాగు లోకం మన బయటి ప్రపంచానికి మరో రూపం ఇక్కడా ఇవి తప్పవు. నిజానికి చదువుకున్న ఇలాంటి section లోనే prejudice లు ఎక్కువ. తప్పదు.

 37. కత్తి మహేష్ కుమార్ said...

  భరతఖండంబు చక్కని పాడియావు
  హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
  దెల్లవారను గడుసరి గొల్లవారు
  పితుకుచున్నారు మూతులు బిగియగట్టి

  స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించిన ‘తేటగీతి’ ఇది. 1907 రాజమండ్రి లో బిపిన్ చంద్రపాల్ గారి వందేమాతర ఉద్యమ ప్రచార సభలో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ఈ పద్యం చెప్పగా విశేషస్పందన వచ్చింది. ఆయన మనసులో ఊహించుకుని చెప్పినట్లు చెప్పడం వల్ల ఇది అశువుగా చెప్పిన పద్యమనుకుని ఇప్పటివరకూ చాలా మంది సాహితీవేత్తలు, విమర్శకులు, పరిశోధన కర్తలు అది చిలకమర్తిగారి పద్యమనే అనుకుంటున్నారు. ఈ పద్యం తొలిదేశభక్తి కవితగా కూడా ప్రసిద్ధి చెందింది. తద్వారా చిలమర్తివారు తొలిజాతీయోద్యమ కవి అయ్యారు.

  1968 లో చిలకమర్తివారి శతజయంతి జరిగినప్పటి నుండీ ఈ పద్యం విషయంలో కొన్ని సందేహాలు తలెత్తాయి. ఇప్పుడు దాదాపు వందసంవత్సరాల తరువాత ఈ పద్యం 1905 లో చెన్నాప్రగడ భానుమూర్తి గారు రాసిన ‘భారత ధర్మదర్శనం’ అనే ఖండకావ్యంలోనిదిగా అది 1905-07 ప్రాంతంలో అచ్చయినదిగా కరణం సుబ్బారావు తగినన్నిఆధారాలతో ఒక పుస్తకంగా ప్రచురించారు. చిలకమర్తివారు వారి,స్వీయచరిత్రలోకూడా "ఊహించుకుని (గుర్తు చేసుకుని) చదివితిని" అనడం. 1907 నుంచీ 1920 ప్రాంతంలోని ఏ పత్రికా ఈ పద్యం చిలకమర్తివారి రచనగా పేర్కొనకపోవడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

  వందసంవత్సరాల తరువాత ఈ పద్యం ఎవరురాశారు అనేది తిరగదోడడం అవసరమా? అని ప్రశ్నించేవారికి "ఒక కవికి అన్యాయం జరగకూడదు" అనే ఈ పుస్తక రచయిత ఆశయం సమాధానం చెబుతుంది. ఈ పద్యం రాయకపోయినంత మాత్రానా చిలకమర్తి వారి స్థాయి తెలుగు సాహిత్యంలో తగ్గేదీకాకపోయినా, ఈ కొత్త నిజం ఒక మరచిపోయిన, సరైన గుర్తింపు లభించని కవికి గుర్తింపునిస్తే అంతేచాలు.

  ఈ వివాదానికి తోడు ఈ పద్యంలో మతప్రస్తావనా, కులప్రస్తావనా ఉండటంవల్ల మరోవివాదం రగలకుండా ఉంటే అంతే చాలు.

  సమాధానకర్త: కరణం సుబ్బారావు
  ముద్రణ: మార్చి,2009
  ప్రచురణకర్త: అనూస్ పబ్లికేషన్స్
  వెల: రూ.50 /-

 38. జీడిపప్పు said...

  చాలా చక్కని పోస్ట్ మహేష్ గారు.

  ఇప్పటికయినా మన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఈ పద్యం ద్వారా చిలకమర్తివారు సంపాదించిన కీర్తిని, ధనాన్ని రద్దు చేసి చెన్నాప్రగడ వారికి ఆ కీర్తి, ధనం దక్కేలా చేయాలి.

  అందరూ మీలాగా వివాదం రగలకూడదు అని కోరుకొనేవాళ్ళు కాదుగా! కొందరు మతగజ్జి రోగులు ఉంటారు. వీరివల్లే అసలు ముప్పు. నూరేళ్ళుగా ఎన్నడూ ఎవరికీ కనిపించని కుల, మత విషయాలు ఈ గజ్జి కుక్కలకు కనిపిస్తాయి. ఈ కుక్కలకు కేవలం మతగజ్జే కాకుండా కులగజ్జి కూడా ఉండడం వల్ల వీటిని దూరంగా ఉంచాలి. లేకపోతే "ఆ ఏముంది, ఇది మంచి దేశభక్తి పద్యం" అనే వాళ్ళను కూడా "లేదు, సరిగా చూడు, ఇందులో కుల, మత ప్రస్తావన ఉంది" అంటూ విషబీజాలు నాటి తమకున్న గజ్జిని మనుషులకు కూడా అంటిస్తాయి.

 39. చదువరి said...

  నేనూ దీన్ని వ్యంగ్యమని తెలుసుకోలేకపోయాను. తెలిసాక, మళ్ళీ చదివితే అర్థమైంది. ఆ వ్యంగ్యం నాకు నచ్చలేదు.

  మొత్తానికి నిర్హేతుకమైన వివాదం. దానికితోడు, కొన్ని వ్యాఖ్యల్లో కించపరచే మాటలు.

 40. Varunudu said...

  కత్తి మహేష్ గారు చెప్పారు
  ==========================
  ఈ వివాదానికి తోడు ఈ పద్యంలో మతప్రస్తావనా, కులప్రస్తావనా ఉండటంవల్ల మరోవివాదం రగలకుండా ఉంటే అంతే చాలు.
  ===========================
  @కత్తి గారూ.. మీరు ఏ ఉద్దేశం తో ఆ ముక్క వ్రాసారో తెలీదు గానీ..నా విశ్లేషణ ఇది...

  ఆ వ్యాసం చదివాక.. నాకు ఆ పద్యం మంచి దేశ భక్తి పద్యం గానే తోచింది. మీరు అన్నారే కుల వివాదం అని.. కుల ప్రస్తావన ఎక్కడుందా అని మళ్ళీ వెనక్కు వెళ్ళి చదివా.. అప్పటికి గానీ అర్థం కాలేదు. ఆ పద్యం లో కుల ప్రస్తావన ఉంది అని... సో, ఇలా వేరే ఆలొచనలు లేని వారికి కూడా, రేండో ఆలోచన కల్పింఛేదిలా ఉండి మీ వాక్యం అని.. జీడిపప్పు భావం. మీకు అర్థమయిందనుకొంటా..

 41. Anonymous said...

  ఇప్పటికయినా మన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఈ పద్యం ద్వారా చిలకమర్తివారు సంపాదించిన కీర్తిని, ధనాన్ని రద్దు చేసి చెన్నాప్రగడ వారికి ఆ కీర్తి, ధనం దక్కేలా చేయాలి.

  How can this be possible when both writer and the thief are dead ? ;-)

 42. Anonymous said...

  Anonymous garu , katti adagandi chebutadu.

  - maro anynymous

 43. Anonymous said...

  వరుణుడు,
  కత్తన్నకు ఆమాత్రం గ్రహించే శక్తిలేదనుకున్నావా? వుంది కాబట్టే ఆయన 'కత్తి '
  జీడిపప్పు వ్యంగ్యం, పద్యాన్ని పక్కదోవలుపట్టించే వాళ్ళమీదనే కానీ చిలకమర్తివారి మీదనో 1960 ల్లో గొడవలు చేసినవాళ్ళమీదనో కాదని నా కోడి మెదడుకు కూడా అర్థమైంది. మొత్తానికి ముల్లును ముల్లుతోనే తీయాలని ప్రయత్నించి పాపం ఇంకోముల్లుని కూడ గుచ్చుకున్నాడు జీడిపప్పు.

 44. కత్తి మహేష్ కుమార్ said...

  @వరుణుడు: నేను వ్యాసం రాసేనాటికి ఒక కులవివాదం ముందుకొచ్చిందన్న చూచాయ సమాచారం మాత్రం లభించింది. అందుకే అలా రాసాను. కానీ నిజంగానే రాజమండ్రికి చెందిన ఒక పత్రిక గొల్లకులస్తుల్ని తెల్ల్వారితో పోల్చి అవమానించారని రాసినట్లు తరువాత తెలిసింది.

  ఇందులో నా ఉద్దేశంకన్నా, నేనిలాగే రాస్తాను అనే మీ assumption ప్రభావమే ఎక్కువుందని గ్రహించగలరు. సాహిత్యంలో వివాదాస్పదమైన పుస్తకాన్ని పరిచయం చేస్తూ దాన్నుంచీ మరో వివాదం రేగాలని కోరుకునేంత చిన్నబుద్ది నాకు లేదు. కానీ, ఇంత తీవ్రంగా ఆలోచించగల ఘనత మాత్రం జీడిపప్పుగారిదే.

 45. యోగి said...

  ROFL!!

  Well, too many pimps in the blog world tryong to protect a punk, you see!

  c'est la vie ! (meaning, such is life!!)

 46. యోగి said...

  My dear Pimps and Punks, we really love you! Your presence in this murky world is what gives us *some* entertainment. Rock on Punks and the respective Pimps :D

 47. తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

  ప్రముఖ సంఘసంస్కర్త, మహాకవి, రచయిత, ఉపాధ్యాయుడు, పత్రికాసంపాదకుడు అయిన కీ.శే. చిలకమర్తివారి పవిత్రాత్మకు రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని ఆపాదించడం చదివి చాలా బాధపడ్డాను. చిలకమర్తివారు పేదవాడుగా పుట్టారు. పేదవాడుగానే జీవించారు. పేదవాడుగానే చనిపోయారు. ఆయనకి పుట్టుకతోనే దృష్టిలోపం ఉండేది. నలభయ్యేళ్ళ వయసువచ్చేసరికి పూర్తిగా గుడ్డివారయ్యారు. గుడ్డికవి అనడం ఇష్టం లేని ఆ కాలపు అభిమానులు ఆయన్ని "ఆంధ్రా మిల్టన్" అనే మాఱుపేరుతో పిల్చుకునేవారు.

  మీరు నిజంగా మనుషులైతే ఆయన గుఱించి ఇలాంటి తప్పుడు రాతలు రాసినందుకు యథార్థంగా పశ్చాత్తాపం చెంది భగవంతుడికి క్షమాపణలు చెప్పుకొని ఈ టపా అంతా అబద్ధం అని ఒప్పుకుంటూ ఇంకో టపా రాయండి.

Post a Comment