కూడలి కష్టాలు - పరిష్కారం

Posted by జీడిపప్పు

కొద్దిరోజుల క్రితం కూడలిలో పోస్టులు చూసి చాలా చిరాకేసింది. ఒకరివి (అఫ్‌కోర్స్ అన్ని బ్లాగులూ కలిపి) తొమ్మిది, మరొకరివి ఐదు, ఇంకొకరివి ఆరు ఫోటోలు, ఇంకొకరివి మూడు పోస్టులు..ఇలా ఐదారుమంది తమ పోస్టులతో మొత్తం జాబితాలో సుమారు సగం ఆక్రమించేసారు. అది చూసి ఒక పోస్టు వ్రాసాను కానీ చివరిక్షణంలో నేనొక్కడినే ఇలా అనుకుంటున్నానేమో అనిపించి ఆ పోస్టు ప్రచురించలేదు. ఈ రోజు జ్యోతిగారి పోస్టు చూసిన తర్వాత ఆ పోస్టును యథాతథంగా ప్రచురిస్తున్నాను. మీకు కూడా ఇది సమస్యే అనిపిస్తే..మరెందుకాలశ్యం, ఓ పోస్టు వెయ్యండి. పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందేమో!

అసలు పోస్టు :

నేను కూడలిని ఏడాదినుండి క్రమం తప్పకుండా చూస్తున్నాను. కూడలిని చూడడం అంటే ఈ పేజీ చూడడం. నాకు తెలిసి చాలామంది బ్లాగర్లు ఈ పేజీనే చూస్తారు అనుకుంటా. ఎందుకంటే, ఈ పేజీలో అయితే పోస్టుల మొదటి నాలుగు లైన్లు చూస్తూ కుడిపక్కన కామెంట్లను చూడవచ్చు.

కొద్దికాలం క్రితం వరకూ ఈ పద్దతి అనుసరించడం చాలా సులభంగా ఉండేది. చాలావరకు "చదవగలిన" పోస్టులే ఉండడంతో "చెత్త" పోస్టులను సులభంగా దాటుకుంటూ వెళ్ళిపోయేవాడిని. కానీ ఈ మధ్య అంతా రివర్స్ అయినట్టనిపిస్తున్నది. మంచి పోస్టులు తగ్గిపోయి, ఒకే బ్లాగులో రోజుకు నాలుగైదు పోస్టులు పడుతున్నాయి. రోజుకు రెండు-మూడు కంటే ఎక్కువ ఒకే బ్లాగుకు సంబంధించిన పోస్టులు కూడలిలో కనిపించాయంటే అన్నీ పరమ చెత్త పోస్టులే అని నా own స్వంత పర్సనల్ స్వాభిప్రాయం.

ఇలా రోజుకు మూడు నాలుగు పోస్టులవల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి. బ్లాగు లోకంలో చాలా పాపులర్ అవ్వవచ్చు, ఆ పోస్టులు వేసేవాడు ఎంత మేధావో అందరికీ తెలుస్తుంది, బ్లాగుకు హిట్లు పెరుగుతాయి, అలెక్సా ర్యాంకు పెరుగుతుంది. అందుకే నేను కూడా కొన్ని బ్లాగులు మొదలు పెట్టాలనుకుంటున్నాను.

ఒకటో బ్లాగు: నాకు కమ్యూనిస్టులంటే పరమ అసహ్యం. ఇవి ప్రపంచంలోనే అత్యంత ---- అన్నమాట. వీటిపైన నాకున్న కసి తీర్చుకోవడానికి తెల్లవారి ఆరున్నరకు "ఛీ కమ్యూనిస్టులు" అని రెండు లైన్లు, తొమ్మిదిన్నరకు 'థూ కమ్యూనిస్టులు" అని మూడు లైన్లు, రెండున్నరకు "ఛీ ఛీ కమ్యూనిస్టులు" అని రెండు లైన్లు, సాయంత్రం ఏడున్నరకు 'కమ్యూనిస్టులు ఛీ ఛీ" అని ఒక లైను పోస్టులు వేస్తాను అన్నమాట.

రెండో బ్లాగులో "అసలు మా మెగాజోకర్ గారు ఓడిపోలేదు", "మెగాజోకర్ గారూ, మీ వెంటే మేముంటాము", "వచ్చే ఎన్నికల్లో మీరే ముఖ్యమంత్రి మెగాజోకర్ గారూ", "మీరు చాలా మంచివారు మెగాజోకర్ గారు" "అసలు మెగాజోకర్ ఎవరు" లాంటి పోస్టులు వేస్తాను, మతి చలించినప్పుడల్లా లేదా మతి ఉన్నపుడల్లా. మూడో బ్లాగులో మా ఊరి ఎమ్మెల్యే భజన, మా ఊరి రోడ్ల గుంతల ఫోటోలు ఉంటాయి. నాలుగో బ్లాగు వార్తలకోసం. న్యూయార్క్ నగరంలో జరుగుతున్న విషయాలతో గంటకొకసారి అప్‌డేట్ అవుతుంటుంది.

ఇలా సగటున రోజుకు 15-20 చెత్త పోస్టులతో కూడలి పేజీని సగం నింపడంవల్ల మంచి పోస్టులను చదవాలనే వారికి చికాకు కలిగించవచ్చు. ఇహపోతే - స్వేచ్ఛ పేరుతో నన్నేమీ చేయలేరు. రోజుకు నాలుగు కాదు, నలభై చెత్త పోస్టులు వేసుకున్నా ఎవరికీ అడిగే హక్కులేదు. ఒకే బ్లాగులో 10 పోస్టులు వెయ్యకూడదని రూల్ పెడితే ఐదు బ్లాగులు సృష్టించి ఒక్కోదాంట్లో రెండేసి పోస్టులు వేస్తాను. ఇష్టముంటే చదవచ్చు లేదా చదవకపోవచ్చు. మరీ అంత ఇబ్బంది అయితే "మంచి పోస్టులున్న" బ్లాగులు ఫేవరెట్స్ లో కలుపుకోవాలి.

ఇంత సేపు ఈ చెత్తను ఓపిగ్గా చదివినందుకు మీకో ఉచిత సలహా:: కూడలి నిర్వాహకులకు " అయ్యా, దయచేసి ఈ multiple టపాల బ్లాగులకోసం ఇంకో Tab సృష్టించి అవన్నీ అక్కడ పెట్టండి. ఈ చెత్తను మెయిన్ పేజీలో చూడలేక, ఆ చెత్తలో మంచి పోస్టులను వెతుక్కోలేక ఛస్తున్నాము" అని అర్జీ పెడుతూ ఒక పోస్టు వెయ్యండి. మీ అదృష్టం బాగుంటే ఈ multiple పోస్టుల బాధ తగ్గవచ్చు.

వీవెన్ గారు :)

52 comments:

  1. కొత్త పాళీ said...

    మీరు తయారుచేసుకున్న ప్రాణాళిక ప్రకారం కమ్యూనిష్టుల్నీ, మెగా జోకర్నీ, పన్లో పనిగా ఇంకొన్ని అమంబాపతు అవిషయాల్ని కలిపి కొట్టి రోజుకి డజనుకి తక్కువ కాకుండా పోష్టులు కొట్టించండి. ఏం పర్లేదు, కూడలి మనదే.

  2. చిలమకూరు విజయమోహన్ said...

    భలె భలే...
    ఇక మీ పనయిపోయింది.
    జీడిపప్పును నమిలేస్తారు,
    ఇక రాబోయే మూడు రోజులూ మీపైనే మా టపాలు
    ఇక డాలు పట్టుకుని కాస్కోవడం మీ వంతు.

  3. Praveen Mandangi said...

    మే 28న నేను మూడు పోస్టులు, మే 29న ఒక్క పోస్టు మాత్రమే వ్రాసాను. వేరే బ్లాగర్ల పోస్టుల వల్ల నా పోస్టులు కూడా కనిపించకుండా పోయాయి. అయినా నేను పేచీ పెట్టలేదే. మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని అయిన a2zdreams గారు కూడా ఈ మధ్య పోస్టులు తగ్గించారు. వ్యక్తిగతంగా ఇతర బ్లాగర్ల మీద బురద జల్లడం అంత అవసరమా?

  4. Kathi Mahesh Kumar said...

    మీరూ నాలుగైదు బ్లాగులు మొదలెట్టి మరో ఆరేడు టపాలు రాసెయ్యండి. కూడలి భరించగలదు. పాఠకులూ సహించగలరు.

  5. Praveen Mandangi said...

    నేను బిజినెస్ చేస్తున్నాను. బిజినెస్ పనుల వల్ల కూడా బ్లాగింగ్ మీద కాన్సెంట్రేషన్ తగ్గించాను. నా బిజినెస్ వెబ్ సైట్ www.pkmct.net. నా ఆఫీస్ ఫోన్ నంబర్ 08942-224547, Fax: 08942-228261, . నా ఇంటి ఫోన్ నంబర్లు 08942-278374, 08942-645664. ఇంటిలో ఉన్నప్పుడు కూడా ఫ్రెండ్స్ తోనూ, ఇతరులతోనూ ఫోన్ లో మాట్లాడడం లాంటివి చేస్తుంటాను. ఇక నేను బ్లాగింగ్ మీద ఎక్కువ టైమ్ ఎలా పెట్టగలను? అందుకే పోస్టులు తగ్గించేశాను.

  6. Praveen Mandangi said...

    వ్యంగ్యాలు చెయ్యాల్సిన అవసరం నాకేమిటి? ఆఫీస్ పనులతో పాటు బ్యాంక్ కి వెళ్ళి డబ్బులు చూసుకునే పనులు కూడా ఉంటాయి. బిజినెస్ పనులు మానుకుని లాస్ తెచ్చుకునేంత అమాయకుడిని కాను.

  7. Praveen Mandangi said...

    మీరు కూడా బిజినెస్ చేస్తే బిజినెస్ ఎలా జరుగుతుందో మీకు తెలుస్తుంది.

  8. మరువం ఉష said...

    అర్థం కాలే, వద్దంటారా, మరిన్ని వ్రాయమంటారా? దుమ్మెత్తమంటున్నారా? దండయాత్రకి సిద్దం కమ్మంటున్నారా. ఏంటో, నాకేనా ఇలావుంది? ;)

  9. Praveen Mandangi said...

    "Anonymous" బాబు నిరుద్యోగి అయ్యుంటాడు. అందుకే అతనికి బిజినెస్ గురించి తెలియకపోవచ్చు. నాకు బిజినెస్ వల్ల టైమ్ సరిపోవడం లేదు, ఇక దండయాత్రలకి నాకు టైమ్ ఎక్కడి నుంచి వస్తుంది?

  10. chavakiran said...

    As I have been telling...
    this is something aggregators have to fix, not the bloggers!

  11. భాస్కర రామిరెడ్డి said...

    పనిలోపని గా నన్నుగూడా ప్రచారం చేసుకోనివ్వండి... అందరూ కలిసి హారం (www.haaram.com ) లో కుమ్మండి.. మొదటి పేజీ లో 50 కాకపోతే 100 పెట్టుకుందాము.Stress testing లో ఫట్ మంటే మా హోష్టింగ్ వాడిని కూడా ఫట్ మనిపించవచ్చు.

  12. Praveen Mandangi said...

    చిత్తూరు మురుగేశన్ వ్రాసే బూతు వ్రాతలని విమర్శించకుండా పోస్టులు తగ్గించేసిన బ్లాగర్లని విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది.

  13. శరత్ కాలమ్ said...

    షికాగో వింతలు, విశేషాలతో నేనూ గంటకు ఒక సారి పోస్టువేయదలుచుకున్నాను. చూద్దాం మీ న్యూయార్క్ గెలుస్తుందో లేక మా షికాగో గెలుస్తుందో.

    ఒకరిని ఆదర్శంగా తీసుకొని అందరూ తమ తమ జన్మభూమి లేదా కర్మ/ఖర్మ భూమి విశేషాలతో గంటకు ఒకసారి అయినా టపాలు జనాల మీదకు విసిరేయాల్సిందిగా మనవి.

  14. భాస్కర రామిరెడ్డి said...

    ఇక్కడెవరో మా న్యూయార్క్ మీదకు వస్తున్నారు...చూసుకుందాం ... బస్తీమే సవాల్ :)

    సరేగానీ న్యూయార్క్ నుంచి గంటకో టపా వేసే బ్లాగేదబ్బా.. ఎలా మిస్ అయ్యానది?

  15. కాలనేమి said...

    మార్తాండ దగ్గర సూటిగా విషయానికి (ఏ విషయమైనా సరే) సమాధానం చెప్పించిన వాళ్ళకు వెయ్యి కామెంట్ల బహుమానం!!

  16. శరత్ కాలమ్ said...

    @ రామిరెడ్డి
    నా కామెంట్ తరువాత ఠకీమని నన్ను తిడుతూ ఒక కామెడీ కామెంటు వస్తుందనుకున్నాను కానీ మీది వచ్చిందే!

    (ఒక బ్లాగుని ఆదర్శంగా తీసుకొని అనుకంటాను) జీడిపప్పు గారు తమ నాలుగో బ్లాగు న్యూయార్క్ మీద మొదలెట్టబోతున్నారు. మీరు న్యూజెర్సీ మీదనో, అట్లాంటిక్ సిటీ మీదనో మొదలెడితే బావుంటుంది కానీ ఒక విషయం. క్రమం తప్పకుండా గంటకు ఒక పోస్టు వరుసగా ఎవరు వేస్తారో వారే గెలుస్తారు ఈ టపాల పోటీలో!

  17. Unknown said...

    జీడిపప్పు గారు, ఈ ఒకటి రెండు లైన్ల పోస్టుల కాన్సెప్ట్ ఏదో వెరైటీగా ఉంది. రెండుకన్నా ఎక్కువ లైన్లని ఒక పోస్టులో జోడించాలంటే స్థలాభావం అయ్యుంటుంది. లేదా తాము పెట్టే టెంమ్టింగ్ హెడ్డింగులకు జస్టిఫికేషన్ చేకూర్చడం కోసం పోస్ట్ టైటిల్ కి సంబంధించిన విషయాన్నే క్లుప్తంగా రెండు లైన్లలో రాసేసి చదువరులకు భారం తగ్గిస్తూ ఉండొచ్చు.

  18. కాలనేమి said...

    But there is one thing I must admit! Marthanda is at least honest and is mostly harmless, except for he blocks the view every now and then..

    But there are more lethal, cold blooded traitors passing junk for knowledge. And what more, these traitors have followers.

    Oh well, the punks and their pimps!!

  19. Praveen Mandangi said...

    బ్లాగుల్లో బూతు వీడియోల లింకులు అడ్వర్టైజ్ చేసే శరత్, వ్యభిచారం చట్టబద్దత అంటూ బూతు పురాణాలు వ్రాసే మురుగేశన్ బ్లాగింగ్ ఎథిక్స్ గురించి వ్రాస్తే నవ్వుతాలుగా ఉంటుంది. నేను బిజినెస్ పనుల్లో బిజీ అయిపోయి పోస్టులు తగ్గించినా కూడా నా మీద బురద జల్లేవాళ్ళది ఎలాంటి సంస్కారమో?

  20. శరత్ కాలమ్ said...

    @ యోగి
    ఆ వొయ్యున్నొక్క కామెంట్లు తెచ్చుకునే సామర్ధ్యం మీకే వుందని అభిజ్ఞవర్గాల భోగట్టా! కానివ్వండి మరి :)

  21. భాస్కర రామిరెడ్డి said...

    @యోగి, మార్తాండ లో నాకు నచ్చింది అదే.. ఏది వ్రాసినా మనకు వెంటనే మార్తాండ వుద్దేశ్యం తెలిసి పోతుంది,but these lethal, cold blooded traitors imbibe slow poison to the entire blog group. You will never know their intentional intuition.

  22. భాస్కర రామిరెడ్డి said...

    @శరత్, గంటకొకటా.. వారానికొకటి రాయాలన్నా ఆఫీస్ లో బాగా చినుగుతుంది.

  23. Praveen Mandangi said...

    బిజినెస్ టైమ్ వాల్యూ భాస్కర్ గారికి తెలుసనుకుంటాను. నేను కూడా చేసేది బిజినెసే. నా పోస్టులు ఎందుకు తగ్గిపోయాయో బిజినెస్ చేసేవాళ్ళు ఎవరికైనా అర్థమైపోతుంది. మరి నా మీద బురద జల్లడం ఎందుకు?

  24. శ్రీనివాస్ said...

    మా ఒంగోలు ఏమన్నా తక్కువ తిందా నేను ఒంగోలు గొప్పదనం మీద రోజుకి ముప్పి లేక డెబ్బి టపాలు రాస్తా

  25. చిలమకూరు విజయమోహన్ said...

    అయ్యా! జీడిపప్పుగారూ మీరేమో అగ్గిపుల్ల గీసి ప్రక్కన తమాషా చూస్తున్నారా ఏంటి ? చర్చ అజ్ఞాతల కామెంట్లతో అసహ్యకరంగా ప్రక్కదారిపడుతోంది.ఇబ్బందికరంగా ఉంది దయచేసి గమనించి ఏదో ఒకటి చేయండి మీకు పుణ్యముంటుంది.

  26. శ్రీనివాస్ said...

    మలక్పేట్ రౌడీ గారు వచ్చి తన అభిప్రాయం వ్యక్తం చెయ్యాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము

  27. Praveen Mandangi said...

    చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి బోగం గుడిసెలు అన్నట్టు బ్లాగుల్లో బూతు లింకులు అడ్వర్టైజ్ చేసేవాళ్ళు పోస్టులు తగ్గించిన బ్లాగర్లని విమర్శిస్తున్నారు.

  28. Kathi Mahesh Kumar said...

    @చిలమకూరు విజయమోహన్ : అగ్గిపుల్ల గీసందే అందుకోసమైతే మీరు ఏదో ఒకటి చెయ్యమంటారేమిటండీ బాబూ!

    Self proclaimed blog,culture,country saviors తమ అధారిటీని అక్కసుగా వెళ్ళగక్కుకునే అవకాశం కోసమే కదా ఈ వేదిక.గ్రూపులున్నాయి అనుకుంటూ దాన్ని పోరాడటానికి వీళ్ళొక గ్రూపుగా తయారయ్యారు. ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయని దుమ్మెత్తి పోస్తూ వీళ్ళూవీళ్ళ వీపుగోకుడికి ఏకంగా సామూహిక బ్లాగులే రాసుకుంటారు.అజ్ఞాతల పేర్లతో ముసుగులేసుకుని మరీ వ్యాఖ్యానాలు చేసుకుంటారు.

    ఇదొక ఆనందం. ఏదో అంటారు దాన్ని...గుర్తు రావట్లేదు.

  29. Malakpet Rowdy said...

    మీ న్యూయార్క్ గెలుస్తుందో లేక మా షికాగో గెలుస్తుందో
    __________________________________

    Yankees Vs Cubs/Sox ???? :))

    But LOL ...

    Martanda, its only 2 days since 28th. I would wait for some more time. By the way I dont run my business and I dont do any productive work. So I should be allowed post 20 articles a day

  30. శ్రీనివాస్ said...

    జీడిపప్పు గారు మీరెప్పుడు బ్లాగు లో బూతు లింక్స్ అడ్వర్టైస్ చేసారు ?

  31. Praveen Mandangi said...

    బూతు లింకులు అడ్వర్టైజ్ చేసినది జీడిపప్పు కాదు. ఆ పని చేసినది శరత్. ఆ లింకులు పొరపాటున ఓపెన్ చేసి చూసాను. జుగుప్స కలిగి నిద్ర సరిగ్గా పట్టలేదు.

  32. భాస్కర రామిరెడ్డి said...

    సాధారణంగా జనాలు జిల పుడితేనే వీపు గోక్కుంటారు. కానీ గోకించుకోవడానికి జిల తెచ్చుకొంటే అందరూ గోకితే వీపు ఎర్రగా కమిలి పోతుందేమో..
    మా వీపులు గోకడానికి కుతి లాంటి ఫాన్స్ క్లబ్ లేకే మాకొక గ్రూపు. ఇందులో పేరు చెప్పుకోకుండా దాచిపెట్టుకొనే పిరికివాళ్ళు ఇంకా చేరలేదు. చెప్పాల్సింది ముసుగేసుకోకుండానే ...ఏదైనా అక్కడికక్కడే...

  33. Krishna K said...

    "కానీ గోకించుకోవడానికి జిల తెచ్చుకొంటే అందరూ గోకితే వీపు ఎర్రగా కమిలి పోతుందేమో.."well said. నాకయితే మొగుడిని కొట్టి మొగసాలకు వెళ్లినమ్మ సామెత గుర్తుకు వస్తుంది.

  34. జ్యోతి said...

    జీడిపప్పుగారు,

    ఇది అన్యాయం,,ఉన్నవాటితోనే వేగలేకుంటే మీరు కూడా మరిన్ని బ్లాగులు మొదలెడతారా..

    ప్రవీణ్ గారు,
    కోపం తెచ్చుకోకండి. కాస్త మిగతా బ్లాగర్ల, చదువరుల బాధలు అర్ధం చేసుకోండి. అందరి బ్లాగులు చూడాలి కదా..

    కూడలి, హారం, జల్లెడ.. అన్నీ మనవే, మనకోసమే.. ఎక్కడైనా ఇదే సమస్య కదా.. అగ్రిగేటర్ నిర్వాహకులేమైనా చేయగలరా??

  35. Praveen Mandangi said...

    చిత్తూరు మురుగేశన్ ఫొటో పెట్టుకుని మరీ బూతు వ్రాతలు వ్రాస్తుంటాడు. పేరు వ్రాయడం, వ్రాయకపోవడం ఒక పెద్ద సమస్యా?

  36. Praveen Mandangi said...

    జ్యోతి గారు, నేను ఇది వరకే వ్రాసాను "బిజినెస్ పనుల్లో బిజీ అయిపోవడం వల్ల వ్రాతలు తగ్గించాను" అని. మరి నా మీద బురద జల్లడం ఎందుకు? వ్యభిచారం పేరుతో బూతు వ్రాతలు వ్రాసే మురుగేశన్ ని విమర్శించడం చేత కాదు కానీ నా మీద బురద జల్లడమేమిటి? హాస్యాస్పదంగా లేదా?

  37. జ్యోతి said...

    ప్రవీణ్ గారు ,, వదిలేయండి..మీరు సైలెంట్ గా ఉంటే , అందరూ సైలెంటవుతారు.

  38. Anonymous said...

    ఈ విషయం గురించి ఇంతకు ముందోసారి, పెద్ద రచ్చే జరిగింది. పెద్దలు ఏవో తీర్మానాలవీ జారీ చేసేరు. తర్వాత, మళ్లీ చర్విత చరణమే!

    ఈ విషయం మీద ఎలుగెత్తిన "తెలుగువాడిని" గారు, ఈ మధ్యెందుకో, ముఖ్యంగా ఎన్నికలైనప్పట్నించీ, కనిపించట్లేదు.

    ఆ టపా లంకె ఇద్దామంటే, ఎందుకో మరి కుదరడంలేదు. తెలుగువాడిని గారి 27 జులై 2008 నాటి టపా చూడండి.
    http://teluguvadini.blogspot.com/2008/07/blog-post_27.html




    ఆర్ టీ ఎస్ నుంచి తెలుగులోకి మార్చాలన్నా ఇవాళ ఎందుకో కుదరడం లేదు.

    ఇదిగో, మళ్లీ ప్రయత్నిస్తే కుదిరింది.

    -శివ

  39. Anonymous said...

    ఒక్క ముక్క కూడ అర్ధం కాలేదు ఈ కామెంట్ల యుద్దం ఏమిటో?
    అర్థమైతే నేను వ్రాయడం మానేద్దాం అనుకున్నాను....కాలేదుగా
    అంటే కవితలతో కుమ్మెయ్య వచ్చన్నమాట!!!

  40. Shashank said...

    బుడుగు, జ్యోతి గారు - భలే భలే. ఈ విషయం మీద ఇంతక ముందు కూడా బుడుగు రాసాడు. యామి సేస్తాం .. నో చేంజ్.

    సరె కాని శరత్, రామి రెడ్డి - ఏంటి మీ షికాగో, న్యూ యార్క్ గొప్పదనం? మాది రాజధాని. నేను గంట కి ఒకటి కాదు బ్రేకింగ్ న్యూస్ అని ఐదు నిమిషాలకి ఓ పోస్ట్ వ్రాస్త. కమాన్ - సూస్కుందాం. సీమ సందుల్లో కాదు కూడలి మేన్ పేజ్ లో. బుడుగు నీకు ఇదే నా తుది హెచ్చరిక. నువ్వు రోజుకి 10 వేస్తే నేను గంట కి 60/5 = 12 వేస్తా.

  41. తాడేపల్లి said...

    "కొద్దిరోజుల క్రితం కూడలిలో పోస్టులు చూసి చాలా చిరాకేసింది. ఒకరివి (అఫ్‌కోర్స్ అన్ని బ్లాగులూ కలిపి) తొమ్మిది, మరొకరివి ఐదు, ఇంకొకరివి ఆరు ఫోటోలు, ఇంకొకరివి మూడు పోస్టులు..ఇలా ఐదారుమంది తమ పోస్టులతో మొత్తం జాబితాలో సుమారు సగం ఆక్రమించేసారు...."కూడలిలో కూడలి100 అనే పుట ఉంది. అందులోనే సాధారణంగా ఇలా జఱుగుతూంటుంది. మిగతా కూడలి పుటలు నేనైతే చూడను. కూడలి100 లో అలా జఱగడం తప్పు కాదు. ఎందుకంటే అది అందఱు బ్లాగరులకి సంబంధించినది కాదు. సాధారణంగా బహు-సీనియర్ బ్లాగరులవీ (అంటే రెండుమూడేళ్ళకి పైబడి బ్లాగింగ్ లో ఉన్నవాళ్ళవి),పాఠకుల అభిమాన బ్లాగులుగా క్రితం సంవత్సరం గుర్తించబడినవి, చాలా తఱచుగా తాజాకరించబడేవి అయిన బ్లాగులు మాత్రమే అందులో ఉంటాయి. అయితే మీరు పేర్కొన్నట్లు ఒకేరోజున రెండుమూడు టపాలు చేసేవాళ్ళెవరూ కూడలి100 లో లేరు.

  42. Praveen Mandangi said...

    బిజినెస్ పనుల వల్ల వ్రాతలు తగ్గించిన నా మీద కూడా ఆరోపణలు ఎందుకు? a2zdreams గారి వ్రాతలు కూడా తగ్గిపోయాయి. అతనికి కూడా ఏవో పర్సనల్ పనులు ఉండొచ్చు. అతని మీద కూడా ఆరోపణలు ఎందుకు? ఇది వ్యక్తిగత బురద జల్లుడు కాకపోతే మరేమిటి?

  43. శరత్ కాలమ్ said...

    @ శశాంక్
    ఇంకేమంటం? జైహో శశాంక్ అంటాం.

    ఇకముందు నిముష నిముషానకీ మైక్రో బ్లాగింగ్ చేస్తారేమో ఎవరన్నా. ఎవరయినా అలా చేసి శశాంక్ గారిని అత్యధిక మెజారిటీతో ఓడించాల్సిందిగా విన్నపం. అప్పుడు వారికే జైహో అంటాం.

  44. Shashank said...

    @శరత్ - నాకు ఇంకో అమోఘమైన ఆలోచన వచ్చింది. ఒక కవిత ని విభజించి ఒక్కో పదానికి ఒక్కో పోస్ట్ వేస్తా. అన్ని కలిపి ఇంకోటి. తర్వత నా ఆలోచనలు ఇంకోటి. రాస్తున్నా అని ఒక పోస్ట్. ఎల రాసానో ఇంకోటి.

  45. విశ్వక్శేనుడు said...

    హా హా హా..... (వికటాట్టహాసం)... నాకు ఈరొజు నుండి 3 నెలలు సెలవలు. ఇంక చూసుకో నా సామిరంగా దెబ్బకి కూడలికి దెయ్యం వదలాల.

    నేను కొత్త కాన్సెప్ట్ కనిపెటా, ఒక్కొక టపా లో ఒక అక్షరం మాత్రమే రాస్తా.
    ఇంక నాతో పోటీ పెట్టుకోండి చూద్దాం.

  46. శరత్ కాలమ్ said...

    @ శశాంక్
    మీకు మీరే సాటి. సరి లేరు మీకెవ్వరూ! ఇంకెందుకాలస్యం. విజయీభవ!
    @ మాధవ
    ఆ పనేదో తెలుగు అక్షరమాల ప్రకారం చేయండి. మరచిపోయిన అక్షరాలు ఏమయినా వుంటే మాకు గుర్తుకువస్తాయి! అక్షరాలు అయితే 56 మాత్రమే వుంటాయి. అదే అంకెలు తీసుకున్నారనుకోండి - ఆకాశమే మీ హద్దు లేదా వీవెన్ నే మీ హద్దు. వీవెన్ మీ బ్లాగ్ ని 'లంకించడం' ఆపేదాకా అలా చేయొచ్చు.వీవెన్ కి చురుకుముట్టే లోపుగా మేమందరమూ కూడలి నుండి పరుగు 'లంకించు'కుంటాము - అది వేరే సంగతి.

  47. విశ్వక్శేనుడు said...

    @శరత్

    అబ్బే మీరందరూ లంకించుకుంటే కున్నారు గాక. నా బ్లాగ్ కి నెనే సుమన్. నేను మారను. అంతే గట్టిగా మట్లాడితే ఎప్పుడెప్పుడో జరిగిపొయిన వాటి లంకెలు ఇచ్చి నిన్న గాక మొన్న బ్లాగ్ తెరిచిన వాల్లకి కూడా అనవసరపు క్యురియాసిటి కలిగిస్తా అదేమంటే ఆ పదాలు వడద్దు అనడానికి ఇది విమర్శ. మీరు నా గొంతు నొక్కలేరు. లాల్ సలాం.

  48. Anonymous said...

    జీడిపప్పు గారు,

    'తాంబూలాలు ఇప్పించేసాం తన్నుకు చావండి' అన్నట్లు టపా వ్రాసారు.

    కూడలి లో మనకి ఇష్టంలేని బ్లాగులు బ్లాక్ చేసేలాగ ఆప్షన్ పెడితే ఈ గొడవంతా ఉండదు కదా.

    అలా కుదురుతుందా? నేను సివిల్ ఇంజినీరుని. సాఫ్టువేర్ కాదు. అందుకే అడుగుతున్నాను.

  49. Shashank said...

    బోనగిరి గారు - ఇంకా ఫీచర్స్ పెట్టచ్చు. కాని మన చేతుల్లో లేదు కదండి. అంతా వీవెన్ గారి మహిమ.

  50. శరత్ కాలమ్ said...

    అవును. వీవెన్ దయ - మన ప్రాప్తం.

  51. Praveen Mandangi said...

    కె బ్లా సం మూత పడింది. నేను కె బ్లా సం పై వీవెన్ కి ఫిర్యాదు చెయ్యలేదు. వాళ్ళు అలిసిపోయి వ్రాయడం మానేస్తారనుకుని రెస్టు తీసుకున్నాను. వాళ్ళ బిహేవియర్ వల్ల వీవెన్ కి కోపం వచ్చి వీవెన్ వాళ్ళ బ్లాగ్ ని తొలిగించాడు. మీరు వ్యక్తిగత ఆరోపణలు చెయ్యడం మానేస్తే మంచిది. కూడలిలో మూడు పోస్టులు కంటే ఎక్కువ కనిపించకుండా వీవెన్ లిమిట్ పెట్టాడు. ఒకవేళ నేను ఎనిమిది పోస్టులు వ్రాసినా మూడు మాత్రమే కనిపిస్తాయి. అందుకే నిన్న నేను రెండు పోస్టులు మాత్రమే వ్రాసాను. అయినా కె బ్లా సం వాళ్ళు ఊరుకోకుండా రేగిపోయారు దిగారు. అందుకే వీవెన్ వాళ్ళ బ్లాగ్ ని కూడలి నుంచి తొలిగించాడు.

  52. Chittoor Murugesan said...

    మద్యలో నా ఊసెందుకొచ్చిందో ? నేను అంబేల్ పెట్టి చాలా కాలమైంది. మురికి వాడల్లో రోడ్ల మీద ఆడుకునే చిన్న పిల్లలకు సైతం తెలుసు అంబేలు పెట్టిన వాడ్ని ఔట్ చెయ్యకూడదని.

    ఏమి స్భ్యత, ఏమి సంస్కారం ?

Post a Comment