మొత్తానికి ప్రభాకరన్ చచ్చాడు. అన్నెం పున్నెం ఎరుగని బాలలను సైతం మానవ బాంబులుగా తయారు చేసి, వారిలో జాతి విద్వేషాన్ని విషంలా ఎక్కించిన ఈ మానవ మృగాన్ని చంపిన శ్రీలంక సేనకు జేజేలు కొట్టాలి. వీడిని ఎదుర్కొని ఎన్నో దశాబ్దాలుగా సాగుతున్న మారణకాండను అదుపులోకి తెచ్చిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ధైర్యానికి జోహార్లు అర్పించాలి. ఈ సందర్భంగా - విషయాన్ని చక్కగా విశ్లేషించే ఎంబీయస్ ప్రసాద్ గారు ఈ తీవ్రవాద సంస్థ గురించి వ్రాసిన
వ్యాసాలనుండి సంగ్రహించిన కొన్ని అంశాలు:
May 21, 2009 at 11:17 PM
నిన్న పెట్టావ్ కద పోస్ట్. అప్పుడే చదివేసా. కమెంట్ కూడా రాసా కాని పేస్టే లోపు ఎత్తేసావ్. అందుకే ఇప్పుడు రాయడం లేదు. i hurted.
May 23, 2009 at 3:17 PM
నిన్న రాత్రి హెచ్‌బివోలో Bill Maher కార్యక్రమంలో MIA అమాయకత్వం/మూర్ఖత్వం చూసి నవ్వొచ్చింది. ఇలాంటి 15 minutes of fame జనాల వోవర్ యాక్షన్ చూడలేకపోతున్నామీ మధ్య.
శ్రీలంక సమస్యపై MIA అభిప్రాయాలు విని తీరాలి. అన్నిట్లోకీ హైలైట్: స్వతంత్రమొచ్చాక శ్రీలంక చరిత్రలో ఏ ఒక్క సింహళీయుడినీ ఎటువంటి నేరమ్మీదా జైలుకి పంపటం జరగనే లేదని ఆ అమ్మాయి బల్ల, కుర్చీ, మరియూ Bill Maher మొహాన్నీ గుద్ది మరీ చెప్పటం!!
మీరా కార్యక్రమాన్ని చూడకపోతే ఇక్కడ చూడొచ్చు: Bill Maher - MIA.
చూసి మీదైన శైలిలో ఓ టపా రాయండి.