తెలుగోడు ఎవరు?
Posted by జీడిపప్పు
తెలుగోడు ఎవరు?
వహ్! ఏమి కొస్చెన్? అసల ఈ కొస్చన్ లో ఎంత మాధుర్యం వుంది..అలానే తీపి కూడా వుంది. కొంచెం తీపి, కొంచెం పులుపు, కొంచెం చేదు, కొంచెం కారం, కొంచెం వగరు , కొంచెం ఉప్పు...ఇలా ఎన్నైనా రుచులు చెప్పుకోవచ్చు. అసల ఈ రుచీ వుంది చూడండీ, ఈ రుచీ అనే పదాన్ని వాడుకునీ రుచీ పచ్చళ్ళు తయారుచేసారు ప్రియ పచ్చళ్ళ కు పోటీ గా. ఈ ప్రియ పచ్చళ్ళు ఎవరిది అనుకున్నారు? మన రామోజీ రావు ది.
ఈ రామోజీ రావు కి ఒక్క పచ్చళ్ళ బిజినస్సే కాదు ఇంకా ఈనాడు పత్రిక బిజినస్సు, ఆ మధ్యనే గొంతు లోతు మునిగి మళ్ళీ తేలి ప్రస్తుతం వెన్టిలేటరు మీద బ్రతుకు కొనసాఆఆఆ...గిస్తున్న మార్గదర్శి చీటీ పాట బిజినస్సు, ఫిల్మ్ సిటీ బిజినస్సు, కోడలు పిల్ల చూసుకునే డల్ఫిన్ హొటళ్ళ బిజినస్సు, మీ టీవి ఈటీవి బిజినస్సు ఇలా చాలా వున్నాయి. ఈటీవి అంటే ఏమనుకున్నారు? ఈనాడు టెలివిజన్. ఇందులో ’హార్లిక్స్ హృదయాంజలి’ అనీ హార్లిక్స్ వారు స్పాన్సర్ చేసే ప్రోగ్రాం వచ్చేది.
అలాగే ’కాల్గేట్ పాడుతా తీయగా’ అనే ఇంకో ప్రోగ్రాం కూడా వచ్చేది. దాన్నీ మన ఎస్.పీ.బీ. కన్డక్ట్ చేసేవాడు. అసల ఎస్.పీ.బీ ఎంత మంది యంగ్ ట్యాలంట్ ని ఎంకరేజ్ చేసాడో ఈ ప్రోగ్రాం లో...మన ఏడుపు గొంతు ఆర్.పీ.పట్నాయక్ ఫేవరెట్ గాయిని ఉష ఈ ప్రోగ్రామ్ నుండే వెలుగు లోకి వచ్చింది. వెలుగు...ఈ వెలుగు వుంది చూసారూ...వెలుగు కోసం సూరీడు ఒక్కడే...సూరీడు అంటే ’అరిస్తే చరుస్తా పెన్సిల్ ఇస్తే చప్పరిస్తా’ మోహన్ బాబు పుత్రరత్నం మంచు విస్స్ను చేసిన సినిమ ’సూర్యం’ కాదు :), ఆకాశం లో వుండే సూరీడు అనమాట.
వెలుగు కోసం సూరీడు ఒక్కడే వున్డాల్సిన అవసరం లేదు...ఇంట్లో కర్మ కాలీ కరంటు వుంటే, స్విఛ్ వేస్తే బల్బ్ వెలుగునిస్తుంది. కర్మ కాలకపోయి కరంటు పోతే అగ్గిపుల్ల కాల్చాలి. అది కూడా వెలుగునిస్తుంది. ఆ అగ్గిపుల్ల తో ఓ కొవ్వత్తి ని అంటిస్తే అది కూడా వెలుగునిస్తుంది. కొవ్వత్తి ని హస్టల్స్ లో రాత్రి పూట కరంటు పోయినప్పుడు కొంత మంది చదువుకోడానికి వాడేవారు. మిగిలిన మరికొంత మంది అమ్మాయిల హాస్టల్ పోడానికి వాడుకునేవారు.
ఈ హాస్టల్స్ లో వెలుగు చూడని చాలా ఆశలు..చాల గొడవలు , రౌడీయిజంలు వుంటాయి. రౌడీయిజం అంటే మామూలు చేతులతో కొట్టుకోడం కాదు...కత్తులు కటారులతో ఖడ్గాలతో కాట్రాజు మాదిరి కొట్టేసుకోడం లాంటివి అనమాట. ఖడ్గం అంటే గుర్తొచ్చింది, ఖడ్గం సినిమా లో ఎక్కడ చూసినా మూడు రంగులు చూపిస్తాడు మన కిస్స్న వంశి. అసల ఈ మూడు రంగుల జాతీయ జండాని ఎవరు మొదట డిజైన్ చేసారనుకుంటున్నారూ?
...మన తెలుగోడు.
తెలుగోడు ఎవరు?
May 20, 2009 at 10:10 PM
ఈ పోస్టు అర్జెంట్ గా బాబాఇ కి పంపాలి. అసలు తనని ఇంతల పొగిడేవాళ్ళు కరువై ఈ మధ్యనే డిప్రెషన్ లోకి వెళ్ళాడు. అందునా తను ఆరాధ్య దైవం మోగన బాబు కొడుకు మోగన బాబు మాట వినకుండా లవ్ పెళ్ళి చేసుకున్నప్పటి నుండి బాబాయి ఎడతెరిపిలేకుండా శోక "రం" సముద్రం లో మునిగిపోతున్నాడని వరుణ్ చెప్పాడు ఇందాకే.
May 20, 2009 at 11:01 PM
ఏదో స్పేనిష్ సినిమాలో ఫ్రెంచ్ డైలాగ్ వింటున్నట్టుంది. ఒక్క ముక్క అర్థం కావట్లేదు ఎన్ని సార్లు చదివినా
May 20, 2009 at 11:12 PM
ఏమోనబ్బా, తెలుగోడంటే నాకైతే అబ్రకదబ్రే!
May 20, 2009 at 11:26 PM
?! ఏంటో - నాకేం అర్ధం కాలా.
May 20, 2009 at 11:53 PM
ఏమోనబ్బా, తెలుగోడంటే నాకైతే అబ్రకదబ్రే! :) true statement
May 21, 2009 at 12:14 AM
Orni gOku!! (adE.. gOdArijillA kurrODA)... ikkaDakUDA tayArayyAvA!! kottagA tayAravvaDam EnTi, bhUmi puTTakamundu nunDE unnAnanTAvA ;)
ayinA jADipappu! akkaDanTE, prajAnIkAniki telusu, nuvvEm sOdi cheppinA artham avutundi. ikkaDa chUDu, pApam spanish cinema lO frech dialgoues lA anipistunnAyi. ahanA peLLanTa lO, vIrabhadrarAv lA, janam 'nA kattEdi, gurramEdi' ani aDigElOpu, I TapA tIseyyaDamO, unkochem vivaraNa ichchukOvaDamO chEstE, andarikI ArOgyadAyakam.
May 21, 2009 at 12:26 AM
మీరు తెలుగోడు కాదా?
May 21, 2009 at 1:45 AM
చాలా information వుందండీ మీ పోస్టులో :-). ఇంతకీ అది "అంకుసం" అనుకోవాలా లేక "అంకుశం" అనుకోవాలా. I mean, is it a typo or some kind of pun?
May 21, 2009 at 2:18 AM
తెలుగోడంటే అబ్రకదబ్రే!
May 21, 2009 at 2:53 AM
>>అబ్రకదబ్ర గారు "తెలుగోడు ఎవరు" అన్నారు
అబ్రకదబ్ర గారు - ఇలా అయితే ఎలాగండీ .. తెలుగోడు అంటేనే గుర్తొచ్చేది మీరు -- మీరే ఆ ప్రశ్న వేస్తే ఎలా??!!!
May 21, 2009 at 10:46 AM
>>అగ్గిపుల్ల కాల్చాలి. అది కూడా వెలుగునిస్తుంది.
అగ్గిపుల్లని పెట్టెమీన గీత్తారు, అగ్గిపుల్లమి కాల్చాలి అంటే అగ్గి కావాలిగా?
>>ఆ అగ్గిపుల్ల తో ఓ కొవ్వత్తి ని అంటిస్తే అది కూడా వెలుగునిస్తుంది.
kovvottini aggipullatO "veligi"stAru. aMTiMcaru. aMTiMccaTAki adEM koMpa kAdu lEka porugODi gaDDivAmu@M kAdu.
>>కొవ్వత్తి ని హస్టల్స్ లో రాత్రి పూట కరంటు పోయినప్పుడు కొంత మంది చదువుకోడానికి వాడేవారు. మిగిలిన మరికొంత మంది అమ్మాయిల హాస్టల్ పోడానికి వాడుకునేవారు.
ఆ ఆ!! అట్ట సీకట్లో ఎలుగట్టుకుఎల్తే జనాలు సూత్తా ఊర్కుంటారేటి? కొరివ్దయ్యాలని ఊరవతలిదాక తరువుఁకుంటారు.
May 21, 2009 at 10:47 AM
>>అగ్గిపుల్ల కాల్చాలి. అది కూడా వెలుగునిస్తుంది.
అగ్గిపుల్లని పెట్టెమీన గీత్తారు, అగ్గిపుల్లని కాల్చాలి అంటే అగ్గి కావాలిగా?
>>ఆ అగ్గిపుల్ల తో ఓ కొవ్వత్తి ని అంటిస్తే అది కూడా వెలుగునిస్తుంది.
కొవ్వొత్తిని అగ్గిపుల్లతో "వెలిగి"స్తారు. అంటించరు. అంటించ్చటాకి అదేం కొంప కాదు లేక పొరుగోడి గడ్డివాముఁ కాదు.
>>కొవ్వత్తి ని హస్టల్స్ లో రాత్రి పూట కరంటు పోయినప్పుడు కొంత మంది చదువుకోడానికి వాడేవారు. మిగిలిన మరికొంత మంది అమ్మాయిల హాస్టల్ పోడానికి వాడుకునేవారు.
ఆ ఆ!! అట్ట సీకట్లో ఎలుగట్టుకుఎల్తే జనాలు సూత్తా ఊర్కుంటారేటి? కొరివ్దయ్యాలని ఊరవతలిదాక తరువుఁకుంటారు.
May 21, 2009 at 6:06 PM
నాకు మాత్రం అర్ధమయింది - ఉంకో తెలుగోడెవరన్నది కాదు, టపా వెనకున్న హాస్య స్ఫూర్తి. అసలు సంగజ్జెప్పకుండా ఎటెటో తిప్పే రోశయ్యామాత్యుల శైలి. విషయం లేకపోయినా, అదిరింది.
పన్లోపనిగా - ఒరిజినల్ తెలుగోడ్ని నేనేనంటూ అడక్కపోయినా ఓట్లేసి గెలిపించిన అందరికీ - నెనర్లు నచ్చేవాళ్లకి నెనర్లు, నచ్చనోళ్లకి ధన్యవాదాలు. ఇది విశ్వసనీయతకీ, ధైర్యానికీ అఖిలాంధ్ర బ్లాగర్లు కట్టిన పట్టం. ప్రత్యేక రాస్ట్రం ఇచ్చే ప్రసక్తే లేదు. ఏ కూటమీ నన్నేమీ చెయ్యలేదు. జైహో.
May 21, 2009 at 10:51 PM This comment has been removed by the author.
May 21, 2009 at 10:53 PM
@ఇండియన్ మినర్వా
"అంకుసా"నికి , "అంకుశా"నికి హస్తిమశకాంతరం ఉంది.
అంకుసం --- అంతర్జాతీయ కుళ్ళు సంఘం
దీని గురించిన వివరణ "తెలుగోడి" ని కానీ, తూ.గో.జి కుర్రోడిని కానీ, జీడీపప్పు ను కానీ అడగండి... !
June 16, 2009 at 4:01 AM
rachalu lepavu bossu
June 24, 2009 at 8:46 AM
టపా అదిరింది బాసు!