స్లమ్‌డాగ్‌ Vs విజయేంద్ర వర్మ - 2

Posted by జీడిపప్పు

క్రితం భాగంలో ఒక పాయింట్ తీసుకొని స్లమ్‌డాగ్‌ గొప్పవాడా విజయేంద్ర వర్మ గొప్పవాడా అని పోల్చాము కదా. ఇప్పుడు మరొక పాయింటు చూద్దాము. కొందరు స్లమ్‌డాగ్‌ ఆస్కారుకు వెళ్ళింది కదా ఇలా రాయడమేంటి అంటే - మొదటి భాగంలో స్పష్టంగా చెప్పాను "సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చూస్తుంటే విజయేంద్ర వర్మ గుర్తొచ్చాడు" అని.

గమనిక: " ఇది కేవలం హాస్యం కోసం రాసింది, రచయితకు ఆ సినిమాలను కించపరిచే ఉద్దేశ్యం లేదు" అనుకోకండి.

ఇక విషయానికి వస్తే -
విజయేంద్ర వర్మ పారాచూట్ వేసుకొని గాలిలో ఎగురుతూ పాకిస్తాన్‌కు వెళ్ళి అక్కడ విలన్ల స్థావరం పైన దిగి, తెలుగులో మాట్లాడి, అందరితో ఫైట్ చేసి, అందరినీ చంపేసి తిరిగి వస్తాడు. పారాచూట్ వేసుకొని పాకిస్తాన్‌లో విలన్ స్థావరం పైన దిగడం నమ్మశక్యంగా లేదా? ఆ వెళ్ళినవాడు ఏదో కొండల పైన పడకుండా సరాసరి విలన్ల స్థావరం పైన దిగుతాడు. పోనీ అక్కడ ఏ హిందీనో ఇంగ్లీషో మాట్లాడుతాడా అంటే ఊహూ.. అచ్చ తెలుగు మాట్లాడుతాడు పాకిస్తానీయులతో!! విలన్లకు అందరికీ అన్ని ఆయుధాలున్నా అందరినీ చంపేస్తాడు. మరీ అంత ఎదవలా విలన్లు? అనిపించిందా మీకు? అలా జరగడం అసంభవం అని అన్నవాళ్ళు ముమ్మాటికీ మనుషులే, కాదన్నవాళ్ళు విజయేంద్ర వర్మ ఫ్యాన్స్ అన్నమాట.

స్లండాగ్‌లో - అనిల్ కపూర్ "కేంబ్రిడ్జ్ సర్కస్ ఎక్కడ ఉంది" అని అడుగుతాడు. మళ్ళీ స్లండాగ్ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తాడు. బొంబాయికి వచ్చాక ఒక కస్టమర్ సర్వీస్ సెంటర్లో టీలు కాఫీలు అందించే కుర్రాడిగా చేరుతాడు. అక్కడివి గుర్తు తెచ్చుకొని "లండన్" అని చెప్తాడు.

నా మిత్రుడు అడిగిన ప్రశ్నలు, నేను చెప్పిన జవాబులు:
ప్ర: బొంబాయికి తిరిగి వచ్చిన తర్వాత హీరో ఒక కాల్ సెంటర్‌లో పని చేస్తుంటాడు. చిన్నపుడు ఒకటో రెండో తరగతి మాత్రమే చదువుకున్న హీరోకు కాల్ సెంటర్‌లో ఎలా ఉద్యోగం వచ్చింది? ఇంటర్వ్యూ చేసేటపుడు సర్టిఫికేట్లు అడగరా?
జ: అవసరం లేదు. ఏ కాల్ సెంటర్‌లో అయినా సర్వెంట్ మొదలయిన ఉద్యోగాలు చదువురాని వాళ్ళకే ఇస్తారు. కాబట్టి హీరోకు ఇచ్చారు. ఒక వేళ చదువు వచ్చిన వాళ్ళకే ఇచ్చారు అనుకుంటే, హీరో తాజ్‌మహల్ దగ్గర చదువు నేర్చున్నాడు. అక్కడే పార్ట్ టైం హై స్కూలుకు వెళ్ళి చదువుకొని 86% తో ప్యాసయ్యి సర్టిఫికేట్లు తెచ్చుకున్నాడు.

ప్ర: కాల్ సెంటర్‌లో కస్టమర్లతో మాట్లాడే ఎవరయినా కాఫీలు టీలు అందించే వాడిని "నేను ఇప్పుడే వస్తాను, కాస్త ఇక్కడ కూర్చొని మెయింటెన్ చెయ్యి" అంటారా?
జ:ఎందుకు అనకూడదు? ఒక డాక్టరు పేషంటుకు అనస్తీషియా ఇచ్చి పక్కనే ఉన్న నర్సుతో "నేను సిగరెట్ తాగి వస్తాను, ఈ లోపు పేషంట్‌కు మెలకువ వస్తే ఆపరేషన్ చేసెయ్యి" అని చెప్పడా ఏంటి? అంతెదుకు, నువ్వు మీ అఫీసులో చెత్త వూడ్చే వాడితో "ఇదిగో నేను అలా బయట వెళ్ళి వస్తాను, కోడ్ రన్ అవుతోంది, మధ్యలో ఎర్రర్స్ వస్తే డీబగ్ చెయ్యి" అని చెప్తావా చెప్పవా?

ప్ర: కస్టమర్ సర్వీస్ సెంటర్లో లండన్‌కు సంబంధించిన ఫోటోలు ఉంటాయి. అలా ఎక్కడయినా ఉంటాయా?
జ: ఎందుకుండవు? ఎపుడయినా ఇన్‌ఫోసిస్, విప్రో ఆఫీసులు చూసావా? ఎవరయితే వాళ్ళ కస్టమర్లో ఆ ప్రదేశాలకు సంబంధించిన ఫోటోలు పెద్ద పెద్ద వాల్ పేపర్లలా పెడతారు

ప్ర: అక్కడేదో బోట్ రేసింగ్ పోస్టర్ ఉంటే హీరో క్విజ్ లో గుర్తు తెచ్చుకొని "లండన్‌కు అదేదో ఊరికి మధ్య రేస్ కాబట్టి .." అని చెప్తాడు. అదెలా సాధ్యం?
జ: కామన్సెన్సు ఉందా నీకు? మీ ఫ్రెండ్ ఎవడయినా పారిస్ ఉన్న క్లయింటుకు ఏ బెంగుళూరు నుండో సపోర్ట్ చేస్తున్నాడు అనుకుందాము. అప్పుడు బెంగుళూరులోని మీ ఫ్రెండ్ ఆఫీసులో ఈఫిల్ టవర్ పోస్టర్ ఉంటుంది. రోజూ దాన్ని చూసిన మీ ఫ్రెండ్ కు ఈఫిల్ టవర్ చరిత్ర, ఆటోమాటిగ్గా తెలిసిపోతుంది కదా. అలాంటప్పుడు కాఫీలు అందిచే కుర్రాడికి అవన్నీ తెలియకూడదా?

ప్ర: అవును, కాల్ సెంటర్ అంటే గుర్తొచ్చింది - అక్కడ కంప్యూటర్‌లో తన అన్న పేరు సెర్చ్ చేసి నంబర్ కనుక్కొని ఫోన్ చేస్తాడు కదా, ఎలా సాధ్యం? హీరోకు అంత సరిగ్గా కంప్యూటర్ ఆపరేట్ చెయ్యడం ఎలా తెలుసు?
జ: కిలోమీటర్లు గాలిలో వెళ్ళిన విజయేంద్ర వర్మ విలన్ల స్థావరం పైనే, అదీ విలన్లు గన్లు పట్టుకొని గట్టి కాపలా ఉన్నపుడు, దిగడం ఎలా సాధ్యమో ఇది కూడా అలాగే సాధ్యం

ప్ర: గన్లు అంటే గుర్తొచ్చింది. రివాల్వర్ కనిపెట్టింది ఎవరు అని అనిల్ కపూర్ క్విజ్ లో అడిగితే కోల్ట్ అని ఎలా చెప్పగలడు?
జ: లతికను వేశ్యా గృహం(?) నుండి రక్షించేటపుడు జమాల్ అన్న అంటాడు కదా దిస్ కోల్ట్ విల్ కిల్ యు అని

ప్ర: అన్నంత మాత్రాన రివాల్వర్ ను కోల్ట్ కనిపెట్టాడు అని ఎలా తెలుసు? సరే, సపోజ్ నేను నా సెల్ ఫోన్ నీకు ఇచ్చి 'దిస్ మొబైల్ విల్ హెల్ప్ యు"' అంటే సెల్ ఫోన్‌ను మొబైల్ అనేవాడు కనిపెట్టినట్టా?
జ: తిక్క తిక్క ప్రశ్నలు వెయ్యకు. విజయేంద్ర వర్మ సినిమాలో ఎవరు ఏ భాష మాట్లాడినా ఆ భాషలో మాట్లాడుతాడు. అంటే అవతలి వాళ్ళు ఏమి చెప్పినా అట్టే క్యాచ్ చేసి ఇట్టే జవాబు చెప్పేస్తాడు విజయేంద్రవర్మ. ఇక్కడ జమాల్ అన్న కూడా విజయేంద్ర వర్మ కు తీసిపోడు, తన తమ్ముడిలా.

ప్ర: జమాల్ అన్న అంటే ఇంకో డవుట్ వస్తోంది. అసలు జమాల్ అన్నకు రివాల్వర్ కనిపెట్టింది "కోల్ట్" అని ఎలా తెలుసు?
జ: రోజూ రివాల్వర్ వాడుతుంటాడు కదా, మరి ఆ మాత్రం తెలియదా? అయినా విజయేంద్ర వర్మ రైలు పైనుండి బైక్‌ను ఎలా జంప్ చేయించాడో స్లండాగ్ కూడా రివాల్వర్ కనిపెట్టింది "కోల్ట్" అని చెప్పి ఉంటాడు.

ప్ర: అంటే రోజూ ఒకటి వాడుతున్నంత మాత్రాన దాని ఎవరు కనిపెట్టాడో తెలిసిపోతుందా?
జ: నీకు అంత నమ్మకం లేకుంటే మన ఆంధ్రాలో ఏ మధ్యతరగతి ఇంటికయినా వెళ్ళి రోజూ మిక్సీ వాడుతున్న ఓ గృహిణిని మిక్సీ ఎవరు కనిపెట్టారో అడుగు, ఇట్టే చెప్పేస్తుంది. (బ్లాగర్లకు ఒక ప్రశ్న: మీరు రోజూ వాడుతున్న బ్లాగు ఎవరు కనిపెట్టారో చెప్పండి చూద్దాం.)

ఇప్పుడు చెప్పండి: పాకిస్తానుకు పారాచూట్లో వెళ్ళి తెలుగులో మాట్లాడి విలన్లను చంపిన విజయేంద్ర వర్మ గొప్పవాడా? అడిగినవన్నిటికీ జవాబులు చెప్పిన స్లమ్‌డాగ్‌ గొప్పవాడా?

12 comments:

  1. Malakpet Rowdy said...

    LOLOLOLOLOLOLOL ....

    am still laughing, rolling on the floor.

    Beware - maa oollo bhookampam gaani ostey, You will be held responsible!

  2. కన్నగాడు said...

    ప్రశ్నలు సమాధానాలు బాగున్నాయి, కాని నిజానికి సినిమా చూస్తున్నప్పుడు ఇంత వెటకారంగా ఉండదు కన్విన్సింగా ఉంటుంది, ఎందుకంటే ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ చెప్పినట్టు "Where Drama begins Logic ends".
    కాకపోతే పైన చెప్పిన విజయేంద్రవర్మలో ఈ డ్రామా మొదలైందని దర్శకుడు అనుకున్నాడు కాని ప్రేక్షకులు అనుకోలేదు.

    చివరి నుంచి రెండవ ప్రశ్నలో అన్న పేరు జమాల్ అన్నారు కాని సలీం

  3. ప్రపుల్ల చంద్ర said...

    ultimate !!!

  4. శ్రీనివాస్ said...

    hahahahah

  5. Anonymous said...

    బాగుందండి..ఇంతకీ మూడో భాగం ఎప్పుడు?

  6. Anonymous said...

    Whats your favorite movie ? I'm sure there are as many goofs in that one also :)

    Bottom line... You made up your mind to not like it even before you watched the movie.

    PS: So did I :)

  7. జీడిపప్పు said...

    Dreamer గారు, నా ఫేవరెట్ సినిమా విజయేంద్ర వర్మ :)

  8. Anonymous said...

    Mine too [:P]

  9. Unknown said...

    for all the questions you raised there are answers. nuvvu vimarsinchali kabatti vimarsistunnav. randranvesha chestunnav. it may not be a greeeeeat movie but very good movie. u dont have to do this much OA.

  10. Sujata M said...

    good. Awesome.

  11. Anonymous said...

    oooohhhhhhhoooooo good comparision

  12. మనోహర్ చెనికల said...

    vijayandra varma is my favourite movie too, nobody can make you smile with all emotions , even jandhyala sometimes makes you cry(with emotion (chantabbayi climax).

Post a Comment