ఎవరు గొప్ప మెజీషియన్?

Posted by జీడిపప్పు

ముగ్గురు ప్రఖ్యాతి గాంచిన మెజీషియన్లు ఒక బారులో కూర్చుకొని తమ గొప్పదనాన్ని ఇలా చెప్పుకుంటున్నారు.

మొదటి మెజీషియన్: నేనిచ్చిన మేజిక్ ప్రదర్శనలో ప్రేక్షకులలోని ముగ్గురు స్త్రీలను అందరూ చూస్తుండగా మాయం చేసాను. ప్రేక్షకులు ఎంత వెతికినా ఆ ముగ్గురూ కనిపించలేదు. గంట తర్వాత మళ్ళీ ప్రత్యక్షమయ్యారు.

రెండవ మెజీషియన్: మా పక్క వూళ్ళో ఉన్న మున్సిపాలిటీ ఆఫీసును మాయం చేసాను. ఊరి జనమంతా గాలించినా వారికి కనపడలేదు. రెండు గంటల తర్వాత మళ్ళీ అక్కడే కనిపించింది.

మూడవ మెజీషియన్: మీరిద్దరూ చేసినవి చాలా చిన్న మాయలు. నేను ఆగ్రా వెళ్ళాను. టీవీలో ప్రత్యక్షప్రసారం అవుతుండగా అక్కడ ఉన్న తాజ్‌మహల్‌ను మాయం చేసాను. ఆగ్రావాసులు అందరూ ఎంత వెతికినా అది కనిపించలేదు. నాలుగు గంటల తర్వాత మాత్రమే అక్కడ ప్రత్యక్షమయింది.

ఇలా ముగ్గురూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకోవడం మొదలుపెట్టారు.

అంతలో సూటు బూటు వేసుకున్న ఒక వ్యక్తి బార్‌లోకి అడుగుపెట్టాడు. అతడిని చూసిన మెజీషియన్లు గొడవ ఆపి కిక్కురుమనకుండా కూర్చున్నారు. కాసేపటికి ఆ వ్యక్తి వెళ్ళిపోయాక ముగ్గురూ "హమ్మయ్యా వెళ్ళిపోయాడు" అని నిట్టూర్చారు. ఇదంతా గమనిస్తున్న ఒక వ్యక్తి "ఎవరతను? అతడిని చూడగానే మీరు ఎందుకలా సైలెంట్ అయ్యారు?" అన్నాడు.

అపుడు ముగ్గురిలో ఒకడు ఇలా అన్నాడు: "అతడు చాలా గొప్ప మెజీషియన్. అతడి ముందు మేము ఎందుకూ పనికిరాము. మాలాగా చిన్న చిన్నవి అదృశ్యం చేయలేదతడు. అతడి పేరు రామలింగ రాజు. అందరూ చూస్తున్నాము అనుకుంటుండగానే 7,000 కోట్ల రూపాయలను మాయం చేసాడు. అది ఎక్కడుందో ఎవరికీ తెలియదు, ఇంకా వెతుకుతూనే ఉన్నారు"

4 comments:

  1. Malakpet Rowdy said...

    LOL :)) hehehehe .. good one!

  2. చైతన్య.ఎస్ said...

    :) :)

  3. చైతన్య said...

    hmmm... ఎందుకో రామలింగరాజు గారిని చెడ్డగా ఊహించలేకపోతున్నా...!!

  4. Anonymous said...

    Good one

Post a Comment