బ్లాగు మూసేస్తున్నా - Shame on You!

Posted by జీడిపప్పు

వ్యక్తిగత సమస్యలవల్లో, పని ఒత్తిడి పెరగడం వల్లో బ్లాగులో వ్రాయడం తగ్గిస్తే, లేదా బ్లాగును మూసివేస్తే అర్థం, పరమార్థం ఉన్నాయి కానీ "ఎవరో" "ఎక్కడో" "ఏదో" అన్నారని ఠాఠ్ నా బ్లాగు మూసేస్తున్నా అనడంకంటే హాస్యాస్పదం ఇంకేమయినా ఉందా?

అసలు బ్లాగింగ్ ఎందుకు మొదలుపెట్టాము? మనకు నచ్చిన భావాలను వ్యక్తపరచడానికి. ఆఫీసులో బాసు చెప్పిన పని మాత్రమే చేయాలి. కానీ మీ బ్లాగులో ఆ అవసరం లేదు. మీరు మెచ్చినది, మీకు నచ్చినది ఎప్పుడయినా ఎలా అయినా రాసుకోవచ్చు. మీ బ్లాగులో ఎలాంటి పోస్టులు పడాలన్నా, ఎలాంటి కామెంట్లు రావాలన్నా అది మీ చేతుల్లో ఉంది. మీ బ్లాగుకు మీరే రాజు/రాణి/మంత్రి/E-TV సుమన్. అలాంటప్పుడు ఈ "బ్లాగు మూయడం" ఏమిటి?

నిజజీవితంలో మనకు ఎన్నో చేయాలని, చెప్పాలని ఉన్నా అవకాశాలు, స్వాతంత్ర్యం ఉండకపోవచ్చు కానీ బ్లాగుల్లో ఆ స్వాతంత్ర్యం ఉంది. మరి ఇంత స్వతంత్రం ఉండి కూడా ఎవరో ముక్కూ మొహం తెలియని వ్యక్తి ఏదో అన్నాడని భయపడి పిరికితనాన్ని, బేలతనాన్ని పెంచుకొని బ్లాగు మూసేయాలనుకున్న ఈ బ్లాగురులు నిజజీవితంలో ఎలా బ్రతుకుతున్నారో తలుచుకుంటే జాలేస్తున్నది.
జరిగినదానిలో మీ తప్పు ఏమయినా ఉందా? ఉంటే మీ తప్పు ధైర్యంగా ఒప్పుకొని క్షమాపణలు చెప్పండి. ఒక వేళ మీ తప్పు లేనట్లయితే ఎందుకు పిరికివారిలా "బ్లాగు మూయడం"? .

మీ పిరికితనాన్ని, బేలతనాన్ని బయటపెట్టి మీలాంటివారిని మరికొందరిని తయారుచేస్తున్నారు. మిమ్మల్ని మీరు వంచించుకోవడం, అవమానించుకోవడం మాని ధైర్యంగా మీ పని మీరు కానివ్వండి. బ్లాగు మూసి వేయడం లేదా ప్రైవేటు చేయడం అన్నది దాడులు చేస్తున్న వారికి మరింత అవకాశం ఇవ్వడమే. వాళ్ళ వాఖ్యలను పట్టించుకోకండి. మన గురించి చెడుగా చెప్తుంటే సెటైర్ ఆన్సర్ ఇవ్వగలిగితే నోరెత్తలేరు. ఒక వేళ అలా వద్దనుకుంటే "పుట్టపుటేనుగు రాజఠీవితో వెళ్తుంటే ఆ రాజసం చూసి కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, ఏనుగు కన్నెత్తి చూడకుండా ముందుకు వెళ్తూ పూజలు, గౌరవాలు అందుకుంటుంది" అన్న సంగతి గుర్తించుకోండి .

కావాలని బాగా ఆలోచించి (నొప్పించినా పరవాలేదని) Shame on You!! అని ఎందుకన్నానో ఒక్క నిమిషం ఆలోచించండి.


ఈ సందర్భంగా నేనింతే ... మారనుగాక మారను.... అన్న జ్యోతిగారికి Image Hosted by ImageShack.us

14 comments:

  1. Sobha said...

    hi jeedi pappu garu,
    correct andy.yemi raalo theliyadu.....kaani nenu raayatam nerchukovali..naa alochanalani andaritho panchukovali..ane nenu blog create chesukunna....and main ga ila discussions vasthene mana thappulu manaku thelusthayi...mana alochana dorani kooda maaruthundhi..
    i agree with u....
    inkoka vishayam nenu modalupettindhi ee madhyane....naaku coments kude yekkuva raavu..but nenu yemi disappoint avvatledu.yendukante atleast chaduvutharu...so yela raayalaa anedi nenu nerchukuntunna..but konthamandhi maatram chaalaa baga raasthunnaru...
    and naa blog ki kuda nene raju,rani,etc

  2. Anonymous said...

    శోభ గారూ దయచేసి తెలుగులో రాయండి.

  3. Anil Dasari said...

    కొంచెం దురుసుగా ఉన్నా (ఎందుకంత దురుసో చెప్పేశారు కాబట్టి గొడవ లేదు) అర్ధవంతంగా ఉంది.

  4. Anonymous said...

    బాగా చెప్పారు జీడిపప్పు.వెనకటికి ఎవరో చెరువు మీద కోపం వచ్చి ఏదో కడుక్కోను అంటే ఎవడికి నష్టం?అయిన ఇదంతా ఏదో సంచలనం సృష్టించి హిట్స్ పెంచుకుందమనుకునే cheap ట్రిక్.మళ్ళి నేనింతే నా ఇష్టం మీ దిక్కున్న చోట చెప్పుకోండి అనే భావంతో శీర్షిక .అయిన రాయడానికి ఇంక సరుకు లేక ఇలాంటి గిల్లికజ్జాలు పెట్టుకుని అదేదో ఆడవాళ్ళ మొత్తం సమస్యల చూపి సానుభూతి పొందాలనే దురాలోచనే తప్ప. మనమందరం ఇంక ఈ టాపిక్ మీద చర్చ ఆపేస్తే ఇటువంటి పోకడలకు అడ్డుకట్ట వేయొచ్చు.

  5. చైతన్య said...

    "బ్లాగు మూసేస్తున్నా" అన్న మీ టైటిల్ చూసి... మీరు కూడా బ్లాగు మూసేస్తున్నరేమో అని కంగారుపడ్డాను...
    మీ పోస్ట్ బాగుంది... కొంచం ఘాటుగా చెప్పినా... మంచి కోసమే / మంచే చెప్పారు...
    బ్లాగు మూసేసిన / మూసేస్తున్న / మూసేయాలి అనుకుంటున్నా వారికీ...
    "ఎవరి కోసమో మీరు బ్లాగు మొదలు పెట్టలేదు... ఎవరి వల్లనో బ్లాగు మూయవలసిన పని లేదు."

  6. krishna rao jallipalli said...

    మనం వెనకడుగు వేస్తె.. ఎదుటి వాడు మరో అడుగు ముందుకేస్తాడు. దైర్యంతో మనమే ఒకడుగు ముందుకేస్తే... పలాయనం.. పరార్.(వెనక్కి తిరిగి చూడకుండా),

  7. cbrao said...

    భేష్!

  8. asha said...

    ఘాటుగా చెప్పినా మంచిగా చెప్పారు.

  9. Uyyaala said...

    మీ బ్లాగుకు మీరే రాజు/రాణి/మంత్రి/E-TV సుమన్. అలాంటప్పుడు ఈ "బ్లాగు మూయడం" ఏమిటి?
    తిరుగులేని మాట.
    మూసుకుపోయిన మన సాటి తెలుగు బ్లాగాలయాల తలుపులు మళ్ళీ తెరుచుకుంటాయని ఆకాంక్షిద్దాం.

  10. శ్రీనివాస్ said...

    మూసుకుపోయిన బ్లాగులు మళ్ళా తెరుచుకోవాలని ఆశిస్తూ,,,చెడు అనేది సర్వత్రా ఉన్నది దానికి బయపడక మన మనోభావాల సమాహారాన్ని బ్లాగుల రూపం లో అందరితో పంచుకుంటూ ఇలాగె ముందుకి పోదాం
    మీ శ్రీనివాస్

    www.sahaayafoundation.co.cc

  11. జ్యోతి said...

    Thank you..

  12. శరత్ కాలమ్ said...

    టైటిల్ చూసి మీరే బ్లాగ్ మూస్తున్నారనుకొని సంతాపం ప్రకటిద్దామనుకున్నా!

  13. శ్రీనివాస్ పప్పు said...

    "జీడి"శ్రీనివాస్"పప్పు"...నేనూ వంత పాడుతున్నా..

  14. Anonymous said...

    "పు"ట్టపు కాదు నాన్నా!!! పట్టపు..

    ఫిబ్రవరి నెల posts అన్నీ ఇప్పుడే చదువుతున్నాను. చించి ఆరేశావు. నేను కుట్టుకొని, ఇస్త్రీ చేసుకుంటా...

    సూపర్ గా వ్రాస్తున్నావు... కుమ్మెయ్!!

Post a Comment