బేతాళ కథలు - విష ప్రయోగం

Posted by జీడిపప్పు

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగి వెళ్ళి, చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నీవంటి వారిపై సాధారణంగా కుట్రలు జరుగుతూంటాయి. దాని ఫలితంగానే నువ్వీ అపరాత్రివేళ ఇన్ని పాట్లకు గురి అవుతూ ఉండవచ్చు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఉజ్జయనీ రాజుపై జరిగిన కుట్ర గురించి చెబుతాను విను" అంటూ ఇలా చెప్పసాగాడు:

ఒకప్పుడు ఉజ్జయినీ నగరంలో వజ్రగుప్తుడనే వజ్రాల వర్తకుడుండేవాడు. అతను అపూర్వమైన వజ్రాలను మాత్రమే కొనేవాడు, అమ్మేవాడు. అతని వజ్రాలను రాజులూ, మహరాజులూ మాత్రమే కొనేవారు. అపూర్వమైన వజ్రాలు ఎక్కడ ఉన్నట్టు వార్త వచ్చినా వజ్రగుప్తుడు సముద్రాలు సైతం దాటి వెళ్ళి, వాటిని ఖరీదు చేసేవాడు.

ఒకసారి అతను క్రౌంచద్వీపంలో "శిరీషకం" అనే గొప్ప వజ్రాన్ని కొన్నాడు. దాన్ని యాభై లక్షల వరహాలకు అమ్మాలని అతను నిశ్చయించుకొని స్వదేశానికి తిరిగివచ్చాడు.


పూర్తి కథ  బేతాళ కథలు బ్లాగులో ....

6 comments:

  1. లక్ష్మి said...

    భేతాళ కథలు బ్లాగు కూడా మీదేనా జీడిపప్పుగారూ? అలా ఐతే మరుగున పడిపోతున్న పాత సంచికలలోని కథలు తిరిగి పరిచయం చేస్తున్నందుకు అభినందనలు, మీది కాకపోయినా లింక్ ఇచ్చినందుకు అభినందనలు

  2. జీడిపప్పు said...

    @లక్ష్మి గారు - అవునండీ, బాగా ఆలోచించి ఒక ప్రత్యేక బ్లాగు ఉంటే శ్రేయస్కరమని ఆ బ్లాగు సృష్టించాను. వీలయితే వారానికొక కథ పోస్టు చేయడానికి ప్రయత్నిస్తాను. ఇవన్నీ http://www.ulib.org/cgi-bin/udlcgi/ULIBAdvSearch.cgi?listStart=0&url=online&title1=chandamama&author1=&subject1=Any&language1=Telugu&year1=&year2=&identifier=Any&search=Search&perPage=100

    నుండి download చేసాను. ఆ లింకుల్లో కొన్ని మాత్రమే పని చేస్తున్నాయి, కాకపోతే ఒక్కొక్క పేజీ download చేసుకోవాలి!

  3. పరిమళం said...

    మీ మరో బ్లాగ్ ద్వారా మంచి మంచి కధలు అందిస్తున్నందుకు ధన్యవాదములండీ .

  4. మరువం ఉష said...

    పైన వారిరువురూ చెప్పిన మాటే - కృతజ్ఞాభివందనలు.

  5. Anonymous said...

    "భే" కాదు "బే"తాళకథలు. సరిచేయగలరు.

  6. జీడిపప్పు said...

    @వికటకవి గారు - మంచి సూచన అందించారు. ఎందుకో "భేతాళ" అని అలవాటు అయింది. ఇపుడు సరిచేసాను, ధన్యవాదాలు.

Post a Comment