కాఫీ కప్పు

Posted by జీడిపప్పు

తమ రంగాల్లో గొప్ప స్థానాలకు చేరుకున్న కొందరు ఒకప్పటి తమ ప్రొఫెసరు ఇంట్లో కలుసుకొన్నారు. వారి మధ్య సంభాషణ  తాము  పనిలో, జీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిళ్ళు, సమస్యల వైపు వెళ్ళింది. అపుడు వృద్ధుడయిన ఆ ప్రొఫెసరు లోనికి వెళ్ళి ఒక పెద్ద ఫ్లాస్కులో కాఫీ, ఒక పెద్ద ప్లేటులో కొన్ని కాఫీ కప్పులు తీసుకొచ్చాడు.

కాఫీ కప్పుల్లో కొన్ని సాధారణమయినవి, పాతవి, కొత్తవి, మంచి డిజైన్ తో ఆకర్షణీయంగా ఉన్నవి ఉన్నాయి. అందరి ముందు పెట్టి కాఫీ  తీసుకోమన్నాడు. అందరూ ఒక్కో కప్పు తీసుకొని కాఫీ పోసుకొని త్రాగడం మొదలుపెట్టారు. అపుడు ఆయన "మీరు గమనించారా? మీ అందరి చేతుల్లో మంచి కప్పులే ఉన్నాయి. మాములువి, పాతవి ఇంకా ప్లేటులోనే ఉన్నాయి. ఉన్నవాటిలో ఉత్తమమైనదే కోరుకుంటున్నారు మీరు. అదే మీ అసంతృప్తులకు కారణం అని గ్రహించారా?

కప్పు వల్ల కాఫీ రుచిలో ఎటువంటి మార్పు రాదన్న సంగతి మరచిపోకండి. . నేను మీకు కాఫీ ఇచ్చాను కానీ మీరు అందంగా కనిపించే కప్పులు తీసుకొన్నారు, మీ పక్క వాళ్ళు తీసుకున్న కప్పులతో మీ కప్పులను పోల్చుకుంటున్నారు.

ఇలా చూడండి: జీవితం అన్నది కాఫీ. ఉద్యోగం, డబ్బు, కీర్తిప్రతిష్టలు కాఫీ తాగే కప్పు. ఆ కప్పు కేవలం కాఫీని నింపుకోవడానికే కానీ కాఫీ రుచిలో మార్పుకోసం కాదు. ఖరీదయిన, ఆకర్షణీయంగా కప్పు మనం తాగే కాఫీ రుచిని మనము ఆస్వాదించకుండా  చేయగలదు." అన్నాడు.

"ఆనందంగా ఉన్న అందరికీ అత్యుత్తమమయినవి అవసరం లేదు. తమకు అందుబాటులో ఉన్నవాటినే తమ ఆనందానికి మూలం చేసుకుంటారు. అపుడే జీవితాన్ని ఆస్వాదిస్తారు"

13 comments:

  1. మధురవాణి said...

    very good one..!!

  2. Anonymous said...

    very nice thought...

  3. లక్ష్మి said...

    Good One!!!

  4. Anonymous said...

    chala baga chepparu

  5. బుజ్జి said...

    gud one...

  6. పరిమళం said...

    మంచి టపా !cute girl picture చాలా బావుందడీ .

  7. చిలమకూరు విజయమోహన్ said...

    "ఆనందంగా ఉన్న అందరికీ అత్యుత్తమమయినవి అవసరం లేదు. తమకు అందుబాటులో ఉన్నవాటినే తమ ఆనందానికి మూలం చేసుకుంటారు. అపుడే జీవితాన్ని ఆస్వాదిస్తారు"
    చాలా బాగుంది.

  8. నేస్తం said...

    nice post :) chaalaa bagundi

  9. ఉమాశంకర్ said...

    Good one.

    బొమ్మ కూడా బాగుంది..

  10. Anonymous said...

    http://vnutravel.typepad.com/trainingday/2006/09/another_story_f.html

  11. Anonymous said...

    asala, what is jeevitam?

    have been thinking about this a lot of late...
    daily mechanical life..amma, nanna, akka, tammuDu, peLLaam, job, pay check, expenditure, property, jolly trips, movies, restaurants, anaarOgyam, doctor visits, and cyclic life..

    idEnaa?

    mari ee blog lO cheppina kauphy EnTi and kap EnTi? naakEmO nEnu indaaka cheppinavanneee kappanee anipistaadi, if that's the case, what is kauphy then?

    nuvvu cheppakapOtE anoonO karaNNO aDagaali...

  12. జీడిపప్పు said...

    కరణ్‌ను అడగండి ;)

  13. Vinay Chakravarthi.Gogineni said...

    chaala baaga vundi..............good one

Post a Comment