వేశ్యలుగా పుట్టిన వాళ్ళు - మరొక ఆస్కార్ విజేత

Posted by జీడిపప్పు

స్లమ్‌డాగ్‌ మిలియనీర్ ఆస్కార్ అవార్డులను గెలుచుకోవడం గురించి చెప్పుకుంటున్న  ఈ సందర్భంగా మనలో చాలా మందికి తెలియని మరొక ఆస్కార్ అవార్డు విజేతను తెలుసుకుందాము/ గుర్తు చేసుకుందాము. భారతదేశపు స్లమ్‌ జీవితాన్ని స్లమ్‌డాగ్‌ మిలియనీర్ లో  కళ్ళకు కట్టినట్టు  చూపించిన విధంగా,  భారతదేశంలో వ్యభిచార వాటికల్లో ఉన్నవారి జీవనాన్ని డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరించారు. అది 2005లో ఆస్కార్ అవార్డులు అందుకోవడమే కాక  ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు అందుకుంది.

కలకత్తాలోని "సోనాగచ్చి" వ్యభిచార వాటికలో ఫోటోలు తీయడానికి వెళ్ళిన Briski అనే ఫోటోగ్రాఫర్ అక్కడి వేశ్యల పిల్లలను చేరదీసి వాళ్ళకు ఫోటోలు తీయడం నేర్పింది. ఆ పిల్లలకు కెమెరాలు ఇచ్చి వారి జీవితం ఎంత దుర్భరంగా ఉందో ఫోటోలు తీయించి వాటి ఆధారంగా Born Into Brothels అనే డాక్యుమెంటరీ తీసింది. ఆ డాక్యుమెంటరీకి ఎన్నో అవార్డులు వచ్చాయి. కేవలం అవార్డులే కాక ఆ డాక్యుమెంటరీలోని పిల్లల్లో కొందరు ఫోటోగ్రఫీలో పై చదువులు చదువుతున్నారు.

ఇప్పటికే స్లమ్‌డాగ్ లో నటించిన పిల్లల జీవితాలు మారిపోయాయి. ముందు ముందు ఇలా భారతదేశంలో వేశ్యావాటికలు, మురికివాడలు, పేదరికం మొదలయినవాటి ఆధారంగా ఆస్కార్ గెలుచుకొనే చిత్రాలు మరిన్ని వస్తాయేమో. ఆ సినిమాల్లో నటించిన మరికొందరి జీవితాలు బాగుపడతాయేమో చూద్దాం.

4 comments:

  1. Kathi Mahesh Kumar said...

    ఈ సినిమా నా దగ్గరుంది. హైదరాబాద్ లో ఎవరైనా చూడాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చెయ్యండి. mahesh.kathi@gmail.com

  2. శ్రీనివాస్ said...

    torrent download link

    http://www.torrentz.com/search?q=Born+Into+Brothels

  3. Anonymous said...

    You can view online!

    Link is here!

    http://video.google.com/googleplayer.swf?docId=-4952714190753324164

  4. శ్రీ said...

    నేనూ చూసాను ఈ సినిమా.

Post a Comment