అమెరికాను బహిష్కరిద్దాం
Posted by జీడిపప్పు
సరే, ఇక అసలు విషయానికొస్తే - అమెరికా ప్రభుత్వం వందల బిలియన్లు ఇచ్చి "మీరు కొత్తవాళ్ళను తీసుకోవాలనుకుంటే అమెరికన్లనే తీసుకోండి. H1B వాళ్ళను వద్దు" అన్నది. వినడానికి అన్యాయం అనిపిస్తున్నా, నాకయితే వారివాదనలో తప్పులేదు అనిపిస్తున్నది. Of course సరి అయిన నిపుణులు లేక, పని సరిగా జరగక వాళ్ళ పాట్లేవో వాళ్ళే పడతారు, కళ్ళు తెరచి మళ్ళీ H1Bను పిలవవచ్చు లేదా మరింత outsource చెయ్యవచ్చు.
"కాలిఫోర్నియాలో ఉద్యోగాలకు కేవలం కాలిఫోర్నియా వాళ్ళనే తీసుకోవాలి" అని చెప్పిఉంటే నేనూ వ్యతిరేకించేవాడిని. వాళ్ళు చెప్పింది "ఇతర దేశస్థుల" గురించి. "ముందు మనదేశ పౌరులకు ఉద్యోగాలుండాలి, ఆ తర్వాతే ఎవరికయినా" అన్నారు. వాళ్ళేమీ భారతీయులను తీసేయమనలేదు. ఉన్నవాళ్ళను అలాగే ఉంచచ్చు కానీ కొత్తగా ఉద్యోగాలు ఇస్తే మాత్రం అమెరికన్లకే ఇవ్వాలి అంటున్నారు. ఈ రోజు అక్షరాలా 50 లక్షల మంది నిరుద్యోగ భృతి తీసుకుంటున్న అమెరికాలో ఈ షరతు సరి అయినదే అని నా నమ్మకం.
ఒక్కనిమిషం ఆలోచించండి - మన దేశంలో రోజుకు కొన్ని వేల ఉద్యోగాలు పోతున్నాయి అనుకోండి. అప్పుడు మన ప్రభుత్వం కంపెనీలకు కొన్ని వందల కోట్లు ఇచ్చింది, ఉద్యోగాలు కల్పించడానికి. అప్పుడు Infosys బెంగుళూరు ఆఫీసులో భారతీయుల బదులు చైనీయులను బెంగుళూరుకు పిలిపిస్తే ఎలా ఉంటుంది? ముందు మన దేశస్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఆ తర్వాతే బయటి దేశస్థులకు లేదా మన దేశానికి వలస వచ్చినవారికి.
ఒక నాయకుడు అమెరికా వస్తువులను బహిష్కరించాలని ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చాడు. మీలో ఎవరయినా దానిని సమర్థిస్తే, ఈ క్రిందివి కూడా చేయండి.
- మీ ఇంట్లో అమెరికా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఉంటే వెంటనే బద్దలు కొట్టండి
- అమెరికానుండి మీవాళ్ళు తెచ్చిన బహుమతులు చెత్తలో పడవేయండి
- మీ ఇంట్లో ఎవరయినా IT ఉద్యోగం చేస్తుంటే వెంటనే మానిపించండి. ఎందుకంటే 60% పైగా మన IT ఉద్యోగాలు అమెరికాకు పని చేయడానికే ఉన్నాయి
- IT లేదా అమెరికానుండి వచ్చిన డబ్బుతో కొన్న భూములు, ఇళ్ళు పేదలకు దానం చెయ్యండి
- ఇంటర్నెట్ కనిపెట్టింది అమెరికావాళ్ళే. ఇంకెప్పుడూ ఇంటర్నెట్ వాడకండి
- అన్నట్టు మరచిపోయాను, బ్లాగు అన్నది అమెరికావాళ్ళ ప్రాడక్టు. ఇంకెందుకు ఆలశ్యం...బ్లాగింగు మానెయ్యండి.
February 21, 2009 at 8:52 PM
నిజంగా విశ్వమానవులండీ మీరు. అందుకే అంత నిష్పాక్షికంగా అమెరికాను సమర్ధించగలుగుతున్నారు. మీలా అంతా ఉంటే అసలు ఈపాటికే వసుధైక కుటుంబకం అన్న భారతీయనానుడి నిజమైపోయి ఉండేది. కొన్ని చిన్న సందేహాలు -
1. అమెరికా వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకుంటామని అన్నప్పుడు, భారతీయులు తమ వస్తువులు తాము వాడుకుంటామని అనడంలో తప్పేముంది?
2. ఓ... మీరు సమాధానం చెప్పేసారే - అమెరికా వాళ్ళు కనిపెట్టిన లాప్టాపులని విరగగొట్టమని. తప్పకుండా...అమెరికాలో ఉన్న అందరు భారతీయులని వెనక్కి పంపేసినప్పుడు ఆ పని తప్పకుండా చేస్తాము. వాళ్ళకి కావాల్సిన కొంత నైపుణ్యాన్ని వాళ్ళు మన దగ్గరనుంచి వాడుకున్నప్పుడు వాళ్ళ పరికరాల్ని ఇక్కడ వినియోగించడంలో తప్పులేదు కదా! అయినా ఇక్కడ వాడబడుతున్న లాప్టాపులన్నీ విరగగొట్టబడితే అమెరికాకు జలుబు ముదురుతుంది - మరిన్ని కంపనీలు మూతపడతాయి.
3. అయ్యబాబోయ్ - మీరేదో అమెరికా ఎంతో దానవీరశూరకర్ణ స్థాయిలో భారతదేశానికి డబ్బులు పంచిపెట్టిందన్నట్టు మాటాడుతున్నారే. అమెరికా డబ్బు కూలి పని చేయించుకుని ఇచ్చింది. ఆ పనినంతా అమెరికాని వెనక్కు ఇచ్చెయ్యమనండి. అప్పుడు డబ్బులు దానం చెయ్యడం సంగతి ఆలోచిద్దాము.
4. కంప్యూటర్ సున్నా లేకుండా పనిచెయ్యదు. సున్నా భారతీయ ప్రొడక్టు. కాబట్టి అమెరికాని కంప్యూటర్ వాడడం మానెయ్యమనండి ముందు. ఆ తరువాత ఇంటర్నెట్, బ్లాగింగు భారతీయులందరూ మానేస్తారు.
అయ్యా! వెరసి నే చెప్పొచ్చేదేమంటే, వాళ్ళకి అవసరమైనప్పుడు మన జనాల్ని మోసుకెళ్ళారు. ఇప్పుడొద్దు మానేస్తామంటున్నారు - అది వాళ్ళిష్టం. వాళ్ళు వాళ్ళ దేశం బాగు చూసుకుంటున్నప్పుడు, మన దేశం ప్రొడక్టులువాడి మన కంపనీల్ని బతికించండి అని ఇంకొకరు అంటే రెండిటికీ తేడా ఏముంది?
అయినా ఈ విడగొట్టడాలు రాజకీయుల పని. చక్కగా బ్లాగులు రాసుకునే మీకెందుకండీ ఇలాంటి ఆవేశాల్ని రేకెత్తించడం?
February 21, 2009 at 9:16 PM
కృష్ణమోహన్ గారూ,
వాళ్ళేమీ భారతీయులను తీసేయమనలేదు. ఉన్నవాళ్ళను అలాగే ఉంచచ్చు కానీ కొత్తగా ఉద్యోగాలు ఇస్తే మాత్రం అమెరికన్లకే ఇవ్వాలి అంటున్నారు. అది సబబుగానే ఉంది.
అన్నట్టు కంప్యూటర్లను పగలగొట్టమన్నది "అమెరికా ప్రాడక్టులు బహిష్కరించాలి" అనేవాళ్ళను ఉద్దేశించి. మీరు కూడా వారిలో ఒకరా :)
February 21, 2009 at 10:24 PM
ఇక్కడ గుర్తుంచుకోవలసినవి:
1. కేవలం స్టిమ్యులస్ పేకేజ్ ఇవ్వబడిన కంపెనీలకే "ముందు అమేరికన్లు" అనేది వర్తిస్తుంది. విడేసీయులకి ఉద్యోగాలు ఇవ్వడానికి ఫైనాన్షియల్ ఎయిడ్ అంటే ఏ దేశంలొ అయినా ఎబ్బెట్టుగా ఉంటుంది.
2. హెచ్ 1 బీ - కేవలం భారతీయులకే పరిమితం కాదు - అదేదో భారతీయుల జన్మహక్కులా మాట్లాడే రాజకీయ నాయకుల్ని చూస్తే చిర్రెత్తుకొస్తుంది.
3. "కంప్యూటర్ సున్నా లేకుండ పనిచెయ్యదు" ... అసలు కంప్యూటర్ లో సున్నా ఎక్కడ ఎలా ఉంటుందో చెప్తారా కాస్త?
ఇక్కడ గుర్తుంచుకోవలసినవి:
1. కేవలం స్టిమ్యులస్ పేకేజ్ ఇవ్వబడిన కంపెనీలకే "ముందు అమేరికన్లు" అనేది వర్తిస్తుంది. విడేసీయులకి ఉద్యోగాలు ఇవ్వడానికి ఫైనాన్షియల్ ఎయిడ్ అంటే ఏ దేశంలొ అయినా ఎబ్బెట్టుగా ఉంటుంది.
2. హెచ్ 1 బీ - కేవలం భారతీయులకే పరిమితం కాదు - అదేదో భారతీయుల జన్మహక్కులా మాట్లాడేవాళ్ళని చూస్తే చిర్రెత్తుకొస్తుంది.
3. "కంప్యూటర్ సున్నా లేకుండ పనిచెయ్యదు" ... అసలు కంప్యూటర్ లో సున్నా ఎక్కడ ఎలా ఉంటుందో చెప్తారా కాస్త?
4. "Infosys బెంగుళూరు ఆఫీసులో నలుగురు భారతీయులను తీసివేసి ఇద్దరు చైనీయులను బెంగుళూరుకు పిలిపిస్తే ఎలా ఉంటుంది?" - This is the point to be highlighted!
February 21, 2009 at 11:08 PM
వాదనలోకి దిగకూడదు అనుకుంటూనే దిగిపోయాను. మరి ఇప్పుడు వాదించక తప్పదు కదా! :)
నేను పైన చేసిన వాదన తాలూకు ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే మన జనాల్ని మోసుకెళ్ళినరోజు గానీ, ఇవాళ వద్దన్న రోజుగానీ అప్పుడూ ఇప్పుడూ అమెరికా తన బాగునే చూసుకుంది. అందులో తప్పులేదు. ఇప్పుడు వాళ్ళు బాగోలేరు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు చూసుకుంటున్నారు అని వాళ్ళకి సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. Finally it comes down to business - survival and profitability - atleast in case of United States.
అలాగే అమెరికా తన బాగు మాత్రమే తాను చూసుకోవడంలో తప్పులేదు అని ఏకీభవించినతర్వాత మనం మన బాగు చూసుకోవడంలో తప్పేముంది?
అమెరికా తనకి లేని రిసోర్సులు పైనుంచి తెచ్చుకోవచ్చు - అవకాశం ఉంటే అమెరికన్లకే ఉద్యోగాలివ్వాలి. ఇది చాలా మంచిమాట కదా! నేనన్నదీ అంతే. కావల్సిన లేప్టాపులూ, డబ్బులూ అక్కడ నుంచి తెచ్చుకో - ఇక్కడ దొరికేవి ఇక్కడి కంపనీలవి వాడు అని ఎవరైనా అంటే మొదటిది రైటూ, రెండోది తప్పూ ఎలాగో నాకోసారి వివరిస్తే బాగుంటుంది.
హెచ్ 1 బీ భారతీయుల జన్మహక్కని నేనైతే అనుకోవటంలేదు. కానీ అమెరికా ఏ నిర్ణయం తీసుకున్నా అది విశ్వమానవ కళ్యాణం అని మాటాడేవాళ్ళని చూస్తే చిర్రెత్తుకొస్తుంది. వాళ్ళ దేశ పరిస్థితులబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అందులో తప్పు ఎలాగ ఉండదో, మన దేశానికి సరిపడ్డట్టు మనం ప్రవర్తించడం కూడా తప్పు కాదు.
చూడబోతే మీరంతా రాజ్ థాక్రే కరక్టే చేసాడు అని వాదించేటట్టున్నారే. అది దేశం - ఇది రాష్ట్రంలాంటి సమాధానాలివ్వకండేం - రెండూ ఊహాత్మకమైన అడ్డుగోడలే - నాకైతే రెంటికీ పెద్ద తేడాలేదు.
"కంప్యూటర్ సున్నా లేకుండ పనిచెయ్యదు" ... అసలు కంప్యూటర్ లో సున్నా ఎక్కడ ఎలా ఉంటుందో చెప్తారా కాస్త? - చూపించలేనండి. మనిషిలో ప్రాణం ఎక్కడ - ఇలాంటి ప్రశ్నలడిగితే ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలియదు. కాబట్టి మీ సందేహం తీర్చలేనందుకు క్షంతవ్యుడిని.
"Infosys బెంగుళూరు ఆఫీసులో నలుగురు భారతీయులను తీసివేసి ఇద్దరు చైనీయులను బెంగుళూరుకు పిలిపిస్తే ఎలా ఉంటుంది?"
- ఇదే పని అమెరికా మొన్నటి దాకా చేసిందండి. ఎందుకంటే అమెరికా కూలివాళ్ళ కంటా భారతకూలివాళ్ళు చవక. అప్పుడు లాభం కాబట్టి ఆ పని చేసారు. ఇప్పుడు గవర్నమెంటు డబ్బు కావాలి కాబట్టి వీళ్ళని తీసేసి అమెరికావాళ్లని వేసుకుంటాయి. ఇదీ కంపనీ సొంత లాభం కోసమే. ఆపాటి దానికి వాళ్ళని సమర్ధించడం అవసరం లేదు.
ముగింపుగా - నాకేమీ అమెరికా ద్వేషం లేదు. మనం చేసేదంతా రైటు అన్న కుందేటి కాలిని పట్టుకుని కూడా లేను. బ్లాగింగు వదిలెయ్యండి - ఇంటర్నెట్ వాడకండి - అమెరికా లేకపోతే మీకు దిక్కులేదు అంటే కొంచెం చిర్రెత్తుకొస్తుంది.
I am using my internet because I am paying for it. And if America invented it - It is getting the money. So, if I have to be grateful to America, it is the same case the other way also. It is a business and moral/emotional blackmailing is not necessary here.
February 21, 2009 at 11:33 PM
మనం అసలు సంగతి ఒకటి మరచి పోతున్నాము. అసలు వాడు మనకి ఉద్యోగాలివ్వడమేమిటీ. మనకొరకు మనం ఐ.టి.ని ఏమేరకు ఉపయోగించుకొంటున్నాము. వాడి సబ్బులు, పేస్టులు, నాప్కిన్స్ లెక్కలు చేయడానికి మనం పనిచేసి, జీతాలు చూసుకొని మురిసిపోతున్నాం. ఇక్కడ మనదేశంలో జనాలకే లెక్కలేకుండా పోయింది. మన ప్రజలు, భూమి, సంపదలెక్కలన్నీ తేలాయా? లెక్కలు లేక ఇక్కడి సంపద, వనరులు ఎంత వృధా అయిపోరున్నాయి? ఎంత దోపిడీకి గురౌతున్నాయి?
మనం మనకొరకు పనిచేసుకొని మనదేశంలోనే ఉద్యోగావకాశాలు సృష్టించుకోవాలి. ఐ.టి.ని ఉపయోగించుకొని మన వ్యవస్థని సక్రమంగా నిర్మించుకొవాలి.
February 22, 2009 at 12:07 AM
నేను పైన చేసిన వాదన తాలూకు ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే మన జనాల్ని మోసుకెళ్ళినరోజు గానీ, ఇవాళ వద్దన్న రోజుగానీ అప్పుడూ ఇప్పుడూ అమెరికా తన బాగునే చూసుకుంది.
---------------------------------------------
Exactly! ఏ దేశమయినా ముందు తన బాగునే చూసుకుంటుంది - ముఖ్యంగా కష్టకాలంలో. నేననేది ఏమిటంటే ఈ కొత్త హెచ్ వన్ బీ పాలచీ వల్ల విదేసీయులు కొంత మంది నష్టపోయారు. మరి చైనా లో మెక్సికో లో ఇలాంటి బహిష్కరణలు జరుగుతున్నాయా అంటే - నేనయితే వినలేదు.
అన్నట్టు హెచ్ 1 బీ వ్యాఖ్య మిమ్మల్నుద్దేశించి కాదు. మిమ్మల్నుద్దేశించి చేసింది ఆ సున్నా వ్యాఖ్య మాత్రమే - మిగతావన్నీ జనరల్ గా చేసినవి.
ఇకపొతే మీరన్నది - "ఇదే పని అమెరికా మొన్నటి దాకా చేసిందండి"
కాదండీ. పనిచేసెందుకు మనుషులు చాలాక అమేరికా ఆ పని చేసింది ఇన్నాళ్ళూ (ఏవో మైక్రోసాఫ్ట్ లాంటి ఒకటి రెండు కంపెనీలు మినహా)
మనిషి ప్రాణం సంగతంటారా - "ప్రాణం" అనే పదాన్ని నిర్వచించడాన్ని బట్టి ఉంటుంది. దాన్ని ఒక స్థితి గా తీసుకుంటే మెదడులో, తత్వమైయ్తే రక్తంలో ఉంటుందని నా ఉద్దెశ్యం!
February 22, 2009 at 12:21 AM
Newayz lemme make myself clear ... (Kshamimchaali .. naa Telugu Editor hang ayyindi)
What I meant to say was this is a difficult time for the US and when the Govt is financially supporting a few firms it's only natural that the Citizens come first, due to its compulsions. Boycotting the US goods for this reasons sounds flimsy to me.
I support the US boycott for indirectly supporting terrorism in India or for not allowing India to secure a permanent seat in the security council, but somehow unable to justify this particular thing - the reason being the same ... this policy hits all H1-B holders hard irrespective of the nationality - So considering this as an anti-Indian move puzzles me.
February 22, 2009 at 12:32 AM
Hmm... let me also make my last comment.
I support US goods boycott for the same reasons that it is reducing H1B. It is doing for its own country sake. We have to increase Indian product consumption, because it will help Indian companies/Indians just a bit more. No hatred/anti-american feelings are intended.
నా బాధ ఏమిటంటే ఏంటీ-ఇండియన్ అని అమెరికాని చూసి ఏడ్చే బదులు వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు కదా! అని - వాళ్ళు అవకాశం ఉన్నచోట స్వదేశీ అంటున్నారు - మనంకూడా అనచ్చు కదా అని.
February 22, 2009 at 3:25 AM
వాళ్ళు అవకాశం ఉన్నచోట స్వదేశీ అంటున్నారు - మనంకూడా అనచ్చు కదా అని.
_______________________________________________
I am all for it. In fact many of the so called American Consumer Products are made in India/China/Bangladesh but you hardly find that stuff in the Indian malls, cost being the factor. I never said "Buy American" .. I always say BUY WHAT IMPRESSES YOU. If the Indian products beat their American counterparts in terms of quality, why not embrace Indian Goods irrespective of the cost? Nobody is forced to buy anything in India.
Thats what US guys are saying even in terms of H1-B. If you gave an American and an H1B of the same quality then take an American. if you dont find one then go for H1B.
It may sound as a joke to you in this context but, for a short period, I was heading a small group belonging to Swadeshi Jagaran Manch long time ago.
February 22, 2009 at 4:36 AM
మనం విండోస్ వాడడం మానేసి ఉబుంటు లాంటి ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడితే చాలు, మైక్రోసాఫ్ట్ కంపెనీ కొమ్ములు విరుగుతాయి. ఉబుంటులో స్కానర్లు, లేజర్ ప్రింటర్లు, లాన్ కార్డులు బాగా పనిచేస్తాయి, ఇంటర్నెట్ కనెక్ట్ చెయ్యడం కూడా అందులో సులభమే. మనం మైక్రో సాఫ్ట్ లాంటి అమెరికన్ కంపెనీలని దివాలా తియ్యించడంలో సఫలమైనా అమెరికాకి ఇంకొక వాత పెట్టినట్టే. ఈ వాతలు సరిపోవు కానీ మన కంటే అల్-కైదా అమెరికాకి పెద్ద షాకులు ఇవ్వగలదనుకుంటాను.
February 22, 2009 at 5:22 AM
Many of the Windows installations in India are pirated. So Microsoft doesnt earn anything from that. The companies which deliver US projects have to use MS products because of the Client requirements. Thus, the only chance India has to hit microsoft is though 100% Indian product development companies.
First of all not many Indian cos are into Product Development / Research.
Even those companies cant take risk with amateur OS like Ubuntu. Opensource always carries the risk pertaining to reliability.
February 22, 2009 at 8:26 AM
Ubuntu is more secure than Windows. There are also free C & Java compilers available for Ubuntu and it is developer friendly. There are some people even in small towns who use licensed versions of microsoft's softwares. Even I had licensed CD of Windows 2003 in past. Now, another ISP operator in our town is using Windows 2003 licensed version.
February 22, 2009 at 10:03 AM
@ISP Administrator
మైక్రోసాఫ్ట్ కొమ్ములు విరిచేసి అందులో పనిచేస్తున్న ఉద్యోగుల్ని రోడ్డున పడేసి ఏం సాధిద్దామనుకుంటున్నరో కొద్దిగా సెలవిస్తే ...
కొత్తగా ఒకరికి ఉపాధి కల్పించలేని ప్రతి ఒక్కరూ మాట్ల్లాడడమే.
February 22, 2009 at 11:03 AM
కృష్ణమోహన్ గారు - ఇలాంటి జాతీయ విపత్తుల్లో "దేశం" అన్న మాటే కానీ "రాష్ట్రం" అన్న మాట కూడా వినపడకూడదు.
"అమెరికా తన బాగునే చూసుకుంది" ---- ఏ దేశమయినా ముందు వాళ్ళ బాగునే చూసుకోవాలి కదా?
"మన బాగు చూసుకోవడంలో తప్పేముంది?" ---- తప్పే లేదు. ఏమి చేస్తారు మరి? ఏ ఏ అమెరికా ప్రాడక్టులు బహిష్కరిస్తారు, ఏవి బహిష్కరించరు?
"బ్లాగింగు వదిలెయ్యండి - ఇంటర్నెట్ వాడకండి - అమెరికా లేకపోతే మీకు దిక్కులేదు అంటే కొంచెం చిర్రెత్తుకొస్తుంది." ----- ఆ మాటలన్నది రాజ్ థాక్రే లా "అమెరికా సరుకులు బహిష్కరించాలి" అన్న వాళ్ళను. మరి మీరు అది సమర్థించి ఏమన్నా బహిష్కరిస్తున్నారా? అలా అన్న వాళ్ళకే కానీ మిగతా వాళ్ళకు వర్తించవు.
"We have to increase Indian product consumption" ----- సరిగ్గా చెప్పారు. కాబట్టి దాని గురించి ఆలోచించి ముందు మన దేశంలో ఏమి జరగాలో చూడాలి మన నాయకులు. అప్పటివరకు మన IT అన్నది అమెరికా వాడి కూలీ అన్న సంగతి మర్చిపోకూడదు. వాళ్ళకు ఇష్టమొచ్చిన కూలీలను కూలిపనికి పెట్టుకుంటారు. అమెరికావాడు దయతలచో. cheap labour అనో H1Bలు ఇస్తే తీసుకోవడమే కానీ, H1Bలకు కూడా ఉద్యోగాలివ్వండి అని చెప్పడానికి మనకు హక్కు లేదు.
February 22, 2009 at 12:17 PM
ISP Admin,
The major problem with Opensource is with regards to reliability. If Ubuntu turns out to be better than Windows, people would embrace it even in the US, not just in India. The users will go for the best OS available - be it Ubuntu or Windows. If you feel that Ubuntu is better then go ahead - others who feel that Windows is more mature will go for it.
February 22, 2009 at 12:32 PM
"Infosys బెంగుళూరు ఆఫీసులో నలుగురు భారతీయులను తీసివేసి ఇద్దరు చైనీయులను బెంగుళూరుకు పిలిపిస్తే ఎలా ఉంటుంది?" ఇదే ఈ బ్లాగు కి సమాదానం..
రాష్ట్రాల మద్యనే ఇలాంటి వాతారణం కల్పించే రాజ్ థాకరె లు, ఒకె రాష్ట్రం లొ వివిధ ప్రాంతాలమద్య ఇలాంటి వాతారణం కల్పించే కెసీఆర్ లు వున్న మనం అమెరికా వాళ్ళని విమర్శిస్తున్నం.
కరక్టె .. మనం స్వదెశి అంటె బాగానే వుంటుంది..కానీ .. మనం ఇప్పుడు వున్న పరి స్తితులలొ అది పూర్తిగ అమలుపరిచె సీన్ మనకు లేదు.. అది నిజం.. ఉదాహరణలు పైన జీడిపప్పు గారి బ్లాగు లొ వున్నాయి.. వీలయినంత వరకు స్వదెశీ వాడితె బాగానే వుంటుంది మరి.. రెజర్ బ్లెడు కు , చిన్న పిల్లల ఆట వస్తువులకు కూడ చైనా , అమెరికా ల వేపు చుసె మనం స్వదెశి అంతె కొద్ది కస్టమే.
February 22, 2009 at 6:40 PM
One credible way to stop the American Goods: BUILD SOMETHING BETTER! CAN'T WE?
February 23, 2009 at 2:42 AM
ఇళ్లలో పిల్లకాయలు, చుట్టాలు, పక్కాలు డాలర్లకోసం ఎగేసుకుని అమెరికాకి ఎగిరెళ్లినప్పుడు, డిగ్రీ పూర్తయ్యీ కాకుండానే కాల్ సెంటర్లలో వేల రూపాయల ఉద్యోగాల్లో చేరినప్పుడూ అమెరికా వోడు దేవుడు. ఇప్పుడు వాడే దెయ్యం! పక్కవాడిపై పడి ఏడిచే విద్యలో మనకెవరూ సాటి లేరు, రారు. మనమెలా బాగు పడాలో ఆలోచించటం మానేసి, పక్కోడు నాశనమైపోవాలని కోరుకునే వాళ్లు ఎక్కువయ్యే మన దేశం ఇలా ఉంది.
February 25, 2009 at 4:34 PM
@ Malakpet Rowdy said...
One credible way to stop the American Goods: BUILD SOMETHING BETTER! CAN'T WE?
I totally agree with this! Do something better! Do not hate! If you do not like it make it better than them.
June 12, 2009 at 1:56 AM
i will agree with u............mana vallu services chestunnaru ante mana vallu research lo vunnavallani easy ga lekkapettavachhu........
anni technologies vallavi use chesukuntu ohhh marala vallane tidutaaru.........tikkalo 60 years daatindi intavaraku nuclear fuel recycling technology ledu pedda chebtaaru memu podichestam ani...........
babu isp...ikka andaru choosedi secure ani kadamma user friendly na kaada ani.........
edo edo chebutav entayya babu........