ఒబామా మంత్రం ఫలిస్తుందా?

Posted by జీడిపప్పు

ఆర్థిక మాంద్యంతో అతలాకుతలమవుతున్న అమెరికాను గట్టెక్కించడానికి ఒబామా ప్రకటించిన కొత్త Stimulus Package లో కొన్ని ముఖ్యాంశాలు:
  • రోడ్లు, నిర్మాణాలు, బ్రిడ్జిల రిపేర్లకు $120 బిలియన్లు, విద్యకు $100 బిలియన్లు, ఇంధన/శక్తి ఉత్పాదనకు $30 బిలియన్లు
  • ఆరోగ్యానికి $10 బిలియన్లు, నాసాకు $2 బిలియన్లు
  • హై-స్పీడ్ రైలు వ్యవస్థకు $8 బిలియన్లు, Amtrak రైళ్ళకు $1.3 బిలియన్లు
  • అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇళ్ళను కొనుగోలు చేయడానికి $2 బిలియన్లు, ఇళ్ళు లేనివారికి $1.5 బిలియన్లు
  • ఏడాదికి $125,000 కంటే తక్కువ సంపాదన ఉన్నవారు 2009లో కొత్త కారు కొంటే సేల్స్ ట్యాక్స్ కట్టనవసరం లేదు
  • మొదటిసారి ఇల్లు కొంటున్నవారికి $8,000 ట్యాక్స్ చెల్లింపు
  • ఒక్కరి సంపాదన $80,000 కంటే లేదా కుటుంబ సంపాదన $160,000 కంటే తక్కువ ఉంటే కాలేజ్ ఫీజులో $2,500 పన్ను మినహాయింపు
  • ఒక్కరి సంపాదన $75,000 కంటే లేదా కుటుంబ సంపాదన $150,000 కంటే తక్కువ ఉంటే ఒక్కరికి $400 లేదా కుటుంబానికి $800 చెల్లింపు
(ఒక బిలియన్ = 1,000,000,000. $1 బిలియన్ = సుమారు 5000 కోట్ల రూపాయలు)

చివరి పాయింటుకు, అంటే ఏమీ ఖర్చు పెట్టని వాళ్ళకు కూడా డబ్బు ఇవ్వడం, నేను పూర్తి వ్యతిరేకిని. ఈ పరిస్థితుల్లో ఒక మధ్య తరగతి కుటుంబానికి ఓ $800 ఇస్తే వాళ్ళు ఆ డబ్బు ఖర్చుపెడతారా లేక జరుగుతున్నవి చూసి ఆ డబ్బు ఖర్చుపెట్టగలిగే స్థితిలో ఉన్నా దాచుకుంటారా? ప్రజలకు డబ్బు ఇవ్వకూడదు. ఆ డబ్బుతో మరిన్ని ఉపాధి అవకాశాలు కలిగించాలి, డబ్బు చేతులు మారేలా చేయాలి. జార్జ్ బుష్ అన్ని బిలియన్లు కుమ్మరించాడు. ఏమయింది? ఒబామా ప్రణాళికలో 35 శాతం ట్యాక్స్ కోతలు/చెల్లింపులు, 65 శాతం ఖర్చులు ఉన్నాయి. ఇవి 20-80 శాతాలుగా ఉండి ఉంటే బాగుండేదేమో.

50 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఒబామాకు ఇవన్నీ ఎంత దోహదం చేస్తాయో చూద్దాం. అంతా మంచే జరగాలని, అమెరికా తొందరగా కోలుకోవాలని ఆశిద్దాము.

5 comments:

  1. swapna@kalalaprapancham said...

    manchi knowledge,naku kuda konchem appu istara mi knowledge.

  2. Anil Dasari said...

    ఆ $400/$800 ఖర్చు పెట్టొద్దు, అత్యవసర పరిస్థితులకోసం దాచుకోండి అంటూ కొందరు మహా ఎకనమిస్టులు ఇప్పటికే ఉచిత సలహాలు కుమ్మరించే పన్లో బిజీ బిజీగా ఉన్నారు. వీళ్లని లాగి పెట్టి తన్నాలి.

  3. Malakpet Rowdy said...

    ఊరికే 800 ఇవ్వడం కన్నా - ఏదైనా కొనుక్కోమని తరవాత రీ ఇంబర్స్ చేస్తే బాగుంటుందేమో?

  4. జీడిపప్పు said...

    @swapna@kalalaprapancham గారు - ఇదంతా కాపీ కొట్టిన నాలెడ్జి :)

    @అబ్రకదబ్ర గారు - సరిగ్గా చెప్పారు

    @రౌడీ గారు - ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కష్టమేమో!

  5. Anonymous said...

    i want to know the reson for that crunch? some body said closing banks. can 4 or 5 banks crete this much of effect? i studied one finance paper. if any body have patiency explain with both telugu, english terms. i may understand at least one.my mail id is vasuc@lntecc.com

Post a Comment