$10 కే ల్యాప్‌టాప్!

Posted by జీడిపప్పు

గతవారం తిరుపతి శ్రీ వెంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో మన సాంకేతిక శాఖ కార్యదర్శి  "పది డాలర్లకే ల్యాప్‌టాప్" అని చెప్పి యావత్ ప్రపంచం ముక్కు తీసి వేలు పైన వేసుకొనేలా చేసారు. ఒక మంచి ల్యాప్‌టాప్ $500 కు దొరుకుతున్నది. ఆ మధ్య MITలో ఓ సైంటిస్టు "$100 కే పిల్లలకు ల్యాప్‌టాప్" అని ఒక ల్యాప్‌టాప్ రూపకల్పన చేసి కాస్తో కూస్తో విజయం సాధించాడు. అంతలో మనవాళ్ళు కేవలం పదిడాలర్లకే ల్యాప్‌టాప్ అంటూ బాంబు పేల్చారు. ఇది తెలిసి కంప్యూటర్ తయారీదారులయిన Dell, HP లాంటి కంపెనీలు ఉలిక్కిపడ్డాయి. కానీ ఆ తర్వాత తేలిందేమిటంటే, అది కేవలం Storage Device మాత్రమే, స్క్రీన్ కావలంటే ఇంకో $20 అవుతుంది, ఇంకా పూర్తి వినియోగ దశలో లేదు అని.

" ప్రపంచమంతా చూస్తున్నపుడు సరి అయిన అవగాహన లేకుండా చెప్పడమెందుకు? చెప్పి నవ్వులపాలు కావడమెందుకు? మొత్తం ల్యాప్‌టాప్ యే 50 డాలర్లో అని నిజం చెప్పొచ్చుగా? ఇపుడు విదేశీయులు $10కే ల్యాప్‌టాప్ పెద్ద జోక్ అని మనల్ని చూసి నవ్వుతున్నారు. భారతీయులు అందరూ సిగ్గుపడాలి ఇలాంటివి చూసి.  ఇకనుండి మనము అమీర్‌పేట్ లో ఎలా తలెత్తుకుని తిరగగలము?" అనుకొనేవాళ్ళు కాసేపు సిగ్గుపడి సిగ్గుతో మొగ్గలవండి.

జరిగిందేదో జరిగిపోయింది. నాకయితే మనవాళ్ళు సాధించినది నిజంగానే గొప్ప వార్త అనిపించింది. మనకున్న పరిమిత వనరులతో, అవకాశాలతో $100కు  ల్యాప్‌టాప్ వచ్చినా అంతకంటే ఏమి కావాలి? పైగా ఇది ఆరంభం మాత్రమే, ఎవరికి తెలుసు తొందర్లో నిజంగా $10 కే మంచి ల్యాప్‌టాప్ వస్తుందేమో! ఈ సందర్భంగా ఇప్పటివరకు సాధించిన పురోగతికి మన శాస్త్రవేత్తలకు ఒకసారి జై కొడదాం. Image Hosted by ImageShack.us


 $10 కే ల్యాప్‌టాప్  న్యూస్ చూసి నేను క్రింద చెప్పబడిన ఒక్కో పాయింటు తలచుకుంటూ కూర్చుకున్న కుర్చీ నుండి ఒక్కో అడుగు గాలిలో తేలడం మొదలు పెట్టాను
  • ప్రతి ఇంట్లో తల ఒక్కింటికీ ఒక ల్యాప్‌టాప్ ఉంటుంది
  • పిల్లలకు పుస్తకాల మోత ఉండదు. పిల్లలు వంగిపోయి ఆ ఐదు కిలోల సంచి మోయనక్కర్లేదు. చిన్న ల్యాప్‌టాప్ పట్టుకొని నిటారుగా నడుస్తూ స్కూలుకు వెళ్తారు
  • మా చంటిది క్లాస్ రూంలో టీచరు చెప్తున్న rhymes అన్నీ తన బ్లాగులో Live Update చేస్తుంటుంది
  • మా చంటోడు బస్‌స్టాప్ లో కూర్చొని Anonymus పేరుతో తన ఫ్రెండ్స్ బ్లాగుల్లో బండ బూతులు తిడుతుంటాడు.
  • పాల అంకుల్, పనిమనిషి ఆంటీ, చెత్త అంకుల్ వచ్చి మా ఆవిడను "అమ్మగారు ఈ పండగకు ఓ ల్యాప్‌టాప్ ఇప్పించండి" అంటారు
  • మా చంటోడితో మా ఆవిడ "నాన్నా నీ ల్యాప్‌టాప్ ఫార్మాట్ చేసి చెత్తంకుల్‌కు ఇవ్వు" అంటుంది. వాడిచ్చిన ల్యాప్‌టాప్ చూసి చెత్తంకుల్ మొహం సంతోషంగా వెలిగిపోవడం చూసిన నా కళ్ళలోని సంతృప్తిని చూసిన మా ఆవిడ మొహంలోని   ఆనందాన్ని చూసిన  మా చంటిది కేరింతలు కొట్టడం చూసి మా చంటోడు గంతులు వేస్తుంటాడు
ఏదో శబ్దం వస్తుంటే అనుమానంతో తలెత్తి చూస్తే ఫ్యాన్‌కు ఒకడుగు దూరంలో ఉన్నాను, అంతే, దబ్బున మళ్ళీ కుర్చీలో పడ్డాను.

500 రూపాయలకే ల్యాప్‌టాప్ వస్తే మీ ఇంట్లో ఎలా ఉంటుందో ఊహించుకొని మీరు కూడా కాసేపు గాలిలో తేలండి మరి!!

అన్నట్టు మీరు బ్లాగు ప్రతిజ్ఞ చేసారా?

9 comments:

  1. Anonymous said...

    Chala Baga chepparandhi.blogs,comments,chetta uncle,panimanishi aunty super. :)

  2. swapna@kalalaprapancham said...

    కేక బాబు కేక.

  3. Anonymous said...

    LOL :)) ....

  4. ఉమాశంకర్ said...

    "ఇకనుండి మనము అమీర్‌పేట్ లో ఎలా తలెత్తుకుని తిరగగలము?" అనుకొనేవాళ్ళు కాసేపు సిగ్గుపడి సిగ్గుతో మొగ్గలవండి. "
    హ హ హ

  5. Anonymous said...

    The problem with us Indians is that we want instant publicity and later we won't mind to fade out. Same case with Ramar Pillai, $50 laptop or $10 laptop or some operating system created by another 8th grade kid that tops windows NT (hmm). Why do we do this? The answer was explained by Paul Burton decades ago. Read his books. (A Search in Secret India).

    The joke is that even IITs and IISc and major institutions are not against this top-of-the-world-for-ten-minutes rule. What a shame!

  6. Anil Dasari said...

    ఎంత మన్నికలేని విడిభాగాలతో తయారు చేసినా, ఐదొందల రూపాయలకి తయారు చెయ్యటం ఎలా కుదుర్తుంది? సర్క్యూట్లలో బంగారం బదులు ప్లాస్టిక్ తీగలో, ట్వైన్ దారమో వాడే పద్ధతెవరన్నా కనుక్కున్నారా, లేక రాత్రికి రాత్రి బంగారం ధరలు పాతాళంలోకి పడిపోయాయా?

  7. నేస్తం said...

    ha ha ha super

  8. జీడిపప్పు said...

    @సతీష్ జి కుమార్ గారు , @swapna@kalalaprapancham గారు , @Deepthi గారు , @ఉమాశంకర్ గారు , @నేస్తం గారు - ధన్యవాదాలు

    @ Anonymous గారు - ఈ shame ని ఎలా తట్టుకుంటున్నారో కాస్త చెప్పండి.

    @అబ్రకదబ్ర గారు - :)

  9. చైతన్య said...

    500 రూపాయలకే లాప్ టాప్ వస్తే ఎంచక్కా ప్రతి నెలా సరుకులతో పాటు కొత్తది కోనేస్కోవచ్చేమో :D

Post a Comment