భారతీయులు సిగ్గుపడాలి
Posted by జీడిపప్పు
పబ్ లో పార్టీ చేసుకుంటున్న అమ్మాయిల పైన దాడి జరగడం అత్యంత శోచనీయం. అందుకు రామ సేన చెప్పిన కారణం:
Sudhir, district convener of Sri Rama Sene says "there is lot of upheaval in the society, alcoholism, pub culture, meaningless partying, obscene dancing which includes soft pornographic positions and open caressing and kissing has become common among the youth. Such open show of lust is not our culture".
మనది స్వతంత్ర్య దేశం. ఎవరయినా తనకు నచ్చినది చేసుకోవచ్చు, అది చట్టాన్ని ఉల్లఘించనంతవరకు. అలాంటప్పుడు ఈ అమ్మాయిలు చేసిన తప్పేమిటి? అమ్మాయిలు మందు తాగుతుంటే ఆ మందు అమ్ముతున్న బార్ పైన దాడి చేయాలి. అమ్మాయిలు తాగిన మైకంలో అశ్లీలంగా నృత్యాలు చేస్తుంటే ఆ నృత్యాలు చూస్తున్న వారిని కొట్టాలి. అంతేగానీ అన్నెం పున్నెం ఎరుగని అమ్మాయిల పైన దాడులు చేసిన వీళ్ళు మగాళ్ళా లేక .... ?
పేరుకు స్వాతంత్ర్యం వచ్చిందే కానీ, ఆడదానికి వచ్చిందా? ఆడవాళ్ళు సిగరెట్లు తాగకూడదు, మందు కొట్టకూడదు, రెచ్చకొట్టే విధంగా బట్టలు వేసుకోకూడదు. వొళ్ళు కనిపించేలా ఒకమ్మాయి బట్టలు వేసుకొని వెళ్తుంటే వెంట పడి ఏడ్పించడం, పబ్లిక్ ప్లేసుల్లో అశ్లీలంగా ప్రవర్తిస్తుంటే వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చెయ్యడం. పబ్‌కు వెళ్ళి తాగిన ఎంత మంది అమ్మాయిలు ధైర్యంగా ఇంటికి రాగలరు? ఇది మన భారతం, మన స్వాతంత్ర్యం
మొన్న జరిగిన సంఘటనను సమర్థిస్తున్న వారి మాటలు చూస్తే జాలి వేస్తుంది.
Whatever has happend is sad. But, I must tell each one of you NRI mangloreans that this was something that Mangalore needs at this point of time. The girls here are just loosing their track and doing all things that you would not like your wife, sister, mother doing!! Wearing revealing clothes, smoking, getting drunk, falling over guys. These girls are the once inviting trouble. If you happend to visit these so called happening places you would agree with me. Atleast now the gals will be carefull and you parents out there will know what your daughters, sisters are actually upto!! If this incident will change the scene that is going around in my kudla, then am happy for it!!
ఎక్కడ బ్రతుకుతున్నారు వీళ్ళు? రాతి యుగంలోనా?
ఇప్పటికయినా ప్రభుత్వాలు కళ్ళు తెరచి చట్టలు తీసుకురావాలి. దోషుల పైన రేప్ కేస్ పెట్టి నాన్-బెయిలబుల్ అరెస్టు చేయాలి. లేకుంటే పబ్‌లకు వెళ్ళాలంటేనే అమ్మాయిలు భయపడతారు.
January 26, 2009 at 4:18 PM
మీ బాధ అర్ధం అయ్యింది.
>>లేకుంటే పబ్‌లకు వెళ్ళాలంటేనే అమ్మాయిలు భయపడతారు. ??
తప్పు ఎవ్వరిదీ? పబ్బులకెళ్లి తాగే అమ్మాయిలదా? లేక వాళ్లు వేస్కునే మోడర్న్ దుస్తుల చీలికల్లోంచి కనబడే శరీరాన్ని తాకాలనే పిచ్చి పుట్టే తాగుబోటు కుఱ్ఱాళ్లదా? లేక "ఈట్"(ఐటీ) తెచ్చిన పడమటి గాలిదా?
http://ramakantharao.blogspot.com/2009/01/so-called.html
January 26, 2009 at 5:48 PM
>> "పబ్‌కు వెళ్ళి తాగిన ఎంత మంది అమ్మాయిలు ధైర్యంగా ఇంటికి రాగలరు?"
'ఉద్యోగానికెళ్లిన ఎందరు ఆడాళ్లు ధైర్యంగా ఇంటికి తిరిగి రాగలరు' అంటే అర్ధం చేసుకోగలను. తాగి తందనాలాడటానికెళ్లినోళ్లు - వాళ్లు ఆడైనా, మగైనా - భద్రంగా ఇంటికొస్తారో లేదో అన్న ఆందోళన హాస్యాస్పదం.
>> "లేకుంటే పబ్‌లకు వెళ్ళాలంటేనే అమ్మాయిలు భయపడతారు"
మంచిదే. అమ్మాయిలతో పాటు అబ్బాయిలూ భయపడాలనీ, పబ్బులన్నీ మూతపడే రోజులు రావాలనీ మనసారా కోరుకుంటున్నాను. అఫ్‌కోర్స్, పబ్బుల మీద దాడి చేసి కొట్టటం దీనికి పరిష్కారం కాదు, సమర్ధనీయమూ కాదు.
స్వతంత్ర దేశంలో ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లు చెయ్యొచ్చు. నిజమే. అయితే ఈ దాడికీ స్త్రీ స్వాతంత్ర్యానికీ లంకె పెట్టే ముందు మీరొకటి మర్చిపోయారు. మగాళ్ల దురలవాట్లన్నీ అమ్మాయిలూ నేర్చుకోవటమేనా స్త్రీ స్వాతంత్ర్యం అంటే?
ఈ పబ్ కల్చర్ వంటివాటి గురించి నేరాసిన మద్యతరగతి మహిళ వీలైతే ఓ సారి చదవండి.
January 26, 2009 at 6:20 PM
మీ వ్యగ్యం అర్ధం అయింది :) ఏకీభవిస్తున్నాను.అమ్మాయిలతో పాటూ అబ్బాయిలని కూడా కొట్టారు ఆ సేన సేవకులు
January 26, 2009 at 7:29 PM
పగటి పూట సెక్స్ గురించి మాట్లాడితేనే పరువు పోతుందనుకునేంత పవిత్రంగా ఉంటారు. రాత్రి మాత్రం తాగి తందనాలాడి వీధి వ్యభిచారం చెయ్యగలరు. భారతీయులకి నీతి మీద నిలకడ లేదు. గుడివాడ పట్టణంలో కూడా సెక్స్ గురించి ఓపెన్ గా మాట్లాడే వాళ్ళు తక్కువే కానీ ఆ ఊరిలో పెరిగిపోయిన ఎయిడ్స్ కేసులు చూస్తే సీక్రెట్ గా వ్యభిచారం చేసేవాళ్ళు అక్కడ కూడా ఎక్కువేనని అర్థమైపోతుంది. మన దేశంలో ఎక్కడైనా ఇంతే. పగటి పూట శ్రీరంగ నీతులు చెపుతూ, రాత్రి పూట సాని కొంపలు లేదా పబ్ లలో దూరుతారు.
January 26, 2009 at 10:44 PM
ముందు ఏది మన సంస్కృతో. ఏది కాదో. దానిని ఎవరు పరిరక్షించాలో, ఎట్లా పరిరక్షించాలో తేల్చండి. ఇట్లా ఎవడు పడితే వాడు ఒక గుంపును వెంటేసుకుని పబ్బుల్లోని జనాన్ని, వాలంటైన్ డే నాడు ప్రేమికులని చితక బాదుతామంటే ఎట్లా ? ప్రభుత్వాలు, రక్షక భటులూ, కోర్టులూ, చట్టాలు చట్టుబండలూ ఎందుకు? హింసే మన సంస్కృతా? బుద్దుడూ, గాందీ ఎంత క్షోభించాలి?
January 26, 2009 at 11:32 PM
దేవుడా
రక్షించు నా దేశాన్ని
పవిత్రులనుండి, పతివ్రతలనుండి
పెద్దమనుషులనుండి, పెద్దపులులనుండి
నీతుల రెండు నాల్కలు సాచి బుసలుకొట్టే
నిర్హెతుక కృపా సర్పాలనుండి,
లక్షలాది దేవుళ్ళనుండి, వారి పూజరులనుండి,
వారివారి ప్రతినిధులనుండి,
సిద్దంతకేసరులనుండి, సిద్దులనుండి,
శ్రీ మన్మద్గురు పరంపరనుండి.
- తిలక్
January 26, 2009 at 11:37 PM
"నా శరీరం చూడండి, ఎంత బాగుందో" అని చూపిస్తూ తిరిగే అమ్మాయిలు "సమాజం నుంచి నాకు రక్షణ లేదా" అని ప్రశ్నిస్తే నేనొప్పుకోను. మీరేమో పాశ్చాత్య ధోరణుల్లో బార్లకెళ్ళి బీర్లు కొడుతుంటారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం భారతీయ సంస్కృతి ప్రకారం మిమ్మల్ని సోదరీ మణులుగా భావిస్తూ మీకు రక్షణ కల్పించాలి. పాపం కదూ!
భజరంగ్ దళ్ వాళ్లకి ఫిబ్రవరి 14 న ఏడాదికోసారి సంస్కృతి గుర్తొస్తుంది. లేదంటే ఎవడో ఒకడు వెనకనుంచి పురెక్కిస్తే...నిన్న మంగుళూరులో ఇలా...!
సంస్కృతిని రక్షించడం ఇలా భయభ్రాంతుల్ని చేసి కాదు. దమ్ముంటే ప్రతి సిటీలో పబ్బుల్ని, బార్లని మూయించి అప్పుడు మాట్లాడాలి!
ప్రభాకర్ గారు,
మీరు చెప్పింది బాగానే ఉంది. కానీ ప్రభుత్వం ఇలా ప్రజలకు నీతి బోధలు చేస్తూ కూచుంటుందా? అది ప్రభుత్వ బాధ్యతల్లో లేదుగా! అడిగిన ప్రతివాడికీ పబ్బులకో, బార్లకో పర్మిషన్లిస్తూ పోయే ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో ఎలా స్పందిస్తుందో అర్థం చేసుకోలేమా!
భౌతికంగా దాడికి దిగడం తప్పే కావొచ్చు, కానీ కొన్నాళ్ల పాటు పబ్బుల కెళ్ళాలంటే ఆడపిల్లలు భయపడి చావడం ఖాయం...మంగుళూరులోనే కాదు, అన్ని చోట్లా!
January 27, 2009 at 12:50 AM
@sujata
అంటే ఒళ్ళు చూపిస్తే రేప్ చెయ్యడానికి పాస్ ఇచ్చేసినట్టేనాండి?? మన సంస్కారం ఏమైపోయింది??
సాంప్రదాయంగా ఉన్న అమ్మాయిని రేప్ చేసిన వాడికి ఒక శిక్ష,మోడెర్న్ గా ఉన్న అమ్మయిని రేప్ చేసిన వాడికి ఒక శిక్ష విధించాలంటారా??
నాకొక్కటి అర్ధం కాదు.స్త్రీని సోదరిగా చూడటం,లేక కామంతో చూడటం ఈ రెండు చాయిస్ లే ఉన్నాయా మనకు?? సాటి మనిషి గా ఛూడలేమా??
నిజంగా భారతీయులం స్త్రీని సోదరిగా చూస్తున్నామని మీరు భావిస్తున్నారా?? అలా ఐతే ఈ పవిత్ర దేశంలో గంటకొక స్త్రీ రేప్ కి ఎందుకు గురవుతోందో చెప్పగలరా??
January 27, 2009 at 3:23 AM
బాబూ సందీప్...
అంటే ఒళ్ళు చూపిస్తే రేప్ చెయ్యడానికి పాస్ ఇచ్చేసినట్టేనాండి?? మన సంస్కారం ఏమైపోయింది??
బాగుంది మీ ప్రశ్న !!! పోనీ దాని అర్థం ఏంటో చెప్పండీ తెల్సుకొంటాం. వాళ్ళు అలాంటి దుస్తులు వేసుకోవడానికి కారణం, వాళ్ళ ఫీలింగ్స్ ఊహించి చెప్పండి చూద్దాం. మీరు ఒక్క రోజు గుండీలన్నీ విప్పేసి రోడ్డు మీదకు రండి చూద్దాం??? సిగ్గు పడకండి అది అనాగరికమేం కాదు. ఇప్పుడు మోడల్స్ అనుసరిస్తున్న లేటెస్ట్ ఫ్యాషన్ అది.
ఒళ్ళు కనబడకుండా కూడా చాలా మోడర్న్ గా ఉండచ్చు. ఒళ్ళు చూపించటం కాదు మోడెర్న్ అంటే.
ఎమోషనల్ గా ఆలోచించడం పక్కన పెట్టి వాస్తవాలు ఆలోచించండి.
January 27, 2009 at 1:29 PM
మీరన్నది నిజమే. నేనెప్పటికి అలా గుండీలు వదిలేసి బయటకు రాలేను. కానీ నా పాయింట్ అదేనండీ. నేను నమ్మిన సిద్ధాంతాన్నే లోకమంతా ఆచరించాలంటే ఎలా? "మన" సంస్కృతి మీద మీకు
అంత మమకారం ఉంటే feel free to follow it. కానీ అందరి మీద రుద్దాలని చూస్తే ఎలా??
అసంధర్బమనిపించినా ఒకటి చెప్తాను. ఆ పండగనీ, ఈ పండగనీ మా వీధిలో ఉండే గుళ్ళో మైకు పెట్టి గంటలు గంటలు మంత్రాలు చదువుతుంటే చిర్రెత్తుకొస్తుంది నాకు. అలాగని నేనెళ్ళి ఆ గుళ్ళొ పూజారిని చితక్కొడుతున్నానా??
మనకు నచ్చినట్టు ఉండని వాళ్ళంతా తప్పు చేస్తున్నారంటే ఎలా??
January 27, 2009 at 8:32 PM
సందీప్,
విపరీత ధోరణులని వ్యతిరేకించే వారంతా వారు స్వయంగా సంస్కృతిని అనుసరించరనీ, తమ భావాలను ఇతరలమీద రుద్దుతారనీ మీరొక స్థిరమైన అభిప్రాయానికి వచ్చేసినట్లున్నారు. అనుసరించకుండానే ఇంకొకరిమీద రుద్దాలని చూసే వారు రాజకీయ నాయకులవుతారు కానీ మా వంటి సామాన్యులు కారు.
నేనైతే పూజారిని చితక్కొట్టను, కానీ కనీసం వాల్యూం తగ్గించి పెట్టుకోమని రిక్వెస్ట్ చేస్తాను. విద్యార్థులందర్నీ తీసుకెళ్ళి చెప్పిస్తాను. చెవులు మూసుకుని "నాకెందులే" అని కూచోను.
మనిషి సంఘజీవి అని ఒప్పుకుంటే సంఘానికున్న కొన్ని నియమాలను(వీటినే సభ్యత, సంస్కారాలంటారు) పాటించి తీరాలి. లేదంటే మిగిలేది ఆటవికత్వమే!ఇది స్త్రీలకు, పురుషులకు ఇద్దరికీ వర్తిస్తుంది.
నేను వాదన కోసం వాదించను.దానికి సంధ్య, కాంగ్రెస్ గంగా భవాని ఉన్నారు.
ఒక పక్క గృహ హింసకు గురై చెప్పుకోలేక యాతన పడుతున్న స్త్రీలు,కూలి చేస్తే తప్ప పొట్ట గడవని స్త్రీలు,ఆకతాయిల వేధింపులకు గురై గొంతులు కోయించుకునే ఆడపిల్లలు , మరో వైపు "మాకు బారు(లేదా పబ్బు)కెళ్ళే హక్కు లేదా, బీరు తాగే స్వేఛ్చ లేదా, ఒళ్ళు ప్రదర్శించే స్వాతంత్ర్యం లేదా అని వాపోయే స్త్రీ రత్నాలు మరో వేపు ఉంటే ఎవరి గురించి బాధ పడాలో నిర్ణయించుకోవడం మనుషులు చేయాల్సిన పని.
January 27, 2009 at 10:30 PM
సుజాత గారు చివరి పేరా సూపరండి.
January 28, 2009 at 12:03 AM
సందీప్ గారూ, మనం ఒక సమాజం లో జీవిస్తున్నాం. సంఘం మొత్తానికి ఏదైతే మంచిదో ఆ సంస్కృతి నే మనమూ అనుసరించాలి. నా ఇష్టం వచ్చినది నెను చెస్తాను. ఇది నా సంస్కృతి అంటే..... మరి అలా మూర్ఖపు దాడులు చేయడం వారి సంస్కృతి. తిరిగి కొట్ట గలిగిన సంస్కృతి కుడా మీరు నేర్చుకోవాలి. అలా అని నేను ఈ దాడి చేసిన వాళ్ళని సమర్థించడం లేదు. నేను కత్తి మహేష్ కుమార్ గారి బ్లాగ్ లో నా వ్యాఖ్యను ఆల్‌రెడీ ఉంచాను చదవచ్చు
February 6, 2009 at 6:27 PM
Telugu blog ki nenu chala late ga parichayam ayyanu!
Wow! what a great discussion?
I would suggest you all (except jeedipappu garu, Sandeep garu etc. You are 100% right!)
Samajam gurunchi meedorani matlade mundu okka sari alochinchandi. Please mee personal abhiprayalanu ivvavaddu. Mee ku sariga avagahana ledu ani grahinchandi! Avagahana leni vishleshana mundu mundu ibbandiki gurichestundi ante kadu taruvathi taralu vaatiki moolyam chellichali.
August 1, 2009 at 12:13 PM
mee ru raavalasina vedika vunnadi
dharmam patla avagaahana ,charchato anumaanaalu teerchukovatam kosamoka vedika erpaatuchesaamu vachchi paalgonagalaru
http://groups.google.co.in/group/punyabhoomi
ee link ku velli contact owner annachota clik chesi messege lo meevivaraalu ivvamdi