రామలింగరాజు గారికి ధన్యవాదాలు - 1

Posted by జీడిపప్పు

వేల కోట్ల కుంభకోణం చేసి, లక్షల మందిని ఇబ్బందుల పాలు చేసి , " రాజు గారు ఆంధ్రుడని చెప్పడానికి గర్వపడుతున్నాను, రాజు గారిది ఆంధ్రానే, నాదీ ఆంధ్రానే" అని చెప్పేవాళ్ళు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక బైరాగుల్లో కలిసేలా చేసిన రామలింగరాజుగారికి ధన్యవాదాలు ఎందుకు అన్న అనుమానం వచ్చే ఉండాలి. రాజు గారు జైల్లో రాజభోగాలనుభవిస్తూ బినామీ పేర్లతో ఉన్న వేల కోట్ల ఆస్తిని దాచడానికి, పంచడానికి ఎంతో కష్టపడుతున్నారు పాపం. మరి ఆయనకు ధన్యవాదాలు ఎందుకు? రాజుగారు చేసినదానివల్ల కొంత మంచి కూడా జరిగింది అనుకొనే వాళ్ళలో నేను ఒకడిని. జరిగిందేదో జరిగిపోయింది. "వెంట్రులన్నీ పోయి గుండు అయింది అని బాధపడేదానికంటే షాంపూ, పేలు, దువ్వెన బాధ తప్పింది అని ఆనందించాలి" అన్నారు శ్రీ సోదేశ్వర స్వాములవారు. మీరు కూడా ఆయన భక్తులయితే ఇది చదవండి.

కొందరి జీవన శైలి:
పాతికేళ్ళు దాటని కుర్రాడి జీతం పాతికవేలు దాటి ఉంటున్నది. కానీ నెలాఖరుకు చూస్తే బ్యాంకు బ్యాలెన్సు వందల్లో ఉంటుంది. బ్యాంకుల వాళ్ళు అడుక్కొని మరీ క్రెడిట్ కార్డులు అంటగట్టేవారు, వీళ్ళ చేతకానితనం బాగా తెలిసి. ఈ విషయంలో బ్యాంకు వారి తెలివితేటలను మెచ్చుకోవాలి. మనకు పెద్దగా తెలియని క్రెడిట్ కార్డులను పరిచయం చేసి, అలవాటు చేసి డబ్బు అవసరం లేని వాళ్ళు సంపాదించిన డబ్బంతా లాక్కున్నారు. అలా లాక్కోకపోతే పాపం ఆ డబ్బు ఏ బీరువాలోనో మూలిగేది!! వీకెండ్ వస్తే పబ్‌లు డిస్కోథెక్‌లు, ఐమాక్స్ వెళ్ళడానికే సరిపోతుంది. 2-3 వేల రూపాయల షర్ట్, గర్ల్ ఫ్రెండ్, బోయ్ ఫ్రెండ్ లతో షికార్లకు వేలకు వేల రూపాయలు ఖర్చు చేసేవారు. భూమికి పడి అడుగుల ఎత్తులో నడిచినా పర్లేదు కానీ పాతిక అడుగుల ఎత్తులో నడిస్తే చాలా ప్రమాదం.

ఆనకట్ట కట్టి నీటిని ఆపి కాలువలద్వారా సరఫరా చేసినపుడే నీటికి విలువ, సరి అయిన ప్రయోజనం చేకూరుతాయి. ఆనకట్ట లేకుంటే, నీళ్ళు అడ్డు అదుపులేకుండా ప్రవహించి కల్లోలం చేస్తాయి. గత ఆరేడు సంవత్సరాల్లో మన దేశానికి డబ్బు వరదలా వచ్చింది. రాజు గారు తిన్నదాన్ని పక్కన పెట్టినా సత్యం ఉద్యోగులకు నెలకు సరాసరిన వందల కోట్లు జీతాలు చెల్లించారు. మిగతా కంపెనీల జీతాలు కలిపితే అధమపక్షాన నెలకు ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లింపులు జరుగుతున్నాయి. అంటే గత ఐదారేళ్ళలో కొన్ని లక్షల కోట్లు వచ్చి పడ్డాయి. కేవలం కొద్దిశాతం ఉన్న IT ఉద్యోగుల వల్ల లక్షల కోట్లు రావడం, చేతులు మారడం వల్ల ఏమయిందో తెలిసిందే. రియల్ ఎస్టేట్ ఉప్పెన, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం 12 శాతానికి చేరడం జరిగాయి. ఇది ఇలాగే జరిగి అప్పులు చేసి ఇళ్ళు, కార్లు కొని, విలాసవంతమయిన జీవితానికి అలవాటుపడితే అమెరికాలో అయిన విధంగా మరో పదేళ్ళకు మన దేశంలో కూడా దివాలాలు ప్రకటించేవారు.

అగ్నికి వాయువు తోడయినట్లు ఆర్థికమాంద్యానికి రాజుగారు తోడయ్యారు. రాజు గారి పుణ్యమా అని కేవలం సత్యంలో పని చేసే వుద్యోగులే కాక వేరే కంపెనీల్లో పనిచేసే వారిలో కూడా, అంటే ప్రత్యక్షంగా వేలమందిలో పరోక్షంగా లక్షల మందిలో వణుకు మొదలయింది. ఇపుడు వాడి ఉద్యోగానికి ఎసరు, మరి రేపు నాకు జరిగితే? అన్న భయాలు/నిజాలు కనిపిస్తున్నాయి.

ఇప్పుడు పబ్‌లో తాగేవాళ్ళు, డిస్కోల్లో తందనాలాడేవాళ్ళు తగ్గిపోయారు మన సిటీల్లో. ఫైవ్ స్టార్ హోటల్‌లో పూటకు నాలుగైదు వందలు పెట్టి తినకుండా మామూలు హోటళ్ళవైపు దారిమళ్ళారు. మాల్స్ లో మూడు-నాలు వేల రూపాయల బట్టలు దిగులు మొహాలేసుకుని చూస్తుండగా వెయ్యి రూపాయల లోపు బట్టలే ఎక్కువ అమ్ముడు పోతున్నాయట ! కనీస భవిష్యత్ ప్రణాళిక లేకుండా కార్లు, అపార్ట్మెంట్‌లు కొన్న వారు నెల నెలా EMI కట్టడానికే భయపడుతున్నారు. ఇది మన వ్యవస్థకు శుభసూచకం. జరుగుతున్నది చూస్తున్న యువత జాగ్రత్తగా భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకోనే అవకాశం వద్దన్నా వచ్చింది. అపుడే అడ్డదిడ్డంగా కాకుండా క్రమ పద్దతిలో ఆర్థిక, సామాజిక పురోగతి సాధ్యం.

ఈ మార్పుకు కాస్తో కూస్తో దోహదం చేసిన రాజు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలిగా మరి.

9 comments:

  1. Unknown said...

    :)

  2. Unknown said...

    నిజమే. ఐటి మూలాన మన ఆర్ధిక వ్యవస్థలోకి చేరిన సంపద చాలా అసమానతలను సృష్టించింది. మామూలు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు కనీసం బ్రతకలేని స్థాయికి మార్కెట్ రేట్లు పెరిగిపోయాయి. ఈ పరిస్థితిని చూసి వేలం వెర్రి పెరిగింది, దోపిడీలు కూడాపెరిగాయి. నేలవిడిచి సాము పనికి రాదు.

  3. నేస్తం said...

    :)

  4. Unknown said...

    prapancham lo dabbu nirantaram ga oka chotu nunchi inko chotaki pravahistune vuntundy. five star hotel vaadi loss kaka hotel vadiki gain.costly shirts amme vadi loss moderate shirts amme vadiki gain.imax vaadi loss meera talkies gain.raaju gaari loss ayana benami ki gain.upma lo jidipappulekunda kani chetaru yenchestam?.

  5. Naga said...

    శ్రీ సోదేశ్వర స్వాములవారు చెప్పిన దాంట్లో కూడా నీతి ఉన్నది..! :)

  6. Anonymous said...

    - I.T.

  7. Anonymous said...

    He, She, IT - I.T

  8. ఉమాశంకర్ said...

    ఇన్వెస్తర్లకూ, ఉద్యోగులకూ, కార్పొరేట్ ఇమేజీ కి జరిగింది నష్టమే, అది బాధపడాల్సిన విషయమే..
    ఇక దాన్ని పక్కన పడితే ఈ విషయంలో మీ ధృక్కోణం నూటికి నూరుపాళ్ళు కరెక్ట్. ఏ సమాజంలోనైనా అన్నివర్గాలు కలసికట్టుగా సాధించేదే నిజమైన అభివృద్ది.

  9. Anonymous said...

    Well said Anonymous,
    SHE
    HE
    I.T. =
    SHIT

Post a Comment