రామలింగరాజు గారికి ధన్యవాదాలు - 2

Posted by జీడిపప్పు

ఇంతకు ముందు భాగంలో ఉద్యోగాలు చేస్తున్న యువత జీవనశైలిలో మార్పులు తెస్తున్నందుకు రాజుగారికి ధన్యవాదాలు చెప్పుకున్నాము. ఈ భాగంలో విద్యార్థులపైన రాజుగారి ప్రభావం ఎంత వుందో చూసి వీలయితే ధన్యవాదాలు చెప్పుకుందాము.


విద్యార్థులు
సినిమాల్లో ధర్మవరపు సుబ్రమణ్యం, ఎమ్మెస్ నారాయణ వేసే పాత్రల పుణ్యమా అని గత పదేళ్ళ నుండి లెక్చరర్ అంటే "వాడా, ఒక ఎదవ  "అని ఒక స్టాండర్డ్ ను ఏర్పరుచుకున్నారు కాలేజీ విద్యార్థులు. గురువులపట్ల గౌరవం తగ్గడానికి కొందరు గురువులు కూడా కారణం. చదువు చెప్పడం తక్కువ, ప్రైవేటు బిజినెస్‌లు ఎక్కువ అవుతున్నాయి కొందరు గురువులకు. ఆ విషయం పైన ఇంకో పోస్టు వెయ్యవచ్చు.

అసలు విషయానికి వస్తే, పదేళ్ళ క్రితం కూడా లెక్చరర్ల పైన జోకులు వెయ్యడం, ఆటపట్టించడం ఉండేది. అవి చేస్తున్నా, కాస్తో కూస్తో భయం, లెక్చరర్ అంటే ఒక విలువనిచ్చేవాళ్ళు విద్యార్థులు. ఎప్పుడయితే IT బూం పెరిగిందో, విద్యార్థుల వైఖరిలో మార్పు మొదలయింది, ముఖ్యముగా 2003 నుండి. ఫైనల్ ఇయర్ కాకముందే కంపెనీలు క్యూలు కట్టి మరీ "ఆన్ క్యాంపస్" పేరిట ఉద్యోగాలిచ్చేవాళ్ళు. తమకు చదువు చెబుతున్న వారికి వచ్చే జీతం దాదాపు తమకూ వస్తుంది మరి కొద్ది రోజుల్లో అనే భావన 20 ఏళ్ళు కూడా నిండని యువతలో పాతుకుపోయింది.

అప్పుడు చూడాలి వారి ప్రవర్తన. ప్రొఫెసర్లపట్ల "నువ్వెంత, నీకు నాకు తేడా ఏంటి, నీ శాలరీ కంటే ఎక్కువ సంపాదిస్తాను నెక్స్ట్ ఇయర్‌కు" అన్న భావనలు కలిగాయి. అప్పట్లో ప్రతిఒక్కడూ ITలో దుంకుతుంటే కొందరు పరిగెత్తి పాలు తాగడం ఎందుకని ఏ 15-20 వేల జీతానికో కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేరారు. పాపం వాళ్ళు అనుభవించిన అవమానాలు ఉపాధ్యాయ వృత్తిలో ఎవరూ అనుభవించి ఉండరేమో! " కనీసం IT జాబ్ తెచ్చుకోవడం చేతకాక దిక్కులేక ఫుడ్డు కోసం మాకు చదువు చెబుతున్నావు" అని చూపులతోనే చెప్పడం మన విద్యార్థులకు చెల్లింది. మీకు తెలిసిన మిత్రులెవరయినా ప్రొఫెసర్లుగా ఉంటే అడిగి చూడండి, మూడు నాలుగేళ్ళ క్రితం పరిస్థితి ఏంటో!

మిగతా కంపెనీలకంటే మన రాజు గారు మరొకడుగు ముందుకు వేసి పెద్ద కంపెనీలు తీసుకోని వాళ్ళను తీసుకున్నారు. చాలా మంచిది, ఏమీ రాని వాళ్ళను కూడా రెకమండేషన్లవల్ల తీసుకున్నారు. వీళ్ళను పెట్టి ప్రాజెక్టులు చేయించడానికి ఆ టీం లీడర్లు ఎంత కష్టపడ్డారో ఆ దేవుడికే ఎరుక. వీళ్ళు చేసిన పనిలోని  తప్పులు భరించలేక ఆ ఆన్-సైట్ కో-ఆర్డినేటర్ "వద్దు,మీరు పని చేస్తే అందులోని తప్పులు ఫిక్స్ చేయడానికి నాకు రెండింతలు టైం పడుతుంది. నా తిప్పలేవో నేనే పడతాను, మీ పని కూడా నేనే చేసుకుంటాను" అన్న సందర్భాలు కోకొల్లలు.

విద్యార్థుల ప్రస్తావన వచ్చింది కనుక కాలేజీల గురించి కూడా చూద్దాం. ఇప్పుడు ఆంధ్రాలో దాదాపు 500 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి అన్నం నిజం తెలుసా? ఒక్కో కాలేజీ నుండి సగటున 200 మంది, అంటే ఏడాదికి సరాసరి లక్ష మంది కేవలం ఇంజినీరింగ్ కాలేజీల నుండి బయటకు వస్తారు. IT రంగంలో లక్షల ఉద్యోగాలున్నాయి నిజమే, మరి మిగతా వాటి పరిస్థితేమిటి? 2000 సంవత్సరం తర్వాత దాదాపు యే కాలేజీలో సివిల్ బ్రాంచ్ లేదు. దానిబదులు ఉన్న బ్రాంచిలను  క్రాస్ బ్రీడింగ్ చేసి "ఏదో" IT బ్రాంచ్ పెట్టారు. భవిష్యత్తులో సివిల్ ఇంజినీర్ల కొరత ఏర్పడుతుంది. అప్పుడు పొరుగురాష్ట్రాలకు పరుగెత్తాలి.

ఆస్ట్రేలియాలో వరదలు అని తెలిస్తే ఏమీ పట్టించుకోము. ఢిల్లీలో వరదలు అని తెలిస్తే - అవునా అనుకుంటాము. కోస్తాలో వరదలు అంటే ఉలిక్కిపడి మన ఊళ్ళో ఏమవుతుందో అని ఆలోచిస్తాము. సరిగ్గా ఇదే జరగబోతున్నది IT విషయంలో. అమెరికాలో ఉద్యోగాలు పోతున్నాయి అంటే 'మళ్ళీ వస్తాయిలే" అనుకున్నారు. రాజు గారి స్కాం తెలిసి IT జీవితాలు అంటే రిస్క్ అని అందరికీ తెలిసింది.

గత ఏడాది నుండి "ఆన్ క్యాంపస్" ఉద్యోగాలు తగ్గిపోయాయి. ఫైనల్ ఇయర్‌లో ఉన్న విద్యార్థులు 60% వస్తే చాలు మాకు ఉద్యోగం వస్తుంది అనుకోవడం లేదట. ప్రొఫెసర్లను గౌరవిస్తున్నారట. "మీకేమి సార్, 20 వేల జీతం, రిస్కు లేని సుఖమయిన ఉద్యోగం. మేము బయట వెళ్తే ఉద్యోగాలు లేవు, ఉన్నా ఎప్పుడు వూడతాయో? ఏమి చేయాలో తెలియదు" అంటున్నారట. తల్లిదండ్రులు కూడా "యే బ్రాంచ్ అయినా సరే, IT తప్ప" అంటున్నారట (Of course మళ్ళీ బూం వస్తే పరుగులు పెడతారు, అది వేరే విషయం). మన నట్టింట రాజు గారు చేసిన నిర్వాకం వల్ల ఇవి ఇంకాస్త పెరుగుతాయి.

మొన్నటి వరకు "ఎందుకురా ఈ ఉద్యోగం చేస్తూ 20 ఏళ్ళు కూడా నిండని వాళ్ళ దగ్గర చులకనగా బ్రతుకుతున్నాము" అనుకొనే కాలేజీల్లో ప్రొఫెసర్లు మూడేళ్ళ క్రితం ఉన్న దీనస్థితికి బదులు నేడు, రేపు, మరి కొద్ది రోజులు గౌరవాన్ని దక్కించుకోవడానికి కాస్తో కూస్తో దోహదం చేసిన, చేస్తున్న రాజుగారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి కదా  మరి! Image Hosted by ImageShack.us

8 comments:

  1. లక్ష్మి said...

    So true!!! WOnderful analysis

  2. నాగప్రసాద్ said...

    ధన్యవాదాలు చెప్పవలసింది ఋణాలు తీసుకొని, అవి తీర్చకుండా ఆర్థిక మాంధ్యానికి కారణమై, రామలింగరాజు లాంటి వాళ్ళ బతుకులు బయట పెట్టిన ప్రజలకి.

    ఏదేమైనా ఈ ఆర్థిక మాంధ్యం మన దేశానికి చాలా మంచినే చేస్తోందని నేను అభిప్రాయపడుతున్నాను.

  3. శ్రీనివాస్ పప్పు said...

    మరే..ఎద్దు ఎప్పుడూ ఒక పక్కకే పడుకోదు కదా.అలాగన్నమాట.
    కొన్నేళ్ళ క్రితం మా కాలేజీ లో సివిల్ ఇంజినీరింగ్ హెడ్ ఒక వ్యభిచార నేరంలో పట్టుబడితే విడిపించడానికెళ్ళిన మా ప్రిసిపాల్ ఇదేమిటీ మాస్టారు ఇలా చేసారు తప్పుకదా అని అడిగితే మా ఆవిడ్ని చూస్తే మీరీమాట మాట్లడరన్నాట్ట(అలాంటాయన చెప్పే పాఠల్ని మీరే దృష్టితో వింటారు).మా ప్రిన్సిపాల్ కి నోట మా బంద్.అదీ సంగతి..

  4. మురళి said...

    నిజమే..మనం మంచి అనుకున్న దాంట్లో చెడు ఉంటుంది..చెడు అనుకున్న దాంట్లో మంచీ ఉంటుంది. ఆలోచింపచేసే పోస్ట్..

  5. Rajendra Devarapalli said...

    పప్పు వారూ కుమ్మారు ఇక్కడ కూడా :)

  6. సుభద్ర said...

    yemjarigi naa mana manchikeee,
    guruvulaki guravam istunnaru ani chuste happy
    anipinchidi.
    naa 8year koduku teacher ni yeppu cheppidi antadu,nenu pratisari chepperu ani correct chestsaaa.vadu peddaga pattinchukadu.
    neenu school lo unnppu teachergaru ane tappa teacher ani kuda anntu gurtu ledu.manchi visyam bagaarasaru.

  7. సుజాత వేల్పూరి said...

    బావుంది మీ విశ్లేషణ! అప్పుడప్పుడూ చేదు తగులుతూ ఉంటే గానీ తీపి విలువ తెలియదు.

    ఇంకో విషయం! ఎమ్మెస్ నారాయణ, ధర్మ వరం వేసే లెక్చరర్, మరియు ప్రిన్సిపాల్ పాత్రల మీద మీరు ఒక టపా రాయలి.

  8. sunita said...

    nijamenandi.okka subprime. bush gaaru koodaa yadhaasakti help chesaaru. inkaa manchijarigi santoshamgaa india velli bratike roju kosam prardhistunnanu. raju gaari saayam maatalakandanidi.

Post a Comment