అరచేతి గ్రంథాలయం 'కిండిల్' కబుర్లు - 1

Posted by జీడిపప్పు

అరచేతి గ్రంథాలయం కిండిల్ విడుదలయిన కొన్నాళ్ళవరకు "భౌతికంగా పుస్తకాన్ని పట్టుకొని చదివినపుడు కలిగే అనుభూతే వేరు, ఇలా e-readerలో చదివితే ఆ అనుభూతి రాదు" అన్న పాఠకులే e-reader లో ఒకట్రెండు పుస్తకాలు చదివి "ఇదేదో బాగుందే!! వేలకొద్ది పుస్తకాలను అరచేతిలో అమర్చుకొని ఎప్పుడు ఎక్కడయినా చదుకోవడానికి వీలుగా ఉంది.. పైగా కళ్ళకు శ్రమ కూడా లేదు" అంటూ వీటివైపు మొగ్గు చూపించారు. కొందరు గొప్పరచయితలు కూడా (ముఖ్యంగా Stephen King) వీటి ఉపయోగాలను, భవిష్యత్తులో వీటి అవసరాన్ని వివరించడంతో పఠనారంగంలో సరికొత్త విప్లవం మొదలయింది.

కిండిల్ బాగా పాపులర్ అయిన కొన్నాళ్ళకు స్టీవ్ జాబ్స్ ఎవరూ ఊహించని విధంగా iPad ను విడుదల చేసి 'ఆహా ఏమి భాగ్యము, దీనికంటే మిన్న అయినది, సరిసాటి మరియొకటి లేదు" అనిపించాడు. అమెజాన్ కిండిల్ కేవలం పుస్తకాలను చదువుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది (music, చిన్న చిన్న games కూడా ఉన్నాయి) కానీ ఐపాడ్‌లో వినోదానికి సంబంధించి దాదాపు అన్ని సౌకర్యాలున్నాయి. అయినప్పటికీ సగటు పాఠకుడికి e-పుస్తకాల రుచిని చూపెట్టి, అందుబాటు ధరకే లభ్యమయ్యేలా చేసింది మాత్రం Amazon CEO Jeff Bezos. ప్రస్తుతం మార్కెట్‌లో ఎన్నో e-book readers ఉన్నా నా ఓటు మాత్రం కిండిల్ కే.

ఇక్కడ అమెజాన్ వారి marketing strategy ని అభినందించక తప్పదు. మమూలు పుస్తకం కంటే ఇ-పుస్తకం ధర కాస్త తక్కువగా నిర్ణయించి పాఠకుల దగ్గర అభిమానాన్ని చురగొన్నారు. పుస్తకాల ధర తక్కువ అన్నపుడు వచ్చిన స్పందన చూసి "కొన్ని పుస్తకాలు ఉచితం అని ప్రకటిస్తే ఎలా ఉంటుంది" అన్న ఆలోచనతో 1927 కంటే ముందు ప్రచురించబడిన కొన్నింటిని ఉచితంగా అందచేయడం మొదలు పెట్టారు. ఉచిత పుస్తకాలనంత మాత్రాన అవేవో ఊరు పేరు లేని అనామక రచయితలవి కావు. ప్రపంచ ప్రసిద్దులయిన Mark Twain, Jane Austen వంటివారి రచనలన్నిటినీ కిండిలీకరించి ఉచితంగా కిండిల్ లో చదువుకొనే అవకాశం కలిపించారు.

Gulliver's Travels, Adventures of Tom Sawyer, Alice in Wonderland, Jungle Book, Treasure Island, Sherlock Holmes లాంటి పుస్తకాలు ఉచితంగా ఊరిస్తూ ఉంటే ఊరుకోగలరా ఎవరయినా?  కొన్నాళ్ళు ఈ ఉచిత పుస్తకాలకే పరిమితమయినా తర్వాత అమెజాన్‌లో $1 నుండి మొదలయ్యే పుస్తకాలను కొనడానికి అలవాటవుతారు. కేవలం Amazon Free Books మాత్రమే కాకుండా Project Gutenberg, ManyBooks లాంటి చోట్ల కూడా ఎన్నో వేల పుస్తకాలున్నాయి. Calibre ఉపయోగించి మన దగ్గర ఉన్న  ఇంగ్లీషు pdf లను కిండిల్ కు అనుగుణంగా మార్చుకొని చదువుకోవడానికి కూడా వీలుంది. (ఇక నెట్‌లో వెతికితే కావలసిన పుస్తకం ఏదో ఒక ఫోరంలో mobi/epub ఫార్మాట్‌లో దొరుకుతుంది!)




నేను Kindle 3 కొన్న మొదట్లో అందరిలాగే "ఎంతయినా పుస్తకం పుస్తకమే" అనుకుంటూ అందుబాటులో ఉన్న ఏదో పుస్తకాన్ని కిండిల్‌లోకి ఎక్కించి కొన్ని పేజీలు చదివిన తర్వాత నచ్చక "తొందరపడి కొన్నానా" అనుకొంటూ "ఇన్ని మిలియన్లమంది కొంటున్నారంటే ఏదో ఉండి తీరాలి" అనుకున్నాను.  తర్వాత తెలిసింది నేను చేసిన తప్పేంటో. వెంటనే నాకు బాగా నచ్చిన Gulliver's Travels చదవడం మొదలుపెట్టాను. కొన్ని పేజీల వరకు కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఆ తర్వాత గాడిలోపడ్డాను. తద్వారా బోధపడిన సత్యం - "మనకు బాగా నచ్చిన పుస్తకాన్ని చదవడముతో కిండిల్ ఉపయోగాన్ని ప్రారంభించాలి". ఒక్కసారి కిండిల్ రుచి చూసాక అదే ఊపులో మరికొన్ని పుస్తకాలను చదివి నా పఠనాజీవితంలోకి కిండిల్ ను మనస్పూర్తిగా ఆహ్వానించాను. ఈ క్రమంలో పుస్తకాల వేటను కూడా ఉధృతం చేసాను. ఎమ్మెల్యే సీట్లమ్ముకున్న అల్లు అరవింద్ కలెక్షన్ బాక్సు ఎలా నిండిందో నా కిండిల్ పుస్తకాల కలెక్షన్ కూడా అలా పెరిగింది.

ఇక ఈ కిండిల్‌లో నాకు నచ్చిన మరో అంశం - డిక్షనరీ. మనము చదువుతున్నపుడు మనకు అర్థం తెలియని పదం దగ్గరకు cursor తీసుకొస్తే వెంటనే రెండు లైనలో అర్థం కనపడుతుంది. మరిన్ని వివరాలు, ఉదాహరణ వాక్యాలు చూసుకోవచ్చు కూడా. అలాగే highlight చేసే సదుపాయం వల్ల పుస్తకం మొత్తం పైన ఉన్న మనకు కావలసిన క్లిష్టపదాలను ఒకేసారి చదువుకోవచ్చు. GRE లాంటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక పుస్తకాలను లైబ్రరీలోలా అమర్చుకోవడం కూడా చాలా బాగుంది.

ధర - రెండున్నరేళ్ళ క్రితం నేను వ్రాసిన 'అరచేతిలో గ్రంథాలయం - రచయితలకు, పాఠకులకు ఒక వరం' టపాలో 'బహుశా మరో ఐదేళ్ళలో అన్ని భాషలలో, అన్ని దేశాలలో 100-150 డాలర్లకు ఈ పరికరం అందుబాటులోకి రావచ్చు.' అని ఊహించాను. నా అంచనాలకు భిన్నంగా  ప్రస్తుతమే కిండిల్ $139 లేదా $114 కే లభ్యమవుతోంది! ( Best Buyలో Thanksgiving Sale లో $99 కే దొరకవచ్చేమో! )  ఒక కిండిల్ వాడుకరిగా, దీని ఉపయోగాలు, సౌకర్యాలు కాస్తో కాస్తో తెలిసినవాడిగా "పఠనాసక్తి ఉన్నవారు మరో ఆలోచన లేకుండా ప్రస్తుత ధరకు కొనవచ్చు" అని చెప్పగలను. ముఖ్యంగా టీనేజర్లలో పఠనాసక్తి కలిగించడానికి ఇది చక్కని బహుమతి.

ఇవీ ప్రస్తుతానికి "కిండిల్ కబుర్లు - ఇంగ్లీషు పుస్తకాలు".  మరి మన భారతీయ సాహిత్యం, ముఖ్యంగా కిండిల్‌లో తెలుగు చదవడం ఎంతవరకు సాధ్యం లాంటి వివరాలు మరో టపాలో!




11 comments:

  1. Sravya V said...

    హ్మ్ ! ఇప్పుడు కొంచెం ఈలాంటి విషయం మీదే ఒక బుజజ్ పెట్టి ఇటోచ్చా మీ పోస్టు :)))
    ఈ పోస్టు లింక్ నా బజ్ లో షేర్ చేయొచ్చా ?

  2. జీడిపప్పు said...

    తప్పకుండా శ్రావ్య గారు. ఈ పోస్టు వివరాలను ముగ్గురు బజ్‌జ్‌జ్జాలి.. అది చూసి మరో ముగ్గురు బజ్‌జ్‌జ్జాలి.. ఆవిధంగా ముందుకు పోదాము :)

  3. Sravya V said...

    హ హ థాంక్ యు అండి ! బుజజ్ ఇక్కడ చూడొచ్చు మీరు :)))
    https://plus.google.com/116301660446665230533/posts/PHC5dp5FPmu

  4. Ravi said...

    జీడిపప్పు గారూ,
    మీరు రాసిన కబుర్లు చూస్తుంటే కిండిల్ కొనాలని ఉబలాటం మొదలైంది. ఇప్పుడు భారతదేశంలో ఏయే మోడళ్ళు ఉన్నాయి. ఏయే మోడల్ ధర ఎంతో మీకేమైనా తెలిస్తే చెప్పండి. వాటిలో ఏది మంచిది? లాంటి వివరాలు తరువాతి పోస్టులో రాయండి.
    ఆంగ్ల సాహిత్యంలో క్లాసిక్స్ అయిన పుస్తకాలు ఉచితంగా అందించడం చాలా మంచి ఆలోచన.

  5. Indian Minerva said...

    కిండిల్ దగ్గరకూడా అరవిందుని స్మరించుకోవలసిందేనా మీకు అరవిందుడంటే కిండలైపోయింది :-D

    మీరు చెప్పిన ఫీచర్స్ బాగున్నాయనిపిస్తున్నాయి కానీ ఈ మధ్య ఈ-బుక్స్ చదవడం సాంతం మానేశాను. కొన్ని నెలలముందు ఇదేపోస్ట్ గనక చదివుంటే ఎగురుకుంటూ వెళ్ళికొనుండేవాడిని.

  6. Ruth said...

    హ్మ్మ్... ఇది నా విష్ లిస్ట్లో గత చాలా కాలంగా ఉంది (మూడేళ్ళు+)ప్చ్... ఎప్పటికి తీరేనో !!!

  7. PDSUKAVALI said...

    sir namaste
    na peru bhaskar, kavali ,nellore dist.,kindle e book reader lo thelugu books kuda chaduvukovachha ? danilo manak kavalacinabooks munduga lode chesukovala ? konchem e vivaralu cheppaalaru.

  8. వీరుభొట్ల వెంకట గణేష్ said...

    Thanks for the post. When I looked in e-bay, there are two versions, with ads & with out ads. Could you let us know the difference between these two?

  9. జీడిపప్పు said...

    @రవిచంద్ర గారు - ప్రస్తుతానికి కిండిల్ ఇండియాలో దొరకడం లేదనుకుంటా.. ఎవరయినా ఫ్రెండ్స్ ద్వారా తెప్పించుకోవడమే మార్గమేమో!

    @ మినర్వా గారు - lol.. నేను అరవిందుడి అభిమానిని :)

    @ PDSU - ప్రస్తుతానికి తెలుగు పుస్తకాలను చదువుకొనే వీల్లేదనే చెప్పవచ్చు!

    @ వెంకట గణేష్ గారు - నాకు తెలిసి ads ఉన్నదానిలో చదువుతుంటేనో లేదా కిండిల్ ఓపన్ చెసినపుడో ads వస్తుంటాయేమో! ఇదేమీ ఇబ్బందిగా ఉండకపోవచ్చు

  10. మధురవాణి said...

    Very informative article! Waiting for the next part! :)

  11. Purnima said...

    కిండిల కొనాలనుకునేవాళ్ళు తొమ్మిది ఇంచుల స్క్రీన్ ఉన్నది కొనుక్కుంటే మేలు. ఆరు ఇంచులది కొని ఇబ్బంది పడ్డ స్నేహితులను చూసాను.

    నేను మొన్నే కిండిల్ లైట్స్ తెప్పించుకున్నాను. వీటితో చీకట్లో కూడా హాయిగా చదువుకోవచ్చును. కిండిల్ గురించి మరిన్ని అభిప్రాయాల కోసం చూస్తుంటాను.

Post a Comment