అమెరికాలో ఆంధ్రుల పైన దాడి

Posted by జీడిపప్పు

ఈ మధ్య పత్రికల్లో ప్రవాసభారతీయుల పైన దాడుల వార్తలు దర్శనమిస్తున్నాయి. ఆ మధ్య అమెరికాలో తెలుగువారిని వరుసగా హత్యలు చేసారనీ, తెలుగువారిపైన దాడులు ఎక్కువ జరుగుతున్నాయని కూడా వార్తలు వచ్చాయి. ఎన్నడూ లేనిది ఆస్ట్రేలియాలో భారతీయులను లక్ష్యం చేసుకొని కొన్ని అల్లరి మూకలు దాడులు కొనసాగిస్తున్నాయి. ఇది అమానుష చర్య. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనికి నిరసనగా అమితాబ్ బచ్చన్ తనకు ఆస్ట్రేలియావారు ఇవ్వబోతున్న డాక్టరేట్ తిరస్కరించాడు. నేను కూడా ఇంకో వారం రోజులపాటు ఆస్ట్రేలియన్ మోడల్స్ ఫోజులిచ్చిన ప్లేబోయ్ మేగజైన్లను, వాళ్ళు నటించిన ప్లేబోయ్ వీడియోలను బహిష్కరిస్తున్నాను.

దాడులు తప్పు అన్నదానిలో అణుమాత్రమనుమానం లేదు కానీ, దానికి ప్రతిచర్యగా మనవాళ్ళు బిజీ రోడ్ల పైన బైఠాయింపులు, రాళ్ళు రువ్వడాలు చేయడం మాత్రం బాగలేదు. నేను ఆఫీసుకు వెళ్ళే దారిలో ఎవరయినా నిరసనలు చేస్తుంటే Who the #$&% are these morons delaying my meeting అనుకుంటాను. ఆస్ట్రేలియాలో మనవాళ్ళు చేస్తున్న చర్యలవల్ల మంచివాళ్ళకు కూడా కోపం వచ్చి వారిలో కూడా "వర్ణ" ఆలోచనలు మొదలవుతాయి. కాబట్టి ఇప్పటికయినా మనవాళ్ళు తమ పంథా మార్చుకొంటే మంచిది.

ఇక అమెరికా సంగతి కొస్తే - కొద్ది కాలం క్రితం మన తెలుగు మీడియావాళ్ళు "అమెరికాలో ఆంధ్రుల పైన దాడులు" అంటూ ఊదరగొట్టారు. దాడులు జరిగిన మాట నిజమే. మొన్నటికి మొన్న ఒక ఆంధ్ర విద్యార్థి పైన దాడి జరిగింది. ఆ వార్త మొత్తం చదివిన తర్వాత ఆ విద్యార్థి పట్ల నాకు కలిగిన అభిప్రాయం - What a mindless idiot. వినడానికి కటువుగా ఉన్నా ఇది నిజం. ఇలాంటి బుద్దిలేనివాళ్ళకు అలాంటి శాస్తే జరుగుతుంది మరి.

ఇలా ఎందుకంటున్నానంటే, కొన్నేళ్ళ క్రితం అమెరికాలో అడుగుపెట్టినపుడు సీనియర్లు కొన్ని సలహాలు ఇచ్చారు. అవి: చీకటి పడిన తర్వాత ఒంటరిగా తిరగవద్దు. ఎప్పుడూ జేబులో ఐదు-పది డాలర్లు ఉంచుకో. ఎవరయినా, ముఖ్యంగా నల్లజాతీయులు, ఎదురుపడితే సూటిగా వారి కళ్ళలోకి చూడకు. నల్లజాతీయుడు వచ్చి డబ్బు అడిగితే పటతటాయించకుండా నీ దగ్గర ఉన్న మొత్తం డబ్బు ఇచ్చేయి. పొరపాటున కూడా వారితో వాదనకు/పోట్లాటకు దిగకు.

సాధారణంగా ఈ నల్లజాతీయులు సిగరెట్లు/మందు/డ్రగ్స్ కోసం మనల్ని డబ్బు అడుగుతారు. మాటమాట్లాడకుండా వాలెట్ తీసి మొత్తం డబ్బు ఇచ్చేస్తే ఏమీ అనకుండా వెళ్ళిపోతారు. నేనయితే కొత్తగా వచ్చినవాళ్ళకు "నిన్ను అడిగితే వాలెట్ ఇచ్చెయ్యి" అని చెప్తాను. డబ్బు ఇచ్చిన తర్వాత కూడా గాయపరిచేవారు చాలా తక్కువ. (ఇప్పటివరకు నన్నెవరూ డబ్బు అడగలేదు. అడిగితే వాలెట్ ఇచ్చేస్తాను. ఇచ్చినా నన్ను గన్‌తో కాలిస్తే అపుడు చెప్తాను, నేను అనుకున్నది తప్పు అని!)

ఈ వివరాలు దాదాపు కొత్త విద్యార్థులందరికీ సీనియర్లు చెప్తారు. దాదాపు అందరూ పాటిస్తారు కానీ కొందరు తలతిక్క మనుషులు పాటించక ప్రాణాలపైకి కొనితెచ్చుకుంటారు. గత ఏడాది జరిగిన 10 హత్యలలో సుమారు ఏడెనిమిది ఇందువల్లే జరిగాయి. గత ఏడాది డాలస్‌లో ఒక దేశీ తన గర్ల్ ఫ్రెండ్ ముందు ఫోజు కొట్టాలని నల్లజాతీయుడికి ఎదురు తిరిగాడు. సీన్ కట్ చేస్తే డిక్కీలో (శవపేటికలో) తొంగున్నాడు.

ఇక తెలుగువాళ్ళ పైనే ఈ దాడులు ఎందుకు జరుతాయంటే తెలుగువాళ్ళ జనాభా అంత ఎక్కువ కాబట్టి. నేను స్కూల్లో ఉద్యోగం అడుక్కుంటున్నపుడు..err.. వెతుక్కుంటున్నపుడు చాలామంది అమెరికన్లు are you from Hyderabad? అన్నారు. కొన్ని స్కూళ్ళల్లో అయితే మాస్టర్స్ లో "(అన)అధికార భాషగా తెలుగు" ఉంటుంది! కాబట్టి అమెరికాలో ఎవరయినా విద్యార్థి పైన దాడి జరిగిన వార్త చూసి ఆ విద్యార్థి తెలుగు విద్యార్థి కాకపోతే ముక్కు తీసి వేలుపైన వేసుకుంటాము.

మీడియా ఏమో "అమెరికాలో ఆంధ్రుల హత్య" అని రాద్ధాంతం చేస్తుంది. వీళ్ళు అమెరికాలో ఒక సంస్థ తెలుగువాళ్ళను చంపడమే ధ్యేయంగా కార్యకలాపాలు సాగిస్తున్న రేంజ్‌లో హంగమా చేస్తారు,ఎప్పటిలాగే గోరంతలు కొండంతలు చేసి చెప్తారు. మొన్న మిసిసిపీలో జరిగిన సంఘటనలో ఆ విద్యార్థి చొక్కా కారు డోరుకు తగులుకొని ఉండగా 100 మీటర్లు లాక్కుని వెళ్ళినట్టు హిందూ పత్రికలో వస్తే, కిలోమీటరు లాక్కెళ్ళినట్టు ఈనాడులో వచ్చింది. ఒక బ్లాగరయితే ఏకంగా  ఆ విద్యార్థి ఆత్మకు శాంతి కలగాలని కూడా ప్రార్థించాడు.. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో బ్రతికించేసాడు! ఇలా ఉంటాయి లీలలు.

అన్నట్టు నిన్న మెగాస్టార్ గారు "ప్రవాసాంధ్రుల రక్షణకొసం ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి" అన్నారు. అమెరికాలో సంపాదిస్తూ అమెరికా దేశానికి పన్ను కట్టే నా రక్షణకోసం ఒక శాఖనా??!!! అదీ నేను పైసా డబ్బు కట్టకుండా?! అలా అయితే ఢిల్లీదాకా ఏంటీ..ఢ ఢ ఢల్లాస్ దాకా దేక్కున్నా మనకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే నాకొచ్చిన సందేహమేమిటంటే, మెగాజోకర్ గారు ముఖ్యమంత్రి అయి ఒక శాఖను ఏర్పాటు చేసారే అనుకుందాము. అమెరికాలోని ఒక నగరంలో ఆంధ్రుని పైన దాడి జరుగుతుంటే మెగాజోకర్ గారు ఎలా రచ్చిస్తారబ్బా???

13 comments:

  1. Vani said...

    బాగా చెప్పావు నాయనా..
    మొన్న మద్య ఇట్టాన్నే మన టీవీ 9 అక్కలూ అన్నలూ భాగ్యనగరంలో అడుక్కొంటున్న వాళ్ళలో సగం లోకల్ software వాళ్ళు, సగం అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పి కడుపు మంట తీర్చుకొనే టప్పటికి పల్లె టూర్ల నుంచి ఒకటే ఫోన్లు. అనవసరం గా మ్యారేజ్ మార్కెట్ పడిపోయింది.

  2. హరే కృష్ణ said...

    nenu choosanu vere blog lo photo pettina paper cut
    mana meedia valle choosinattuga raasaru ninna
    nijam nee dwara telisindi

  3. Anonymous said...

    Baaga chepparu andi. Ooo media vallu badestunnaru kani, manaloo entha mandi old city ki veltam night time ?? Alagee prati city loo untadi oka dark area. Veella soodi inka ilanee vintee .. eppudoo manam vallani chava badutam..

  4. పుల్లాయన said...

    జీడి పప్పు గారు,
    మీ వ్యాసం బాగానే ఉంది కాని,
    కొద్దిగా మెగా స్టార్ మీద మీ జోక్ ఎక్కువ అయినట్లుంది. అలా ఒక శాఖ ఏర్పాటు ఈ విధం గా తప్పు అవుతుంది. విదేశాలు అంటే ఒక్క అమెరికా నే కాదు, దుబాయ్, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో మన వాళ్లు పడే కష్టాల కోసం ఒక శాఖ ఉంటే మంచిది. ఇలా ఏదన్నా మన వాళ్లకు ప్రమాదం జరగగానే ముందుగా మన జనాలకు గుర్తొచ్చేది మన ప్రభుత్వమే. ఇక అలాంటి శాఖ ఒకటి ఉంది అది అలా విదేశాలకు వెళ్లేవాళ్లకు సూచనలు ఇవ్వొచ్చు. అందులో ఈ తప్పు లేదు అని నా అభిప్రాయం. అక్కడ ఏవన్న సమస్యలు ఉంటే ఒత్తిడి కూడా తీసుకు రావచ్చు.

  5. Malakpet Rowdy said...

    Vey well Said!!!

  6. Shashank said...

    గురు - కొన్ని సార్లు కొన్ని అల జరిగిపోతూంటాయి. నేను పని చేసిన గ్యాస్ స్టేషన్ వెనకాలే ఒక నైట్ క్లబ్ ఉండేది. అందువళ్ళ గ్రేవ్ యార్డ్ షిఫ్ట్ చేసేటప్పుడు మా వాడూ చెప్పేవాడు సెల్ లో 911 నొక్కిపెట్టుకో ఎవరైన అనుమానాస్పదం గా వస్తే అని. అదృష్ట వశాత్తు ఎప్పుడు ఏమీ కాలేదు.. కాని దగ్గర్లో ఉన్న ఇంకో బంక్ లో షూటింగ్ అయ్యింది. డబ్బులు ఇచ్చేసినా షూటింగ్ అయ్యింది. సో చెప్పలేము.. యే నిమిషానికి ఏమి జరుగుతుందో అని.

    ఒక్కటి మాత్రం కరెష్ట్. అమేరికా లో ఉన్న దేశీళ్ళో ఎక్కువసాతం (అంటే మాస్టర్స్ చేసుకుంటూ) మన తెలుగు వాళ్ళే. ఇంక నయం ఇలా తమిళుల మీద జరగలేదు. లేకుంటే డా||. కరుణానిధి గారు ఇక్కడ కూడా ఒక ఈలం కావాలి అని ఉపవాసం చేసేవాడు.

  7. Anonymous said...

    అంతా బానే ఉంది కాని మెగాస్టార్ ని, మా వూరి వాడిని పట్టుకుని మెగా జోకర్ అనడం అన్యాయం. ఆయన మీకేమి ద్రోహం చేసాడు?
    పాతికేళ్ళుగా డాన్సులు. ఫైట్లు చేస్తూ అందరికి మంచి ఎంటరటైన్మెంట్ ఇచ్చాడు.

  8. శ్రీ said...

    బాగా రాసారు. నల్లవాళ్ళతో గొడవలు పోకుండా ఒక 10,20 ఇస్తే వాడి మానాన వాడే పోతాడు.

  9. కొత్త పాళీ said...

    "నల్లజాతీయుడు వచ్చి డబ్బు అడిగితే పటతటాయించకుండా నీ దగ్గర ఉన్న మొత్తం డబ్బు ఇచ్చేయి."
    మగ్గింగ్ (మగ్గరి?) చేసేవాడు ఏజాతివాడయినా అవ్వొచ్చు. రాత్రి పూటల బయట తిరగడంలో జాగ్రత్త వహించాలి, అందులో సందేహం లేదు.

  10. నాగప్రసాద్ said...

    >>"అమెరికాలోని ఒక నగరంలో ఆంధ్రుని పైన దాడి జరుగుతుంటే మెగాజోకర్ గారు ఎలా రచ్చిస్తారబ్బా???"

    జీడిపప్పు గారు, అమ్రికా లో అనే ఏముంది? ఆంధ్రాలో దాడి జరిగినా రక్షించే అవకాశం ఉందంటారా? ఎవరిమీద, ఎప్పుడు, ఎక్కడ దాడి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అలాంటప్పుడు దాడి జరుగుతుంటే రక్షించడం సాధ్యంకాదు. మహా అయితే దాడి జరిగిన తర్వాత సానుభూతి తెలుపగలరు. లేదా ఖండించగలరు. ఇంకా వీలైతే, బాధితుడి తరపున పోరాడి న్యాయం చెయ్యగలరు.

    ఆ మధ్య దుబాయ్ లో మన వాళ్ళు నానా కష్టాలు పడలేక, తిరిగి భారతదేశం రావడానికి చాలా అవస్థలు పడ్డారు. ఆఖరికి వాళ్ళ శవాలు కూడా తెచ్చుకోలేని పరిస్థితి దాపురించింది.

  11. Vinay Chakravarthi.Gogineni said...

    anta baaga raasavu.enduko rakshna sakha teleeda babu.....neeku anta telusu ani pose kottaku.............

  12. Anonymous said...

    జీడిపప్పుగారూ,

    Everybody is having fun అంటూ, మీరు పుస్తకం.నెట్ మీద రాసిన పోస్టుమీద వ్యాఖ్యానాలకి చుక్క పెట్టేరు. పైగా నాపోస్టులో మీరు ఇచ్చిన మీ ఐడి కూడా ఫేక్. అంచేత మరొకపోస్టులో నాఅభ్యంతరం తెలియజేస్తున్నాను. శతకోటి దరిద్రాలకి అనంతకోటి వుపాయాలు! ఇది మీరు అప్రువ్ చెయ్యకపోయినా, మీరు ఎవరిని ఎంత హర్ట్ చేసేరో తెలుస్తుంది కదా.
    పుస్తకం.నెట్ నిర్వాహకులు జైలుకు - Season Finale అన్న శీర్షిక న్యాయం కాదు.
    పుస్తకం.నెట్ ఇద్దరు అమ్మాయిలు సదాశయంతో ప్రారంభించిన సైటు. అచిరకాలంలోనే చాలామంది అభిమానం సంపాదించుకున్న నెట్ పత్రిక. మీ శీర్షిక చూసి చాలా బాధపడ్డాను. మీరు పుస్తకం.నెట్‌కి మద్దతు ఇవ్వకపోతే మీఇష్టం. కానీ ఇలాటి తప్పుడు వాక్యాలు ప్రచురించడం న్యాయం కాదు. నిజంగా మహేష్ కోర్టుకెక్కినా మీలాటివారు పుస్తకం.కే చేయూతనిస్తారనుకుంటున్నాను.
    ఈటపాలో చాలా సంగతులు నాకు అర్థం కాలేదు. కానీ పుస్తకం.నెట్‌కి సంబంధించినంతవరకూ మీరు ఇచ్చిన వివరాలు తప్పు అని తెలుసుకునే రాస్తున్నాను. కేసు లేదు. జైలు లేదు.


    నిడదవోలు మాలతి
    ఒక పుస్తకం.నెట్ అభిమాని

  13. జీడిపప్పు said...

    మాలతి గారూ, నేను ఎప్పటినుండో అదే ఫేక్ ఐడీని వాడుతున్నాను :)

    ఇక పుస్తకం.నెట్ కేసు సంగతికొస్తే, పుస్తకాల అభిమానినయిన నాకు పుస్తకం.నెట్ సైటు పైన చెక్కు చెదరని గౌరవం ఉంది. మీరు గత కొద్ది రోజులు జరిగిన పరిణామాలు గమనించలేదేమో, అందుకే మీకు ఆ పోస్టులోని హాస్యం/వ్యంగ్యం అర్థం కాలేదు. అంతే కానీ నాకు పుస్తకం.నెట్ నిర్వాహకుల పైన ఎటువంటి వ్యతిరేకత లేదు. "నిజంగా మహేష్ కోర్టుకెక్కినా మీలాటివారు పుస్తకం.కే చేయూతనిస్తారనుకుంటున్నాను. " అన్నారు. తప్పకుండా!! నేనే కాదు, బ్లాగులోకంలో చాలమంది చేయూతనిస్తారు.

Post a Comment