అవీ..ఇవీ..అన్నీ

Posted by జీడిపప్పు

వారేవా ఒబామా. కొడితే అలా కొట్టాలి దెబ్బ. అప్పటి ప్రభుత్వం గత డిసెంబరులో డిట్రాయిట్ ఆటో ముఠా వచ్చి డబ్బులు అడిగితే పాతిక బిలియన్లు ఇచ్చింది. ఒబామా ప్రభుత్వం వాళ్ళ కంపెనీలను రక్షించుకొనేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో నివేదిక ఇవ్వమంది. మూడు నెలలు హాయిగా గడిపి ఒక చెత్త రిపోర్టు రాసుకొచ్చారు. అది చూసిన ఒబామా యంత్రాంగం మండిపడి GM కంపెనీని 60 రోజుల్లో కంపెనీని దారిలో పెట్టే ప్రణాళిక ఇవ్వకపోతే దివాలా ప్రకటించమని చెప్పింది. మరో కంపెనీని 30 రోజుల్లో Fiat తో కలవమని చెప్పింది. ఇప్పటివరకు ఆటో కంపెనీ మాఫియా పట్ల ఇంత కఠినంగా ఎవరూ వ్యవహరించలేదు. ఇది చూస్తుంటే కెన్నెడీ అధ్యక్షుడిగా ఉన్నపుడు లేబర్ యూనియన్, మాఫియా పైన చర్యలు తీసుకోవడం గుర్తొస్తోంది.

By the way, ఆర్థిక వ్యవహారాల గురించి సత్యప్రసాద్ గారి బ్లాగుతో పాటు శశాంక్ బ్లాగులో కూడా కొన్ని ఆసక్తికరమయిన పోస్టులు వస్తున్నాయి.

*******
అనుకున్నట్టే వరుణ్ గాంధీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని నిశ్చయమయింది. ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడాడు అన్న ఆరోపణలు చూసి బీజేపీ "మాకు సంబంధం లేదు ఈ గాంధీ మాటలతో" అన్నప్పటికీ, ఆ తర్వాత తన ఓటు బ్యాంకు పెంచుకోవచ్చన్న విషయం గ్రహించిన రథరత్న, రథవిదూషక, రథబీభత్స, రథపిశాచి అద్వానీగారు ముందుకొచ్చి వరుణ్ గాంధీ పైన కేసు పెట్టడం ఎమర్జెన్సీ లాంటిదని మద్దతు పలికాడు. వరుణ్ గాంధీని హత్య చేసేందుకు పాకిస్తాన్ నుండి వచ్చిన ఛోటా షకీల్ అనుచరుడిని పోలీసులు అరెస్టు చేసారు. వరుణ్ గాంధీని "హిందూ పరిరక్షకుడి"గా వర్ణిస్తూ ఆకాశానికెత్తేస్తున్నారు బీజేపీవాళ్ళు. చివరకు బీజేపీకీ మరో "గాంధీ" దిక్కయినా హాచ్ఛర్యపోనక్కర్లేదు.

*******
"బాబుల్ గాడి దెబ్బ గోల్కొండ అబ్బ" అన్న మాట చంద్రబాబు చేసినదానికి వర్తిస్తుంది. ప్రపంచ స్థాయిలో ఒక వెలుగు వెలిగిన చంద్రబాబును సర్కస్‌లో రింగ్ మాస్టర్ లా ఆడించాడు కేసీయార్. కేసీయార్ చెప్పినదానికల్లా తలఊపిన చంద్రబాబు నామినేషన్ల చివరిరోజు టీఆర్‌యెస్ కు కేటాయించిన సీట్లలో టీడీపీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించాడు. దెబ్బకు దిమ్మె తిరిగిన కేసీయార్ పరిగెత్తికెళ్ళి బాబు కాళ్ళో వేళ్ళో పట్టుకొని బ్రతిమాలుకొన్నాడు. దయతలచిన బాబు కొందరితో నామినేషన్లు ఉపసంహరింప చేశాడు. కొన్ని చోట్ల "స్నేహపూర్వక పోటీ" లో కొందరిని దింపాడు. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీయార్ ప్రతీకారం తీర్చుకొంటాడో లేదో వేచి చూడాలి.
*******
గతవారం పద్మశ్రీ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కుళ్ళు రాజకీయాలకు, అవగాహనా రాహిత్యానికి చిరునామా అయిన పద్మశ్రీ అవార్డులు అర్హత లేని వ్యక్తులకు అర్హతలేని వారి చేతుల పైన ఇవ్వబడడం సంతోషించదగ్గ విషయం. ఒకప్పుడు అబ్దుల్ కలాం ఉన్న స్థానంలో ప్రతిభా పాటిల్ ను చూస్తుంటే "కనకపు సింహాసనమున.." గుర్తుకొచ్చింది ఎందుకో. సోనియా మాత కాళ్ళ దగ్గర, క్షమించాలి, చెప్పుల కింద పడి ఉంటే చాలు, రాష్ట్రపతి అయిపోవచ్చు!!!  అన్నట్టు గత ఏడాది నైట్ శ్యామలన్‌కు పద్మశ్రీ ఇచ్చారు. నైట్ శ్యామలన్‌కు ఉన్న అర్హతేమి స్టీవెన్ స్పీల్బర్గ్ కు లేని అర్హతేమి? కేవలం భారతీయుడిగా పుట్టి అమెరికాలో సినిమాలు తీయడమేనా?
*******
సాధారణంగా ఫ్యాషన్ షో అంటే - చెత్త కుప్పల్లో ఉన్న చెత్త తెచ్చి పీలికలు తయారు చేసి అస్థిపంజరాలకు తగిలించి నడిపించడం అనే భావన ఉండేది. ఆ బట్టలు వేసుకొని రోడ్డు పైన వెళ్తే ఎంత మంచి కుక్క అయినా తరుముకోవాలి అన్న నిబంధనకు లోబడి డిజైన్ చేస్తారు. కానీ ఈ సారి లాక్మే ఫ్యాషన్ వీక్‌లో అలా కనిపించలేదు. దాదాపు అన్నీ మనుషులు వేసుకొనే దుస్తులే ప్రదర్శించారు. సినీ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందరికంటే కత్రినా కైఫ్ చాలా బాగుంది. కత్రినా బార్బీ బొమ్మలా ఉందా లేక బార్బీ బొమ్మ కత్రినాలా ఉంటుందా అనిపించింది!!
*******
ఈ రాష్ట్రాన్ని ఎవరూ బాగు చెయ్యలేరు. మొన్నటివరకు ఎవరో ఒకరు వస్తారు ఏదో చేస్తారు అన్న ఆశ ఉండేది,ఇప్పుడు అది కూడా పోయింది. రాజకీయాల్లో ఉన్నవాళ్ళకు దమ్ము, ధైర్యం ఉండాలి. ఎన్నికలలో పోటీకి నిలబడి ధైర్యంగా అవతలివాళ్ళను ఎదుర్కోవాలి. కే.ఏ.పాల్ గారు మొత్తం 294 + 42 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసి అన్నీ కంప్యూటర్లో పెట్టారు. ఈ సంగతి తెలిసిన మిగిలిన అన్ని రాజకీయ పార్టీలకు వణుకు పుట్టి నామినేషన్లు ఒక రోజు ఉండగా ఆ సీడీని, కంప్యూటర్‌ను దొంగిలించారు. విధిలేక పాల్ గారు తాను ఒక్కడే పాలకొల్లు నుండి నామినేషన్ వేసారు. రాజకీయాల్లో మరీ ఇంత దిగజారుడుతనం ఎప్పుడూ చూడలేదు. పాల్ గారు 2014 ఎలక్షన్లపుడు తాను తయారు చేసిన జాబితాను ఈమెయిల్ లో భద్రపరుచుకొని, లేదా ఒక పేపరు పైన రాసుకొని మిగతాపార్టీల అంతు తేలుస్తారు అని నమ్మకం ఉంది.

మీరు తప్పకుండా మిగిలిన పార్టీల అంతు తేలుస్తారు పాల్ గారు, అంతు తేలుస్తారు Image and video hosting by TinyPic

17 comments:

  1. శ్రీనివాస్ said...

    hahaahha lol yedoka roju meeru valla antu choostaru pal gaaru choostaru

  2. Shashank said...

    రచ్చ... కిళారి ఆనంద్ పౌల్ గురించి ఇంత హేళన చేయడం మంచింది కాదు.. కోపం వస్తే నిన్ను కూడా శపిస్తాడు. బుష్ ని శపించినట్టుగా.. పద్మశ్రీ గురించి మాత్రం కరెస్ట్ గా చెప్పావ్. ప్రతిభా తాయి ని చూస్టూంటే జాలి / కోపం ఒకటేసారి అనిపిస్తాయి. యేం చేస్తాం. మన రాజ్యాంగం అలంటిది..

  3. చైతన్య.ఎస్ said...

    :))

  4. పరిమళం said...

    wow! sir! :)

  5. Anil Dasari said...

    మీ కబుర్ల శైలి రాన్రానూ రాటుదేలుతుంది. క్లుప్తమైన వార్తలకి వ్యంగ్యం, హాస్యం సమపాళ్లలో మేళవించి వారం వారం మీరొడ్డిస్తున్న విందు భోజనం ఘుమఘుమలాడిపోతుంది. ఈ బ్లాగు పేరు జీడిపప్పు కాకుండా ఫుల్ మీల్స్ అనుండాలి.

  6. జీడిపప్పు said...

    అంతా మీ అభిమానం :)

  7. Shashank said...

    అంతా బానే ఉంది కాని శశాంక్ "గారు" ఎంట్రోయి? ముందు అది సవరించు...

  8. జీడిపప్పు said...

    చిత్తం దొరా

  9. నేస్తం said...

    పాపం పాల్ గారి నామినేషన్ కూడా తిరస్కరించారంట :)

  10. మహాపోకిరి said...

    నీకు కత్రీనా అక్కడ బార్బీ లా కనిపించిందా?????

  11. బుజ్జి said...

    ఆ బట్టలు వేసుకొని రోడ్డు పైన వెళ్తే ఎంత మంచి కుక్క అయినా తరుముకోవాలి అన్న నిబంధనకు లోబడి డిజైన్ చేస్తారు.

  12. Anonymous said...

    ఎంతయినా రాష్ట్రపతి ని పదవిలో ఉండగా అలా అనవచ్చా?
    అంటే మనకు అంత వాక్ స్వాతంత్రం ఉందా అని తెలుసుకోవాలని.

    పద్మ అవార్డుల విషయనికొస్తే నా దృష్టిలో కృష్ణ కివ్వడం కంటే మహేష్ బాబు కివ్వడం బెటర్.

  13. Shashank said...

    రాష్ట్రపతి పదవిని కాదు కద అంటుందేది.. రాష్ట్రపతి పదవి లో ఉన్నవారిని. అమెరికా లో బుష్ ఉన్నప్పుడు రాసేవారు కద he is not my president అని.. మళ్ళ ఎన్నికయ్యక he is still not my president అని.. అలనే. ;-)
    సర్వేపల్లి, బాబు రాజేంద్రప్రసాద్, జాకిర్ హుస్సైన్, డా|| ఏ. పీ. జే. అబ్దుల్ కలాం లాంటి మాహోనత్తులు లతో పోలిస్తే ప్రతిభా తాయి కి ఉన్న ఎకైక "అర్హత" సోనియ అమ్మ కి నచ్చడం,. కాదంటారా?

  14. సుజాత వేల్పూరి said...

    "సాధారణంగా ఫ్యాషన్ షో అంటే - చెత్త కుప్పల్లో ఉన్న చెత్త తెచ్చి పీలికలు తయారు చేసి అస్థిపంజరాలకు తగిలించి నడిపించడం అనే భావన ఉండేది. ఆ బట్టలు వేసుకొని రోడ్డు పైన వెళ్తే ఎంత మంచి కుక్క అయినా తరుముకోవాలి అన్న నిబంధనకు లోబడి డిజైన్ చేస్తారు."

    హైటెక్ సిటీ దగ్గర ఒక సంస్థ ఉంది లెండి, 'సిఫ్ట్' అనీ, వాళ్ళు ఖచ్చితంగా ఇలాగే డిజైన్ చేస్తారు. భలే కామెడీ మనుషులు!

  15. Anil Dasari said...

    పాల్ ఫ్రమ్ పాలకొల్లు .. కంప్యూటర్లతో పాటు ఈయన్నీ దొంగలెత్తుకుపోతే పీడా వదిలుండేది.

  16. జీడిపప్పు said...

    @ నేస్తం గారు - మిగతా పార్టీలకు పాల్ ముఖ్యమంత్రి అవుతాడు అన్ భయమి. అందుకే కుట్ర పన్నారు!

    @ మహాపోకిరి - బార్బీ బొమ్మ కత్రీనాలా ఉంటుందా అనిపించింది :)

    @ బుజ్జి గారు - :)

    @ బోనగిరి గారు - కనకపు సింహాసనము పైన కూర్చున్నంత మాత్రాన...

    @ సుజాత గారు - ఈ ఫ్యాషన్ స్కూల్స్ అన్నీ FTV చూసి "ప్రేరణ" పొందుతుంటాయి!

    @ అబ్రకదబ్ర గారు - దొంగలెత్తుకుపోతారు, ఆ తర్వాత పాల్ మాటలకు అందరికీ పిచ్చెక్కి "మహాప్రభో మేము దోచుకున్నదంతా ఇచ్చేస్తాము మమ్మల్ని వదిలి వెళ్ళిపో" అని కాళ్ళు పట్టుకుంటారు

  17. Sujata M said...

    I liked advani's honourable titles. He is a very desperate man now.

Post a Comment