అవీ..ఇవీ..అన్నీ

Posted by జీడిపప్పు


గతవారం రాజకీయాల్లో ఆశించినదాని కంటే ఎక్కువ వినోదం లభించింది.
ముందుగా జాతీయ స్థాయిలో - బీజేపీకి చెందిన వరుణ్ గాంధీ "హిందువుల వైపు చెయ్యి చూపితే చెయ్యి నరుకుతా" అంటూ ఇంకా ఏవో "హిందూ" వ్యాఖ్యలు చేసాడు. కాంగ్రెస్ కు ఇది ఒక వరం అయింది. వరుణ్ గాంధీ పైన క్రిమినల్ కేసు పెట్టాలన్నారు. శివసేన ముందుకు వచ్చి వరుణ్ గాంధీకి మద్దతు ప్రకటించింది. బీజేపీ మాత్రం "మాకు సంబంధం లేదు. అసలు ఈ గాంధీ వంశస్థులెపుడూ ఇంతే" అంది. వరుణ్ గాంధీ మాత్రం "నేనలా అనలేదు, నా మాటలను మార్చేసారు" అంటున్నాడు. ఏది ఏమయినప్పటికీ వరుణ్ గాంధీకి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని ఈ సంఘటనతో తెలుస్తోంది.
*****
రాష్ట్ర రాజకీయాలకొస్తే - భవిష్యత్తు ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాడు. అది చూసి ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు "ముందు నీ తల్లికి న్యాయం చెయ్యి" అంటున్నారు. ఇది చూసిన చంద్రబాబు "సోనియా గాంధీ రహస్యాలు కూడా నాకు తెలుసు, కాంగ్రెస్ నాయకుల సంగతి బయట పెడతా" అన్నాడు. ఈ గొడవల్లో ప్రధాన లోపం ఏంటంటే, రోజా, గంగాభవాని, శోభారాణి లేకపోవడం. మహిళా జాతికే మసిబొగ్గుల్లాంటి వీళ్ళు దిగజారి తిట్టుకోవడం కనిపించడం లేదు.  ఐ మిస్ యూ రోజా, శోభా, గంగా.
*****
జయప్రకాష్ గారు నిర్వహిస్తున్న సభలకు మీడియాలో కవరేజీ అస్సలు లభించడం లేదు. ఇది చూసిన జేపీ గారు ఆగ్రహం పట్టలేక మీడియా పైన విరుచుకుపడ్డారు. ఏమి చేస్తాం మరి!! అన్నట్టు నేను క్రితవారం వారం "లోక్‌సత్తాకు ఓటు వేస్టా" లో " మా ఊళ్ళో కనీసం ముక్కూ మొహం తెలియని వాడు వచ్చి నేను లోక్‌సత్తా అభ్యర్థిని, ఓటెయ్యండి అంటే ఎలా నమ్మాలి..." అన్నాను. ఎంబీయస్ గారు మరో వ్యాసంలో  ఇలాంటి అభిప్రాయాన్ని చక్కగా చెప్పారు.
*****
108 వాహనం పైన రాజీవ్ గాంధీ బొమ్మ ఉండకూడదు అన్నారు తెదెపా వాళ్ళు. అది చూసిన రోశయ్య గారు "అలా అయితే ఎక్కడా ఎన్టీఆర్సినిమాలు ప్రదర్శించకూడదు" అన్నారు. జనం వెర్రివాళ్ళు అయితే మాత్రం ఎన్టీవోడిని చూసి ముందూ వెనక ఆలోచించకుండా ఓట్లు వేసే  అంత వెర్రివాళ్ళు అనుకున్నారా రోశయ్యగారు!! బెస్ట్ జోకర్ అవార్డు శిరీష్ భరద్వాజ్ కు ఇవ్వవచ్చు. చిరంజీవి కూతురును లేపుకుపోయినవాడుగా తప్ప ఇతడి గురించి ఇంకెవరికీ తెలియదు. ఈ బచ్చా కూడా "నాకు రాజకీయాలంటే ఆసక్తి, భవిష్యత్తులో రాజకీయ్యాల్లోకి రావలన్న ఆలోచన ఉంది" అన్నాడు. హతవిధీ!!
*****
మందక్రిష్ణ మాదిగ మహాకూటమిలో చేరానని ప్రకటించుకొని మాదిగ పోరాట సమితికి 30 అసెంబ్లీ సీట్లు, 4 లోక్‌సభ సీట్లు ఇవ్వాలన్నాడు. చంద్రబాబు "ఛస్, అసలు మందక్రిష్ణ మా కూటమిలో ఉన్నాడని ఎవరన్నారు" అన్నాడు. వామపక్షాలు కూడా అపహాస్యం చేసాయి. అవమానాన్ని తట్టుకొని మందక్రిష్ణ మాదిగ "కనీసం 15 అసెంబ్లీ సీట్లు, 2 లోక్‌సభ సీట్లు ఇవ్వండి. లేకుంటే 1) ఎన్నికలను బహిష్కరిస్తాము  లేదా 2) రాష్ట్రమంతా మాదిగ పోరాట సమితి సొంతంగా పోటీ చేస్తుంది" అన్నారు. నాకు తెలిసి ఎన్నికలను బహిష్కరించడం సబబు కాదు. ఎందుకంటే అలా జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో  సుమారు ఒకటి నుండి రెండు ఒట్లు ఎందుకూ పనికిరాకుండా పోతాయి. అలా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 294 స్థానాల్లో పోటీ చేయాలి. కనీసం 136  అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటే మందక్రిష్ణ మాదిగ ముఖ్యమంత్రి అవ్వచ్చు. ఓ పాతిక ఎంపీ సీట్లు గెలుచుకుంటే మాయావతి సహాయంతో మందక్రిష్ణ మాదిగ ప్రధానమంత్రి అవ్వచ్చు లేదా తాతచ్చు. 
*****
బాలయ్య బాబు ఒంగోలులో తన అక్క ఇంటిముందు తొడకొట్టి మీసం మెలేశాడు. పైగా తన సొంత అక్కను విమర్శిస్తూ ఆమె రైతులను ముంచింది అన్నాడు. ఇది మన రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపు మరియు జానపద ???? (i donno). పార్టీ కోసం సొంత అక్కను విమర్శించడం అంటే మాటలా? సీన్ కట్ చేస్తే, నాల్రోజుల తర్వాత హైదరాబాదులో పురంధ్రీశ్వరి ఇంట్లో:

పురంధ్రీశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్రావు ఇద్దరూ ఒక మూల టేబుల్ దగ్గర కూర్చుని తెలుగుదేశాన్ని ఎలా ఓడించాలో తీక్షణంగా చర్చిస్తున్నారు. కాస్త దూరంలో నందమూరి తారక రత్న (న.తా.ర ) తన ల్యాప్‌టాప్ లో  బాలక్రిష్ణ వీడియో   చూస్తూ తన్మయత్వంలో ఉన్నాడు. అంతలో బాలయ్య బాబు లోనికి వచ్చాడు. బాలయ్యను చూసిన న.తా.ర గట్టిగా "బాబాయే సీయం" అని అరిచాడు. ఆ అరుపుకు ఉలిక్కిపడిన పురంధ్రీశ్వరి "ఓరి నీ దుంపతెగ ఏమొచ్చింది అలా అరిచావు" అంది.

"బాబాయే సీయం వచ్చాడత్తా" అన్నాడు న.తా.ర సంతోషంగా. "రా తమ్ముడూ" అంటూ పురంధ్రీశ్వరీ బాలయ్యను ఆప్యాయంగా పలకరించింది. బాలయ్య  "ఎలా విమర్శించానక్కా నిన్ను, బావా రాసిచ్చినదంతా బట్టీ కొట్టి చెప్పేసాను కదా" అన్నాడు  తల అడ్డదిడ్డంగా తిప్పుతూ. పురంధ్రీశ్వరీ  "నా బాబే, నేను చెప్పినట్టే చక్కగా చేసావురా. అయినా సిగ్గు లేకుండా తొడకొట్టావేంటి తమ్ముడూ. నేను చెప్పలేదుగా తొడకొట్టమని" అంది కాస్త నొచ్చుకుంటూ. "సారీ అక్కా. నా బుర్రలేని అభిమానులు కొట్టమన్నారు, కొట్టేశాను" అన్నాడు. "సరేలే, అందరూ నవ్వుతున్నారు అక్క ఇంటి ముందు తొడకొట్టడమేమిటని. ఇకనుండి కొట్టమాకయ్యా" అంది.

సోఫాలో కూర్చున్న బాలయ్య టీవీ పెట్టి అందులో జూనియర్ NTR కనపడగానే ఆపేశాడు. బాలయ్య మొహం వాడిపోయింది. "ఏమయింది తమ్ముడూ" అన్న అక్క మాటలకు "ఈ జూనియర్ ఏంటక్కా ఇలా దూసుకుపోతున్నాడు, వీడి ముందు నేను ఎందుకూ పనికిరాను అంటున్నారు" అన్నాడు. న.తా.ర పళ్ళు పట పటా కొరుకుతూ కోపంగా "బాబాయే సీయం" అన్నాడు.

పురంధ్రీశ్వరీ న.తా.ర తల పైన  ఒక టెంకిజెల్ల పీకి "తప్పంతా నీదే తమ్ముడు. నీకు మాట్లాడ్డం రాదు. నువ్వు ఏమి మాట్లాడుతున్నావో నీకే తెలియదు. కనీసం బుర్రకు నాలుకకు మధ్య ఒక్క నరం కూడా లేదురా నీకు. వాడిని చూడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో, నాకే ముచ్చటేస్తున్నది వాడి మాటలు వింటుంటే. మీరంతా వాడిని చూసి నేర్చుకోవాలి ఎలా మాట్లాడాలో" అంది. బాలయ్య చిన్నబుచ్చుకున్నాడు. అది చూసిన న.తా.ర బాధగా "బాబాయే సీయం" అన్నాడు.

పురంద్రీశ్వరీ న.తా.ర తల పైన ఇంకో టెంకిజెల్ల పీకి "నువ్వూ ఉన్నావు ఎందుకురా? తొమ్మిది సినిమాలు మొదలుపెట్టిస్తే ఒక్క హిట్టు లేదు. యాక్టింగ్ రాదు, డాన్స్ రాదు. ఎందుకూ పనికిరానివాడివి అని పాలిటిక్స్ లో పెడితే అక్కడా ఫ్లాప్ అయ్యావు" అంది. న.తా.ర కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కన్నీళ్ళు తుడుచుకుంటూ వెక్కిళ్ళు ఆపుకుంటూ "బాబాయే (కూక్) సీయం" అన్నాడు.

బాలయ్య "అదొకటే కాదక్కా, చంద్రబావ కూడా జూనియర్ ను వెనకేసుకొస్తున్నాడు" అన్నాడు దిగులుగా. "నువ్వేమీ భయపడకురా, ఓట్లకోసమే అలా అంటున్నాడు చంద్రబాబు. అవసరం తీరాక జూనియర్‌ను అణగదొక్కేస్తాడు. పైగా తన కొడుకు ఉన్నాడు కదా. కావాలంటే మీ బావను చూడు. ఎలా ముంచేసాడో అవసరం తీరాక" అంది. దగ్గుబాటి భరోసాగా చూసాడు. బాలయ్య మొహం లో ఆనందం తాండవించింది. న.తా.ర హుషారుగా ఈల వేసి "బాబాయే సీయం" అన్నాడు.

అంతలో బాలయ్య బుర్ర బరుక్కుంటూ "ఏంటో అక్కా నేను నిన్ను తిట్టాలి, నువ్వు చంద్రబావను తిడతావు, మనిద్దరం జూనియర్‌ను తిడతాము, ఈ బావ చంద్రబావను తిడతాడు. చంద్రబావ అందరినీ ముంచేస్తాడంటావు. మళ్ళీ అందరం మన మధ్య గొడవలే లేవు అని చెప్పుకోవాలి. అసలు ఎందుకక్కా ఇదంతా" అంది. పురంధ్రీశ్వరీ ప్రేమగా బాలయ్య తలనిమిరి "దాన్నే రాజకీయం అంటారు తమ్ముడూ. నీకు అర్థం కాదులే. అది అర్థం కావాలంటే చీమతలకాయంతయినా మెదడు ఉండాలి" అని ""సరే భోజనానికి లేవండి" అంటూ వంటగదిలోకి వెళ్ళింది.

"బాబాయ్, నీకోసం అత్తయ్య స్పెషల్‌గా "బాబాయే సీయం"  కూర చేసింది" అంటూ  న.తా.ర. కిచెన్‌లోకి రివ్వున వెళ్ళాడు. బాలయ్య బాబుకు అర్థం కాక "అదేమి కూర బావా" అన్నాడు. దగ్గుబాటి "ఏమీ లేదు బామ్మర్దీ, వీడు వారం నుండి మా ఇంట్లోనే ఉంటున్నాడు. వీడికి ఏదిచ్చినా దానిపేరు బాబాయే సీయం అని చెప్పాలి. గుత్తివంకాయ కూర అని చెప్తే తినడు, బాబాయే సీయం కూర అంటే తింటాడు" అన్నాడు.

బాలయ్య కిచెన్‌లోకి వచ్చాడు.. టేబుల్ పైన అన్ని గిన్నెలకు స్టిక్కర్లు అతికించి ఉన్నాయి: బాబాయే సీయం కూర, బాబాయే సీయం రసం, బాబాయే సీయం వేపుడు, బాబాయే సీయం పెరుగు అని.
అది చూసిన బాలయ్య -> Image and video hosting by TinyPic

19 comments:

  1. చైతన్య said...

    సూపర్ కామెడీ జీడిపప్పు గారు...
    అన్నిటికంటే హైలెట్ 'శిరీష్' రాజకీయాల్లోకి వస్తా అనటం... హి హి హి :D

    అన్నట్టు 108 వాహనాల పైన రాజేవ్ గాంధీ బొమ్మ తీసేయాలి అనటం కుడా... ntr సినిమాలు టీవీలో రాకూడదు అనటం లాంటిదే కదా...
    ఏదో ఒకటి అనాలి... గొడవ చేయాలి అని కాకపోతే... ఏంటి ఈ కొట్టుకోవడాలు... చిన్నపిల్లలు chocs కోసం కొట్టుకున్నట్టు... ఆడవాళ్ళూ నీళ్ళ కోసం పంపు దగ్గర కొట్టుకున్నట్టు...

  2. anveshi said...

    హి హి హి .అదిరినది యి టపా.ఆ మాత్రం బుర్ర వుంటే బాలకిట్టి ఎందుకు అవుతాడు? :D

    గన్ తో games ఆడే వాడికి టెంకిజెల్ల ?? :P "టెంకిజెల్ల" ఈమాట చాల రోజులకి విన్నా :D

  3. సుజాత వేల్పూరి said...

    "బాబాయే సీయం" నాటిక బాగుందండీ

  4. సూర్యుడు said...

    అదిరింది :)

  5. indhu said...

    adyantaam navvinchaaru adbutam....

  6. పరిమళం said...

    :) :)

  7. కన్నగాడు said...

    బాబాయే సి.యం.

  8. Varunudu said...

    బాబాయే C.M.
    అదిరింది జీడిపప్పూ..
    మస్తు కామెడి టైమింగ్. పైకి కనిపించవు గానీ నీలో ఒక చక్కటి కామెడీ రచయిత ఉన్నాడు. ప్రయత్నిస్తే తోటరాముడి లెవెల్లో వ్రాయగలవ్.. చాలా రోజుల తరవాత మనస్పూర్తిగా నవ్వుకొన్నా.. తరువాత ఎపిసోడ్ లొ "చిరు యే C.M." కథ వ్రాయి. !

  9. చైతన్య.ఎస్ said...

    సూపర్ :))

  10. అశోక్ చౌదరి said...

    Too Good..

  11. Anil Dasari said...

    >> బీజేపీ మాత్రం "మాకు సంబంధం లేదు. అసలు ఈ గాంధీ వంశస్థులెపుడూ ఇంతే" అంది.

    వెధవ పన్లు చేసేది నెహ్రూ వారసులు, తిట్లు మాత్రం గాంధీ వంశానికా!?!

  12. Anonymous said...

    LOLZ too good!

  13. Anonymous said...

    Pappu Garu,
    Very good setire andi,correct ga chepparu...15 min nonstop ga navvanu OMG.....

  14. నేస్తం said...

    శీర్షిక కూడా బాబాయే cM అని పెట్టల్సింది.. చాలా బాగా రాసారు

  15. సమతలం said...

    సమతలం
    బాగుంది. చాలా బాగా నవ్వించారు.
    కాని మీరు కూడా సగటు ఓటరులాగే ఆలొచిస్తున్నారని అనిపించింది ఒక విషయం లో.

    "ముక్కు, మొహం తెలయని వాడు ఓటు అడిగితె ఓటు ఎలా వెయ్యాలి" అన్నారు.
    ముక్కు మొహం ఎవరికి ఉన్నాయి చెప్పండి?
    వైఎస్స్ , బాబు, చిరు, జెపి, లేదా కోట్లు కూడ పెట్టిన మీ ఏరియాలోని పెద్ద పెత్తందారులు, లేదా దలారిగిరి చేసి డబ్బులు పోగేసె రాజకీయ బ్రోకర్లు, గొప్ప గొప్ప నేరాలు చేసి పెద్ద మనుషులలాగె తిరిగె రాజకీయ రౌడీలు, వంశపారంపర్యంగా తాతల, తండ్రుల పేరు చెప్పుకొనే రాజకీయ వృత్తిదారులు.
    వీరి ముక్కు మొహమే కదా మీకు తెలిసింది. వారికే ఓట్లు.
    ఇక మార్పు ఎలా వస్తుంది ఇలా ఆలొచించెవాల్లుంటె.
    ముక్కు మొహం అందరికి ఉంటాయండి. మనకే కళ్లు లేవు మనుషుల ముఖాలను చూడటానికి.
    ముక్కులు, మొహాలు కాదు, వారు చెప్పే విషయాలు, వారి అవగాహణ, వారి చిత్తశుద్ధి ఇవి చూడాలి.
    అసలు మనం మనుషులను చూడటంలొ మార్పు రావాలి.

  16. మహాపోకిరి said...

    Dubugs,

    Good one. nI punyamA ani nEnu kUDA blogs regular gaa sadUtunnA....

  17. జీడిపప్పు said...

    @ చైతన్య గారు - "చిన్నపిల్లలు చొచ్స్ కోసం కొట్టుకున్నట్టు... ఆడవాళ్ళూ నీళ్ళ కోసం పంపు దగ్గర కొట్టుకున్నట్టు" హ హ్హ హ్హా భలే చెప్పారు.
    @ అన్వేషి - కి క్కి క్కీ
    @ సుజాత గారు - ధన్యవాదాలు
    @సూర్యుడు గారు - ధన్యవాదాలు
    @పరిమళం గారు - :)
    @ కన్నగాడు గారు - ;)
    @వరుణుడు గారు - అంతా మీ అభిమానం, ఆశీర్వచనం ;)
    @ చైతన్య.ఎస్ గారు - :)
    @ అశోక్ గారు - :)
    @అబ్రకదబ్ర గారు - నెహ్రూ వారసులా? వాళ్ళెవరు!!!
    @రౌడీ గారు - ధన్యవాదాలు
    @జ్యోతిగారు - ధన్యవాదాలు
    @నేస్తం గారు - నిజమే, బాబాయే సీయం టైటిల్ పెట్టాల్సింది!
    @సమతలం గారు - ఏం చెయ్యను.. అలా అనిపిస్తున్నది!!
    @ mahA pOkiri - థ్యాంక్స్ గురూ. నీ బ్లాగ్ ఇంకా ఖాళీగానే ఉంది!

  18. అభిసారిక said...

    చాలా బాగా వ్రాసేరు :))

  19. Anonymous said...

    బాబాయే CM బాగుంది. పురంధరేశ్వరి ప్రేమ ని తెగ మెచ్చేసుకున్నారు ... ఆ అభిమానం కాంగ్రెస్ మీదా .. లేక ఆవిడ చూపించే పెద్దరికం మీదా ??? అదేవిటి రెండింటిలోను పెద్ద తేడా లేదు కదా అనకండి, నేను కాంగ్రెస్ ని ద్వేషించే వ్యక్తిని అయినా .... పురంధరేశ్వరి గారిని అభిమానిస్తాను ...

Post a Comment