ఇల్లు కాలిపోతుంటే..

Posted by జీడిపప్పు

"ఘోరం. దారుణం. అమానుషం. వీళ్ళసలు మనుషులేనా. ఇంతకంటే బాధాకరమయినది ఇంకొకటి లేదు. వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి ఇలాంటి పని చేసినందుకు."  ఇవన్నీ గత కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న సగటు అమెరికన్ అభిప్రాయాలు. ఇప్పటివరకు ప్రజల ఆగ్రహాన్ని మామూలు మాటల్లో చూసాను కానీ "వీళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి" అన్న మాట ఎప్పుడూ వినలేదు. ఎందుకంటే సగటు అమెరికన్ పొరపాటున కూడా ఆ మాట అనడానికి ఇష్టపడరు. అయినా ఇపుడు అంటున్నారంటే దానికి కారణం AIG సంస్థ తన ఉద్యోగులకు 165 మిలియన్ డాలర్లు బోనస్ గా ఇవ్వడమే. అది కూడా ఒక్కొక్కరికి 1-4 మిలియన్ డాలర్ల బోనస్!

కంపెనీ లాభాల్లో ఉన్నపుడు ఇచ్చినా పర్వాలేదు కానీ AIG మరణావస్థలో ఉంది. చనిపోతున్నదాన్ని బ్రతికించడానికి ప్రభుత్వం వందల బిలియన్లు ఇస్తుంటే, యాజమాన్యం ఏమో "కంపెనీ రూల్స్ అలా ఉన్నాయి" అనో "మంచి వాళ్ళను పోగొట్టుకోకూడదని ఇస్తున్నాము" అనో అంటోంది. పన్ను చెల్లించే సగటు పౌరుడికి మాత్రం ఇది చూసి మండుతోంది. ఒక వైపు లక్షల మందికి ఉద్యోగాలు లేవు. వీళ్ళేమో ప్రజల సొమ్మును ఇలా దోచుకుంటున్నారు. నిజానికి ఇది ఒబామా రాక ముందే జరిగింది. అయినా సరే ఇందులో ఒబామా తప్పు కాస్త ఉంది అని నమ్ముతున్నా. అన్ని బిలియన్లు ఇచ్చినపుడు ప్రతి సెంటుకూ లెక్క చూపాలని, అన్ని వివరాలు బహిర్గతం చెయ్యాలని ఆంక్షలు పెట్టాలి.

ఈ రోజు ఇంకో వార్త ఏమిటంటే, ఆటో ఇండస్ట్రీకి ఐదు బిలియన్ డాలర్లు ఇస్తున్నారు. ఇది మరొక ఘోర తప్పిదం అనిపిస్తోంది. డెట్రాయిట్ ఆటో సంస్థల కంటే అవినీతిమయమయినవి అమెరికాలో మరేవీ ఉండవు. అక్కడి లేబర్ యూనియన్ల ముందు మాఫియా ఎందుకూ పనికిరాదు అంటారు. వాళ్ళ జీతాలు, ఇతర సదుపాయాలు చూస్తే కళ్ళుతిరుగుతాయి. మేనేజ్‌మెంట్ కూడా అలాంటిదే. దొరికినంత వరకు దోచుకోవడమే. కంపెనీ డబ్బులతో ప్రైవేట్ జెట్లను కొనిపిస్తారు, ఆఫీసు పక్కన ల్యాండ్ అవడానికి!

తమ ఫ్యాక్టరీలను బ్రతికించుకోవడానికి ప్రభుత్వాన్ని అప్పు అడగడానికి మూడు కార్ల కంపెనీల పెద్దలుముగ్గురూ కంపెనీ ప్రైవేట్ విమానాల్లో వాషింగ్టన్‌కు వెళ్ళారు. ఒక సెనేటర్ కు మండిపోయి "ఇప్పటికిప్పుడు మీ జెట్ విమానాలను అమ్మివేసి మామూలు విమానంలో సాధారణ ప్రయాణీకుల్లా వెళ్ళడానికి మీలో ఎవరు సిద్దమో చేతులెత్తండి. " అంటే  ఒక్కరు కూడా చేతులెత్తలేదు.  ఇక వీళ్ళ కంపెనీలకు ఎంత డబ్బు కావాలో వీళ్ళకే తెలియదు. మొదట 13 బిలియన్లు అన్నారు, తర్వాత 25 బిలియన్లు అన్నారు.

ఏమయినా అంటే ఆ మూడు  కంపెనీల పైన 2 మిలియన్ ఉద్యోగాలు ఆధారపడి ఉన్నాయి అంటారు. పోనీ ఆ కార్లు కొనదగినవా అంటే అదీ కాదు. సగటు అమెరికన్లు "మా దేశపు కారు కొని పడ్డ కష్టాలు చాలు. ఇప్పుడు ఈ జపాన్ కారుతో హాయిగా ఉంది" అంటున్నారు.

ఇప్పుడు 50 బిలియన్లు ఇచ్చినా లేబర్ యూనియన్లు "రూల్స్" అంటూ  శుభ్రంగా తినేస్తాయి తప్పించి ఆ కంపెనీలు బాగుపడతాయన్న నమ్మకం లేదు. ఆ కంపెనీలతో దివాలా ప్రకటింపచేసి మొత్తం ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ఏ టొయోటాకో హోండాకో అమ్మివేయడమే ఉత్తమం.

18 comments:

 1. Anonymous said...

  కాకుల్ని కొట్టి గద్దలకు పంచడం అంటే ఇదేనేమో. అమెరికాలో కూడా ఇంతేనా.. హతవిధీ.

 2. cbrao said...

  మీరు ఏ కంపనీ కారు వాడుతున్నారు?

 3. సోదరి said...

  ఇలా అయితే ఇంక అమెరికా బాగుపడినట్లే :(

 4. చైతన్య said...

  ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం...

 5. amma odi said...

  ఏదేశమైనా, అధికారంలో ఉండేది ఏపార్టీ అయినా, కార్పోరేట్ దోపిడి, రాజకీయ దోపిడి ఒకటే అని ఇది నిరూపించడం లేదూ!

 6. Anonymous said...

  @cbరావుగారు
  జీడిపప్పు పరిష్కారాలు పక్కన పెట్టండి - ఇది అమెరికన్ మూడ్ కాదంటారా!? ఏంటి మీ ఉద్దేశ్యం!? లేక ప్రభుత్వం చేసిన పరిష్కారం కరెక్టని మీ ఉద్దేశ్యమా!?

 7. Shashank said...

  @అందరికీ.. సారీ ఈ ముక్క తెలుగులో పోస్టలేను - Check this out from a movie called "The Network" http://www.youtube.com/watch?v=CeCMSLP3Wy8. This is how our world works now. This is the world we live in. బుడుగూ మరియూ అందరూ.. ఈ చిత్రం మొత్తం గూగుల్ వీడియో లో ఉంది. వీలైతే చూడండి.

  @అరుణ గారూ - అమేరికా లో "కూడా" ఏంటండి? ఇది కార్పరేటె జీవిత రహస్యం. ఇప్పుడు directగా అంటే అందరిముందు చేస్తున్నారు.. ఇంతకు పూర్వం lobbyingతో చేసేవాళ్ళు. చాలా తక్కువ కంపనీలు "సత్యం" "ధర్మం" మీద నడుస్తాయి.. పక్కనోడిని తొక్కనిదే ఏదీ పైకి రాదు కద.

  @సోదరి గారు - ఇది ఆరంభం మాత్రమే.. we are like the 1/3 of the turmoil. ఇంకా చాలా ఉంది (Alt-A & ARM) మార్కెట్ లోకి రావల్సినవి. ఇప్పుడు ఉన్న fiscal/monetary policy మారాలి. అంత వరకూ ఇలనే life support మీద ఉంటుంది ప్రపంచం.

  @అమ్మ ఒడి గారు - కరెష్ట్!! అందుకే పైన పెట్టిన లంకె చూడండి.

 8. cbrao said...

  @rayraj: ఆ ప్రశ్న అడగటంలో ఉద్దేశం -నాకు తెలిసిన భారతీయులు జపనీస్ కార్లు కొన్నారు. జీడిపప్పు ఎటువైపు ఉన్నారో తెలుసుకోవాలనే?

 9. Anil Dasari said...

  @జీడిపప్పు:

  అసలు కతలో సగమే రాసి విషయం పూర్తిగా తెలీనోళ్లని బాగానే బుట్టలో పడేశావు :-) వాళ్ల నిట్టూర్పులు చూడు పాపం. ఒకరేమో 'అమెరికాలోనూ అంతేనా', మరొకరు 'ప్రపంచమంతా ఇంతే' ..

  ఈ బోనస్‌ల మీద ప్రభుత్వం ఏ స్థాయిలో విరుచుకు పడిందో, ఏమేం చర్యలు తీసుకుందో కూడా వివరంగా రాస్తే తెలీనోళ్లకి 'అదన్న మాట, అలా కూడా వాళ్ల పని పట్టొచ్చు' అనిపించేది కదా.

  ఆ బోనస్‌ల మీద కేంద్రం (ఫెడ్) తొంభై శాతం దాకా పన్ను విధిస్తూ నిన్ననే ప్రత్యేక శాసనమొకటి అమల్లోకి తెచ్చింది. ఈ చట్టమూ, దానికి ముందు ప్రభుత్వం చేసిన రచ్చా చూసి దడుచుకున్న కొందరు 'లబ్దిదార్లు' వాళ్లకందిన బోనస్ మొత్తం తిరిగిచ్చేస్తున్నారు కూడా. మొత్తమ్మీద ఏదోరకంగా ముక్కు పిండి ఆ డబ్బులో తొంభైశాతం పైన వసూలు చేస్తున్నారిక్కడ. అదే మనదేశంలోనైతే?

 10. చైతన్య said...

  @అబ్రకదబ్ర
  తిరిగి వాసులు చేయటం బాగుంది!

  కానీ అసలు ఇవ్వటం ఎందుకు... తిరిగి ముక్కు పిండి మరీ వాసులు చేయటం ఎందుకు?
  నాకు ఈ విషయాలు ఎక్కువగా తెలియవు... క్లారిటీ కోసం మాత్రమే అడుగుతున్నాను...

 11. చైతన్య said...

  'వసూలు' అని నా ఉద్దేశం... 'వాసులు' అని తప్పుగా పడింది...

 12. Shashank said...

  @అబ్రకదబ్ర - మీరు కూడా బుట్టలోనే పడ్డారు కద! 'మరి మనదేశం లో' అని..

  ముక్కు పిండి వసూలు చేసారు అని అంటున్నారు.. జనాలు అందరు దాన్ని మరీ ఎక్కువగా వ్యతిరేకించారు కాబట్టే కొత్త చట్టం తెచ్చారు లేకపోతే ఆ 165 మిలియన్ల సంగతి ఎవ్వరు పట్టించుకునేవాళ్ళు కాదు.

  btw AIG bailout అంతా ఒక నాటకం అనిపిస్తుంది. అసలు AIG కి ఇచ్చిన దానిలో దాదాపుగా ఒక 80B Goldman Sachsకి వెల్లింది. just another way to make GS survive IMHO.

 13. Shashank said...

  http://www.globalresearch.ca/index.php?context=va&aid=12817

 14. Anil Dasari said...

  >> "అసలు AIG కి ఇచ్చిన దానిలో దాదాపుగా ఒక 80B Goldman Sachsకి వెల్లింది."

  80 బిలియన్!?! AIGకి ఇచ్చిన మొత్తమే అందులో పదో వంతు కదా.

 15. జీడిపప్పు said...

  @cbrao గారు - మీకు తెలిసిన దేశీలాంటివాడినే అనుకోండి :)

  @Shashank - thanks for the link CD చూస్తాను.

  @అబ్రకదబ్ర గారు - బాగా"నే" అన్నారు. అంటే సరిగా బుట్టలో వేసుకోలేదన్నమాట నేను. Madoff స్కాం గురించి వ్రాసి "బాగా" బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.

  >> 80 బిలియన్!?! AIGకి ఇచ్చిన మొత్తమే అందులో పదో వంతు కదా.
  భలే జోకులేస్తారే అబ్రకదబ్ర గారు. ఇప్పటివరకు AIG కి $170 బిలియన్ల పైన ఇచ్చింది ప్రభుత్వం. ఓ సారి AIG 170 billion చూడండి

 16. Anonymous said...

  @Shashank

  >>btw AIG bailout అంతా ఒక నాటకం అనిపిస్తుంది. అసలు AIG కి ఇచ్చిన దానిలో దాదాపుగా ఒక 80B Goldman Sachsకి వెల్లింది. just another way to make GS survive IMHO.  tokkEmee kaadoo?

 17. Shashank said...

  @anonymous -

  http://www.slate.com/id/2213942/

  inkA anumAnamgA unTE cheppanDi.

 18. Shashank said...

  http://www.rollingstone.com/politics/story/26793903/the_big_takeover/print

  to all those interested in knowing where we are and what is happening read this.

Post a Comment