అవీ..ఇవీ..అన్నీ
Posted by జీడిపప్పు
కేసీఆర్ గారు ఒక మహత్తరమయిన స్టేట్మెంట్ ఇచ్చారు. "తెలంగాణా కోసం తల నరికించుకోవడానికి సిద్దంగా ఉన్నవాళ్ళకు టికెట్టు ఇస్తాను" అన్నారు. ఈ నరకడాలు పొడవడాలు వదలరా? ఎవరికయినా టికెట్లు కావాలంటే కేసీఆర్ గారి దగ్గరకు వెళ్తారు. అక్కడ పదునయిన కత్తి పట్టుకొని ఒక రిటైర్డ్ తలారి ఉంటాడు. వీళ్ళు వెళ్ళి ఆ తలారి ముందు వంగి నిలుచున్నప్పుడు ఆ తలారి "నరుకుతా, నరుకుతా" అని భయపెడుతుంటాడు. మెడ పైన కత్తి ఉన్నా భయపడని వాళ్ళకు టికెట్ వస్తుంది. ఒక వేళ తలారి ముచ్చటపడి పుటుక్కున తల నరికినా భయం లేదు. మొండానికో లేదా తలకో సీటు వస్తుంది!
**********
రాష్ట్రంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతున్నది. బాపట్లలొ ఒక అమ్మాయి ర్యాగింగ్ భరించలేక ఆత్మహత్య చేసుకున్నది. ఆ అమ్మాయిని ర్యాగింగ్ చేసింది నజ్మ, సాహిత్య, స్రవంతి, సౌజన్య, వనిత అనే విద్యార్థినులట. స్త్రీవాదులెవరూ ఈ సంఘటనను ఖండించలేదు, కనీసం కత్తిరించినట్లు కూడా చూడలేదు నేను. ఇప్పుడు మహిళా సంఘాలు ఆ ఐదుమంది అమ్మాయిలను కఠినంగా శిక్షించాలని, వాళ్ళు కాళ్ళో చేతులో తీసేయాలని లేదా ఉరి తీయలని రాష్ట్రవ్యాప్త ధర్నాలు, నిరసనలు, మీటింగులు పెడతాయో లేదో వేచి చూడాలి.**********
చిరంజీవి గారు ఇప్పటివరకు మనకు తెలియని కఠోర నిజాన్ని చెప్పారు. ఇప్పటివరకు కేవలం 24 మంది మాత్రమే ముస్లింలు మంత్రులు అయ్యారట. ఎన్నడూ మతానికింతమంది మంత్రులు అని ఆలోచించని సగటు మనిషిలో మత విషబీజాన్ని నాటడం మొదలు పెట్టారు చిరంజీవిగారు. అధికారంలోకి వస్తే ఏ పని చేయాలన్నా "మాదంతా సామాజిక న్యాయం. నీ కులమేది, నీ మతమేది" అని ప్రశ్నిస్తారేమో!! అన్నట్టు ఇప్పటివరకు ఎంత మంది క్రైస్తవ మతస్తులు, బౌద్ద మతస్తులు మంత్రులయ్యారో తెలుసా?**********
సరిగా చదువురానివాళ్ళు, లేదా కాస్తో కూస్తో చదువుకున్నవాళ్ళు తిట్టుకుంటుంటే "సిగ్గులేకుండా అసెంబ్లీలో ఎమ్మెల్యేలలా తిట్టుకోకండి" అంటాము. అదే బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉంటూ తిట్టుకొనేవాళ్ళను ఏమనాలి? "అసెంబ్లీ ఎమ్మెల్యేల్లా" అంటే బాగోదు. అందుకే ఈ మధ్య కొత్తగా "తానా సభ్యుల్లా తన్నుకోకండి" అని అందరూ అంటున్నారు. ఏడాది నుండి తానా రెండుగా చీలింది. కోర్టు కేసులు నడిచాయి. ఒకరినొకరు నానామాటలనుకున్నారు. మొన్న ఏమయిందో ఏమో "తూచ్, అంతా ఉత్తుత్తిదే..మనమంతా ఒకటే" అన్నారు. ఇది చూసి విసుగు చెందిన కొందరు తానాను బహిష్కరించారు. కొత్తగా యునైటెడ్తానా ఏర్పడింది. ముందు ముందు చాలా ఎంటర్టైన్మెంట్ ఉండబోతోంది. Stay Tuned!!**********
ఆపిల్ స్టోర్‌లో కొత్త iPod shuffle దర్శనమిచ్చింది. బటన్స్ లేకపోవడం దీని ప్రత్యేకత. మస్కిటో మ్యాట్లా ఉండే ఇంతకు ముందు shuffle నాకు బాగా నచ్చింది. చిన్న చక్రం పైన అన్ని కంట్రోల్స్ ఉండేవి. ప్యాంట్ జేబుకు తగిలిస్తే అవసరమయినపుడు మార్చుకోవడానికి సులభంగా ఉండేది. కానీ కొత్త shuffle కు అన్ని కంట్రోల్స్ ear phones వైరులో పెట్టారు. పాట మార్చుకోవాలంటే దాదాపు గొంతుదగ్గరకు చెయ్యి తీసుకురావాలి. multiple playlists ఈ కొత్త shuffle ప్రత్యేకత. మరింత చిన్న సైజు, 4 GB మెమొరీ ఉన్న దీని విలువ $79. **********
కాంగ్రెస్, బీజేపీ లు తప్ప మిగిలిన దాదాపు అన్నీ పార్టీలు కలసి మూడో ఫ్రంట్ పెట్టాయి. జయలలిత, కేసీఆర్ కూడా అందులో ఉన్నారన్న వార్త చూడగానే నా ఆనందానికి అవధులు లేవు. తనను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే మద్దతు ఇస్తానంటోంది మాయావతి. మిగతా అందరూ కూడా ఒప్పుకుంటారనుకుంటా. నాక్కూడా మాయవతిని ప్రధానమంత్రి చేసి పారేస్తే పోలా అనిపిస్తున్నది కానీ, ఆమె పుట్టిన రోజు బహుమతులకు అడిగినంత డబ్బు ఇవ్వలేదని మా ఇల్లు ధ్వంసం చేసి నన్ను కత్తితో కసుక్కున పొడుస్తారేమో. అలా అయితే 2055లో నేను తలపెట్టిన ప్రపంచయాత్ర జరగదు అని భయంగా ఉంది!
స్టెంసెల్ రీసెర్చ్ పైన బుష్ విధించిన ఆంక్షలను ఒబామా రద్దు చేసి మరిన్ని నిధులను ఇచ్చాడు. ఇది ఒబామా తీసుకున్న "గొప్ప" నిర్ణయాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. పిండాల పైన రీసెర్చ్ తప్పు, వాటిని హత్య చేయడం అమానుషం అని చాలామంది రిపబ్లికన్లు, పని లేని చర్చి ఫాదర్లు అరుస్తున్నారు కానీ దీనివల్ల భవిష్యత్తులో కాన్సర్, డయాబెటిస్, పాంక్రియాస్ మొదలయిన వాటికి చికిత్స కనుగొనే అవకాశం ఉంది. Go Obama!!
**********
March 16, 2009 at 4:54 AM
లాస్ట్ వీక్ బిజీగా వుండి న్యూస్ చూడలేదు, అన్నీ కవర్ చేసినట్టున్నారు....
March 16, 2009 at 5:21 AM
ర్య్గాగింగ్ విషయంలో మాత్రం ఆ అమ్మాయిలని శిక్షించాల్సిందే. ర్యాగింగ్ కి ఆడ మగ బేధం ఏముంటుంది... అందులోనే అది ఒక నిండు ప్రాణం బలి తీసుకున్నప్పుడు!
మాయావతి పుట్టినరోజు కి బహుమతులు ఇవ్వకపోతే నరికేస్తారా!? ఈ సంగతి నాకు ఇప్పుడే తెలిసింది!
కే సి ఆర్ గారి కామెడీ టచ్ బాగుంది :D
March 16, 2009 at 6:12 AM
బాగున్నాయి మీ గత వారపు వార్తలు.
బాపట్లలొ ఒక అమ్మాయి ర్యాగింగ్ భరించలేక ఆత్మహత్య చేసుకున్నది--ఆత్మహత్యా ప్రయత్నం చేసింది, అదృష్టం కొద్దీ చనిపోలేదు.
2055లో నేను తలపెట్టిన ప్రపంచయాత్ర--2055 కి ఏమన్నా ప్రాముఖ్యత వుందా?
March 16, 2009 at 6:12 AM
"2055లో నేను తలపెట్టిన ప్రపంచయాత్ర"?? :) :)
March 16, 2009 at 7:54 AM
మహిళా సంఘం అంటేనే తప్పు మగవాళ్లది అనే ఒక యూనివర్సల్ జవాబుని జేబులో పెట్టుకొని తిరిగే సంఘం, మన అదృష్టం బాగుంది ర్యాగింగ్ జరుగుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల తిరిగిన మగవాళ్లు నిలదీయలేదు కాబట్టి మగవాళ్లదే తప్పన్న ఒక నింద మగవాళ్లకు తప్పింది.
సామాజిక న్యాయం అంటే అందరినీ ఒకటిగా చూడడం అనుకున్నా, కాని ప్రజారాజ్యం వారి మేధావుల కమిటీ అన్ని కులాలను మతాలను వేరు చేసి చూడాలని చెప్పిందేమో, లోగుట్టు పెరుమాళ్ళుకెరుక.
ఆపిల్ కొత్త ఐపాడ్ షఫిల్ పై మీటలని తీసివేసి మరొకసారి వాళ్లకు మీటలంటే నచ్చదని నిరూపించారు, ఇప్పుడు ఎవరైనా కొత్త షఫిల్ ని వాళ్ల కారులోని స్టీరియొ సిస్టంకి కలిపి వాడాలంటే ఎలా:(
ఇదే కాదు కొత్తగా రెండు వారాల క్రితం నవీకరించిన ఐమాక్ అనబడే డెస్క్టాపు కంప్యూటరు కీబోర్డు నుండి న్యూమరిక్ కీపాడ్ ని తొలగించింది. రేపు అనగా మంగళవారం పదిహేడవ తేదీన ఐఫోన్ కొత్త ఆపరేటింగ్ సిస్టం డెమొ కలదు, ఈసారి ఇంకేమైనా వింతలు చూపిస్తే ఎల్లుండి నేను పరిచయం చేస్తాను. :)
GO OBAMA GO (this is for only stemcells only)
2055 అదే మంచి సమయం ప్రపంచయాత్రకి అప్పటికి భారతదేశ పాసుపోర్టు విలువ పెరిగి పాసుపోర్టు ఉంటే చాలు వీసా అక్కర్లదని అన్ని దేశాలు ప్రకటించేస్తాయి కాబట్టి యాత్ర చేయడం వీజీ :))
March 16, 2009 at 8:25 AM
మన "జాతీయ క్రీడ" గురించి రాయలేదేం? ఒకటే వారం లో ఒకసారి భయంవేసేటట్టు కీవీస్ ని కొట్టి ఇంకో సారి భయంకరంగా కొట్టించుకోవడం మన వాళ్ళకే సాధ్యం! అల కాకుండా మన మహిళా జట్టు ఆసీస్ ని చిత్తు చిత్తు గా కొట్టి ఫైనల్స్ కి ఇంకా చేరువైంది.
ఇది నీ న్యూస్ రిపోర్ట్ లో రాయనందుకు నేను ఖండిస్తున్నను. మన జట్టుల్లో ముస్లిం సోదర సోదరీమణులు ఉన్నారనే కద నీవు రాయనిది?
March 16, 2009 at 10:38 AM
The great lady who writes the "mA gOdAvari" blog and those who trumpet too loud and too often on the women's lib are now shutting up about this ladies ragging! If it were a man/male who did this, they would have pulled their guns and started doing everything under the sun about the 'amAnuSha charya!' hmmm?
March 16, 2009 at 4:57 PM
ఆపిల్ వారి లీలలు ఇన్నిన్ని కావయా .. మచ్చుకు మరోటి:
పోయినేడాదొచ్చిన 'యూనీ బాడీ' మాక్‌బుక్ - $1200 ధరది - నుండి ఫైర్‌వైర్ పోర్టుని పీకేశారు. అసలు మ్యాక్‌లు కొనేదే గ్రాఫిక్స్ సపోర్ట్ బాగుంటుందని. ఫైర్‌వైర్ లేకపోతే అందులోకి వీడియోలు ఎక్కించటం కుదరదు - ముఖ్యంగా హై-డెఫ్ వీడియోలు. దాని కోసం గొడవ చేసేవాళ్ల నోరు మూయించటానికి $900 విలువ చేసే తక్కువ రకం మ్యాక్‌బుక్‌లో ఫైర్‌వైర్ సపోర్ట్ ఉంచి 'చూశారా, మీకు ఇంకా తక్కువకే ఫైర్‌వైర్ సదుపాయం అందిస్తున్నాం' అన్నారు. ఐతే ఇక్కడ కిటుకేమిటంటే, ఆ తక్కువ రకం మ్యాక్ హై-డెఫ్ వీడియో ప్రాసెసింగ్ చెయ్యాలంటే అల్లాడిపోతుంది. మరేమిటి దారి? ఇష్టమున్నా లేకపోయినా $2200 పెట్టి మ్యాక్‌బుక్-ప్రో కొనాలి - కేవలం ఆ ఫైర్‌వైర్ కోసం. అంతా మార్కెటింగ్ మాయ!!
March 16, 2009 at 7:11 PM
అయ్యా జీడిపప్పు గారూ.. మీ వార్తా కథాంశాలు సరదాగా ఉన్నాయి. కాక పోతే ఒక్క విషయం నచ్చలేదు. మీరు వ్రాసిన ఆ మూడో వార్తాంశం ! మనుషుల్లో మత విషబీజాలు నాటే ప్రయత్నం మొదలెట్టింది చిరంజీవి గారు అన్నారు మీరు. కానీ మీరు చరిత్ర పరిశీలిస్తే మతమే పరమావధిగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన కల్లోలాలు మీకు అవగతమవుతాయి. మత ప్రాతిపదికగా ప్రపంచం అంతటా ఉన్మాదం నిండి ఉంది. ఈ పశ్చిమ దేశాల్లో క్రైస్తవ మత ప్రాతిపదికన జరిగిన యుద్ధాలూ, అలాగే మధ్య ప్రాచ్య దేశాల్లో ఇస్లాం మత పేరిట జరిగిన మారణ హోమాలూ, అలాగే తూర్పు దేశాలయినా మన లాంటి దేశాల్లో హిందూ, బౌద్ధ మతాల పేరిట (అందునా హిందువుల్లో మరీ, శైవులూ, వైష్ణవులూ కొట్టుకోవడాలు ) జరిగిన కల్లోలాలు అన్నీ ఇన్నీ కావు. కనుక మొదటి నుండీ మతం అనేది మనిషి మనుగడకు పెద్ద సవాలు గా నిలిచింది.
నాగరికత సాధించాం, ఆధునికీకరించ బడ్దాం అనే ముసుగులో ప్రస్తుత ప్రపంచం లో జరుగుతున్నకల్లోలాలూ, అమానవీయ సంఘటనలూ మీకు తెలియనివి కావు. అన్నిటికీ మతమే మూలకారణం. అలాంటి ప్రపంచం లో బతుకుతున్న మనం తెలుసు కోవాల్సిన విషయం ఒక్కటే. ఎవరు ఏం చేసినా మనిషి నుండి మతాన్ని, కులాన్ని విడదీయలేరు. ఒప్పుకోబుద్ధి కాక పోయినా ఇది పచ్చి నిజం. అలాంటి సమాజం లో ఉంటూ అన్ని కులాల వారికీ, అన్ని మతాల వారికీ సామాజికంగా అన్ని కోణాల్లోనూ ఎటువంటి విభేదాలూ లేకుండా సమాన అవకాశాలు కల్పిస్తాం అనే హామీ చాలా ఉన్నతమయిన హామీ అని నా అభిప్రాయం. ఇది కేవలం నా అభిప్రాయమే. బురద గుంటలో పడి, బురద అంటకుండా బయటకు రావడం అనేది ఎంత దుస్సాధ్యమో, అలాగే కులాలు, మతాల మీద నిర్మింపబడ్డ మన సామాజిక భవంతి లో ఉంటూ, కులం, మతం అనే మాట ఉపయోగించ కుండా ఉండడం అంతే దుస్సాధ్యం ! కులాలు, మతాల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు అనే భ్రమ లో బతకడం కేవలం ఆత్మవంచనే ! ఇవాల్టికి కూడా భారత దేశం లో ఏ మూలకు వెళ్ళినా ఇదే కుల పిచ్చే.ఇదే మ(ద)త పిచ్చే. అంతా పచ్చగా ఉంది అనుకోవడం మనసుకు హాయి కలిగిస్తుందేమో కానీ.. వాస్తవం చేసే వికృత నృత్యాన్ని ఆపలేదు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భావన పోయి అందరికీ సామాజికం గా ఒక న్యాయం చెయ్యాలి అనే భావన చాలా ఉదాత్తమయింది. ఆచరణలో చిరంజీవి ఎలా ఉంటాడు అనేది కాలం నిర్ణయించాల్సిన విషయం. అది అతగాడికి అధికారం సిద్ధిస్తుందా లేదా అనే విషయాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటి దాకా వచ్చిన సర్వేల్లో అతడు కొన్ని స్థానాలకే పరిమితమవుతాడు అనే వచ్చింది. కానీ ఆ ఆలోచన మాత్రం మహత్తరమైంది. అందరూ అనుకొనే సమ సమాజం రావాలంటే ముందు అందరికీ న్యాయం జరగాలి అని అతడి ఆలోచనా దృక్పథం అధ్భుతమైంది.
ఆలోచనలు, ఆశయాలు ప్రతీ రాజకీయనాయకుడూ వల్లె వేస్తాడు. ఆచరణలో నిజాయితీ చూపిన వాడే సిసలయిన నాయకుడు. ఆ నాయకుడు ఎవరైనా ఆతడికి సువర్ణ కలశ అభిషిక్త పాదాభివందనం !
March 16, 2009 at 7:48 PM
chiranjeevi party pettaadai santoshinchaanu okappudu.ae vooru vellinaa me kulaaniki pradhaanyam,mee kulaaniki praadhanyam ani chestunna kula gajji choosi athaniki vote veyyoddu ani cheppalanipistondi-cheedara vestondi veella kula politics-us vacchi anni kullalaala vaalla vadda funds adukkuni ippudu vaallatho maatlaaddaaniki koodaa pose kodtunnaadani vinnaaka asahyam vestondi-karnataka nunchi vacchina telugu vaari vadda chaala collect chesaaru-andukenemo karnataka nunchi kooda contest chestaanantunnaadu-kulu gola cheedaragaa undi
March 16, 2009 at 9:22 PM
@ padmarpita గారు - ధన్యవాదాలు
@ చైతన్య గారు - మాయావతా మజాకా :)
@ సిరిసిరిమువ్వ గారు - TV9 ప్రభావం!! 2055 కు ఏమీ ప్రత్యేకత లేదండీ. ఊర్కే ఒక నంబరు అనుకున్నా ప్రపంచయాత్రకు :)
@ పరిమళం గారు - :)
@ కన్నగాడు గారు - waiting for more more Apple :)
@ Shashank అన్నా - చెమించి ఈసారికొగ్గెయ్యి. "జాతీయ క్రీడ" అంటే ఏందన్నా?
@ Anonymous గారు - మనకున్న దరిద్రాల్లో ఈ స్త్రీవాద సంఘాలు కూడా ఒకటి. ఇవి కొంపలు కూల్చేదానికి బాగా పనికొస్తాయి. అసలు వీళ్ళలో ఎంతమంది సక్రమంగా కాపురం చేసుకొని పిల్లల చదువుసంధ్యలను పట్టించుకుంటున్నారో!
@ అబ్రకదబ్ర గారు - బాగున్నాయి యాపిలీలలు :)
@ Anonymous గారు - మంచి వివరణాత్మక పోస్టు. ధన్యవాదాలు
@ Anonymous గారు - వీలయితే http://lekhini.org/ ద్వారా తెలుగులో వ్రాయండి. మీ అభిప్రాయం తెలిపిననందుకు ధన్యవాదాలు.
March 16, 2009 at 10:51 PM
"జాతీయ క్రీడ" అంటే జాతి మొత్తం తీయగా చూసే క్రీడ అన్నమాట. ఇదినూ తెలియదు తమకి....