అమెరికాకు నష్టం - ప్రపంచానికి లాభం
Posted by జీడిపప్పు
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి లేదా ఉద్యోగం చేసి తమ స్వదేశానికి వెళ్ళినవారి గురించి కొన్ని వివరాలు:
- వీరందరూ ఉన్నత విద్యావంతులు. చైనీయులలో 51% మాస్టర్స్, 40.8% PhD చేసినవారు, భారతీయులలో 65.6% మాస్టర్స్, 12.1% PhD చేసినవారు
- 26.9% భారతీయులు, 34% చైనీయులు అమెరికాలో గ్రీన్‌కార్డ్ లేదా సిటిజన్‌షిప్ ఉన్నవారు
- 76% వారికి వీసా అన్నది సమస్య కాదు
- 90% పైగా అమెరికాకు రావడానికి కారణం ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు
- 68.7% భారతీయులు, 84% చైనీయులు తమ స్వదేశంలో అమెరికాలో కంటే మంచి ఉద్యోగావకాశాలున్నాయి అన్నారు
- 42.4% భారతీయులు, 17.6% చైనీయులు తమ పిల్లలకు అమెరికాలో కంటే తమ స్వదేశంలో మంచి విద్య లభిస్తుంది అన్నారు
- అమెరికాలోకంటే స్వదేశంలో ఉద్యోగాల్లో ఉన్నత స్థానానికి చేరుకోవడం సులభం
- 56.6% భారతీయులు మరో ఐదేళ్ళలో తమ సొంత కంపెనీలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు
వినడానికి చాలా తమాషాగా ఉన్నా, చాలామంది అమెరికన్ల పరిస్థితి ఇంతే. ఆర్ట్స్ అంటే ప్రాణమిస్తారు కానీ మ్యాథ్స్, సైన్స్ అంటే పరుగులుపెడతారు. ఈ తరం పిల్లల్లో ఇది మరీ ఎక్కువ అవుతుండడం చూసి నాలుగేళ్ళ ముందు అనుకుంటా, కొందరు మేధావులు కలసి మ్యాథ్స్, సైన్స్ కోర్సులు చేసే వారికోసం ప్రత్యేక సదుపాయాలు, స్కాలర్‌షిప్‌లు ఇవ్వమని, సుమారు $20 బిలియన్ డాలర్ల ప్రతిపాదన చేసారు కానీ జార్జ్ బుష్ అమలు పరచలేదు. ఇంత కష్ట సమయంలో కూడా ఒబామా $50 బిలియన్లు విద్యకు కేటాయించడం వెనుక రహస్యం రాబోవు తరం వారికి అవసరమయిన ఉన్నత విద్యకోసమే. అందులో మ్యాథ్స్, సైన్స్ లకు ప్రాధాన్యత ఉండబోతుంది తప్పకుండా.
ఏది ఏమయినప్పటికీ ఈ మేథోవలస వల్ల భవిష్యత్తులో ఇండియాలో సిలికాన్ వ్యాలీలు, మరెన్నో యాహూ, గూగుల్ లాంటివి పుట్టడం తథ్యం.
March 5, 2009 at 9:01 AM
"ఏది ఏమయినప్పటికీ ఈ మేథోవలస వల్ల భవిష్యత్తులో ఇండియాలో సిలికాన్ వ్యాలీలు, మరెన్నో యాహూ, గూగుల్ లాంటివి పుట్టడం తథ్యం."
మంచి వ్యాసం..! మీరన్నట్టు ఆ రోజు త్వరలోనే రావాలని.. మనకున్న కొద్దో గొప్పో జ్ఞానాన్ని మన దేశాభివృద్దికే వినియోగించాలని కోరుకుందాం..!!
March 5, 2009 at 9:05 AM
పదేళ్ల వయసు వరకు అమెరికాలో పెరిగి ఇండియాకు తిరిగి వచ్చిన పిల్లలకు మాథ్స్, సైన్స్ బోధించడం శ్రీనివాస రామానుజన్ కి కూడా కష్టమే! అనేక మందిని చూశాను.
March 5, 2009 at 12:55 PM
బహుశా ఇప్పుడు జరగబోయే దానిని మేధోవలస అనకూడదేమో! "రెటర్న్ ఆఫ్ మేధోవలస' సొంతగూటికి వస్తున్నారు కదా.
ఉద్యోగాలు కష్టతరం చేసినప్పుడు అనికున్నాను, తాత్కాలికంగా అమెరికాలో ఉంటున్న వారికి కష్టకాలమైనప్పటికీ దీర్ఘకాలికంగా చూస్తే మనదేశానికి అనుకూలించే అంశం.
March 5, 2009 at 10:49 PM
బాగుంది మీ వ్యాసం...
ఈ మధ్య పేపర్ లో ఒక వార్తా చదివాను... అమెరికా లో H1B వీసాల వాళ్లనైతే ఉద్యోగానికి తీసుకోవటం లేదు కాని...
అమెరికా సైన్యం లో చేరాలనుకుంటే మాత్రం వెంటనే వీసా ఇస్తారంట... అంతే కాదు... 6 నెలలు ఆ సైన్యం లో పని చేస్తే... గ్రీన్ కార్డు కూడా ఇస్తారంట!!
March 11, 2009 at 9:33 AM
@చైతన్య గారు దాన్ని బట్టె అర్థం అవుతుంది కద.. అమెరికా కి ఏది ముఖ్యమో అని. సాంకేతిక నైపుణ్యం కంటే యుద్ధలు గెలవడమే వాళ్ళకి ముఖ్యం.
June 12, 2009 at 1:34 AM
aha meeru media kaadu invention chudandi..mana vaallu publish chese ieee or other journal papers choodandi verevaarivi chudandi.........
yahoo and google kadu kavalasindi,vaatiki chala limitations vunnay.
microsoft,qualcom lantivi prati field lo vunnayi
June 12, 2009 at 3:00 AM
బాగా చెప్పారు
నిజంగా జరిగేది అదే!