ఓ మంచి పుస్తకం - Peaks and Valleys
Posted by జీడిపప్పు
మనుషులకు ఒడిదుడుకులు సహజం. కష్టాల్లో ఉన్నపుడు నిరాశ చెంది ఈ జీవితమింతే అనుకొని సరి అయిన నిర్ణయం తీసుకోక ఆ తర్వాత మంచి అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగపరుచుకోని వారు చాలామందే ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి తన ఫ్రెండ్ సూచించిన ఒకామెను కలిసి "ఏదో కథ విన్న తర్వాత మీ కష్టాలు తీరిపోయాయట కదా. ఇది అందరికీ వర్తిస్తుందా?" అన్నపుడు ఆమె "ఈ కథ నాకు నచ్చింది, కాస్త మార్పు తెచ్చింది.. నీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు.. అయినా ఒకసారి వింటే నష్టం లేదుగా" అంటు కథ మొదలుపెడుతుంది.
కథకొస్తే- చుట్టూ కొండలున్న ఓ ఊరిలో కథానాయకుడయిన యువకుడు నివసిస్తూ ఉంటాడు. పెద్దగా ఆశలు, ఆశయాలు లేని ఇతడు తనపని తాను చేసుకుని పోతుంటాడు, ఎలా అంటే... ఇతను పని చేయడం వల్ల లాభం లేదు, చేయకపోతే నష్టంలేదు. కానీ ఏదో పని చేస్తుంటాడు. కొన్నాళ్ళకు ఆ ఉద్యోగం పోవడంతో నిరాశతో కుంగిపోయి మరో ప్రయత్నం చేయడు. అపుడపుడు ఊరిబయట ఉన్న పచ్చికలో సేదతీరుతూ చుట్టూ కనిపిస్తున్న ఎత్తయిన శిఖరాలను చూస్తూ 'ఈ ఊళ్ళో ఏదీ ఆసక్తిగా లేదు, ఆ శిఖరాల పైన అంతా చాలా బాగుంటుంది. ఎప్పటికయినా అక్కడకు వెళ్ళాలి ' అనుకుంటుంటాడు. ఈ ఆలోచన పెరిగి పెద్దదయి ఆ శిఖరాలకు వెళ్ళాలన్న కోరికను తన ఇంట్లోవారికి చెప్పి వారు వద్దని వారిస్తున్నా వినకుండా బయలుదేరి ఎంతో కష్టపడి ఒక శిఖరాన్ని చేరుకుంటాడు.
శిఖరం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వృద్దుడు ఇతన్ని చూసి ఎందుకిలా వచ్చావు అని వివరాలు తెలుసుకుంటాడు. తన ఉద్యోగం పోయిందనీ, ఏ విషయం పట్ల పెద్దగా ఆసక్తిగా లేదని, ఈ శిఖరాల దగ్గర చాలా ఆహ్లాదకరంగా ఉందనీ, ఇక్కడే తాను ఉండిపోతాననీ చెప్తాడు. అది విన్న వృద్దుడు నవ్వి ఒకప్పటి తనను ఆ యువకుడిలో చూసుకొని "జీవితంలో ఎగుడు దిగుడులు సహజమే, ఉన్నతస్థాయిలో అన్ని సౌకర్యాలతో బతకడం సులభమే కానీ కష్టకాలంలో మంచి నిర్ణయాలు తీసుకుంటే ఉంటే దాని సత్ఫలితం రాబోవు మంచిరోజులలో ఎలా ఉంటుందో, అన్నీ సవ్యంగా జరుగుతున్నపుడు పొరపాటు చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో " వివరిస్తాడు. రెండు రోజులు వృద్దుడిదగ్గర జీవితం గురించి విలువయిన విషయాలు తెలుసుకున్న యువకుడు ఉత్సాహంతో మళ్ళీ తన సొంత ఊరుకొచ్చి ఉద్యోగంలో చేరి చాలా కష్టపడి పనిచేస్తాడు, మంచి పేరు తెచ్చుకొని ప్రమోషన్ కూడా తెచ్చుకుంటాడు.
ఇంతటితో కథ ముగిసి ఉంటే ఈ పుస్తకం ఇంత పాపులర్ అయ్యేది కాదు, మనము చదవనవసరం లేదు. నాలుగు మంచి మాటలు విని ఉత్తేజపూరితుడయి ఆ ఉత్సాహంలో తాత్కాలిక విజయం సాధించడం చాలమందికి సహజమే. అయితే సగటుమనిషిలా ఈ యువకుడు కూడా కొన్నాళ్ళు చాలా చక్కని జీవితం గడుపుతాడు కానీ మళ్ళీ కథ మొదటికొస్తుందు. మళ్ళీ కష్టాలు ఎదురయి నిరాశ చెందుతాడు. చాలా గొప్ప విషయాలు తెలుసుకున్న తనకు ఈ సమస్యలెందుకు అనుకుంటూ మథనపడుతుంటాడు. కొన్నాళ్ళకు తిరిగి ఆ వృద్దుడిని కలిసిన తర్వాత ఏమి జరుగుతుంది? దాని పర్యవసానాలేమిటి అన్నదే ఈ పుస్తక విషయం.
ఈ పుస్తకంలో బాగా నచ్చిన రెండు అంశాలు - 1) మనము ఏదయినా సమస్య ఎదుర్కొటున్నపుడు 'అలా నిరాశతో ఉండకు. పాజిటివ్ గా ఆలోచిస్తే మంచే జరుగుతుంది ' అని సలహా ఇస్తుంటారు. చెప్పేవాడికి అది బాగానే ఉంటుంది కానీ అనుభవిస్తున్నవారు "చెప్పడం సులువే కానీ ఆచరించి ఏమి లాభం? పోయినవి మళ్ళీ తిరిగొస్తాయా, ఆ నష్టం ఎలా పూడుతుంది" అంటుంటాము. సరిగ్గా ఇదే మాటను యువకుడు అన్నపుడు ఆ వృద్దుడు "నీ దగ్గరికి ఇద్దరు ఉద్యోగానికి వచ్చారు. ఒకడు చాలా నిరాశతో తన గతం గురించి బాధపడుతూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు. మరొకడు జరిగిందేదో జరిగిపోయింది, కష్టపడి పనిచేస్తే మెరుగుపడవచ్చు అన్నాడు. వీరిద్దరిలో ఎవరికి ఉద్యోగం ఇస్తావు? ఎందుచేత" అని యువకుడితో జవాబు చెప్పించే సంభాషణలు.
2) యువకుడు "జీవితంలో ఈ ఎగుడుదిగుళ్ళెందుకు? ఏ కష్టమూ రాకుండా ఎపుడూ అన్నీ సాఫీగా ఉంటే బాగుంటుంది కదా" అన్నపుడు వృద్దుడు గుండె కొట్టుకొనే గ్రాఫును, ఒక సరళ రేఖను చూపెట్టి "ఎగుడుదిగుళ్ళు ఉన్నాయంటే గుండె కొట్టుకుంటున్నదని అర్థం" అని చెప్పడం.
ఈ రచయిత వ్రాసిన Who Moved My Cheese పుస్తకం లాగే ఈ పుస్తకం కూడా 100 పేజీల కంటే చిన్నది. మధ్య మధ్యలో పేజీ మొత్తానికకి ఒక వాక్యం ఉండడము, మిగతా పేజీల్లో కూడా ముప్పావుశాతం మాత్రమే నిండి ఉండడముతో మొత్తం పుస్తకాన్ని గంట-గంటన్నరలో ముగించవచ్చు.

October 20, 2011 at 12:18 AM
యువకుడు "జీవితంలో ఈ ఎగుడుదిగుళ్ళెందుకు? ఏ కష్టమూ రాకుండా ఎపుడూ అన్నీ సాఫీగా ఉంటే బాగుంటుంది కదా" అన్నపుడు వృద్దుడు గుండె కొట్టుకొనే గ్రాఫును, ఒక సరళ రేఖను చూపెట్టి "ఎగుడుదిగుళ్ళు ఉన్నాయంటే గుండె కొట్టుకుంటున్నదని అర్థం" అని చెప్పడం.
Wow!!!
One thing I like with the personality development books is the stories. I read book just for them and throw the book out through the window :)
October 20, 2011 at 3:38 AM
Nice Intro jeedipappu gaaru !
@Indian Minerva smae with me too :)))అలా intentional గా చదివి వదిలేయాలి అనుకోను కాని అలానే జరుగుతూ ఉంటుంది ఏంటో :))))
October 20, 2011 at 10:51 PM
@Minarva gaaru - :)
@Sravya gaaru - :)
October 20, 2011 at 11:08 PM
Fools write books
intelligent people read it
and praise the fool that 'what a wonderful book'!
cheers
zilebi
http://www.varudhini.tk