అరచేతి గ్రంథాలయం 'కిండిల్' కబుర్లు - 3
Posted by జీడిపప్పు
ఈ-రీడర్లు/ట్యాబ్లెట్ కంప్యూటర్ల మధ్య కొనసాగుతున్న యుద్దానికి గతవారం అమెజాన్ సీయీవో మరో అంకాన్ని చేర్చాడు. iPad ను ఢీకొట్టడం మరెవరివల్లా కాకపోవడంతో మరి కొన్నేళ్ళు iPad ఆధిపత్యానికి తిరుగులేదనుకున్న వారు పునరాలోచించుకొనేలా ఓ మినీ iPad ను Kindle Fire పేరుతో విడుదల చేసాడు. ప్రస్తుత iPad ను $500కు (??) రిలీజ్ చేసినపుడే స్టీవ్ జాబ్స్ మరో మినీ iPad ను కాస్తంత తక్కువ ధరకు మార్కెట్లోకి వదిలి ఉంటే అమ్మకాలు మరింత పెరిగేవేమో కానీ, ఎందుకో ఆపిల్ అలా చెయ్యలేదు.!
ఇప్పటిదాకా కేవలం పుస్తకాలను చదువుకొనే ఈ-రీడర్ల పైన మాత్రమే దృష్టి పెట్టిన అమెజాన్ ఇప్పుడు కేవలం $199 కే 7 inches కలర్‌స్క్రీన్ ఉన్న ట్యాబ్లెట్ ను విడుదల చేసింది. ఇది గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పైన నడుస్తుంది కాబట్టి మార్కెట్లో ఉన్న వేలాది applications ఇందులో కూడా వాడవచ్చు. ఇక iPad తరహా ఇందులో సినిమాలు, మ్యూజిక్, బుక్స్.. మొదలయిన అన్ని సదుపాయాలున్నాయి. కెమెరా, వాయిస్ ఛాట్ లేకపోవడం ఒక మైనస్ కావచ్చు. Fire స్క్రీన్ సైజు కేవలం 7" కావడం వల్ల పీడీయఫ్‌లు చదువుకోవడమే కష్టమేనేమో. ఏది ఏమయినా ఇది అమెజాన్ ప్రాడక్టు కాబట్టి తప్పక మన డబ్బుకు తగిన ప్రతిఫలాన్నిస్తుంది అన్న నమ్మకం ఉంది. పూర్తివివరాలను నవంబరులో Fire విడులయ్యాక చూడాలి.
Fire తో పాటు మరో రెండు ఇ-రీడర్లను కూడా అమెజాన్ సీయీవో Jeff Bezos విడుదల చేసాడు. ఇప్పటికే Kindle 3 ధరను $189 నుండి $139 కు, ఆ తర్వాత ads ఉన్నదాన్ని $114కే ప్రకటించి కొన్నవారికి బాధను, కొనేవారికి ఆశను కల్గించిన Bezos ఈసారి Kindle 3 కొన్నవారు "తొందరపడ్డామేమో!" అనుకొనేలా చేసాడు. (ఆఫ్‌కోర్స్.. ఎలక్ట్రానిక్స్, కార్లు లాంటివి కొన్న ప్రతివారికీ ఇలాంటి బాధలు మామూలే!). 3G లేని కిండిల్ 3 ధర $114 నుండి $99 కి వచ్చింది. దీనితోపాటు అదే స్క్రీన్ సైజు ఉన్న Kindle Touch $99కి, కీబోర్డ్ లేని కిండిల్ $79కే లభ్యమవుతోంది!!
ఇవన్నీ చూసిన తర్వాత ఈ-రీడర్ల పైన ఆసక్తి ఉన్నవారు ఏది కొనాలి అంటే చెప్పడం కష్టమే. ఇంట్లో హైస్కూలు పిల్లలుంటే వారికి చివరన చెప్పిన $79 కిండిల్ కొనివ్వడం ఉత్తమం. iPad కొనాలని, ఇంకా కొనని వారు కొన్నాళ్ళాగి Fire ను $200 కు కొనుక్కోవడం మేలనిపిస్తుంది, అది కూడా Fire రివ్యూలను చదివి. ("ఎంతో కష్టపడి గొప్ప ప్రాడక్టు తయారు చేస్తే మీరు ముష్టి $200 పెట్టి కొనడానానికి రివ్యూలు చూస్తారా? రివ్యూలు చూసి కాదురా ప్రాడక్టు కొనవలసింది" అని ఎవరన్నా అంటే అది వారి మనస్సాక్షికే వదిలేస్తున్నా)

October 4, 2011 at 7:51 AM
నాకైతే kindle fire వచ్చిందని చూసాక, ఇంకో యాభయ్యో వందో డాలర్లు ఎక్కువైనా సరే దీన్ని కూడా ipad సైజ్లో రిలీజ్ చేస్తే సూపర్ గా ఉండేదనిపించింది. :)
October 7, 2011 at 2:56 AM
నమస్తే జీడిపప్పు గారూ,
మేము(జంధ్యాల అభిమానులం)ఒక వెబ్ సైట్ జంధ్యాల మీద "జంధ్యావందనం" పేరుతో తయారుచేస్తున్నాం.అందులో మీరు అప్పట్లో వీరభద్ర రావుమీద రాసిన వ్యాసాలు వెయ్యాలని అనుకుంటున్నాం.మీ అనుమతి కోసం ఎదురుచూస్తూ.
దయచేసి నా మెయిల్ ఐడీ pappusreenu@gmail.com కి జవాబివ్వగలరు.
ఇట్లు శ్రీనివాస్ పప్పు
October 7, 2011 at 2:00 PM
శ్రీనివాస్ గారు, అంతకంటే ఆనందమయిన విషయముంటుందా! తప్పక ప్రచురించండి.